సాక్షి, ముంబై: ఫోర్బ్స్ 2023 అపర కుబేరుల ప్లేస్‌లో మూడో స్థానంలో నిలిచిన ఇండియాలో కొత్తగా 16 మంది కొత్త బిలియనీర్లు చోటు దక్కించు కున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. ఈ మేటి మహిళల్లో ఒకరు వినోద్ రాయ్ గుప్తా.రూ. 33 వేల కోట్ల నికర విలువతో భారతదేశంలో 4వ అత్యంత సంపన్న మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా)
హావెల్స్ ఇండియా అధినేత వినోద్ రాయ్ దేశీయ నాల్గవ సంపన్న మహిళ. మొత్తం సంపన్నుల జాబితాలో 40 వ స్థానం. హావెల్స్ ఇండియాలో ఈమెకు 40 శాతం వాటా ఉంది. హావెల్స్ ఇండియాను 1958లో వినోద్ రాయ్ గుప్తా దివంగత భర్త ఖిమత్ రాయ్ గుప్తా స్థాపించారు. ఇప్పుడు అతని కుమారుడు అనిల్ రాయ్ గుప్తా ప్రస్తుతం హావెల్స్ ఇండియా చైర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
హావెల్స్ ఇండియా ఎలక్ట్రికల్ అండ్ లైటింగ్ ఫిక్చర్‌ల నుండి ఫ్యాన్‌లు, రిఫ్రిజిరేటర్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్‌ల వరకు ప్రతిదీ తయారు చేస్తుంది. హావెల్స్‌కు 14 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాని ఉత్పత్తులు ఇప్పుడు 50కి పైగా దేశాల్లో అమ్ముడవుతున్నాయి. క్విమత్ రాయ్ గుప్తా 10వేల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రికల్ బిజినెస్ ప్రారంభించగా ఇపుడు వారి కుమారుడు అనిల్ రాయ్ గుప్తా నాయకత్వంలో రూ. 74,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో వ్యాపార రంగంలో రాణిస్తోంది. (జీపే యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్ సంచలనం: మీ రివార్డ్స్ చెక్ చేసుకోండి!)
ఫోర్బ్స్ తన వార్షిక బిలియనీర్ల జాబితాలను 2023 ఏప్రిల్ 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భారతదేశంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితా కూడా ఉంది. ఈ లిస్ట్‌లో రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ దేశీయంగా, ఆసియా రెండింటిలోనూ టాప్ ప్లేస్‌లో నిలవగా, అత్యంత ధనవంతుడుగా నిలిచారు. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం, భారతదేశంలోని ఐదుగురు సంపన్న మహిళలు సావిత్రి జిందాల్, రోహికా సైరస్ మిస్త్రీ, రేఖా ఝన్‌ఝన్‌వాలా, వినోద్ రాయ్ గుప్తా, లీనా తివారీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment