Sai Pallavi Opens Up On Tiny Outfit In Latest Interview - Sakshi
Sakshi News home page

Sai Pallavi: పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదు.. సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు

Published Sun, Jun 12 2022 1:16 PM | Last Updated on Sun, Jun 12 2022 2:06 PM

Sai Pallavi Open Up On Tiny Outfit In Latest Interview - Sakshi

హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఆమెకు అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా అద్భుతమైన డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్‌ చేస్తోంది ఈ నేచులర్‌ బ్యూటీ. ఫిదా మూవీతో హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమె గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె నటిచంని చిత్రం విరాట పర్వం. ఇందులో రానా జోడిగా జతకట్టింది సాయి పల్లవి. ఈ మూవీ జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్‌ డైరెక్టర్‌

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో తాను ఇంట్లో ఎక్కువగా తెలుగులో మాట్లాడుతుండటంతో తెలుగబ్బాయి చూసి పెళ్లి చేసుకుంటావా? అని ఇంట్లో అంటుంటారంది. చదువుతున్న సమయంలో తనకు 23 ఏళ్ల వయసులోనే పెళ్లి అయిపోతుందని, 30 ఏళ్ల వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉంటారనినుకున్నానని చెప్పింది. ఇక సినిమాల్లో గ్లామర్‌ షో లేకుండా స్టార్‌ హీరోయిన్‌ అయ్యారని, హీరోయిన్‌ అంటే పోట్టి బట్టలు వేసుకుంటారు.. అదే గ్లామర్‌.. మీరెందుకు వాటికి వ్యతిరేకం అని అడగ్గా.. అలాంటిదేం లేదని, పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదంది. కానీ ఎదుటి వారు చూసే చూపుల్లో మార్పు వచ్చినప్పుడు తనకు ఆ కాన్ఫీడెన్స్‌ వస్తుందంటూ చెప్పుకొచ్చింది. 

చదవండి: చిరు ఇంట్లో విక్రమ్‌ టీంకు గ్రాండ్‌ పార్టీ, సల్మాన్‌ ఖాన్‌ సందడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement