Forbes billionaire rankings
-
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో సైరస్ మిస్త్రీ కుమారులు
ముంబై : ఫోర్బ్స్ ఈ ఏడాది బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. అందులో 25 మంది అతిచిన్న వయస్సుల్లో బిలియనీర్లు ఉన్నారు. వారి మొత్తం సంపద 110 బిలియన్ డాలర్లు కాగా వారి వయస్సు 33 అంతకంటే తక్కువగా ఉందని ఫోర్బ్స్ తెలిపింది. 30 ఏళ్లలోపు యువ భారతీయ బిలియనీర్లలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కుమారులు జహాన్, ఫిరోజ్ ముందంజలో ఉన్నారు. వారిద్దరి సంపద 9.8 బిలియన్లుగా ఉంది. జహాన్ మిస్త్రీ 2022లో కారు ప్రమాదంలో తండ్రి సైరస్ మిస్త్రీ మరణించిన తర్వాత జహాన్ తన కుటుంబ సంపదలో కొంత భాగాన్ని వారసత్వంగా పొందారు. ఇందులో టాటా సన్స్‌లో వాటా 18.4శాతం, ముంబై నిర్మాణ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో జహాన్ 25 శాతం వాటా ఉంది. ఐర్లాండ్‌లో పౌరసత్వం కలిగిన జహాన్ మిస్త్రీ తన తండ్రి సైరస్ మిస్త్రీ మరణం తర్వాత ముంబైలో నివసిస్తున్నారు. ఫిరోజ్ మిస్త్రీ ఫిరోజ్ మిస్త్రీ (27) దివంగత సైరస్ మిస్త్రీకి పెద్ద కుమారుడు. కుటుంబ వారసత్వంగా టాటా సన్స్‌లో 18.4శాతం వాటాను, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో 25శాతం వాటాను దక్కించుకున్నారు. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఐపీఓకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఫిరోజ్ మిస్త్రీ యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో చదువుకున్నారు. ఐరిష్ పౌరసత్వం ఉన్నప్పటికీ అతను ముంబైలో నివసిస్తున్నారు. -
ప్రపంచంలోనే ‘పిన్న’ బిలియనీర్‌గా లివియా
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించి 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి లివియా వొయిట్ చరిత్ర సృష్టించింది. 20 ఏళ్లుకూడా నిండని ఈమెకు అత్యంత సంపన్నుడైన తాత నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఒక్కసారిగా వేల కోట్ల అధిపతి అయ్యింది. బ్రెజిల్‌కు చెందిన డబ్ల్యూఈజీ కంపెనీని లివియా తాత వెర్నెర్ రికార్డో వొయిట్ మరో ఇద్దరితో కలిసి స్థాపించారు. ఫోర్బ్స్ సంస్థ 33 ఏళ్ల వయసులోపు ఉన్న 25 మంది యువ బిలియనీర్ల జాబితాను తాజాగా విడుదలచేసింది. ఇందులో లివియా పేరు కూడా ఉంది. దాదాపు రూ.9,165 కోట్ల(1.1 బిలియర్ డాలర్ల) సంపదతో ప్రపంచంలో బిలియనీర్ అయిన అత్యంత చిన్న వయసు్కరాలుగా ఈమె పేరు రికార్డులకెక్కింది. కోట్లకు పడగలెత్తినా ఇంకా ఆమె కంపెనీ బోర్డులో సభ్యురాలిగా చేరలేదు. ఆస్తులతో నాకేం పని అన్నట్లుగా నిరాడంబరంగా లివియా ప్రస్తుతం బ్రెజిల్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతోంది. -
19 ఏళ్లకే బిలియనీర్‌గా స్టూడెంట్..ఆమె ఆస్తి అన్ని కోట్లా?
కొందరు అత్యంత చిన్న వయసులోనే కోటీశ్వరులుగా అవతరిస్తారు. తరతరాల నుంచే వచ్చే ఆస్తుల కారణంగా ఒక్కసారిగా చిన్న వయసులోనే ధనవంతులుగా అయిపోతుంటారు. చెప్పాలంటే కోటీశ్వరులు తమ ఆస్తులను వృద్ధి చేస్తూ మనవళ్లు లేదా మనవరాళ్ల పేర్ల మీద రాయడం వల్ల లేదా మరణం కారణంగానో వాళ్ల వారసులు ఇలా ధనవంతులుగా అయిపోతారు. అలానే ఇక్కడొక విద్యార్థి చిన్నవయసులోనే బిలీయనీర్‌గా అవతరించింది. ఇంతకీ ఎవరంటే ఆమె..? 19 ఏళ్ల బ్రెజిలియన్ విద్యార్థి లివియా వోయిగ్ట్ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా ఈ ఏడాది ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో స్థానం దక్కించుకుంది. ఆ జాబితాలో 33 ఏళ్ల వయసున్న దాదాపు 25 మంది యువ బిలియనీర్లు ఏకంగా రూ. 11000 కోట్లు సంపదను కలిగి ఉండటం విశేషం. ఇంతకీ ఈ లివయా వోయిగ్ట్ ఎవరంటే.. ఈ ఏడాది 2024లో ప్రపంచంలోనే అత్యంత చిన్న పిన్నవయస్కురాలిగా టైటిల్‌ని గెలుచుకుంది లివయా వోయిగ్ట్. ఇంతకుమునుపు ఆ టైటిల్‌ని అందుకున్న ఎస్సిలర్ టుక్సోటికా వారసుడు డెల్ వెచియా నుంచి లివయా ఆ టైటిల్‌ని అందుకోవడం విశేషం. ఇక ఈ డెల్ వెచియా లివియా కంటే జస్టే రెండు నెలలే పెద్దవాడు. అమెరికాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ మోటార్ల తయారీ కంపెనీ వెగ్(WEG)ని ఆమె తాత వెర్నర్ రికార్డో వోయిగ్ట్, దివగంత బిలియనీర్లు ఎగ్గాన్ జోవో డా సిల్వా, గెరాల్డో వెర్నింగ్హాస్లతో కలిసి స్థాపించారు. ఆ కంపెనీలో లివియా అతి పెద్ద వాటాదారు. ఇక లివియా సంపద నికర విలువ ఏకంగా రూ. 9 వేల కోట్లు. అలాగే ఆమె అక్క డోరా వోగ్ట్ డి అస్సిస్ కూడా ఫోర్బ్స్ అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్ లిస్ట్‌లో ఒకరిగా ఉన్నారు. ఇక డోరా 2020లో ఆర్కిటెక్చర్ డిగ్రీని పూర్తి చేసింది కాగా, లివియా వెగ్(WEG) కంపెనీ బహుళ జాతి కంపెనీగా దాదాపు 10కి పైగా దేశాల్లో కర్మాగారాలు ఉన్నాయి. ఆమె కంపెనీ 2022లో సుమారు రూ. 50 వేల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అయితే లివియా ప్రస్తుతం బ్రెజిల్‌లోని విశ్వవిద్యాలయంలో చదువుతోంది. ఇంకా ఆమె WEGలో బోర్డు లేదా ఎగ్జిక్యూటివ్ హోదాలో సాగకపోయినా అందులో అతిపెద్ద వాటాదారు కావడంతో బిలియనీర్‌గా అవతరించింది. ఇక ఈ బిలియనీర్ ర్యాంకులో చాలామంది యువ వారసులు చేరారు. అందులో ఇద్దరు ఐర్లాండ్ మిస్త్రీ సోదరులు కూడా ఉన్నారు. (చదవండి: మేకల వల్లే కాఫీ గురించి తెలిసిందా? ఆ స్టోరీ తెలిస్తే షాకవ్వుతారు!) -
రికార్డ్ స్థాయిలో బిలియనీర్ల సంపద: టాప్ మహిళ ఎవరో తెలుసా?
భారతీయ మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాల్లోదూసుకుపోవడమే కాదు. ఫోర్బ్స్ జాబితాలో అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుంటున్నారు. తాజాగా విడుదల చేసిన 'ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ లిస్ట్' 2024లో 17మంది మహిళలు చోటు సాధించారు. ఈ ఏడాది భారతదేశం సంపదలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2023లో 169 మంది ఉండగా తాజాగా 200 మంది భారతీయులు ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. 25 మంది కొత్త బిలియనీర్లు ఈ జాబితాలో చేరారు. వీరి సంపద రికార్డు స్థాయిలో 41 శాతం పుంజుకుని 954 బిలియన్లకు డాలర్లకు పెరిగింది. టాప్ -10 మహిళా బిలియనీర్లు సావిత్రి జిందాల్: భాభారతీయ సంపన్న మహిళ జాబితాలో జిందాల్ కుటుంబానికి చెందిన జిందాల్ గ్రూప్ చైర్పర్సన్. సావిత్రి జిందాల్ 35.5 బిలియన్ల డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో ఉన్నారు. రేఖా ఝున్‌ఝన్‌వాలా: ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా. రెండో స్థానంలో నిలిచారు. ఆమె నికర విలువ 8.5 బిలియన్ డాలర్లు వినోద్ రాయ్ గుప్తా: హావెల్స్ ఇండియాకు చెందిన వినోద్ రాయ్ గుప్తా 5 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో చోటు సంపాదించారు. రేణుకా జగ్తియాని: ల్యాండ్‌మార్క్ గ్రూప్ చైర్పర్సన్, సీఈవో రేణుకా జగ్తియాని 4.8 బిలియన్ల డాలర్లతో ఈ జాబితాలోకి అరంగేట్రం చేశారు. 2023,మే లో మిక్కీ జగ్తియాని కన్నుమూయడంతో, ఆమె కంపెనీ బాధ్యతలను చేపట్టారు. స్మితా కృష్ణ-గోద్రెజ్: గోద్రెజ్ కుటుంబానికి చెందిన స్మితా కృష్ణ మహిళల బిలియనీర్ల జాబితాలో ఐదో ప్లేస్‌లో నిలిచారు. ఈమె నికర విలువ 3.8 బిలియన్ డాలర్లు. గోద్రెజ్ కుటుంబ ఆస్తులలో గణనీయమైన వాటాను కలిగి ఉన్నారు. ఇతర మహిళా బిలియనీర్లు - నికర విలువ రాధా వెంబు (3.4 బిలియన్ డాలర్లు) , అను అగా (3.3 బిలియన్ డాలర్లు), లీనా తివారి (3.2 బిలియన్ డాలర్లు), ఫల్గుణి నాయర్ (2.9బిలియన్ డాలర్లు), కిరణ్ మజుందార్-షా (2.7 బిలియన్ డాలర్లు), మృదులా పరేఖ్ (2.1 బిలియన్ డాలర్లు), సరోజ్ రాణి గుప్తా (1.6 బిలియన్ డాలర్లు), రేణు ముంజాల్ (1.6 బిలియన్ డాలర్లు, సారా జార్జ్ ముత్తూట్ (1.3 బిలియన్ డాలర్లు), అల్పనా డాంగి (1.2 బిలియన్ డాలర్లు), సుబ్బమ్మ జాస్తి (1.1 బిలియన్ డాలర్లు), కల్పనా పరేఖ్ (1.1 బిలియన్ డాలర్లు) -
ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే..
ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుల్లో మొదటి పది మందిలో రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. మరోసారి భారత్‌లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం.. 116 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ ప్రపంచంలో 9వ స్థానంలో నిలిచారు. 2023లో ఆయన సంపద 83.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక భారత్‌లో రెండో సంపన్నుడైన గౌతమ్ అదానీ 17వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 47.2 బిలియన్ డాలర్ల నుంచి 84 బిలియన్ డాలర్లకు పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్ సహవ్యవస్థాపకుడు శివ్ నాడార్ 36.9 బిలియన్ డాలర్లతో 39వ స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్-కుటుంబం (33.5 బి.డాలర్లు) 46వ స్థానంలో, సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వి (26.7 బి.డాలర్లు) 69వ స్థానంలో నిలిచారు. సైరస్ పూనావాలా (21.3 బి.డాలర్లు) 90వ స్థానం, కుషాల్ పాల్ సింగ్ (20.9 బి.డాలర్లు) 92వ స్థానం, కుమార్ బిర్లా (19.7 బి.డాలర్లు) 98వ స్థానం దక్కించుకున్నారు. ఇదీ చదవండి: గూగుల్ రహస్య బ్రౌజర్.. రూ.41,000 కోట్ల దావా! తెలుగు రాష్ట్రాల నుంచి ఫోర్బ్స్‌లో చోటు సంపాదించిన వారి వివరాలు కింది విధంగా ఉన్నాయి. మురళి దివి, కుంటుబం 6.2 బిలియన్ డాలర్ల సంపదతో(రూ.51వేలకోట్లు) 469 ర్యాంకులో నిలిచారు. ప్రతాప్ సి రెడ్డి 3 బిలియన్ డాలర్లతో(రూ.26వేలకోట్లు) 1104 ర్యాంకు జీఎం రావు 2.9 బిలియన్ డాలర్లతో(రూ.25వేలకోట్లు) 1143 ర్యాంకు పీవీ రామ్ ప్రసాద్‌రెడ్డి 2.9 బిలియన్ డాలర్లతో(రూ.25వేలకోట్లు) 1143 ర్యాంకు జూపల్లి రామేశ్వర్రావు 2.3 బిలియన్ డాలర్లతో(రూ.19వేలకోట్లు) 1438 ర్యాంకు పీపీ రెడ్డి 2.3 బిలియన్ డాలర్లతో(రూ.19వేలకోట్లు) 1438 ర్యాంకు పీవీ కృష్ణారెడ్డి 2.2 బిలియన్ డాలర్లతో(రూ.18వేలకోట్లు) 1496 ర్యాంకు ఎం.సత్యనారాయణ రెడ్డి 2 బిలియన్ డాలర్లతో(రూ.16వేలకోట్లు) 1623 ర్యాంకు కె.సతీశ్‌రెడ్డి 1.8 బిలియన్ డాలర్లతో(రూ.15వేలకోట్లు) 1764 ర్యాంకు జి.వి.ప్రసాద్ 1.5 బిలియన్ డాలర్లతో(రూ.12వేలకోట్లు) 2046 ర్యాంకు -
Forbes richest list 2024: టాప్–10లో ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్ టాప్–10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. 116 బిలియన్ డాలర్ల సంపదతో 66 ఏళ్ల ముకేశ్ టాప్–9గా నిలిచారు. 2023లో ముకేశ్ సంపద 83.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. దేశీయంగా సంపదలో టాప్–2గా నిలుస్తున్న గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 17వ ర్యాంకును అందుకున్నారు. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా 2023లో అదానీ సంపద 47.2 బిలియన్ డాలర్లకు క్షీణించిన సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ తిరిగి బలపడింది. ఇక 2022లో అదానీ 90 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌ను సాధించడం ప్రస్తావించదగ్గ అంశం! జాబితా ఇలా ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో 2,781 మంది వ్యక్తులు చోటు సాధించారు. గతేడాది జాబితాతో పోలిస్తే 141 మందికి అదనంగా చోటు లభించింది. 2023తో పోలిస్తే కుబేరుల ఉమ్మడి సంపద 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 14.2 ట్రిలియన్ డాలర్లను తాకింది. సరికొత్త రికార్డ్ నమోదైన 2021తో పోలిస్తే 1.1 లక్షల కోట్ల డాలర్లు జత కలసింది. ఫ్యాషన్స్, కాస్మెటిక్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 233 బిలియన్ డాలర్లతో టాప్ ర్యాంకును, 195 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ రెండో ర్యాంకునూ కొల్లగొట్టారు. 177 బిలియన్ డాలర్లతో ఫేస్బుక్ జుకర్‌బర్గ్ టాప్–3గా నిలిచారు. -
ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో జాయ్ అలుక్కాస్
కొచ్చి: ఫోర్బ్స్ 100 మంది సంపన్న భారతీయుల జాబితాలో జోయాలుక్కాస్ కంపెనీ చైర్మన్ జాయ్ అలుక్కాస్ 50వ స్థానం దక్కించుకున్నారు. తద్వారా భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక జ్యువెలర్‌గా ఖ్యాతి గడించారు. జ్యువెలరీ రంగంలో పెను మార్పులు తీసుకురావడంలో జాయ్ అలుక్కాస్ కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంక్షోభం(2008), కరోనా మహమ్మారి(2020) వంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా అధిగమించి వ్యాపారాన్ని నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అవుట్‌లెట్‌ను చెన్నైలో ప్రారంభించడం, ప్రోత్సాహంగా రోల్స్ రాయిస్ కార్లను బహుమతిగా ఇవ్వడం, రష్యా తూర్పు భాగం ప్రాంతాల కొత్త మార్కెట్లలో ప్రవేశించడం వంటి విన్నూత ఆలోచనలతో జోయాలుక్కాస్ను ‘వరల్డ్స్ పేవరెట్ జ్యువెలర్’ గా జోయాలుక్కాస్ సంస్థగా తీర్చిద్దిద్దారు. -
ఫోర్బ్స్ కుబేరుల జాబితా: అంబానీ, అదానీ ర్యాంకు ఎంతో తెలుసా?
అమెరికన్ బిజినెస్ మేగజీన్ ఫోర్బ్స్ (Forbes) 2023 సంవత్సరానికి గానూ ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఫోర్బ్స్ విడుదల చేసిన 37వ ఎడిషన్‌లో ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తిరిగి టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నారు. 90.8 బిలియన్ల నికర విలువతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దేశంలోని 167 మంది బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. (కళ్లద్దాల్నే నమ్ముకున్నాడు: కట్ చేస్తే..వేల కోట్ల వ్యాపారం, లగ్జరీ లైఫ్!) 2023 ఏడాది ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో 240.7 బిలయన్ డాలర్లతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. అలాగే ఫ్రాన్స్ కు చెందిన లూయీస్ వీటన్ (Louis Vuitton) బ్రాండ్ ఫౌండర్ ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్ జీన్ అర్నాల్ట్ ప్రంపంచలో టాప్ 2 ప్లేస్ కొట్టేశారు సంపద 231.4 బిలియన్ డాలర్లు. 154.9 బిలియన్ డాలర్లతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు. ఇండియాలో టాప్-10 లో ఉన్నది వీరే భారత్‌లో దాదాపు 167 మంది బిలియనీర్లలో, ముఖేష్ అంబానీ వరుసగా 14 సంవత్సరాలుగా భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ, సైరస్ పూనావల్లా, శివనాదా తర్వాతి స్థానాల్లో ఉన్నారు ఐదో స్థానంలో సావిత్రి జిందాల్ నిలిచారు. ♦ గౌతమ్ అదానీ 54.9 బిలియన్ డాలర్లు ♦ సైరస్ పూనావాలా 29.1 బిలియన్ డాలర్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ♦ శివ్ నాడార్ 25.6బిలియన్ డాలర్లు HCL టెక్నాలజీస్ ♦ సావిత్రి జిందాల్ & కుటుంబం 20.3 బిలియన్ డాలర్లు JSW గ్రూప్ ♦ దిలీప్ షాంఘ్వీ 18.2 బిలియన్ డాలర్లుసన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ♦ లక్ష్మి మిట్టల్ 16.9 బిలియన్ డాలర్లుఆర్సెలర్ మిట్టల్ ♦ రాధాక్రిషన్ దమానీ 16.7 బిలియన్ డాలర్లు DMart, అవెన్యూ సూపర్ మార్కెట్లు ♦ కుమార్ బిర్లా 15.8 బిలియన్ డాలర్లు ఆదిత్య బిర్లా గ్రూప్ ♦ ఉదయ్ కోటక్ 14.2బిలియన్ డాలర్లు బి కోటక్ మహీంద్రా బ్యాంక్ -
దేశంలోని 1 శాతం ధనవంతుల్లో ఒకరిగా ఉండాలంటే.. ఎంత డబ్బుండాలి?
ఫోర్బ్స్ ఇండియా -2023 నివేదిక ప్రకారం..భారత్‌లో మొత్తం 169 మంది (ఏప్రిల్ 5 నాటికి) బిలియనీర్లు ఉన్నారు. వారి వద్ద 675 బిలియన్ల డాలర్ల ధనం ఉంది. అయితే వారితో సమానంగా మేం కూడా ధనవంతులమే అని నిరూపించుకోవాలంటే సామాన్యుల వద్ద ఎంత డబ్బు ఉండాలి? అసలు ఎంత డబ్బు ఉంటే ధనవంతులని పరిగణలోకి తీసుకుంటారు? అని ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? అవును! ప్రపంచంలోని 25 దేశాల్లో ఆయా దేశాల్ని బట్టి ధనవంతుల సంఖ్య పెరగొచ్చు. తగ్గొచ్చు. మరి మన దేశంలో మొత్తం కాకపోయినా కనీసం 1 శాతం ధనవంతుల్లో మనమూ ఒకరిగా పేరు సంపాదించాలంటే మన వద్ద కనీసం రూ.1.44 కోట్లు ఉండాలి. ఆ మొత్తం ఉంటే ఆ ఒక్క శాతం కోటీశ్వరుల జాబితాలో చోటు దక్కించుకోవచ్చు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా - 2023 రూపొందించిన తాజా నివేదికలో ఆల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యూవల్స్ (uhnwi) ఈ విషయాన్ని వెల్లడించింది. నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ధనవంతుల జాబితా దేశాల్లో దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, కెన్యాలు సైతం ఉండగా.. భారత్ 22వ స్థానం దక్కించుకుంది. ►ప్రపంచంలోనే అత్యంత సంపన్నులున్న మొనాకో 25 దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ఆ దేశంలో 12.4 మిలియన్లు (రూ.102 కోట్లు) ఉంటే ఒక్క శాతం ధనవంతుల జాబితాలో ఒకరిగా పేరు సంపాదించవచ్చు. ►ఇక, స్విట్జర్లాండ్‌లో 6.6 మిలియన్లు, సింగపూర్‌లో 3.5 మిలియన్లు, హాంగ్ కాంగ్లో 3.4 మిలియన్లు ఉండాలి ►మిడిల్ ఈస్ట్ దేశాలైన బ్రెజిల్ 1.6మిలియన్లు, లాటిన్ అమెరికాలో 430,000 డాలర్లు ఉండాలి. ► అల్ట్రా హై నెట్ వర్త్ జాబితాలో భారత్‌లో 30 మిలియన్ల నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య రానున్న ఐదేళ్లలో 58.4 శాతం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. చదవండి👉 అమెజాన్ ఉద్యోగుల తొలగింపుల్లో ఊహించని ట్విస్ట్! -
వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?
సాక్షి, ముంబై: ఫోర్బ్స్ 2023 అపర కుబేరుల ప్లేస్‌లో మూడో స్థానంలో నిలిచిన ఇండియాలో కొత్తగా 16 మంది కొత్త బిలియనీర్లు చోటు దక్కించు కున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. ఈ మేటి మహిళల్లో ఒకరు వినోద్ రాయ్ గుప్తా.రూ. 33 వేల కోట్ల నికర విలువతో భారతదేశంలో 4వ అత్యంత సంపన్న మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా) హావెల్స్ ఇండియా అధినేత వినోద్ రాయ్ దేశీయ నాల్గవ సంపన్న మహిళ. మొత్తం సంపన్నుల జాబితాలో 40 వ స్థానం. హావెల్స్ ఇండియాలో ఈమెకు 40 శాతం వాటా ఉంది. హావెల్స్ ఇండియాను 1958లో వినోద్ రాయ్ గుప్తా దివంగత భర్త ఖిమత్ రాయ్ గుప్తా స్థాపించారు. ఇప్పుడు అతని కుమారుడు అనిల్ రాయ్ గుప్తా ప్రస్తుతం హావెల్స్ ఇండియా చైర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. హావెల్స్ ఇండియా ఎలక్ట్రికల్ అండ్ లైటింగ్ ఫిక్చర్ల నుండి ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ల వరకు ప్రతిదీ తయారు చేస్తుంది. హావెల్స్‌కు 14 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాని ఉత్పత్తులు ఇప్పుడు 50కి పైగా దేశాల్లో అమ్ముడవుతున్నాయి. క్విమత్ రాయ్ గుప్తా 10వేల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రికల్ బిజినెస్ ప్రారంభించగా ఇపుడు వారి కుమారుడు అనిల్ రాయ్ గుప్తా నాయకత్వంలో రూ. 74,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో వ్యాపార రంగంలో రాణిస్తోంది. (జీపే యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్ సంచలనం: మీ రివార్డ్స్ చెక్ చేసుకోండి!) ఫోర్బ్స్ తన వార్షిక బిలియనీర్ల జాబితాలను 2023 ఏప్రిల్ 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భారతదేశంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితా కూడా ఉంది. ఈ లిస్ట్‌లో రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ దేశీయంగా, ఆసియా రెండింటిలోనూ టాప్ ప్లేస్‌లో నిలవగా, అత్యంత ధనవంతుడుగా నిలిచారు. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం, భారతదేశంలోని ఐదుగురు సంపన్న మహిళలు సావిత్రి జిందాల్, రోహికా సైరస్ మిస్త్రీ, రేఖా ఝన్‌ఝన్‌వాలా, వినోద్ రాయ్ గుప్తా, లీనా తివారీ ఉన్నారు. -
ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?
ఆసియా లేటెస్ట్ బిలియనీర్ ఎవరంటే రిలయన్స్ ముఖేశ్ అంబానీ అని ఠక్కున చెప్పేస్తాం. ఫోర్బ్స్ తన 2023 ప్రకారం 99 ఏళ్ల వయసులో బిలియనీర్ అయిన కేషుబ్ మహీంద్రాను గురించి తెలుసా? రూ. 9వేల కోట్లకు పైగా నికర విలువతో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా నిలిచిన కేషుబ్ మహీంద్రా తెలుసుకుందాం. ఫోర్బ్స్ తన 2023 సంపన్నుల జాబితాలో భారతదేశంలో అత్యంత ధనవంతుడు ము్ఖేశ్ అంబానీ నిలిచారు. ఈ జాబితాలో భారత్ కొత్తగా 16 మంది బిలియనీర్లు చేరగా అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అయితే 99 ఏళ్ల కేశబ్ మహీంద్రా భారతదేశంలో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా నిలిచారు. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్ కేషుబ్ మహీంద్రా. దిగ్గజ పారిశ్రామికవేత్త, మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్రకు మేనమామ. కేశబ్ మహీంద్రా 5 దశాబ్దాల పాటు మహీంద్ర గ్రూప్‌నకు నాయకత్వం వహించి కంపెనీనీ విజయతీరాలకు చేర్చారు. మహీంద్ర గ్రూపు ప్రస్థానంలో కీలక ప్రాత పోషించిన ఆయన 2012 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రాను 1945లో కేషుబ్ తండ్రి జేసీ మహీంద్రా స్థాపించారు. (IPL 2023: షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు) 1923, అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించిన కేషుబ్ మహీంద్రా ఈ ఏడాది చివర్లో 100 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. వార్టన్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ చేసి అనంతరం, అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కేషుబ్ తన తండ్రికి చెందిన కంపెనీలో 1947లో చేరారు. 1963లో కంపెనీకి ఛైర్మన్ అయ్యారు. మంచి కార్పొరేట్ గవర్నెన్స్, నైతికతకు ప్రసిద్ధి చెందిన కేషుబ్ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక కమిటీలలో ఆయన ప్రాతినిధ్యం ఉంది. 2007లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. ఫిలాంత్రపీలో కూడా కేషుబ్ అగ్రగణ్యుడే. అసోచామ్ అపెక్స్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు కూడా. 1987లో, ఫ్రెంచ్ ప్రభుత్వ చెవాలియర్ డి ఎల్'ఆర్డ్రే నేషనల్ డి లా లెజియన్ డి'హోన్నూర్ అవార్డును అందుకున్నారు. 2004 నుండి 2010 వరకు న్యూ ఢిల్లీలోని వాణిజ్యం పరిశ్రమల ప్రధాన మంత్రి మండలిలో సభ్యుడుగాపనిచేశారు. తొలుత మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశంలో విల్లీసీప్లను అసెంబ్లింగ్ చేసేది. మహీంద్రా అండ్ మహీంద్రాను అసెంబ్లర్ నుండి భారీ సమ్మేళనంగా తీర్చిదిద్దడంలో కేషుబ్ పాత్ర కీలకం. ఆధ్వర్యంలోని కంపెనీ సాఫ్ట్వేర్ సేవలు, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో విజయవంతంగా ప్రవేశించింది. ప్రస్తుతం టాప్ఎస్యూవీల అతిపెద్ద తయారీదారుగా పాపులర్ అయింది.మహీంద్రా థార్, మహీంద్రా టీయూవీ 300,మహీంద్రా ఎక్స్‌యూవీ 700, మహీంద్రా బొలెరో నియో మొదలైన వాటితో సహా దాని పోర్ట్‌ఫోలియోలో అనేక విజయవంతమైన కార్లు ఉన్నాయి. -
అయ్యో.. ఎలన్ మస్క్! సంచలన పతనం
ఎలన్ మస్క్.. వ్యాపార రంగంలోనే కాదు సోషల్ మీడియాలోనూ ఓ ట్రెండ్ సెట్టర్. గత రెండేళ్లుగా ప్రపంచ మీడియా సంస్థల్లో ఆయన పేరు నానని రోజంటూ లేదు. అంతలా సంచలనాలకు తెర లేపాడు ఆయన. పైపెచ్చు 2021 జనవరిలో వ్యక్తిగత సంపదను 200 బిలియన్ల మార్క్ దాటించుకుని.. మానవ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తద్వారా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను దాటేసి.. అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతూ వస్తున్నాడు. అయితే.. ట్విటర్ కొనుగోలు నేపథ్యంలో ఎలన్ మస్క్‌కు బ్యాడ్ టైం నడుస్తున్నట్లు ఉంది. 2022 ఎలన్ మస్క్‌కు ఏరకంగానూ కలిసి రాలేదు. ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ పరిణామాలేవీ ఆయన ఖాతాలో పడకపోవడం గమనార్హం. పైగా ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం.. ప్రపంచ అపర కుబేరుల జాబితా నుంచి రెండో స్థానానికి పడిపోయారు ఆయన. ఏడాది చివరకల్లా.. 150 బిలియన్ డాలర్లకు దిగువకు పడిపోయింది ఆయన సంపద. ఒకానొక టైంకి 137 బిలియన్ డాలర్లకు చేరుకుంది కూడా. చరిత్రలో తొలి ట్రిలియన్ బిలియనీర్‌గా నిలిచిన ఘనత ఎలన్ మస్క్‌దే. నవంబర్ 4, 2021 నాటికి ఆయన సంపద అక్షరాల 340 బిలియన్ డాలర్లు. కానీ, ఆ మార్క్‌ను ఆయన ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు!. ఎలన్ మస్క్ సంపద తరుగుతూ వస్తోంది. మరోవైపు ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినా.. ఆయన సంపదపై ఆ ప్రభావం పడదని ఆర్థిక విశ్లేషకులు భావించారు. కానీ, అ అంచనా తప్పింది. టెస్లా షేర్లు గణనీయంగా, క్రమం తప్పకుండా పతనం అవుతుండడం(2022లో ఏకంగా 65 శాతం దాకా పతనం అయ్యింది) ఆయన సంపద కరిగిపోవడానికి ప్రధాన కారణంగా మారింది. అయితే ఎలన్ మస్క్ మాత్రం టెస్లా అద్భుతంగా పని చేస్తోందని, అది అంతకు ముందు కంటే అద్భుతంగా ఉందంటూ డిసెంబర్ 16వ తేదీన ఒక ట్వీట్ చేశాడు. గణాంకాలు మాత్రం విశ్లేషకుల అంచనాలకు తగ్గట్లే ఉన్నాయి. మిగతా సొంత కంపెనీలతో(న్యూరాలింక్, ఓపెన్ ఏఐ, స్పేస్ఎక్స్.. దీని అనుబంధ సంస్థ స్టార్‌లింక్, ది బోరింగ్ కంపెనీలతో ఎలన్ మస్క్‌కు పెద్దగా ఒరిగింది కూడా ఏం లేకపోవడం గమనార్హం!. ఈ కథనం రాసే సమయానికి ఫోర్బ్స్ లిస్ట్‌లో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ అర్నాల్ట్ & ఫ్యామిలీ 179 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో ఎలన్ మస్క్ 146 బిలియన్ డాలర్లత సంపదతో నిలిచారు. అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 200 బిలియన్ డాలర్ల సంపదను ఆయన కోల్పోయారన్నమాట. మానవ చరిత్రలో ఇప్పటిదాకా ఇంతలా ఓ వ్యక్తి సంపదను కోల్పోయిందే లేదు. ఇక.. భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ 127 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: రిలయన్స్‌ను ముకేశ్ ఎలా ఉరుకులు పెట్టించారో తెలుసా? -
Elon Musk: అలా దిగజారి ఆ వెంటనే..
న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత ధనికుడి స్థానాన్ని ఎలన్ మస్క్ కోల్పోయాడు. అవును.. ఫోర్బ్స్ జాబితాలో ఆయన రెండో స్థానానికి దిగజారాడు. టెస్లా షేర్లు భారీగా పతనం కావడం, ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన నేపథ్యంలో.. ఆయన సంపద కరిగిపోయి ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే.. ఎలన్ మస్క్ రెండో స్థానంలోకి చేరిన వేళ.. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడిగా ఫ్రెంచ్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ అర్నాల్ట్ నిలిచినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. అయితే ఈ పరిణామం మారడానికి ఎంతో టైం పట్టలేదు. వ్యక్తిగత సంపదను పెంచుకుని మస్క్ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. అర్నాల్ట్ సంపద విలువ 184.7 బిలియన్ డాలర్లు. అలాగే.. మస్క్ సంపద 185.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ లిస్ట్‌లో మూడో స్థానంలో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ మూడోస్థానంలో, జెఫ్ బెజోస్ ఐదవ స్థానంలో, వారెన్ బఫెట్ ఐదో స్థానంలో నిలిచారు. భారత్ నుంచి ముకేశ్ అంబానీ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. కిందటేడాది సెప్టెంబర్‌లో ప్రపంచంలో అత్యంత ధనికుడిగా ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను కిందకు నెట్టేసి.. ఎలన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచాడు. అప్పటి నుంచి ఆయన అదే స్థానంలో కొనసాగుతూ వస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో ఆయన సంపద ఏకంగా 200 బిలియన్ డాలర్లు దాటడం గమనార్హం. -
‘అదిరిందయ్యా అదానీ’..ప్రపంచ కుబేరుల జాబితాలో దూసుకెళ్తున్న గౌతమ్ అదానీ
ప్రముఖ బిలియనీర్ గౌతమ్ అదానీ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌ను అధిగమించారు. మూడు స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత రెండు వారాలుగా అమెరికన్ స్టాక్ మార్కెట్ వాల్ స్ట్రీట్‌లో నమోదైన కంపెనీల షేర్ల కంటే..అదానీ కంపెనీల షేర్లు లాభాల పంట పండించాయి. వెరసీ సోమవారం నాటికి అదానీ సంపదలోకి మరో 314 మిలియన్ డాలర్లు వచ్చి చేరగా..ఆయన మొత్తం సంపద 131.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ప్రముఖ ఫ్యాషన్ సంస్థ లూయిస్ విట్టన్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 156.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ తర్వాతి స్థానంలో అదానీ నిలిచారు. అదానీకి కలిసొచ్చింది ఆర్ధిక పరమైన అంశాల్లో ఆర్బీఐ ఆచితూచి అడుగులు వేయడం, చమురు ధరలు తగ్గే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మూడో వారంలో దేశీయ స్టాక్ సూచిలకు పై అంశాలు కలిసొచ్చాయి. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లో షేర్లు భారీ లాభాలతో పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో అదానీ షేర్లు పుంజుకోవడం, ప్రపంచంలో ధనవంతుల జాబితాలో జెఫ్బెజోస్ను వెనక్కి నెట్టడం వెనువెంటనే జరిగిపోయాయి. బెజోస్ షాక్.. అదానీ రాక్ గత గురువారం అమెజాన్ చరిత్రలో అత్యంత దారుణమైన రికార్డులు నమోదయ్యాయి. సెలవులు, షాపింగ్ సీజన్ ఉన్నప్పటికీ అమెజాన్. కామ్ సేల్స్ తగ్గిపోయాయి. దీంతో ఆ ఒక్కరోజే మార్కెట్ ముగిసే సమయానికి అమెజాన్ షేర్లు 21 శాతానికి క్షీణించడంతో ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో జెఫ్ బెజోస్ తన ఉనికిని కోల్పోతుండగా అదానీ ఒక్కొక్కరిని దాటుకుంటూ వెళుతున్నారు. స్టాక్ మార్కెట్లో గందర గోళం 126.9 బిలియన్ డాలర్ల సంపదతో ధనవంతుల జాబితాలో జెఫ్ బెజోస్‌ను అదానీ అధిగమించినప్పటికీ..ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న గందర గోళంతో ఫోర్బ్స్ జాబితాలోని ర్యాంకింగ్‌లు మారుతున్నాయి. బిలియనీర్ల మ్యూజికల్ చైర్ గేమ్ స్టాక్ మార్కెట్ల పనితీరుతో బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ సంపదలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటి ఆధారంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ మారుతోంది. అయినప్పటికీ ఈ ముగ్గురు బిలయనీర్ల మధ్య వ్యత్యాసం సుమారు 30 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇటీవలి వారాల్లో గౌతమ్ అదానీ, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్ మధ్య మ్యూజికల్ చైర్ గేమ్ నడుస్తోంది. 2,3,4 ఇలా ధనవంతుల జాబితాల్లో వారి స్థానం కోసం పోటీపడుతున్నప్పటికీ ఎలాన్ మస్క్ మాత్రం 223.8 నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రథమ స్థానంలో దూసుకెళ్తున్నారు. -
బిల్ గేట్స్ నిర్ణయం.. ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలోకి గౌతమ్ అదానీ!
గత రెండు సంవత్సరాలుగా భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దూకుడు మామూలుగా లేదు. అదానీ సంస్థలు కూడా ఎన్నడూ లేని విధంగా లాభాల బాట పడుతూ ఎందులోనూ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నాయి. తాజాగా ప్రపంచ కుబేరుల్లో గౌతమ్ అదానీ తన స్థానాన్ని ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నారు. అయితే ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో ఆయన ఆస్తుల విలువ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఫోర్స్బ్ ప్రకటించిన సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి అదానీ నాలుగో స్థానానికి దూసుకెళ్లారు. ఇటీవల బిల్ గేట్స్ 20 బిలియన్ డాలర్లను గేట్స్ ఫౌండేషన్‌కు విరాళమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం అనంతరం గేట్స్ ఒక స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అదాని 114 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానానికి ఎగబాకారు. ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల విషయానికొస్తే.. అత్యధిక సంపాదన 230 బిలియన్ డాలర్లతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలవగా, రెండు, మూడు స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్డ్, అమెజాన్ అధినేత జెప్ బెజోస్ లు నిలిచారు. నాలుగో స్థానంలో గౌతమ్ అదాని నిలిచారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మాత్రం పదో స్థానంలో కొనసాగుతున్నారు. చదవండి: Go First Flights: గాల్లో ఉండగానే ఇంజన్ లోపాలు, ఒకేసారి రెండు విమానాల్లో -
ఫోర్బ్స్ టాప్ 2000లో రిలయన్స్ జోరు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా 2000 టాప్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 53వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు ఎగబాకింది. 2022 సంవత్సరానికి గాను అగ్రశ్రేణి కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. అమ్మకాలు, లాభాలు, అసెట్లు, మార్కెట్ విలువ ఆధారంగా ఈ దిగ్గజాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఇందులో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 105వ ర్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 153వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్ 204వ ర్యాంకు దక్కించుకున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ 104.6 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. తద్వారా 100 బిలియన్ డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసిన తొలి భారతీయ కంపెనీగా నిల్చిందని ఫోర్బ్స్ తెలిపింది. ‘గ్లోబల్ 2000 జాబితాలో రిలయన్స్ రెండు స్థానాలు ఎగబాకి 53వ ర్యాంకుకు చేరుకుంది. భారతీయ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిల్చింది. ఈ ఏడాది తొలినాళ్లలో రిలయన్స్ అధినేత సంపద విలువ 90.7 బిలియన్ డాలర్లుగా లెక్కించాం. తద్వారా ఈ ఏడాది టాప్ బిలియనీర్ల జాబితాలో ఆయన 10వ స్థానంలో నిల్చారు‘ అని వివరించింది. గ్లోబల్ 2000 జాబితాలో ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే అగ్రస్థానంలో నిల్చింది. 2003లో ఫోర్బ్స్ ఈ లిస్టును ప్రకటించడం ప్రారంభించినప్పట్నుంచి బఫెట్ కంపెనీ నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇదే ప్రథమం. ఇక గత తొమ్మిదేళ్లుగా అగ్రస్థానంలో ఉంటున్న ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా తాజా లిస్టులో రెండో స్థానంలో నిల్చింది. సౌదీ ఆరామ్కో, జేపీమోర్గాన్ చేజ్, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంకు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. లిస్టులో చోటు దక్కించుకున్న ఇతర సంస్థలు.. ► ఓఎన్జీసీ (228 ర్యాంకు), హెచ్డీఎఫ్సీ (268), ఐఓసీ (357), టీసీఎస్ (384), టాటా స్టీల్ (407), యాక్సిస్ బ్యాంక్ (431) ఈ జాబితాలో ఉన్నాయి. ► అపర కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన సంస్థలు ఈసారి లిస్టులో కొత్తగా చోటు దక్కించుకున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ (1,453 ర్యాంకు), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (1,568), అదానీ గ్రీన్ ఎనర్జీ (1,570) అదానీ ట్రాన్స్మిషన్ (1,705), అదానీ టోటల్ (1,746) వీటిలో ఉన్నాయి. అదానీ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్‌ను అధిగమించి అయిదో స్థానం దక్కించుకున్నారు. ► చమురు, గ్యాస్, మెటల్స్ దిగ్గజం వేదాంత ఏకంగా 703 స్థానాలు ఎగబాకి 593వ ర్యాంకు దక్కించుకుంది. ► ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్టులో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థల్లో అత్యధికంగా ఇంధన, బ్యాంకింగ్ రంగ కంపెనీలే ఉన్నాయి. -
గుండు బాస్ ఖాతాలోకి లక్షా నలభై వేల కోట్లు!
ఆయన తల్చుకుంటే.. బోడిగుండుపైన జుట్టు మొలిపించుకోవడం ఎంత సేపు? కానీ, ఆయనకది ఇష్టం లేదు. ఎందుకంటే.. సక్సెస్ అనేది లుక్కులో కాదు.. లక్కులో, హార్డ్ వర్క్‌లో ఉందని నమ్ముతున్నాడాయన. అందుకే గుండ్ బాస్‌గా పాపులర్ అయ్యాడు. ఆయనే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. జెఫ్ బెజోస్(58).. అమెజాన్ అనే ఈ-కామర్స్ కంపెనీతో సంచలనాలకు నెలవయ్యాడు. అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి పక్కకు జరిగాక.. సొంత స్పేస్ కంపెనీ బ్లూఆరిజిన్ మీదే ఆయన ఫోకస్ ఉంటోంది. అయితే గత కొంతకాలంగా ఆయనకు కలిసి రావడం లేదు. పెద్దగా లాభాలు రాకపోవడంతో.. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు ఆయన(ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం). ఈ తరుణంలో తాజా పరిణామాలు బెజోస్‌కి బాగా కలిసొచ్చాయి. అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ అమెజాన్ ఆమధ్య ఈవీ కంపెనీ రివియన్‌లో పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు ప్రైమ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో షేర్ల ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 15 శాతం పెరగ్గా.. అక్టోబర్ 2009 నుంచి ఇదే అధికం కావడం గమనార్హం. మరోవైపు అమెజాన్ కేవలం అడ్వర్టైజింగ్ బిజినెస్‌ల ద్వారా 31 బిలియన్ డాలర్లు సంపాదించుకోవడం గమనార్హం. ఈ దెబ్బతో బెజోస్ వ్యక్తిగత సంపద 20 బిలియన్ డాలర్లకు(మన కరెన్సీలో లక్షా నలభై వేల కోట్ల రూ.) పెరిగింది. ప్రస్తుతం ఈయన మొత్తం సంపద విలువ.. 164.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒకవైపు ఫేస్బుక్ యూజర్ల ఎఫెక్ట్‌తో జుకర్‌బర్గ్ ఒక్కరోజులోనే 2.2 లక్షల కోట్ల రూపాయలు పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్‌తో రియల్ టైం బిలియనీర్ల జాబితాలో దిగజారిపోగా.. భారతీయ బిజినెస్ టైకూన్స్ ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు జుకర్‌బర్గ్ కంటే పైస్థానాల్లోకి ఎగబాకడం తెలిసిందే. చదవండి: అపర కుబేరుడి పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం! -
లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1
Elon Musk Wealth Drops 15billion Dollars as tech stocks plunge: షేర్ మార్కెట్ పరిణామాలు.. ఎప్పుడు? ఎవరి తలరాతను ఎలా? మార్చేస్తాయో ఊహించడం కష్టం. ఒక్కపూటలో కాసులు కురిపించి.. అదేటైంలో రోడ్డు మీదకు లాగేస్తుంది కూడా. ఐపీవో పరిణామాలైతే మరీ ఊహించని రేంజ్లో ఉంటున్నాయి. అయితే అపరకుబేరుల విషయంలో ఈ పరిణామాలన్నీ పెద్దగా అనిపించకపోయినా.. వాళ్ల ర్యాంకింగ్‌లను మాత్రం పైకి కిందకి మార్చేస్తుందన్నది ఒప్పుకోవాల్సిన విషయం. ఈ తరుణంలో లక్ష కోట్లకుపైగా పొగొట్టుకున్నా ఆ అయ్యగారు.. ఇంకా నెంబర్ వన్ పొజిషన్లోనే కొనసాగుతున్నారు. ఇంతకీ ఈ అయ్యగారు ఎవరో కాదు.. స్పేస్ఎక్స్ అధినేత, అపరకుబేరుడి జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఎలన్ మస్క్. శుక్రవారం అమెరికా ఈ-వెహికిల్స్ తయారీదారు కంపెనీ ‘టెస్లా’ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఈ పరిణామంతో ఏకంగా 15.2 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయాడు ఎలన్ మస్క్. ఈ విలువ మన కరెన్సీలో లక్ష కోట్ల రూపాయలకు పైనే. ఇదిగాక స్పేస్ఎక్స్ షేర్ల పతనంతో మరో బిలియన్ డాలర్లు(ఏడున్నర వేల కోట్ల రూపాయలకుపైనే) నష్టపోయాడు. మొత్తంగా ఒక్కరోజులోనే 16.2 బిలియన్ డాలర్ల(లక్షా నలభై వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టంతో.. ప్రస్తుతం ఎలన్ మస్క్ సంపద విలువ 266.8 బిలియన్లుగా ఉంది. ఇక ఈ లిస్ట్‌లో మస్క్ మొదటి ప్లేస్‌లో ఉండగా.. రెండో ప్లేస్‌లో అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ ఉన్నాడు. 195.6 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ బ్లూ ఆరిజిన్ బాస్. ఇక అమెజాన్ షేర్లు కూడా 1.20 శాతం పడిపోవడంతో.. 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయాడు బెజోస్. జాబితాలో బ్రిటిష్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 187.5 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, బిల్‌గేట్స్ (136.4 బిలియన్ డాలర్లు) నాలుగో ప్లేస్‌లో, లారీ పేజ్ (121.5 బిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఒమిక్రాన్ ప్రభావంతో మార్కెట్లన్నీ పతనం దిశగా పయనిస్తుండగా.. ఫోర్బ్స్ టాప్ టెన్‌లో ఉన్న బిలియనీర్లంతా షేర్ల నష్టాలతో భారీగా సంపదను కోల్పోవడం విశేషం. ఎటు చూసినా టాపే దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్లాలోని తన షేర్లను అమ్మేసుకున్నాడు ఎలన్ మస్క్. పైసా తీసుకోని జీతగాడిగా(జీరో శాలరీ) కేవలం టెస్లా షేర్లతోనే లాభాలు అందుకుంటున్న ఎలన్ మస్క్.. ఈ మధ్య 10 శాతం వాటా అమ్మేసుకుంటున్నట్లు ప్రకటించి ఆసక్తికర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి అమ్మకంతో 10.9 బిలియన్ డాలర్ల విలువైన 10.1 మిలియన్ షేర్లు అమ్మేసుకున్నాడు. ఇంకా దాదాపు ఏడు మిలియన్లు అమ్మేయాల్సి ఉంది. మరి మొత్తంగా తన వాటాగా ఉన్న 17 మిలియన్ షేర్లను వదులుకోవడం ద్వారా మస్క్ నష్టపోడా? బిలియనీర్ జాబితాలో కిందకి జారిపోడా? అనే అనుమానాలు చాలామందికే కలుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. షేర్ల అమ్ముకోవడం ద్వారా కట్టాల్సిన ట్యాక్స్ నుంచి భారీ మినహాయింపు పొందాడు ఎలన్ మస్క్. పైగా ఈ అమ్మకాల ద్వారా వాటిల్లిన నష్టం(1,084 డాలర్లు) నుంచి తప్పించుకుని లాభపడ్డాడు కూడా!. ఇక ఈ ఏడాది మొదట్లో ఏకంగా 384 బిలియన్ డాలర్ల సంపదతో(266.8 బిలియన్లకు చేరుకుంది ప్రస్తుతం) రిచ్చెస్ట్ మ్యాన్‌గా అవతరించాడు ఎలన్ మస్క్. మరోవైపు స్పేస్ఎక్స్ నుంచి సుమారు 10 బిలియన్ డాలర్ల సంపదను పోగేశాడు. ఇదీగాక ఈ మధ్యే కేవలం స్పేస్ఎక్స్ సంపదే వంద బిలియన్ల డాలర్లకు చేరుకుంది. తాజా నివేదికల ప్రకారం.. ప్రపంచంలో రెండో అతిపెద్ద విలువైన ప్రైవేట్ కంపెనీగా స్పేస్ఎక్స్ అవతరించింది. ఇవిగాక భవిష్యత్తులో స్పేస్ టూరిజానికి ఉన్న డిమాండ్, నాసా లాంటి ఏజెన్సీలతో కాంటాక్ట్‌లు, శాటిలైట్ ఇంటర్నెట్ ‘స్టార్‌లింక్’ సేవలతో మస్క్ సంపద మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఎలా చూసుకున్నా అయ్యగారి నెంబర్ వన్‌స్థానానికి ఇప్పట్లో వచ్చిన నష్టమేమీ లేదని ఫోర్బ్స్ ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది ఈ మధ్య. చదవండి: ట్విటర్ సీఈవో పరాగ్‌పై వివాదాస్పద ట్వీట్ -
ఎలాన్ మస్క్, జెఫ్‌బెజోస్: వీళ్లిద్దరూ ఏక్ నెంబర్ 'పిసినారులు'
టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌లు బిజినెస్ టైకూన్స్. ఫోర్బ్స్ తాజా గణంకాల ప్రకారం..ప్రపంచ అపర కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ మొదటిస్థానం,బెజోస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. సంపాదించడంలో ఒకరితో ఒకరూ పోటీ పడడమే కాదు..దానం చేసే విషయంలో ఏక్ నెంబర్ పిసునారులుగా ప్రసిద్దికెక్కారు. ఫోర్బ్స్ సర్వేలో ఎలాన్ మస్క్, జెఫ్బెజోస్లకు డబ్బు విలువ తెలియడం చేత ఆచి తూచి ఖర్చు చేసినా...పొదుపు,ఆదాను మరీ పీక్లెవెల్స్కి తీసుకెళ్లి ఆల్‌టైమ్ పిసినారి కోటీశ్వరుల జాబితాలో చేరిపోయారు.అది ఎలా అంటారా? ఫోర్బ్స్ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ప్రపపంచ ధనవంతుల జాబితాలో ఉన్న వ్యక్తులు తమ జీవితకాలంలో ఎంత దానం చేశారనే విషయాన్ని నిర్ధారించే ప్రయత్నం చేసింది. అందులో ప్రైవేట్ ఫౌండేషన్లు, డోనర్ అడ్వైజ్ ఫండ్స్ (ఓ చారిటీ సంస్థకు తరుపు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేయడం, వాటి వినియోగం) ను పరిగణలోకి తీసుకోకుండా ధనవంతులు సంపాదించిన మొత్తం ఆస్తిని వాళ్లు దానం చేసిన మొత్తాన్ని డివైడ్ చేయగా వచ్చిన మొత్తాన్ని 1శాతం కంటే తక్కువ, 1శాతం - 5శాతం మధ్య, 5శాతం - 10శాతం మధ్య, 10శాతం -20శాతం మధ్య, 20శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇలా ఐదు భాగాలుగా విభజించింది. ఇందులో సగటు ఒక అమెరికా పౌరుడు కుటుంబం అంతా జీవిత కాలంలో చేసే దానం కంటే ఎలాన్ మస్క్, జెఫ్బెజోస్లు ఇప్పటి వరకు చేసిన దానం చాలా తక్కువని తేలింది. అపర కుబేరులే కానీ ఏక్ నెంబర్ పిసినారులు సగటు ఒక అమెరికన్ కుటుంబం వారి జీవితం మొత్తంలో నికర విలువ దాదాపు $ 120,000 డాలర్లు ఉంటే...అందులో స్వచ్ఛంద సంస్థకు $1,200 ఇస్తే బెజోస్ - మస్క్ ఇచ్చేది చాలా తక్కువని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఈ ఏడాది బిలియనీర్ల జాబితాలో ఉన్న 400 మందిలో కేవలం 19 మంది మాత్రమే తమ సంపదలో 10శాతం లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చారు. రికార్డ్ స్థాయిలో 156 మంది 1శాతం కంటే తక్కువ ఇచ్చారు. వారిలో బెజోస్- ఎలాన్ మస్క్‌లు కూడా ఉన్నారు.జెఫ్ బెజోస్ మాజీ భార్య మెక్కెంజీ తన సంపదలో 13శాతం దానం ఇవ్వడం మరింత ఆసక్తి కరంగా మారింది. చదవండి: దుల్కర్ సల్మాన్ సినిమాను మించిన సీన్..5 ఏళ్లలో.. -
వారం తిరగకుండానే మారిన జాతకాలు! మళ్లీ టాప్‌లోకి..
అపర కుబేరుల రేసు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. బిజినెస్ టైకూన్ ఎలన్ మస్క్ రెండో స్థానం నుంచి మళ్లీ మొదటి ప్లేస్‌కు వచ్చేశాడు. వారం క్రితం ఫోర్బ్స్ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో మస్క్ రెండో ప్లేస్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే టెస్లా స్టాక్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో మస్క్ ఒక్కసారిగా టాప్ పొజిషన్లో దూసుకొచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హయ్యెస్ట్ పాయింట్‌కు రీచ్ అయిన టెస్లా షేర్ల ధరలు.. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. సోమవారం 2.2 శాతం పెరుగుదలతో 791.36 డాలర్ల వద్ద మార్కెట్ ముగిసింది. దీంతో సోమవారం నాటికల్లా మస్క్ సంపాదనను లెక్కలోకి తీసుకున్న తర్వాత టాప్ బిలియనీర్‌గా నిర్ధారించారు. సంపద విలువ 3.8 బిలియన్ డాలర్ల పెరగుదల కారణంగా.. మస్క్ మొత్తం సంపద విలువ 203.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో జెఫ్ బెజోస్‌ను దాటేసి మొదటి స్థానానికి చేరాడు ఎలన్ మస్క్. తాజా గణంకాల ప్రకారం.. ప్రపంచ అపర కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ మొదటిస్థానం, బెజోస్ రెండు, బెర్నార్డ్ ఆర్నాల్ట్ మూడు, బిల్‌గేట్స్ నాలుగు, మార్క్ జుకర్‌బర్గ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రధానంగా అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల ద్వారా బెజోస్, మస్క్‌ల మధ్య వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: మీకు భూమ్మీది సమస్యలు కనడడం లేదా?.. బిల్‌గేట్స్ ఫైర్ ఇదిలా ఉంటే గత కొంతకాలంగా అమెజాన్ షేర్లు మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దీనికితోడు తాజాగా అమెజాన్ స్టాక్ 0.6 శాతం పడిపోవడంతో బెజోస్ సంపద విలువ 197.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విశేషం ఏంటంటే.. ఈ ఏడాది జనవరిలో టెస్లా వ్యాపారం తారాస్థాయిలో జరిగింది. అయినప్పటికీ అప్పటికంటే ఇప్పుడే మస్క్ సంపద బాగా పెరగడం. టెస్లా విలువ 792 బిలియన్ డాలర్లుకాగా, స్పేస్ ఎక్స్ 74 బిలియన్ డాలర్లు ఉంది. ఈ ఏప్రిల్‌లో ఈక్విటీ ఫండింగ్ ద్వారా 1.16 బిలియన్ డాలర్లు సేకరించగలిగింది. ఇదిలా ఉంటే ఒక్క 2020లోనే మస్క్ సంపాదన 720 శాతం పెరిగి.. 125 బిలియన్ డాలర్లను తెచ్చిపెట్టింది. ► 200 బిలియన్ డాలర్ల సంపదను టచ్ చేసిన మూడో బిలియనీర్. ► ఇంతకు ముందు ఈ రికార్డు జెఫ్ బెజోజ్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఈ ఫీట్ దక్కించుకున్నారు. ► అమెజాన్ ఓనర్ బెజోస్ కిందటి ఏడాది ఆగస్టులో ఈ ఫీట్ సాధించగా.. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్యాషన్&రిటైల్ ఎల్వీఎమ్హెచ్ కంపెనీ ఓనర్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ కిందటి నెలలోనే ఈ ఘనత దక్కించుకున్నాడు. ► ఇదే ఊపుగనుక కొనసాగితే 2025 నాటికి తొలి ట్రిలియనీర్(300 బిలియన్ డాలర్లు) ఘనతను మస్క్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: ఫోర్బ్స్ లిస్ట్‌లో ముకేష్ అంబానీ.. విలువెంతో తెలుసా? -
సంపాదనలో మెస్సీని దాటేశాడు.. ఏడాదికి 922 కోట్లు అర్జిస్తున్నాడు
న్యూజెర్సీ: 2021-22 సీజన్‌కు గాను ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డొ అత్యధికంగా ఏడాదికి 922 కోట్లు(125 మిలియన్ డాలర్లు) అర్జిస్తూ టాప్‌లో నిలిచాడు. ఇటీవలే జువెంటస్ క్లబ్‌ను వదిలి మాంచెస్టర్ యునైటెడ్‌కు బదిలీ అయిన సీఆర్7.. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ(811 కోట్లు)ని రెండో స్థానానికి నెట్టి టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. జీతభత్యాల ద్వారా 70 మిలియన్ డాలర్లు పొందే రొనాల్డొ.. కమర్షియల్ డీల్స్ రూపేనా మరో 55 మిలియన్ డాలర్లు జేబులో వేసుకుంటున్నాడు. మరోవైపు రొనాల్డొ సమవుజ్జీ అయిన మెస్సీ.. జీతం ద్వారా 75 మిలియన్ డాలర్లు, ఇతర ఎండార్స్మెంట్ల రూపేనా మరో 35 మిలియన్ డాలర్లు అర్జిస్తున్నాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాతి స్థానాల్లో బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మార్(95 మిలియన్ డాలర్లు), టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(90 మిలియన్ డాలర్లు), ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్(65 మిలియన్ డాలర్లు), ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్(70 మిలియన్ డాలర్లు) ఉన్నారు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. మరో దేశానికి వలస -
ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్
ఫోర్బ్స్ 2021 సంవత్సరం అత్యంత ధనవంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 10వ స్థానంలో నిలిచారు. ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్ జాబితాలో ఆసియా నుంచి చోటు సంపాదించకున్న ఏకైక వ్యక్తి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం 84.5 బిలియన్ డాలర్ల నికర విలువతో ముఖేష్ అంబానీ 10వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో వరుసగా నాలుగో సంవత్సరం కూడా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. జెఫ్ బెజోస్ ఆస్తుల నికర విలువ 177 బిలియన్ డాలర్లు. ఇక రెండవ స్థానంలో టెస్లా యజమాని ఎలోన్ మస్క్ 151 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రముఖ లగ్జరీ గూడ్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ (ఎల్వీఎమ్హెచ్) కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ 150 బిలియన్ డాలర్ల నికర విలువతో మూడో స్థానంలో ఉన్నారు. బిల్ గేట్స్ 124 బిలియన్ డాలర్ల నికర విలువతో ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఫేస్ బుక్ అధినేత 97 బిలియన్ డాలర్లతో 5వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ప్రపంచంలో నలుగురు ధనవంతులు మాత్రమే 100 బిలియన్ డాలర్లకు పైగా నికర విలువ కలిగి ఉన్నారు.(చదవండి: ఎన్హెచ్ఏఐ ఒక "బంగారు గని": నితిన్ గడ్కరీ) ఫోర్బ్స్ ప్రకారం, క్రిప్టోకరెన్సీ & స్టాక్ ధరలు ఈ ఏడాది ఆకాశాన్నంటాయి. ఫలితంగా ఫోర్బ్స్ ప్రపంచంలో 35 మంది ధనవంతుల జాబితా పెరిగింది. గత ఏడాది 2020 జాబితాలో 8 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 13.1 ట్రిలియన్ డాలర్లుకు చేరుకుంది. ఈ ఏడాది ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 493 మంది కొత్త వ్యక్తులు స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచ బిలియనీర్స్ టాప్-10 జాబితాలో ఆరుగురు వ్యక్తులు టెక్నాలజీ రంగానికి చెందిన వారు కావడం విశేషం. ఫోర్బ్స్ వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్స్ లిస్ట్ 2021: RANK NAME NET WORTH COUNTRY / TERRITORY SOURCE INDUSTRY 1 జెఫ్ బెజోస్ $177 బిలియన్లు అమెరికా అమెజాన్ టెక్నాలజీ 2 ఎలోన్ మస్క్ $151 బిలియన్లు అమెరికా టెస్లా, స్పేస్ ఎక్స్ ఆటోమొబైల్ 3 బెర్నార్డ్ ఆర్నాల్ట్ $150 బిలియన్లు ఫ్రాన్స్ ఎల్వీఎమ్హెచ్ ఫ్యాషన్ & రిటైల్ 4 బిల్ గేట్స్ $124 బిలియన్లు అమెరికా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ 5 మార్క్ జుకర్ బర్గ్ $97 బిలియన్లు అమెరికా ఫేస్ బుక్ టెక్నాలజీ 6 వారెన్ బఫెట్ $96 బిలియన్లు అమెరికా బెర్క్ షైర్ హాత్ వే ఫైనాన్స్ 7 లారీ ఎల్లిసన్ $93 బిలియన్లు అమెరికా ఒరాకిల్ టెక్నాలజీ 8 లారీ పేజ్ $91.5 బిలియన్లు అమెరికా గూగుల్ టెక్నాలజీ 9 సెర్జీ బ్రిన్ $89 బిలియన్లు అమెరికా గూగుల్ టెక్నాలజీ 10 ముఖేష్ అంబానీ $84.5 బిలియన్లు భారత్ రిలయన్స్ రిటైల్ -
ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ పేరుతో తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో ఇండో అమెరికన్ మహిళలు స్థానం సంపాదించారు. ఈ జాబితాలో.. అరిస్టా నెట్వర్క్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ 1.7బిలియన్ డాలర్ల ఆస్తులతో 16వ స్థానంలో నిలవగా.. సింటెల్ ఐటీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథి.. 1 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో 26వ స్థానంలో నిలిచారు. కాన్ఫ్లుయెంట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే 925 మిలియన్ డాలర్లు, జింగో బయోవర్క్స్ సహ వ్యవస్థాపకురాలు రేష్మా శెట్టి 750 మిలియన్ డాలర్ల ఆస్తులతో వరుసగా 29, 39వ స్థానాల్లో నిలిచారు. పెప్సికో సంస్థ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న ఇంద్ర నూయి.. 290 మిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో 91వ స్థానంలో నిలిచారు. -
వెనుకబడ్డ జెఫ్‌బెజోస్.. ప్రపంచానికి కొత్త కుబేరుడు..!
ప్రపంచ కుబేరుల జాబితాలో తాజాగా మొదటి స్థానం నుంచి జెఫ్‌బెజోస్ వైదొలిగాడు. కొత్తగా ప్రపంచ నెంబర్ వన్ సంపన్నుడిగా ప్రముఖ లగ్జరీ గూడ్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ(ఎల్వీఎమ్హెచ్) కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ అవతరించాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్ట్ మొత్తం నికర ఆస్తుల విలువ 198.9 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రెండో స్థానంలో జెఫ్ బెజోస్ 194.9 బిలియన్ డాలర్లతో కొనసాగుతున్నాడు. స్పెస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ 185. 5 బిలియన్ల డాలర్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆర్నాల్ట్ అంతకు ముందు డిసెంబర్ 2019, జనవరి 2020, మే 2021 లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. తాజాగా మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించాడు. ఎల్వీఎమ్హెచ్ కంపెనీ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 14 బిలియన్ యూరోలను ఆర్జించాడు. ఆ సమయంలో ఆర్నాల్డ్ ఎలన్ మస్క్ స్థానాన్ని దాటాడు. గత ఏడాది పోలిస్తే 38 శాతం మేర ఆర్నాల్డ్ అధికంగా ఆర్జించాడు. ఎల్వీఎమ్హెచ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 70 బ్రాండ్లను కలిగింది. లూయిస్ విట్టన్, సెఫోరా, టిఫనీ అండ్ కో, స్టెల్లా, మాక్కార్ట్నీ, గూచీ, క్రిస్టియన్ డియోర్, గివెన్చీ బ్రాండ్లను కలిగి ఉంది. -
ప్రపంచ బిలియనీర్స్‌లో మరో భారతీయుడు
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీకి చోటు దక్కింది. తాజాగా ప్రకటించిన జాబితాలో అదానీకి టాప్-20లో స్థానం లభించింది. అదానీ గ్రూపుకు చెందిన వివిధ రంగాల షేర్లు ఈ ఏడాది(2021)లో అమాంతం పెరగడంతో అతని సంపదన కూడా అదే రీతిన పెరిగింది. ఫలితంగా టాప్ 20లో స్థానం దక్కించుకున్న రెండో భారతీయునిగా తన పేరుని నమోదు చేసుకున్నాడు. రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ తరువాత టాప్-20లో చోటు దక్కించుకున్న రెండో భారతీయునిగా ఆయన గుర్తింపు పొందారు. అదానీ గ్రూపుకు ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు గనులు, పవర్ ప్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి. ఇటీవల సాంకేతిక రంగంలోనూ అదానీ గ్రూప్ అడుగుపెట్టింది. ఈ సంవత్సరం అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 96 పెరిగితే ప్రధానమైన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 90 శాతం పురోగతి సాధించింది. ఇలా పలు రంగాలల్లో ఆయన రాణిస్తున్నారు. ఇక 2020లో 16.2 బిలియన్ డాలర్లగా ఉండే అదానీ సంపద ప్రస్తుతం 59 బిలియన్ల డాలర్లకు చేరింది. ఇటీవలే ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ కంటే అదానీ 2021లో ఎక్కువ సంపాదించిన వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..అదానీ నికర విలువ 2021లో 16.2 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనితో ఈ ఏడాదిలో అత్యధికంగా సంపాదించే వ్యక్తిగా నిలిచారు. అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు ఒకటి మినహా మిగిలిన అన్నీ షేర్ల ధరలు 50 శాతం మేర పెరగడంతో అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది. ( చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్ )