వారి వల్లే మా ఎంగేజ్‌మెంట్‌ జరిగింది: అదితిరావు హైదరీ | Aditi Rao Hydari Reveals About Her Relationship With Siddharth, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari: అందుకే మా రిలేషన్‌ బయటపెట్టాం: అదితి రావు హైదరీ

May 6 2024 9:50 PM | Updated on May 7 2024 11:40 AM

Aditi Rao Hydari on relationship with Siddharth

హీరామండి వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ అదితిరావ్ హైదరీ. సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వచ్చిన  భారీబడ్జెట్‌ వెబ్ సిరీస్‌ హీరామండిలో నటించింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదితి తన ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో సిద్ధార్థ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంపై స్పందించింది. సిద్ధార్థ్‌తో కలిసి ఉండటం ప్రేమపై నమ్మకాన్ని పెంచిందని తెలిపింది.

అదితి మాట్లాడుతూ.. 'నేను కొన్ని విషయాల్లో పవిత్రతను నమ్ముతాను. మా ఇద్దరి రిలేషన్‌పై రూమర్స్ రావడం సహజమే. కానీ మేం మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం. వారు మా కంటే ఎంతో ప్రైవేట్‌గా ఉంటారు. మాకు చాలా కాల్స్ వస్తున్నందుకే మా రిలేషన్‌ను బయటకు చెప్పేశాం. ఈ విషయాన్ని బయటకు చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా మేము భావించాం'అని తెలిపింది.

ఆమె ఇంకా మాట్లాడుతూ..'నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా. నా గోప్యత, పవిత్రతను నేను నమ్ముతా. నా గోప్యతను కోరుకునే ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా. కానీ ప్రజలు మా పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని మీరు గ్రహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది.  వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని' తెలిపింది.

కాగా.. హీరో సిద్దార్థ్‌తో డేటింగ్‌లో ఉన్న భామ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ జంట డేటింగ్‌లో ఉన్నారు. వనపర్తిలోని అతి పురాతన ఆలయంలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ వేడుక జరిగింది. మా ఇద్దరి తల్లిదండ్రుల కారణంగానే నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది.  సంజయ్ లీలా భన్సాలీ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో  బిబో జాన్‌ పాత్రలో అదితి రావ్ హైదరీ నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement