దేశంలోని కొన్ని కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అవి మనం నిత్యం వింటున్న పేర్లే.. బాగా తెలిసిన కంపెనీలే. అయితే అవి రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటాం. 2024 ఆర్థిక సంవత్సరానికి ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ల ఆధారంగా సగటున రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
ముఖేష్ అంబానీ నేతృత్వలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.79 లక్షల కోట్ల ఏకీకృత ఎబీటా (EBITDA)ని నివేదించింది. నికర లాభం రూ. 79,020 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ సగటున రోజుకు ఆర్జిస్తున్న లాభం రూ.216.5 కోట్లు. ఈటీ మనీ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో సగటున రోజువారీ లాభంలో టాప్ టెన్ కంపెనీల జాబితా ఇదే..
లాభాల్లో టాప్10 కంపెనీలు
🔝రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216.5 కోట్లు
🔝ఎస్‌బీఐ రూ.186.7 కోట్లు
🔝హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.179.3 కోట్లు
🔝ఓఎన్‌జీసీ రూ.156.4 కోట్లు
🔝టీసీఎస్ రూ.126.3 కోట్లు
🔝ఐసీఐసీఐ బ్యాంక్ రూ.123.3 కోట్లు
🔝ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.118.2 కోట్లు
🔝ఎల్‌ఐసీ రూ.112.1 కోట్లు
🔝కోల్ ఇండియా రూ.102.4 కోట్లు
🔝టాటా మోటర్స్ రూ.87.1 కోట్లు
ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..
Comments
Please login to add a commentAdd a comment