అదితి-సిద్ధార్థ్‌ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా? | Aditi Rao Hydari And Siddharth Net Worth List Goes Viral After Marriage | Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari and Siddharth: అదితి-సిద్ధార్థ్‌ పెళ్లి.. కొత్త జంట ఆస్తులు ఎన్ని కోట్లంటే?

Published Tue, Sep 17 2024 3:07 PM | Last Updated on Tue, Sep 17 2024 3:18 PM

Aditi Rao Hydari And Siddharth Net Worth List Goes Viral After Marriage

 హీరో, హీరోయిన్​ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ ఇటీవలే వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఈ ఏడాదిలోనే వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వనపర్తి ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవీ కాస్తా వైరల్ కావడంతో అభిమానులు, సినీతారలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అయితే వీరి పెళ్లి తర్వాత నెటిజన్స్‌ ఆరా తీయడం మొదలెట్టారు. ఇంతకీ వీరి ఆస్తులు ఎంత ఉ‍న్నాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆదితిరావు హైదరీ రాజవంశానికి చెందిన కుటుంబం కావడంతో అభిమానులు ఆస్తులపై ఆరా తీస్తున్నారు.

‍అయితే ప్రస్తుతం గణాంకాల ప్రకారం అదితి రావు హైదరీ ఆస్తులు రూ.60కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఉంటుందని ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది. జాగరణ్ ఇంగ్లీష్‌ నివేదిక ప్రకారం నిర్మాత, హీరోగా రాణిస్తున్నసిద్ధార్థ్ ఆస్తులు కూడా దాదాపు రూ.70 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. ఈ లెక్కన ఇద్దరికీ కలిపి సుమారు రూ.130 కోట్ల నుంచి రూ.135 కోట్లకు మధ్య ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముంబయిలోని వర్సోవాలో అదితికి ఓ అపార్ట్ మెంటు కూడా ఉంది. మార్చి 2024న సిద్ధార్థ్- అదితి నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్నారు. 

ఆ ఆలయంలోనే పెళ్లి ఎందుకంటే?

ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ వనపర్తిలోని ఆలయంలోనే పెళ్లి చేసుకోవడంపై కూడా చర్చ మొదలైంది. దాదాపు  400ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడి అదితి కుటుంబానికి ముఖ్యమైదని సమాచారం. ఆ సెంటిమెంట్‌తోనే వీరి పెళ్లి అక్కడే చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదితి తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన వారసురాలు కావడం విశేషం. అదితిరావు చివరిసారిగా హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. సిద్ధార్థ్ ఇటీవల విడుదలైన ఇండియన్‌-2లో కనిపించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement