Virata Parvam Movies
-
విరాట పర్వం: 30 ఏళ్ల కిందట పేలిన తూటా.. శంకరన్న చేతిలో సరళ బలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు మావోయిస్టుల ఖిల్లా. అడుగడుగునా అన్నలు కలియతిరిగిన ప్రాంతం. అడవులన్నీ ఉద్యమపాటలతో ఉర్రూతలూగగా ఆకర్షితులైన యువత మన్యంబాట పట్టేది. ఆ సమయంలో జిల్లాలో తూర్పు.. పశ్చిమ డివిజన్లు ఉండేవి. ఈ రెండు ప్రాంతాలు కేంద్రంగా మావోలు కార్యకలాపాలు కొనసాగించేవారు. కరీంనగర్– నిజామాబాద్ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌గా పరిగణించేది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆ సినిమాను తెరకెక్కించినా.. రాజన్నసిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సిర్నాపల్లి అడవుల్లో సరళను 1992 జూలైలో హత్య చేశారు. సరళను చంపిన శంకరన్న అలియాస్ దొంతు మార్కండేయ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటవాసి. శంకరన్న అప్పటి పీపుల్స్‌వార్‌లో ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందనేదానిపై కథనం.. సిరిసిల్ల: కరీంనగర్–నిజామాబాద్ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌గా పరిగణిస్తోంది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించినా.. రాజన్న సిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సిర్నాపల్లి అడవుల్లో సరళను 1992 జూలైలో హత్య చేశారు. సరళను చంపిన శంకరన్న అలియాస్ దొంతు మార్కండేయ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటవాసి. శంకరన్న అప్పటి పీపుల్స్‌వార్‌లో ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది..? ► ఖమ్మం జిల్లాకు చెందిన తూము సరళ ఇల్లు వదిలి సిర్నాపల్లి అటవీ ప్రాంతానికి చేరింది. వాస్తవానికి అప్పటికే శంకరన్న భార్య జ్యోతి ఎన్కౌంటర్లో మరణించింది. ► ఆ వార్తను పత్రికల్లో చూసిన సరళ, శంకరన్నను కలిసేందుకు ఇల్లు వీడి నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి ప్రాంతానికి చేరింది. ► అటవీ ప్రాంతంలోని డొంకల్, గన్నారం, సిర్నాపల్లి గ్రామాల్లో ఉంటూ.. పార్టీలో చేరాలని, శంకరన్నను కలవాలని ప్రయత్నించింది. ► ఈక్రమంలోనే డొంకల్ అటవీ ప్రాంతంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరుగుతుండగా.. సరళను పిలిచి విచారించారు. ► శంకరన్నతోపాటు హరిభూషణ్, కుమార్ దళాలు ఉన్నాయి. సరళను పోలీస్ ఇన్ఫార్మర్గా భావించి, కోవర్టుకు పాల్పడుతోందనే భయంతో ఆమెను విచారించారు. ► సరళ ఎంత కొట్టినా.. తాను పార్టీలో చేరేందుకు వచ్చానని పదే పదే చెప్పినట్లు సమాచారం. ► చివరకు శంకరన్న, సరళను భయపెట్టేందుకు ఫైర్ చేయగా.. అది పొరపాటున సరళకు తగిలి మరణించినట్లు అప్పట్లో పార్టీలో పనిచేసి లొంగిపోయిన మాజీ దళ నేత కుమార్ వెల్లడించారు. అలా సరళ సిర్నాపల్లి అడవుల్లో శవమైంది. సిరిసిల్ల జిల్లాలో గోడలపై సిర్నాపల్లి రాతలు రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతాల్లోని పల్లెల్లో గోడలపై సరళ ఉదంతాన్ని ఉటంకిస్తూ పీపుల్స్‌వార్‌కు వ్యతిరేకంగా అప్పటి జనశక్తి పార్టీ వాల్ రైటింగ్స్ చేసింది. పీపుల్స్‌వార్ నేత శంకరన్న చేసిన ఘాతుకం అంటూ ప్రచారం చేసింది. నిజానికి సరళ తల్లిదండ్రులు సరోజ, భిక్షమయ్య.. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ మద్దతుదారులు కావడంతో జనశక్తి పార్టీ ఈ ఘటనపై వ్యతిరేకంగా ప్రచారం చేసింది. సరళ మృతదేహాన్ని కూడా వారి తల్లిదండ్రులకు ఇవ్వలేదని, అడవుల్లోనే కాల్చివేశారంటూ తీవ్రస్థాయిలో ఖండించారు. పొరపాటును గుర్తించిన శంకరన్న సిర్నాపల్లి అడవుల్లో జరిగిన సరళ ఘటనపై పీపుల్స్‌వార్ పార్టీలో తీవ్రస్థాయిలో చర్చసాగింది. ఆ అమ్మాయిని ఇంటికి పంపించే క్రమంలోనే మిస్ ఫైర్ కారణంగా మరణించిందని శంకరన్న స్పష్టం చేశారు. పార్టీ సమావేశంలో శంకరన్న ఆత్మవిమర్శ చేసుకుని పొరపాటును ఒప్పుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 1993 జనవరి 27న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డులో శంకరన్న ఎన్కౌంటర్లో మరణించాడు. ఎల్లారెడ్డిపేటకు చెందిన మార్కండేయ పీపుల్స్‌వార్‌లో చేరి ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఎదిగారు. ఆయన అనేక ఎన్కౌంటర్లలో తప్పించుకున్నారు. చివరికి సరళ ఘటన ఆయన్ని మానసికంగా బాధించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా విరాటపర్వంలో సిరిసిల్ల అధ్యాయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. -
‘విరాట పర్వం’ మూవీపై తమిళ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం కావడంతో ప్రేక్షకులను ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది. అందులోనే 1990లో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన సరళ అనే యువతి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా విరాట పర్వం రూపొందింది. చదవండి: ‘విక్రమ్’ మూవీలో విలన్స్‌తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా? రానా కామ్రేడ్ రవన్న పాత్ర పోషించగా.. సాయి పల్లవి లీడ్రోల్లో కనిపించింది. ఇక ప్రియమణి, నవీన్ చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలో రానా, సాయి పల్లవిల నటలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో పాటు చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలు ఈ మూవీని కొనియాడారు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ సైతం విరాట పర్వం మూవీపై స్పందించడం విశేషం. ప్రముఖ తమిళ డైరెక్టర్ పా రంజిత్ సోషల్ మీడియా వేదికగా విరాట పర్వం మూవీపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో విరాట పర్వం అత్యుత్తమైంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు ప్రశంసలకు అర్హులు. రానా వంటి స్టార్ హీరో ఇలాంటి పాత్రను అంగీకరించి చేసినందుకు అతడిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఇక సాయి పల్లవి అయితే చాలా అద్భుతంగా నటించింది. ఇలాంటి మంచి సినిమాను అందించిన మూవీ టీమ్‌కు స్పెషల్ థ్యాంక్స్’ అంటూ రాసుకొచ్చాడు. కాగా, విరాట పర్వం చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబులు సంయుక్తంగా నిర్మించారు. #Viraataparvam is the best Telugu film I've watched in recent times. Producers & dir @venuudugulafilm deserve much appreciation for making this film without any compromises.Special appreciations to @RanaDaggubati for accepting &doing this role & @Sai_Pallavi92 has done superbly👏 — pa.ranjith (@beemji) June 19, 2022 -
వరంగల్ లో 'విరాట పర్వం' ఆత్మీయ వేడుక.. (ఫొటోలు)
-
పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదు, కానీ..: సాయిపల్లవి
హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమెకు అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా అద్భుతమైన డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్ చేస్తోంది ఈ నేచులర్ బ్యూటీ. ఫిదా మూవీతో హీరోయిన్గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమె గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె నటిచంని చిత్రం విరాట పర్వం. ఇందులో రానా జోడిగా జతకట్టింది సాయి పల్లవి. ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్ ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో తాను ఇంట్లో ఎక్కువగా తెలుగులో మాట్లాడుతుండటంతో తెలుగబ్బాయి చూసి పెళ్లి చేసుకుంటావా? అని ఇంట్లో అంటుంటారంది. చదువుతున్న సమయంలో తనకు 23 ఏళ్ల వయసులోనే పెళ్లి అయిపోతుందని, 30 ఏళ్ల వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉంటారనినుకున్నానని చెప్పింది. ఇక సినిమాల్లో గ్లామర్ షో లేకుండా స్టార్ హీరోయిన్ అయ్యారని, హీరోయిన్ అంటే పోట్టి బట్టలు వేసుకుంటారు.. అదే గ్లామర్.. మీరెందుకు వాటికి వ్యతిరేకం అని అడగ్గా.. అలాంటిదేం లేదని, పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదంది. కానీ ఎదుటి వారు చూసే చూపుల్లో మార్పు వచ్చినప్పుడు తనకు ఆ కాన్ఫీడెన్స్ వస్తుందంటూ చెప్పుకొచ్చింది. చదవండి: చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి -
ఆ నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది: వేణు ఊడుగుల
‘‘ఒక నిజాయితీ ఉన్న గొప్ప ప్రేమకథా చిత్రం ‘విరాటపర్వం’. ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా’’ అని దర్శకుడు వేణు ఊడుగుల అన్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు వేణు ఊడుగుల విలేకరులతో పంచుకున్న విశేషాలు.. ‘‘నేను పుట్టి పెరిగిన వాతావరణం, చూసిన జీవితం, చదివిన పుస్తకాలు.. నేను ఎలాంటి సినిమా తీయాలనే ఒక విజన్‌ని ఇచ్చాయి. 1992లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘విరాటపర్వం’. ఎవరి బయోపిక్ కాదు. ఓ రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా సినిమాలో చూపిస్తున్నాం. మానవ సంబంధాల నేపథ్యంలో చెప్పే కథలను ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. ‘విరాటపర్వం’ నక్సల్ నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ. కొత్తగా ఉంటుంది’’ అన్నారు. ‘‘విరాటపర్వం’ కథ సురేష్‌బాబుగారికి నచ్చడంతో రానాగారికి చెప్పమన్నారు. రానాగారికి నచ్చి ఒప్పుకున్నారు. ఈ కథ రాస్తున్నప్పుడే కలలో సాయి పల్లవి హీరోయిన్ పాత్రలో కనిపిస్తుండేది. పది నిమిషాల కథ విని ఆమె ఓకే చెప్పారు. ∙ ‘విరాటపర్వం’ని ఇతర భాషల్లో డబ్ చేసి, రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘ఆహా’ కోసం ‘మైదానం’ సినిమా తీస్తున్నాం. చలంగారు రాసిన నవల మనదైన వ్యాఖ్యానంతో ఉంటుంది. దీనికి షో రన్నర్‌గా చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. -
సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్
రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం ఇటీవల మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆదివారం (జూన్ 5న) రిలీజైన విరాట పర్వం ట్రైలర్ అందరి బాగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. యుద్ధం మధ్యలో ప్రేమకథ అనే కాన్సెప్ట్ కట్టిపడేసేలా అనిపిస్తోంది. చదవండి: లారెన్స్ భిష్ణోయ్ తెలుసు కానీ, గోల్డీ ఎవరో తెలియదు: సల్మాన్ దీంతో ఈ ట్రైలర్‌పై పలువురు సినీ స్టార్స్ స్పందిస్తూ తమ స్పందనను తెలుపుతున్నారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహార్ సైతం ట్రైలర్‌పై స్పందించాడు. విరాట పర్వం ట్రైలర్ విడుదల చేసినట్లు రానా ట్వీట్ చేయగా.. ఈ ట్రైలర్ తనని బాగా ఆకట్టుకుందని, సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ రానా ట్వీట్‌కు రీట్వీట్ చేశాడు కరణ్ జోహార్. ‘ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది రానా. సినిమాను చూడడానికి ఎదురుచూస్తున్నాను. నువ్వు సూపర్. ఇంక నేను సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్’ అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. చదవండి: అర్జున్ కపూర్ బాడీ షేప్‌పై ట్రోల్స్, ఘాటుగా స్పందించిన లవ్‌బర్డ్స్ This looks fantastic Rana!!!! Can’t wait to see it! Intense Raw and Rivetting!!! You are superb! And I am a huge @Sai_Pallavi92 fan! ❤️ https://t.co/FpvsbHQhQ2 — Karan Johar (@karanjohar) June 6, 2022 -
అడవి బాట... బాక్సాఫీస్ వేట
అడవిలో వేటకు దిగారు హీరోలు.. ఒకరి వేట అక్రమార్కులను అంతం చేయడం కోసం.. ఒకరి వేట స్మగ్లింగ్ చేయడం కోసం.. ఎవరి వేట ఏదైనా అంతిమంగా బాక్సాఫీస్ వసూళ్ల వేట కోసమే. కొందరు తెలుగు హీరోలు, దర్శకులు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంలో కథలను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఈ మధ్య ‘అడవి’ సినిమాలు కొన్ని వచ్చాయి. ఇక రానున్న ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల గురించి తెలుసుకుందాం. హీరో అల్లు అర్జున్– దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలు లవ్‌స్టోరీగా ప్రేక్షకులను మెప్పించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’ ఫుల్ మాస్ ఎంటర్టైనర్. కంప్లీట్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ అని తెలిసిందే. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ రెచ్చిపోయి నటించారు. ‘పుష్ప: ది రైజ్’ ఇచ్చిన విజయంతో మరింత జోష్‌తో ‘పుష్ప’లో రెండో భాగమైన ‘పుష్ప: ది రూల్’పై ఫోకస్ పెట్టారు అల్లు అర్జున్, సుకుమార్. ‘పుష్ప: ది రైజ్’ అడవి బ్యాక్‌డ్రాప్‌లో సాగినట్లే ‘పుష్ప: ది రూల్’ కూడా అడవి బ్యాక్‌డ్రాపే. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఇక ‘విరాటపర్వం’ కోసం వెండితెర విప్లవకారుడు రవన్న అవతారం ఎత్తారు హీరో రానా. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. 1990 నాటి పరిస్థితుల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అడవిలోనే జరిగింది. ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వాహబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. మరోవైపు ఇటీవలి కాలంలో మారేడుమిల్లి ఫారెస్ట్‌లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేశారట ‘అల్లరి’ నరేశ్. ఎందుకంటే... ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా కోసం. అడవిలో నివాసం ఉండే ఓ ఆదివాసీ తెగ సమస్యలను పరిష్కరించే వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్. ఈ సినిమా కథనం కూడా అడవి నేపథ్యంలోనే ఉంటుంది. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ‘సింబా’ చిత్రం కోసం ఫారెస్ట్మేన్గా మారిపోయారు జగపతిబాబు. దర్శకుడు సంపత్ నంది కథ అందిచడంతో పాటు ఓ నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మురళీ మోహన్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలో ప్రకృతి ప్రేమికుడి పాత్రలో కనిపిస్తారు జగపతిబాబు. పర్యావరణ అంశాల నేపథ్యంలో సినిమా కాబట్టి ‘సింబా’ మేజర్ షూటింగ్ అడవి బ్యాక్ డ్రాప్లో ఉంటుందనుకోవచ్చు. అలాగే దివంగత నటుడు హరనాథ్ మనవడు విరాట్‌రాజ్ ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అడవి బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. ఇక ఈ ఏడాది రిలీజైన ‘భీమ్లా నాయక్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, చిత్రాలు కూడా అడవి నేపథ్యంతో కూడుకున్నవే. రాబోయే రోజుల్లో మరికొన్ని అడవి కథలు వెండితెర పైకి రానున్నాయి. అడవి బాటలోనే మహేశ్-రాజమౌళి సినిమా కూడా: హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు కథ అందిస్తున్న రచయిత విజయేంద్రప్రసాద్ సైతం మహేశ్ సినిమా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు. -
కర్నూలు : విరాటపర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విరాటపర్వం నాకో చాలెంజ్
‘‘విరాటపర్వం’ చిత్రంలో ఉద్యమంతో పాటు ఒక గొప్ప ప్రేమకథ ఉంది. వేణు ఊడుగులగారు అద్భుతంగా రాశారు.. తీశారు. ఇలాంటి బలమైన కథలో నాకు మంచి పాత్ర దక్కింది’’ అని నవీన్ చంద్ర అన్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నవీన్ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ– ‘‘విరాటపర్వం’లో సీనియర్ ఉద్యమకారుడు రఘన్న పాత్రలో కనిపిస్తా. కథను తలకిందులు చేసే పాత్ర నాది. నాతో మొదటిసారి తెలంగాణ యాసని అద్భుతంగా చెప్పించారు వేణుగారు. ఈ సినిమా చేయడం ఒక చాలెంజ్. రానాగారి వ్యక్తిత్వం గొప్పది. ఓ రకంగా ఆయన బిగ్ ఇన్ఫర్మేషన్ బాక్స్’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నన్ను చాలా మంది హీరోగా ఫిక్స్ అయిపోయారు. హీరోగా చేయాల్సిన సినిమాలు వస్తే చేస్తున్నాను. సినిమా ఆడినా ఆడకపోయినా నేను చక్కగా చేశాననే గుర్తింపు వస్తోంది. నాపై నమ్మకంతో మంచి పాత్రలు ఇస్తున్న దర్శకులకు కృతజ్ఞతలు. హీరోగా చేయడం సెపరేటు. నాలుగు నెలలు ఒకే కథపై ఉంటాం.. దానికి వచ్చే పేరు, రెమ్యూనరేషన్ వేరుగా ఉంటాయి. కానీ మంచి కథ ఉన్న సినిమాల్లో పాత్రలు చేయడం కూడా నటుడిగా తృప్తి ఇస్తోంది. నేను చేసిన కొన్ని ఓటీటీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. యూవీ కాన్సెప్ట్స్‌లో హీరోగా ఒక సినిమా చేశాను. రామ్‌చరణ్–శంకర్‌గారి సినిమా, బాలకృష్ణ– గోపీచంద్ మలినేనిగారి సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
విరాటపర్వం నుంచి నగాదారిలో పాట వచ్చేసింది
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 17న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచేసింది చిత్ర బృందం. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ‘నగాదారిలో..’పాటను విడుదల చేశారు. ‘నిప్పు ఉంది, నీరు ఉంది నగాదారిలో..చివరికి నెగ్గేదేది, తగ్గేదేది నగాదారిలో..’అంటూ సాగే ఈ పాటకు ద్యావరి నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించగా.. ఫోక్ సింగర్ వరం అద్భుతంగా ఆలపించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు. హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమ కథను ఈ పాటలో అద్భుతంగా చూపించారు. ఒక తిరుగుబాటు దారుడు ప్రేమలో పడిన తర్వాత కొత్త ప్రయాణంలో తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు పూర్తి భిన్నంగా ఎలా మారాడు అనేది ఈ పాట ద్వారా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, రవి శంకర్ అలియాస్ రవన్న అనే కామ్రేడ్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ప్రియమణి, నందిత దాస్, నవీన్ చంద్రలు ముఖ్య పాత్రలు పోషించారు. దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. -
ముందుగా రాబోతున్న ‘విరాట పర్వం’?, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Rana Virata Parvam Release Date Preponed: రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం విరాట పర్వం. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈమూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే కారోనా టైంలో వాయిదా పడ్డ సినిమాలన్ని వరుసగా విడుదలై మంచి విజయాలను సాధించాయి. కానీ విరాట పర్వం మాత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేకపోయింది. ఒకనొక సమయంలో ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇటీవలే ఈ పుకార్లకు చెక్ పెడుతూ మేకర్స్ విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: ‘మేజర్’ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన అడివి శేష్ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఎట్టకేలకు విరాట పర్వం విడుదల కాబోతుందని, థియేటర్లోనే ఈ మూవీ వస్తుండటంతో దగ్గుబాటి ఫ్యాన్స్, ఇటూ సాయి పల్లవి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొదటగా అనుకున్న తేదీకంటే ముందుగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. చదవండి: మంచు లక్ష్మిపై ట్రోల్స్.. స్మగ్లర్ అంటూ కామెంట్స్ అన్ని కుదిరితే జూన్17న ఈ చిత్రం విడుదల కానుందని సినీవర్గాల నుంచి సమాచారం. ఇక దీనిపై చిత్రబృందం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ ఉగ్గుల వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తుండగా ప్రియమణి, నందిత దాస్, నవీన్ చంద్రలు ముఖ్య పాత్రలు పోషించారు. దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. -
నన్ను నమ్మవు.. ఆడపిల్లను కదా.. సాయి పల్లవి డబ్బింగ్ వీడియో వైరల్
‘నువ్వు టైమ్, రాత, విధి... అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ, నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే... నేను మగపిల్లాడిని కాదుగా.. ఆడపిల్లను’ అంటూ సాయిపల్లవి డబ్బింగ్ చెబుతున్న వీడియో సోమవారం విడుదలైంది. మే 9న ఈ బ్యూటీ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న త్రిభాషా (తెలుగు, కన్నడ, మలయాళం) చిత్రం ‘గార్గీ’ లుక్, మేకింగ్ వీడియోను విడుదల చేశారు. (చదవండి: సింగర్స్‌గా మారిన మంచు విష్ణు కుమార్తెలు) ఈ వీడియోలోనే తెలుగు, కన్నడ భాషల్లో సాయి పల్లవి డబ్బింగ్ చెబుతూ కనిపించారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు సాయిపల్లవి మరో సినిమా అప్డేట్ కూడా వచ్చింది. ప్రముఖ నటుడు కమల్‌హాసన్ బేనర్లో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందనున్న చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది. వెన్నెల రెండుసార్లు జన్మించింది రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేశ్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సినిమాలో సాయిపల్లవి చేసిన ‘వెన్నెల’ పాత్రను ఉద్దేశించి ‘సోల్ ఆఫ్ వెన్నెల’ పేరుతో ‘వెన్నెల రెండుసార్లు జన్మించింది. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు. అడవి తల్లి ఒడిలో ఒకసారి ఆశయాన్ని ఆయుధం చేసినట్టు.. అతని ప్రేమలో మరొకసారి..’ అంటూ వీడియోను విడుదల చేశారు.