ఇటీవలే సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని ఊటీలో జరిగిన వేడుకలో సాయిపల్లవి డ్యాన్స్‌తో అలరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది. పూజా కన్నన్ తన క్లోజ్ ఫ్రెండ్ వినీత్ శివకుమార్‌ను పెళ్లాడారు. ఈ శుభ సమయంలో సాయిపల్లవి కుటుంబసభ్యులు ఎంతో సందడిగా గడిపారు. అయితే చెల్లి పెళ్లిలో సాయి పల్లవి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. దీనికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి.
అయితే పూజకన్నన్ వివాహం జరిగిన తీరుపై నెట్టింట చర్చ నడుస్తోంది. అందుకు కారణం ఆమె పెళ్లి నీలగిరి కొండల్లోని బడగ అనే పురాతన సంప్రదాయం జరగడమే. సెప్టెంబర్ 5న ఊటీలోని వరుడైన వినీత్ స్వగృహంలోనే వీరి వివాహా వేడుక జరిగింది. బడగ సంప్రదాయం ప్రకారం వరుడు పెళ్లితంతు అంతా వరుడి తరఫువారే నిర్వహించాలంటా. వివాహానికి సంబంధించిన ఖర్చులన్నీ వరుడే భరించాలంటా. నీలగిరి కొండల్లోని గ్రామాలలో జరిగే వివాహాలన్నీ దాదాపు ఇదే పద్ధతిని పాటిస్తారట.
(ఇది చదవండి: సాయిపల్లవి ఇంట పెళ్లి సందడి.. డ్యాన్స్ వీడియో వైరల్)
బడగ సంప్రదాయం ప్రకారం పెళ్లిలో కేవలం శాఖాహార వంటకాలు మాత్రమే వడ్డిస్తారు. వీరి పెళ్లి చూస్తుంటే బడగ ఆచారాలు, సంప్రదాయాలు వాటి ఆచరణాత్మకతకు అద్దం పట్టినట్లుగా నిర్వహించారు. బాడగ సంప్రదాయం ప్రకారం వరుడు కట్నం తీసుకోరట. సాయిపల్లవి స్వస్థలం నీలగిరి జిల్లాలోని కోటగిరి కావడం.. అక్కడి ఆచార, వ్యవహరాలను పెళ్లిలోనూ పాటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment