Gargi Movie Thanks Meet: Sai Pallavi Shares Movie Watching Experience With Audience - Sakshi
Sakshi News home page

Sai pallavi: ఆ అనుభూతి అద్భుతం

Published Sun, Jul 24 2022 8:38 AM | Last Updated on Sun, Jul 24 2022 11:41 AM

Experience Of Watching Movie With The Audience Will Be Amazing, Sai Pallavi Says - Sakshi

ప్రేక్షకులతో కలిసి సినిమా చూసే అనుభూతి అద్భుతంగా ఉంటుందని హీరోయిన్‌ సాయిపల్లవి అన్నారు. ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గార్గి. బ్లాకీ జానీ, మై లెఫ్ట్‌ ఫుట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకుడు. కాళీ వెంకట్, శరవణన్, ఎస్‌ ఆర్‌ శివాజీ తదితరులు ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రానికి గోవింద్‌ వసంత సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను సూర్య, జ్యోతికకు చెందిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ పొందటం విశేషం. గత వారం తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది.

(చదవండి: నెంబర్‌ వన్‌ స్థానం కోసం భారీ మొత్తంలో డబ్బులిచ్చా: సమంత)

తమిళంలో ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ శుక్రవారం సాయంత్రం చెన్నైలో థ్యాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిపల్లవి మాట్లాడుతూ.. చిత్రాన్ని చూసిన పాత్రికేయులు గార్గిని మాత్రమే కాకుండా ఇందులో నటించిన నటీనటుల నటనలోనూ, సాంకేతిక వర్గ పనితనాన్ని ఎంతగానో ప్రశంసిస్తూ రాశారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.


గార్గి చిత్ర యూనిట్‌

సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన నటుడు సూర్యకు, ఈ చిత్రాన్ని ఆయన వద్దకు తీసుకెళ్లిన నిర్మాత, పంపిణీదారుడు శక్తివేల్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్రాన్ని తాను థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశానని తెలిపారు.  ప్రేక్షకులు భావోద్రేకాల గురించి మాట్లాడుకున్నారని, అది తనకు ఎంతో ఆనందం కలిగిందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement