![BCCI Elections On October 23 Instead of October 22 - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/25/BCCI.jpg.webp?itok=fpjW3YNL)
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎన్నికలు ఒక రోజు ఆలస్యంగా జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన అక్టోబర్ 22న కాకుండా ఒక రోజు ఆలస్యంగా 23న జరుగుతాయి. హరియాణా, మహారాష్ట్రలలో శాసనసభ ఎన్నికలు అక్టోబర్ 21న జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. అదే విధంగా రాష్ట్ర క్రికెట్ సంఘాల ఎన్నికల గడువును కూడా బీసీసీఐ పొడిగించింది. అక్టోబర్ 4లోపు ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment