ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్ | Forbes Billionaires 2021: The Richest People in the World | Sakshi
Sakshi News home page

Forbes Billionaires 2021: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ..?

Published Sun, Sep 19 2021 4:49 PM | Last Updated on Sun, Sep 19 2021 5:23 PM

Forbes Billionaires 2021: The Richest People in the World - Sakshi

ఫోర్బ్స్ 2021 సంవత్సరం అత్యంత ధనవంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 10వ స్థానంలో నిలిచారు. ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్‌ జాబితాలో ఆసియా నుంచి చోటు సంపాదించకున్న ఏకైక వ్యక్తి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం 84.5 బిలియన్ డాలర్ల నికర విలువతో ముఖేష్ అంబానీ 10వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో వరుసగా నాలుగో సంవత్సరం కూడా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. జెఫ్ బెజోస్ ఆస్తుల నికర విలువ 177 బిలియన్ డాలర్లు. 

ఇక రెండవ స్థానంలో టెస్లా యజమాని ఎలోన్ మస్క్ 151 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రముఖ లగ్జరీ గూడ్స్‌ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ (ఎల్‌వీఎమ్‌హెచ్‌) కంపెనీ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ 150 బిలియన్ డాలర్ల నికర విలువతో మూడో స్థానంలో ఉన్నారు. బిల్ గేట్స్ 124 బిలియన్ డాలర్ల నికర విలువతో ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఫేస్ బుక్ అధినేత 97 బిలియన్ డాలర్లతో 5వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ప్రపంచంలో నలుగురు ధనవంతులు మాత్రమే 100 బిలియన్ డాలర్లకు పైగా నికర విలువ కలిగి ఉన్నారు.(చదవండి: ఎన్‌హెచ్‌ఏఐ ఒక "బంగారు గని": నితిన్ గడ్కరీ)

ఫోర్బ్స్ ప్రకారం, క్రిప్టోకరెన్సీ & స్టాక్ ధరలు ఈ ఏడాది ఆకాశాన్నంటాయి. ఫలితంగా ఫోర్బ్స్ ప్రపంచంలో 35 మంది ధనవంతుల జాబితా పెరిగింది. గత ఏడాది 2020 జాబితాలో 8 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 13.1 ట్రిలియన్ డాలర్లుకు చేరుకుంది. ఈ ఏడాది ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 493 మంది కొత్త వ్యక్తులు స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచ బిలియనీర్స్ టాప్-10 జాబితాలో ఆరుగురు వ్యక్తులు టెక్నాలజీ రంగానికి చెందిన వారు కావడం విశేషం.

ఫోర్బ్స్ వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్స్ లిస్ట్ 2021:

RANK NAME NET WORTH COUNTRY / TERRITORY SOURCE INDUSTRY
1 జెఫ్ బెజోస్ $177 బిలియన్లు అమెరికా  అమెజాన్ టెక్నాలజీ
2 ఎలోన్ మస్క్ $151 బిలియన్లు అమెరికా టెస్లా, స్పేస్ ఎక్స్ ఆటోమొబైల్
3 బెర్నార్డ్ ఆర్నాల్ట్ $150 బిలియన్లు ఫ్రాన్స్  ఎల్‌వీఎమ్‌హెచ్‌ ఫ్యాషన్  & రిటైల్ 
4 బిల్ గేట్స్ $124 బిలియన్లు అమెరికా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ
5 మార్క్ జుకర్ బర్గ్ $97 బిలియన్లు అమెరికా ఫేస్ బుక్ టెక్నాలజీ
6 వారెన్ బఫెట్ $96 బిలియన్లు అమెరికా బెర్క్ షైర్ హాత్ వే ఫైనాన్స్ 
7 లారీ ఎల్లిసన్ $93 బిలియన్లు అమెరికా ఒరాకిల్ టెక్నాలజీ
8 లారీ పేజ్ $91.5 బిలియన్లు అమెరికా గూగుల్ టెక్నాలజీ
9 సెర్జీ బ్రిన్ $89 బిలియన్లు అమెరికా గూగుల్ టెక్నాలజీ
10 ముఖేష్ అంబానీ $84.5 బిలియన్లు భారత్  రిలయన్స్     రిటైల్  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement