Sai Pallavi Gargi Movie Releasing Worldwide on July 15th - Sakshi
Sakshi News home page

Sai Pallavi: సాయి పల్లవి గార్గి మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Published Sat, Jul 2 2022 8:41 PM | Last Updated on Sat, Jul 2 2022 9:10 PM

Sai Pallavi Gargi Movie Releasing On July 15th - Sakshi

సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం ‘గార్గి’. త్రిభాష(తెలుగు, తమిళం, కన్నడ) చిత్రంగా రూపొందిన ఈ చిత్రం నుంచి తాజాగా బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. జులైన 15న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు స్వయంగా సాయి పల్లవి సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల సాయి ప‌ల్ల‌వి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్‌, మేకింగ్ వీడియోల‌కు మంచి స్పందన వచ్చింది.

చదవండి: దయచేసి నాకు, నరేశ్‌కు సపోర్డు ఇవ్వండి..

ఇందులో సాయి పల్లవి లుక్‌ సినిమా హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. కాగా ఈ చిత్రాన్ని త‌మిళంలో 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై హీరో సూర్య, జ్యోతిక విడుద‌ల చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ’96’ ఫేం గోవింద్ వ‌సంత్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ర‌విచంద్ర‌న్ రామ‌చంద్ర‌న్, ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ, థామ‌స్ జార్జ్ సంయుక్తంగా నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement