
‘నువ్వు టైమ్, రాత, విధి... అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ, నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే... నేను మగపిల్లాడిని కాదుగా.. ఆడపిల్లను’ అంటూ సాయిపల్లవి డబ్బింగ్ చెబుతున్న వీడియో సోమవారం విడుదలైంది. మే 9న ఈ బ్యూటీ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న త్రిభాషా (తెలుగు, కన్నడ, మలయాళం) చిత్రం ‘గార్గీ’ లుక్, మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
(చదవండి: సింగర్స్‌గా మారిన మంచు విష్ణు కుమార్తెలు)
ఈ వీడియోలోనే తెలుగు, కన్నడ భాషల్లో సాయి పల్లవి డబ్బింగ్ చెబుతూ కనిపించారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు సాయిపల్లవి మరో సినిమా అప్‌డేట్ కూడా వచ్చింది. ప్రముఖ నటుడు కమల్‌హాసన్ బేనర్‌లో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందనున్న చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది.
వెన్నెల రెండుసార్లు జన్మించింది
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేశ్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సినిమాలో సాయిపల్లవి చేసిన ‘వెన్నెల’ పాత్రను ఉద్దేశించి ‘సోల్ ఆఫ్ వెన్నెల’ పేరుతో ‘వెన్నెల రెండుసార్లు జన్మించింది. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు. అడవి తల్లి ఒడిలో ఒకసారి ఆశయాన్ని ఆయుధం చేసినట్టు.. అతని ప్రేమలో మరొకసారి..’ అంటూ వీడియోను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment