Networth
-
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ సీఎం పదవిపై ఉత్కంఠకు తెరదించింది. ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను నియమించింది. నేడు (ఫిబ్రవరి 20న) రాంలీలా మైదానంలో బీజేపీ రెండో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకోవడం ద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడమే కాదు ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవికి యువ నాయకురాలిని ఎంపిక చేయడం విశేషం. ఈ సందర్భంగా రేఖా గుప్తా ఆస్తులపై నెట్టింట చాలా ఆసక్తి నెలకొంది.ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్లో, రేఖ గుప్తా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 6,92,050గా, భర్త మనీషా గుప్తా ఆదాయం రూ.97,33,570 గా ప్రకటించారు.కుటుంబం నికర విలువ రూ. 5.3 కోట్లుగా ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు.రేఖ గుప్తా నికర ఆస్తుల విలువరేఖ గుప్తా ఆస్తులు మొత్తం ఆస్తులు: రూ.5.31 కోట్లు రేఖ గుప్తాపై లోన్లు ఇంకా ఇతర అప్పులు: రూ.1.20 కోట్లు రేఖ గుప్తా వార్షిక ఆదాయం 2023-24: రూ.6.92 లక్షలు 2022-23: రూ.4.87 లక్షలు 2021-22: రూ.6.51 లక్షలు 2020-21: రూ.6.07 లక్షలు 2019-20: రూ.5.89 లక్షలు రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఆదాయం 2023-24: రూ.97.33 లక్షలు 2022-23: రూ.64.56 లక్షలు 2021-22: రూ.23.13 లక్షలు రేఖ గుప్తాకి మారుతి XL6 (2020 మోడల్) కారు ఉంది, దీని విలువ దాదాపు రూ.4.33 లక్షలు ఉంటుందని అంచనా.రేఖా గుప్తాకు నాయకత్వ లక్షణాలు ఎలా వచ్చాయి? హర్యానాలోని జింద్ జిల్లా నంద్‌గఢ్ గ్రామంలో జూలై 19, 1974న జన్మించిన రేఖా గుప్తా తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు. 1976లో, గుప్తాకు రెండేళ్ల వయసులో కుటుంబం ఢిల్లీకి వెళ్లింది. రాజధాని నగరంలోనే తన విద్యను పూర్తి చేసింది. ఇక్కడే ఆమె భవిష్యత్ రాజకీయ జీవితానికి పునాది వేసింది.విద్యార్థి దశలోనే ఆగుప్తా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు, ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు. విద్యార్థి రాజకీయాల్లో ఆమె చురుగ్గా ఉంటూ 1996-1997లోఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU)అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.రేఖ గుప్తా బీజేపీలో రాజకీయ జీవితం 2000లో ప్రారంభంలో ప్రారంభమైంది. పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో చేరి, ఢిల్లీ యూనిట్లో కార్యదర్శిగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆ తరువాత 2004 నుండి 2006 వరకు BJYM జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె రాజకీయ నైపుణ్యం, లక్షణాలు 2007లో ఉత్తర పితంపురా నియోజకవర్గానికి కౌన్సిలర్‌గా చేశాయి. అంతేకాదు 2007 నుండి 2009 వరకు MCDలో మహిళా సంక్షేమం మరియు శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇంకా ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ,పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక ఇతర కీలక పదవులను కూడా ఆమె చేపట్టారు. -
సాధారణ టెకీ.. రూ.5 కోట్ల నెట్‌వర్త్..
కోటీశ్వరులు కావాలని, సంపద పెంచుకోవాలని చాలా మంది కలలు కంటారు. కానీ కొంత మంది మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు. అలాంటి వారిలో ఒకరు గుర్గావ్కు చెందిన యాక్సెంచర్ ఉద్యోగి గుర్జోత్ అహ్లువాలియా. కేవలం 11 ఏళ్లలో జీరో నుండి రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను నిర్మించుకున్నారు. తన అద్భుతమైన ఆర్థిక ప్రయాణాన్ని ఆయనే వెల్లడించారు.2025లో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న అహ్లువాలియా.. తాను సాధించిన మైలురాయిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2024 తనకు అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను చూపుతున్న తన ఆర్థిక ట్రాకింగ్ యాప్ స్క్రీన్‌షాట్‌ను కూడా అహ్లువాలియా పోస్ట్ చేశారు. ఇందులో రూ. 2.7 లక్షల మేర మాత్రమే అప్పులు చూపుతోంది.మూడే సూత్రాలు తన విజయానికి మూడు అంశాల విధానం కారణమని అహ్లువాలియా చెబుతున్నారు. అవి అధిక ఆదాయాల కోసం కెరీర్ పురోగతి, ఆలస్యమైన సంతృప్తి ద్వారా క్రమశిక్షణతో కూడిన పొదుపు, వ్యూహాత్మక ఈక్విటీ పెట్టుబడులు. ఇవే కేవలం 11 ఏళ్లలో తాను రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన చెబుతున్నారు.జీతం పొందే మధ్యతరగతి వ్యక్తి నుండి రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌కు చేరడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని ఆయన గుర్తించారు. ఒకటి అప్పు లేకపోవడం (విద్యకు తల్లిదండ్రులు నిధులు సమకూర్చినందున) అద్దె ఖర్చు లేకపోవడం (ఆయన తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నారు). అయితే ఇటీవలి మార్కెట్ దిద్దుబాట్లు తన నెట్‌వర్త్‌లో 8-10% క్షీణతకు దారితీశాయని కూడా ఆయన అంగీకరించారు.Hitting this milestone was my biggest achievement in 2024.A salaried middle class person like me went from 0 to ₹5,00,00,000 in 11 years.3 Key Elements1. Professional Growth - high income2. Aggressive savings - delay gratification3. Equity investing - owning businesses pic.twitter.com/t3niPluPW7— Gurjot Ahluwalia (@gurjota) February 2, 2025 -
తల్లి బాటలో కూతురు.. వేలకోట్లకు వారసురాలు!
భారతదేశంలో అత్యంత సంపన్నులైన వ్యాపారవేత్తల జాబితాలో 'లీనా తివారీ' ఒకరు. బహుశా ఈ పేరు కొంతమందికి పరిచయమే అయినా.. ఈమె కుమార్తె 'అనీషా గాంధీ తివారీ' (Aneesha Gandhi Tewari) గురించి బహుశా తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆమె గురించి తెలుసుకుందాం.అనీషా గాంధీ బ్రౌన్ యూనివర్శిటీ నుంచి బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి మాలిక్యులర్ బయాలజీలో పీహెచ్డీ(PhD) పట్టా పొందారు. చదువు పూర్తయిన తరువాత అనీషా యూఎస్వీ బోర్డ్‌కు డైరెక్టర్లలో ఒకరుగా చేరారు.యూఎస్వీ (USV) అనేది పార్మాస్యుటికల్ కంపెనీ. దీనిని లీనా తివారీ తన తండ్రి 'విఠల్ గాంధీ' 1961లో రెవ్లాన్ సహకారంతో ప్రారంభించారు. ఇది లీనా సారథ్యంలో గణనీయమైన వృద్ధి సాధించింది. నేడు, ఈ కంపెనీ కార్డియోవాస్కులర్, డయాబెటిక్ ఔషధాల విభాగంలో భారతదేశంలోని మొదటి ఐదు సంస్థలలో ఒకటిగా నిలిచింది.లీనా తివారీముంబై యూనివర్సిటిలో గ్రాడ్యుయేట్, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన 'లీనా తివారీ' USV ఇండియాకు నాయకత్వం వహిస్తున్నారు. ఈమె రూ. 11వేలకోట్ల కంటే ఎక్కువ నికర విలువతో.. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరుగా నిలిచారు. ఈమె అనేక దాతృత్వ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. ఇందులో భాగంగానే వెనుకబడిన మహిళలకు సాధికారత కల్పించే విద్యా కార్యక్రమాలపై దృష్టి సారించారు. -
ఆరేళ్లకే యూట్యూబ్ సంచలనం.. 16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద.. ప్రపంచంలోనే సంపన్నుడిగా!
ఈ రోజుల్లో మిలియనీర్ కావాలంటే మాటలు కాదు. బిజినెస్‌లో రాణించేవారికే ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కోట్ల సంపాదన కూడబెట్టాలన్న వ్యాపారంలో రాణిస్తేనే సాధ్యమవుతుంది. కానీ 16 కోటీశ్వరుడైతే ఎలా ఉంటుంది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అలా చిన్న వయసులోనే కోట్లు సంపాదించిన బాలనటుడు ఒకరు ఉన్నారు. అతని పేరే ఇయాన్ ఆర్మిటేజ్. ఇంతకీ అతను ఎలా సంపాదించాడో తెలుసుకుందాం.ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాలనటుడిగా ఇయాన్ ఆర్మిటేజ్ నిలిచారు. ఆరేళ్లకే తన యూట్యూబ్ వీడియో సిరీస్ ఇయాన్ లవ్స్ థియేటర్ ద్వారా యూట్యూబ్ స్టార్‌గా సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకే ప్రైమ్‌టైమ్ టీవీ షోలో లీడ్ రోల్లో కనిపించాడు. 2008లో జార్జియాలో జన్మించిన ఇయాన్ ఆర్మిటేజ్ 2017లో నటనలో ఎంట్రీ ఇచ్చాడు. ది గ్లాస్ కాజిల్, అవర్ సోల్స్ ఎట్ నైట్, ఐయామ్ నాట్ హియర్ లాంటి చిత్రాలతో పాటు లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, బిగ్ లిటిల్ లైస్ లాంటి టీవీ షోల్లో మెరిశాడు.అయితే యంగ్ షెల్డన్ అనే సిట్కామ్తోనే ఇయాన్ ఆర్మిటేజ్ మరింత ఫేమస్ అయ్యాడు. తొమ్మిదేళ్లకే లీడ్ రోల్ పోషించిన బాలనటుడిగా నిలిచాడు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ సిట్‌కామ్‌లో కనిపించాడు. ఈ సిరీస్ ఏడు సీజన్ల తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో ముగిసింది.16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద..యంగ్ షెల్డన్లో పాత్రకు గానూ ఇయాన్ ఒక ఎపిసోడ్‌కు 30 వేల డాలర్లు పారితోషికం అందుకున్నాడు. సీజన్ -1 కోసం ఏకంగా రూ.4.6 కోట్లు సంపాదించాడు. ఈ సిట్కామ్ సీజన్ -5 నాటికి ఒక్కో సీజన్‌కు దాదాపు రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. దీంతో 13 ఏళ్లకే ప్రపంచంలో మిలినీయర్లలో ఒకరుగా నిలిచాడు. అతని నికర ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత సంపన్న బాల నటుడి రికార్డ్ సృష్టించాడు.యూట్యూబ్ నుంచి మొదలైన ఇయాన్ ఆర్మిటేజ్ ఏకంగా టీవీ స్టార్‌గా ఎదిగారు. యంగ్ షెల్డన్ సిరీస్‌తో స్టార్డమ్ తెచ్చుకున్న ఇయాన్ మరో రెండు చిత్రాలలో నటించాడు. స్కూబ్, పా పెట్రోల్: ది మూవీస్‌లో కనిపించాడు. -
అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?
హీరో, హీరోయిన్ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ ఇటీవలే వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాదిలోనే వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వనపర్తి ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవీ కాస్తా వైరల్ కావడంతో అభిమానులు, సినీతారలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.అయితే వీరి పెళ్లి తర్వాత నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. ఇంతకీ వీరి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆదితిరావు హైదరీ రాజవంశానికి చెందిన కుటుంబం కావడంతో అభిమానులు ఆస్తులపై ఆరా తీస్తున్నారు.అయితే ప్రస్తుతం గణాంకాల ప్రకారం అదితి రావు హైదరీ ఆస్తులు రూ.60కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఉంటుందని ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది. జాగరణ్ ఇంగ్లీష్ నివేదిక ప్రకారం నిర్మాత, హీరోగా రాణిస్తున్నసిద్ధార్థ్ ఆస్తులు కూడా దాదాపు రూ.70 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. ఈ లెక్కన ఇద్దరికీ కలిపి సుమారు రూ.130 కోట్ల నుంచి రూ.135 కోట్లకు మధ్య ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముంబయిలోని వర్సోవాలో అదితికి ఓ అపార్ట్ మెంటు కూడా ఉంది. మార్చి 2024న సిద్ధార్థ్- అదితి నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు. ఆ ఆలయంలోనే పెళ్లి ఎందుకంటే?ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ వనపర్తిలోని ఆలయంలోనే పెళ్లి చేసుకోవడంపై కూడా చర్చ మొదలైంది. దాదాపు 400ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడి అదితి కుటుంబానికి ముఖ్యమైదని సమాచారం. ఆ సెంటిమెంట్‌తోనే వీరి పెళ్లి అక్కడే చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదితి తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన వారసురాలు కావడం విశేషం. అదితిరావు చివరిసారిగా హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. సిద్ధార్థ్ ఇటీవల విడుదలైన ఇండియన్-2లో కనిపించారు. -
సన్నబడ్డ సంపన్నులు! రూ. 11 లక్షల కోట్ల సంపద ఆవిరి!!
ప్రపంచంలో సంపన్నుల సంపద కరిగిపోయింది. ఒక్క జెఫ్ బెజోస్ నెట్‌వర్త్ శుక్రవారం 15.2 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు) తగ్గిపోయింది. దీంతో ప్రపంచంలోని 500 మంది సంపన్నుల సంపద 134 బిలియన్ డాలర్లు (రూ. 11 లక్షల కోట్లు) క్షీణించింది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్ షేర్లు మార్కెట్లో విస్తృత అమ్మకాల మధ్య 8.8% పడిపోయాయి. బెజోస్ నెట్‌వర్త్ 191.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజులో భారీగా సంపద క్షీణించడం జెజోస్కి ఇది మూడోసారి. 2019లో విడాకుల పరిష్కారం తర్వాత 36 బిలియన్ డాలర్లు, 2022లో అమెజాన్ షేర్లు 14% పడిపోయాయి.నాస్డాక్ 100 ఇండెక్స్ 2.4% పడిపోయింది. ఇలాన్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్‌తో సహా ఇతర టెక్ బిలియనీర్ల సంపదలు వరుసగా 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫెడరల్ రిజర్వ్ రేట్ కోతలపై అనిశ్చితి, అలాగే కొన్ని అధిక-ప్రొఫైల్ ఆదాయాల్లో నిరాశలు, టెక్-హెవీ ఇండెక్స్‌ను దిద్దుబాటులోకి నెట్టేశాయి. కేవలం మూడు వారాల్లోనే 2 ట్రిలియన్ డాలర్ల విలువను తుడిచిపెట్టేసింది. -
కొత్త కోడలి అదృష్టం!! పెళ్లి తర్వాత రూ.25వేల కోట్ల సంపద!
అపర కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో జూలై 12న అత్యంత ఘనంగా, విలాసవంతంగా జరిగింది. ఈ వివాహం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద గణనీయంగా పెరిగింది.పెళ్లికి విపరీతంగా ఖర్చు చేసినా ముఖేష్ అంబానీ సంపద మాత్రం తగ్గలేదు. అంతకు ఐదింతలు పెరిగింది. జాతీయ వార్తాసంస్థ ఆజ్‌తక్ ప్రకారం, పెళ్లి తర్వాత అంబానీ నెట్‌వర్త్ రూ.25,000 కోట్లు (3 బిలియన్ డాలర్లు) పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జూలై 5న అంబానీ నెట్‌వర్త్ 118 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. జూలై 12 నాటికి ఇది 121 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఈ అసాధారణ పెరుగుదల ప్రపంచ సంపద ర్యాంకింగ్స్‌లో ముఖేష్ అంబానీ స్థానాన్ని పెంచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో అంబానీ స్థానం 12 నుంచి 11వ స్థానానికి ఎగిసింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. అంబానీ నెట్‌వర్త్ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పటిష్ట పనితీరు కారణమని చెప్పవచ్చు. పెళ్లి రోజున, రిలయన్స్ షేర్లు 1% పెరిగాయి. గత నెలలో షేర్లు 6.65% పెరిగాయి. గత ఆరు నెలల్లో 14.90% రాబడిని అందుకున్నారు. -
ఉద్యోగం నుంచి తీసేశారు.. ఏడుస్తూ కూర్చోలేదు.. కంపెనీ పెట్టి ఏకంగా..
ఓ లక్ష్యం ఉంటే.. దానివైపే అడుగులు వేస్తుంటే, తప్పకుండా సక్సెస్ నీ ముందు నిలబడుతుంది. విజయం అనేది చదవడానికి చిన్న పదమే కావొచ్చు, సొంతం చేసుకోవాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరం. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు తొంభై రెండేళ్ల 'జోన్ పేడెన్' (Joan Payden). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సాధించిన విజయం ఏంటి? నెట్‌వర్త్ ఎంత అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..1931లో కనెక్టికట్‌లోని డెర్బీలో జన్మించిన పేడెన్ తన యుక్తవయస్సును ఇండోనేషియాలో గడిపారు. అయితే ట్రినిటీ కాలేజీలో గణితం, భౌతిక శాస్త్రంలో డ్యూయల్ డిగ్రీని పూర్తి చేశారు. డ్యూయెల్ డిగ్రీ చేయడం అనేది ఆ సమయంలో మహిళలకు అరుదైన విజయం. 1950లలో న్యూజెర్సీకి చెందిన చమురు శుద్ధి కర్మాగారాలను నిర్మించే కంపెనీలో ఇంజనీరింగ్‌లో చేరిన కొద్దిమంది మహిళల్లో ఈమె కూడా ఒకరు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించారు. ఇదే ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది.ఉద్యోగం కోల్పోవడంతో.. పేడెన్ ఫైనాన్స్‌లో తన వృత్తిని ప్రారంభించారు. ఆ తరువాత మెర్రిల్ లించ్ అనే పెట్టుబడి నిర్వహణ సంస్థలో చేరింది. అప్పట్లో బాండ్, స్టాక్ మధ్య వ్యత్యాసం తెలియకపోవడంతో.. 25 శాతం తక్కువ సాలరీతో పనిచేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఈమె స్కడర్, స్టీవెన్స్ & క్లార్క్ దృష్టిని ఆకర్శించారు. అక్కడే ఆమె మొదటి మహిళా భాగస్వామి అయింది. ఆ తరువాత సొంతంగా కంపెనీ స్థాపించడానికి ఒక మైలురాయిగా నిలిచింది.1983లో 52 సంవత్సరాల వయసులో పేడెన్ సహోద్యోగి సాండ్రా రైగెల్తో కలిసి పేడెన్ & రైగెల్ను స్థాపించారు. ఈ సంస్థ కేవలం ఆదాయం, ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్లను పొందలేనని భయపడినట్లు, ఆ సమస్య ఎదురవలేదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పేడెన్ కంపెనీ ప్రారంభించిన నాలుగు దశాబ్దాల తరువాత కంపెనీ సంపద సుమారు రూ.13 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం ఇది అతి పెద్ద ప్రైవేట్ మనీ మేనేజర్లలో ఒకటిగా మారింది. పేడెన్ ప్రస్తుతం లక్షల కోట్ల సంపద కలిగి ఉన్నప్పటికీ.. వినయంగా ఉండటమే కాకూండా.. దాతృత్వాలు కూడా చేస్తుంటారు. ఇప్పటికే ఈమె విద్యకు జంతు సంరక్షణ వంటి కారణాల కోసం లక్షలాది విరాళాలు ఇచ్చింది.ఫోర్బ్స్ ప్రకారం, తొంభై రెండు సంవత్సరాల వయస్సు గల జోన్ పేడెన్ నికర విలువ దాదాపు రూ. 58వేలకోట్లు. ప్రస్తుతం ఈమె అమెరికాలోని అత్యంత ధనవంతులైన సెల్ఫ్ మేడ్ మహిళల్లో ఒకరుగా.. కేవలం యూఎస్ఏలో మాత్రమే కాకుండా చాలా దేశాల్లోని మహిళకు ఆదర్శంగా నిలిచారు. -
బఫెట్ సంపద రహస్యం అదే
జెండరీ హెడ్జ్ ఫండ్ మేనేజర్ జిమ్ సిమన్స్ సంపద విలువ 31.4 బిలియన్ డాలర్లు. విఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నెట్‌వర్త్ 139 బిలియన్ డాలర్లు. బఫెట్ కంటే సిమన్స్ సంపద 77 శాతం తక్కువ. వీరిద్దరి మధ్యనున్న సూక్ష్మ వైరుధ్యాన్ని ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవాలి. జిమ్ సిమన్స్ స్థాపించిన హెడ్జ్ ఫండ్ ‘రెనైసెన్స్ టెక్నాలజీస్’ ఒకటి రెండేళ్లు కాదు.. 1988 నుంచి ఏటా 66 శాతం చొప్పున, నిరంతరాయంగా మూడు దశాబ్దాలకు పైనే ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచి్చపెట్టింది. అదే వారెన్ బఫెట్ స్థాపించిన బెర్క్‌షేర్ హాథవే ఏటా 19.8 శాతం కాంపౌండింగ్ వృద్ధినే నమోదు చేసింది. సిమన్స్ కంటే బఫెట్ సంపదే నాలుగు రెట్లు అధికం. ఏటా ఎంత అధికంగా రాబడి తెచ్చుకున్నారనే దానికంటే.. ఎంత ముందుగా పెట్టుబడులు మొదలు పెట్టారు, వాటిని ఎంత కాలం పాటు కొనసాగించారు? అన్నవే సంపదను నిర్ణయిస్తాయని సిమన్స్–బఫెట్ జర్నీ చెబుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ వీలైనంత ముందుగా ఇన్వెస్ట్మెంట్ ఆరంభించి, దీర్ఘకాలం పాటు కొనసాగించినప్పుడే కాంపౌండింగ్ ప్రయోజనాన్ని గరిష్టంగా అందుకోగలరు. ఏటా 12 శాతం రాబడి సంపద సృష్టించాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని.. సంపాదనను తీసుకెళ్లి వృద్ధి చెందే చోట పెట్టడం. ఎంత ముందుగా ఆరంభిస్తే, దీర్ఘకాలంలో అంత అధికంగా ప్రయోజనం పొందొచ్చు. బఫెట్ పెట్టుబడుల ప్రయాణాన్ని గమనించినా ఇదే బోధపడుతుంది. ముందుగా మొదలు పెట్టడం వల్ల అప్పుడు కాంపౌండింగ్ ప్రయోజనం గరిష్ట స్థాయిలో పొందడానికి కావాల్సినంత వ్యవధి ఉంటుంది. 25 ఏళ్ల మహిమ ప్రతి నెలా రూ.1,000 చొప్పున తనకు 50 ఏళ్లు వచ్చే వరకు.. అంటే 25 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసిందని అనుకుందాం. అప్పుడు 25 ఏళ్లలో మహిమ అసలు పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీలలో దీర్ఘకాల సగటు) అంచనా ప్రకారం సమకూరే మొత్తం రూ.18 లక్షలు. కేవలం వెయ్యి రూపాయలే.. 25 ఏళ్లలో రూ.18 లక్షలుగా మారడం కాంపౌండింగ్ వల్లే. ఇలా కాకుండా మహిమ కేసులో కాంపౌండింగ్ ప్రయోజనం తీసేసి చూస్తే.. అంటే అసలుతోపాటు, దానిపై వచి్చన వడ్డీని ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే సమకూరే మొత్తం రూ.7.5 లక్షలుగానే ఉండేది. మొత్తం రూ.18 లక్షల్లో మిగిలిన రూ.10.5 లక్షలు కేవలం కాంపౌండింగ్ వల్లే సమకూరినట్టు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడికి ఇప్పుడేం తొందరొచి్చందిలే.. తర్వాత చూద్దామనుకుని, మహిమ పదేళ్లు ఆలస్యంగా తన 35వ ఏట నుంచి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టి ఉంటే ఏమయ్యేది? పైన చెప్పుకున్నట్టు 50 ఏళ్ల వయసుకు రూ.18 లక్షలు రావాలంటే అప్పటి నుంచి 15 ఏళ్ల పాటు ప్రతి నెలా ఆమె రూ.1,700 ఇన్వెస్ట్ చేయాల్సిందే. పదేళ్లు వృధా చేయడం వల్ల 70 శాతం అదనపు పెట్టుబడి అవసరం అవుతుందని ఇక్కడి ఉదాహరణ చెబుతోంది. పెట్టుబడి విషయంలో కాలం వృధా అవుతున్న కొద్దీ కాంపౌండింగ్ ప్రయోజనం అదే స్థాయిలో కోల్పోతారు. కాంపౌండింగ్పెట్టుబడిపై వడ్డీ వస్తుందని తెలుసు. దీన్ని వడ్డీ రాబడిగా చెబుతారు. ఈ వడ్డీ కూడా తిరిగి పెట్టుబడిగా మారి దానిపైనా వడ్డీ సమకూరడమే కాంపౌండింగ్. దీన్నే చక్రవడ్డీ అని కూడా చెబుతారు. బ్యాంకులో వ్యక్తిగత రుణం, బంగారంపై రుణం తీసుకున్నప్పుడు ప్రతి నెలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో ఒక నెల ఈఎంఐ చెల్లించడంలో విఫలమై, మరుసటి నెలలో చెల్లిస్తున్నప్పుడు నెల బకాయిపై వడ్డీని కూడా బ్యాంక్ రాబడుతుంది. దీన్నే వడ్డీ మీద వడ్డీగా చెబుతారు. రూ.100 ఇన్వెస్ట్ చేస్తే 10 శాతం రాబడి ప్రకారం ఏడాది తర్వాత రూ.110గా మారుతుంది. ఇందులో రూ.10 వడ్డీ రూపంలో సమకూరింది. రెండో ఏడాది రూ.110 కాస్తా రూ.121గా మారుతుంది. మొదటి ఏడాది వడ్డీ రూ.10పైనా రెండో ఏడాది రూపాయి వడ్డీ వచ్చినట్టు. ఇలా వడ్డీపై వడ్డీ రాబడి జమవుతుంది కనుకనే దీర్ఘకాలంలో భారీ మొత్తం సమకూరుతుంది. పెట్టుబడుల జర్నీ..బఫెట్ ప్రస్తుత వయసు 90 ఏళ్లు. ఆయన సంపద విలువ 139 బిలియన్ డాలర్లు. నిజానికి బఫెట్ సంపదలో 99 శాతం ఆయనకు 65 ఏళ్లు వచి్చన తర్వాత సమకూరిందేనని ప్రముఖ రచయిత మోర్గాన్ హౌసెల్ ‘ద సైకాలజీ ఆఫ్ మనీ’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఒకవేళ బఫెట్ 65 ఏళ్లకే రిటైర్ అయి ఉంటే నేడు ఆయన గురించి అంతగా మాట్లాడుకునే వాళ్లం కాదని ఓ ఇంటర్వ్యూలో భాగంగా హౌసెల్ పేర్కొన్నారు. బఫెట్ 30 ఏళ్ల వయసులో పెట్టుబడులు మొదలు పెట్టి, 60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకున్నాడన్నది చాలా మంది ఇన్వెస్టర్లకు తెలిసిన విషయం. కానీ, నిజానికి బఫెట్ 10 ఏళ్ల వయసులోనే పెట్టుబడి ఆరంభించారు. 30 ఏళ్ల నాటికి ఆయన 9.3 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నారు. వెనక్కి తీసుకోకుండా అలాగే జీవితకాలం పాటు కొనసాగించారు. సంపాదిస్తున్న మొత్తంలో కనీస అవసరాలకే తప్ప ఎప్పుడూ లగ్జరీ వ్యయాలకు పోలేదు. వీలైనంత పెట్టుబడి పెట్టడమే ఆయన చేసిన పని. నిజానికి దీన్నే బఫెట్ స్కిల్ (నైపుణ్యం)గా హౌసెల్ అభివర్ణిస్తారు. ఏటా 20 శాతం చొప్పున బఫెట్ సంపద కాంపౌండ్ అయింది. జిమ్ సిమన్స్ 1988 నుంచి పెట్టుబడులు ఏటా 66 శాతం చొప్పున వృద్ధి చెందేంత గొప్ప వ్యూహాలు అమలు చేసిననప్పటికీ.. తక్కువ సంపద కలిగి ఉండడానికి కారణం పెట్టుబడుల ప్రపంచంలోకి ఆలస్యంగా ప్రవేశించడమే. నిజానికి సిమన్స్ వార్షిక రాబడి 66 శాతంలో బఫెట్ వార్షిక రాబడి మూడింట ఒక వంతే. బఫెట్ ఎంతో ముందుగా మొదలు పెట్టడం వల్ల కాంపౌండింతో ఎక్కువ సంపద సమకూరింది. ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కానంత వార్షిక రాబడులను సిమన్స్ తెచ్చుకున్నా కానీ, ఆస్తుల్లో బఫెట్ కంటే దిగువన ఉండడానికి కారణం 50 ఏళ్లు వచి్చన తర్వాతే తన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఆరంభించడం. అందుకే ప్రతి ఇన్వెస్టర్ ముందుగా పెట్టుబడులు మొదలు పెట్టి, ఎక్కువ కాలం పాటు కొనసాగించడం ఆచరించాలని బఫెట్ విజయ గాధ తెలియజేస్తోంది. బఫెట్ మాదిరే సిమన్స్ కూడా 70 ఏళ్లపాటు ఏటా 66 శాతం చొప్పున రాబడులు తెచ్చుకుని ఉంటే.. ఆ మొత్తం కొన్ని వందల రెట్లు అధికంగా ఉంటుంది. బఫెట్ పంచ సూత్రాలు ⇥ పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టి ఉండాలి. అవసరమైతే ఎప్పటికీ కొనసాగించాలి. ⇥ నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఇక్కడ పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. మంచి కంపెనీని అద్భుతమైన ధరలో (చాలా ఖరీదైన వ్యాల్యుయేషన్‌లో) కొనడం కంటే.. అద్భుతమైన కంపెనీని సరసమైన ధరలో కొనుక్కోవాలి. ⇥ పెట్టుబడుల్లో ఉండే రిస్క్ తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారో తెలియనప్పుడే రిస్క్ ఎదురవుతుంది. ⇥ వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నారు. అసాధారణ యాజమాన్యం, అద్భుతమైన వ్యాపారంతో ఉంటే ఆ కంపెనీలో మీరు పెట్టే పెట్టుబడి కాల వ్యవధి జీవితకాలంగానే భావించాలి. ⇥ ఈక్విటీ మార్కెట్లో ఓపిక ఉన్నవారికే అధిక రాబడులు సొంతమవుతాయి. దూకుడైన ఇన్వెస్టర్ నుంచి ఓపికగా వేచి చూసే ఇన్వెస్టర్‌కు సంపదను బదిలీ చేసే విధంగా స్టాక్ మార్కెట్ పనితీరు ఉంటుంది. జిమ్ సిమన్స్ ఏమి చెప్పారంటే..?⇥ ఒక గొప్ప సిద్ధాంతం అందంగా ఎలా ఉంటుందో.. గొప్పగా, సమర్థవంతంగా పనిచేసే కంపెనీ కూడా అంతే అందంగా ఉంటుంది. ⇥ వీలైనంత వరకు మీ చుట్టూ తెలివైన, ఉత్తమమైన వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. వారు మీకంటే తెలివైన వారు అయితే ఇంకా మంచిది. ⇥ ఏదో ఒకటి వాస్తవికంగా చేయండి. మిగిలిన వారిని అనుసరించొద్దు. ఒకే సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ మంది ప్రయతి్నస్తుంటే మీరు దాన్ని చేయొద్దు. ⇥ అంత సులభంగా వదిలేసుకోవద్దు. దానికే కట్టుబడి ఉండాలి. అలా అని శాశ్వతంగా కాదు. కానీ, ఫలితమిచ్చేంత సమయం దానికి ఇవ్వాలి. ⇥ చివరిగా అదృష్టం కలసిరావాలి. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ⇥ జేమ్స్ హారిస్ సిమన్స్ (జిమ్ సిమన్స్) గణితంలో దిట్ట. తనకున్న అసాధారణ ప్రతిభతో మార్కెట్ల తీరును కచి్చతంగా అంచనా వేసి, పెట్టుబడులపై అధిక ప్రతిఫలం పొందే దిశగా ఆయన అమలు చేసిన విధానాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయి. 1980లోనే క్వాంట్ ఇన్వెస్టింగ్ విధానాన్ని ఆవిష్కరించి బఫెట్, జార్జ్ సోరోస్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లను అధిగమించారు. -
హీరామండి నటి షర్మిన్ సెగల్ భర్త ఎవరో తెలుసా? వేల కోట్ల ఆస్తి
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ వెబ్ సిరీస్ హీరామండి హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో నటించిన ప్రముఖ నటీ నటుల వివరాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలీ మేనకోడలు గ్లామరస్ 'అలంజేబ్' పాత్రలో అలరించిన షర్మిన్ సెగల్ ఎవరు. ఆమె భర్త ఎవరు. అతని నెట్‌వర్త్ ఎంత అనేది ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీ కోసం.ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1995లో జన్మించింది షర్మిన్ సెగల్. తండ్రి, దీపక్ సెగల్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ హెడ్‌గా పనిచేశారు. తల్లి బేలా సెగల్ పాపులర్ ఫిల్మ్ ఎడిటర్. తల్లి సోదరుడే , బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ. ఖామోషి, దేవదాస్, బ్లాక్ లాంటి ఎన్నో చిత్రాలకు బేలా సెగల్ పనిచేశారు.అంతేకాదు బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా , మేరీ కోమ్ వంటి చిత్రాలకు షర్మిన్ మామ సంజయ్ లీలా బన్సాలీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది షర్మిన్ సెగల్. ఆ తర్వాతే నట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. షర్మిన్ సెగల్ 'మలాల్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల విడుదలైన సంజయ్ లీలా బన్సాలీ క 'హిరామండి'లో షర్మిన్ గ్లామరస్ పాత్రను దక్కించుకుంది.రూ. 50 వేల కోట్ల ఆస్తిషర్మిన్ సెగల్ భర్త, పారిశ్రామికవేత్త అమన్ మెహతా వేల కోట్లకు యజమాని. గత ఏడాది నవంబరులో అమన్ మెహతా , షర్మిన్ సెహగల్ పెళ్లి చేసుకున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ అనుబంధ సంస్థటోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమన్మెహతా. మెహతా కుటుంబ నికర విలువ 50000 కోట్లకు పైమాటే. అమన్ టోరెంట్ గ్రూప్‌ను అమన్ తాత యు.ఎన్. మెహతా 1959లో ప్రారంభించారు. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది. ప్రస్తుతం అమన్ తండ్రి సమీర్ మెహతా సోదరుడు సుధార్ మెహతా ఇద్దరూ కంపెనీ కో-ఛైర్మెన్‌గా ఉన్నారు. టోరెంట్ గ్రూప్‌నకు టొరెంట్ ఫార్మా, టొరెంట్ పవర్, టొరెంట్ కేబుల్స్, టొరెంట్ గ్యాస్ ,టొరెంట్ డయాగ్నోస్టిక్స్ లాంటి అనుబంధ కంపెనీలున్నాయి.టోరెంట్ ఫార్మా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమన్ మెహతా 2022 నుండి టోరెంట్ ఫార్మాలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇండియతో పాటు, ఇతర దేశాలలోకంపెనీ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.ఫోర్బ్స్ ప్రకారం, అమన్ మెహతా తండ్రి సమీర్ మెహతా నికర విలువ 6.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 50,939 కోట్లు). టోరెంట్ ఫార్మా ఆదాయం 4.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 38,412 కోట్లు). సమీర్, అమన్ ఇద్దరూ తమ కుటుంబ వ్యాపారంలో ఫార్మా రంగంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. అమన్ మెహతా విద్యార్హతలుఅమన్ మెహతా బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అమెరికాలోన కొలంబియా బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. ఎంబీఏ పూర్తికాక ముందు అమన్ 3 సంవత్సరాల పాటు టోరెంట్ పవర్లో డిస్ట్రిబ్యూషన్ మేనేజర్‌గా అనుభవం సంపాదించాడు. ఎంబీఏ పూర్తి అయిన తరువాత టోరెంట్ ఫార్మాలో సీఎంఓగా చేరి మూడేళ్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు. -
ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి?
భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముఖేష్ అంబానీ' గురించి తెలిసిన చాలా మందికి, ఆయన మేనకోడలు 'ఇషితా సల్గావ్కర్' (Isheta Salgaocar) గురించి తెలియకపోవచ్చు. వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు పొందిన ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరీ ఇషితా సల్గావ్కర్? ఇషితా సల్గావ్కర్.. దీప్తి సల్గావ్కర్, దత్తరాజ్ సల్గావ్కర్ దంపతుల కుమార్తె. ఈమె స్వయానా ముకేశ్ అంబానీకి మేనకోడలు. ఎందుకంటే ఇషితా తల్లి 'దీప్తి సల్గావ్కర్' ధీరూభాయ్ అంబానీ కుమార్తె.. ముకేశ్ అంబానీ సోదరి. నిజానికి ముకేశ్ అంబానీ మేనకోడలుగా కాకుండా వ్యాపార కార్యకలాపాలు, దాతృత్వ కార్యక్రమాలతోనే సుపరిచితం అయింది. ఈమె 2016లో నీరవ్ మోదీ తమ్ముడు నీషాల్ మోదీని వివాహం చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిరువురు విడిపోయారు. ఆ తరువాత ఇషితా బిజినెస్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మేనల్లుడు 'అతుల్య మిట్టల్'తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2022లో వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని తన బంధువుల మాదిరిగా కాకుండా.. ఇషితా చదువుకునే రోజుల నుంచి గొప్ప విజయాలను సాధించింది. ఈమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తరువాత సల్గావ్కర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్పొరేట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది. ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు - సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్ ఆమె తల్లి దీప్తి సల్గావ్కర్ మాదిరిగానే.. ఇషితా సల్గావ్కర్ దాతృత్వ కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనేది. ఇప్పటికే అనేక విద్య, ఆరోగ్య సంరక్షణ సంబంధిత కార్యకలాపాలకు పెద్ద ఎత్తున సాయం కూడా చేసింది. ప్రస్తుతం ఇషితా నికర విలువ గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు, అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం ఈమె నికర విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని, వ్యాపార రంగంలో కూడా బాగా రాణిస్తున్నట్లు సమాచారం. -
బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత
భారతదేశంలో కుబేరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో మరో ఇండియన్ పేరు నమోదైంది. ఎనిమిది పదుల వయసులో కుబేరుల జాబితాలోకి చేరిన వ్యక్తి ఎవరు.. అయన సంపద ఎంత.. ఏ కంపెనీ నడిపిస్తున్నారు.. ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మద్యం వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటి. మద్యం వ్యాపారం చేస్తూ ధనవంతుల జాబితాలో చేరిన 'లలిత్ ఖైతాన్' (Lalit Khaitan) 1972-73లలో కంపెనీ స్వాధీనం చేసుకున్న తరువాత దానిని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఈయన అనుదినం కృషి చేసేవారు. అనుకున్న విధంగానే సక్సెస్ సాధించి ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. లలిత్ ఖైతాన్ సారథ్యంలో ముందుకు సాగుతున్న 'రాడికో ఖైతాన్' (Radico Khaitan) ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, 8 పీఎం విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ, రాంపూర్ సింగిల్ మాల్ట్ లాంటి బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది కంపెనీ షేర్లు 50 శాతం పెరిగి సంస్థ విలువ బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో లలిత్ ఖైతాన్ బిలియనీర్ల జాబితాలోకి చేరిపోయారు. ఖైతాన్.. అజ్మీర్ మాయో కాలేజ్, కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువు పూర్తి చేసుకుని, బెంగుళూరులోని BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజిరియల్ ఫైనాన్స్ & అకౌంటింగ్ కోర్సును అభ్యసించారు. రాడికో ఖైతాన్‌గా పిలువబడుతున్న కంపెనీని గతంలో రాంపూర్ డిస్టిలరీ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్‌గా పిలిచేవారు. ఆ సంస్థను ఖైతాన్ తండ్రి జీఎన్ ఖైతాన్ 1970 ప్రారంభంలో నష్టాల్లో నడుస్తున్న సమయంలో సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఈ కంపెనీ క్రమంగా వృద్ధి చెందుతూ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థల జాబితాలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం కంపెనీ బ్రాండ్లను సుమారు 85 దేశాలలో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏం ప్లానింగయ్యా.. ఏమీ చేయకపోయినా నెలకు రూ.9 లక్షలు సంపాదన మద్యం రంగంలో అతి తక్కువ కాలంలోనే గొప్ప పురోగతి కనపరిచిన లలిత్ ఖైతాన్ 2008లో 'ఇన్స్పిరేషనల్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు', 2017లో ఉత్తర ప్రదేశ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ ద్వారా 'లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు' వంటి వాటిని సొంతం చేసుకుని.. ఇప్పడూ ఫోర్బ్స్ జాబితాలో ఒకరుగా స్థానం సంపాదించారు. -
కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొన్న ప్రీతి జింటా!
ప్రముఖ నటి 'ప్రీతి జింటా' (Preity Zinta) ముంబైలోని బాంద్రాలో ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు 'రియల్టీ ప్లాట్‌ఫామ్ ఇండెక్స్‌టాప్.కామ్' ద్వారా తెలిసింది. ఈ అపార్ట్మెంట్ ధర ఎంత? ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రీతి జింటా ముంబైలోని పాష్ బాంద్రాలో సుమారు 1,474 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్‌మెంట్‌ను రూ. 17.01 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 23న జరిగినట్లు తెలుస్తోంది. కీస్టోన్ రియల్టర్స్ లిమిటెడ్ దీనిని విక్రయించినట్లు, దీని కోసం నటి రూ. 85.07 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు సమాచారం. ప్రీతి జింటా మొత్తం ఆస్తుల విలువ ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 110 కోట్లు. ముంబై రియల్ ఎస్టేట్ ముంబై రియల్ ఎస్టేట్ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఇక్కడ స్థలాలను కొనుగోలు చేశారు. ఇటీవల బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, అతని భార్య షబానా బాజ్‌పేయి ముంబైలోని ఓషివారా ప్రాంతంలో రూ. 32.94 కోట్లతో 7,620 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో నాలుగు ఆఫిస్ యూనిట్లను కొనుగోలు చేశారు. ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు! సినీ నటులు అమితాబ్ బచ్చన్ , కార్తీక్ ఆర్యన్ గతంలో ముంబై, దాని పరిసర ప్రాంతాలలో స్థలాలను కొనుగోలు చేశారు. ఎక్కువ మంది నివాస స్థలాల కంటే ఎక్కువ అద్దె రాబడి కోసం కమర్షియల్ ఆస్తుల మీద పెట్టుబడులు పెడుతున్నారు. -
యూట్యూబ్ కింగ్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్లోకొచ్చేశాడు!
YouTuber Gaurav Taneja మలేషియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థకు మాజీ పైలట్ గౌరవ్ తనేజా మరోసారి వార్తల్లో నిలిచాడు. మెట్రో రైల్లో పుట్టిన రోజు వేడుకలు జరిపిన బుక్కైన యూట్యూబర్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? యూట్యూబ్‌లో ఫ్లైయింగ్ బీస్ట్‌గా ఫిట్నెస్ పాఠాలు చెప్పే యూ ట్యూబర్ గౌరవ్ తన సంపాదన ఎంతో ఫ్యాన్స్‌కి చెప్పేశాడు. అంతేకాదు తన పాత సీఈవోతోపోలిస్తే సంపాదనలో కింగ్‌ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకపుడు తనను తొలగించిన ఏయిర్ ఏసియా సీఈవో కంటే ఇపుడు తన సంపాదేన ఎక్కువ అంటూ ఇటీవల ఇన్ఫ్లుయెన్సర్ రాజ్ షమానీ హోస్ట్ చేసిన పోడ్కాస్ట్ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ డీల్స్, యాడ్స్ ఆదాయం గురించి చెప్పమని అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. గౌరవ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. నిర్దిష్టంగా ఇంత అనీ సంపాదన వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ మిలియన్ డాలర్ల ఆస్తులను గుర్తుచేసుకుని తనేజా ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అదీ సీఈవో టోనీ లింక్డ్ఇన్ పోస్ట్‌తో విమర్శల పాలైన తరువాత కంపెనీ మాజీ పైలట్ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో మరింత వైరల్‌గా మారాయి. ఇంతకీ ఎవరీ గౌరవ్ తనేజా ♦ 2008లో ఐఐటీ ఖరగ్‌పూర్ పట్టభద్రుడైన గౌరవ్ తనేజా "సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, ప్రొఫెషనల్ బాడీబిల్డర్ , ఏవియేటర్ కూడా. ♦ ఇపుడు ఢిల్లీ యూనివర్శిటీనుంచి ఎల్ఎల్బీ చేస్తున్నాడు. ♦ మరో పైలట్ రీతూ రథీతో వివాహం. వీరికి ఇద్దరు కుమార్తెలు . ♦ భద్రతా సమస్యల్ని గురించిన మాట్లాడినందుకే తనను ఎయిర్ ఏసియానుంచి తొలగించారనేది గౌరవ్ వాదన. ♦ ఫ్లైయింగ్ బీస్ట్ కంటే ముందే 2016లో FitMuscle TVని లాంచ్ చేశాడు. దీనికి దాదాపు 30 లక్షల సబ్ స్క్రైబర్లున్నారు. ఇక 2020లో లాంచ్ చేసిన రాస్బరీ కే పాపాకి 12 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లున్నారు I was terminated from airasia for raising safety issues! Now, the same issues are raised by #DGCA to @AirAsiaIndian. Justice will prevail! #Sabkeliye — Gaurav Taneja (@flyingbeast320) June 28, 2020 కాగా 2020జూన్‌లో AirAsia ఇండియా గౌరవ్‌ను పైలట్‌గా విధులనుంచి తొలగించింది. అప్పటికే ప్రముఖ వ్లాగర్‌గా తనేజా ఫుట్ టైం కంటెంట్ క్రియేటర్‌గా, యూట్యూబర్‌గా కరియర్ స్టార్ట్ చేశాడు.ఫ్లైయింగ్ బీస్ట్, ఫిట్ మజిల్ టీవీ, రాస్బరీకే పాపా పేర్లతో యూట్యూబ్ ఖాతాలను నిర్వహిస్తున్నాడు. అలా సోషల్‌మీడియాలో పాపులర్ స్టార్‌గా మారిపోయాడు.ప్రస్తుతం, యూట్యూబ్‌లో 80 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు, ట్విటర్లో దాదాపు 900k, ఇన్‌స్టాలో 40 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అతని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. -
స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?
Comedian Kapil Sharma net worth స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో కపిల్ శర్మ నెట్‌వర్త్, కార్లు, తదితర వివరాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్‌లో చక్కటి ఫాం హౌస్‌తోపాటు, ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. దీంతో పాటు లోఖండ్వాలాలో మరొక లగ్జరీ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవంతమైన కెరీర్‌తో పాటు, కపిల్ అందమైన కుటుంబం కూడా ఆయన సొంతం. గర్ల్ ఫ్రెండ్ గిన్ని చత్రాత్ను డిసెంబర్ 12, 2018న వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె అనయ్రా ,కుమారుడు త్రిషాన్‌ను ఉన్నారు. ఇక కపిల్ ఆస్తిపాస్తులను గమనిస్తే మీడియా నివేదికలప్రకారం స్వస్థలమైన పంజాబ్‌లో అందమైన ఫామ్‌హౌస్‌ని కూడా కలిగి ఉన్నాడు. ఈ ఫామ్‌హౌస్ విలువ రూ. 25 కోట్లు. పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో బహుళ ఎకరాల్లో విస్తరించి ఉందీ విశాలమైన ఎస్టేట్. ఈ విలాసవంతమైన రిసార్ట్ చుట్టూ పచ్చని పొలాలు , అందమైన పూదోటలతో,అత్యాధునిక ఫీచర్లతో ప్రకృతి ఒడిలో ఒక రాజభవనంలా ఉంటుంది. విజువల్ ట్రీట్ అందించే ఈ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి, వినోదానికి ఎక్కడా కొదవే ఉండదు. విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, ఇంటి బయట గెజిబో, అందమైన ఫౌంటెన్‌తో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ముంబైలోని పశ్చిమ శివార్లలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. భార్య గిన్ని చత్రత్, పిల్లలతో ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. దీని ధర 15 కోట్లకు పైమాటే. జిమ్, టెర్రస్ గార్డెన్, సినిమా థియేటర్ ఉన్న ఈ యింటికి సంబంధించిన ఫోటోలను కపిల్ భార్య గిన్ని చత్రాత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే దీపావళి సందర్భంగా ఈ ఇంటిని బాగా అలంకరించడం వారికి అలవాటు. విలాస వంతమైన ఫర్నిచర్, అద్భుత లైట్లు, మొక్కలు, బుద్ధ విగ్రహంతో తీర్చిదిద్దిన బాల్కనీ వీడియోను గతంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కపిల్ శర్మ నెట్‌వర్త్ స్టాండ్-అప్ కమెడియన్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటుడు, టెలివిజన్ నిర్మాతగా ఉన్న కపిల్ శర్మ నికర విలువ సుమారు రూ.280 కోట్లు. గత 5 సంవత్సరాలలో ఆయన సంపద 380 శాతం పెరిగింది. నెలవారీ ఆదాయం ,జీతం 3 కోట్లు. తాజా వార్తల ప్రకారం తన షో కొత్త సీజన్ కోసం, అతను ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 50 లక్షలు వసూలు చేస్తాడు. ఇది కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు కోటి రూపాయలు చార్జ్ చేస్తాడు. ఇక దాతృత్వం విషయంలో గొప్ప మనుసు చాటుకునే టాప్ సెలబ్రిటీలలో ఒకడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడుగా ఉన్నాడు. ఖరీదైన కార్ కలెక్షన్ కపిల్ శర్మ , గిన్ని చత్రత్ జంట ఖరీదైన కార్ కలెక్షన్ , ఇతర లగ్జరీ వస్తువులతోపాటు, హై-ఎండ్ ఆటోమొబైల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫెరారీ, పోర్షే లాంటి అత్యాధునిక కార్లు అంటే పిచ్చి. రూ. 1.36 ఖరీదైన Mercedes Benz S350 CDI, రూ. 80 లక్షల వోల్వో XC 90, రేంజ్ రోవర్ ఎవోక్ Mercedes-Benz S-క్లాస్, BMW X7 హోండా సివిక్ లాంటి కార్లున్నాయి. DC డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ దిలీప్ ఛబ్రియా డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ విలువ రూ. 5.5 కోట్లు . బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్. లాంజ్ ఏరియాతో కూడిన ఖరీదైన ఇంటీరియర్ దీని సొంతం. -
బంగ్లా ఖరీదే వందల కోట్లు.. ఎవరీ రేణుకా తల్వార్!
దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఎవరిది అంటే.. ముందుగా చాలామందికి ముఖేష్ అంబానీ లేదా గౌతమ్ ఆదానీ వంటి పారిశ్రామికవేత్తల పేర్లే గుర్తొస్తాయి. కానీ ఢిల్లీలో మాత్రం అత్యంత ఖరీదైన ఇల్లు ఒక మహిళకు చెందింది. ఇంతకీ ఆమె ఎవరు, ఆ ఇంటి ఖరీదు ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఢిల్లీలో ఖరీదైన ఇల్లు కలిగిన మహిళ పేరు 'రేణుకా తల్వార్'. ఈమె ప్రముఖ రియల్ ఎస్టేట్ 'కేపీ సింగ్' కుమార్తె. ఈమె కొనుగోలు చేసిన ఇల్లు పృథ్వీరాజ్ రోడ్లో ఉంది. టీడీఐ ఇన్ఫ్రా కార్పొరేషన్ డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కమల్ తనేజా ఆమెకు ఈ బంగ్లాను విక్రయించినట్లు సమాచారం. 2016లో ఈ బంగ్లాను రూ. 435 కోట్లతో కొనుగోలు చేసింది. ప్రస్తుతం దీని ధర రూ. 510 కోట్లు వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇది మన దేశంలో అత్యంత ఖరీదైన బంగ్లాలలో ఒకటిగా నిలిచింది. దీని విస్తీర్ణం దాదాపు 5000 చ.మీ కాగా ఇంటి నిర్మాణ ప్రాంతం రూ. 1189 చ.మీ. అంటే ఈ భారీ విలాసవంతమైన ఇల్లు చదరపు మీటరు ఖరీద్దు ఏకంగా రూ. 8.8 లక్షలు. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. రేణుకా తల్వార్ కంటే ముందు, ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన పృథ్వీరాజ్ రోడ్లో షాహీ ఎక్స్‌పోర్ట్స్ హరీష్ అహుజా రూ. 173 కోట్లతో ఖరీదైన భవనం కొనుగోలు చేశారు. ఇది ప్రస్తుతం ఉన్న రేణుకా తల్వార్ బంగ్లా పరిమాణంలో సగం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె నికర సంపద విలువ ఏకంగా రూ. 2780 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. -
భర్త కంటే 120 రెట్లు ఎక్కువ: పరిణీతి షాకింగ్ నెట్‌వర్త్, లగ్జరీ కార్లు
Pari-Raghav Chadha Networth బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక, ఫోటోలు ఇంటర్నెట్లో లేటెస్ట్ బజ్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మేలో నిశ్చితార్థం చేసుకున్న లవ్బర్డ్స పరి- రాఘవ్ చద్దా లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ముచ్చటగా సాగింది. అలాగే పెళ్లి దుస్తుల్లో సరికొత్త లుక్లోఈ జంట మెరిసిపోయారు. ఈక్రమంలో వారి ఆస్తి ఎంత అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాఘవ్ కంటే పరిణీతి నెట్‌వర్త్ 120 రెట్లు ఎక్కువ అని టాక్. 2011లో విడుదలైన లేడీస్ వర్సెస్- రికీ బాహ్ల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అనేక సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఆమె ఒకరు. సినిమాలతో బ్రాండ్ ఎండార్స్మెంట్లు ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. దీంతో పరిణీతి చోప్రా నికర విలువ సుమారు 74 కోట్లుగా అంచనా. పరిణీతి ఆడి డ్రైవ్ చేస్తే, భర్త రాఘవ్ స్విఫ్ట్ డిజైర్‌ను నడుపుతాడు అంటూ సోషల్ మీడియాలోకమెంట్లు వినిపిస్తున్నాయి. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి) పలు మీడియా నివేదికల ప్రకారం ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ అయిన క్లెన్స్టాలో మైనారిటీ వాటా, హైదరాబాద్‌కు చెందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ తృతీయలో పెట్టుబడులు ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ పరిణీతి సొంతం. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇంటి ఇంటీరియర్స్ తో అద్భుతంగా కనిపించే ఈ ఇల్లు ధర సుమారు రూ. 22 కోట్లు (బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?) లగ్జరీ కార్లు పరిణీతికి కూడా ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. రూ. 99.56 లక్షలు జాగ్వార్ XJL,దాదాపు రూ 1.30 కోట్ల లువైన రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ కార్లు పరిణీతి సొంతం. ఇంకా 43.19 లక్షల విలువైన ఆడి క్యూ4, రూ. 69.27 లక్షలు Q7, ఆడి ఏ-6 లాంటివి కూడా ఆమె గ్యారేజ్‌లో ఉన్నాయి. ఆమె ధరించే దుస్తులు, బ్యాగ్‌లు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. బ్రాండెడ్ బ్యాగ్స్, షూ ఫ్యాన్ 2.05 లక్షల ఖరీదుచేసే లూయిస్ విట్టన్ న్యూ వేవ్ మల్టీ-పోచెట్ బ్యాగ్‌తో కనిపించింది .అలాగే ఒక ఈవెంట్లో ఆమె ధరించిన ఫిగర్-హగ్గింగ్ ఫెండీ దుస్తుల ధర సుమారు 1.64 లక్షలు. అంతేకాదు పరిణీమి షూ ఫ్యాన్ కూడా. జిమ్మీ చూ నుండి బాలెన్సియాగా వరకు అన్ని హై-ఎండ్ బ్రాండ్లంటే మోజు. నటిగానే కాకుండా ఒక అద్భుతమైన గాయని కూడా. ప్లేబ్యాక్ సింగర్‌గా ఐకానిక్ సాంగ్ బతెరి మిట్టి మహిళా వెర్షన్‌తో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానా సరసన 2017లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మేరీ ప్యారీ బిందులో గాయనిగా విశ్వరూపాన్ని చూపించింది ఇషాక్జాదే (2012), శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013), హసీ తో ఫేసీ (2014), డిషూమ్ (2016), గోల్మాల్ ఎగైన్ (2017) బ్లాక్‌బస్టర్ హిట్మూవీల్లో నటించిన పరిణీతి మిషన్ రాణిగంజ్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి పరిణీతి చోప్రా కనిపించనుంది.ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ‘చమ్కిలా’లో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి చమ్కిలా లో యాక్ట్ చేసింది. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన పరిణీతి పరిణీతి చోప్రా 1988న అక్టోబర్ 22న న హర్యానాలోని అంబాలాలో జన్మించింది. పరిణీతి చోప్రా ధనిక కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి, పవన్ చోప్రా, వ్యాపారవేత్త, అంబాలా కంటోన్మెంట్లో భారతీయ సైన్యానికి డీలర్ కూడా తల్లి రీనా చోప్రా. అంబాలాలోని జీసస్ మేరీ కాన్వెంట్లో, UKలోని మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్, ఎకనామిక్స్ ఫైనాన్స్‌లో ట్రిపుల్ హానర్స్ డిప్లొమా పొందింది. అలాగే మ్యూజిక్‌లో బి.ఎ. హానర్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 43.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్‌కు PRగా తన వృత్తిని ప్రారంభించింది. రాఘవ్ చద్దా నికర విలువ రాఘవ్ చద్దా పార్లమెంటులో అతి పిన్న వయస్కుడిగా పాపులర్అయిన ఈ ఆప్ ఎంపి.యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ వంటి ప్రసిద్ధ సంస్థల్లో విద్యనభ్యసించాడు. నికర విలువ రూ. 50 లక్షలుగా తెలుస్తోంది. పరిణీతి లగ్జరీ కార్లతోపోలిస్తే రాఘవ్ చద్దా వద్ద ఉన్నది స్విఫ్ట్ డిజైర్ కారు. -
ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్‌వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?
స్కిల్డ్ పేసర్‌గా పాపులర్ అయిన భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయిన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బుమ్రా భార్య సంజనా గణేశన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న బుమ్రా అంగద్ జస్ప్రీత్ బుమ్రా అంటూ తన బుజ్జాయి పేరును కూడా ప్రకటించేశాడు. దీంతో బుమ్రా-సంజన దంపతులకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఫ్యాన్స్ కూడా తెగ సంతోష పడిపోతున్నారు. ఈ క్రమంలో బుమ్రా నెట్‌వర్త్, కార్లు తదితర ఆస్తులపై ఆసక్తి నెలకొంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి, క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో జట్టులో కీలక క్రికెటర్‌గా ఎదిగిన వాడు బుమ్రా. తనదైన స్పెషల్ బౌలింగ్ యాక్షన్ , యార్కర్లతో నిలకడైన బౌలింగ్ సామర్థ్యంతో పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా తరువాతే ఎవరైనా. ఇప్పటివరకు తన చిన్న కెరీర్లో, బుమ్రా 2019లో ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. బుమ్రా 2013 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ జట్టుకు కీలక టైటిళ్లను అందించిన ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. మరి ఇంత పాపులర్ అయిన బుమ్రా సంపాదన, ఇతర వివరాలను పరిశీలిస్తే.. వివిధ మీడియా నివేదికల ప్రకారం 2023 మార్చి నాటికి జస్ప్రీత్ బుమ్రా నికర విలువ రూ. 55 కోట్లు(7 మిలియన్ డాలర్లు)గా అంచనా. అలాగే కాంట్రాక్టు ఆటగాళ్లకు బీసీసీఐ చెల్లింపు విధానం ప్రకారం బుమ్రా వార్షిక వేతనం రూ.7 కోట్లు. దీనికి తోడు భారత జట్టు కోసం ఆడే ప్రతి టెస్ట్, ODI, T20I మ్యాచ్‌లకు అందే రెమ్యునరేషన్ వరుసగా రూ. 15 లక్షలు, రూ. 6 లక్షలు , రూ. 3 లక్షలు. View this post on Instagram A post shared by Sanjana Ganesan (@sanjanaganesan) బ్రాండ్లు భారత క్రికెట్ జట్టు గ్రౌండ్లో స్టార్ క్రికెటర్‌గానే కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టీమ్ కాంట్రాక్టులు,బ్రాండ్ ఎండార్స్మెంట్లు ద్వారా కూడా బుమ్రా సంపాదన పెరుగుతూనే ఉంది. బుమ్రా డ్రీమ్11, ఆసిక్స్, వన్‌ప్లస్ వేరబుల్స్, జాగల్, బోట్, సీగ్రామ్ రాయల్ స్టాగ్, కల్ట్స్పోర్ట్, ఎస్ట్రోలో, యునిక్స్ భారత్ పే వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లు అతని చేతిలో ఉన్నాయి. ప్రముఖ క్రికెట్ యాంకర్ సంజనా గణేశన్‌తో పెళ్లి తరువాత బుమ్రా పూణేలోని అనేక ఆస్తులతో పాటు, ముంబైలో సుమారు రూ. 2 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లును సొంతం చేసుకున్నాడు. 2015లో అహ్మదాబాద్‌లో విలాసవంతమైన డిజైనర్ ఇంటిని కొనుగోలు చేశాడు.దీని విలువ ప్రస్తుతం రూ. 3 కోట్లు. ఈ ఆస్తులతో పాటు దేశ వ్యాప్తంగా పలు రియల్ ఎస్టేట్ ఆస్తులను కూడా కలిగి ఉన్నాడు. లగ్జరీ కార్లు: బుమ్రా గ్యారేజీలో రూ. 2.54 కోట్ల విలువైన మెర్సిడెస్-మేబ్యాక్ S560, రూ. 2.17 కోట్ల విలువైన నిస్సాన్ GT-R, రూ. 90 లక్షల విలువైన రేంజ్ రోవర్ వెలార్ , టయోటా ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి. వీటి విలువ రూ.25 లక్షలు. కాగా బుమ్రా డిసెంబర్ 6, 1993న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించాడు. తన సొంత రాష్ట్రం గుజరాత్ కోసం ఆడుతున్న క్రమంలో ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2013లో, జస్ప్రీత్ తన తొలి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో జస్ప్రీత్ బుమ్రా జనవరి 2016లో, జస్ప్రీత్ ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ T20 అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు తన కెరీర్లో, బుమ్రా 2019లో ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెల్చుకున్నాడు. View this post on Instagram A post shared by jasprit bumrah (@jaspritb1) ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న జస్ ప్రీత్ బుమ్రా ఇండియాకు తిరిగి రావడంతో ఫ్యాన్స్‌ను గందరగోళంలో పడేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2023 (Asia Cup 2023)లో భాగంగా భారత్, పాకిస్తాన్ (IND vs PAK మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా నేపాల్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే, సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఆ భారత్ సూపర్-4కు క్వాలిఫై అయిన తరువాత పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 10న తదుపరి మ్యాచ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం తండ్రిగా ప్రమోట్ అయిన ఆనందంలో ఉన్న బ్రుమా సూపర్-4 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
టాలీవుడ్ మన్మధుడి కళ్లు చెదిరే నెట్‌వర్త్, కార్లు, ఇల్లు ఈ విషయాలు తెలుసా?
ఇండియన్ సౌత్ ఫిల్మ్స్ మెగాస్టార్ గురించి పరిచయం అవసరం లేదు. 63 ఏళ్ల వయసులో కూడా టాలీవుడ్ మన్మధుడిగా అక్కినేని నాగార్జున ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల్లో ఒకరు. అలనాటి టాప్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వర రావు కుమారుడిగా తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ, తనదైన నటన, ప్రతిభతో సూపర్ స్టార్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మాత్రమేకాదు బాకాఫీస్ బ్లాక్ బస్టర్ మూవీలతో అటు దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. అద్భుత నటనలో విమర్శకుల ప్రశంసలందుకున్న నటుడు. కేవలం నటుడుగా మాత్రమే కాదు నిర్మాతగా, థియేటర్ ఆర్టిస్ట్, పాపులర్ టీవీ షోకు హోస్ట్‌గా పాత్ర ఏదైనా తనదైన శైలిలో ఆకట్టు కోవడం ఆయన స్పెషాల్టీ. ‘నాగ్’ బర్తడే సందర్భంగా ఆయన నెట్‌వర్త్ తదితర విషయాలను గురించి చూద్దాం. 1959, ఆగస్టు 29న చెన్నైలో పుట్టిన నాగార్జున 1986లో తెరంగేట్రం చేశారు. అనతికాలంలోనే అనేక బాక్లబస్టర్ సినిమాలను అందించి స్టార్‌గా తన వారసత్వాన్ని నిలుపు కున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎవర్ గ్రీన్ కింగ్ నటనా ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. అలాగే హైయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుల్లో ఒకరిగా ఉన్నాడు. దేశంలో అత్యధికంగా పన్ను చెల్లించేవారిలో నాగార్జున కూడా ఒకరు. 2016లో మొత్తం ఆదాయపు పన్ను చెల్లింపులు రూ.16 కోట్లకు పైగా ఉన్నాయి. 2023 నాటికి నాగార్జున నికర విలువ 950 కోట్ల రూపాయలుగా ఇండస్ట్రీ వర్గాల అంచనా. వార్షిక ఆదాయం దాదాపు 40కోట్ల రూపాయలు. నాగార్జున లగ్జరీ కార్లు: BMW 7-సిరీస్ , ఆడి A-7 తదితర కార్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో కారు ధర 1- 2.5 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం సినిమాలే. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం భారీ మొత్తంలోనే వసూలు చేస్తాడని ఇండస్ట్రీ టాక్. నాగార్జునకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని లగ్జరీ భవనం ఉంది. దీని అంచనా విలువ దాదాపు రూ.42.3 కోట్లు. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు ఆస్తులు కూడా ఉన్నాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ పెట్టుబడులున్నాయి. ప్రస్తుతానికి కళ్యాణ్ జ్యువెలర్స్ మినహా కళ్యాణ్ జ్యువెలర్స్‌కు అక్కినేని నాగార్జునకు బ్రాండ్ ఎండార్స్మెంట్లు లేవు. దీనికి ఏడాదికి రూ.2 కోట్లు తీసుకుంటాడు. మరో పాపులర్ షోకు సంబంధించి 40 ఎపిసోడ్ల షో కోసం నాగార్జున రూ.3 కోట్లు ప్లస్ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేసినట్లు తాజా సంచలనం. ఒక్కో సినిమాకు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ 9-11 కోట్ల ఉంటుంది. దీనికి తోడు కేబీసీ తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడుకి నాగార్జున హోస్గ్గా భారీ మొత్తంలోనే సంపాదించాడు. నాగార్జున పలు సామాజిక, సంక్షేమ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. HIV/AIDS అవగాహన ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 2010లో, అతను స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో స్థాపించబడిన టీచ్‌ఎయిడ్స్ రూపొందించిన ఒక HIV/AIDS యానిమేటెడ్ సాఫ్ట్వేర్ ట్యుటోరియల్‌లో కూడా నటించాడు. -
అల్లు అర్జున్ తొలి జీతం ఎంతో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్( పార్ట్ 1)’ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాకి తాజాగా జాతీయ అవార్డ్ దక్కింది. ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు దక్కించుకోవడం గమనార్హం. ఈ తరుణంలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అల్లు అర్జున్ తొలి సినిమా గంగ్రోతి. అయితే.. అంతకు ముందు ఆయన బాలనటుడిగానూ ఓ రెండు చిత్రాల్లో, చిరంజీవి డాడీ చిత్రంలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఆపై.. 21ఏళ్ల వయస్సులో రాఘవేంద్ర రావు డైరెక్షన్లో గంగోత్రితో వెండి తెరకు పరిచయమయ్యారు. కానీ, అంతకంటే ముందే యానిమేటర్, డిజైనర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆయన మొదటి జీతం రూ.3,500 మాత్రమే. ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా ద్వారా అత్యంత డిమాండ్, అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటులలో ఒకరిగా కొనసాగుతున్నారు. అల్లు అర్జున్ ఆస్తులు ఎంతంటే పలు నివేదికల ప్రకారం.. టాలీవుడ్ ఐకాన్ స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఆస్తుల నికర విలువ సుమారు రూ.410 కోట్లు. ఒక్కో సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ కూడా కోట్లలోనే ఉంటుంది. పార్లే ఆగ్రోఫ్రూటీ, రెడ్ బస్, కోల్గేట్ మాక్స్ ఫ్రెష్, లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు విషయంలోనూ ఆయన కోట్లలో పారితోషకం అందుకుంటూ ‘తగ్గేదే లే’ అనిపిస్తున్నారు. ఖరీదైన కార్ కలెక్షన్ అల్లు అర్జున్ ట్యాగ్ లైన్ స్టైలిష్ స్టార్. దుస్తులు, గాడ్జెట్స్, షూ.. ఇలా అన్నింటా ఆ ట్యాగ్‌లైన్ కనిపిస్తుంటుంది. కానీ, డీ గ్లామర్.. అదీ పక్కా మాస్ రోల్‌తో ఆయన పుష్పగాడిగా విశేష ఆదరణ దక్కించుకోవడం గమనార్హం. ఇక.. ఆయనకు కార్లుంటే మహా ఇష్టం. రేంజ్ రోవర్ వోగ్ కారును రూ. 2.50 కోట్లు, వానిటీ వ్యాన్ రూ. 7 కోట్లు, బీఎండబ్ల్యూ ఎక్స్ 5 రూ. 80 లక్షలు, జాగ్వార్ ఎక్స్‌జేఎల్ రూ. 1.20 కోట్లు, ఆడి ఏ7 రూ. 86 కోట్ల వెచ్చించి కొనుగోలు చేశారు. వ్యాపారాలతో పాటు హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌కు పలు వ్యాపారాలు సైతం ఉన్నాయి. సినిమా థియేటర్లు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. రూ.100 కోట్ల ఖరీదైన భవనం ఉంది. ఉదయపూర్‌లో నిహారిక కొణిదెల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వెళుతున్నప్పుడు అతను తన జెట్ ఫోటోగ్రాఫ్‌లను పోస్ట్ చేశాడు. దీంతో పాటు నార్సింగిలోని అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్టైన్మెంట్ (ప్రొడక్షన్ హౌస్), ఆశీర్వాదం(ఫార్మ్ హౌస్), జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన భవనం కొనుగోలు చేశారు. -
మెగాస్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు! కార్లు, ప్రైవేట్ జెట్ ఇంకా..
తెలుగు సినీ ప్రపంచంలో అగ్రగామి నటుడిగా కీర్తి పొంది, ఎంతోమంది యువ నటులకు ఆదర్శమైన 'చిరంజీవి' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే నేడు మెగాస్టార్ జన్మదిన సందర్భంగా ఆయన ఎలాంటి కార్లను వినియోగిస్తున్నారు? నెట్‌వర్త్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే 150 కంటే ఎక్కువ చిత్రాలలో నటించిన చిరంజీవికి అన్యదేశ్య కార్ల మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే బ్రిటన్, జర్మన్ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ (Rolls Royce Phantom) ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'ఫాంటమ్' చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ అద్భుతమైన డిజైన్ కలిగి 6.8 లీటర్ వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 460 Bhp పవర్ అండ్ 720 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదలకాక ముంచే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే. రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) ల్యాండ్ రోవర్ కంపెనీకి రేంజ్ రోవర్ వోగ్ కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ పొందుతుంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. ఇదీ చదవండి: నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్! నెట్‌వర్త్ (Net Worth) చిరంజీవికి హైదరాబాద్ నగరంలో అత్యంత విశాలమైన & విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇది రూ. 30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు. ఇదీ చదవండి: దినేష్ ఠక్కర్ గ్యారేజిలో మరో సూపర్ కారు.. ధర ఎన్ని కోట్లంటే? చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. 1988లో నాగబాబుతో కలిసి 'అంజన ప్రొడక్షన్స్ హౌస్' స్థాపించారు. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ బ్యానర్లలో ఒకటిగా నిలిచింది. మొత్తం మీద మెగాస్టార్ ఆస్తుల విలువ సుమారు రూ. 1650 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం. -
‘దేవర’ స్టార్ యాక్టర్ నెట్‌వర్త్, లగ్జరీ కార్లు: తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ప్యాన్ ఇండియాస్టార్ జూ.ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ దేవర మూవీలో విలన్ అలరించబోతున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్. బర్త్‌డే సందర్భంగా సైఫ్ ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న సైఫ్ భారీ బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీసు వద్ద భారీ హిట్ల లిస్ట్ పెద్దదే. మంచి నటుడిగా, ఫిట్నెస్ ఫ్రీక్‌గా అంతకుమించి బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ భర్తగా మంచి మార్కులే కొట్టేశాడు.ఆ క్రమంలో సైల్ అలీ ఖాన్ ఆస్తిఎంత? సినిమాకు ఎంత తీసుకుంటాడు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) పర్సనల్ లైఫ్, రాయల్ ఫ్యామిలీ 1970, ఆగస్టు 16న నటుడు, ప్రముఖ క్రికెటర్ , భారత జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిలా టాగోర్ ల కుమారుడే సైఫ్ అలీ ఖాన్. సైఫ్ పూర్వీకులు పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు. ఇతని ముత్తాత ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ, తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడిలు నవాబులుగా చలామణి అయ్యారు. సబా అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ అనే ఇద్దరు చెల్లెళ్లున్నారు. 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్‌తో వివాహ జరిగింది. వీరికి సారా అలీ ఖాన్ ,ఇబ్రహీం అలీ ఖాన్ ఇద్దరు సంతానం.. అయితే 13 సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత 2004 లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2012, అక్టోబర్ 16న బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు తైమూర్ అలీ ఖాన్ , జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. దశాబ్దాల సినీ కరియర్ 1993లో సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన దగ్గరనుంచీ ఐకానిక్ క్యారెక్టర్స్‌తో వెనుదిరిగి చూసింది లేదు. ఓంకార, లవ్ ఆజ్ కల్, కల్ హో నా హో, హమ్ తుమ్, దిల్ చాహ్తా హై, తన్హాజీ: ది అన్సంగ్ వారియర్, లాల్ కప్తాన్, మెయిన్ ఖిలాడి తూ అనారీ, పరిణీత, సలామ్ నమస్తే, రేస్ ఆదిపురుష్ , బంటీ ఔర్ బబ్లీ-2తదితర చిత్రాలలో సైఫ్ గుర్తుండిపోయే పాత్రలు చాలా ఉన్నాయి. సైఫ్ అలీఖాన్ కోట్ల విలువైన ఆస్తులు మీడియా నివేదిక ప్రకారం, సైఫ్ అలీ ఖాన్ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెట్టుబడి పెట్టాడు. ముంబైలోని ప్రసిద్ధ ఫార్చ్యూన్ హైట్స్ భవనంలో విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. దీని విలువ దాదాపు రూ. 4.2 కోట్లు. దీంతోపాటు సైఫ్ తమ అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్న విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది దీన్ని అద్దెకిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ముంబైలో 6 కోట్లు విలువ చేసే మరో లగ్జరీ బంగ్లా కూడా ఉంది. జిస్టాడ్‌లో సైఫ్ అలీ ఖాన్ చాలెట్ విలువ రూ. 33 కోట్లు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కి ఫారిన్ లొకేషన్స్ అంటే చాలా ఇష్టం. ఫ్యామిలీతో కలిసి విదేశాలలో కొత్త ప్రదేశాల్లో చక్కర్లు కొట్టి వస్తుంటాడు. స్విట్జర్లాండ్‌లో జిస్టాడ్‌లో చాలెట్( ఫాంహౌస్ లాంటిది) ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని రూ. రూ. 33 కోట్లు. భార్య కరీనా, పిల్లలు తైమూర్ , జహంగీర్ అలీ ఖాన్‌లతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు. సైఫ్ అలీ ఖాన్ పూర్వీకుల ఇల్లు, పటౌడీ ప్యాలెస్ ముంబైలో సైఫ్ అలీ ఖాన్ కలిగి ఉన్న అన్ని అత్యంత ఖరీదైన ఆస్తులతో పాటు, హర్యానాలోని పటౌడీ ప్యాలెస్ చాలా ప్రత్యేకమైన ఆస్తిగా చెప్పుకోవచ్చు. సైఫ్ వారసత్వ సంపద విలువ రూ. 5000 కోట్లు. చివరి పాలక నవాబ్ ఇఫ్తికార్ ఖాన్, దివంగత మన్సూర్ అలీ ఖాన్ వారసత్వ ఆస్తిలో ముఖ్యమైంది. పటౌడీ ప్యాలెస్ 'ఇబ్రహీం కోఠి' పేరుతో కూడా పిలుస్తారు.150 గదులు, ఏడు బెడ్రూమ్లు, పలు డ్రాయింగ్ రూమ్‌లు, ఏడు బిలియర్డ్ రూమ్లులాంటి ఫీచర్లతో హర్యానాలో 10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. బహుళ నివేదికల ప్రకారం, సైఫ్ అలీ ఖాన్‌కు చెందిన పటౌడీ ప్యాలెస్ విలువ రూ. 800 కోట్లు. అలాగే భోపాల్‌లోని పటౌడీ ప్యాలెస్ రూ. 4,200 కోట్లు. లగ్జరీ కార్లు రాయల్ ఇమేజ్, డాషింగ్ యాక్టర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూపర్ కార్లు అతని గ్యారేజీలోఉన్నాయి. లగ్జరీ కార్ కలెక్షన్లో ఫోర్డ్ మస్టాంగ్ జిటి (రూ. 74 లక్షల నుండి రూ. 76 లక్షలు), రేంజ్ రోవర్ వోగ్ (రూ. 2.39 కోట్ల నుండి 4.17 కోట్లు), ల్యాండ్ రోవర్ డిఫెండర్ (రూ. 93 లక్షలు) , లెక్సస్ 470 (రూ. 35 లక్షల నుండి రూ. 38 లక్షలు), BMW 7 సిరీస్ (రూ. 1.70 కోట్లు), బెంజ్ ఎస్- క్లాస్ (రూ. 1.71 కోట్ల నుండి 1.80 కోట్లు), ఆడి R8 (రూ. 2.72 కోట్లు) . డైమండ్ రోలెక్స్ వాచ్ ఖరీదైన బంగ్లా, కార్లతోపాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, రాయల్ వాచీల కలెక్షన్ సైఫ్ సొంతం. బ్రూనై సుల్తాన్ కుమార్తె నుండి తనకు లభించిన బహుమతి అని సైఫ్ ఒక సందర్భంలో వెల్లడించాడు. అంతేకాదు కోటి రూపాయల విలువైన లగ్జరీ వాచ్‌ను ఒకానొక సందర్బంగా విక్రయించాలని చూశాననీ, ఆ తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తన భార్య కరీనా కపూర్‌కి ఇచ్చినట్టు తెలిపాడు. రెమ్యూనరేషన్, నెట్‌వర్త్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్‌లో ‘రావణ్’ పాత్రకోసం 12 కోట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతని రెమ్యూనరేషన్ రూ. ఒక్కో సినిమాకు 10-15 కోట్లుగా అంచనా. దీంతోపాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్, ఓటీటా ప్రాజెక్ట్‌లలో కూడా చాలా యాక్టివ్. అలా వార్షిక ఆదాయంరూ. 28 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు పైమాటే. సో సుదీర్ఘకాలంగా బాలీవుడ్లో కొనసాగుతున్న సైఫ్ అలీ ఖాన్ నికర విలువ సుమారు రూ. 1,180 కోట్లుగా ఉంటుందని అంచనా. -
ప్రపంచంలో టాప్ రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీ ఏదో తెలుసా?
Worlds Most Richest Royal Family: ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజ కుటుంబాలు మధ్యప్రాచ్యం నుండి వచ్చాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం అమలులోకి రాకముందు రాజులు, రాజకుటుంబాల పాలన నడిచేది. ప్రస్తుతం ఆ యుగం ముగిసింది. కానీ బ్రిటిష్ రాజకుటుంబం ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబంగా భావిస్తారు. కింగ్ చార్లెస్ III అధికారికంగా అతని భార్య క్వీన్ కన్సార్ట్ కెమిల్లాతో పాటు దేశాధినేతగా పట్టాభిషేక్తిడైన నేపథ్యంలో, యునైటెడ్ కింగ్డమ్ రాయల్ ఫ్యామిలీ రిచెస్ట్ ఫ్యామిలీ అనుకుంటారు. భారీ సంపద గురించి పట్టాభిషేక వేడుకకు ఖర్చు చేసిన డబ్బు గురించే మాట్లాడుకుంటారు. కానీ ఆశ్యర్యకరంగా ది రాయల్ ఫ్యామిలీ ఆఫ్ సౌదీ ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబంగా నిలుస్తోంది. ఎందుకంటే 1.4 ట్రిలియన్లు డాలర్ల సంపదతో బ్రిటిష్ రాజకుటుంబం కంటే 16 రెట్లు విలువైన సంపద ఈ సౌదీ ఫ్యామిలీ సొంతం. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలోని సౌదీ రాజ కుటుంబంలో 15,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు, వారి సంపదలో ఎక్కువ భాగం దేశంలోని విస్తారమైన చమురు నిల్వల ద్వారా వచ్చిన ఆదాయమే. సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమై అల్ యమామా ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. అగ్రశ్రేణి లగ్జరీ బ్రాండ్లను మాత్రమే ధరించే వీరి ఖజానాలో టన్నుల కొద్దీ బంగారం-వెండితో పాటు విలువైన వజ్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. గ్రాండ్ ప్యాలెస్‌లో కోట్ల విలువైన లగ్జరీ కార్లు, క్రూయిజ్‌లతో పాటు బిలియన్ల విలువైన ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. ఖరీదైన బంగారు పూతతో కూడిన కారు కూడా ఉంది. ఇంకా కోట్ల విలువైన లగ్జరీ కార్లు లంబోర్ఘిని అవెంటడోర్ సూపర్‌వెలోస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, మెర్సిడెస్ జీప్ , బెంట్లీ ఉన్నాయి. 2011లలోనే ఫోర్బ్స్ అతని , అతని తక్షణ కుటుంబ సంపద సుమారు 21 బిలియన్లుగా అంచనా వేసింది. యమామా ప్యాలెస్‌లో సినిమా థియేటర్ అనేక స్విమ్మింగ్ పూల్స్ మసీదు కూడా ఉంది. ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 400 మిలియన్ డాలర్ల సెరీన్ సూపర్‌యాచ్, విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లు కలిగి ఉన్నారు. ఈ భారీ క్రూయిజ్‌లో 2 హెలిప్యాడ్లు , స్పోర్ట్స్ గ్రౌండ్‌తో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య విమానం బోయింగ్ 747-400 రాజకుటుంబం సొంతం. ప్రత్యేక విమానంలో ప్యాలెస్‌లో ఉండే సౌకర్యాలుండటం మరో విశేషం. సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా తన కుమార్తెకు బంగారంతో చేసిన టాయిలెట్‌ను బహుమతిగా ఇచ్చాడని ప్రతీతి. సౌదీ అరేబియా రాజకుటుంబం తర్వాత, ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న రాజ కుటుంబీకులు కువైట్ నుండి వచ్చారు, మొత్తం కుటుంబం 360 బిలియన్ల డాలర్లకు పైగా ఉంది. ఇక కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని యూకే రాయల్ ఫ్యామిలీ మొత్తం నికర విలువ 88 బిలియడాలర్లు. భారతీయ కరెన్సీలో రూ. 7.22 లక్షల కోట్లతో ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన రాయల్లలో 5వ స్థానంలో ఉన్నారు. -
అత్యధిక ట్యాక్స్ కట్టే బీటౌన్ భామ ఎవరో తెలుసా? నెటవర్త్ తెలిస్తే షాకవుతారు
Bollywood highest tax-paying female actress: బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు హీరోలతో ధీటుగా తమ యాక్టింగ్ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే హీరోలతో పోలిస్తే రెమ్యనరేషన్ విషయంలో మాత్రం వివక్ష తప్పడం లేదు. అయితే నటనతో పాటు ఎండార్స్మెంట్స్, యాడ్స్ ద్వారా భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా పన్ను చెల్లించే హీరోయిన్ ఎవరో తెలుసా? 500 కోట్లు నికర విలువ దీపికా పడుకోన్ బాలీవుడ్ విమెన్ సెలబ్రిటీలలో టాప్ టాక్స్పేయర్గా నిలుస్తోంది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం? ) బాలీవుడ్ సెలబ్రిటీలు, సినిమాలు చేయడంతో పాటు, విభిన్న వ్యాపారాలలో కూడా నిమగ్నమై భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్న నేపథ్యంలో దేశంలో అత్యధిక పన్ను చెల్లించే జాబితాలో ఉంటున్నారు హీరోయిన్లు. ఇందులో తోటివారిలో ప్రత్యేకంగా నిలుస్తోంది దీపికా పడుకోన్. దీపికా 2016-2017 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10 కోట్ల రూపాయలు పన్ను రూపంలో చెల్లించిందట. ఇదే పరపరంలో తరువాత సంవత్సరాల్లో కొనసాగుతోందని బహుళ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే గత ఏడాది అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ దీపికా పదుకోన్. దీపికా పదుకోన్ సంపాదన సంవత్సరానికి రూ. 40 కోట్లు. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 15 కోట్లు వసూలు చేస్తోంది. ఇక ఎండార్స్మెంట్ల కోసం 7-10 కోట్లు వసూలు చేస్తుందట. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!) ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, దీపిక ప్రధాన ఆదాయ వనరు ఎండార్స్మెంట్లు. 2019లో 48 కోట్లు సంపాదించింది. పద్మావతి మూవీకోసం ఏకంగా రూ. 12 కోట్లు వసూలు చేసిందని బీటౌన్ టాక్. అంతేకాడదు అదే ఏడాది రోహిత్ శర్మ, అజయ్ దేవగన్, రజనీకాంత్ వంటి ప్రముఖులను వెనక్కి నెట్టి అత్యధిక నికర విలువ కలిగిన టాప్ 10 భారతీయ సెలబ్రిటీలలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. (డాలరు Vs ఫెడ్: మరి బంగారం, వెండి ధరలు? ఇపుడు కొనడం మంచిదేనా?) ఈ రేంజ్లో టాక్స్ కంటిన వారిలో దీపికానే టాప్. గతంలో ఈ ప్లేస్‌లో కత్రినా కైఫ్ ఉంది.2013-2014 ఆర్థిక సంవత్సరంలో 5 కోట్లకు పైగా పన్నులు చెల్లించింది. రూ.10 కోట్ల మార్కుకు చేరుకోనప్పటికీ ఇక ఈలిస్ట్లోఆ లియా భట్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఏడాది 5-6 కోట్ల పన్నులు చెల్లిస్తున్నట్లు సమాచారం. భారతీయ మహిళా సెలబ్రిటీలలో ధనవంతులైన హీరోయిన్లల లిస్ట్‌లో దీపికా రెండో స్థానంలో ఉంది. ప్రియాంక చోప్రా జోనాస్ నెట్‌వర్త్ 620 కోట్లు. కరీన్ కపూర్ ఖాన్, దాదాపు రూ. 485 కోట్లు, -
దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్‌తో పోలిస్తే?
భారతీయ సినీ పరిశ్రమలో సినీ నేపథ్య గాయకులకు ఉన్న పాపులారిటీ సామాన్యమైంది కాదు. ప్లేబ్లాక్ సింగింగ్ను కరియర్‌గా ఎంచుకున్న మహిళలు కూడా చాలామందే ఉన్నారు. తెలుగులో సుశీల, జానకి మొదలు వాణీ జయరాం, సునీత, చిన్మయి, ఉష లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అలాగే లతామంగేష్కర్, ఆశా భోంశ్లే బాలీవుడ్ సినిమాను ఏలారు. ఇంకా సునిధి చౌహాన్ , శ్రేయా ఘోషల్, నేహా కక్కర్ లాంటి వాళ్లు లెజెండ్స్‌గా ఈ తరాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో రిచెస్ట్ గాయని ఎవరో చూద్దాం. భారతీయ సంగీతంలో ప్లేబ్యాక్ సింగింగ్‌కు సంబంధించి1950-60లలో గాయకులకు పైసా కూడా చెల్లించేవారు కాదట. కానీ లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ వంటి వాళ్లు పోరాటం ఫలితంగా ఈ తరం గాయకులు మంచి రెమ్యునరేషన్‌ను అందుకోవడం విశేషమే మరి. ఎంతగా అంటే నేడు చాలా మంది గాయకులు కోట్ల రూపాయలు, ఒక్కో పాటకు లక్షల్లో వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అత్యంత ధనిక మహిళా గాయని ఎవరు అనగానే పలు భాషల్లో తమ గాత్రంతో ఆకట్టుకుంటున్న శ్రేయ ఘోషల్, చిన్మయి శ్రీపాద లాంటివాళ్లు గుర్తు వస్తారు కదా! (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) ఈ పేర్లు టాప్ 5లో ఉన్నప్పటికీ, నికర విలువ పరంగా చూస్తే మాత్రం 37 ఏళ్ల తులసీ కుమార్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఈమె నికర విలువ రూ. 200 కోట్లు. అయితే పాటలు పాడటంతోపాటు, కుటుంబ వ్యాపారం నుంచి వచ్చిన సంపాదన కూడా ఈమె నెట్‌వర్త్‌కు జత కలిసింది. కంటే కొంత తక్కువగానే ఉన్నాయి. గాయకుడు-అలా సింగర్=ఆంట్రప్రెన్యూర్ నికర విలువ 25 మిలియన్లు డాలర్లు. టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ సోదరి తులసికి కుటుంబ వ్యాపారంలో వాటా ఉంది. సుమారు 4000 కోట్ల కంపెనీలో ఆ వాటా ఆమెకు అపారమైన సంపదను జోడిస్తోంది. (Foxconn: ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి) దాదాపు రూ.180-185 కోట్ల నికర విలువతో శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, 100 కోట్ల రూపాయలతో తరువాతి ప్లేస్‌లో ఉన్నారు. ఇక సింగింగ్ లెజెండ్ ఆశా భోంస్లే నికర విలువ రూ. 80 కోట్లకు పైగా ఉండగా, లేటెస్ట్ సెన్నేషనల్ సింగర్ నేహా కక్కర్ విలువ దాదాపు రూ. 40 కోట్లు. అయితే ఇండియా అత్యంత ధనిక గాయకుడితో పోల్చితే తులసి నికర విలువ తక్కువే. ఆస్కార్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయుడు ఏఆర్ రెహమాన్ నికర విలువ రూ. 500 కోట్లకు పైగా మాటే. ఇది చాలా మంది బాలీవుడ్ స్టార్లకంటే చాలా ఎక్కువ. తులసి మరిన్ని విషయాలు 1986 మార్చి 15న న్యూఢిల్లీలో జన్మించారు తులసి సోదరుడు భూషణ్ కుమార్, ఖుషాలి కుమార్ అనే సోదరి ఉన్నారు. లేడీ శ్రీ రామ్ మహిళా కళాశాలలో చదువుకుంది. వ్యాపారవేత్త హితేష్ రాల్హాన్తో 2015లో ప్రేమ వివాహం. వీరిద్దరికీ 2017లో శివాయ్ రాల్హాన్ అనే పాప పుట్టింది. 2009లో 'లవ్ హో జే' ఆల్బమ్‌తో అరంగేట్రం చేసిన అనేక మ్యూజిక్ వీడియోలు, ఆల్బంలతో మిలియన్ల వ్యూస్‌తో ఆదరణ పొందడమే కాదు తన గాన ప్రతిభకు ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. 2010- గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డులు 2014- మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ 2017- ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ 2017- మిర్చి మ్యూజిక్ అవార్డు 2019- IIFA బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌కి నామినేట్ -
వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్
మిలియనీర్, బిలియనీర్ కావాలంటే అంతే స్థాయిలో పెట్టుబడులు కావాలి..బడా పారిశ్రామిక వేత్తో కావాలి అని అనుకుంటాం సాధారణంగా. కనీసం ఏ ఐఐటీ లేదా ఐఐఎం డిగ్రీ సాధించి పెద్ద కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్‌గా ఉండాలి అనుకుంటాం. కానీ ఇవేమీ లేకుండానే రూ. 750 కోట్ల సంస్థకు అధిపతి అయ్యాడు. ఆయన మరెవ్వరో కాదు ఇండియన్ టాప్ రిచెస్ట్ చెఫ్ సంజీవ్ కపూర్. ఆయన సక్సెస్ స్టోరీ ఒకసారి చూద్దాం. ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత ధనిక చెఫ్‌లలో ఒకడిగా మరతానని బహుశా సంజీవ్ కపూర్ ఊహించి ఉండరు. పలు రకాల రెసిపీలతో మొదలు పెట్టి, టాప్ చెఫ్‌గా, హోస్ట్‌గా, రైటర్‌గా చివరికి వ్యాపారవేత్తగా గ్లోబల్‌గా పాపులర్ అయ్యాడు.1992లో ఒక టీవీ షో హోస్ట్ చేయడం ప్రారంభించి 18 సంవత్సరాలు నడిపించిన ఘనత ఆయకే సొంతం. సోషల్‌మీడియాలో మిలియన్ల కొద్దీ ఫోలోవర్లున్నారు. Bahut logon ne mujhe poocha ki millets ki quality kaise check karte hai, store kaise karte hai? Isiliye the next stop on our #MilletKhazana journey is easy tips and tricks to store millets. Do let me know how you store them at home?#MilletKhazana #MilletToMeals #India #Millets pic.twitter.com/rE7NhrCckE — Sanjeev Kapoor (@SanjeevKapoor) June 3, 2023 అంతేకాదు 120 దేశాలలో ప్రసారమై 2010లోనే 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. జనవరి 2011లో ఫుడ్ ఫుడ్ అనే 24 గంటల ఫుడ్ అండ్ లైఫ్ స్టయిల్ ఛానెల్‌ని ప్రారంభించిన ప్రపంచంలోనే తొలి చెఫ్. సంజీవ్ కపూర్ హోస్ట్ చేసిన ఖానాఖజానా ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ITA) ఇండియన్ టెలీ అవార్డ్స్ నుండి బెస్ట్ కుకరీ షో బహుమతిని పలుమార్లు అందుకుంది. (ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు) పంజాబ్, అంబాలాలో 1964 ఏప్రిల్ 10, సంజీవ్ కపూర్ పుట్టారు. న్యూ ఢిల్లీలోని పూసాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్ నుండి హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా పూర్తి చేశాడు. అలియోనా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు. 1984లో తన వృత్తిని ప్రారంభించి అద్భుతమైన రెసిపీలు, చక్కటి వాచకం, అంతకుమించిన యాంకరింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. వండర్‌చెఫ్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ సంస్థ ఆదాయం గత ఏడాది రూ. 700 కోట్లు. అంతకుముందు ఏడాది కంపెనీ రూ.560 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ విస్తరణ ప్లాన్‌లో భాగంగా మార్కెటింగ్‌ను పెంచడానికి కంపెనీ 100 కోట్ల రూపాయలపెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. 40 శాతం విదేశీ పెట్టుబడిదారులున్నారు. సంజీవ్ కపూర్ ఇండియాతోపాటు, ఇతర పలు దేశాల్లో రెస్టారెంట్స్ చెయిన్స్‌ను నిర్వహిస్తున్నారు. సోడెక్సో మాజీ సీఈవోతో కలిసి 1998లో దుబాయ్‌లో ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ద్వారా వ్యాపారవేత్తగా అవతరించాడు. ఈ కంపెనీ విలువ రూ.750 కోట్లు. వంటగది ఉపకరణాలు, ఇతర వంటగది సామాగ్రిని 14 దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) వార్షిక సంపాదన 2022లోనే సంజీవ్ కపూర్ నికర విలువ రూ. 1000 కోట్లుగా ఉంది. వార్షిక సంపాదన రూ. రూ. 25 కోట్లు. వండర్ చెఫ్‌లో అతని పెట్టుబడి, ఎల్లో చిల్లీ వంటి రెస్టారెంట్ చెయిన్ల నుండి, టీవీ షోలు బ్రాండ్ స్పాన్సర్షిప్లతోపాటు, స్వయంగా అతనురాసిన అతని పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చిన రాయల్టీలు ఇవన్నీ ఇందులో భాగం. బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలోని బ్రాండ్లలో ఏరియల్, డెట్టాల్, దావత్ బాస్మతి రైస్, స్లీక్ కిచెన్ లాంటివి ఉన్నాయి. ప్రతి బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం రూ. 30 రూ. 40 లక్షలు చార్జ్ చేస్తాడు. దీనితోపాటు సంజీవ్ కపూర్ ముంబైలోని జుహు ప్రాంతంలో ఒక సంపన్నమైన ఇంటిలో నివసిస్తున్నారు. 1500 చదరపు అడుగులు డ్యూప్లెక్స్‌లో ఉంటారు. స్టాటిస్కా రిపోర్ట్ ప్రకారం 2019లో 24.8 కోట్ల ఆదాయంతో కపూర్ భారతదేశంలో అత్యంత ధనిక చెఫ్‌గా నిలిచారు. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) ప్రేమ వివాహం 1992లో సంజీవ్ కపూర్ తన ప్రేయసి అలియోనాను వివాహమాడాడు. సంజీవ్, వందన కలిసి ఢిల్లీ ఐటీడీసీ హోటల్లో పనిచేసేవారు. కానీ ఎపుడూ కలుసుకోలేదు. అయితే అనుకోకుండా ఒకసారి రైలులో జరిగిన వీరి పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్ల డేటింగ్ తరువాత పెళ్లి చేసుకున్న జంటకు ఇద్దరు కుమార్తెలు న్నారు. పెద్ద కూతురు రచిత. చిన్న కూతురు కృతి. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) అవార్డులు 2017లో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు న్యూ ఢిల్లీలోని వరల్డ్ ఫుడ్ ఇండియాలో 918 కిలోల ఖిచ్డీని వండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (2017) హార్వర్డ్ అసోసియేషన్ ప్రచురించిన సంజీవ్ కపూర్‌పై కేస్ స్టడీ ఐటీఏ అవార్డు - పాపులర్ చెఫ్ & ఎంటర్ప్రెన్యూర్ (జైకా-ఇ-హింద్) (2015) ఐటీఏ అవార్డు ఉత్తమ వంట (ఖానా ఖజానా) (2010, 2004, 2002) భారత ప్రభుత్వ 'బెస్ట్ చెఫ్ ఆఫ్ ఇండియా' జాతీయ అవార్డు ఇండియా అత్యంత విశ్వసనీయ వ్యక్తులలో 100 మంది రీడర్స్ డైజెస్ట్ జాబితాలో 31వ స్థానం ఫోర్బ్స్ 'టాప్ 100 భారతీయ ప్రముఖుల జాబితాలో 34వ స్థానం -
రెస్టారెంట్ టూ స్టార్టప్ ఫండింగ్: సురేష్ రైనా నెట్‌వర్త్ తెలిస్తే షాకవుతారు
క్రికెటర్, ఐపీఎల్ ఆటగాడు సురేష్ రైనా నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించి అటు ఫ్యాన్స్‌ను, ఇటు వ్యాపార వర్గాలను ఆకర్షించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రైనా వ్యాపార వ్యూహంలో భారీ ప్లాన్లే ఉన్నాయి. ఇండియా నుంచి యూరప్‌కు విస్తారమైన ప్రామాణిక వంటకాలను, రుచులను, అందించనున్నాడు. రెస్టారెంట్ మాత్రమే కాదు వ్యాపార సామ్రాజ్యం, పెట్టుబడి డీల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం!. సిక్సర్లేనా.. నోరూరించే ఇండియన్ వంటకాలు కూడా తన ప్రతిభతో క్రికెటర్‌గా పాపులర్ అయిన సురేష్ రైనా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంఎస్ ధోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘రైనా క్యులినరీ ట్రెజర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో కోట్ల రూపాయల రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు జూన్ 23న సోషల్ మీడియా ద్వారా రైనా ప్రకటించాడు. ఈ రెస్టారెంట్ ఢిల్లీలోని ప్రసిద్ధ చాందినీ చౌక్ నుండి స్నాక్స్‌తో సహా అనేక రకాల శాఖాహార, మాంసాహార వంటకాలను అందిస్తుందట. ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోని తర్వాత, రైనా క్రికెట్ టోర్నమెంట్‌కు వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా వ్యవహరించాడు. ఇది భారీ ఆదాయాన్నే సంపాదించి పెట్టింది. దీంతోపాటు బహుళ ఎండార్స్మెంట్ డీల్స్ ద్వారా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాడు. (సింగిల్ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ముఖ్యంగా సురేష్ రైనా , భార్యతో కలిసి ‘మాతే’ అనే బేబీకేర్ బ్రాండ్‌ను కూడా స్థాపించాడు. ఇది ఇది పిల్లల సంరక్షణ కోసం రసాయన రహిత, ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయిస్తుంది. దీంతోపాటు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వార్తలను ప్రచురించే Sahicoin అనే స్టార్టప్ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టాడు. అలాగే సురేష్ రైనా గతంలో అడిడాస్, టైమెక్స్, మ్యాగీ, ఇంటెక్స్, బూస్ట్ ఎనర్జీ డ్రింక్స్, పెప్సికో, ఆర్కె గ్లోబల్, హెచ్‌పి వంటి అనేక పెద్ద బ్రాండ్లతో ఎండార్స్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అంతేనా, భారత్‌పే, బుకింగ్స్ డాట్కాం, ఎలిస్తా లాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. వీటన్నింటి విలువు దాదాపు రూ.10 కోట్లకు పైమాటే. దీంతోపాటు విలాసవంతమైన భారీ బంగ్లా కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఈ బంగ్లా విలువ 18 కోట్ల రూపాయలట.స్పోర్ట్స్‌కీడా అంచనా ప్రకారం రైనా నికర విలువ రూ. 200 కోట్లకు పైగా ఉండగా, వార్షిక సంపాదన దాదాపు రూ. 11.5 కోట్లుగా ఉంది.(ఆదిపురుష్ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?) 1986, నవంబరు 27న యూపీలో పుట్టిన సురేష్ రైనా. ఢిల్లీ యూనివర్శిటీటీ నుంచి బీకాం (డిస్టెన్స్), 2022లో చెన్నైలోని యూనివర్శిటీనుంచి గౌరవ డాక్టరేట్ పొదారు. బీటెక్ చదివిన అతని భార్య ప్రియాంక చౌదరి పలు ఐటీ కంపెనీల్లో పనిచేశారు. ఆ తరువాత 2017లో మాతే నేచురల్ బేబీ కేర్ ఉత్పత్తుల సంస్థను స్థాపించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) -
స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్‌వర్త్ ఎంతంటే?
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటగాడిగానే కాదు దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు, స్టార్టప్స్‌లో పెట్టుబడుల ద్వారా రాణిస్తున్నాడు. కోహ్లి ముఖ్యమైన వ్యాపార భాగస్వాములలో ఒకరు. బిలియనీర్ గురించి తెలుసా మీకు. ప్రత్యర్థి ఐపీఎల్ టీం ఓనరుతో కోహ్లి మధ్య వ్యాపార సంబంధాలు ఏంటో ఒకసారి చూద్దాం! ఆయన ఎవరోకాదు రూ. 7,090 కోట్ల ఐపీఎల్ టీం ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గొయెంకా దేశీయ దిగ్గజం కంపెనీ మల్టీ బిలియన్డాలర్ల విలువైన ఆర్పీ గోయెంకా గ్రూప్ చైర్మన్ కూడా. ఈ కంపెనీ పవర్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ మీడియా, ఎంటర్టైన్మెంట్, విద్య వంటి అనేక పరిశ్రమలలో విస్తరించి ఉంది. ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టు ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకాతో అనేక వ్యాపారాల్లో జతకట్టడంతో పాటు ఇతర భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) 2017నుంచి కోహ్లీ ఫౌండేషన్, ఆర్పీసంజీవ్ ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డ్స్ కోసంవిరాట్,సంజీవ్ జత కట్టారు. అలాగే పలు వ్యాపార వెంచర్లలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. అంతేకాదు కోహ్లీ, గోయంకా ద్వయం సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం విశేషం దీంతో దాదాపు రూ. 50వేల కోట్ల ఆస్తి, రూ. 35,451 కోట్ల స్థిరమైన ఆదాయంతో ఆలరారుతున్న సంజీవ్ గోయెంకా ఆర్పీఎస్జీ గ్రూప్ నేతృత్వంలోని ప్రముఖ స్నాకింగ్ బ్రాండ్ ‘టూ యమ్’కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా విరాట్ కోహ్లీ ఉండటం గమనార్హం. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) దీంతో పాటు ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ జట్టు , ఏటీకే మోహన్ బగాన్ ఫుడ్ బాల్ క్లబ్ ఓనరు కూడా .2023 నాటికి, ఆర్పీఎస్జీ గ్రూప్ గ్రూప్ ఆదాయం 4.3 బిలియన్ల డాలర్లకు పైమాటే. అంటూ దాదాపు రూ. 35,451 కోట్లకు పైనే. ఫోర్బ్స్ ప్రకారం, సంజీవ్ గోయెంకా వ్యక్తిగత నికర విలువ రూ. 17,300 కోట్లు. ఫోర్బ్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశంలో 83వ అత్యంత సంపన్నుడు, మొత్తం ప్రపంచంలో 1238వ స్థానంలో ఉన్నారు. సంజీవ్ గోయెంకా ఎక్కడ పుట్టారు 1961, జనవరి 29న పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలో వ్యాపారవేత్త రామ ప్రసాద్ గోయెంకా, సుశీలా దేవి దంపతులకు జన్మించారు. -
రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా?
కుమార మంగళం బిర్లా నేతృత్వంలోనిఆదిత్య బిర్లా గ్రూప్ నావెల్ జ్యువెల్స్ లిమిటెడ్ పేరుతో బ్రాండెడ్ జ్యువెలరీ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. బడా బాబులే లక్క్ష్యంగా హై క్వాలిటీ జ్యువెలరీ రంగంలో రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నేపథ్యంలో రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా గురించి ఆసక్తి నెలకొంది. 60 బిలియన్ డాలర్లు (రూ. 4,95,000 కోట్లు) నికర విలువతో ఆదిత్య బిర్లా గ్రూప్ నికర విలుతో మెటల్, పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో దూసుకుపోతోంది. గత రెండు సంవత్సరాలలో పెయింట్స్, B2B ఈ-కామర్స్ బిజినెస్‌తోపాటు మూడు పెద్ద వ్యాపారాల్లోకి ప్రవేశించింది ఇపుడిక ఆభరణాల బిజినెస్‌లో అటు టాటా గ్రూప్ తనిష్క్, ఇటు రిలయన్స్‌కు ప్రధాన ప్రత్యర్థిగా పోటీ పడనుంది. (తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ) గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఆర్యమాన్ బిర్లా కుమార్. 25 ఏళ్ల ఆర్యమాన్ బిర్లా గ్రాసిమ్, హిందాల్కో, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి దిగ్గజ విభాగాల బాధ్యతల్లో ఉన్నాడు. ఆర్యమాన్ ఒకపుడు దేశీయ క్రికెటర్‌గా ఆకట్టుకున్నాడు. 2017-2018 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.2018 ఐపీఎల్ వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇక్కడ తన తొలి హాఫ్ సెంచరీ కొట్టి వార్తల్లో నిలిచాడు. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) ESPN Cricinfo ప్రకారం, అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్‌లు ఆడి, ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీతో సహా 414 పరుగులు చేశాడు. లిస్ట్ A క్రికెట్లో నాలుగు మ్యాచ్‌ల్లో 36 పరుగులు చేశాడు.అండర్-23 CK నాయుడు ట్రోఫీ 2017-18లో, ఆరు మ్యాచ్‌ల్లో 795 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 10 వికెట్లు కూడా తీశాడు. అత్యంత సంపన్న క్రికెటర్, కానీ భారత్ లో అంత్యంత సంపన్న క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న ఆర్యమన్ బిర్లాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ క్రికెటర్ కావాలనేది అతని డ్రీమ్. ఆల్ రౌండర్‌గా రాణించాలనుకున్నాడు కానీ ఆందోళన, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా క్రికెట్‌నుంచి తప్పుకున్నట్టు ఫెమినా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఆర్యమాన్ బిర్లా , అతని సోదరి అనన్య బిర్లా గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లోకి డైరెక్టర్స్ ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆదిత్య బిర్లా వెంచర్స్ అనే కంపెనీ వెంచర్ క్యాపిటల్ ఫండ్ హెడ్ కూడా. అలాగే D2C ప్లాట్‌ఫారమ్ TMRW బోర్డు డైరెక్టర్ కూడా.బిర్లాకుమార్తె అనన్య 17 సంవత్సరాల వయస్సులో తొలి కంపెనీ Svatantra Microfin Pvt Ltdని స్థాపించింది. అలాగే Ikai Asai అనే ఇంటి అలంకరణ బ్రాండ్‌ను కూడా స్థాపించింది. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీలు,ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్,నెట్‌వర్త్ గురించి తెలుసా?
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ సందర్బంగా అంబటి రాయుడు ఏం చేయబోతున్నాడు. అతని ఆస్తి, నికర విలువ ఎంత అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్) ఫ్యాన్స్ అభిమానంగా రాయుడు అని పిలుచుకునే ఆల్ రౌండర్‌గా అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. భారత క్రికెట్ జట్టులో రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ,రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా క్రికెట్లోకి ప్రవేశించాడు. 2010లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘకాలం అంటే 2017 దాకా ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2013 సీజన్లో ఐపీఎల్ టైటిల్ సాధనలోనూ, ఆ తరువాత 2018లో సీఎస్కే జట్టులోకి మారిన తరువాత 2018, 2021లో టైటిల్ గెలిచిన కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) నికర విలువు అంబటి రాయుడు మొత్తం నికర విలువ దాదాపు రూ. 50 కోట్లు. సంవత్సరానికి రూ 7 కోట్లకు పైనే. ఐపీఎల్ ద్వారా లభించిన ఫీజు 6.25కోట్లు. లగ్జరీ కార్ల విలువ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోటి దాకా ఆర్జిస్తాడనేది తాజా నివేదికలద్వారా తెలుస్తోంది. (CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?) అంబటి రాయుడు ఇల్లు కార్లు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లగ్జరీ డిజైనర్ ఇల్లు ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ అనంతగరిలో రిసార్ట్ బిజినెస్, సిద్దిపేట వైపు ఫార్మింగ్ బిజినెస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. అధిక బ్రాండ్ వాల్యుయేషన్ కారణంగా గత కొన్నేళ్లుగా అంబటి రాయుడు నికర విలువ 40 శాతం పెరిగిందట. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా రాయుడి నికర ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది నిపుణుల మాట. వ్యవసాయ చేసుకుంటూ ఫామ్‌హౌస్‌లో ఎక్కువ సమయం గడుపుతానని ఒక ఇంటర్వ్యూలో అంబటి చెప్పినప్పటికీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన తరువాత ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో చేరతాడనే ఊహాగానాలున్నాయి. కార్లు : రూ. 1.5 నుంచి 2 కోట్లు అంబటి రాయుడు కార్ల కలెక్షన్ చాలా చిన్నది. అయినా ఆడి కారుతోపాటు ప్రపంచంలోని ది బెస్ట్ లగ్జరీ కార్లు కొన్ని అంబటి రాయుడు సొంతం. కరియర్ 2004 అండర్-19 ప్రపంచకప్‌లో అంబటి రాయుడు కెప్టెన్ ఇంగ్లండ్‌పై అజేయంగా 177 పరుగులు చేసి టైటిల్ సాధించాడు వయసు కేవలం 16 ఏళ్లు. ఇక అప్పటినుంచి మరో సచిన్ పేరు తెచ్చుకున్నాడు.తరువాత హైదరాబాద్ దేశవాళీ జట్టుకు ఎంపిక, కేవలం 17 సంవత్సరాల వయస్సులో నే ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు . భారత జట్టులో ఎంపికై 2013లో జింబాబ్వేపై మ్యాచ్‌లో రావడం 63 పరుగులతో అజేయంగా పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో 203 ఐపీఎల్ మ్యాచులాడిన రాయుడు. 127.26 స్ట్రైక్‌రేట్‌తో 4,329 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1985, సెప్టెంబర్ 23న గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు అంబటి రాయుడు. 1992లో మూడో తరగతి చదువుతున్నప్పుడే రాయడిని తండ్రి హైదరాబాద్‌లోని విజయ్ పాల్ క్రికెట్ అకాడమీలో చేర్చించారు. 14 ఫిబ్రవరి 2009న తన స్నేహితురాలు విద్యను పెళ్లి చేసుకున్నాడు రాయుడు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఐపీఎల్ 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
క్రికెట్ దిగ్గజం ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 టైటిల్‌ను చేజిక్కించుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో విజేతగా నిలిచి అభిమానులను ఉర్రూత లూగించింది టీం. దీంతో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. The interaction you were waiting for 😉 MS Dhoni has got everyone delighted with his response 😃 #TATAIPL | #Final | #CSKvGT | @msdhoni pic.twitter.com/vEX5I88PGK — IndianPremierLeague (@IPL) May 29, 2023 భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో, క్రికెట్ కరియర్లో అనేక రికార్డులను నమోదుచేసిన ధోని కేవలం గ్రౌండ్‌లోనే కాదు, వెలుపల కూడా తగ్గేదేలే అంటూ పెర్ఫెక్ట్ బిజినెస్‌మేన్‌లా సక్సెస్‌పుల్‌గా దూసుకుపోతున్నాడు మాజీ కెప్టెన్ పలు పెట్టుబడులు ప్రసిద్ధ బ్రాండ్ ఎండార్స్మెంట్లతో ఇండియాలో టాప్ రిచెస్ట్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఎంఎస్ ధోని నికర విలువ ఎంత? అంచనాల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నికర విలువ దాదాపు రూ. 1040 కోట్లు. వార్షిక వేతనం, 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అనేక రకాలు పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో పాటు, ఐపీఎల్ రెమ్యునరేషన్‌తో కలిపి మొత్తం ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడు. ఐపీఎల్ టీం సీఎస్కే ద్వారా రూ. 12 కోట్ల ఆదాయం వస్తోంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం గత పదహారు సీజన్లలో ఐపీఎల్ ద్వారా రూ. 178 కోట్లకు పైగా సంపాదించాడు. ఒక విధంగా చెప్పాలంటే అతని మొత్తం సంపాదనలో ఇది చిన్న మొత్తమే. ఖటాబుక్, కార్స్ 24, షాకా హ్యారీ, గరుడ ఏరోస్పేస్ వంటి అనేక వాటిలో ఇన్వెస్టర్‌గా ఉన్నాడు. ఇంకా ఫిట్నెస్, యాక్టివ్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ సెవెన్లో మెజారిటీ వాటాదారు.సేంద్రీయ వ్యవసాయం, డ్రోన్లు, క్రీడా దుస్తులు, జిమ్ బిజినెస్.. ఇలా మొత్తం కలిపి ప్రతీ ఏడాది రూ. 4 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కోకా కోలా, ఇండియా సిమెంట్స్, డ్రీమ్ 11, గోడాడీ , రీబాక్ వంటి బ్రాండ్లు ఎంఎస్ ఖాతాలో ఉన్నాయి. దీంతోపాటు ఫుట్‌బాల్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్‌సి, హాకీ టీమ్ రాంచీ రేస్ , మహి రేసింగ్ టీమ్ ఇండియాలో వాటాలున్నాయి. (ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?) ధోని సాక్షి ధోని లగ్జరీ లైఫ్ స్టైల్ ధోనీ, అతని భార్య సాక్షి ధోనీ ఇద్దరూ లగ్జరీ వస్తువులు, ఇళ్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జార్ఖండ్‌లోని రాంచీలో వీరికి ఒక భారీ ఫామ్‌హౌస్ ఉంది. ఇక్కడే ధోనీ సాక్షి, వారి కుమార్తె జీవాతో నివసిస్తున్నారు, దీని ధర రూ. 10 కోట్ల కంటే ఎక్కువ. దీంతోపాటు జంటకు డెహ్రాడూన్‌లో రూ. 17.8 కోట్ల ఇల్లు కూడా ఉంది. ఇక ధోనికి కార్లు, బైక్‌లపై ఉండే పప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కళ్లు చెదిరే కలెక్షన్ అతని సొంతం. హమ్మర్ హెచ్2, ఆడి క్యూ7, మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, మహీంద్రా స్కార్పియో, ఫెరారీ 599 జిటిఓ, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్, నిస్సాన్ జోంగా, పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఆమ్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ, హిందుస్తాన్ అంబాటోరోస్, రోల్స్ రాయ్టోర్ల లాంటి ఉన్నాయి. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) ఇది కాకుండా ధోని జీవితం ఆధారంగా తీసిన హిట్ మూవీ 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' ద్వారా దాదాపు రూ. 30 కోట్లు సంపాదించాడు. ఈ మూవీలో రీల్ ధోని పాత్రను దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోషించారు. కెప్టెన్ కూల్‌గా పాపులర్ అయిన ధోని, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే అన్నిరకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే -
IPL 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 తుదిపోరులో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్,ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో అహ్మదాబాద్, నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఐపీఎల్ పదహారవ సీజన్ విజేత ఎవరనే ఉత్కంఠకు తోడు భారీ వర్షం మరింత టెన్షన్ రేపింది..చివరికి టైటిల్‌ను సీఎస్కే ఎగురేసుకపోయింది. ఇది ఇలా ఉంటే ఐపీఎల్లో 2022లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓనరు ఎవరు, ఆదాయం ఎంత అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. (ఐపీఎల్ ఫైనల్ విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్, వైరల్ ట్వీట్) ఐపీఎల్ 2022 లక్నో ,అహ్మదాబాద్ టీమ్‌లు ఎంట్రీ ఇచ్చాయి. 25 అక్టోబర్ 2021 ఏర్పాటైన అహ్మదాబాద్ ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ (జీటీ)ని యూరప్‌కు చెందిన ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్స్ రూ. 5625 కోట్లకు కొనుగోలు చేసింది. దీని చైర్మన్ స్టీవ్ కోల్ట్స్. స్టీవ్స్ స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకర్. ఈ కంపెనీ క్రీడలతో పాటు పెట్టుబడి బ్యాంకింగ్ , బ్రోకరేజ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. (3 వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ పెద్ద అమెరికన్-ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ, 133 బిలియన్ యూరోల విలువైన ఆస్తులున్నాయి. దీని భారత కరెన్సీలో రూ. 11.98 లక్షల కోట్లకు పైగా ఉంది, ఇది క్రికెట్ లీగ్‌లోని మెజారిటీ ఐపీఎల్ జట్టు యజమానుల నికర విలువ కంటే చాలా పెద్దది. ఐపీఎల్ బిడ్ గెలిచిన తర్వాత, ముంబై ఇండియన్స్ మాజీ స్టార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకుంది. అలాగే స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) కాగా ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే గెలిచి అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌తో టై చేసింది.. 2022 అరంగేట్రంలో అదరగొట్టి అన్ని అంచనాలను అధిగమించి మరీ టైటిల్ దక్కించుంది జీటీ. -
Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!
గ్లోబల్ స్టార్, ఆస్కార్ విన్నింగ్ హీరో జూ.ఎన్టీఆర్ ఈరోజు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా నందమూరి నటవారసుడి ఆస్తి, విలువైన కార్లు, ఇల్లు తదితర అంశాలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆసక్తి ఉంటుంది. ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు, మెడ్రన్ వాచెస్, ప్రైవేట్ జెట్ తదితర వివరాలపై ఓ లుక్కేద్దాం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవడే నందమూరి తారక రామారావు. 1991లో బాలనటుడిగా అరంగేట్రం చేసి తాతకు తగ్గమనవడిగా, జూ.ఎన్టీఆర్‌గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. దశాబ్దాలుగా తన నటనతో సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, మూవీ ఏదైనా బెస్ట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకోవడం ఆయన స్పెషాల్టీ. అందుకే అభిమానులు ఆయనను టాలీవుడ్ యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు. సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా అతని సింప్లిసిటీకి కూడా పెట్టింది పేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరు. తాజాగా సెన్సేషనల్ టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌కి ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు, ఒక ప్రైవేట్ జెట్ వీటన్నింటికి మించి సూపర్ వాచ్ కలెక్షన్స్ ఉన్నాయి. రూ. 25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం, రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయభూమి కూడా ఉందని, దీనిని ఆయన లక్ష్మీ ప్రణతికి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారని చెబుతారు. దీని వాల్యూ సుమారు 9 కోట్ల రూపాయలట. దీంతోపాటు బెంగుళూరులో కూడా ఆయనకు పలు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు రకరకాల వాచీలను ఇష్టపడే అతను రిచర్డ్ మిల్లే వాచ్ అంటే ఎక్కవగా లైక్ చేస్తారు. దీని ధర రూ. 4 కోట్లు. అలాగే 40MM వాట్ వాచ్ ధర రూ. 2.5 కోట్లు. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఆస్కార్ రెడ్‌కార్పెట్ లుక్ అభిమానులను ఆకర్షించింది. ముఖ్యంగా తారక్ ధరించిన పాటెక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ వాచ్. దీని ధర రూ. 1. 56 కోట్ల రూపాయలు. టోటల్‌గా జూ.ఎన్టీరా్ ఆయన ఆస్తి విలువ రూ.571 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. పలు మీడియా నివేదికల ప్రకారం ఆయన నెలవారీ ఆదాయం రూ. 3 కోట్లు ఉంటుందని అంచనా. ఇక కార్ల విషయానికి వస్తే లంబోర్ఘిని ఉరుస్ గ్రాపైట్ క్యాప్స్యూల్ని సొంతం చేసుకున్న తొలి ఇండియన్ మన జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. రూ. 2 కోట్ల రేంజ్ రోవర్ రోగ్ కారు, సుమారు 5 కోట్ల విలువైన నీరో నోక్టిస్ (బ్లాక్) ఉంది. దీని కస్టమ్ నంబర్ ప్లేట్ ధర 15 లక్షల రూపాయల కంటే ఎక్కువేనట. పోర్లే 718 కేమాన్రూ. కోటి, రూ. 2 కో ట్లబీఎండబ్ల్యూ 720 ఎన్డీ, కోటి రూపాయల మెర్సిడెస్‌బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మే 20, 1983లో జన్మించారు. బాల రామాయణం చిత్రంలో తన నటనకు ఉత్తమ బాలనటుడి అవార్డును గెలుచుకోవడమే కాదు హీరోగా తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. -
వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారతీయ-అమెరికన్ ప్రస్తుతం ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్క వైస్ చైర్మన్ అజయ్‌పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషంగా నిలిచింది. అందరి అంచనాలకు తగినట్టుగానే భారతీయ సంతతికి చెందిన అజయ్ బంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో బంగా వేతనం, ఆయన నెట్‌వర్త్ తదితర అంశాలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా జూన్ 2న బాధ్యతలు స్వీకరించనున్న అజయ్ బంగా ఐదేళ్ల కాలానికి పనిచేయనున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చెందిన సిక్కు కుటుంబానికి చెందిన బంగా మహారాష్ట్ర, పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. తండ్రి హర్భజన్ బంగా. ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేశారు. దీంతో ఇండియాలో పలు నగరాల్లో అతని విద్యాభ్యాసం సాగింది. ముఖ్యంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) పొందారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి పీజీ చేశారు. బంగా తన కరియర్‌ను 1981లో నెస్లేతో ప్రారంభించారు. అక్కడ 13 సంవత్సరాలు తన సేవలందించారు. అలాగే సిటీ గ్రూప్‌లోనూ పనిచేశారు. మాస్టర్ కార్డ్ సీఈవో గానూ, డచ్ ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్ ఫర్మ్ ఎక్సోర్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు . అలాగే ది సైబర్ రెడీనెస్ ఇన్స్టిట్యూట్ కో -ఫౌండర్ అయిన అజయ్ బంగా ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ వైస్ చైర్ గానూ, అప్పటి అధ్యక్షుడు అమెరికా బరాక్ ఓబామా అండ్ నేషనల్ సైబర్‌సెక్యూరిటీ కమిషన్ సభ్యునిగా ,ట్రేడ్ పాలసీకి సంబంధించిన ఒబామా సలహా కమిటీలో సభ్యుడినూ కూడా పనిచేశారు. ఫార్చ్యూన్ ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్తల జాబితాలో కూడా ఉన్నారు. 2016లో ఇంటర్నేషనల్ అండర్ స్టాండింగ్ బిజినెస్ కౌన్సిల్ నుంచి లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. 2016లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. అజయ్ బంగా: నికర విలువ, జీతం సీఎన్‌బీసీ ప్రకారం 2021 నాటికి అజయ్ బంగా నికర విలువ 206 మిలియన్ డాలర్లు (రూ.1700 కోట్లు). మాస్టర్‌కార్డ్ సీఈవోగా బంగా వార్షిక సంపాదన 23,250,000 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1.92 బిలియన్లు. దీని ప్రకారం రోజుకురూ.52 లక్షల వేతనాన్ని ఆయన అందుకున్నారు. అజయ్ బంగా యాజమాన్యంలోని మాస్టర్ కార్డ్ స్టాక్‌ల విలువ 113,123,489 డాలర్లు. గత 13 సంవత్సరాలుగా వేల డాలర్ల విలువైన స్టాక్లను విక్రయించారు. కాగా ప్రపంచ బ్యాంక్ 13వ ప్రెసిడెంట్ డేవిడ్ ఆర్ మాల్పాస్ వార్షిక వేతనం సుమారు 390,539 డాలర్లు. -
పేరుకే యూట్యూబర్.. ఆస్తుల్లో కుబేరుడు: ఎవరతడు?
సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన చాలా మందిలో గౌరవ్ చౌదరి ఒకరు. వృత్తిపరంగా టెక్నికల్ గురూజీ పేరుతో సుపరిచితుడైన ఈ యూట్యూబర్ దుబాయ్‌లో నివసిస్తున్నాడు. భారతదేశంలో ఎక్కువ మంది అనుసరించే టెక్ యూట్యూబర్ కూడా. ఈయన రెండు యూట్యూబ్ ఛానెల్‌లను నడుపుతూ కోట్ల కొద్ది సంపాదిస్తున్నారు. గౌరవ్ చౌదరి అండ్ టెక్నికల్ గురూజీ పేరుతో రెండు యూట్యూబ్ ఛానెల్‌లను నడుపుతున్న ఇతనికి సుమారు 27 మిలియన్స్ పాలొవర్స్ ఉన్నారు. ప్రపంచంలో అతి పెద్ద టెక్ ఛానెల్‌లలో ఒకటి టెక్నికల్ గురూజీ యూట్యూబ్ ఛానెల్. 1991లో రాజస్థాన్‌లో అజ్మీర్‌లో జన్మించిన టెక్నికల్ గురూజీ BITS పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీని పూర్తి చేసాడు. 2015లో యూట్యూబ్ ప్రారంభించాడు. ఈ ఛానల్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే గొప్ప సక్సెస్ సాధించాడు. ఒక పక్క యూట్యూబ్ ద్వారా భారీగా సంపాదించమే కాకుండా, దుబాయ్ పోలీసులకు, ఇతర సంస్థలకు భద్రతా సామగ్రిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు దుబాయ్ పోలీస్ సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇంజనీర్ అని సమాచారం. ప్రస్తుతం దుబాయ్‌లో రూ. 60 కోట్ల విలువైన ఇల్లు ఉంది, అంతే కాకుండా అతడు ఇప్పటికే ఖరీదైన సుమారు 11 కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో రూ. 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెక్లారెన్ GT, రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే పనామెరా GTS, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్, బిఎండబ్ల్యు 750ఎల్ఐ, మెర్సిడెస్ బెంజ్ 500ఎమ్ఎల్, ఆడి ఏ6, మహీంద్రా థార్ మొదలైనవి ఉన్నాయి. ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లను కలిగి ఉన్న టెక్నికల్ గురూజీ మొత్తం ఆస్తుల విలువ 45 మిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 369 కోట్లు. అతని నెల సంపాదన కోటి కంటే ఎక్కువే. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?
సాక్షి, ముంబై: ఫోర్బ్స్ 2023 అపర కుబేరుల ప్లేస్‌లో మూడో స్థానంలో నిలిచిన ఇండియాలో కొత్తగా 16 మంది కొత్త బిలియనీర్లు చోటు దక్కించు కున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. ఈ మేటి మహిళల్లో ఒకరు వినోద్ రాయ్ గుప్తా.రూ. 33 వేల కోట్ల నికర విలువతో భారతదేశంలో 4వ అత్యంత సంపన్న మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా) హావెల్స్ ఇండియా అధినేత వినోద్ రాయ్ దేశీయ నాల్గవ సంపన్న మహిళ. మొత్తం సంపన్నుల జాబితాలో 40 వ స్థానం. హావెల్స్ ఇండియాలో ఈమెకు 40 శాతం వాటా ఉంది. హావెల్స్ ఇండియాను 1958లో వినోద్ రాయ్ గుప్తా దివంగత భర్త ఖిమత్ రాయ్ గుప్తా స్థాపించారు. ఇప్పుడు అతని కుమారుడు అనిల్ రాయ్ గుప్తా ప్రస్తుతం హావెల్స్ ఇండియా చైర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. హావెల్స్ ఇండియా ఎలక్ట్రికల్ అండ్ లైటింగ్ ఫిక్చర్ల నుండి ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ల వరకు ప్రతిదీ తయారు చేస్తుంది. హావెల్స్‌కు 14 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాని ఉత్పత్తులు ఇప్పుడు 50కి పైగా దేశాల్లో అమ్ముడవుతున్నాయి. క్విమత్ రాయ్ గుప్తా 10వేల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రికల్ బిజినెస్ ప్రారంభించగా ఇపుడు వారి కుమారుడు అనిల్ రాయ్ గుప్తా నాయకత్వంలో రూ. 74,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో వ్యాపార రంగంలో రాణిస్తోంది. (జీపే యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్ సంచలనం: మీ రివార్డ్స్ చెక్ చేసుకోండి!) ఫోర్బ్స్ తన వార్షిక బిలియనీర్ల జాబితాలను 2023 ఏప్రిల్ 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భారతదేశంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితా కూడా ఉంది. ఈ లిస్ట్‌లో రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ దేశీయంగా, ఆసియా రెండింటిలోనూ టాప్ ప్లేస్‌లో నిలవగా, అత్యంత ధనవంతుడుగా నిలిచారు. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం, భారతదేశంలోని ఐదుగురు సంపన్న మహిళలు సావిత్రి జిందాల్, రోహికా సైరస్ మిస్త్రీ, రేఖా ఝన్‌ఝన్‌వాలా, వినోద్ రాయ్ గుప్తా, లీనా తివారీ ఉన్నారు. -
15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా
సాక్షి, ముంబై: ప్రముఖ మహిళా వ్యాపారవేత్త రేఖా ఝున్‌ఝున్‌వాలా మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలంలో 15 నిమిషాల్లో కోట్లాది రూపాయలను ఆర్జించారు. తన పోర్ట్‌ఫోలియోలోని టాటాగ్రూపునకు చెందిన టైటన్, టాటా మోటార్స్ షేర్ల లాభాలతో ఆమె మరింత ధనవంతురాలిగా మారిపోయారు. ఏకంగా 400కోట్ల రూపాయలను తన నెట్‌వర్త్‌కు జోడించుకున్నారు. ఈ ఆర్థికసంవత్సరంలో వ్యాపార వృద్ది, ఇతర వ్యాపార అప్డేట్స్తో సోమవారంనాటి మార్కెట్లో టైటన్, టాటా మోటార్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. రేఖా పోర్ట్ ఫోలియోలోని షేర్ల మార్నింగ్ డీల్స్‌తో ఆమె నికర విలువ ఆకాశానికి ఎగిసింది. ట్రేడింగ్ ఆరంభం 15 నిమిషాల్లోనే, టైటన్ షేరు ధర రూ. 2,598.70 గరిష్టాన్ని తాకింది. మునుపటి ముగింపుతో పోలిస్తే రూ. 50కు పైనే ఎగిసింది. అదేవిధంగా, టాటా మోటార్స్ షేరు ధర రూ. 32.75 పెరిగింది. రేఖా ఝున్‌ఝున్‌వాలా నెట్‌వర్త్ జూమ్ 2022 అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికానికి టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం, రేఖాకు 4,58,95,970 టైటాన్ షేర్ల ఉన్నాయి. ఇది కంపెనీ మొత్తం చెల్లించిన మూలధనంలో 5.17 శాతం. కాబట్టి, సోమవారం సెషన్లో మొదటి 15 నిమిషాల్లో టైటాన్ షేరు ధర పెరిగిన తర్వాత రేఖా నికర విలువ దాదాపు రూ.230 కోట్లు (రూ50.25 x 4,58,95,970) పెరిగింది. అలాగే టాటా మోటార్స్ షేర్లు 5,22,56,000 షేర్లు లేదా కంపెనీలో 1.57 శాతం వాటా. కాబట్టి, రేఖా నికర విలువలో మొత్తం పెరుగుదల దాదాపు రూ.170 కోట్లు (రూ.32.75 x 5,22,56,000). కాగా ప్రముఖ పెట్టుబడిదారుడు, దివంగత రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా. -
వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ ఎవరో తెలుసా..?
వైట్ బాల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా.. క్రికెట్ చాలా మారింది. క్రికెట్ ను ఓ క్రీడగా చూసే రోజులు పోయి.. భారీ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ జరిగే రోజులొచ్చేశాయి. ముఖ్యంగా ఐపీఎల్ రాకతో మార్కెట్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇండియాలో మొత్తం క్రీడల పేరుతో జరుగుతున్న సింహ భాగం బిజినెస్ క్రికెట్ దే. ఈ గణాంకాలు చూస్తే చాలు.. దేశంలో క్రికెట్ మానియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిషర్లు వదిలి వెళ్లిన క్రికెట్.. ఇప్పుడు ఇండియాలో మార్కెట్‌ను శాసిస్తోంది. అలాంటి జెంటిల్ మెన్ గేమ్‌లో జూలు విదిల్చి ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డ్‌ను అలుపు లేకుండా పరుగులు పెట్టించే క్రీడాకారులు సంపాదనలో సైతం పోటీపడుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ టెక్ కంపెనీల సీఈవో సంపాదన కంటే వీళ్ల ధనార్జనే ఎక్కువ. అంత క్రేజ్ ఉన్న క్రికెట్ క్రీడా విభాగంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో మీకు తెలుసా? సీఈవో వరల్డ్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం..ఆడమ్ గిల్‌క్రిస్ట్ నెట్ వర్త్ 380 మిలియన్ డాలర్లు, సచిన్ టెండూల్కర్ నెట్ వర్త్ 170 మిలియన్లు, ఎంఎస్ ధోనీ 115 మిలియన్లు, విరాట్ కోహ్లీ 112 మిలియన్లు, రికీ పాంటింగ్ 75 మిలియన్లు, జాక్వెస్ కల్లిస్ 70 మిలియన్లు, బ్రియాన్ లారా 60 మిలియన్లు, వీరేంద్ర సెహ్వాగ్ 40 మిలియన్లు, యువరాజ్ సింగ్ 35 మిలియన్లు, స్టీవ్ స్మిత్ 30 మిలియన్లతో అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్నారు. Top 10 Richest Cricketers In The World, 2023 🇦🇺AC Gilchrist: $380m (estimated net worth) 🇮🇳SR Tendulkar: $170m 🇮🇳MS Dhoni: $115m 🇮🇳V Kohli: $112m 🇦🇺RT Ponting: $75m 🇿🇦JH Kallis: $70m 🌴BC Lara: $60m 🇮🇳V Sehwag: $40m 🇮🇳Yuvraj Singh: $35m 🇦🇺Steve Smith: $30m (CEOWORLD magazine) — World Index (@theworldindex) March 14, 2023 -
Alia Bhatt రూ.150 కోట్ల బ్రాండ్, లగ్జరీ కార్లు, నెట్‌వర్త్, తొలి సంపాదన తెలుసా?
సాక్షి,ముంబై: స్టార్ హీరోయిన్ అలియా భట్ పరిచయం అవసరం లేని పేరు. అందం, అభినయంతో సినిమా రంగంలో మాత్రమేకాదు అటు భారీ పెట్టుబడిదారుగా ఒక సంస్థకు కో ఫౌండర్‌గా వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్‌గా భారీ ఆదాయాన్నే ఆర్జిస్తోంది గంగూభాయి. ఈ కంపెనీ స్థాపించిన ఏడాదికే రూ.150 కోట్లకు స్థాయికి చేరుకుంది. అలియా భట్ మార్చి 15న 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. అద్బుతమైన నటనతో స్టార్ హీరోయిన్గా ప్రశంస లందుకుంటున్న ఈ అమ్మడు విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. గర్భవతిగా ఉన్నప్పుడు భట్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma )లాంచ్ చేసింది. ఈ కంపెనీ వెబ్సైట్లో 800పైగా ప్రొడక్ట్స్‌తో 2-14 సంవత్సరాల వయస్సు పిల్లల బట్టలు విక్రయిస్తుంది. 12 నెలల్లోనే ఈ కంపెనీ 10 రెట్లు వృద్ధితో రూ.150 కోట్ల వాల్యుయేషన్‌ను సాధించడం విశేషం. బిజినెస్ గురించి ఇంకా నేర్చుకుంటున్నా: అలియా బిజినెస్ గురించి తానింకా నేర్చుకుంటున్నా అని, కేవలం ఏడాది వ్యవధిలో సంస్థ సాధించిన ఘనత గర్వకారణమని అలియా భట్ ఆనందాన్ని ప్రకటించింది. చిన్న కలగా మొదలై ఇప్పుడు 150 కోట్ల వ్యాపారంగా మారుతోందని, తాను కంపెనీపై కాకుండా వ్యక్తులు ఆలోచనలపైనే పెట్టుబడి పెడతానని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ కంపెనీ కోటి రూపాయలను సాధించింది. మరోవైపు గత నెలలో కో-ఫౌండర్‌గా అలియాను ప్రకటించడం విశేషం. దీంతో పాటు నైకా, ఫూల్.కో, స్టైల్ క్రేకర్‌లో కూడా పెట్టుబడిదారుగా ఉంది. సొంత ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌ను కూడా లాంచ్ చేసేంది అలియా. ప్రస్తుతం అలియా భట్ నికర విలువ రూ.299 కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం, ఆమె 2017లో రూ. 39.88 కోట్లు సంపాదించింది; 2018లో ఇది రూ. 58.83 కోట్లకు పెరగింది. 2019లో ఆమె రూ. 59.21 కోట్లు సంపాదించింది. కాగా సినిమాల్లో ఒక్కో పాత్రకు 20 కోట్లు తీసుకుంటుందని సమాచారం. చిన్నతనంలో తన తండ్రి మహేష్ భట్ పాదాలకు క్రీమ్ రాసేందుకు రూ.500 సంపాదించేదట. అదే తన తొలి సంపాదన అని అలియా చెప్పుకుంటుంది. అలియా భట్ ఇల్లు, కార్లు అలియా భట్‌కు రెండు లగ్జరీ ఇళ్లు ఉన్నట్టు సమాచారం. అలాగే బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఏ6, ఆడి క్యూ7తో పాటు మూడు కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్ వంటి అనేక కార్లు ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె అలియా. 2022 ఏప్రిల్ 14న హీరో రణబీర్ కపూర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2022 నవంబర్ 6న పాప రాహాకు జన్మనిచ్చింది. ఇక సినిమా కరియర్ విషయానికి వస్తే 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అలియా, హైవే, ఉడతా పంజాబ్, రాజీ, గల్లి బాయ్ బాలీవుడ్లో పలు విజయవంతమైన మూవీస్‌లో నటించింది. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలీ గంగూబాయికతియావాడి చిత్రంలోని నటనతో ఆకట్టుకుంది. అలాగే తెలుగులో సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. -
జెరోధా నితిన్ నెల జీతం ఎంతో తెలుసా? ఈ తప్పులు చేయొద్దన్న బిలియనీర్
దేశీయ అతిపెద్ద స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ స్వయం కృషితో ఎదిగిన సెల్ఫ్ మేడ్ బిలియనీర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అత్యంత పిన్న వయస్సులోనే సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ బిలియనీర్‌గా నిలిచిన ఘనతను దక్కించుకున్న నితిన్ నెల జీతం, నెట్వర్త్కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా, పారిశ్రామికవేత్తల ఆదాయం భారీగా ఎగిసింది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా గణనీయంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే జెరోధా సీఈవో నితిన్ కామత్ నికర విలువ బాగా పెరిగింది. 2022లో నితిన్ నికర విలువ 2 బిలియన్ డాలర్లు (అప్పటికి రూ. 15,612 కోట్లు)గా అంచనా వేశారు. 2021లో భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అత్యధిక వేతనం పొందుతున్న సహ వ్యవస్థాపకులుగా నిలిచారు. ఎవరీ నితిన్ కామత్ నితిన్ కామత్ భారతదేశంలోని కర్ణాటకలోని శివమొగ్గలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి బ్యాంకు ఉద్యోగి, అతని తల్లి గృహిణి. బెంగళూరులో ప్రాథమిక, కాలేజీ విద్యను పూర్తి చేసిన నితిన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పట్టభద్రుడయ్యాడు. ఈక్రమంలో 17 సంవత్సరాల వయస్సులో, తండ్రి వ్యాపారాన్ని నిర్వహించడం ప్రారంభించాడు. అలాగే జనవరి 1997 నుండి జనవరి 2004 వరకు ప్రొప్రైటీ ట్రేడర్‌గా పనిచేశారు. 2010లో సోదరుడు నిఖిల్ కామత్ సహ వ్యవస్థాపకుడిగా, భార్య సీమా పాటిల్‌తో కలిసి స్టాక్ బ్రోకరేజ్ సంస్థ 'జెరోధా'ను స్థాపించారు. కేవలం ఐదుగురు టీమ్‌తో మొదలై 1300 మందికి పైగా ఉద్యోగులతో మల్టీ బిలియన్ల కంపెనీగా, కస్టమర్లకు సరికొత్త ఫీచర్లు,అప్డేట్స్తో జెరోధాను సంస్థను పరుగులు పెట్టించి వేల కోట్ల సంస్థగా అభివృద్ధి చేశారు. నితిన్,సీమా దంపతులకు 'కియాన్' అనే కుమారుడు ఉన్నాడు. 2021లోనే 100 కోట్ల వార్షిక వేతనం 2021లోనే నితిన్, నిఖిల్ ఒక్కొక్కరూ 100 కోట్ల వార్షిక జీతం అందుకున్నారట. అప్పటి బోర్డు ఆమోదం ప్రకారం సీమ, నితిన్ ఇద్దరికీ నెలకు రూ. 4.7 కోట్ల బేస్ సాలరీ, బోనస్ , వేరియబుల్ పే ప్రయోజనాలతో ఏడాదికి రూ. 300 కోట్లు చెల్లించే ప్రత్యేక తీర్మానాన్ని జెరోధా బోర్డు ఆమోదించిందట. దీనిపై విమర్శలు రావడంతో నితిన్ కామత్ ట్విటర్లో ఒక వివరణను పోస్ట్ చేశారు. వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది ట్రేడింగ్‌తో సమానమని, ఏ క్షణంలోనైనా నష్టాలు రావచ్చు, లాభాలు రావచ్చు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ లాభాల్లో స్టార్టప్‌లు, ధార్మిక సంస్థలలో తమ వ్యక్తిగత పెట్టుబడులను కొనసాగించడానికి తమ పెట్టుబడుల ప్లానింగ్ బాగా తోడ్పడిందని చెప్పారు. అలాగే తమ టీం ఉద్యోగులకు ఈఎస్ఏపీ (ఉద్యోగి స్టాక్ యాజమాన్య ప్రణాళిక) బైబ్యాక్ ద్వారా డి-రిస్కింగ్ను సులభతరం చేస్తున్నామని, ఈ బైబ్యాక్ కోసం ఏడాదికి దాదాపు రూ.200 కోట్లు (2021లో) కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు కీలక సలహాలు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో పెట్టుబడి విషయానికి వస్తే, జెరోధా ట్రూ బెకన్ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులకంటే ఇతర పెట్టుబడులు ఇంకా మేలని చెప్పారు. మార్కెట్ టాప్‌లో ఉన్నందున, ఈక్విటీతో పోలిస్తే బంగారంపై పెట్టుబడి మేలని భావించారు. అలాగే ఈక్విటీ, స్థిర-ఆదాయం, రుణం, బంగారం, రియల్ ఎస్టేట్ కలయికతో కూడిన తన పోర్ట్‌ఫోలియో వైవిధ్యతను కూడా వివరించడం విశేషం. ఈక్విటీలో దాదాపు 40 శాతం, అప్పులు 45 శాతం, బంగారంలో 10 శాతం, రియల్ ఎస్టేట్, ఇతరాలు 5 శాతంగా ఉన్నాయన్నారు. అయితే పన్ను ప్రయోజనాలున్న ఈక్విటీ ఎక్స్పోజర్ మంచిదని కూడా సలహా ఇచ్చారు. తప్పక నివారించాల్సిన తప్పులనుకూడా కామత్ ప్రస్తావించారు. చిన్న చిన్న కుదుపులకు ఆందోళన చెందకుండా ప్రణాళికా బద్ధంగా పెట్టుబడులు పెట్టడంతెపాటు, పోర్ట్‌ఫోలియోను నిశితంగా పరిశీలించుకోవాలన్నారు. అంతేకానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరు సంపాదించిన దానిలో 99 శాతం తిరిగి పెట్టుబడిగా పెడతారు. అంటే కేవలం 1 శాతం లేదా అంతకంటే తక్కువ మాత్రమే ఖర్చు చేస్తారు. బహుశా ఇదే జెరోధా సక్సెస్ మంత్రా కావచ్చు. -
కోటి యూట్యూబ్ సబ్స్క్రైబర్లు: 8500 కోట్లతో సొంత కంపెనీ
న్యూఢిల్లీ: చాలా తెలివైన విద్యార్థి. కష్టపడి చదివేవాడు.10, 12వ తరగతిలో టాపర్.. IITలో సీటు కోసం కష్టపడ్డా... దొరక్కపోవడంతో కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ కాలేజీలో అడ్మిషన్ తో సరిపెట్టుకున్నాడు. అయితేనేం ఇపుడు కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయనే UPకి చెందిన అలఖ్ పాండే. ఐఐటీ రాలేదని నిరాశ చెందకుండా ట్యూషన్ టీచర్‌గా కెరియర్ మొదలు పెట్టి ఇప్పుడు విజయవంతమైన ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగాడు. ఆన్లైన్ లర్నింగ్ ప్లాట్‌ఫాం ద్వారా బిలియనీర్‌గా ఎదిగాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం ఏలతాడు అన్నట్టు తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అలహాబాద్ కుర్రోడు బిలియనీర్‌గా అలహాబాద్‌కు చెందిన అలఖ్ పాండే ఇంటర్ చదువుతున్నపుడు ఐఐటీ గురించి కలలు కన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అది సాధ్యం కాలేదు. అయినా కుంగిపోలేదు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోనే చదువుకు టాటా చెప్పేసాడు. సొంత కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ట్యూషన్ టీచర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. ట్యూటర్‌గా అతని తొలి సంపాదన రూ. 5వేలు మాత్రమే. మరిపుడు వేల కోట్ల విలువైన "ఫిజిక్స్ వాలా" అనే కంపెనీ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా శబాష్ అనిపించుకుంటున్నాడు. యూట్యూబర్ కూడా అయిన అలఖ్ పాండే విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తాడు. అలాగే తన యాప్ ద్వారా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు రోజుకు కనీసం 1.5 గంటలు శిక్షణ తీసుకుంటున్నారంటే అతని క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిజిక్స్ వాలాలో జేఈఈ-నీట్ శిక్షణను కూడా ప్రారంభించాడు. అంతేకాదు ఈనెల (ఫిబ్రవరి) 28న విశ్వాస్ దివస్ పేరుతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెస్ట్ లాంచ్ చేయబోతున్నానని ప్రకటించాడు అలఖ్ పాండే. ఫిజిక్స్ వాలా ఆవిర్భావం ఇంజినీరింగ్ వదిలి అలహాబాద్ తిరిగొచ్చి 2016లో ఫిజిక్స్ వాలా ఛానెల్‌ని ప్రారంభించాడు. దీని తరువాత 2020లో ఒక యాప్‌ను కూడా ప్రారంభించాడు. ఇటీవల భారీ పెట్టుబడులతో పాండే కంపెనీ మొత్తం నికర విలువ రూ.8500 కోట్లుగా నిలిచింది. అలఖ్ యూట్యూబ్ ఛానల్ కు 9.75 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. గతేడాది ఆయన కంపెనీ రూ.350 కోట్లు ఆర్జించింది. కంపెనీలో 19వేల మంది ఉద్యోగులు ఉన్నారు. బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా ఫిజిక్స్‌వాలా దేశంలోని 101వ యునికార్న్‌గా ఉంది. తాజాగా ఆయన రూ.777 కోట్ల పెట్టుబడులను సమీకరించారు. దేశీయ 101వ యూనికార్న్ ఫిజిక్స్ వాలా ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్ ఫిజిక్స్ వాలా (PWగా పాపులర్) వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, GSV వెంచర్స్ నుండి సిరీస్ A ఫండింగ్ 100 మిలియన్లను సేకరించడం ద్వారా భారతదేశపు 101వ యునికార్న్‌గా అవతరించింది. 2020, 2021లో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వంటి పోటీ పరీక్షలలో 10వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని కంపెనీ గతంలో ప్రకటించింది. భారతదేశంలో కనీసం ఆరుగురిలో ఒకరు వైద్య విద్యార్థులు, 10మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఫిజిక్స్వాలాకి చెందిన వారుంటారని పేర్కొంది. అలాగే బైజూస్, వేదాంతా వంటి ఇతర అనేక ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా ఇప్పటికే 18 నగరాల్లో 20 కంటే ఎక్కువ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేశారు పాండే. 300 మంది సామూహిక వివాహాలకు ఫండింగ్ ఫిబ్రవరి 22న జర్నలిస్ట్ శివాని దూబేతో ఏడు అడుగులు వేశాడు అలఖ్. మరో విశేషం ఏమిటంటే తమ పెళ్లి సందర్బంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహాలకు ఫండింగ్‌కు ముందుకొచ్చాడు. అంతేకాదు పెళ్లి తరువాత కూడా చదువు కొనసాగించాలనుకునే వారికి చదువుకునేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు పాండే. మార్చి ప్రారంభంలో ప్రయాగ్‌రాజ్, తేలియార్గంజ్లోని NRIPT గ్రౌండ్లో 300మందికి సామూహిక వివాహ వేడుకలను నిర్వహించనున్నారు. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah) -
Adani Group crisis: రూ. 10 లక్షల కోట్లు హాంఫట్, 24వ స్థానానికి గౌతం అదానీ
సాక్షి, ముంబై: అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రకంపనలతో అదానీ గ్రూపు ఇన్వెస్టర్లసంపద రోజురోజుకు ఆవిరైపోతూ వస్తోంది. జనవరి నుంచి అదానీ గ్రూప్ మార్కెట్ విలువలో 10 లక్షల కోట్లు (10 ట్రిలియన్లు రూపాయలకు పైగా పతనమైంది. సోమవారం ఒక్కరోజే రూ. 51,610 కోట్లను కోల్పోవడం గమనార్హం. సోమవారం ఒక్క రోజు పతనంతో గ్రూప్ మార్కెట్ విలువ 8.98 ట్రిలియన్ రూపాయిలకు పడిపోయింది. (ఇదీ చదవండి: Valentine's Day 2023:వామ్మో..చాట్‌జీపీటీని అలా కూడా వాడేస్తున్నారట!) హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలతో జనవరి 24న ప్రారంభమైన మెల్ట్‌డౌన్, గ్రూప్ మార్కెట్ క్యాప్ నుండి 10.2 ట్రిలియన్ రూపాయలు లేదా 53 శాతం తుడిచి పెట్టుకుపోయింది మరోవైపు అదానీ గ్రూప్ ఛైర్మన్, గౌతం అదానీ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 24వ స్థానానికి దిగజారారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫిబ్రవరి 14 నాటికి అదానీ నికర విలువ 52.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, నికర విలువ 53 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ ఎంఎస్సీఐ గత వారం చివరిలో దాని గ్లోబల్ ఇండెక్స్‌లలో భాగమైన కొన్ని గ్రూప్ కంపెనీల వెయిటింగ్‌లను తగ్గించడం, అలాగే గ్రూప్ తన క్యాపెక్స్ ప్లాన్లను తగ్గించాలని యోచిస్తున్న తాజా నివేదికల తరువాత తాజా నష్టాలు సంభవించాయి. ఇప్పటికే హిండెన్‌బర్గ్ ఆరోపణలను తిప్పి కొట్టిన అదానీ గ్రూప్ కొన్ని కంపెనీల స్వతంత్ర ఆడిట్ల కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్న్టన్ను నియమించినట్టు తెలుస్తోంది. (Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్) అంతా బానే ఉంది: ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ భరోసా ఇన్వెస్టర్లకు భరోసా కల్పించేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. తమ వ్యాపార ప్రణాళికలకు అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. వాటాదారులకు మంచి రాబడులే అందించగలమంటూ ధీమా వ్యక్తం చేసింది. వృద్ధి లక్ష్యాలు, పెట్టుబడులను కుదించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను గ్రూప్ అధికార ప్రతినిధి ఖండించారు. ప్రస్తుత మార్కెట్ కుదుటపడిన తర్వాత గ్రూప్‌లోని ప్రతీ సంస్థ తన వ్యూహాల సమీక్ష చేపడుతుందని చెప్పారు. -
కుప్పకూలుతున్న అదానీ: డౌ జోన్స్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ ఔట్
సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల తీరు నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారైంది. దలాల్ స్ట్రీట్‌లో అదానీ స్టాక్‌ల తనం కారణంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ సంపద దాదాపు సగం ఆవిరైపోయింది. ప్రస్తుతం ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ప్రస్తుతం అదానీ నికర విలువ 55.8 బిలియన్ డాలర్లకు చేరింది. గౌతమ్ అదానీకి చెందిన ఎనర్జీ-టు-పోర్ట్‌ల సామ్రాజ్యం నికర సంపద 10 రోజుల్లో సగం తుడిచి పెట్టుకు పోయింది. ఫలితంగా ప్రపంచంలో 2వ అత్యంత సంపన్న పౌరుడిగా ఎదిగిన బిలియనీర్ 108 బిలియన్ డాలర్లను కోల్పోయి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 21వ స్థానానికి పడిపోయాడు. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ 20వేల ఎఫ్‌పీవో రద్దు భారీ క్షీణతకు దారితీసింది. అటు హిండెన్‌బర్గ్ కంపెనీకి అదానీ గ్రూపు ఇచ్చిన సమాధానం కూడా పెట్టుబడి దారులకు భరోసా ఇవ్వడంలో విఫలమైంది. ఫలితంగా అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ , అదానీ గ్రీన్ ఎనర్జీ వాటి గరిష్ట స్థాయిల నుండి 70-75 శాతం క్షీణించగా, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ విల్మార్ తమ విలువలో 50-60 శాతం నష్టపోయాయి. ఇంకా ఏసీసీ అంబుజా సిమెంట్స్ ,ఎన్డీటీవీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి. డౌ జోన్స్ నుంచి ఔట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్ నుండి తొలగించనున్నారు. ఈమేరకు S&P Dow Jones Indices ఒక నోట్ జారీ చేసింది. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం ఆరోపణలు, మీడియా, వాటాదారుల విశ్లేషణ తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ సూచీల నుండి తొలగిస్తున్నట్టు ఈ నోట్ పేర్కొంది. ఈ సంక్షోభంతో ప్రపంచవృద్ధి ఇంజిన్‌గా, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గమ్య స్థానంగా ఉన్న భారత విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అదానీ గ్రూపు మేనేజ్మెంట్ క్లారిటీ కోరనున్న ఎల్ఐసీ మరోవైపు అదానీలో కీలక పెట్టుబడిదారు ఎల్ఐసీ త్వరలోనే అదానీ గ్రూపు కీలక మేనేజ్మెంట్తో భేటీ కానుందట. ఎఫ్‌పీవో ఉపసంహరణ తరువాత ఇన్వెస్టర్లకు పెట్టుబడులను తిరిగి ఇచ్చే విషయంలో స్పష్టకోరనుందని సీఎన్‌బీసీ నివేదించింది. -
ఇలా జరుగుతుందని ఎలాన్ మస్క్ అస్సలు ఊహించి ఉండడు
సాక్షి, బిజినెస్ డెస్క్ : అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా షేరు ఏడాది క్రితం దాకా బ్రేకుల్లేని బండిలా రివ్వున దూసుకెళ్లిపోయింది. కంపెనీ బాసు ఎలాన్ మస్క్‌ను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి స్థానంలో కూర్చోబెట్టింది. కానీ ఇప్పుడదే షేరు ఏకంగా 70 శాతం పడిపోయి .. నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో మస్క్ సంపదా భారీగా హరించుకుపోయింది. చరిత్రలోనే అత్యంత వేగంగా భారీ సంపదను పోగొట్టుకున్న కుబేరుడిగా రికార్డును కూడా మూటగట్టుకున్నారు. ముచ్చట పడి, పంతం పట్టి కొనుక్కున్న ట్విటర్‌కే సమయం అంతా వెచ్చిస్తూ టెస్లాను మస్క్ పట్టించుకోకపోతూ ఉండటమే ఇన్ని అనర్ధాలకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. అయితే, అదొక్కటే కాకుండా టెస్లాకు మార్కెట్లో పోటీ పెరిగిపోతుండటం, డిమాండ్ తగ్గుతుండటం, కంపెనీపై ఇన్వెస్టర్లకు నమ్మకం సడలుతుండటం మొదలైనవి మరికొన్ని కారణాలని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఇదంతా ఒక దశ మాత్రమేనని, మళ్లీ పుంజుకునే సామర్థ్యాలు టెస్లాకు పుష్కలంగా ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ట్విటర్‌తో కష్టాలు.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌ను కొనడంతోనే అటు టెస్లాకు ఇటు మస్క్‌కు కష్టాలు వచ్చాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొంటానంటూ గతేడాది ఏప్రిల్‌లో ప్రకటించిన మస్క్, బోలెడంత ఊగిసలాట తర్వాత అక్టోబర్‌లో ఎట్టకేలకు కొన్నారు. డీల్ గురించి ప్రకటించిన దగ్గర్నుంచి ఆయన 23 బిలియన్ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను అమ్మేశారు. ట్విటర్‌ను కొన్నప్పటి నుంచి గరిష్టంగా దానికే సమయాన్ని వెచ్చిస్తున్నారని, టెస్లాను పట్టించుకోవడం లేదనే అభిప్రాయంతో మిగతా షేర్‌హోల్డర్లూ అదే బాట పట్టారు. ఇవన్నీ కంపెనీ షేరుపై ప్రతికూల ప్రభావం చూపాయన్న అభిప్రాయం ఉంది. డిమాండ్ డౌన్.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ కారణంగా టెస్లా కార్లకు డిమాండ్ బలహీనపడుతోంది. కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టెస్లా తొలిసారిగా డిస్కౌంట్లు ఆఫర్ చేయడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముందు 3,750 డాలర్ల డిస్కౌంటు ఇస్తామని ప్రకటించిన టెస్లా.. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆ తర్వాత దాన్ని ఏకంగా 7,500 డాలర్లకు పెంచింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పోటీ పెరుగుతున్న క్రమంలో కీలకమైన చైనా, అమెరికా మార్కెట్లలో డిమాండ్ బలహీనపడుతుండటం టెస్లాకు అర్థమవుతోంది కాబట్టే ఇలా డిస్కౌంట్ల బాట పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే కాకుండా అమెరికా ఎకానమీ ఈ ఏడాది మాంద్యంలోకి జారుకుంటుందని, కార్లకు డిమాండ్ పడిపోతుందని వస్తున్న వార్తలూ టెస్లాకు ప్రతికూలంగా ఉంటున్నాయి. అంతేకాకుండా ఫోక్స్‌వ్యాగన్, ఫోర్డ్, జీఎం, హ్యుందాయ్ వంటి దిగ్గజాలు బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ టెస్లాకు దీటుగా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను దింపేందుకు కసరత్తు చేస్తుండటమూ కంపెనీకి సవాలుగా మారుతోంది. కీలకమైన అమెరికా ఈవీ మార్కెట్లో టెస్లా వాటా 2020లో 79% కాగా గతేడాది తొలి 9 నెలల్లో 65%కి పడిపోయింది. 2025 నాటికి ఇది 20% దిగువకు పడిపోవచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ మొబిలిటీ అంచనా. వేల్యుయేషన్లపై సందేహాలు.. అమ్మకాలు అంతంతే అయినా అసాధారణంగా ట్రిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ట్రేడ్ అవడం టెస్లాకు క్రమంగా ప్రతికూలంగా మారింది. ఒక దశలో టెస్లా వేల్యుయేషన్.. ప్రపంచంలోనే టాప్ 12 భారీ ఆటో దిగ్గజాలన్నింటినీ మించి పలికింది. కానీ వాటి అమ్మకాలతో పోలిస్తే టెస్లా విక్రయాలు తూగడం లేదు. ఇదంతా మార్కెట్‌కు అవగతమయ్యే కొద్దీ కంపెనీ వేల్యుయేషన్ ట్రిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం దాదాపు 400 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతే గాకుండా మస్క్ చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండకపోతుండటం కూడా ఇన్వెస్టర్లలో అపనమ్మకం కలిగిస్తోంది. ఏదేదో చేసేస్తున్నానంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసే మస్క్ .. వాటిని ఆచరణలో మాత్రం చూపడం లేదంటూ విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు దాదాపు నాలుగేళ్ల క్రితం ఆవిష్కరించిన సైబర్‌ట్రక్ ఉత్పత్తి 2021లో మొదలుపెడతామని మస్క్ చెప్పినప్పటికీ ఈ ఏడాది వరకూ వాయిదా పడుతూ వచ్చింది. 2024లో గానీ పూర్తి స్థాయిలో తయారీ పుంజుకోదు. ఫోర్డ్, రివియన్ లాంటి కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ పికప్‌లను అమ్మేస్తుండగా టెస్లా ఎప్పటికి పుంజుకుంటుందనేది సందేహంగా మారింది. సంపద సృష్టిలోనూ.. కోల్పోవడంలోనూ రికార్డే! టెస్లా షేరు 2021 ఆఖర్లో దాదాపు 409 డాలర్ల రికార్డు స్థాయిని తాకింది. దానికి అనుగుణంగానే అందులో సుమారు 21 శాతం వాటాలున్న కంపెనీ చీఫ్ మస్క్ 320 బిలియన్ డాలర్ల సంపదతో సంపన్నుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నంబర్ వన్‌గా ఉండేవారు. అయితే, గట్టిగా ఏడాది తిరిగేసరికి టెస్లా షేరు 123 డాలర్లకు పడిపోయింది. మస్క్– ట్విటర్ డీల్ నేపథ్యంలో గత మూడు నెలల్లో భారీగా పతనమైంది. వెరసి 2022 మొత్తం మీద దాదాపు 65 శాతం క్షీణించింది. దానికి తగ్గట్లే కంపెనీలో 13.4 శాతం (ప్రస్తుతం) వాటాలు ఉన్న మస్క్ సంపద కూడా ఏకంగా 188 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం మస్క్ సంపద విలువ 132 బిలియన్ డాలర్లు. ఇంత స్వల్ప కాలంలో ఇంత భారీగా సంపద కోల్పోవడంలో మస్క్ రికార్డు సృష్టించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ రికార్డు జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ అధినేత మసయోషి సన్ పేరిట ఉండేది. 2000 ఐటీ బబుల్ బరస్ట్ అయినప్పుడు ఆయన ఏకంగా 58.6 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. -
జుకర్ బర్గ్‌కు భారీ షాక్! 71 బిలియన్ డాలర్లు తుడుచుపెట్టుకుపోయాయ్!
న్యూఢిల్లీ: ‘మెటా’ అభివృద్ధి, రీబ్రాండింగ్‌పై దృష్టిపెట్టిన ఫేస్బుక్ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు భారీ షాక్ ఇస్తోంది. మార్క్ సంపద భారీగా తాజాగా మరింత క్షీణించింది. ఫలితంగా కేవలం 55.9 బిలియన్ డాలర్ల నికర విలువతో మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచ బిలియనీర్లలో 20వ స్థానంలో ఉంది, 2014 నుండి ఇదే అత్యల్ప స్థానం. ఈ సంపద రెండేళ్ల కిందటే 106 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. మెటా డెవలప్మెంట్ కోసం దాదాపు 71 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నారు. ఫలితగా మార్క్ సంపద ఈ మేరకు తుడుచుపెట్టుకుపోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అత్యంత సంపన్నులలో అతని నికర సంపద సగానికి తగ్గిపోయింది. 2014లో ప్రపంచ బిలియనీర్లలో రెండు స్థానంలో ఉన్నారు ఇటీవల కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో 24 శాతం పడిపోయాయి. అంచనాలకు భిన్నంగా మెటా బలహీన ఫలితాల కారణంగా చరిత్రలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అలా ఒక్క రోజులోనే మార్క్ సంపద 31 బిలియప్ డాలర్లకు పడిపోయింది. సెప్టెంబర్, 2021లో కంపెనీ షేర్లు 382 డాలర్ల వద్ద జుకర్ బర్గ్ అతని సంపద గరిష్టంగా 142 బిలియన్ డాలర్లగా ఉన్న సంగతి తెలిసిందే. మెటావర్స్‌లో కంపెనీ పెట్టుబడులు పెట్టడం వల్ల స్టాక్ డ్రాప్ అవుతోందనీ, రాబోయే మూడు నుండి ఐదేళ్లలో "గణనీయమైన" సంపద కోల్పోతుందని తాను భావిస్తున్నట్లు నీధమ్ అండ్ కంపెనీ ఇంటర్నెట్ విశ్లేషకుడు లారా మార్టిన్ చెప్పారు. -
మీ నెట్‌వర్త్ ఎంత?
♦ ఫైనాన్షియల్ బేసిక్స్ మొత్తం ఆస్తుల విలువలో నుంచి అన్ని రకాల రుణాల విలువను తీసివేస్తే వచ్చే విలువే నెట్‌వర్త్. వ్యక్తులకైనా, సంస్థలకైనా నెట్‌వర్త్‌ను బట్టే ఆ వ్యక్తి లేదా సంస్థకు నికరంగా వున్న ఆస్తి విలువ తెలిసేది. సంస్థలకు సంబంధించి ఈ నెట్వర్త్నే పుస్తక విలువ లేదా షేర్‌హోల్డర్ల మూలధనంగా పరిగణిస్తారు. నెట్‌వర్త్ విలువ మీ ఆర్థిక నిర్వహణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే నెట్‌వర్త్ విలువ పెరుగుతూ పోతే అతని ఆర్థిక సామర్థ్యం బాగా ఉన్నట్లు లెక్క. అదే తగ్గుతూ వస్తే.. అతనికి ఆర్థిక లావాదేవీల నిర్వహణపై సరైన నియంత్రణ లేదని అర్థం. అదే ఒక కంపెనీ నెట్‌వర్త్ విలువ (బుక్ వ్యాల్యూ) పెరుగుతూ ఉంటే.. అది మంచి పనితీరును కనబరుస్తోందని తెలుసుకోవాలి. నెట్ వర్త్ విలువ బాగా ఉన్న వ్యక్తికి/కంపెనీకి క్రెడిట్ రేటింగ్ కూడా బాగా ఉంటుంది. నెట్‌వర్త్ అనేది వ్యక్తి/కంపెనీ నిధుల సమీకరణపై ప్రభావాన్ని చూపిస్తుంది. నెట్‌వర్త్‌ను లెక్కించడం ఎలా? నెట్‌వర్త్ విలువ ఎంతో తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఇళ్లు, కారు, బైక్, ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వంటి అన్ని ఆస్తుల వివరాలతో ఒక జాబితా తయారుచేసుకోవాలి. తర్వాత మీకు ఉన్న బ్యాంకు రుణాలు, ఇతర అప్పుల వివరాలతో మరొక జాబితా రూపొందించుకోండి. ఇప్పుడు ఆస్తుల విలువ లో నుంచి రుణ మొత్తాలను తీసివేస్తే మీ నెట్‌వర్త్ విలువ వస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.20,00,000 ఖరీదైన ఇంటిని కలిగి ఉన్నాడు. అలాగే అతనికి రూ.5,00,000 విలువైన పెట్టుబడులు ఉన్నాయి. రూ.4,00,000 విలువైన వాహనం ఉంది. ఇవన్నీ అతని ఆస్తులు. అతను ఇంకా చెల్లించాల్సిన ఇంటి రుణం రూ.10,00,000 వరకూ వుంది. అలాగే అతనికి కారు రుణం రూ.2,00,000 ఉంది. ఇవన్నీ అతని రుణాలు. ఇప్పుడు అతని నెట్‌వర్త్ విలువ (మొత్తం ఆస్తుల విలువ-అన్ని రుణాలు) రూ.17,00,000గా ఉంటుంది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతను నివాసం ఉంటున్న ఇంటి విలువ రూ.22,00,000కు పెరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ రూ.6,00,000గా, సేవింగ్స్ రూ.1,00,000గా వున్నాయి. వాహనం విలువ రూ.3,00,000కు తగ్గింది. కారు రుణం చెల్లించివేశాడు. ఇంటి రుణం రూ.6,00,000గా ఉంది. దాంతో అతని నెట్‌వర్త్ రూ.26,00,000గా ఉంటుంది. అంటే అతని నెట్‌వర్త్ ఐదేళ్లలో రూ.9,00,000 మేర పెరిగిందన్న మాట. -
డీఅండ్‌బీ టాప్500లో 16 హైదరాబాదీ కంపెనీలు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) విడుదల చేసిన టాప్ 500 భారతీయ కంపెనీల్లో 16 హైదరాబాద్ కంపెనీలకు చోటు లభించింది. ఆదాయం, లాభాలు, నెట్‌వర్త్ వంటి అనేక ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకొని టాప్ -500 కంపెనీలను ఎంపిక చేసినట్లు డీఅండ్‌బీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంక్, ఎన్ఎండీసీ, డాక్టర్ రెడ్డీస్, సైయంట్, కోరమాండల్ ఇంటర్నేషనల్, అరబిందో ఫార్మా, అమర్ రాజా బ్యాటరీస్, బీఎస్, గాయత్రీ, హెచ్‌బీఎల్, హెరిటేజ్, మధుకాన్, ఎన్సీసీ, ప్రిజిం సిమెంట్, రాంకీ ఇన్ఫ్రా, స్టీల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 500 కంపెనీలు దేశ జీడీపీలో 20 శాతం వాటాను కలిగి ఉండగా, ఎగుమతుల్లో 30 శాతం, ఉద్యోగాల కల్పనలో 10 శాతం వాటాను కలిగి ఉన్నట్లు డీఅండ్‌బీ సీఈవో (ఇండియా) కుషాల్ సంపత్ తెలిపారు.2014 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో ఈ కంపెనీల ఆదాయాలు 8 శాతం వృద్ధిని నమోదు చేయగా, లాభాలు 7.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గినట్లు డీఅండ్‌బీ పేర్కొంది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఏడాది ఆదాయం, లాభాల్లో మరింత వృద్ధిని అంచనా వేస్తోంది. అలాగే దేశ జీడీపీ 5.5 శాతం ఉంటుందని డీఅండ్‌బీ లెక్కకట్టింది.