సాక్షి,ముంబై: మెట్‌గాలాలో బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు సందడి చేశారు. అదేంటి ఫ్యాషన్ ఈవెంట్‌లో వ్యాపారవేత్తలకు ఏం పని అనుకుంటున్నారా? ఇదంతా ఏఐ ఆర్ట్ మహిమ. ఏఐ ఆర్టిస్ట్ అబూ సాహిద్ బుర్రలో వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ చిత్రాలు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఇంట్రస్టింగ్ ఫోటోలతో ఇన్‌స్టాలో పాపులర్ అవుతున్నారు. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర)
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, ట్విటర్ అధినేత, ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్‌జుకర్ బర్గ్ మెట్ గాలాకు హాజరవుతున్నట్లు ఊహించి ఈ ఫోటోలను సృష్టించారు. మిడ్ జర్నీ సాయంతోరూపుదిద్దిన ఈ ఫోటోల్లోబాబా రాందేవ్, అజీం ప్రేమ్‌జీతో పాటు, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ లాంటి దిగ్గజాల ఫోటోలు కూడా ఉండటం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి మెట్‌గాలా. ఈ ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్‌ను న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రతీ ఏడాది నిర్వహిస్తుంటారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?)
కాగా కృత్రిమ మేధస్సుతో (ఏఐ) రూపొందించిన చిత్రాలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్‌లు , డిజిటల్ ఆర్టిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రూపొందించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇండియన్ డిజిటల్ ఆర్టిస్ అబూ సాహిత్ ప్రముఖంగా నిలుస్తున్నారు. ఇన్‌స్టాలో ఆయనకు 21.6వేల గ్రామ్ ఫాలోవర్లున్నారు. ఆయన పేజీ నిండా ఇలాంటి ఫోటోలు చాలానే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment