అమెరికన్ బిజినెస్ మేగజీన్ ఫోర్బ్స్ (Forbes) 2023 సంవత్సరానికి గానూ ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఫోర్బ్స్ విడుదల చేసిన 37వ ఎడిషన్‌లో ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తిరిగి టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నారు. 90.8 బిలియన్ల నికర విలువతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దేశంలోని 167 మంది బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. (కళ్లద్దాల్నే నమ్ముకున్నాడు: కట్ చేస్తే..వేల కోట్ల వ్యాపారం, లగ్జరీ లైఫ్!)
2023 ఏడాది ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో 240.7 బిలయన్ డాలర్లతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. అలాగే ఫ్రాన్స్ కు చెందిన లూయీస్ వీటన్ (Louis Vuitton) బ్రాండ్ ఫౌండర్ ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్ జీన్ అర్నాల్ట్ ప్రంపంచలో టాప్ 2 ప్లేస్ కొట్టేశారు సంపద 231.4 బిలియన్ డాలర్లు. 154.9 బిలియన్ డాలర్లతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు.
ఇండియాలో టాప్-10 లో ఉన్నది వీరే
భారత్‌లో దాదాపు 167 మంది బిలియనీర్లలో, ముఖేష్ అంబానీ వరుసగా 14 సంవత్సరాలుగా భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ, సైరస్ పూనావల్లా, శివనాదా తర్వాతి స్థానాల్లో ఉన్నారు ఐదో స్థానంలో సావిత్రి జిందాల్ నిలిచారు.
♦ గౌతమ్ అదానీ 54.9 బిలియన్ డాలర్లు
♦ సైరస్ పూనావాలా 29.1 బిలియన్ డాలర్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
♦ శివ్ నాడార్ 25.6బిలియన్ డాలర్లు HCL టెక్నాలజీస్
♦ సావిత్రి జిందాల్ & కుటుంబం 20.3 బిలియన్ డాలర్లు JSW గ్రూప్
♦ దిలీప్ షాంఘ్వీ 18.2 బిలియన్ డాలర్లుసన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
♦ లక్ష్మి మిట్టల్ 16.9 బిలియన్ డాలర్లుఆర్సెలర్ మిట్టల్
♦ రాధాక్రిషన్ దమానీ 16.7 బిలియన్ డాలర్లు DMart, అవెన్యూ సూపర్ మార్కెట్లు
♦ కుమార్ బిర్లా 15.8 బిలియన్ డాలర్లు ఆదిత్య బిర్లా గ్రూప్
♦ ఉదయ్ కోటక్ 14.2బిలియన్ డాలర్లు బి కోటక్ మహీంద్రా బ్యాంక్
Comments
Please login to add a commentAdd a comment