vinod roy
-
వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?
సాక్షి, ముంబై: ఫోర్బ్స్ 2023 అపర కుబేరుల ప్లేస్‌లో మూడో స్థానంలో నిలిచిన ఇండియాలో కొత్తగా 16 మంది కొత్త బిలియనీర్లు చోటు దక్కించు కున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. ఈ మేటి మహిళల్లో ఒకరు వినోద్ రాయ్ గుప్తా.రూ. 33 వేల కోట్ల నికర విలువతో భారతదేశంలో 4వ అత్యంత సంపన్న మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా) హావెల్స్ ఇండియా అధినేత వినోద్ రాయ్ దేశీయ నాల్గవ సంపన్న మహిళ. మొత్తం సంపన్నుల జాబితాలో 40 వ స్థానం. హావెల్స్ ఇండియాలో ఈమెకు 40 శాతం వాటా ఉంది. హావెల్స్ ఇండియాను 1958లో వినోద్ రాయ్ గుప్తా దివంగత భర్త ఖిమత్ రాయ్ గుప్తా స్థాపించారు. ఇప్పుడు అతని కుమారుడు అనిల్ రాయ్ గుప్తా ప్రస్తుతం హావెల్స్ ఇండియా చైర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. హావెల్స్ ఇండియా ఎలక్ట్రికల్ అండ్ లైటింగ్ ఫిక్చర్ల నుండి ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ల వరకు ప్రతిదీ తయారు చేస్తుంది. హావెల్స్‌కు 14 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాని ఉత్పత్తులు ఇప్పుడు 50కి పైగా దేశాల్లో అమ్ముడవుతున్నాయి. క్విమత్ రాయ్ గుప్తా 10వేల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రికల్ బిజినెస్ ప్రారంభించగా ఇపుడు వారి కుమారుడు అనిల్ రాయ్ గుప్తా నాయకత్వంలో రూ. 74,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో వ్యాపార రంగంలో రాణిస్తోంది. (జీపే యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్ సంచలనం: మీ రివార్డ్స్ చెక్ చేసుకోండి!) ఫోర్బ్స్ తన వార్షిక బిలియనీర్ల జాబితాలను 2023 ఏప్రిల్ 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భారతదేశంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితా కూడా ఉంది. ఈ లిస్ట్‌లో రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ దేశీయంగా, ఆసియా రెండింటిలోనూ టాప్ ప్లేస్‌లో నిలవగా, అత్యంత ధనవంతుడుగా నిలిచారు. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం, భారతదేశంలోని ఐదుగురు సంపన్న మహిళలు సావిత్రి జిందాల్, రోహికా సైరస్ మిస్త్రీ, రేఖా ఝన్‌ఝన్‌వాలా, వినోద్ రాయ్ గుప్తా, లీనా తివారీ ఉన్నారు. -
అక్టోబరు 23న బీసీసీఐ ఎన్నికలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎన్నికలు ఒక రోజు ఆలస్యంగా జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన అక్టోబర్ 22న కాకుండా ఒక రోజు ఆలస్యంగా 23న జరుగుతాయి. హరియాణా, మహారాష్ట్రలలో శాసనసభ ఎన్నికలు అక్టోబర్ 21న జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. అదే విధంగా రాష్ట్ర క్రికెట్ సంఘాల ఎన్నికల గడువును కూడా బీసీసీఐ పొడిగించింది. అక్టోబర్ 4లోపు ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించింది. -
కొత్త కోచ్ ను ప్రకటించాల్సిందే!
ముంబై:భారత క్రికెట్ ప్రధాన కోచ్ అభ్యర్ధిని మంగళవారం సాయంత్రంలోగా ప్రకటించాల్సిందేనని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పరిపాలక కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కోచ్ అభ్యర్దికోసం ఇంటర్య్వూలు నిర్వహించినప్పటికీ, ఆ ప్రకటనను మాత్రం వాయిదా వేయడానికి వినోద్ రాయ్ తప్పుబట్టినట్లు సమాచారం..ఈ రోజు సాయంత్రానికల్లా కోచ్ అభ్యర్ధిని ప్రకటించాల్సిదేనని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. ఈ మేరకు బీసీసీఐకి కోచ్ ప్రకటనకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారని సమాచారం. దానిలో భాగంగా బీసీసీఐ సీఈఏ రాహుల్ జోహ్రి, బీసీసీఐ కార్యదర్శి అమితామ్ చౌదరిలతో వినోద్ రాయ్ సమావేశమై కోచ్ అభ్యర్ధి ప్రకటించడంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సోమవారంగంగూలీతో పాటు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ (లండన్ నుంచి స్కైప్ ద్వారా) ఇంటర్వ్యూలు నిర్వహించారు. ‘కోచ్ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదు. కొన్ని రోజుల సమయం ఇంకా అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. ఎంపికకు తొందరేమీ లేదని మా అభిప్రాయం. ఈసారి ఎవరి పేరును ప్రకటించినా వారు 2019 వరల్డ్ కప్ వరకు కొనసాగుతారు’ అని గంగూలీ స్పష్టం చేశారు. కోచ్ పేరును ప్రకటించే ముందు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో కచ్చితంగా చర్చిస్తామని గంగూలీ వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు మాత్రం కోహ్లి తమ పనిలో కలగజేసుకోలేదని, కోచ్‌గా ఎవరు ఉండాలనే పేరును కూడా సూచించలేదని ఆయన అన్నారు. ‘కోచ్ ఎవరితో కలిసి పని చేయాల్సి ఉంటుందో అలాంటి వారితో మాట్లాడటం కూడా చాలా అవసరం'అని గంగూలీ తెలిపాడు. -
రవిశాస్త్రి వైఖరిపై బీసీసీఐ అసంతృప్తి
న్యూఢిల్లీ:భారత క్రికెటర్ల జీత భత్యాల విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వమూ అవసరం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఆటగాళ్ల తాజా కాంట్రాక్ట్ వేతనాలు ఎంతమాత్రం ఆమోద యోగ్యం లేవంటూ ధ్వజమెత్తిన భారత క్రికెట్ జట్టు మాజీ డైరక్టర్ రవిశాస్త్రిపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు ఎవరి సలహాలు అవసరం లేదని రవిశాస్త్రి జోక్యాన్ని తప్పబట్టారు బీసీసీఐ పరిపాలన కమిటీ సీఈవో వినోద్ రాయ్. 'ఆటగాళ్ల వార్షిక వేతనాల విషయంలో మేము చాలా క్లియర్ గా ఉన్నాం. దీనిపై ఏ ఒక్కరి సలహా మాకు అక్కర్లేదు. ఆటగాళ్లకు బీసీసీఐకి మధ్యవర్తిత్వం అసలు అవసరమే లేదు. శాలరీల పెంపుపై భారత ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ఒక నివేదిక అందజేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో ఇప్పటికే సమావేశమయ్యాం. ఆటగాళ్ల వేతనాల పెంపుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే త్వరలోనే పరిష్కరిస్తాం. మాకు ఎవరి సలహాలు అక్కర్లేదనే విషయంలో మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాం'అని వినోద్ రాయ్ అన్నారు. ఇటీవల ఆటగాళ్లకు బీసీసీఐ చెల్లిస్తున్న వార్షిక వేతనంపై రవిశాస్త్రి మండిపడ్డాడు. ఇతర దేశ క్రికెటర్లతో పోలిస్తే వారికి లభిస్తున్నది ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు.‘ఏ’ గ్రేడ్ ఆటగాళ్లకు రూ.2 కోట్లు కాకుండా మరింత ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 'ఏ' గ్రేడ్ ఆటగాళ్ల వార్షిక వేతనం రూ. కోటిని రెట్టింపు చేసిన తరువాత రవిశాస్త్రి పెదవి విప్పాడు.