
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. డేటింగ్‌ను ఓపెన్‌గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. తాజాగా మార్చి 27న అదితిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు.
అయితే తన పెళ్లిపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందిచాడు. తాజాగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 'ఆమె ఓకే చెప్పింది.. అందుకే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాం' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్లి జరిగిపోయిందని ఫ్యాన్స్ భావిస్తుంటే సిద్ధార్థ్ సడన్ షాకిచ్చాడు. ఎంగేజ్‌మెంట్ పోస్ట్‌తో అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చి పడేశాడు. మరి వీళ్లద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment