
టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి ఇంట వివాహా వేడుకలు మొదలయ్యాయి. ఆమె సోదరి, నటి పూజ కన్నన్ పెళ్లి వివాహం త్వరలో జరగనుంది. తన స్నేహితుడు వినీత్‌ను ఆమె పెళ్లాడనుంది. కొన్నేళ్లుగా పూజ, వినీత్ ప్రేమయాణం కొనసాగిస్తున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో త్వరలోనే వీరి వివాహం జరగనుంది.
(ఇది చదవండి: ప్రభాస్ సలార్.. ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు.. ఎందుకంటే?)
ఈ నేపథ్యంలోనే ఎంగేజ్‌మెంట్‌కు ముందు జరిగిన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను పూజ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. మెహందీ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. సాయిపల్లవి సోదరిగా పూజ సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్ చిత్రం ‘చితిరై సెవ్వానం’తో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో పూజ నటనకు ప్రశంసలు అందుకున్నారు. జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ ఇటీవల ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment