ప్రపంచంలో కొందరి సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే లక్షల కోట్లు దాటిపోయింది. ఇప్పటి వరకూ వారిని మల్టీ బిలియనీర్లు అనేవారు. ఇప్పుడు కొత్త టైటిల్ రాబోతోంది. అదే ట్రియనీర్. అంటే 1000 బిలియన్లు ఒక ట్రిలియన్‌కి సమానం. అయితే ఇప్పటి వరకూ ఎవరూ అధికారింగా ట్రిలియనీర్ టైటిల్ పొందలేదు. ఆ టైటిల్ సాధించే దిశగా టాప్ 10లో ఎవరెవరుంటారు అనే దానిపై ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడమీ ఓ జాబితాను తయారు చేసింది.
ఎలాన్ మస్క్
ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఎలాన్ మస్క్‌కు ఉంది. ప్రస్తుతం ఆయన నెట్‌వర్త్ 195 బిలియన్ డాలర్లు. ఇది సగటున ఏడాదికి 109.88 శాతం చొప్పున పెరుగుతోంది. దీని ప్రకారం ఆయన 2027 కల్లా ట్రిలియన్ డాలర్ల సంపదను చేరుకుంటారు. ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరా లింక్ వంటి సంస్థలకు అధినేతగా ఉన్నారు.
గౌతమ్ అదానీ
భారత్‌కు చెందిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ట్రిలియనీర్ అయ్యేవారి జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఈయన 2028 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. 84 బిలియన్ డాలర్లున్న గౌతమ్ అదానీ నెట్‌వర్త్ ఏటా సగటున 122.86 శాతం వృద్ధి చెందుతోంది.
జెన్‌సెన్ హువాంగ్
చిప్ కంపెనీ ఎన్‌విడియా కోఫౌండర్, సీఈవో జెన్‌సెన్ హువాంగ్ నెట్‌వర్త్ 77 బిలియన్ డాలర్లు కాగా సంవత్సానికి 111.88 శాతం పెరుగుతోంది. దీని ప్రకారం 2028 కల్లా ట్రిలియనీర్ జాబితాలోకి చేరనున్నారు.
ప్రజోగో పంగెస్టు
బరిటో పసిఫిక్ వ్యాపార సమ్మేళం అధినేత ప్రజోగో పంగెస్టు కూడా ట్రిలియనీర్ కానున్నవారి జాబితాలో ఉన్నారు. ఈయన 2028 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. 43.4 బిలియన్ డాలర్లున్న పంగెస్టు నెట్‌వర్త్ ఏటా సగటున 135.95 శాతం పెరుగుతోంది.
బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం
ఎల్‌వీఎంహెచ్ ఫౌండర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం సంపద 223 బిలియన్ డాలర్లు. ఇది ఏటా 29.33 శాతం వృద్ధి చెందుతోంది. ఈ లెక్కన 2030 కల్లా ఆర్నాల్ట్ కుటుంబం ట్రిలియనీర్ జాబితాలోకి రానుంది.
మార్క్ బుకర్‌బర్గ్
మెటా ఫౌండర్, చైర్మన్, సీఈవో అయిన మార్క్ బుకర్‌బర్గ్ 2030 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడిగా ఉన్న బుకర్‌బర్గ్ నెట్‌వర్త్ ఏటా 35.76 శాతం వృద్ధి చెందుతోంది.
ఫిల్ నైట్ కుటుంబం
నైక్ చైర్మన్ ఫిల్ నైట్, ఆయన కుటుంబం సంయుక్తంగా 40.9 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఇది సంవత్సరానికి సగటున 7.99 శాతం పెరుగుతోంది. 2030 నాటికి ఈ కుటుంబం ట్రిలియనీర్ జాబితాలో చోటు దక్కించుకోనుంది.
ముఖేష్ అంబానీ
ఆసియా అపర కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 2033 కల్లా ట్రిలియనీర్ కానున్నారు. ఆయన నెట్‌వర్త్ ఏటా సగటున 28.25 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది.
మైకేల్ డెల్
డెల్ టెక్నాలజీస్ చైర్మన్ సీఈవో మైకేల్ డెల్ ప్రస్తుత నెట్‌వర్త్ 91 బిలియన్ డాలర్లు. ఇది సంవత్సరానికి 30.89 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. దీని ప్రకారం ఆయన 2033 నాటికి ట్రిలియన్ డాలర్ క్లబ్‌లో చేరనున్నారు.
స్టీవ్ బామర్
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ ప్రస్తుత నెట్‌వర్త్ 121 బిలియన్ డాలర్లు. 25.76 శాతం చొప్పున ఏటా వృద్ధి చెందుతోంది. ఇన్‌ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక ప్రకారం ఈయన 2034 నాటికి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment