RIL
-
రిలయన్స్‌కు రూ.24,500 కోట్ల డిమాండ్ నోటీసులు
వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి కేంద్రం షాకిచ్చింది. ఓఎన్జీసీకి చెందిన క్షేత్రం నుంచి గ్యాస్ అక్రమంగా ఉత్పత్తి చేసినందుకు, గడువులోగా బ్యాటరీ సెల్ ప్లాంటు ఏర్పాటు చేయనందుకు గాను రెండు డిమాండ్ నోటీసులు ఇచ్చింది. మొదటి దానికి సంబంధించి రూ.24,500 కోట్ల నష్టపరిహారం కట్టాలని ఆదేశించింది. ఇక రెండో అంశానికి సంబంధించి సుమారు 3.1 కోట్ల పెనాల్టీ విధించింది.కృష్ణా గోదావరి బేసిన్లో రిలయన్స్–బీపీ, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ గ్యాస్ క్షేత్రాలు పక్కపక్కనే ఉన్నాయి. ఓఎన్జీసీ క్షేత్రం నుంచి తమ క్షేత్రంలోకి వచ్చిన గ్యాస్‌ను రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ వెలికితీసి, విక్రయించుకుని, లబ్ధి పొందినట్లు అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రిలయన్స్, బీపీ నష్టపరిహారం కట్టాలనే అంశం తెరపైకి వచ్చింది. కానీ, ఈ వివాదంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో కంపెనీలకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 14న వాటిని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో తమతో పాటు నికో (గతంలో భాగస్వామి)కి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ డిమాండ్ నోటీసులు పంపినట్లు ఎక్ఛ్సేంజీలకు రిలయన్స్ తెలిపింది. ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: ఆరు నెలలు.. అన్లిమిటెడ్మరోవైపు, 10 గిగావాట్ హవర్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యంతో బ్యాటరీ సెల్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి తొలి మైలురాయి పనులను పూర్తి చేయడంలో జాప్యానికిగాను అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ స్టోరేజ్ లిమిటెడ్‌కి భారీ పరిశ్రమల శాఖ పెనాల్టీ విధించినట్లు రిలయన్స్ తెలిపింది. ఈ గడువును పొడిగించాలంటూ ప్రభుత్వాన్ని ఆర్‌ఎన్‌ఈబీఎస్‌ఎల్ కోరినట్లు వివరించింది. జనవరి 1 నుంచి మార్చి 3 వరకు లెక్కేస్తే జరిమానా రూ. 3.1 కోట్లు ఉంటుంది. -
ఒక్క కంపెనీ లాభం.. రోజుకు రూ.216 కోట్లు!
దేశంలోని కొన్ని కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అవి మనం నిత్యం వింటున్న పేర్లే.. బాగా తెలిసిన కంపెనీలే. అయితే అవి రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటాం. 2024 ఆర్థిక సంవత్సరానికి ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ఆధారంగా సగటున రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.ముఖేష్ అంబానీ నేతృత్వలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.79 లక్షల కోట్ల ఏకీకృత ఎబీటా (EBITDA)ని నివేదించింది. నికర లాభం రూ. 79,020 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ సగటున రోజుకు ఆర్జిస్తున్న లాభం రూ.216.5 కోట్లు. ఈటీ మనీ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో సగటున రోజువారీ లాభంలో టాప్ టెన్ కంపెనీల జాబితా ఇదే..లాభాల్లో టాప్10 కంపెనీలు🔝రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216.5 కోట్లు🔝ఎస్బీఐ రూ.186.7 కోట్లు🔝హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.179.3 కోట్లు🔝ఓఎన్జీసీ రూ.156.4 కోట్లు🔝టీసీఎస్ రూ.126.3 కోట్లు🔝ఐసీఐసీఐ బ్యాంక్ రూ.123.3 కోట్లు🔝ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.118.2 కోట్లు🔝ఎల్ఐసీ రూ.112.1 కోట్లు🔝కోల్ ఇండియా రూ.102.4 కోట్లు🔝టాటా మోటర్స్ రూ.87.1 కోట్లుఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ.. -
రిలయన్స్ బోనస్ ఆఫర్.. ప్రతి షేర్‌కు మరో షేర్ ఫ్రీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) బోర్డు 1:1 బోనస్ ఇష్యూని ఆమోదించింది. 2017 సెప్టెంబర్ తర్వాత కంపెనీ మొదటి బోనస్ ఆఫర్ ఇదే. దీని ద్వారా షేర్ హోల్డర్లు ప్రతి షేర్‌కు ఒక షేరును ఉచితంగా పొందుతారు.భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు తేదీకి సంబంధించిన వివరాలను తర్వాత తెలియజేయనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ అధీకృత వాటా మూలధనాన్ని రూ.15,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచే ప్రతిపాదనకు ఆర్ఐఎల్ బోర్డు ఆమోదం తెలిపింది.షేర్హోల్డర్లకు బోనస్ షేర్లను బహుమతిగా ఇవ్వడానికి కంపెనీ ప్రణాళికలను ప్రకటించడం ఇది ఐదవసారి. 1983, 1997, 2009, 2017లో ఇలాగే బోనస్ షేర్లను రిలయన్స్ అందించింది. -
రిలయన్స్ షేర్ల రికార్డ్.. రూ.18 లక్షల కోట్ల మార్కు దాటిన ఆర్ఐఎల్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర ఊపందుకుంది. మార్కెట్ విలువ ప్రకారం దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన ఆర్ఐఎల్ షేర్లు గురువారం (జనవరి 11) 2 శాతానిపైగా పెరిగాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ కంపెనీ షేరు విలువ రూ. 2,700కిపైగా పెరిగి కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఆర్ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 18 లక్షల కోట్ల మార్కును దాటింది. గతేడాది నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువ 9 శాతం తగ్గుదల నమోదైంది. అయితే ఆర్ఐఎల్ షేర్ల కొనుగోళ్లు గత కొన్ని రోజులలో ఊపందుకున్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సుమారుగా 4 శాతం పెరిగాయని ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక పేర్కొంది. డిసెంబరు త్రైమాసిక ఫలితాల సీజన్ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన బ్రోకరేజీల కొనుగోలు జాబితాలో ఆర్ఐఎల్ అగ్రస్థానంలో ఉంది. గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఇటీవల ఆర్ఐఎల్ టార్గెట్ ధరను రూ.2,660 నుంచి రూ.2,885కి పెంచగా జెఫరీస్ ఇంకా ఎక్కువగా టార్గెట్ ధరను రూ.3,125గా నిర్ణయించింది. ఇక నోమురా అయితే రూ. 2,985గా నిర్ణయించింది. త్వరలో గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ జామ్‌నగర్‌లోని ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను 2024 ద్వితీయార్థంలో ప్రారంభించనున్నట్లు ఆర్ఐఎల్ చైర్పర్సన్ ముఖేష్ అంబానీ తాజాగా ప్రకటించారు. 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ హరిత ఇంధన రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించడం, పర్యావరణహిత ఉత్పత్తులను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
రిలయన్స్ బోర్డులోకి అంబానీ వారసులు - ఆమోదం తెలిపిన షేర్ హోల్డర్స్
ఆయిల్ నుంచి టెలికామ్ వరకు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఈ సంస్థలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు వారి పిల్లలు కూడా ఒక్కో విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీ ముగ్గురూ కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ప్రారంభంలో వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన వారసత్వ ప్రణాళికను ఈ రోజు అధికారికం చేసింది. కంపెనీ బోర్డులో ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించడానికి వాటాదారులు ఆమోదించారు. కంపెనీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగటానికి షేర్ హోల్డర్ల నుంచి అంబానీ పిల్లలు ముగ్గురూ (ఇషా, ఆకాష్, అనంత్ అంబానీ) వరుసగా 98.21 శాతం, 98.06 శాతం, 92.75 శాతం ఆమోదం పొందారు. ఇదీ చదవండి: ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే.. ముఖేష్ అంబానీ మరో ఐదేళ్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను ముఖేష్ అంబానీ మరో ఐదేళ్లపాటు నిర్వహించనున్నారు. నీతా అంబానీ పదవీ విరమణ తరువాత కూడా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. దీనికి రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి ఆమోదం లబించింది. -
హోల్డింగ్ కంపెనీగా ఆర్ఐఎల్!
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) క్రమంగా హోల్డింగ్ కంపెనీగా ఆవిర్భవించే అవకాశమున్నట్లు ఫిన్‌టెక్ గ్రూప్ క్రెడిట్‌సైట్స్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రధాన బిజినెస్ విభాగాల్లో స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు హోల్డింగ్ కంపెనీగా నిలిచే వీలున్నట్లు అంచనా వేసింది. ఆర్ఐఎల్ విషయంలో కంపెనీ చీఫ్ బిలియనీర్ ముకేశ్ అంబానీ అమలు చేస్తున్న విజయవంతమైన ప్రణాళికల ద్వారా పటిష్ట క్రెడిట్ ప్రొఫైల్‌ను సొంతం చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది. టెలికం, రిటైల్ విభాగాలు అత్యుత్తమ ఫలితాలు సాధించనుండటంతో చమురు విభాగం బలహీన ఔట్లుక్ పెద్దగా ప్రభావం చూపబోదని అభిప్రాయపడింది. అధిక ధరల నేపథ్యంలో చమురుశుద్ధి యూనిట్, భారీ పెట్టుబడి అవసరాలు వంటి అంశాలు చమురు విభాగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు అంచనా వేసింది. కాగా.. ఇటీవల ఆర్ఐఎల్ వివిధ బిజినెస్‌ల విజయవంతమయ్యే ప్రణాళికలపైనే దృష్టి సారించింది. చైర్మన్ ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం ఆకాశ్, ఈషా, అనంత్‌లను సంస్థ బోర్డులో డైరెక్టర్లుగా చోటు కల్పించింది. ఇదే సమయంలో ముకేశ్ అంబానీ మరో ఐదేళ్లు చైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. ప్రణాళికాబద్ధంగా.. ‘పలువురు ఇన్వెస్టర్లకు ముకేశ్ అంబానీ బాధ్యతల నుంచి వైదొలగే అంశంపై ఆందోళనలు నెలకొని ఉండవచ్చు. అయితే ముకేశ్ అంబానీ విజయవంతమైన ప్రణాళికలను సానుకూలంగా పరిగణించాలి. ముగ్గురికీ ఆర్ఐఎల్ ప్రధాన బిజినెస్ యూనిట్ల (టెలికం, రిటైల్, నూతన ఇంధన) యాజమాన్య బాధ్యతలను అప్పగించారు. తద్వారా భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలూ తలెత్తకుండా స్పష్టమైన విభజనను చేపట్టారం’టూ క్రెడిట్‌సైట్స్ నివేదికలో వివరించింది. దీంతో ముకేశ్ ఉన్నట్లుండి బాధ్యతల నుంచి తప్పుకోవడం అనే రిస్కుకు చెక్ పెట్టారని పేర్కొంది. అంతేకాకుండా తదుపరి తరం యాజమాన్య నిర్వహణలో మార్గదర్శకత్వం వహించడం ద్వారా మరింత అభివృద్ధి చెందేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి ప్రధాన బిజినెస్ విభాగాలు స్వతంత్రంగా ఎదిగేందుకు దారి చూపుతూ హోల్డింగ్ కంపెనీగా ఆర్ఐఎల్ ఆవిర్భవించనున్నట్లు క్రెడిట్‌సైట్స్ పేర్కొంది. -
ఆస్ట్రేలియాలో అంబానీ వ్యాపారం, ఫోకస్ అంతా చిన్న కొడుకు బిజినెస్‌పైనే!
న్యూఢిల్లీ: బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్తో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) చేతులు కలిపింది.తద్వారా భాగస్వామ్య సంస్థ(జేవీ)ని ఏర్పాటు చేయనుంది. ఈ జేవీ ఆస్ట్రేలియాలో పునరుత్పాదక ఇంధనం, కర్బనాలు తగ్గించే పరికరాల తయారీకి ఉన్న అవకాశాలను అన్వేషించనుంది. ఒప్పందంలో భాగంగా బ్రూక్‌ఫీల్డ్.. రిలయన్స్‌తో కలసి ప్రత్యక్ష మూలధన పెట్టుబడి అవకాశాలు, కార్యకలాపాల ఏర్పాటు అవకాశాలను వెదికి పట్టుకోనుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సోలార్ సెల్స్, మాడ్యూల్స్, ఎనర్జీ స్టోరీజే బ్యాటరీలు, ఇంధన సెల్స్, గ్రీన్ హైడ్రోజన్ తయారీకి రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న గిగాఫ్యాక్టరీలకు సైతం పరికరాలను జేవీ సరఫరా చేయనుంది. ఇందుకు వీలుగా ఆర్ఐఎల్, బ్రూక్‌ఫీల్డ్ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. వెరసి ఆ్రస్టేలియాలో ఇంధనపరమైన మార్పులకు జేవీ బూస్ట్ నివ్వనున్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. శుద్ధ ఇంధన పరికరాల స్థానిక తయారీ ఇందుకు తోడ్పాటునందించనున్నట్లు తెలియజేసింది. ఈ సందర్భంగా ఎంఓయూపై రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్పందించారు. తమ సంస్థ (రిలయన్స్) మానవాళికి ప్రయోజనకరమైన, ప్రకృతికి అనుకూలంగా ఉండే క్లీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్‌ను రూపొందించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. -
ఆర్ఐఎల్ కౌంటర్లో ప్రత్యేక ట్రేడింగ్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్చేంజి దిగ్గజం ఎన్ఎస్ఈ.. ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కౌంటర్లో ప్రత్యేక ట్రేడింగ్‌కు తెరతీస్తోంది. ఫైనాన్షియల్ సర్వి సెస్ బిజినెస్‌ను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీగా ఆర్ఐఎల్ విడదీయనుంది. తదుపరి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌గా మార్పు చేయనుంది. దీనిలో భాగంగా ఆర్ఐఎల్ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ షేరుకూ ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరును కేటాయించనుంది. ఇందుకు రికార్డ్ డేట్ జూలై 20కాగా.. అదే రోజు కొత్తవిధానంలో ప్రత్యేక ప్రీఓపెన్ సెషన్‌ను ఎన్ఎస్ఈ నిర్వహించనుంది. దీని ప్రకారం నిఫ్టీ ఇండెక్స్‌లో ఆర్ఐఎల్ కొనసాగనుంది. 19 ఇండెక్సులలో..: జియో ఫైనాన్షియల్‌ను తాత్కాలికంగా నిఫ్టీ–50లో కొనసాగించడంతోపాటు.. 19 ఇండెక్సులలో చోటు కల్పించనుంది. దీంతో జూలై 20 నుంచి కనీసం మూడు రోజులపాటు నిఫ్టీకి తాత్కాలికంగా 51 షేర్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి. జియో ఫైనాన్షియల్ లిస్టయిన రోజు నుంచి మూడు రోజులు( ఖీ+3) పూర్తయ్యాక ఇండెక్సుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా నిఫ్టీ ఇండెక్సుల కొత్త విధానం ప్రకారం ఎన్ఎస్ఈ చేపట్టనుంది. ఏప్రిల్‌లో ఎన్ఎస్ఈ ఇండైసెస్ లిమిటెడ్ కొన్ని సవరణల ద్వారా కొత్త విధానానికి తెరతీసింది. కంపెనీల విడదీతసహా కార్పొరేట్ చర్యలకు అనుగుణంగా తాజా విధానానికి రూపకల్పన చేసినట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దీనిలో భాగంగా ఎన్ఎస్ఈ ప్రత్యేక ప్రీఓపెన్ సెషన్‌ను నిర్వహిస్తే నిఫ్టీలో విడదీత కంపెనీకి చోటు కల్పించవచ్చు. రికార్డ్ డేట్ ఎఫెక్ట్.. అనుబంధ సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వి సెస్ విడదీతకు రికార్డ్ డేట్ జూలై 20 కాగా.. 19 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఇన్వెస్ట్ చేసిన వాటాదారులకు జియో ఫైనాన్షియల్ షేర్లు పొందేందుకు వీలుంటుంది. ఇక గురువారం (20న) ఎన్ఎస్ఈ రెగ్యులర్ ట్రేడింగ్ కంటే ముందుగా ప్రత్యేక ప్రీ–ఓపెన్ సెషన్‌ను నిర్వహిస్తోంది. ఉదయం 9–10 మధ్య జియో ఫైనాన్షియల్ షేరు ధర నిర్ణయానికి ఇది సహకరించనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దీనికి సంబంధించి బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ ఇచ్చిన ఉదాహరణను చూద్దాం.. 19న (టీ–1) ఆర్ఐఎల్ ముగింపు ధర రూ. 2,800 అనుకుంటే.. 20న రూ. 2,600 ధర పలికిందనుకుందాం.. వెరసి జియో ఫైనాన్షియల్ షేరు ధరను రూ. 200గా పేర్కొనవచ్చు. -
ఫార్మసీ బిజినెస్‌లోకి అంబానీ: మందులు అమ్మనున్న రిలయన్స్!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని భారీ వ్యాపార సమ్మేళనం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Limited) వివిధ రంగాలకు విస్తరిస్తోంది. పెద్ద పెద్ద అంతర్జాతీయ బ్రాండ్లను భారత్‌కు తీసుకొస్తోంది. వాటితో భాగస్వామ్యం చేసుకుని విభిన్న వ్యాపారాల్లోకి అడుగు పెడుతోంది. ఈసారి యూకేకి చెందిన వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ (Walgreens Boots Alliance Inc) అనే భారీ ఫార్మాస్యూటికల్ కంపెనీతో ఒప్పందాన్ని చేసుకుంటోంది. భారీ మొత్తంలోనే ఆఫర్ వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ అనేది యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ. దీన్ని కొనుగోలు చేసి మెడికల్ స్టోర్లు, ఫార్మా వ్యాపారాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎత్తుగడలు వేస్తోంది. ఈ మేరకు వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని దానికి సంబంధించిన అంతర్జాతీయ మెడిస్టోర్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందు కోసం యూకే కంపెనీకి అంబానీ భారీ మొత్తంలోనే ఆఫర్ చేసినట్లు తెలిసిందని బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొంది. కన్సార్టియం ఏర్పాటు ఔట్లుక్, ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రిటన్, యూఎస్‌లో ఉన్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ చైన్ స్టోర్లను కొనుగోలు చేయడానికి యూఎస్ ఆధారిత ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఐఎన్‌సీ సంస్థతో ఒక కన్సార్టియంను ఏర్పాటు చేస్తోంది. ఫార్మా బ్రాండ్ స్టోర్లను కొనుగోలు చేయడానికి వాల్గ్రీన్స్తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న రిలయన్స్ ఇందు కోసం భారీ మొత్తాన్ని ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాల్‌గ్రీన్స్ కంపెనీ విలువ సుమారు 6.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 53,600 కోట్లు. కష్టాల్లో ఉన్న వాల్‌గ్రీన్స్ ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని ఆన్లైన్ మార్కెట్లకు విస్తరించినప్పటి నుంచి వాల్‌గ్రీన్స్ కష్టాల్లో ఉంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఒప్పందం కుదిరితే, ఈ కంపెనీ తమ సంస్థలో స్వల్ప వాటాను మాత్రమే కలిగి ఉంటుంది. మెజారిటీ రిలయన్స్ నియంత్రణలో ఉంటుంది. రిలయన్స్-వాల్‌గ్రీన్స్ ఒప్పందం విజయవంతమైతే, ముఖేష్ అంబానీ ఈ యూకే కంపెనీని భారతదేశంలో కంపెనీని పరిచయం చేసి ఆన్లైన్ డ్రగ్ స్టోర్ల ద్వారా లాభాలను పెంచుతారని భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న టాటా 1ఎంజీ, అపోలో ఫార్మసీ వంటి వాటికి గట్టి పోటీ తప్పదు. కాగా గత సంవత్సరంలోనే ముఖేష్ అంబానీ యూకే కంపెనీ ఈ ఆఫర్ చేశారు. దీనిపై వాల్‌గ్రీన్స్ బూట్స్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు! -
మరో 2 బిలియన్ డాలర్లు.. రిలయన్స్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో 2 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 16,400 కోట్లు) సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాయి. విదేశీ కరెన్సీలో తక్కువ వడ్డీ రేట్లకు ఈ నిధులను సమీకరించే యోచనలో కంపెనీలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. (ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) ఈ రెండు సంస్థలు ఇటీవలే 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 24,600 కోట్లు) మొత్తాన్ని సిండికేట్ లోన్ ద్వారా సమీకరించాయి. రెండు డజన్ల తైవాన్ బ్యాంకులతో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ తదితర 55 దిగ్గజ సంస్థలు ఈ నిధులను అందించాయి. ఆ ఒప్పందాల ప్రాతిపదికనే కొత్తగా 2 బిలియన్ డాలర్లను రిలయన్స్, జియో సమీకరించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. (విప్రో కన్జూమర్ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు) -
ఆర్ఐఎల్ చేతికి శుభలక్ష్మీ పాలి
న్యూఢిల్లీ: పాలియెస్టర్ చిప్స్, యార్న్ తయారీ కంపెనీ శుభలక్ష్మీ పాలియెస్టర్స్(ఎస్పీఎల్)ను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ రిలయన్స్ పాలియెస్టర్ లిమిటెడ్ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా శుభలక్ష్మీ పాలియెస్టర్స్, శుభలక్ష్మీ పాలిటెక్స్ లిమిటెడ్‌కు చెందిన పాలియెస్టర్ బిజినెస్‌లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వీటికి రూ. 1,522 కోట్లు, రూ. 70 కోట్లు చొప్పున చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)తోపాటు రెండు సంస్థల రుణదాతల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు పేర్కొంది. తాజా కొనుగోలు ద్వారా టెక్స్టైల్ తయారీ బిజినెస్ మరింత పటిష్టంకానున్నట్లు తెలియజేసింది. ఎస్పీఎల్ పాలియెస్టర్ ఫైబర్, యార్స్, టెక్స్టైల్ గ్రేడ్ చిప్స్ తయారు చేస్తోంది. ఏడాదికి 2,52,000 టన్నుల పాలిమరైజేషన్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ గుజరాత్‌లోని దహేజ్, దాద్రానగర్ హవేలీలోని సిల్వస్సాలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకండి! -
రిలయన్స్ లాభం.. భళా
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ గ్రూప్ ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్ క్యూ1లో రూ. 17,955 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 12,273 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధి. చమురు, టెలికం బిజినెస్‌లు ఇందుకు దోహదం చేశాయి. నిర్వహణ లాభం 46 శాతం ఎగసి రూ. 40,179 కోట్లయ్యింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. మొత్తం ఆదాయం రూ. 2,42,982 కోట్లను తాకింది. ప్రధానంగా పెట్రోకెమికల్ విభాగం కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 1.6 లక్షల కోట్ల ఆదాయం సాధించింది. ఇది 57 శాతం అధికం. గ్యాస్, రిటైల్ గుడ్.. చమురు, గ్యాస్ బిజినెస్ ఆదాయం 183 శాతం జంప్‌చేసి రూ. 3,625 కోట్లకు చేరింది. కేజీ డీ6లో 40.6 బిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ ఉత్పత్తయ్యింది. గత క్యూ1లో ఇది 33.1 బీసీఎఫ్గా నమోదైంది. ఒక్కో ఎంబీటీయూకి 9.72 డాలర్లు చొప్పున లభించింది. గతంలో ఇది 3.62 డాలర్లు మాత్రమే. ఇక రిలయన్స్ రిటైల్ అమ్మకాలు 54 శాతం ఎగసి రూ. 51,582 కోట్లను తాకాయి. నిర్వహణా లాభం 180 శాతం పురోగమించి రూ. 3,897 కోట్లకు చేరింది. మార్జిన్లు 7.6 శాతానికి మెరుగుపడ్డాయి. నికర లాభం 114 శాతం వృద్ధితో రూ. 2,061 కోట్లయ్యింది. కొత్తగా 792 స్టోర్లు తెరిచింది. వీటి మొత్తం సంఖ్య 15,866కు చేరాయి. కంపెనీ ప్రధానంగా ఓటూసీ, రిటైల్, ఈకామర్స్, టెలికంతోపాటు న్యూ ఎనర్జీ బిజినెస్‌లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 30కల్లా నగదు(రూ. 2,05,727 కోట్లు) కంటే రుణాలు(రూ. 2,63,382 కోట్లు) అధికంకావడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 2,503 వద్ద ముగిసింది. ఓటూసీ రికార్డ్... అధిక ఇంధన ధరలు, రవాణా వ్యయాల నేపథ్యంలోనూ ఓటూసీ (ఆయిల్ టూ కెమికల్స్) బిజినెస్ రికార్డ్ పనితీరు చూపింది. ఈ విభాగం నిర్వహణా లాభం 63 శాతం దూసుకెళ్లి రూ. 19,888 కోట్లను తాకింది. రిటైల్ విభాగంలో కస్టమర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. డిజిటల్ సర్వీసులు ఇందుకు వినియోగపడుతున్నాయి. దేశ ఇంధన భద్రతపై పెట్టుబడులు కొనసాగిస్తాం. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ -
ఆ వ్యాపారానికి స్వస్తి పలికిన రిలయన్స్...!
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) యూఎస్‌లోని చిట్టచివరి షేల్ గ్యాస్ ఆస్తులను సైతం విక్రయిస్తోంది. ఇందుకు వీలుగా డెలావేర్ కంపెనీ ఎన్సైన్ ఆపరేటింగ్–3 ఎల్ఎల్సీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. అనుబంధ సంస్థ రిలయన్స్ ఈగిల్ఫోర్డ్ అప్‌స్ట్రీమ్ హోల్డిం గ్‌కు చెందిన షేల్ గ్యాస్ ఆస్తులను విక్రయించేందుకు డెలావేర్ కంపెనీతో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. దీంతో యూఎస్‌లోని మొత్తం షేల్ గ్యాస్ ఆస్తుల నుంచి తప్పుకున్నట్లేనని ఆర్ఐఎల్ పేర్కొంది. తద్వారా ఉత్తర అమెరికా షేల్ గ్యాస్ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు తెలియజేసింది. 2010– 2013 మధ్య కాలంలో మూడు భాగస్వామ్య సంస్థలలో ఆర్ఐఎల్ వాటాలు కొనుగోలు చేసింది. -
వారం రోజుల్లో సుమారు రెండున్నర లక్షల కోట్లు ఖతమ్..!
గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్‌మార్కెట్స్ కొత్త రికార్డులను నమోదుచేసిన విషయం తెలిసిందే. రంకెలేస్తు వచ్చిన బుల్‌ను బేర్ ఒక దెబ్బతో పడగొట్టింది. పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకలు, ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించే విషయంలో అమ్మకాల జోరు ఊపందుకోవడంతో స్టాక్‌మార్కెట్లు కొద్దిరోజుల నుంచి కుప్పకూలుతూ వచ్చాయి. అక్టోబర్ 29 రోజున దేశీయ సూచీలు ఒక్కసారిగా పడిపోవడంతో ఇన్వెస్టర్ల రూ. 4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి అయ్యింది. బేర్ కొట్టిన దెబ్బకు రిలయన్స్, హెడీఎఫ్సీ లాంటి టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయాయి. అత్యంత విలువైన కంపెనీలలో తొమ్మిది కంపెనీలు గత వారం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 2,48,542.3 కోట్లను కోల్పోయాయి. బలహీనమైన విస్తృత మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా సంస్థలు తమ మార్కెట్ విలువను కోల్పోవడం జరిగింది. టాప్-10 మార్కెట్ క్యాప్ కంపెనీల జాబితాలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే లాభపడింది. చదవండి: నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! ►రిలయన్స్ మార్కెట్ క్యాప్ సుమారు రూ.56,741.2 కోట్లు తగ్గి రూ.16,09,686.75 కోట్లకు చేరుకుంది. ►హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 54,843.3 కోట్లు క్షీణించి రూ.8,76,528.42 కోట్ల వద్ద స్థిరపడింది. ►టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విలువ రూ.37,452.9 కోట్లు తగ్గి రూ.12,57,233.58 కోట్లకు చేరుకుంది. ►ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ విలువ రూ.27,678.78 కోట్లు తగ్గి రూ.7,01,731.59 కోట్ల వద్ద స్థిరపడింది. ►కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ విలువ రూ.27,545.09 కోట్లు తగ్గడంతో రూ.4,03,013 కోట్లకు చేరింది. ►బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 18,774.8 కోట్లు తగ్గింది. దీంతో ఎమ్-క్యాప్ విలువ 4,46,801.66 కోట్లకు చేరుకుంది. ►హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) రూ. 14,356 కోట్లు తగ్గి రూ. 5,62,480.40 కోట్ల వద్ద స్థిరపడింది. ►హెచ్‌డిఎఫ్‌సి వాల్యుయేషన్ రూ.10,659.37 కోట్లు తగ్గి రూ.5,14,217.69 కోట్లకు చేరుకోగా.. ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత మేర నష్టాలను చవిచూసింది. గతవారంలో సుమారు రూ.490.86 కోట్లు తగ్గి రూ.4,48,372.48 కోట్లకు చేరింది. ►టాప్-10 మార్కెట్ క్యాప్ కల్గిన కంపెనీలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే రూ. 30,010.44 కోట్లను జోడించి రూ. 5,56,507.71 కోట్లకు తీసుకుంది. చదవండి: గూగుల్‌పే మాదిరిగా...వాట్సాప్‌లో రూ. 255 వరకు క్యాష్‌బ్యాక్..! -
తొలి మొబిలిటీ స్టేషన్ ప్రారంభించిన జియో-బీపీ
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్), బీపీ జాయింట్ వెంచర్ రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్(ఆర్‌బిఎంఎల్) నేడు నవీ ముంబైలో తన మొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్ ను ప్రారంభించింది. గత జూలైలో ఆర్‌బిఎంఎల్‌ను ఆర్ఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ జియో-బీపీ బ్రాండ్ కింద ఇంధన స్టేషన్లను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 1,400 ఇంధన నెట్‌వర్క్‌ను జియో-బీపీగా రీబ్రాండ్ చేస్తామని ప్రకటించింది. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ ఇంధనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లను పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించాము. కస్టమర్ సౌకర్యానికి అనుగుణంగా వినియోగదారులకు ఇవి కోసం అనేక సేవలు అందిస్తాయి. ఈ మొబిలిటీ స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్, జనరల్ స్టోర్స్ ఉంటాయి అని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లలో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన 'యాక్టివ్' టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇంజిన్లను శుభ్రంగా ఉంచడంలో సహాయపడే కీలకమైన ఇంజిన్ భాగాలపై రక్షణ పొరను ఏర్పరుస్తుంది అని కంపెనీ తెలిపింది. ఈ జాయింట్ వెంచర్ భారతదేశంలో ప్రముఖ ఈవి ఛార్జింగ్ మార్కెట్లో కీలకంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కారు ధర మరి ఇంత తక్కువ!) -
ఏపీలో రీసైక్లింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్న రిలయన్స్
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వాటర్ బాటిళ్లకు, ఇతర ప్లాస్టిక్ వస్తువులకు వాడే పాలిథిలిన్ టెరాఫ్తలెట్(PET) రీసైక్లింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు బుధవారం (ఆగస్టు 4) రోజున ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసైకిల్ పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ తయారీ కేంద్రాన్ని శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా, ఆర్ఐఎల్ కోసం ప్రత్యేకంగా రీసైకిల్ చేసిన పీఎస్ఎఫ్-రెక్రాన్ గ్రీన్ గోల్డ్, పెట్ ఫ్లాక్స్ వాష్-లైన్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించనుంది. అంతేకాకుండా తయారీ కేంద్రాన్ని శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా ఆపరేట్ చేయనుందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రీసైక్లింగ్ సామర్ధ్యాన్ని రెండింతలకు పెంచాలని భావిస్తోంది. 5 బిలియన్ పోస్ట్-కన్స్యూమర్ పెట్ బాటిళ్లను రీసైక్లింగ్ చేయడంతో దేశవ్యాప్తంగా 90శాతం రీసైక్లింగ్ రేటును సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. రిలయన్స్ పెట్రో కెమికల్స్ సీవోవో విపుల్ షా మాట్లాడుతూ.. రిలయన్స్ పెట్ బాటిళ్ల రీసైక్లింగ్ విస్తరణ అనేది రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ దృష్టిలో భాగంగా ఉందన్నారు. శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా సంస్థకు తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంలో, నిర్వహించడంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన మద్దతును తెలుపుతుందని పేర్కొన్నారు. -
రిలయన్స్ డీల్‌కు బ్రేక్ : బియానీకి భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్‌తో న్యాయపోరాటంలో ఫ్యూచర్ గ్రూప్‌నకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ రిటైల్‌తో రూ.24,713 కోట్ల ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్ విబేధాలకు సంబంధించి సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్ (ఈఏ) 2020 అక్టోబర్ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్ గ్రూప్ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో న్యాయస్థానం పేర్కొంది.(మాల్యా, మోదీ, మెహెల్‌కు నిర్మలాజీ షాక్) కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ ఆదేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని, ఈ ఒప్పందంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్లు జస్టిస్ జెఆర్ మిధా ధర్మాసనం పేర్కొంది. ఫ్యూచర్ గ్రూపుకు సంబంధించిన బియానీ, ఇతరుల ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యూచర్ గ్రూప్ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్యూచర్ గ్రూప్ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలులో ఎందుకు ఉంచకోడదని ప్రశి్నస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచి్చంది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. -
అమెజాన్.. వెనక్కి తగ్గాలి
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూపు, రిలయన్స్ మధ్య కుదిరిన ఒప్పందానికి అడ్డుపడకుండా, వెనక్కి తగ్గాలంటూ వర్తకుల మండలి.. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్(ఏఐసీపీడీ), స్వచ్చంద సంస్థ ప్రహర్ అమెజాన్‌ను డిమాండ్ చేశాయి. కంపెనీల మధ్య ప్రస్తుత వివాదం అలాగే కొనసాగితే అది ఫ్యూచర్ గ్రూపు వెండర్లు, సరఫరాదారులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ‘‘దేశ వ్యాప్తంగా సుమారు 6,000 మంది చిన్న విక్రేతలు, సరఫరాదారులకు ఫ్యూచర్ గ్రూపు నుంచి రూ.6,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. 2020 మార్చి నుంచి ఈ బకాయిలు ఆగిపోయి ఉన్నాయి. 2020 ఆగస్ట్‌లో ఫ్యూచర్ గ్రూపు-రిలయన్స్ ఒప్పందం త్వరలోనే మా బకాయిలు వసూలవుతాయన్న ఆశలను చిగురింపజేసింది’’ అని ఏఐసీపీడీ, ప్రహర్ తమ లేఖలో పేర్కొన్నాయి. ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌కు అడ్డుపడకుండా వెనక్కి తగ్గాలని లేదా తమ సభ్యుల బకాయిలను చెల్లించాలని అమెజాన్‌ను వర్తకుల సంఘం కోరింది. చదవండి: అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్! డెస్క్ టాప్లోనూ వాయిస్, వీడియో కాల్స్ -
ఏనాడూ వ్యవసాయ భూమి కొనలేదు: ఆర్ఐఎల్
ముంబై: కార్పొరేట్ అవసరాల కోసం ఏనాడూ వ్యవసాయ భూములను కొనుగోలు చేయలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదే విధంగా రైతులతో కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదని తెలియజేసింది. భవిష్యత్‌లోనూ కాంట్రాక్ట్ లేదా కార్పొరేట్ వ్యవసాయం చేసే ప్రణాళికలు లేవని తేల్చిచెప్పింది. తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటనలో ఆర్ఐఎల్ ఇంకా ఏమన్నదంటే.. ఎంఎస్పీకి అనుగుణంగా అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ ఏనాడూ రైతుల నుంచి ఆహార ధాన్యాలను ప్రత్యక్షంగా కొనుగోలు చేయలేదు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) లేదా ఏ ఇతర మార్గదర్శకాలకు అనుగుణమైన విధానాలలోనే వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయవలసిందిగా సరఫరాదారులందరికీ స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల విధానంలో మాత్రమే వ్యవసాయోత్పత్తులను సమకూర్చవలసిందిగా సరఫరాదారులకు తగిన ఆదేశాలు జారీ చేసింది. రైతులకు నష్టం చేసే రీతిలో లేదా కంపెనీకి అనుచిత లబ్ది చేకూరే విధానంలో ఏనాడూ దీర్ఘకాలిక కాంట్రాక్టులను కుదుర్చుకోవడం వంటివి చేపట్టలేదు. కోర్టులో పిటిషన్ ఇటీవల కొద్ది రోజులుగా పంజాబ్, హర్యానాలలో రిలయన్స్ జియోకు చెందిన సుమారు 1,500 మొబైల్ టవర్లకు కొంతమంది నష్టం చేకూర్చినట్లు అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ద్వారా పంజాబ్, హర్యానా హైకోర్టులో ఆర్ఐఎల్ ఫిర్యాదు చేసింది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవల రైతులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కావాలని కొంతమంది కంపెనీ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నట్లు ఆరోపించింది. తద్వారా వేలకొద్దీ ఉద్యోగులకు రక్షణ కరవుకాగా, కీలక మౌలికసదుపాయాలకు విఘాతం కలుగుతున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఉద్యోగులు, ఆస్తులకు వెంటనే తగిన రక్షణ కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోర్టును అభ్యర్థించింది. కంపెనీ ఆస్తుల విధ్వంసాన్ని కొన్ని వ్యాపార వైరివర్గాలు కావాలని చేస్తున్న దుశ్చర్యలుగా ఫిర్యాదులో ఆరోపించింది. -
అపోలో ఫార్మసీలో అమెజాన్ ఇన్వెస్ట్మెంట్!
బెంగళూరు, సాక్షి: కోవిడ్-19 కారణంగా కొద్ది నెలలుగా ఆన్ లైన్ ఫార్మసీ రంగం జోరందుకుంది. దేశీ ఫార్మసిస్ రంగంపై కన్నేసిన గ్లోబల్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా అపోలో ఫార్మసీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అపోలో ఫార్మసీలో 10 కోట్ల డాలర్లను(సుమారు రూ. 740 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆంగ్ల మీడియా అభిప్రాయపడింది. ఇందుకు వీలుగా ఇప్పటికే ప్రారంభమైన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. దేశీయంగా ఓవైపు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, మరోపక్క పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఫార్మసీ విభాగంలో విస్తరణకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో ఫార్మసీలో పెట్టుబడుల ద్వారా అమెజాన్ భారీ అడుగులు వేయాలని భావిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. తద్వారా దిగ్గజ కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలియజేశారు. చదవండి: (టాటాల చేతికి 1ఎంజీ?) నెట్‌మెడ్స్ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల ఆన్లైన్ ఫార్మసీ సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. రూ. 620 కోట్లు వెచ్చించడం ద్వారా నెట్‌మెడ్స్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ఆగస్ట్‌లోనే ఆర్ఐఎల్ వెల్లడించింది. దీంతో డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో.. ఈకామర్స్ రంగంలో ఔషధ విభాగంలోకి సైతం ప్రవేశించేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జియోమార్ట్ పేరుతో ఆన్లైన్ గ్రాసరీ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆర్ఐఎల్ డీల్ ప్రకారం నెట్‌మెడ్స్ విలువ రూ. 1,000 కోట్లకు చేరినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. ఆగస్ట్ మొదటి వారంలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. బెంగళూరులో ఆన్లైన్ ఫార్మసీ విక్రయాలు ప్రారంభించింది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు అప్పట్లోనే తెలియజేసింది. చదవండి: (రిలయన్స్ చేతికి నెట్‌మెడ్స్) 1 ఎంజీ ఆన్లైన్ ఫార్మసీ కంపెనీ 1ఎంజీలో మెజారిటీ వాటా కొనుగోలుకి పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. తద్వారా ఈ విభాగంలో ప్రధాన కంపెనీలైన మెడ్ ప్లస్, నెట్ మెడ్స్, ఫార్మజీ, 1ఎంజీ మధ్య పోటీ తీవ్రతరం కానున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. నాలుగు నెలల క్రితమే నెట్ మెడ్స్ ప్రమోటర్ కంపెనీ విటాలిక్లో రిలయన్స్ రిటైల్ 60 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇదేవిధంగా క్లౌడ్ టెయిల్‌తో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. క్లౌడ్ టెయిల్లో అమెజాన్ 24 శాతం వాటా పొందింది. దేశీయంగా నెట్‌మెడ్స్, ఫార్మ్ఈజీ, మెడ్‌లైఫ్ తదితర పలు కంపెనీలు ఆన్లైన్ ద్వారా ఔషధ విక్రయాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. -
అంబానీ- ఆసియా కుబేరుల్లో రెండు మెట్లుపైనే!
న్యూఢిల్లీ, సాక్షి: దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తాజాగా కుబేరుల జాబితాలో మరో రికార్డును చేరుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆసియాలోకెల్లా అంబానీల కుటుంబం అత్యంత ధనికులుగా రికార్డులకెక్కింది. అంబానీ కుటుంబ సంపద 76 బిలియన్ డాలర్లుకాగా.. జాబితాలో రెండో ర్యాంకులో నిలిచిన హాంకాంగ్‌కు చెందిన క్వాక్ ఫ్యామిలీ ఆస్తుల విలువ 33 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇక మూడో స్థానాన్ని పొందిన శామ్సంగ్ యజమాని లీ కుటుంబ సంపద సైతం 26.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. వెరసి అంబానీ కుంటుంబ సంపద రెండో ర్యాంకుకంటే రెట్టింపు, మూడో ర్యాంకుతో పోలిస్తే మూడు రెట్లు అధికంకావడం గమనార్హం! 10 బిలియన్లు ప్లస్ ఆసియాలో టాప్-20 కుబేర కుటుంబాల జాబితాను బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసింది. ఈ మొత్తం కుటుంబాల సంపద గతేడాదితో పోలిస్తే 10 బిలియన్ డాలర్లు పెరిగి 463 బిలియన్ డాలర్లకు చేరింది. అంబానీ కుటుంబ సభ్యుల్లో అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఆస్తులు క్షీణించినప్పటికీ ముకేశ్ అంబానీ గ్రూప్ ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు చూపడం ద్వారా జాబితాలో అగ్రస్థానాన్ని పటిష్ట పరచుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ పేర్కొంది. కాగా.. వారసులు లేకపోవడంతో చైనీస్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు చెందిన జాక్ మాను జాబితాకు ఎంపిక చేయలేదని తెలియజేసింది. రిటైల్, డిజిటల్ ఎఫెక్ట్ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొద్ది రోజులుగా అనుబంధ సంస్థలు రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లో విదేశీ పెట్టుబడులను ఆకట్టుకుంటూ వచ్చింది. డిజిటల్ విభాగం రిలయన్స్ జియోలో వాటాల విక్రయం ద్వారా 20.2 బిలియన్ డాలర్లను సమీకరించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కేకేఆర్, టీపీజీతోపాటు, ఫేస్బుక్, గూగుల్ సైతం వాటాలను కొనుగోలు చేశాయి. ఈ బాటలో రిలయన్స్ రిటైల్లోనూ 10 శాతంపైగా వాటా విక్రయంతో రూ. 47,000 కోట్లు సమకూర్చుకుంది. రెండు నెలల్లోనే రిటైల్ విభాగంలో భారీగా నిధులు సమీకరించడం విశేషంకాగా.. చమురు, గ్యాస్ బిజినెస్‌లు నీరసించినప్పటికీ ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది 50 శాతం ర్యాలీ చేసింది. తద్వారా ముకేశ్ అంబానీ సంపదకు 16 బిలియన్ డాలర్లు జమైనట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇది ఆసియా కుబేరుల సంపదలో అంతరాన్ని పెంచినట్లు వివరించారు. -
ఫ్యూచర్ గ్రూప్ ఫ్యూచర్.. కత్తిమీద సాము!
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు రిటైల్ బిజినెస్‌ల విక్రయం ప్రస్తుతానికి డోలాయమానంలో పడటంతో ఫ్యూచర్ గ్రూప్ దిక్కుతోచని పరిస్థితికి చేరినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రిటైల్ బిజినెస్‌లను ఆర్ఐఎల్కు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ 3.4 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ కుదర్చుకోవడంలో ఫ్యూచర్ గ్రూప్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ అమెజాన్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో తాత్కాలికంగా డీల్‌ను నిలిపివేయమంటూ సింగపూర్ ఆర్బిట్రేటర్ అక్టోబర్‌లో ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదేశించిన విషయం విదితమే. చదవండి: (చిన్న షేర్ల దన్ను- స్మాల్ క్యాప్ రికార్డ్) ఏం జరిగిందంటే.. గతేడాది ఫ్యూచర్ గ్రూప్‌లోని అన్‌లిస్టెడ్ కంపెనీలలో 49 శాతం వాటాను యూఎస్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. తద్వారా గ్రూప్‌లోని ప్రధాన లిస్టెడ్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి తమకు హక్కు ఉన్నదంటూ వాదిస్తోంది. అయితే నిబంధనలకు అనుగుణంగానే ఆర్ఐఎల్తో డీల్ కుదుర్చుకున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తోంది. రుణభారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ మార్చిలో లాక్‌డవున్‌ల విధింపు నేపథ్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీంతో రిటైల్ ఆస్తుల విక్రయానికి ఆర్ఐఎల్తో డీల్ కుదుర్చుకుంది. చదవండి: (ఐషర్ మోటార్స్- ఐబీ రియల్టీ.. హైజంప్) ఆకర్షణీయ మార్కెట్ దేశీయంగా ట్రిలియన్ డాలర్ల విలువైన కన్జూమర్ రిటైల్ మార్కెట్లో పాగా వేసేందుకు ఇప్పటికే అమెజాన్, ఆర్ఐఎల్, వాల్‌మార్ట్(ఫ్లిప్‌కార్ట్) తదితర దిగ్గజాలు పావులు కదుపుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్ కొనుగోలుకి రిలయన్స్ గ్రూప్ ఆసక్తి చూపింది. తద్వారా రిలయన్స్ రిటైల్ బిజినెస్‌కు బూస్ట్ లభించే వీలుంటుందని భావించింది. అయితే దేశీ రిటైల్ మార్కెట్లో భారీ వాటాపై కన్నేసిన అమెజాన్ గ్రూప్.. ఈ డీల్ నిబంధనలకు విరుద్ధమంటూ ఫ్యూచర్ గ్రూప్‌నకు వ్యతిరేకంగా సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. తద్వారా అక్టోబర్ 25న డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేయమంటూ ఆర్బిట్రేటర్ కోర్టు నుంచి ఎమర్జెన్సీ ఆదేశాలను సాధించింది. ఈ అంశంపై దేశీయంగా కాంపిటీషన్ కమిషన్‌ను సైతం ఆశ్రయించింది. నిజానికి అమెజాన్ మే నెలలో ఫ్యూచర్ గ్రూప్‌లో మరింత వాటా కొనుగోలుకి ఆసక్తి చూపి విఫలమైనట్లు వార్తలు వెలువడ్డాయి. డీల్‌పై ఆశలు అమెజాన్‌తో తలెత్తిన న్యాయవివాదాలను స్థానిక చట్టాల ద్వారా పరిష్కరించుకునే యోచనలో ఉన్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ఇప్పటికే పేర్కొంది. ఆర్ఐఎల్ సైతం వీలైనంత త్వరగా ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తుల కొనుగోలును చేపట్టే వీలున్నట్లు సంకేతాలిచ్చింది. అమెజాన్‌తో అన్‌లిస్టెడ్ గ్రూప్ సంస్థల కాంట్రాక్టుకు రిటైల్ ఆస్తుల విక్రయానికి సంబంధంలేదంటూ ఫ్యూచర్ గ్రూప్ న్యాయనిపుణులు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు సంస్థలూ ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమేనని, ఒకే యాజమాన్య నిర్వహణలో ఉన్నాయని అమెజాన్ న్యాయనిపుణులు పేర్కొంటున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. కాగా.. ఆర్ఐఎల్తో డీల్ విఫలమైతే ఫ్యూచర్ గ్రూప్‌నకు చెల్లింపుల సమస్యలు ఎదురుకాగలవని, పలువురు ఉపాధి కోల్పోయే ప్రమాదమున్నదని మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ఫ్యూచర్ గ్రూప్ రుణ చెల్లింపుల సమస్యలు ఎదుర్కొన్నట్లు ప్రస్తావిస్తున్నారు. కోవిడ్-19 ప్రభావం, ప్రత్యర్ధుల నుంచి తీవ్ర పోటీ తదితర ప్రతికూలతలతో అమ్మకాలు పడిపోగా.. వరుసగా రెండు త్రైమాసికాలలో ఫ్యూచర్ గ్రూప్ భారీ నష్టాలను నమోదు చేసింది. దీంతో గ్రూప్‌లోని షేర్లు 80 శాతం వరకూ పతనమయ్యాయి. కాగా.. నేడు ఫ్యూచర్ రిటైల్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక(జులై- సెప్టెంబర్) ఫలితాలను ప్రకటించనుండటం గమనార్హం! -
15% వాటాకు రూ. 63,000 కోట్లు!
న్యూఢిల్లీ: అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటాను విక్రయించే ప్రణాళికల్లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తాజాగా అంచనాలు వెలువడుతున్నాయి. బుధవారం పీఈ సంస్థ సిల్వర్ లేక్‌కు 1.75 శాతం వాటాను విక్రయించేందుకు డీల్ కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకు సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలకు రిలయన్స్ రిటైల్లోనూ వాటాలను ఆఫర్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసింది. ఇదే విధంగా జియోలో ఇన్వెస్ట్ చేసిన సౌదీ సంస్థలు రిలయన్స్ రిటైల్‌లో వాటాపై కన్నేసినట్లు తెలుస్తోంది. 15 శాతం వాటాకు సై రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటాలను విక్రయించాలని పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. తద్వారా రూ. 63,000 కోట్లను సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు ఊహిస్తున్నాయి. సిల్వర్ లేక్ డీల్‌తో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(పీఐఎఫ్), అబుధబీకి చెందిన ముబదాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, అబుధబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(ఏడీఐఏ), ఎల్‌కేటర్‌టన్‌సహా.. పీఈ దిగ్గజం కేకేఆర్.. రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. షేరు జూమ్ రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 63,000 కోట్లవరకూ సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలు రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 2,223ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! కన్సాలిడేషన్ గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్(వాల్‌మార్ట్)కు పోటీగా జియో మార్ట్ ద్వారా రిలయన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తున్నట్లు వివరించారు. 2006లో ప్రారంభమైన రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,806 స్టోర్లను కలిగి ఉంది. చదవండి: ము‘క్యాష్’ రిటైల్ స్వారీ..! -
ఊరిస్తున్న యూఎస్ స్టాక్స్- ఇన్వెస్ట్ చేస్తారా?
కోవిడ్-19 భయాలతో ఈ ఏడాది మార్చిలో కుప్పకూలిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల దౌడు తీస్తున్నాయి. దేశీయంగా సెన్సెక్స్ 38,000 పాయింట్ల మైలురాయి అందుకుంది. ఇందుకు ప్రధానంగా డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) దోహదం చేసింది. అయితే యూఎస్ మార్కెట్లు మరింత దూకుడు చూపుతున్నాయి. ఏప్రిల్ నుంచి నాస్డాక్ పలుమార్లు సరికొత్త గరిష్టాలను అందుకుంటూ వస్తోంది. ఈ బాటలో ప్రధాన ఇండెక్సులు డోజోన్స్, ఎస్అండ్పీ సైతం రికార్డ్ గరిష్టాలకు చేరువయ్యాయి. ఇందుకు FANMAG స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లు సహకరిస్తున్న విషయం విదితమే. ఇతర వివరాలు చూద్దాం.. యమ స్పీడ్ FANMAG స్టాక్స్‌గా పిలిచే గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు ఫేస్బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్.. కొద్ది రోజులుగా జోరు చూపుతున్నాయి. మార్చి కనిష్టాల నుంచి చూస్తే 128 శాతం స్థాయిలో ఎగశాయి. అయితే వీటిలో గూగుల్, మైక్రోసాఫ్ట్ 60 శాతం స్థాయిలో లాభపడ్డాయి. ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్ అయితే 750 శాతం దూసుకెళ్లింది. దీంతో అమెరికా మార్కెట్లు బలపడగా.. ఇదే సమయంలో దేశీయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 140 శాతం జంప్‌చేసింది. దీంతో సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌లను దాటాయి. భారీ విలువ అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన FANMAG.. గ్లోబల్ కంపెనీలు కావడంతో వీటి సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ 7.2 ట్రిలియన్ డాలర్లను తాకాయి. ఇక బీఎస్ఈ మొత్తం మార్కెట్ విలువ 2.4 ట్రిలియన్ డాలర్లస్థాయికి చేరింది. అంటే బీఎస్ఈ మార్కెట్ క్యాప్‌తో చూస్తే FANMAG మార్కెట్ విలువ మూడు రెట్లు అధికం. కాగా.. ఇటీవల ఈ స్టాక్స్‌లో వస్తున్న ర్యాలీ కారణంగా పలువురు ఇన్వెస్టర్లు వీటిలో ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తి చూపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలియజేశాయి. ఇందుకు వీలుగా బ్రోకింగ్ సంస్థలు సైతం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అవకాశాలు ఇలా ప్రస్తుతం సంపన్నులు, మధ్యస్థాయి వర్గాలు అధికంగా యూఎస్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలియజేశాయి. దీంతో విదేశీ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసే ప్రక్రియ దేశీయంగా ఊపందుకోలేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ పేర్కొన్నారు. చిన్న ఇన్వెస్టర్లు యూఎస్ ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయడం అంత సులభంకాదని పలువురు నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మ్యూచువల్ ఫండ్ మార్గంలో అంతర్జాతీయ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా ఇందుకు వీలున్నట్లు తెలియజేశారు. పీపీఎఫ్ఏఎస్ దీర్ఘకాలిక ఈక్విటీ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ ఎస్అండ్పీ-500 ఫండ్ వంటి అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. విదేశీ ఈక్విటీలలో అయితే పలు రంగాలు, కంపెనీల ద్వారా భారీ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలున్నప్పటికీ అత్యధిక రిస్కులను ఎదుర్కోవలసి ఉంటుందని విశ్లేషకులు వివరించారు. డాలరు- రూపాయి మారకం విలువ, సామాజిక, రాజకీయ అంశాలు వంటివి ప్రభావం చూపుతుంటాయని తెలియజేశారు. తగినంత రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం భారీ నష్టాలకు దారితీయవచ్చని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లలో కనిపిస్తున్న బుల్‌ట్రెండ్ కారణంగా భారీ ఆటుపోట్లకు వీలున్నట్లు చెబుతున్నారు. -
రిలయన్స్‌కు షాకిచ్చిన బ్రోకరేజ్‌లు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, ఎడెల్వీజ్లు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు షాక్‌నిచ్చాయి. నిఫ్టీ ఇండెక్స్‌ను ముందుండి నడిపిస్తున్న రిలయన్స్ షేరుకు డౌన్‌గ్రేడ్ రేటింగ్‌ను కేటాయించాయి. మార్చి కనిష్టస్థాయి రూ.867.82 నుంచి రిలయన్స్ షేరు 150శాతం ర్యాలీ చేసి ఇటీవల రూ.2000 స్థాయిని అందుకుంది. ‘‘నిధుల సమీకరణ, రుణాన్ని తగ్గించుకోవడం, వ్యాపారాల వాల్యూ అన్‌లాక్ కావడంతో షేరు అధికంగా ర్యాలీ చేసింది. వాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయి. ఈ పరిణామాలు అప్రమత్తతకు సంకేతాలు’’ అని రెండు బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు రిలయన్స్ షేరుపై ఆయా బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలను చూద్దాం... ఎడెల్వీజ్ బ్రోకరేజ్: రిలయన్స్ షేరుకు ‘‘హోల్డ్’’ రేటింగ్‌ను కేటాయించింది. టార్గెట్ ధరను రూ.2105గా నిర్ణయించింది. రుణాలను తగ్గించుకోవడం, అసెట్ మోనిటైజేషన్, వ్యాపారంలో డిజిటల్ మూమెంట్ తదితర అంశాలు షేరును రూ.2000స్థాయిని అందుకునేందుకు తోడ్పడినట్లు ఎడెల్వీజ్ బ్రోకరేజ్ తెలిపింది. రిలయన్స్ షేరు ఏడాది ప్రైజ్ -టు -ఎర్నింగ్స్ 47.2రెట్ల నిష్పత్తి వద్ద ట్రేడ్ అవుతోందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ విలువ వాస్తవ విలువ కంటే అధికంగా ఉందని తెలిపింది. షేరు ధర పతనం ఒక క్రమపద్ధతిలో ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ బ్రోకరేజ్ సంస్థ 2016 నుంచి రిలయన్స్ షేరుపై పాజిటివ్‌గానే ఉంది. ఈ 4ఏళ్లలో షేరు 400శాతం ర్యాలీ చేసింది. సీఎల్ఎస్ఏ బ్రోకరేజ్: రిలయన్స్ షేరు రేటింగ్‌ను ‘‘అవుట్‌ఫెర్‌ఫామ్’’ నుంచి ‘‘బై’’కు కుదించింది. అయితే టార్గెట్ ధరను మాత్రం రూ.2,250కి పెంచింది. ఈ టార్గెట్ ధర షేరు ప్రస్తుత ధరకు అతి దగ్గరలో ఉంది. మార్చి 2022 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 220 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తుంది. అయితే షేరు ర్యాలీ స్వల్పకాలంలో ఆగిపోతుందని విశ్వసిస్తుంది. గడిచిన 4ఏళ్లలో షేరు 400శాతానికి పైగా ర్యాలీ చేసింది. 4నెలల్లో 150శాతం ర్యాలీ చేసింది. ఇప్పుడు స్టాక్ ర్యాలీ కొంతకాలం పాటు ఆగిపోవచ్చని సీఎల్ఎస్ఏ తన నివేదికలో తెలిపింది. -
ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానానికి ముకేశ్
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించాడు. ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానానికి ఎగబాకారు. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఎలెన్ మస్క్‌ను, గూగుల్ సహ-వ్యవస్థాపకులు బ్రెయిన్, లారీ పేజ్‌లను అధిగమించడం ద్వారా ఈ ఘనతను సాధించినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 72.4బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా టెక్ షేర్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. షేర్ల పతనంతో లారీ పేజ్ సంపద 71.6బిలియన్ డాలర్లకు, బ్రెయిన్స్ సంపద 69.4బిలియన్ డాలర్లకు, టెస్లా అధినేత మస్క్ సంపద 68.6బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతవారంలో చివర్లో ఇదే సంపద విషయంలో స్టాక్ మార్కెట్ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ఈమార్చి నుంచి పలు దేశాలు విధించిన లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇటువంటి క్లిష్టతరుణంలో ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్, సిల్వర్‌లేక్, క్వాల్‌కాంతో సహా సుమారు 12 విదేశీ కంపెనీలకు 25.24 శాతం వాటా విక్రయం ద్వారా 13 విదేశీ సంస్థల నుంచి రూ.1.18 లక్షల కోట్ల మేర నిధులు సమీకరించింది. ఫలితంగా రిలయన్స్ షేరు మార్చి కనిష్టస్థాయి నుంచి రెట్టింపు లాభాల్ని ఆర్జించింది. భారత్‌లో శరవేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యాపారాన్ని దృష్టి పెట్టుకుని ముకేశ్ ఈ-కామర్స్ రంగంలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభ కలిగిన మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు... ముఖ్యంగా అమెరికా ఆధారిత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా నిన్నటి రోజులన వచ్చే 5–7 సంవత్సరాల్లో సుమారు రూ. 75 వేల కోట్లు (దాదాపు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రికార్డుల మోత మోగిస్తున్న రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సోమవారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. తన అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం ఇందుకు కారణమైంది. క్వాల్కామ్ వెంచర్స్ సంస్థ జియోలో 0.15శాతం వాటాను రూ.730 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఆదివారం రిలయన్స్ ప్రకటించింది. ఫలితంగా నేడు బీఎస్ఈ రియలన్స్ షేరు రూ.1908.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో షేరు 3.64శాతం పెరిగి రూ.1947 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయ గం.11:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.1878.50)తో పోలిస్తే 3శాతం లాభంతో రూ.1935 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ మార్చి మార్కెట్ పతనం నుంచి రిలయన్స్ షేరు ఏకంగా 120శాతం ర్యాలీ చేసింది. ఈ వారంలో బుధవారం (ఈ నెల 15న) జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఏజీఎమ్(వార్షిక సాధారణ సమావేశం) కోసం ఇన్వెస్టర్లు ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు. రూ.12లక్షల కోట్లకు చేరిన మార్కెట్క్యాప్: రిలయన్స్ షేరు కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకోవడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా రిలయన్స్ రికార్డుకెక్కింది. షేరు టార్గెట్ ధరను పెంచిన బ్రోకరేజ్‌లు: ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ షేరు టార్గెట్ ధరను పెంచింది. గతంలో బ్రోకరేజ్ సంస్థ కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ షేరు టార్గెట్ ధరను రూ.1950 నుంచి రూ.2000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. డిజిటల్ వ్యాపారంలో కంపెనీ వ్యూహాత్మక అడుగులు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, క్వాల్కామ్లతో ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్లు జియోలో వాటాను కొనుగోలు చేయడం షేరు ర్యాలీకి మరింత ఉత్సాహానిస్తున్నాయి. -
రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త రికార్డు
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సోమవారం కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. తన డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ జియోలోకి వరుసగా పెట్టుబడులు వెల్లువెత్తడంతో రిలయన్స్ షేరుకు డిమాండ్ పెరిగింది. నేటి ఉదయం బీఎస్ఈలో రూ.1801 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఈ షేరకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఒక దశలో 2.55శాతం పెరిగి రూ.1833.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర(రూ.1833.10) షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.11.5లక్షల కోట్ల మార్కును దాటింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ రికార్డుకెక్కింది. ఉదయం 11గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.1787.50)తో పోలిస్తే రూ.1828.25 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది షేరు కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1833.10లు, రూ.1833.10గా నమోదయ్యాయి. జియోలోకి 12వ పెట్టుబడి: రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది. గ్లోబల్ సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ కార్ప్ 0.39శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 1895 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో డిజిటల్, టెలికం విభాగమైన రిలయన్స్ జియోలో 25.1 శాతం వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1.17 లక్షల కోట్లను సమీకరించినట్లయిందని విశ్లేషకులు తెలియజేశారు. -
నీతా అంబానీకి సముచిత గౌరవం
ముంబై : కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన నీతా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్ టౌన్ అండ్ కంట్రీ వెల్లడించిన 2020 సంవత్సరానికి అత్యంత వితరణశీలుల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. కరోనా వైరస్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడంతో పాటు మహమ్మారిపై ముందుండి పోరాడే యోధులకు అవసరమైన సహాయ సహకారాలు అందించారని, భారత్‌లో తొలి కోవిడ్-19 ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారని ఈ మ్యాగజైన్ నీతా సేవలను కొనియాడింది. లక్షలాది మంది అన్నార్తులకు భోజనం సమకూర్చడంతో పాటు నీతా అంబానీ పెద్ద సంఖ్యలో పలువురిని తమ వితరణతో ఆదుకున్నారని పేర్కొంది. వైద్యులు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లను సరఫరా చేశారని గుర్తుచేసింది. ఇక నీతాతో పాటు టిమ్ కుక్, ఆఫ్రా విన్ఫ్రే, లారిన్ పావెల్ జాబ్స్, ది లాడర్ ఫ్యామిలీ, మైఖేల్ బ్లూంబర్గ్, లియనార్డో డిపాక్రియో వంటి ప్రముఖులకు టౌన్ అండ్ కంట్రీ మ్యాగజైన్ జాబితాలో స్ధానం లభించింది. భారత్ నుంచి ఈ జాబితాలో కేవలం నీతా ఒక్కరికే చోటుదక్కడం గమనార్హం. కరోనా సంక్షోభంతో ప్రపంచం అల్లాడుతున్న క్రమంలో వీరంతా సాయం చేసేందుకు ముందుకొచ్చారని పేర్కొంది. సంక్షోభం తలెత్తితే తక్షణ స్పందన : నీతా అంబానీ సంక్షోభం వచ్చినప్పుడు తక్షణం స్పందించేలా రిలయన్స్ ఫౌండేషన్‌ను తాము తీర్చిదిద్దామని, కోవిడ్-19 సమయంలో తమ సేవలకు అంతర్జాతీయ స్ధాయి గుర్తింపు రావడం గౌరవంగా భావిస్తున్నామని రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అన్నారు. టౌన్ అండ్ కంట్రీ మ్యాగజైన్ టాప్ ఫిలాంత్రఫిస్ట్ జాబితాలో స్థానం దక్కడం సంతోషకరం. ఎప్పుడు ఎలాంటి అవసరం ఎదురైనా తమ ప్రభుత్వానికి, ప్రజలకు సాయం చేస్తామని చెప్పారు. చదవండి : నిరుపేదల కోసం ‘రిలయన్స్’ ముందడుగు -
రిలయన్స్ షేరు ర్యాలీ ఇప్పట్లో ఆగదు
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ర్యాలీ మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తితో గత ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూసిన సందర్భంలో... రిలయన్స్ షేరు ధర కేవలం 3నెలల్లో రెట్టింపు అయ్యింది. ఈ మార్చి 23న రూ.868 వద్ద ఉన్న షేరు జూన్ 20నాటికి రూ.1761కి చేరుకుంది. ఇంతటి స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ.., పలు బ్రోకరేజ్ సంస్థలు షేరుపై ‘‘బుల్లిష్’’ వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ షేరుకు మొత్తం 17 బ్రోకరేజ్ సంస్థలు ‘‘స్ట్రాంగ్ బై’’ రేటింగ్‌ను, 8 కంపెనీలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. మరోవైపు 3 బ్రోకరేజ్ సంస్థలు ‘‘సెల్’’ రేటింగ్‌ను ఇవ్వగా, 1 బ్రోకరేజ్ సంస్థ ‘‘స్ట్రాంగ్ సెల్’’ రేటింగ్‌ను ఇచ్చింది. మరో 3ఏళ్లలో షేరు ధర రెట్టింపు: ప్రభుదాస్ లిల్లాధర్ బ్రోకరేజ్ షేర్ హోల్డర్ల కోణంలో పరిశీలిస్తే వచ్చే 3ఏళ్లలో షేరు మరోసారి రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ప్రభుదాస్ లిల్లాధర్ బ్రోకరేజ్ సంస్థ రీసెర్చ్ విశ్లేషకుడు అజయ్ బోడ్కే తెలిపారు. భారత క్యాపిటల్ మార్కెట్లో అతి తక్కువ కాల వ్యవధిలో రూ.1లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అనేది అరుదుగా జరిగే సంఘటనగా ఆయన అభివర్ణించారు. ‘‘భారత్ జనాభాలో ఆరోవంతు అవసరాల్లో జియో భాగం కానుంది. రిటైల్, టెలికాం, కన్జ్యూమర్ కేంద్రీకృత వ్యాపారాల వృద్ధి రిలయన్స్ షేరు ర్యాలీకి సహకరిస్తాయి. ఈ షేరు మార్చి కనిష్టస్థాయి నుంచి డ్రీమ్ ర్యాలీ చేసింది. షేర్ హోల్డర్ల కోణంలో పరిశీలిస్తే వచ్చే 3ఏళ్లలో షేరు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.’’ అని అజయ్ బోడ్కే తెలిపారు. వచ్చే 2-5ఏళ్లలో జియో వాల్యూయేషన్ 200 బిలియన్ డాలర్లు: కేఆర్ చౌక్సీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే 2-5ఏళ్లలో జియో ప్లాట్‌ఫాం 200 బిలియన్ డాలర్ల వాల్యూయేషన్స్‌ను సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కేఆర్ చౌక్సీ ఇన్వెస్ట్మెంట్స్ మేనేజర్ దేవన్ చౌక్సీ అన్నారు. జియో ప్లాట్‌ఫామ్ సామర్థ్యాన్ని గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి వాటితో పోలిస్తున్నారు. కంపెనీని రుణ రహితంగా మారుస్తామని ఇచ్చిన వాగ్ధానాన్ని ముకేశ్ నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు. రిటైల్, హెల్త్‌కేర్, పేమెంట్స్ గేమింగ్ అండ్ ఎడ్యుకేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి అనేక పెద్ద మొత్తంలో వ్యాపార అవకాశాల కోసం రిలయన్స్ పూర్తి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని చౌక్సీ చెప్పారు. ఆశావాదం విస్తృతంగా వ్యాపించింది: ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కంపెనీపై ఆశావాదం విస్తృత స్థాయిలో వ్యాపించడంతో షేరు మరి కొంతకాలం ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అయాన్ ముఖోపాధ్యాయ్ అన్నారు. ఇంకా చాలా ఫండింగ్ సంస్థలు ఈ షేరును కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఇటీవల స్టాక్ విభజన జరగవచ్చనే ఊహాగానాలు కూడా వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. రిలయన్స్ వ్యాపారాల విభజన జరిగి వేర్వేరు సంస్థలుగా ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కావచ్చన్నారు. దీంతో మరిన్ని పెట్టుబడులను రిలయన్స్‌ను ఆకర్షించేందుకు అవకాశం ఉందిని ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. నిర్ణయించిన గడువుకు ముందే కంపెనీని నికర రుణరహితంగా మారుస్తామని ఇచ్చిన హామిని ముకేశ్ అంబానీ నిలబెట్టుకోవడంతో ఇన్వెస్టర్లు రిలయన్స్ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి వచ్చే ఏడాది మార్చి 31వ తేదిలోగా కంపెనీని రుణ రహిత కంపెనీగా మారుస్తామని గతంలో కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ అనుబంధ సంస్థ జియో ఫ్లాట్‌ఫామ్ పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో పాటు దేశంలో అతిపెద్ద రైట్స్ ఇష్యూను విజయవంతం చేయడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి 150బిలియన్ డాలర్లను అందుకుంది. ఈ క్రమంలో 150బిలియన్ డాలర్లను అందుకున్న తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం 58 రోజుల్లో రూ.1,68,818 కోట్లను సమీకరించింది. ఇందులో జియోలో వాటా విక్రయంతో రూ.115,693.95 కోట్లను, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124.20 కోట్లును సేకరించింది. గతంలో పెట్రో-రిటైల్ జాయింట్ వెంచర్లో బ్రిటన్ సంస్థ బీవీకి వాటాను విక్రయించడంతో రూ.7వేల కోట్లకు విక్రయించడంతో మొత్తం రూ.1.75లక్షల కోట్లు నిధుల సమీకరణ చేయగలిగింది. -
రిలయన్స్ @ రూ.11లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మార్కెట్ క్యాప్ గురువారం రూ.11లక్షల కోట్లను తాకింది. మార్కెట్ బౌన్స్‌బ్యాక్‌లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకోవడం ఇందుకు కారణమైంది. మార్కెట్ నష్టాల ప్రారంభంలో భాగంగా నేడు ఈ కంపెనీ షేరు అరశాతానికి పైగా నష్టంతో రూ.1605.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మిడ్ సెషన్ అనంతరం లభించిన అపూర్వ కొనుగోళ్లతో షేరు ఇంట్రాడే కనిష్టం నుంచి 3.70శాతం లాభపడి రూ.1665.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 2.50 శాతం లాభంతో రూ.1656.25 వద్ద స్థిరపడింది. షేరు సరికొత్త గరిష్టాన్ని నమోదు చేయడంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.11లక్షల కోట్లను అందుకుంది. ఈ ఘనత సాధించిన భారతీయ తొలి కంపెనీగా రికార్డుకెక్కింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది మార్చి కనిష్టస్థాయి నుంచి షేరు ఏకంగా 80శాతం పెరిగింది. కేవలం 3నెలల్లోనే 10 విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రిలయన్స్ జియోలో దాదాపు రూ.1.04లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం షేరు ర్యాలీకి కారణమైనట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రిలయన్స్ షేరుపై బ్రోకరేజ్‌లకు ఎందుకంత మోజు..?
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది మార్చి కనిష్టస్థాయి నుంచి షేరు ఏకంగా 80శాతం పెరిగింది. కేవలం 3నెలల్లోనే 10 విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రిలయన్స్ జియోలో దాదాపు రూ.1.04లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం షేరు ర్యాలీకి కారణమైనట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో మంగళవారం ఇంట్రాడే షేరు రూ.1647 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఈ షేరు ఇంత స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ.., రానున్న రోజుల్లో మరింత లాభపడేందుకు అవకాశాలున్నట్లు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలైన మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మెన్ శాక్స్, సీఎల్‌ఎస్‌ఏలు రిలయన్స్ షేరుపై ఇప్పటికీ బుల్లిష్ వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ షేరుపై ఆయా సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి... మోర్గాన్ స్టాన్లీ: ఆస్తుల అమ్మకాలు, ఇంధన విభాగంలో క్యాష్ ఫ్లోలు తిరిగి పుంజుకోవడం, రిటైల్ అమ్మకాలు పెరగడం, టెలికాం యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరగడం తదితర కారణాలతో షేరు రానున్న రోజుల్లో మరింత ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. ‘‘ ఏడాది తర్వాత ప్రైస్-టు-ఎర్నింగ్ (పీ/ఈ), ప్రైస్-టు-బుక్ (పీ/బీ)లు ఇప్పుడు సైకిల్ లెవల్లో గరిష్టస్థాయి వద్ద ఉన్నాయి. అయితే ఈక్విటీపై రిటర్న్(ఆర్ఓఈ), వృద్ధి ఆదాయాలను తన సహచర కంపెనీలు(పీర్స్)తో పోలిస్తే అధికంగా ఉన్నాయి.’’ అని మోర్గాన్ స్టాన్లీ ఈక్విటి విశ్లేషకుడు మయాంక్ మహేశ్వర్ తెలిపారు. మోర్గాన్ స్లాన్టీ ఈ షేరుపై ఓవర్‌వెయిట్ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.1801కి పెంచింది. గోల్డ్‌మెన్ శాక్స్: బ్రోకరేజ్ అంచనాల ప్రకారం.... ఆఫ్‌లైన్ గ్రాసరీ స్టోర్ విస్తరణ-ఆధారిత మార్కెట్ వాటా, ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్ విస్తరణతో రిలయన్స్ గ్రాసరీ రీటైల్ స్థూల వ్యాపారణ విలువ ఆర్థిక సంవత్సరం 2029 నాటికి 83బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అంతేకాకుండా, రిటైల్ వ్యాపారం ఎబిడిటా ఎఫ్వై 20-29 మధ్య 5.6 రెట్ల వృద్ధిని సాధిస్తుందని బ్రోకరేజ్ సంస్థ ఆశిస్తోంది. గోల్డ్‌మెన్ శాక్స్ ''బై'' రేటింగ్ కేటాయించడంతో పాటు పాటు షేరు టార్గెట్ ధరను రూ.1755గా నిర్ణయించింది సీఎల్ఎస్ఏ: ఈ-కామర్స్ రంగంలో విజయవంతం కావడం, ఇన్విట్ టవర్ల వాటా అమ్మకం, జియో ఫ్లాట్‌ఫామ్‌లో మరింత వాటా విక్రయం, అరామ్కో ఒప్పందం తదితదర అంశాలు రిలయన్స్ షేరు తదుపరి ర్యాలీని నడిపిస్తాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇటీవల ఫేస్‌బుక్‌తో ఒప్పందం జియో మార్ట్‌కు కలిసొస్తుంది. ఫేస్బుక్ అనుబంధ సంస్థ వాట్సప్ ద్వారా వినియోగదారులతో సత్సంబంధం పెంచుకోవడం, నిరంతరం వారికి అందుబాటులో ఉండటంతో వ్యాపార అభివృద్ధికి మరింత కలిసొస్తుందని సీఎల్ఎస్ఏ తెలిపింది. సీఎల్‌ఎస్‌ఈ బ్రోకరేజ్ సంస్థ సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. -
ఆర్ఐఎల్లో 12ఏళ్ల గరిష్టానికి ముకేశ్ వాటా
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ వాటా 12ఏళ్ల గరిష్ట స్థాయి 49.14శాతానికి చేరుకుంది. ఇటీవల ఆర్ఐల్ జారీ చేసిన రైట్స్ ఇష్యూలో భాగంగా ముకేశ్ కొన్ని షేర్లను సొంతం చేసుకోవడంతో కంపెనీలో వాటా పెరిగింది. ఆర్ఐఎల్కు చెందిన రూ.53,124 కోట్ల రైట్స్ ఇష్యూలో ముకేశ్ అంబానీ, ఇతర ప్రమోటర్ గ్రూప్ సభ్యులు కలిపి రూ.28,286 కోట్లు వెచ్చించి 2.25 కోట్ల షేర్లను దక్కించుకున్నారు. కంపెనీలో జూన్ 2008 నాటికి ప్రమోటర్ల వాటా 51.37 శాతంగా ఉండేది. అది 2011 సెప్టెంబర్ నాటికి 44.71శాతానికి దిగివచ్చింది. అప్పటి నుంచి ప్రమోటర్లు వివిధ రూపాల్లో క్రమంగా కంపెనీలో వాటాలను పెంచుకుంటున్నారు. రైట్స్ ఇష్యూలో భాగంగా అన్సబ్స్క్రైబ్డ్ పోర్షన్లో ప్రమోటర్ గ్రూప్ దాదాపు 50శాతం అదనపు వాటాను సొంతం చేసుకున్నట్లు రెగ్యూలేటరీ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో ఒక ప్రమోటర్ తన కంపెనీలో వాటాను పెంచుకోవడం, భారీ ఎత్తున నిధులను సమీకరించడటం లాంటి అంశాలు సంస్థ భవిష్యత్తు వృద్ధిపై ప్రమోటర్ నిబద్ధతను చాటి చెబుతాయి. అలాగే ఇన్వెస్టర్లలో మరింత విశ్వాసాన్ని పెంచుతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్ రామ్‌దియో అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 24న సూచీలు ఏడాది కనిష్టాన్ని తాకిన నాటి నుంచి శుక్రవారం వరకు రిలయన్స్ షేరు 82శాతం లాభపడింది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.10.07లక్షల కోట్లుగా ఉంది. గురువారం ఆర్ఐల్ పాక్షిక పెయిడ్-అప్ రైట్స్ ఇష్యూ షేర్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. రైట్స్ ఇష్యూలో ముకేశ్‌కు 5.52లక్షల షేర్లు: రైట్స్ ఇష్యూలో భాగంగా కంపెనీ అధిపతి ముకేశ్ అంబానీ 5.52లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నారు. ఈ షేర్ల కొనుగోలుతో ముకేష్ అంబానీకి వ్యక్తిగతంగా రిలయన్స్‌లో మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్య 80.52లక్షలకు చేరుకుంది. రైట్స్ ఇష్యూకు ముందు 75 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇష్యూలో ముకేశ్ భార్య నీతా అంబానీ, పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్‌లు సైతం ఒక్కొక్కరు 5.52లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. -
ముఖేష్ అంబానీని ముందుండి నడిపించినా..
ముంబై : ఆయనకు కెమేరాల మెరుపులంటే మోజులేదు..టీవీ స్క్రీన్లపై మెరవాలనే ఆసక్తీ లేదు. ఒంటిచేత్తో రూ వేల కోట్ల కార్పొరేట్ డీల్స్‌ను ఖరారు చేయగల సత్తా ఉన్నా నలుగురిలో పేరుకోసం తహతహలాడే తత్వం కాదు. భారత కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీని ముందుండి నడిపించే శక్తే అయినా ప్రచార పటాటోపాలకు వెనుకుండే వ్యక్తి..ఆయనే మనోజ్ మోదీ. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీకి మనోజ్ మోదీ కుడిభుజం అని కార్పొరేట్ వర్గాలు చెబుతుంటాయి. గుంభనంగా, బహిరంగ వేదికల్లో పెద్దగా కనబడని మోదీని ముఖేష్‌కు అత్యంత సన్నిహితుడని చెబుతారు. ఫేస్‌బుక్‌తో 570 కోట్ల డాలర్ల భారీ డీల్ సంప్రదింపుల్లో మోదీ కీలక పాత్ర పోషించారు. పెట్రోకెమికల్స్ నుంచి ఇంటర్నెట్ టెక్నాలజీలకు ముఖేష్ తన వ్యాపార సామ్రాజాన్ని విస్తరించాలనే లక్ష్యంలో మనోజ్ మోదీ చురుగ్గా వ్యవహరించారు. రిలయన్స్ జియోలో మరికొన్ని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు పెట్టుబడులు పెట్టే ఒప్పందాల్లోనూ ఆయనదే కీలక పాత్రని కార్పొరేట్ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే మోదీ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడతారు. సంస్ధాగత నిర్మాణంపై రిలయన్స్ ప్రచారం చేసుకోకున్నా అంబానీ, మనోజ్ మోదీల సాన్నిహిత్యం ఎలాంటిదో పరిశ్రమ వర్గాలకు తెలుసని, కీలక ఒప్పందాలను ఇరువురు ఖరారు చేస్తూ పకడ్బందీగా వాటి అమలుతీరుకు పూనుకుంటారని వెంచర్ క్యాపిటల్ సంస్థ కలారి క్యాపిటల్ పార్టనర్స్ ఎండీ వాణి కోల పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోల్లో డైరెక్టర్‌గా వ్యవహరించే మనోజ్ మోదీ కంపెనీ ఉద్యోగులను మెరికల్లా తీర్చిదిద్దడంలోనూ ముందుంటారు. చదవండి : ఫోర్భ్స్ జాబితాలో మళ్లీ ముఖేష్ -
రైట్స్ ఇష్యూలో ముకేశ్‌కు 5.52లక్షల షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల జారీ చేసిన రూ.53వేల కోట్ల రైట్స్ ఇష్యూలో భాగంగా కంపెనీ అధిపతి ముకేశ్ అంబానీ 5.52లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసున్నారు. కంపెనీ రెగ్యూలేటరీ ఇచ్చిన సమాచారం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షేర్ల కొనుగోలుతో ముకేష్ అంబానీకి వ్యక్తిగతంగా రిలయన్స్‌లో మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్య 80.52లక్షలకు చేరుకుంది. రైట్స్ ఇష్యూకు ముందు 75 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇష్యూలో ముకేశ్ భార్య నీతూ అంబానీ, పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్‌లు సైతం ఒక్కొక్కరు 5.52లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఇదే రైట్స్ ఇష్యూలో ప్రమోటర్స్ గ్రూప్ 22.50కోట్ల ఈక్విటీ షేర్లను దక్కించుకుంది. తద్వారా షేర్‌హోల్డింగ్ వాటా 50.07శాతం నుంచి 50.29శాతానికి పెంచుకుంది. మరోవైపు పబ్లిక్ హోర్‌హోల్డింగ్ వాటా 49.93శాతం నుంచి 49.71శాతానికి దిగివచ్చింది. ఎల్ఐసీ 2.47 కోట్ల ఈక్విటీ షేర్లను సబ్‌స్క్రైబ్ చేసుకుంది. ఈ కొనుగోలుతో ఎల్ఐసీ వద్ద మొత్తం ఈక్విటీ షేర్లు 37.18 కోట్లకు చేరుకున్నాయి. తద్వారా రిలయన్స్‌లో ఎల్ఐసీ షేర్‌హోల్డింగ్ వాటా 6శాతానికి చేరుకుంది. కొత్త పబ్లిక్ షేర్హోల్డర్లు 19.74 కోట్ల ఈక్వటీ షేర్లను దక్కించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.53,124 కోట్లు సమీకరణ లక్ష్యంతో రైట్స్ ఇష్యూ ద్వారా 42.26 షేర్లను విక్రయానికి పెట్టింది. ప్రతిషేరు ధరను రూ.1,257 నిర్ణయించింది. రైట్స్ ఇష్యూకు ఇన్వెస్టర్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. గతవారం జూన్ 3న రైట్స్ ముగిసింది. ఈ ఇష్యూకు 1.59 రెట్లు సబ్ స్క్రిప్షన్ లభించింది. ఈ దెబ్బకు ఆర్ఐఎల్ ఏకంగా రూ.84 వేల కోట్లను సమకూర్చుకుంది. -
ఆర్ఐఎల్ రైట్స్ ఇష్యూకు భారీ స్పందన
ముంబై : రూ 53,124 కోట్లతో తాము జారీచేసిన దేశంలోనే అతిపెద్ద రైట్స్ ఇష్యూ విజయవంతంగా ముగిసిందని రిలయన్స్ ఇండస్ర్టీస్ (ఆర్ఐఎల్) వెల్లడించింది. రైట్స్ ఇష్యూకు మదుపుదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఇష్యూ 1.59 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని తెలిపింది. దేశ, విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లతో పాటు లక్షలాది చిన్న మదుపుదారులు ఈ ఇష్యూ పట్ల ఆసక్తి కనబరిచారు. రైట్స్ ఇష్యూలో ప్రజల వాటా 1.22 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయిందని ఆర్ఐఎల్ ప్రకటించింది. ఈనెల 10 నుంచి షేర్ల కేటాయింపు జరగనుంది. జూన్ 12న రైట్స్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వద్ద లిస్ట్ కానున్నాయి. రైట్స్ ఇష్యూపై కంపెనీ చేపట్టిన వినూత్న ప్రచారం మంచి ఫలితాలను రాబట్టింది. రైట్స్ ఇష్యూ విజయవంతం కావడంతో ఆర్ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ స్పందిస్తూ రైట్స్ ఇష్యూలో పాల్గొన్న వాటాదారులకు ధన్యవాదాలు తెలిపారు. భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో రైట్స్ ఇష్యూ మైలురాయిలా నిలిచిపోయేలా చేశారని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారితో సతమతమవుతున్న సమయంలో ఆర్ఐఎల్ రైట్స్ ఇష్యూ విజయవంతం కావడం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సంకేతమని ముఖేష్ అన్నారు. చదవండి : మరో మెగా డీల్: అంబానీ కల నెలవేరినట్టే! -
నకిలీ యాడ్స్‌పై ఓఎల్ఎస్, క్వికర్‌లకు హైకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఒఎల్ఎక్స్, క్వికర్‌లు తమ వెబ్సైట్లలో రిలయన్స్ జియో పేరిట నకిలీ ఉద్యోగ ప్రకటనలు పొందుపరచడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ఒఎల్ఎక్స్, క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్‌లను ఆదేశించింది. జియో జాబ్స్, రిలయన్స్ ట్రెండ్స్ జాబ్స్ అనే వర్డ్స్‌ను ఉపయోగిస్తూ నకిలీ ప్రకటనలు ఇవ్వడంతో రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రతిష్ట, గుడ్‌విల్ దెబ్బతింటాయని ఆర్ఐఎల్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో ఆర్ఐఎల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు అనుకూలంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున మధ్యంతర ఊరట కల్పిచని పక్షంలో వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని జస్టిస్ ముక్తా గుప్తా రెండు వేర్వేరు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జియో, రిలయన్స్ ట్రేడ్‌మార్క్‌లకు తాము సొంతదారులమని ఓఎల్ఎక్స్, క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లు తమ గుడ్‌విల్‌కు, ప్రతిష్టకు తీరని హాని కలిగించేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్ఐఎల్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి : మరో మెగాడీల్‌కు జియో రెడీ -
సెన్సెక్స్ 199 పాయింట్లు అప్
ఆరంభ లాభాలు ఆవిరైనా, శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో విదేశీ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టటంతో ఆ షేర్ 3 శాతం మేర లాభపడటం, మరో దిగ్గజ కంపెనీ హెచ్‌యూఎల్ 5 శాతం పెరగడం కలసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తొలి దశ చర్చలు చోటు చేసుకోవడంతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం, వివిధ దేశాలు దశలవారీగా లాక్‌డౌన్‌ను తొలగిస్తుండటం....సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 646 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ చివరకు 199 పాయింట్ల లాభంతో 31,643 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 9,252 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2,075 పాయింట్లు, నిఫ్టీ 608 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఈ సూచీలు చెరో 6 శాతం మేర పతనమయ్యాయి. రోజంతా లాభాలు..... ఆసియా మార్కెట్ల దన్నుతో మన మార్కెట్ భారీ లాభాల్లో ఆరంభమయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. అయితే చివర్లో లోహ, ఆర్థిక రంగ, వాహన షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. దీంతో ఆరంభ లాభాలు తగ్గాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2% లాభాల్లో ముగిశాయి. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 4 శాతం లాభంతో రూ.1,562 వద్ద ముగిసింది. ఈ కంపెనీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ 2.3 శాతం వాటాను రూ.11,367 కోట్లతో కొనుగోలు చేసింది. దీంతో ఈ షేర్ జోరుగా పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ,.9,90,088 కోట్లకు పెరిగింది. ఈ షేర్ మరో రూ.15 మేర పెరిగితే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు ఎగబాకుతుంది. ► హిందుస్తాన్ యూనిలివర్(హెచ్‌యూఎల్) షేర్ 5 శాతం లాభంతో రూ.2,088 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సొసైటీ జనరల్ సంస్థ 1.3 కోట్ల షేర్లను రూ.1,902 ధరకు కొనుగోలు చేయడంతో ఈ షేర్ ఈ స్థాయిలో పెరిగింది. ► దాదాపు 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ కన్సూమర్, సుజ్లాన్ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 90 కంపెనీల షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, డీబీ కార్ప్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా పవర్ తదితర షేర్లు ఈ పడిపోయిన జాబితాలో ఉన్నాయి. -
రిలయన్స్‌పై కోవిడ్-19 ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ : మార్చి త్రైమాసంలో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నికర లాభం 39 శాతం తగ్గి రూ 6,348 కోట్లుగా నమోదైంది. కోవిడ్-19 వ్యాప్తితో ముడిచమురు ధరల భారీ పతనం ప్రభావం ఆర్ఐఎల్ ఫలితాలపై చూపింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ 10,362 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రిలయన్స్ గ్రూప్ రాబడి రూ 1,42,565 కోట్లు కాగా ప్రస్తుతం 2.3 శాతం తగ్గి రూ 1,39,283 కోట్లకు పరిమితమైంది. ఇక దేశంలోనే అతిపెద్ద రైట్స్ ఇష్యూ ద్వారా రూ 53,125 కోట్ల నిధులు సమీకరించేందుకు ఆర్ఐఎల్ ఆమోదముద్ర వేసింది. కాగా ఈ క్వార్టర్లో చమురు ధరలు అనూహ్యంగా తగ్గడంతో ఇంధన వ్యాపారంలో రూ 4245 కోట్ల నష్టం వాటిల్లిందని కంపెనీ పేర్కొంది. చదవండి : ట్రెండ్ సెట్ చేసిన అంబానీ -
కోవిడ్-19పై పోరు : ఉద్యోగులకు ముఖేష్ ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతూ ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే విపత్కాలంలో ధైర్యంగా సేవలందిస్తున్న తమ ఉద్యోగులను ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసించారు. దేశమంతా లాక్డౌన్లో ఉంటే కోవిడ్-19పై ఆర్ఐఎల్ సమరంలో గ్రూపు సంస్థల ఉద్యోగులు యోధులా నిలిచారని బిలియనీర్ ముఖేష్ ప్రస్తుతించారు. మహమ్మారి కోరల్లో దేశం చిక్కుకున్న ఈ విపత్తు వేళ ఉద్యోగులంతా అంకితభావంతో సేవలందిస్తున్నారని రెండు లక్షలకు పైగా ఆర్ఐఎల్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్‌తో 130 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా రిలయన్స్ జియో 40 కోట్ల మందికి నిరంతర వాయిస్ కాల్స్, మొబైల్‌పై ఇంటర్నెట్ సేవలను అందించిందని, రిలయన్స్ రిటైల్ ద్వారా లక్షలాది మందికి నిత్యావసరాలు, ఆహారం సరఫరా సమకూరిందని చెప్పారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు టెస్టింగ్ సామర్థ్యాల పెంపునకు రిలయన్స్ లైఫ్‌సైన్సెస్ సన్నాహాలు చేస్తోందని గుర్తుచేశారు. హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి ముంబైలో కేవలం పదిరోజుల్లోనే వంద పడకల కరోనావైరస్ చికిత్సా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పుకొచ్చారు. కంపెనీ రిఫైనరీలు ఇంధన అవసరాలను తీర్చేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఇక సిబ్బంది తమ ఆలోచనలు పంచుకునేందుకు మైవాయిస్ వేదికను లాంఛ్ చేస్తున్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ సంక్లిష్ట పరిస్థితిని అధిగమించి మనం సురక్షితంగా, ఆరోగ్యకరంగా ముందుకెళతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : కరోనా: థాంక్స్ చెప్పిన ముఖేష్ అంబానీ! -
పీఏం కేర్స్ ఫండ్‌కు రిలయన్స్ భారీ విరాళం
ముంబై : కరోనా వైరస్‌పై దేశం జరిపే పోరులో సాయపడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పీఎం కేర్స్ ఫండ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రూ 500 కోట్ల విరాళం ప్రకటించింది. పీఎం సహాయ నిధికి అందించే మొత్తానికి అదనంగా మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు రూ 5 కోట్ల చొప్పున విరాళాలను అందచేస్తామని ఆర్ఐఎల్ తెలిపింది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు 100 పడకలతో కోవిడ్-19 హాస్పిటల్ రెండు వారాల్లోనే సిద్ధమైందని, వైద్య సిబ్బంది రక్షణ కోసం పీపీఈ ప్రొటెక్టివ్స్ గేర్స్‌ను పంపిణీ చేస్తామని వెల్లడించింది. పది రోజుల్లో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది పేదలకు భోజనం సరఫరా చేయడంతో పాటు ప్రతిరోజూ లక్ష మాస్క్‌లను వైద్య సిబ్బంది, ఆరోగ్య సంరక్షకులకు సరఫరా చేస్తామని తెలిపింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలకు దేశవ్యాప్తంగా ఉచిత ఇంధనాన్ని సమకూరుస్తామని పేర్కొంది. చదవండి : కరోనాపై పోరుకు రిలయన్స్ సిద్ధం.. -
ముఖేష్‌ను వెనక్కినెట్టిన జాక్‌మా
న్యూఢిల్లీ : ముడిచమురు ధరల పతనంతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం ప్రపంచ కుబేరుల స్ధానాలనూ కదిలించింది. ఆసియాలో అత్యంత సంపన్నుడి స్ధానాన్ని భారత పారిశ్రామికదిగ్గజం ముఖేష్ అంబానీ కోల్పోయారు. షేర్‌మార్కెట్ కుదేలవడంతో అంబానీ నికర సంపద ఏకంగా 580 కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోవడంతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్ధానాన్ని అలీబాబా గ్రూప్ అధినేత జాక్‌మా ఆక్రమించారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ముఖేష్ అంబానీ కంటే 260 కోట్ల డాలర్ల అధిక సంపద (4450 కోట్ల డాలర్లు)తో జాక్‌మా ఆసియా సంపన్నుల్లో నెంబర్‌వన్‌గా నిలిచారని పేర్కొంది. కరోనా వైరస్ భయాలు ఈక్విటీ మార్కెట్లను వెంటాడుతున్న క్రమంలో 30 ఏళ్ల కనిష్టస్ధాయిలో ముడిచమురు ధరలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు సోమవారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. రిలయన్స్ షేర్లు సైతం ఏకంగా 12 శాతం పతనమయ్యాయి. అయితే ప్రతికూల పరిణామాలు తాత్కాలికమేనని ముఖేష్ అంబానీ (62) తిరిగి సత్తా చాటుతారని ఈక్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌కు చెందిన హరీష్ హెచ్వీ అన్నారు. అంబానీ టెలికాం బిజినెస్ రానున్న సంవత్సరాల్లో మెరుగైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకొచ్చారు. చదవండి : కోవిడ్ క్రాష్ : అంబానీకి నష్టం ఎంతంటే? -
ముకేశ్ అంబానీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. సీఎన్‌బీసీ-టీవీ18 ఐకానిక్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికెడ్‌గా ముకేశ్ అంబానీ నిలిచారు. సీఎన్‌బీసీ-టీవీ18 నిర్వహించిన ఇండియన్ బిజినెస్ లీడర్స్ అవార్డుల ప్రధానోత్సవం శుక్రవారం ముంబైలో ఘనంగా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా ముకేశ్ ఐకానిక్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికెడ్ అవార్డును అందుకున్నారు. ముకేశ్ నాయకత్వంలో రిలియన్స్ గ్రూప్ భారత్‌లోనే అతిపెద్ద కంపెనీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును ముకేశ్ తన తండ్రి, రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీతోపాటు, కంపెనీలోని యంగ్ లీడర్స్‌కు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ముకేశ్ మాట్లాడుతూ.. ఒక వస్త్ర సంస్థగా ప్రారంభమైన తమ కంపెనీ పెట్రోకెమికల్ కంపెనీగా మారిందని గుర్తుచేశారు. గత నాలుగు దశాబ్దాలుగా రిలయన్స్‌ను అనుసరిస్తున్న వారికి తమను తాము ఎలా మార్చుకున్నామో తెలుస్తుందన్నారు. గత దశాబ్దంలో తమ సంస్థ ప్రపంచ స్థాయి రిటైల్, వినియోగదారుల టెక్ వ్యాపారాన్ని నిర్మించిందని తెలిపారు. తమ కంపెనీ యువ నాయకత్వం తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్నట్టు చెప్పారు. అలాగే రిలయన్స్ కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీల పాత్రను ముకేశ్ ప్రస్తావించారు. వచ్చే దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధి కనబరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
మెగా డీల్ : ఆర్ఐఎల్, ఆరాంకో చర్చలు ముమ్మరం
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ తన చమురు, రసాయనాల విభాగంలో మైనారిటీ వాటా విక్రయానికి సంబంధించి సౌదీ అరాంకోతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ ఒప్పందంపై ఆరాంకో అధికారులు, బ్యాంకర్లు ఈ నెలలో ముంబైలోని రిలయన్స్ కార్యాలయాలకు చేరుకుని విలువ మదింపు ప్రక్రియను వేగవంతం చేస్తారని సమాచారం. ఈ భారీ ఒప్పందంపై తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇరు పార్టీలు సంసిద్ధమయ్యాయి. సెప్టెంబర్ మాసాంతంలో జరిగే వార్షిక వాటాదారుల సమావేశం లోగా ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆర్ఐఎల్ అధినేత, బిలియనీర్ ముఖేష్ అంబానీ యోచిస్తున్నారు. చదవండి : భారత సీఈఓలతో 25న ట్రంప్ భేటీ గత ఏడాది ఆగస్ట్‌లో తన ఆయిల్, పెట్రోకెమికల్స్ డివిజన్ విలువ 7500 కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. ఆ ప్రకారం 20 శాతం వాటా 1500 కోట్ల డాలర్లు పలకనుంది. ఈ విలువ ప్రామాణికంగా విక్రయ ప్రక్రియ పూర్తయితే ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ వాటా కొనుగోలు అనంతరం ఇదే భారీ అతిపెద్ద లావాదేవీగా నమోదవనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా రిలయన్స్ ఆయిల్, పెట్రోకెమికల్ డివిజన్లో 20 శాతం వాటా విక్రయానికి ఆర్ఐఎల్, సౌదీ ఆరాంకో అంగీకరించాయని ఆగస్ట్‌లో వాటాదారుల సమావేశంలో ఆర్ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
అదరగొట్టిన రిలయన్స్..
ముంబై : డిసెంబర్ క్వార్టర్లో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రోత్సాహకర త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ కాలంలో ఆర్ఐఎల్ నికర లాభం అత్యధికంగా 13.5 శాతం వృద్ధితో రూ 11,640 కోట్లు ఆర్జించింది. కన్జ్యూమర్ వ్యాపారంలో మెరుగైన నిర్వహణ సామర్థ్యం కనబరిచింది. ఇక ఈ త్రైమాసంలో కన్సాలిడేటెడ్ ఫలితాలను పరిశీలిస్తే ఆదాయం 1.4 శాతం తగ్గి రూ 1,68,858 కోట్లుగా నమోదైంది. పన్నుకు ముందు లాభాలు 3.6 శాతం పెరిగి రూ 14,962 కోట్లు కాగా నికర లాభం అత్యధికంగా 13.5 శాతం వృద్ధితో రూ 11,640 కోట్లుగా నమోదయ్యాయి. మూడో క్వార్టర్లో తమ ఇంధన వ్యాపారంపై గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల అనిశ్చితి, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం కనిపించిందని, అయితే రిఫైనింగ్ విభాగంలో మెరుగైన సామర్ధ్యం కనబరిచామని ఆర్థిక ఫలితాలపై ఆర్ఐఎల్ సీఎండీ ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. మరోవైపు కన్జూమర్ వ్యాపారాలు ప్రతి క్వార్టర్లో నూతన మైలురాళ్లను నెలకొల్పుతూ పురోగతి సాగిస్తున్నాయని అన్నారు. కొనసాగిన జియో జోష్.. దేశంలో 4జీ దిశగా మార్పునకు వేగంగా అడుగులు వేస్తూ జియో డిసెంబర్ త్రైమాసంలో అన్ని విభాగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరిచింది. మూడవ క్వార్టర్లో అదనంగా 3.7 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు జియో నెట్‌వర్క్‌కు తోడయ్యారు. ఆదాయం రూ 13,968 కోట్లకు పెరగడంతో నికర లాభం గత క్వార్టర్‌తో పోలిస్తే 36.4 శాతం వృద్ధితో రూ 13.50 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలపై ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మెరుగైన మొబైల్ కనెక్టివిటీ సేవలతో కస్టమర్లను ఆకర్షిస్తూ జియో తన విజయవంతమైన ప్రస్ధానం కొనసాగిస్తోందని అన్నారు. అందుబాటైన ధరలో ప్రజలకు అసాధారణ డిజిటల్ అనుభూతిని అందించడంపై జియో దృష్టిసారిస్తుందని చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా నెట్వర్క్ సామర్ధ్యాలను ఆధునీకరిస్తామని వెల్లడించారు. చదవండి : జియో ఫైబర్ సంచలన ఆఫర్లు -
ఓఎన్జీసీకి చమురు క్షేత్రాల అప్పగింత
ముంబై : పన్నా- ముక్తా చమురు సహజ వాయు క్షేత్రాలపై పాతిక సంవత్సరాల పాటు పనిచేసిన అనంతరం షెల్, రిలయన్స్, ఓఎన్‌జీసీలతో కూడిన జాయింట్ వెంచర్ ఆ చమురు క్షేత్రాలను తిరిగి ఓఎన్జీసీకి అప్పగించింది. ఈ ఏడాది డిసెంబర్ 21న ఒప్పందం ముగియటంతో వీటిని జాయింట్‌వెంచర్ సంస్థ ఓఎన్జీసీకి తిరిగి బదలాయించింది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ర్టీస్ ప్రెసిడెంట్ (ఈఅండ్‌పీ) బి. గంగూలీ మాట్లాడుతూ పన్నా-ముక్తా చమురు క్షేత్రం నుంచి దేశీ చమురు ఉత్పాదనలో దాదాపు ఆరు శాతం సమకూర్చామని ఇక 2007-08లో దేశ గ్యాస్ ఉత్పత్తిలో దాదాపు ఏడు శాతం ఇక్కడి గ్యాస్ క్షేత్రాల నుంచి సమకూరిందని చెప్పారు. దేశ చమురు, గ్యాస్ రంగంలో ఇతోథిక వృద్ధికి ఇంధనం సమకూర్చడం ద్వారా మెరుగైన పయనంలో రిలయన్స్ భాగస్వామిగా ఉందని అన్నారు. ఇక బీజీఈపీఐల్ ఎండీ త్రివిక్రమ్ అరుణ్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ ఓఎన్జీసీతో ప్రైవేట్ రంగ రిలయన్స్, అంతర్జాతీయ ఆయిల్ దిగ్గజం షెల్‌తో కలిసి ఏర్పాటైన ఈ జాయింట్ వెంచర్ ఇంధన రంగంలో అద్భుత ఉదాహరణగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఒప్పందం ముగియగానే చమురు, సహజవాయు క్షేత్రాలను తిరిగి సురక్షితంగా ఓఎన్జీసికి అప్పగించామని వెల్లడించారు. -
జియో-బీపీ పేరుతో రిలయన్స్ పెట్రోలు బంకులు
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తన ఇంధన రిటైల్ వ్యాపారాన్ని బ్రిటిష్ ఇంధన ప్రధాన సంస్థ బీపీతో తుది ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రాధమిక ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆర్ఐఎల్, బీసీ సోమవారం ఒక ఖచ్చితమైన ఒప్పందంపై సంతకం చేశాయని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. జియో-బీపీ బ్రాండ్ ఇంధన మార్కెటింగ్, మొబిలిటీ సొల్యూషన్స్ ద్వారా వేగంగా అభివృద్ది చెందుతున్న భారత మార్కెట్ మరింత అభివృద్ది చెందనుందని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. రెగ్యులేటరీ, ఇతర ఆమోదాలకు లోబడి, 2020 మొదటి భాగంలో జియో-బీపీ జాయింట్ వెంచర్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్లో ఆర్ఐఎల్ 51 శాతం, బీపీ 49 శాతం వాటా ఉంటుంది. ఈ వాటా కోసం బీపీ రూ.7,000 కోట్లను వెచ్చించనుంది. ప్రస్తుతం ఆర్ఐఎల్కు దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం 5,500 పెట్రోల్ బంకులను జాయింట్ వెంచర్ ద్వారా అందుబాటులోకి తేవాలని లక్ష్యం. ఈ జాయింట్ వెంచర్ ద్వారా భారతీయ వినియోగదారులకు అధిక-నాణ్యత విభిన్న ఇంధనాలు, ఇతర సేవలను అందించనున్నామని ఆర్ఐఎల్ తెలిపింది. కాగా ముకేష్ అంబానీ నేతృత్వంలోని మరో సంస్థ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లోని సంస్థాగత భాగస్వాముల నుండి రూ .25,215 కోట్ల పెట్టుబడులను సాధించిన సంగతి తెలిసిందే. -
సత్తా చాటిన ఆర్ఐఎల్
ముంబై : స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరడంతో ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ర్టీస్ (ఆర్ఐఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 10 లక్షల కోట్లకు చేరి ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీగా సత్తా చాటింది. గురువారం ఉదయం పది గంటలకు ఆర్ఐఎల్ షేర్ రూ 1579కు చేరగానే అదేసమయంలో కంపెనీ షేర్ల మొత్తం మార్కెట్ విలువ రూ 10 లక్షల కోట్లు పలికింది. ఈ ఏడాది ఆర్ఐఎల్ షేర్ 41 శాతం పెరగ్గా, బీఎస్ఈ సెన్సెక్స్ కేవలం 12 శాతం పైగా లాభపడింది. ఈ ఏడాది అక్టోబర్ 18న ఆర్ఐల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 9 లక్షల కోట్లకు చేరగా మరో నెలలోనే మరో రూ లక్ష కోట్ల మేర తన విలువను పెంచుకోగలిగింది. రూ 7.81 లక్షల కోట్లతో ఆర్ఐఎల్ తర్వాత టీసీఎస్ రెండో అతిపెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీగా నమోదైంది. -
అంబానీ చానెల్స్‌లో ‘సోనీ’కి వాటా...!
ముంబై: ముకేశ్ అంబానీకి చెందిన నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్‌లో కొంత వాటాను జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కార్పొరేషన్ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి నెట్వర్క్ 18 మీడియాలో సోనీ కంపెనీ మదింపు నిర్వహిస్తోందని సమాచారం. చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయని, ఒప్పందం కుదరవచ్చు లేదా కుదరకపోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... ‘స్థానిక’ బలం కోసం సోనీ..... నెట్వర్క్18లో వాటా కైవసం కోసం ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనే విషయమై కూడా సోనీ కంపెనీ కసరత్తు చేస్తోంది. నెట్వర్క్18లో వాటా కోసం బిడ్‌ను దాఖలు చేయడం లేదా తన భారత వ్యాపారాన్ని నెట్వర్క్18 వినోద చానెళ్లలో విలీనం చేయడం, తదితర మార్గాలపై సోనీ అధ్యయనం చేస్తోంది. ఒక వేళ ఒప్పందం సాకారమైతే, సోనీకి ‘స్థానిక’ బలం పెరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్ తదితర పోటీ సంస్థలకు గట్టిపోటీనివ్వగలుగుతుంది. మరోవైపు అంబానీ చానెళ్లకు సోనీ ఇంటర్నేషనల్ కంటెంట్‌కు యాక్సెస్ లభిస్తుంది. కాగా వివిధ అవకాశాలను మదింపు చేస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి పేర్కొన్నారు. సోనీ సంస్థ భారత, జపాన్ విభాగాలు ఎలాంటి స్పందనను వ్యక్తం చేయలేదు. రెండేళ్లలో మరిన్ని భాగస్వామ్యాలు.... భారత ఓటీటీ మార్కెట్లో అపార అవకాశాలున్నాయి. ఏ అంతర్జాతీయ సంస్థయినా, ఇక్కడి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే స్థానిక వ్యూహం తప్పనిసరని నిపుణులంటున్నారు. రానున్న రెండేళ్లలో ఇలాంటి భాగస్వామ్యాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు మరిన్ని చోటు చేసుకుంటాయని వారంటున్నారు. సోనీ కంపెనీ భారత్‌తో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ద్వారా వివిధ చానెళ్లను నిర్వహిస్తోంది. ఇక టీవీ18 బ్రాడ్కాస్ట్ సంస్థ మొత్తం 56 చానెళ్లను (వార్తలు, వినోద విభాగాలు) నిర్వహిస్తోంది. ఈ వార్తలతో బీఎస్ఈలో ఇంట్రాడేలో నెట్వర్క్18 మీడియా షేర్ 19%, టీవీ18 బ్రాడ్కాస్ట్ షేర్ 10% మేర పెరిగాయి. చివరకు నెట్వర్క్18 షేర్ 8% లాభంతో రూ.27.70 వద్ద, టీవీ18 బ్రాడ్కాస్ట్ 1.5% లాభంతో రూ. 23 వద్ద ముగిశాయి. -
ఫోర్బ్స్ సంపన్నుల జాబితా : మళ్లీ ముఖేషే..
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ 2019 ఏడాదికిగాను ఫోర్బ్స్ ప్రకటించిన భారత్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్ధానంలో నిలిచారు. 51.4 బిలియన్ డాలర్ల (రూ 3.85 లక్షల కోట్ల) విలువైన నికర ఆస్తులతో ముఖేష్ అంబానీ వరుసగా 12వ సారి భారత సంపన్నుల్లో టాప్ ప్లేస్‌ను దక్కించుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది సంక్లిష్ట సంవత్సరమైనా ఆర్ఐఎల్ టెలికాం విభాగం జియో సత్తా చాటడంతో ముఖేష్ అంబానీ సంపదకు 400 కోట్ల డాలర్లు పైగా తోడయ్యాయని ఫోర్బ్స్ పేర్కొంది. ఇక ముఖేష్ తర్వాత బిజినెస్ దిగ్గజాలు గౌతం ఆదాని, హిందుజా బ్రదర్స్, పలోంజి మిస్త్రీ, బ్యాంకర్ ఉదయ్ కొటక్‌ల సంపద కూడా ఈ ఏడాది గణనీయంగా వృద్ధి చెంది వరుసగా రెండు నుంచి ఐదు స్ధానాల్లో నిలిచారని తెలిపింది. ఇంకా ఈ జాబితాలో టాప్ 10 స్ధానాల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్‌నాడార్, అవెన్యూ సూపర్‌మార్ట్స్ అధినేత దమాని, గోద్రెజ్ కుటుంబం, పారిశ్రామిక దిగ్గజాలు కుమార మంగళం, బిర్లా ఫ్యామిలీలు నిలిచాయి. విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ టాప్ 17వ స్ధానం దక్కించుకున్నారు. -
రిలయన్స్‌తో సౌదీ ఆరామ్కో భారీ డీల్
ముంబై : భారత్‌లో అతిపెద్ద ఎఫ్‌డీఐగా రిలయన్స్ రిఫైనరీ, పెట్రోకెమికల్ - సౌదీ ఆరామ్కో ఒప్పందం నిలవనుంది. రిలయన్స్ రిఫైనరీ, కెమికల్ వ్యాపారంలో సౌదీ చమురు దిగ్గజం ఆరామ్కో రూ 5,32,466 కోట్ల మొత్తంతో 20 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందని ఆర్ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆర్ఐఎల్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ఈ ఒప్పందంలో భాగంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రెండు రిలయన్స్ రిఫైనరీలకు ఆరామ్కో రోజుకు 50,000 బ్యారెళ్ల ముడిచమురును సరఫరా చేస్తుందని చెప్పారు. ప్రపంచంలోని దిగ్గజ వాణిజ్య సంస్థల్లో ఒకటైన సౌదీ ఆరామ్కోను తమ సంస్ధలో కీలక ఇన్వెస్టర్‌గా స్వాగతిస్తున్నామని చెప్పారు. సౌదీ ఆరామ్కోతో తమకు పాతికేళ్లుగా ముడిచమురు రంగంలో అనుబంధం ఉందంటూ ఈ పెట్టుబడులతో తమ బంధం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. భారత నియంత్రణ సంస్థలు, ఇతర అనుమతులు, నిబంధనలకు లోబడి వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి ఒప్పందం కార్యరూపం దాల్చుతుందని వెల్లడించారు. మరోవైపు సౌదీ ఆయిల్ కంపెనీ ఆరామ్కో దుబాయ్‌కు చెందిన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ)తో కలిసి మహారాష్ట్రలో పీఎస్‌యూ ఆయిల్ కంపెనీలు ఏర్పాటు చేసే మెగా రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో 50 శాతం వాటా తీసుకునేందుకు అంగీకరించాయి. భారత ఇంధన రంగంలో అపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సౌదీ ఆయిల్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. -
నిలిచిపోయిన ముకేశ్ డీల్..!
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారంలో 25 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీకి చెందిన అరామ్కో ఆసక్తి చూపుతుందన్న విషయం తెలిసిందే. కాగా, ఈ డీల్ నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పాదక కంపెనీల్లో ఒకటైన సౌదీ అరామ్కో లెక్కించిన విలువకు.. ఆర్ఐఎల్ వాల్యుయేషన్‌కు అంతరం అధికంగా ఉన్న కారణంగానే ఈ డీల్ నిలిచిపోయినట్లు చెబుతున్నాయి. అయితే ఊహాగానాలపై మాట్లాడలేమని ఆర్ఐఎల్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
ఫార్చూన్ ఇండియా 500లో ఆర్ఐఎల్ టాప్
న్యూఢిల్లీ: ఫార్చూన్ 500 జాబితాలో భారత్ నుంచి అత్యంత విలువైన కంపెనీగా (ఆదాయం పరంగా) రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇన్నాళ్లు భారత్‌లోని టాప్ కంపెనీగా కొనసాగుతూ వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)ని వెనక్కినెట్టింది. తాజా ఫార్చూన్ గ్లోబల్ 500లో భారతదేశ సంపన్న పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన ఆర్ఐఎల్ 106వ స్థానానికి ఎగబాకింది. ఆ తరువాత స్థానంలో ఉన్న దేశీయ కంపెనీ ఐఓసీ 117వ స్థానంలో నిలిచింది. 2018లో 62.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్ఐఎల్ ఆదాయం 2019లో 32.1 శాతం వృద్ధి చెంది 82.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో ఐఓసీ ఆదాయం 17.7 శాతం వృద్ధి చెంది 77.6 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడైంది. గడిచిన పదేళ్లలో ఆర్ఐఎల్ ఆదాయం 7.2 శాతం చొప్పున చక్రగతి వృద్ధి రేటును నమోదుచేయగా.. ఐఓసీ ఆదాయం 3.64 శాతం వృద్ధితో కొనసాగుతోంది. ఇక ఫార్చూన్ 500లో స్థానం సంపాదించిన ఇతర భారత కంపెనీల జాబితాలో.. ఓఎస్జీసీ(160), ఎస్బీఐ(236), టాటా మోటార్స్(265), బీపీసీఎల్(275), రాజేష్ ఎక్స్పోర్ట్ (495) స్థానాల్లో నిలిచాయి. జాబితాలోని మొదటి స్థానంలో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ ఉంది. -
ఆయిల్, గ్యాస్ బ్లాక్ కోసం ఆర్ఐఎల్, బీపీ పోటీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామి బ్రిటిష్ పెట్రోలియం (బీపీ పీఎల్సీ) ఎనిమిదేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఓ చమురు, సహజ వాయువు బ్లాక్ కోసం బిడ్ దాఖలు చేశాయి. వేదాంత 30 బ్లాక్‌ల కోసం బిడ్లు వేయగా, ఓఎన్జీసీ 20 బ్లాక్‌లకు బిడ్లు వేసింది. ఓపెన్ యాకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) రౌండ్– 2 కింద 14 బ్లాక్‌లు, ఓఏఎల్‌పీ– 3 కింద 18 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లతోపాటు 5 కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచింది. గతేడాది ఓఏఎల్‌పీ–1 కింద జరిగిన 55 బ్లాక్‌ల వేలంలో అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ 41 బ్లాక్‌లను సొంతం చేసుకోగా, ఈ విడత 30 బ్లాక్‌ల కోసం బిడ్లు వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, ఓఎన్జీసీ 20 బ్లాక్‌లు, ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) 15 బ్లాక్‌లకు, ఐవోసీ, గెయిల్, సన్ పెట్రో ఒక్కోటీ రెండేసి బ్లాక్‌లకు పోటీపడినట్టు వెల్లడించాయి. కృష్ణా గోదావరి బేసిన్లో ఒక బ్లాక్ కోసం ఆర్ఐఎల్, బీపీ సంయుక్తంగా బిడ్ వేసినట్టు తెలిపాయి. 2011లో బీపీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టగా, అన్వేషణ బ్లాక్ కోసం పోటీపడడం ఇదే మొదటిసారి. ముకేశ్ అంబానీకి చెందిన ఆర్ఐఎల్ చివరిగా తొమ్మిదో విడత నూతన అన్వేషణ లైసెన్సింగ్ పాలసీలో భాగంగా ఆరు బ్లాక్‌లకు సొంతంగా బిడ్లు వేసినప్పటికీ ఒక్కటీ దక్కించుకోలేదు. ఆ తర్వాత ఎన్ఈఎల్పీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఓఏఎల్‌పీని తీసుకొచ్చింది. ఓఏఎల్‌పీ పాలసీ దేశంలో 2.8 మిలియన్ల చదరపు కిలోమీటర్ల పరిధిలో వెలుగు చూడని చమురు, గ్యాస్ నిక్షేపాలకు గాను, దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు ఓఏఎల్‌పీని కేంద్రం తీసుకొచ్చింది. దీనికింద ప్రస్తుతం ఉత్పత్తి, అన్వేషణ దశలో భాగం కాని ఏ ఇతర ప్రాంతానికి సంబంధించి అయినా ఆసక్తి వ్యక్తీకరించేందుకు కంపెనీలకు అవకాశం ఉంటుంది. తాము ఫలానా ప్రాంతంలో అన్వేషణ, ఉత్పత్తి పట్ల ఆసక్తిగా ఉన్నామం టూ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం సమీక్షించాక ఆయా ప్రాంతా లను వేలానికి ఉంచుతుంది. అప్పుడు కంపెనీలు వాటికి బిడ్లు వేయాల్సి ఉంటుంది. -
ఫలితాలు, గణాంకాలే దిక్సూచి..!
ముంబై: ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాల ప్రకటనతో గతేడాది క్యూ4 (జనవరి–మార్చి) సీజన్ ప్రారంభమైంది. శుక్రవారం వెల్లడైన ఈ సంస్థల ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్న నేపథ్యంలో.. ఇక మీదట ఫలితాలను ప్రకటించనున్న కంపెనీలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఇదే పాజిటివ్ ట్రెండ్ కొనసాగితే.. వచ్చే కొన్ని రోజుల్లోనే నూతన శిఖరాలను చేరవచ్చని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈవారంలో మార్కెట్ కదలికలు ఏవిధంగా ఉండవచ్చనే అంశంపై స్పందించిన ఎడిల్వీస్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్.. ‘సాధారణ ఎన్నికల కారణంగా భారత వీఐఎక్స్ (వొలటాలిటీ ఇండెక్స్) 20 స్థాయిని అధిగమించింది. ఇది రానున్న రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంటుందనేందుకు సంకేతం’ అని విశ్లేషించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ బాటమింగ్ అవుట్ అవుతోంది. మెరుగైన ఆర్థిక నిర్వహణతో కూడిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సత్ఫలితాలను ఇవ్వనుందని భావిస్తున్నాం. ఈ కారణంగా మార్కెట్ పడిన ప్రతిసారీ కొనుగోళ్ళు జరపడం మంచి స్ట్రాటజీగా సూచిస్తున్నట్లు చెప్పారాయన. ‘సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 18న రెండో దశ పోలింగ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత ఎన్నికల వేడిలో... అధికార పార్టీనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందనే అంచనాలు బలంగా కొనసాగుతున్నందున మార్కెట్ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లనుందని అంచనావేస్తున్నాం’ అని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. అయితే, ఒడిదుడుకులు మాత్రం కొనసాగుతాయని అంచనావేశారు. మరోవైపు ఈవారంలో ట్రేడింగ్ కేవలం మూడు రోజులకే పరిమితమైంది. మహావీర్ జయంతి సందర్భంగా 17న (బుధవారం) మార్కెట్లకు సెలవు కాగా, 19న (శుక్రవారం) గుడ్ ఫ్రైడే సెలవు ఉన్నట్లు ఎక్సే్ఛంజీలు ప్రకటించాయి. ఆర్ఐఎల్ ఫలితాలు ఈవారంలోనే.. మార్కెట్ విలువ పరంగా దేశీ అతిపెద్ద కంపెనీగా ఎదిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఈవారంలోనే క్యూ4 ఫలితాలను ప్రకటించనుంది. ఆయిల్ రిటైల్ నుంచి విభిన్న రంగాల్లో వ్యాపారం కొనసాగిస్తున్న ఈ సంస్థ.. జియో పేరుతో టెలికం రంగంలో దూసుకుపోతోంది. 18న (గురువారం) ఫలితాలను వెల్లడించనుంది. రిఫైనరీ, పెట్రోకెమికల్ విభాగాలు ఫ్లాట్‌గా ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. టెలికం, రిటైల్ విభాగాలు ఎర్నింగ్స్‌కు ఊతం ఇవ్వనున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈవారం ఫలితాలను ప్రకటించనున్న దిగ్గజ కంపెనీలను పరిశీలిస్తే.. విప్రో (మంగళవారం), మైండ్‌ట్రీ, క్రిసిల్ (బుధవారం).. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ (గురువారం), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (శుక్రవారం) ఫలితాలను ఇవ్వనున్నాయి. ఫలితాల సీజన్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. తక్కువ బేస్ ఎఫెక్ట్, కార్పొరేట్ లెండింగ్ బ్యాంకుల లాభదాయకత, ఎనర్జీ రంగ కంపెనీల ఆరోగ్యకర వృద్ధి ప్రధాన సూచీలను నడిపించనున్నాయని షేర్‌ఖాన్ అడ్వైజరీ హెడ్ హేమంగ్ జానీ అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై మార్కెట్ దృష్టి ఈ ఏడాది మార్చి నెల టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటాలను ప్రభుత్వం సోమవారం ప్రకటించనుంది. గురువారం మానిటరీ పాలసీ మినిట్స్, శుక్రవారం విదేశీ మారక నిల్వల డేటా వెల్లడికానున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా.. అమెరికా వాణిజ్య గణాంకాలు బుధవారం వెల్లడికానుండగా.. రిటైల్ అమ్మకాల సమాచారం గురువారం వెల్లడికానుంది. జపాన్ సీపీఐ ద్రవ్యోల్బణం శుక్రవారం విడుదలకానుంది. ముడిచమురు ధరల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ శుక్రవారం 0.69 శాతం పెరిగింది. 71.52 డాలర్ల వద్ద ముగిసింది. క్రమంగా పెరుగుతూ 70 డాలర్ల స్థాయిని అధిగమించిన క్రూడ్ ధర మరింత పెరిగితే సూచీల ప్రయాణానికి ప్రతికూల అంశంగా మారుతుందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా అన్నారు. కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపరా కొనసాగుతోంది. ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లను దేశీ మార్కెట్లలో పెట్టుబడిపెట్టిన వీరు.. ఏప్రిల్‌లో కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగించారు. ఏప్రిల్‌లో ఇప్పటివరకు రూ.11,096 కోట్లను నికరంగా ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల 1–12 కాలంలో ఈమేరకు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. -
అంబానీకి 1,121 కోట్ల లబ్ధి!
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాల విమర్శల వేడి చల్లారకముందే రియలన్స్ కంపెనీకి కొత్త చిక్కు వచ్చిపడింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ ‘రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ ఫ్రాన్స్’కు ఫ్రెంచి ప్రభుత్వం రూ.1,121.18 కోట్లు(14.37 కోట్ల యూరోల) పన్నును మినహాయించినట్లు ‘లా మాండే’ అనే ఫ్రాన్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందాన్ని కుదర్చుకున్న కొన్ని నెలలకే ఫ్లాగ్ అట్లాంటిక్‌కు ఈ మినహాయింపు లభించిందని తెలిపింది. దీంతో మోదీ ఆశీర్వాదంతోనే ఈ పన్ను మినహాయింపులు లభించాయని కాంగ్రెస్ దుమ్మెత్తిపోయగా, రఫేల్ ఒప్పందం–రిలయన్స్ పన్ను మినహాయింపునకు లంకె పెట్టడం సరికాదని కేంద్రం స్పష్టం చేసింది. అనిల్‌కు చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థ రఫేల్ యుద్ధవిమానాలు తయారుచేసే డసో ఏవియేషన్‌కు భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామిగా ఉంది. రఫేల్ ఒప్పందం కుదరగానే.. ఫ్లాగ్ అట్లాంటిక్ 2007–10లో రూ.468.14 కోట్ల(60 మిలియన్ యూరోలు) పన్నును చెల్లించాల్సి ఉన్నట్లు ఫ్రాన్స్ ఐటీ అధికారుల విచారణలో తేలిందని ‘లా మాండే’ కథనంలో తెలిపింది. ‘ఈ విషయమై ఫ్రెంచ్ అధికారులు కంపెనీకి నోటీసులు జారీచేశారు. దీంతో తాము సెటిల్మెంట్లో భాగంగా 56.95 కోట్లు (7.3 మిలియన్ యూరోలు) చెల్లిస్తామని ఫ్లాగ్ అట్లాంటిక్ సంస్థ ప్రతిపాదించింది. కానీ దీన్ని అధికారులు తిరస్కరించారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరిపిన అధికారులు 2010–12 మధ్యకాలంలో మరో రూ.710 కోట్లు(91 మిలియన్ యూరోలు) పన్ను బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం రూ.1,178 కోట్లుగా తేలింది. అయితే 2015, ఏప్రిల్ 10న భారత ప్రధాని మోదీ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో 36 రఫేల్ ఫైటర్జెట్ల కోసం ఒప్పందం కుదర్చుకున్నారు. ఇది జరిగిన 6 నెలలకు అంటే.. 2015, అక్టోబర్‌లో ఫ్రాన్స్ అధికారులు అనూహ్యంగా రిలయన్స్ ప్రతిపాదించిన రూ.56.95 కోట్ల(7.3 మిలియన్ యూరోల) పన్ను సెటిల్మెంట్కు అంగీకరించారు. ఫ్లాగ్ అట్లాంటిక్‌కు రూ.1,121 కోట్ల లబ్ధిని చేకూర్చారు’ అని లా మాండే వెల్లడించింది. ఫ్లాగ్ అట్లాంటిక్ సంస్థకు ఫ్రాన్స్‌లో కేబుల్ నెట్‌వర్క్‌తో పాటు టెలికాం సేవలందించే మౌలికవసతులు ఉన్నాయని పేర్కొంది. అంతా మోదీ ఆశీర్వాదమే: విపక్షాలు ఫ్రాన్స్ అధికారులు రిలయన్స్ అనుబంధ సంస్థకు రూ.1,121.18 కోట్ల లబ్ధి చేకూర్చడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ప్రధాని మోదీ ఆశీర్వాదం, అనుగ్రహం కారణంగానే రిలయన్స్‌కు ఈ పన్ను మినహాయింపు లభించిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. రఫేల్ ఒప్పందంలో మోదీ మధ్యవర్తిగా వ్యవహరించారని దుయ్యబట్టారు. తన స్నేహితుడైన పారిశ్రామికవేత్తకు లబ్ధి చేకూర్చడం కోసం మోదీ రఫేల్ ఒప్పందం ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఆర్థిక కష్టాలతో అల్లాడుతున్న రైతులు, విద్యార్థులకు రుణాలు ఇవ్వని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం దోచిపెడుతోందని సీపీఐ నేత డి.రాజా విమర్శించారు. ఈ రఫేల్ ఒప్పందాన్ని అంగీకరించలేకే మాజీ రక్షణమంత్రి, దివంగత మనోహర్ పరీకర్ తన పదవికి రాజీనామా చేశారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. రాజకీయ జోక్యం లేదు: ఫ్రాన్స్ రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ సంస్థకు పన్ను మినహాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ఫ్రాన్స్ ప్రకటించింది. రిలయన్స్ అనుబంధ సంస్థ నిబంధనల మేరకు ఫ్రెంచ్ అధికారులతో సెటిల్మెంట్ చేసుకుందని తెలిపింది. ఈ ప్రక్రియ చట్టబద్ధంగా ఫ్రాన్స్ నియంత్రణ సంస్థ పర్యవేక్షణలో సాగిందని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. చట్టాలకు లోబడే.. ఈ వివాదంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రతినిధి స్పందిస్తూ.. ‘ఫ్రాన్స్ అధికారులు రూ.1,178 కోట్లు చెల్లించాలని మమ్మల్ని కోరడం పూర్తిగా చట్టవ్యతిరేకం. గడచిపోయిన పదేళ్ల కాలానికి గానూ ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరారు. కానీ అప్పటికే రిలయన్స్ అట్లాంటిక్ సంస్థ రూ.20 కోట్ల నష్టాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ చట్టాలకు లోబడి రూ.56.95 కోట్లు (7.3 మిలియన్ యూరోలు) చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నాం’ అని తెలిపారు. మరోవైపు ఈ పన్ను మినహాయింపునకు, రఫేల్ ఒప్పందాన్ని ముడిపెట్టి ఊహాజనిత కథనాలు రాయడం దురదృష్టకరమని భారత రక్షణశాఖ విమర్శించింది. రఫెల్ ఒప్పందానికి, రిలయన్స్ పన్ను సెటిల్మెంట్కు సంబంధం లేదంది. -
రియల్టీలోకి ముకేశ్ అంబానీ!!
న్యూఢిల్లీ: చౌక చార్జీల జియోతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ తాజాగా రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి పెడుతున్నారు. రియల్టీలో కూడా సంచలనం సృష్టించేలా సింగపూర్ తరహాలో భారీ మెగా సిటీకి రూపకల్పన చేస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దగ్గర్లో దీన్ని తలపెట్టినట్లు సమాచారం. ఈ మెగా సిటీ ప్రాజెక్ట్‌లో ప్రతీ విభాగం ఒక భారీ ప్రాజెక్టుగా ఉండనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాశ్రయం, పోర్టులకు కూడా దీన్ని అనుసంధానించనున్నట్లు వివరించాయి. ఇది పూర్తయితే ఏకంగా అయిదు లక్షల మందికి నివాసం కాగలదని, వేల కొద్దీ వ్యాపార సంస్థలకు కేంద్రం కాగలదని పేర్కొన్నాయి. వచ్చే పదేళ్లలో దీనిపై దాదాపు 75 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రాగలవని అంచనా. టెలికం రంగంలో జియోతో చౌక చార్జీల విప్లవం తీసుకొచ్చినట్లే ఈ ప్రాజెక్టులో అందుబాటు ధరల్లో, నాణ్యమైన ఇళ్లు అందించడంపై అంబానీ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా దేశీయంగా పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల స్వరూపాన్ని సమూలంగా మార్చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అభివృద్ధి.. నిర్వహణ కూడా .. ఈ మెగా సిటీని అభివృద్ధి చేయడంతో పాటు దాని పరిపాలనకు సంబంధించి నిర్వహణపరమైన బాధ్యతలు కూడా రిలయన్సే చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ తీసుకున్న స్పెషల్ ప్లానింగ్ అథారిటీ లైసెన్సు ఇందుకు ఉపయోగపడనుంది. ప్రాజెక్టులో నివాసితులకు ప్రభుత్వపరమైన అనుమతులు లభించడంలో జాప్యంతో పాటు ఇతరత్రా వ్యయాలు కూడా దీనివల్ల తగ్గగలవని అంచనా. సాధారణంగా ముంబై ఖరీదైన ప్రాంతం అయినప్పటికీ అవకాశాలరీత్యా భారీగా వలస వస్తుంటారు. అదే చౌక మెగా సిటీ గానీ పూర్తయితే రివర్స్‌లో ముంబై నుంచి కొత్త నగరానికి వలసలు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ధీరూభాయ్ కల.. వాస్తవానికి రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ 1980లలోనే ఇలాంటి ప్రపంచ స్థా యి నగరాన్ని నవీ ముంబైలో నిర్మించాలని తలపోశారు. తద్వారా దక్షిణ ముంబై, నవీ ముంబైలను రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించాలని భావిం చారు. ఒకవేళ ఇదే గానీ సాకారమై ఉంటే, ముంబైలో రద్దీ గణనీయంగా తగ్గి ఉండేదని విశ్లేషణ. లీజుకు 4 వేల ఎకరాలు.. అంతర్జాతీయ స్థాయిలో ఎకనమిక్ హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా నవీ ముంబై సెజ్ (ఎన్‌ఎంసెజ్) నుంచి దాదాపు 4,000 ఎకరాలు లీజుకు తీసుకున్నట్లు రిలయన్స్ ఇటీవలే ప్రకటించింది. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 2,180 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. ఈ ఎన్‌ఎంసెజ్‌లో ముకేశ్ అంబానీకి వాటాలు ఉండటం గమనార్హం. సుమారు పదిహేనేళ్ల క్రితమే ఈ భారీ ప్రాజెక్టుకు బీజం పడినట్లు భావించవచ్చు. ఎస్‌కేఐఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ చైనాలోని మెగా ఆర్థిక మండళ్ల (సెజ్) తరహాలో దేశీయంగా కూడా సెజ్ ఏర్పాటు చేసే లక్ష్యంతో 2000 నుంచి పెద్ద ఎత్తున స్థలాలను సమీకరిస్తోంది. అప్పట్లో ఎస్‌కేఐఎల్ ఇన్ఫ్రా అధినేత నిఖిల్ గాంధీతో టాటా గ్రూప్ కూడా చేతులు కలిపేందుకు ప్రయత్నించింది కానీ.. ఇంతలో ముకేష్ అంబానీ ఆ అవకాశాన్ని అందుకున్నారు. 2005లో నిఖిల్ గాంధీతో చేతులు కలిపారు. ఎస్‌కేఐఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జై కార్ప్ ఇండియా, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్ప్ (సిడ్కో), ముకేష్లు కలిసి ఎన్ఎంసెజ్ను ఏర్పాటు చేశారు. 2006లో ప్రపంచ స్థాయి సెజ్ నిర్మాణం కోసం ప్రభుత్వం దీనికి స్థలం కేటాయించింది. 2018లో మహారాష్ట్ర పారిశ్రామిక విధానం కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం.. సెజ్‌లకు కేటాయించిన స్థలాన్ని సమీకృత పారిశ్రామిక వాడగా మార్చేందుకు అనుమతులివ్వాలని నిర్ణయించింది. ఇందుకు ఎన్‌ఎంసెజ్ కూడా దరఖాస్తు చేసుకోవడం, సెజ్‌ను ఐఐఏ కింద మార్చుకునేందుకు అనుమతులు తీసుకోవడం జరిగింది. -
ఓఎన్జీసీ, ఆర్ఐఎల్కు గ్యాస్ ధరల్లో స్వేచ్ఛ!
న్యూఢిల్లీ: ఉత్పత్తి లాభసాటి కాదని గ్యాస్ క్షేత్రాలను పక్కన పెట్టిన ఓఎన్జీసీ, ఆర్ఐఎల్... వాటి విషయంలో పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు ధరల్లో స్వేచ్ఛనివ్వటం, తక్కువ రాయల్టీని వసూలు చేయటం వంటి కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకుంది. అన్వేషణ పూర్తయి అభివృద్ధి చేయాల్సిన క్షేత్రాల విషయంలో ఈ కంపెనీలకు ధరల పరంగా పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. అలాకాకుండా ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న క్షేత్రాల్లో గనక ఉత్పత్తిని పెంచితే... వాటిపై తక్కువ రాయల్టీని వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ కొత్త అన్వేషణ విధానాన్ని ఆమోదించామని, ఇందులో దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు పలు ప్రోత్సాహకాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఓఎన్జీసీ 12 ఆవిష్కరణలను (గ్యాస్/చమురు క్షేత్రాల్లో) ఉత్పత్తి లేకుండా పక్కన పెట్టింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రస్తుత ధరల కంటే ఈ క్షేత్రాల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. రిలయన్స్ ఈస్ట్‌కోస్ట్ బ్లాక్ ఎన్ఈసీ–25 వద్ద ఆవిష్కరణల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక, ప్రభుత్వరంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు కేటాయించిన క్షేత్రాల్లో అదనపు ఉత్పత్తిపై 10% రాయల్టీ తగ్గింపు ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి అధిక వాటా ఆఫర్ చేసే కంపెనీలకు చమురు, గ్యాస్ బ్లాక్‌లను కేటాయించే ప్రస్తుత విధానం నుంచి, గతంలో అనుసరించిన అన్వేషణ పనితీరు ఆధారిత కేటాయింపులకు మళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించాయి. ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తిని గుర్తించిన కేటగిరీ–1లోని బ్లాక్‌లను పనితీరుతోపాటు 70:30 రేషియోలో వాటాల పంపిణీపై కేటాయించనున్నట్టు తెలిపాయి. 2, 3వ కేటగిరీల్లోని బ్లాక్‌లను మాత్రం పూర్తిగా కంపెనీల అన్వేషణ, ఉత్పత్తి పనితీరు ఆధారంగానే కేటాయించనున్నట్టు చెప్పాయి. -
ఆర్ఐఎల్తో జట్టుకు సౌదీ ఆరామ్కో ఆసక్తి!
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతి సంస్థ సౌదీ ఆరామ్కో... రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతోంది. భారత్‌లో పెట్రో కెమికల్స్, రిఫైనరీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఇతర కంపెనీలతో చర్చిస్తున్నట్టు బుధవారం సౌదీ ఆరామ్కో ప్రకటించింది. మహారాష్ట్రలోని రత్నగిరిలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయతలపెట్టిన 44 బిలియన్ డాలర్ల మెగా రిఫైనరీ– పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో సౌదీ ఆరామ్కో (సౌదీ అరేబియా జాతీయ కంపెనీ), యూఏఈకి చెందిన అడ్నాక్తో కలసి 50 శాతం వాటా తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారత్‌లో పెట్టుబడుల విషయంలో తాము ఇప్పటికీ సానుకూలంగా ఉన్నామని, భాగస్వాములతో కలసి పనిచేస్తున్నామని సౌదీ ఆరామ్కో సీఈవో అమిన్ ఆల్ నసీర్ తెలిపారు. భారీ రిఫైనరీ ప్రాజెక్టును మహారాష్ట్రలో రత్నగిరి నుంచి మార్చేందుకు సిద్ధమని తాజాగా బీజేపీ– శివసేన అంగీకారానికి రావడంపై స్పందిస్తూ... అన్నీ సవ్యంగానే కొనసాగుతున్నాయని ఇక్కడి భాగస్వాములు తమకు భరోసానిచ్చినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులో సౌదీ ఆరామ్కో పెట్టుబడులు కొనసాగిస్తుందన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఇతర కంపెనీలతో కూడా చర్చిస్తున్నట్లు తెలియజేశారు. రత్నగిరి రిఫైనరీ ప్రాజెక్టుకే పరిమితం కాబోమని, ఇతర అవకాశాలనూ పరిశీలిస్తున్నామని చెప్పారు. భారీ అవకాశాలు... భారత్ తమకు పెట్టుబడుల పరంగా ప్రాధాన్య దేశమని అమిన్ ఆల్ నసీర్ తెలిపారు. ‘‘సౌదీ ఆరామ్కో భారత్‌కు 8,00,000 బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. భారత్‌లో డిమాండ్ వృద్ధి పట్ల మేం సంతోషంగానే ఉన్నాం’’ అన్నారు. ఆర్ఐఎల్, సౌదీ ఆరామ్కో మధ్య చర్చల విషయం తొలిసారి గత డిసెంబర్లో వెలుగు చూసింది. ఉదయ్‌పూర్‌లో ముకేశ్ అంబానీ కుమార్తె వివాహ ముందస్తు వేడుకలకు సౌదీ పెట్రోలియం మంత్రి ఖాలిద్ అల్ ఫలీహ్ హాజరైన సందర్భంగా చర్చలు జరిపారు. పెట్రో కెమికల్, రిఫైనరీ ప్రాజెక్టుల్లో సంయుక్త పెట్టుబడి అవకాశాల గురించి తాము చర్చించినట్టు అనంతరం ఆయన ట్వీట్ చేశారు. రిలయన్స్‌కు జామ్‌నగర్‌లో 68.2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రిఫైనరీ ఉంది. పూర్తి ఎగుమతి ఆధారిత రిఫైనరీ సామర్థ్యం ప్రస్తుతం 35.2 మి. టన్నులుగా ఉండగా, దీన్ని 41 మి. టన్నులకు పెంచుకోవాలని చూస్తోంది. అయితే, కొత్త రిఫైనరీ ఏర్పాటు పట్ల ఆసక్తిగా లేదని, పెట్రోకెమికల్, టెలికం వ్యాపారాల విస్తరణపైనే ప్రధానంగా దృష్టి పెట్టిందని పరిశ్రమ వర్గాల సమాచారం. -
జియోసావన్: ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ
ప్రముఖ మ్యూజిక్ యాప్ సావన్ మీడియా ఇపుడిక రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతమైంది. దక్షిణ ఆసియాలో అతిపెద్ద ప్రసార, వినోద, కళాకారుల వేదిక అయిన సావన్ మీడియా ఇకపై జియోసావన్‌గా అవతరించింది. ఈ మేరకు కంపెనీ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం జియో సావన్ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్లపై లభిస్తుందనీ, జియో యాప్‌స్టోర్, జియోఫోన్, జియో, జియో సావన్ సహా ఇతర యాప్స్టోర్లలో అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. కొత్తగా అవతరించిన రిలయన్స్ జియో మ్యూజిక్ యాప్ జియో సావన్‌లో డార్క్ మోడ్, జియో ట్యూన్స్ సెటింగ్ లాంటి మరిన్ని హంగులను చేర్చింది. అంతేకాదు ఈ యాప్‌లో జియో కస్టమర్లకు ప్రస్తుతం 45 మిలియన్లకు పైగా పాటలు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు సావన్ ఒరిజినల్ ఆడియో షోలు, పర్సనలైజ్డ్ మ్యూజిక్ రికమెండేషన్స్ వంటి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను జియో సావన్ యాప్‌లో అందిస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో ఎక్స్‌క్లూజివ్ వీడియో కంటెంట్‌ను కూడా అందించేందుకు సిద్ధమవుతోంది. 90రోజుల ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉచితం జియో యూజర్లు జియో సావన్ యాప్‌లో 90 రోజుల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చని జియో తెలిపింది. అందులో యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. అన్లిమిటెడ్ డౌన్లోడ్స్ చేసుకోవచ్చు. అలాగే 320 కేబీపీఎస్ బిట్‌రేట్‌తో హై క్వాలిటీ ఆడియో లభిస్తుంది. 3 నెలల తరువాత సాధారణ సబ్‌స్క్రిప్షన్‌కు యూజర్లు మారుతారు. అయితే జియో సావన్ ప్రొ సబ్‌స్క్రిప్షన్‌లో కొనసాగాలంటే పీరియడ్ ముగిశాక నెలకు రూ.99 చెల్లించాలి. 3 నెలలకైతే రూ.285, 6 నెలలకు రూ.550 చెల్లించాలి. పేటీఎం వాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ మొత్తాన్ని గూగుల్ ప్లే ద్వారా చెల్లించాలి. దీంతో జియో సావన్ ప్రొ సేవలను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు. 2018లో మార్చిలో సావన్ మ్యూజిక్‌ను రిలయన్స్ సొంతం చేసుకుంది. భారతదేశంలో మ్యూజిక్ స్ట్రీమింగ్ పరిశ్రమలో ఇదొక టర్నింగ్ పాయింట్ అని జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ వ్యాఖ్యానించారు. సావన్ సహ వ్యవస్థాపకులు రిషి మల్హోత్ర, పరమదీప్ సింగ్, వినోద్ భట్ విలీన సంస్థలో కొనసాగుతారు. అలాగే అమెరికాలోని మౌంటెన్ వ్యూ , న్యూయార్క్, బెంగళూరు, గురుగ్రాం, ముంబైల ఐదు కార్యాలయాల్లోని 200 మంది ఉద్యోగుల బృందం కూడా యథావిధిగా కొనసాగుతుంది. -
టీసీఎస్ మళ్లీ టాప్
సాక్షి, ముంబై: మార్కెట్ క్యాప్‌పరంగా ఐటీ సేవల సంస్థ టీసీఎస్ మళ్లీ టాప్కు దూసుకువచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో మరో మైల్‌స్టోన్‌నుకు చేరుకుని ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవలికాలంలో ఈ టాప్ ర్యాంక్కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ మధ్య తీవ్రమైనపోటీ నెలకొంది. తాజాగా మార్కెట్ క్యాప్ పరంగా భారత్‌లో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ని వెనక్కి నెట్టి ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ.8 లక్షల కోట్లను అధిగమించింది. రూపాయి బలహీనత నేపథ్యంలో ఐటీ షేర్లల కొనుగోళ్ల హవా నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు టిసిఎస్ స షేరు 54.6 శాతం పెరిగింది. ముఖ్యంగా సెప్టెంబరు 6 వ తేదీన జరగనున బై బ్యాక్ ఆఫర్ కారణంగా రోజువారీ లాభాలనే నమోదు చేస్తోంది. టీసీఎస్ షేరు మంగళవారం 2 శాతానికిపైగా లాభపడి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. దీంతో సంస్థ రూ.8 లక్షల కోట్ల (రూ.8,00,478 కోట్లు) కంపెనీగా అవతరించింది. కాగా ఈ మార్క్‌ను తొలిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిగమించింది. అయితే రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన రెండో కంపెనీగా టీసీఎస్ నిలిచింది. అలాగే ఐటీ షేర్లు ఇన్ఫోసిస్ 3.05 శాతం, మైండ్‌ట్రీ 2.45 శాతం, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో లాంటి కంపెనీలు 1.85 శాతం లాభపడ్డాయి. ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆగస్ట్ 23న రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను సాధించి భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రికార్డ్ సృష్టించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన తొలి భారత కంపెనీగా కూడా రికార్డ్ సాధించింది. అయితే ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.7,86,943 కోట్లుగా ఉంది. ఇటీవలే 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,329ని తాకిన షేరు ప్రస్తుతం రూ.1,242 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.1,263 వద్ద ట్రేడవుతున్నప్పుడు కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు అధిగమించింది. -
దూసుకొచ్చిన ఆర్ఐఎల్
సాక్షి, ముంబై: ఒకవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస రికార్డు గరిష్టాలతో దూసుకుపోతోంది. మరోవైపు కొర్పొరేట్ దిగ్గజం, ముకేశ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను సాధించింది. మార్కెట్‌క్యాప్‌లో 8లక్షలకోట్లనుదాటి ఆకర్షణీయంగా నిలిచింది. దేశంలో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆర్ఐఎల్ షేరు 1.28శాతం పుంజుకుని 52వారాల గరిష్టాన్ని టచ్ చేసింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలేజేషన్ 8,00,128 కోట్ల రూపాయలను అధిగమించింది. ఈ క్రమంలో ఈ రేసులో ముందున్న టెక్ దిగ్గజం టీసీఎస్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. . టీసీఎస్ మార్కెట్ క్యాప్ విలువ రూ. 7,77,870కోట్లుగా ఉంది. -
రిలయన్స్‌కు ఝలక్
సాక్షి, ముంబై: ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టీసీఎస్ మరోసారి షాక్ ఇచ్చింది. దేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరించిన సంతోషాన్ని అంతలోనే ఆవిరైపోయింది. కేవలం 24 గంటల వ్యవధిలో ఐటీ దిగ్గజం టీసీఎస్ తన అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఐదేళ్ల క్రితం రిలయన్స్‌ను వెనక్కినెట్టిన టీసీఎస్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. దేశీయ అతిపెద్ద కంపెనీలు టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మధ్య పోటీ ఆకర్షణీంగా నిలిచింది. మార్కెట్ క్యాప్‌కు సంబంధించి ఇరు సంస్థలు నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా క్యూ1 ఫలితాల జోష్ తో ఆర్ఐఎల్ షేరు మంగళవారం భారీగా లాభపడిది. దీంతో ఆర్ఐల్ నెంబర్ వన్ స్థానంలోకి దూసుకు వచ్చింది. అప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న టీసీఎస్‌ను వెనక్కి నెట్టేసింది. ఇది మంగళవారం చోటు చేసుకుంది. బుధవారం ఈ పరిస్థితి తారుమారైంది. తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మళ్లీ ఆర్‌ఐల్‌ను తోసేసి రేసులో ముందుకు దూసుకువచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బుధవారం దేశంలో అత్యంత విలువైన సంస్థగా తన హోదాను తిరిగి దక్కించుకుంది. ప్రస్తుతం టీసీఎస్ ఎమ్. క్యాప్ 7.56 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రిలయన్స్ విలువ కంటే 14.08 బిలియన్ డాలర్లు ఎక్కువ. రూ .7.54 ట్రిలియన్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. మరో వైపు బిఎస్ఇలో టిసిఎస్ షేర్లు 1.74 శాతం పెరిగి 1,975.10 వద్ద స్థిరపడగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.45 శాతం పెరిగి రూ. 1,191.15 వద్ద ముగిసింది. -
రికార్డ్ స్థాయికి ఆర్ఐఎల్
సాక్షి, ముంబై: అటు ఫలితాల జోష్, ఇటు ఎనలిస్టుల అంచనాల నేపథ్యంలో సోమవారం నాటి బుల్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కూడా రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్ఐఎల్ కౌంటర్లో కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రాడేలో రెండున్నర శాతం లాభపడి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. రూ. 1157వద్ద సరికొత్త రికార్డు ఆర్ఐఎల్ క్రియేట్ చేసింది. 1991, జనవరి తరువాత ఇదే అదిపెద్ద లాభమని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు గోల్డ్‌మన్ సాచే, మోర్గాన్ స్టాన్లీ, మోతీలాల్, నోమురా, ఎడిల్వీస్ తదితర బ్రోకరేజ్ సంస్థ లన్నీ బై రేటింగ్‌ను ఇచ్చాయి. ఆర్ఐఎల్ షేరు ప్రైస్ టార్గెట్‌ను 1200నుంచి 1400వరకు జంప్ చేయవచ్చని అంచనా వేశాయి. కాగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ ఎనలిస్టుల అంచనాలను అధిగమిస్తూ 8శాతం స్టాండలోన్ నికరలాభాన్ని నమోదు చేసింది. ఆర్ఐఎల్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో క్యూ-1లో రూ.6.12 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ సామర్ధ్యంపై అంచనాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) పూర్తిస్థాయిలో సామర్థ్యం కనబరిచే సమయం ఇంకా రాలేదని బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలు ప్రకటించినా మున్ముందు ఆర్ఐఎల్ పూర్తిస్థాయిలో సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. జియో రాబడులు ఆశించిన మేర రాకున్నా కంపెనీ పెట్రోకెమికల్ సామర్థ్యం మెరుగ్గా ఉండటంతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని హెచ్ఎస్బీసీ పేర్కొంది. గోల్డ్‌మాన్ శాక్స్.. పెట్రోకెమికల్ డివిజన్ నుంచే ఆర్ఐఎల్ సత్తా చాటిందని ప్రతి క్వార్టర్లో 10 శాతం వృద్ధి కనబరుస్తూ రిఫైనింగ్ రాబడిని మించి అతిపెద్ద రాబడి ఆర్జించే విభాగంగా పెట్రోకెమికల్ ఎదిగిందని గోల్డ్‌మాన్ శాక్స్ పేర్కొంది. రిటైల్ బిజినెస్ నుంచి మెరుగైన వృద్ధితో రిఫైనింగ్ మార్జిన్లపై అంచనాలు తప్పాయని పేర్కొంది. ఇక ప్రతి యూజర్‌పై సగటు రాబడి (ఏఆర్పీయూ) తగ్గినా సబ్‌స్ర్కైబర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో జియో రాబడి అంచనాలకు అనుగుణంగానే ఉందని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. ఆర్ఐఎల్ షేర్లు పెరుగుతున్నా ఇంతకుమించి పెరగవని ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్ఐఎల్ మెరుగైన ప్రదర్శన ఇంకా మొదలు కాలేదని పేర్కొంది. మోర్గాన్‌స్టాన్లీ.. ఆర్ఐఎల్ ఇంధన రాబడులు అంతర్జాతీయ కంపెనీలతో పోలిస్తే అత్యంత నిలకడగా ఉన్నాయి. వృద్ధి పరంపరను కొనసాగించే సంకేతాలు పంపుతున్నాయి. ఇక రిటైల్, టెలికాం విభాగాలు రాబడులను మెరుగుపరుస్తాయి. డేటా యూసేజ్ ఇతర యూజర్ల తరహాలోనే ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్ఐఎల్ నాలుగో క్వార్టర్లో రిఫైనింగ్ రాబడులను (రూ 6400 కోట్లు) పెట్రోకెమికల్ బిజినెస్ రూ(7700 కోట్లు) అధిగమించింది. జియో కేవలం టెలికాం రంగానికే పరిమితం కాదని ఇది డిజిటల్ సేవల వ్యాపారంలో భాగమని ఆర్ఐఎల్ ప్రస్తావించడం గమనార్హం. రానున్న రోజుల్లో జియో దశల వారీగా ఫైబర్ టూ హోం సేవలను ప్రారంభించనుంది. కొటాక్ సెక్యూరిటీస్ జియో ఊపందుకునే వరకూ ఆర్ఐఎల్ వృద్ధి పరంపర మందగమనంలో ఉండే అవకాశం ఉంది. పెట్రోకెమికల్ ప్రాజెక్టులు పూర్తిస్ధాయిలో ఉపయోగంలోకి వచ్చిన అనంతరం మెరుగైన వృద్ధిని అంచనా వేయవచ్చు. డచ్ బ్యాంక్.. రాబోయే ఆరు నెలల్లో ఇంధన రంగంలో నూతన ప్రాజెక్టుల ఆరంభం, జియో నుంచి రాబడులతో ఆర్ఐఎల్ మెరుగైన సామర్థ్యం కనబరిచే అవకాశం ఉంది. 2018-20 ఆర్థిక సంవత్సరాల్లో ఆర్ఐఎల్ రాబడులు 24 శాతం మేర వృద్ధి సాధించవచ్చు. -
మహారాష్ట్రలో ఆర్ఐఎల్ భారీ పెట్టుబడులు
ముంబై: మహారాష్ట్రలో భారీ పెట్టుబడుల ప్రణాళికను ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. మ్యాగ్నటిక్ మహారాష్ట్ర సదస్సు మొదటి రోజు ఇందుకు వేదికగా నిలిచింది. ‘‘ఆర్ఐఎల్ దాని అంతర్జాతీయ భాగస్వామ్య కంపెనీలు కలసి రానున్న పదేళ్లలో మహారాష్ట్రలో రూ.60,000 కోట్లను ఇన్వెస్ట్ చేస్తాయి. దేశంలో ఇదే తొలి సమగ్ర డిజిటల్ పారిశ్రామిక ప్రాంతం అవుతుంది’’ అని అంబానీ తెలిపారు. అయితే ఏర్పాటు చేసే స్థలం గురించి వెల్లడించలేదు. ముంబైలో ఆదివారం ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించగా, ముకేశ్ అంబానీ, రతన్‌టాటా సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ‘‘ఆర్ఐఎల్తో కలసి పెట్టుబడులు పెట్టేందుకు 20కు పైగా అంతర్జాతీయ కంపెనీలు సంసిద్ధతను తెలియజేశాయి. వీటిలో సిస్కో, సీమెన్స్, హెచ్‌పీ, డెల్, నోకియా, ఎన్విడియా తదితర కంపెనీలు ఉన్నాయి’’ అని అంబానీ వెల్లడించారు. సేవల ఆధారిత ఈ నాలుగో పారిశ్రామిక విప్లవంతో చైనా తన తయారీ రంగంతో సాధించిన దాని కంటే భారత్ మరింత వేగంగా ప్రగతి సాధిస్తుందన్నారు. -
ఎన్ఈసీ క్షేత్రం నుంచి నికో ఔట్..
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలోని ‘ఎన్ఈసీ(నార్త్ ఈస్ట్ కోస్ట్)– 25’ చమురు క్షేత్రంలో నికో రిసోర్సెస్ సంస్థకున్న వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో నికో రిసోర్సెస్‌కు 10 శాతం వాటా ఉంది. ఈ విషయాన్ని తన క్యూ3 ఫలితాల వెల్లడి సందర్బంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలియజేసింది. ఈ చమురు క్షేత్రంలో ప్రస్తుతం ఆర్ఐఎల్కు 60 శాతం, బీపీ పీఎల్‌సీకి 30 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ వాటాల నిష్పత్తి ఆధారంగా నికో 10 శాతం వాటాను ఈ రెండు కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ఈ చమురు క్షేత్రంలో 1.032 ట్రిలియన్ ఘనపుటడుగుల నిక్షేపాలున్నాయని అంచనా. కెనడాకు చెందిన నికో కంపెనీ నగదు సమస్యలతో సతమతమవుతోంది. అందుకే ఎన్ఈసీ–25లో వాటాను విక్రయిస్తోంది. కేజీ బేసిన్లో తనకున్న 10 శాతం వాటాను కూడా విక్రయానికి పెట్టింది. అయితే ఇంత వరకూ సరైన కొనుగోలుదారు దొరకలేదు. -
మార్కెట్లో ఫలితాల జోరు
సాక్షి,ముంబై: స్టాక్మార్కెట్లో క్యూ3 ఫలితాల జోరు కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పలుకౌంటర్లు రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో కీలక సూచీలు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ డబుల్ సెంచరీకి చేరువలో ఉండగా, నిప్టీ 10,900కి పైన స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ కంపెనీ కౌంటర్ రికార్డు ధరని(రూ.2231.50) నమోదు చేసింది. దీంతోపాటు హెడ్ఎఫ్సీ బ్యాంకు, అదానీ పోర్ట్, కోటక్ మహీంద్ర, ఎస్ బ్యాంక్ 7శాతానికిపై గా పుంజుకోవడం విశేషం. మరోవైపు సోమవారం ఫలితాలను ప్రకటించిన యాక్సిస్ బ్యాంకు కూడా ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ క్యూ3లో రూ.66కోట్ల నికరలాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.20కోట్ల లాభం సాధించగా..ఇప్పుడీ లాభం మూడింతలైనట్లైంది. ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన చూస్తే రూ.795.20కోట్లు ఆర్జించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 26శాతం లభాలను, హెచ్డీఎఫ్ఎసీ లాభం 20శాతం, అదానీ పోర్ట్స్20శాతం, ఎస్‌బ్యాంక్ 22శాతం వార్షిక గ్రోత్‌ను , కోటక్ మహీంద్ర 20శాతం లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ రికార్డులాభం
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) లాభాల్లో రికార్డుల మోత మోగింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (2017–18, క్యూ3) కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.9,423 కోట్లకు ఎగబాకింది. ఒక కార్టర్లో కంపెనీ ఇంత భారీస్థాయి లాభాన్ని ఆర్జించడం ఇదే తొలిసారి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.7,533 కోట్లతో పోలిస్తే 25.1 శాతం దూసుకెళ్లింది. ప్రధానంగా పెట్రో కెమికల్స్ వ్యాపారంలో రికార్డు స్థాయి రాబడులు, టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో తొలిసారిగా లాభాల్లోకి రావడం కంపెనీకి కలసి వచ్చింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం క్యూ3లో రూ.1,09,905 కోట్లుగా నమోదైంది. కిందటేడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.84,189 కోట్లు. దీంతో పోలిస్తే 30.5 శాతం వృద్ధి చెందింది. సాండ్ అలోన్ ప్రాతిపదికన (ప్రధానమైన పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాలు) కూడా కంపెనీ క్యూ3 నికర లాభం రికార్డు స్థాయిలో రూ.8,454 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 5 శాతం పెరిగింది. జీఆర్ఎం జోరు... డిసెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎం) 11.6 డాలర్లుగా నమోదైంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధి చేసి పెట్రో ఉత్పత్తులుగా మార్చడం ద్వారా ఆర్జించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 10.8 డాలర్లుగా ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (క్యూ2) జీఆర్ఎం 12 డాలర్లు. ఇతర ముఖ్యాంశాలు... ♦ క్యూ3లో పెట్రోకెమికల్స్ వ్యాపారం స్థూల లాభం రికార్డు స్థాయిలో రూ.5,753 కోట్లకు ఎగిసింది. గతేడాది క్యూ3లో స్థూల లాభం రూ.3,326 కోట్లు మాత్రమే. ♦ముడిచమురు రిఫైనింగ్, మార్కెటింగ్ వ్యాపారంలో స్థూల లాభం స్వల్ప తగ్గుదలతో రూ.6,194 కోట్ల నుంచి రూ.6,165 కోట్లకు చేరింది. ఇక క్యూ2తో పోలిస్తే 7% తగ్గింది. ♦ చమురు–గ్యాస్ వ్యాపారంలో స్థూల నష్టం రూ.291 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ3లో స్థూల నష్టం రూ.295 కోట్లుగా ఉంది. ♦ రిటైల్ వ్యాపారం స్థూల లాభం రూ.231 కోట్ల నుంచి రూ.487 కోట్లకు రెట్టింపయింది. దేశంలో ఈ రంగానికి సంబంధించి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా రిలయ న్స్ రిటైల్ నిలుస్తోందని ఆర్ఐఎల్ పేర్కొంది. ఆదాయం రెట్టింపు స్థాయిలో రూ.8,688 కోట్ల నుంచి రూ.18,798 కోట్లకు ఎగబాకింది. అయితే, ఈ విభాగంలో ఇప్పటివరకూ ఇంకా నికర లాభం నమోదుకాలేదు. కాగా, క్యూ3లో కంపెనీ కొత్తగా 72 విభిన్న స్టోర్లను ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 750 నగరాల్లో 3,751కి చేరింది. ♦ 2017 డిసెంబర్ చివరినాటికి రిలయన్స్ మొత్తం రుణ భారం రూ.2,13,206 కోట్లుగా ఉంది. 2016 డిసెంబర్ నాటికి రుణ భారం రూ.2,14,145 కోట్లు. ♦ ఇక కంపెనీ వద్ద నగదు నిల్వలు రూ.77,014 కోట్ల నుంచి రూ.78,617 కోట్లకు పెరిగాయి. ♦ రిలయన్స్ షేరు శుక్రవారం 1% లాభంతో రూ.929కు చేరింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. వారెవ్వా... జియో! ఆర్ఐఎల్ టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కంపెనీ వాణిజ్య పరంగా కార్యకలాపాలను ప్రారంభించిన రెండో త్రైమాసికంలోనే నికర లాభాలను కళ్లజూసింది. ఈ ఏడాది క్యూ3లో జియో తొలిసారిగా రూ.504 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మొబైల్ డేటా (4జీ) నెట్‌వర్క్‌గా జియో నిలుస్తోందని... తమ మొత్తం వినియోగదారులు డిసెంబర్ చివరినాటికి 16.01 కోట్లకు పెరిగారని ఆర్ఐఎల్ పేర్కొంది. 2016 సెప్టెంబర్‌లో 4జీ సేవలను ఆరంభించిన జియో.. ఉచిత ఆఫర్లతో దేశీ టెలికం రంగంలోని పోటీ కంపెనీలకు ముచ్చెమటలు పట్టించింది. వాణిజ్య పరంగా(బిల్లింగ్) సేవలను మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మొదలుపెట్టింది. క్యూ2లో నికర నష్టం రూ.271 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ ఆదాయాలు 11.9% పెరిగి రూ.6,879 కోట్లకు చేరాయి. పెట్రోకెమికల్స్ వ్యాపారంలో విస్తరణ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడం, టెలికం విభాగమైన రిలయన్స్ జియో తొలిసారి నికర లాభాన్ని ఆర్జించడం మూడో త్రైమాసికంలో కీలక మైలురాళ్లుగా నిలిచాయి. రిఫైనింగ్ వ్యాపారంలో వరుసగా 12 క్వార్టర్ల పాటు రెండంకెల రిఫైనింగ్ మార్జిన్లను సాధించడం కూడా కంపెనీ అద్భుత నిర్వహణ పనితీరు, పటిష్టమైన మూలాలకు అద్దం పడుతోంది. పెట్రోకెమికల్స్ రంగంలో మేం వెచ్చించిన భారీస్థాయి పెట్టుబడుల ఫలాలే ఈ రికార్డు లాభాలకు మూల కారణం. ఇక జియో సాధించిన పటిష్టమైన ఫలితాలు గమనిస్తే... ఈ వ్యాపారంలో బలంగా వేళ్లూనుకున్నామన్నది తేటతెల్లమవుతుంది. సంస్థ సామర్థ్యం, తగిన వ్యూహాత్మక నిర్ణయాలే జియో జోరుకు నిదర్శనం. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రి మద్దతుతో స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 41.81 పాయింట్ల లాభంలో 32,444 వద్ద, నిఫ్టీ 4.85 పాయింట్ల లాభంలో 10,152 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రాయ్ మంగళవారం వెలువరించిన మొబైల్ కాల్ కనెక్షన్ ఛార్జీల తగ్గింపుతో టెలికాం స్టాక్స్ కుప్పకూలాయి. భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్ 3-6 శాతం నష్టపోతున్నాయి. ప్రస్తుతం నిమిషానికి 14 పైసలున్న ఇంటర్ కనెక్షన్ ఛార్జీలను 6 పైసలకు తగ్గించింది. ఈ నిర్ణయం జియోకు అనుకూలంగా, మిగతా టెల్కోలకు షాక్‌గా ఉంది. దీంతో టెల్కో షేర్లు నేటి ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టాయి. అంతేకాక టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు, బీపీసీఎల్, సిప్లా, కోల్ ఇండియా, అంబుజా సిమెంట్స్, ఎన్టీపీసీ, విప్రో కంపెనీలు ప్రారంభంలో ఒత్తిడికి గురయ్యాయి. రిలయన్స్ ఇంటస్ట్రీస్ 4 శాతం ర్యాలీ నిర్వహిస్తోంది. ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐటీసీ, టాటా పవర్, యస్ బ్యాంకు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.4 శాతం పైకి ఎగిసింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలహీన పడి 64.26 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 88 రూపాయల లాభంలో 29,635 రూపాయలుగా నమోదవుతున్నాయి. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : యూరోపియన్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు, షార్ట్ కవరింగ్‌తో స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభంలో 31,809.55 వద్ద క్లోజైంది. నిఫ్టీ కూడా 39.35 పాయింట్ల లాభంలో 9950 మార్కును పునరుద్ధరించుకుని 9,952.20 వద్ద ముగిసింది. నార్త్ కొరియా టెన్షన్లు కొనసాగుతున్నప్పటికీ, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో కొనుగోళ్లు, ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు బాగా లభించింది. దీంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి ఎగిశాయి. వరుసగా ఐదో రోజుల పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో నడిచింది. రిలయన్స్‌తో పాటు హెచ్డీఎఫ్సీ గ్రూప్ స్టాక్స్ కూడా లాభాలు కురిపించాయి. యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడం మార్కెట్లకు సహకరించింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 64.11గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 19 రూపాయల నష్టంలో 30,086 రూపాయలుగా నమోదయ్యాయి. -
సెన్సెక్స్ 258 పాయింట్లు జంప్
సాక్షి, ముంబై : గ్లోబల్‌గా సంకేతాలు పాజిటివ్‌గా రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి కోలుకుని బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 258.07 పాయింట్లు పైకి జంప్ చేసి 31,646.46 వద్ద, నిఫ్టీ 88.35 పాయింట్ల లాభంలో 9884.40 వద్ద క్లోజ్ అయ్యాయి. ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు రేపు ముగియనున్న నేపధ్యంలో షార్ట్ కవరింగ్ చోటుచేసుకుంది. ఇది మార్కెట్లకి కలిసి వచ్చింది. ఇంట్రాడేలో నిఫ్టీ 9900 పాయింట్ల పైకి ఎగిసింది. ఉత్తర కొరియా జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించడంతో మంగళవారం భారీగా నష్టపోయిన స్టాక్‌మార్కెట్ బుధవారం కోలుకుంది. లాభాల్లో ప్రారంభమైన స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లోనే ట్రేడయ్యాయి. లోహ షేర్ల లాభాలు కొనసాగగా, కొన్ని ఫార్మా షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు 1-2 శాతం రేంజ్లో పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్, సిప్లా, లుపిన్ షేర్లు 0.1 శాతం నుంచి 1.5 శాతం రేంజ్లో నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 63.94గా ఉంది. -
ఆర్ఐఎల్..‘ఫ్యూచర్స్’ సిగ్నల్స్!
♦ ఈ రోజు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో (ఎఫ్అండ్ ఓ) ఏ షేర్లయితే బెటర్? ♦ ఆ ‘ఫ్యూచర్ సిగ్నల్స్’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... ఆర్ఐఎల్.. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌లో భాగంగా మన మార్కెట్ కూడా గురువారం బాగా తగ్గింది. ఐటీ షేర్లు మినహా దాదాపు బ్లూచిప్ షేర్లన్నీ నష్టాల్లోనే ముగిసాయి. ఈ క్రమంలోనే ఇటీవల పెద్ద ర్యాలీ జరిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 1 శాతం క్షీణతతో రూ. 1,584 వద్ద క్లోజయ్యింది. స్పాట్ మార్కెట్లో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా నమోదుకాగా, ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 4.71 షేర్లు (3.59 శాతం) కట్ అయ్యాయి. ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.26 కోట్లకు తగ్గింది. గురువారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలతో సహా దాదాపు అన్ని స్టాక్ ఫ్యూచర్ల నుంచి కొంతవరకూ లాంగ్ అన్‌వైండింగ్ జరిగింది. అయితే పలు షేర్ల ఫ్యూచర్ ప్రీమియంలు తగ్గగా, ఆర్ఐఎల్ ఫ్యూచర్ కాంట్రాక్టు ప్రీమియం పెరిగింది. ఆర్ఐఎల్ స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం క్రితంరోజుకంటే నాటకీయంగా రూ. 2 నుంచి రూ. 9కి పెరిగింది. ఓఐ తగ్గుతూ...ప్రీమియం పెరగడం షార్ట్ కవరింగ్ కార్యకలాపాల్ని సూచిస్తోంది. రూ. 1,600, 1,620 స్ట్రయిక్స్ వద్ద స్వల్పంగా కాల్ రైటింగ్ జరగడంతో వీటివద్ద కాల్ బిల్డప్ 6.86 లక్షలు, 6.64 లక్షల షేర్లకు పెరిగింది. కానీ 1,640 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్ కారణంగా బిల్డప్ నుంచి లక్ష షేర్లు తగ్గగా, బిల్డప్ 8.08 లక్షల షేర్లకు దిగింది. ఈ ట్రెండ్ షేరుకి నిరోధస్థాయి రూ. 1,640 నుంచి దిగువ శ్రేణి రూ. 1,600–1,620 వద్దకు తగ్గుతుందని కాల్‌రైటర్లు భావించడం కారణం కావొచ్చు. రూ. 1,600 స్థాయికి 1 % దిగువన షేరు ముగిసినా, ఆ స్ట్రయిక్ వద్ద పుట్ బిల్డప్ నుంచి కేవలం 39 వేల షేర్లు కట్ అయ్యాయి. ఇక్కడ 5.50 లక్షల పుట్ బిల్డప్ వుంది. రూ. 1,580 స్ట్రయిక్ వద్ద కూడా 39 వేల పుట్స్ కట్‌కాగా, బిల్డప్ 5.50 లక్షలకు చేరింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 1,580పైన స్థిరపడితే రూ. 1,600–1,620 శ్రేణిని చేరవచ్చని, రూ. 1,580 స్థాయి దిగువన కొనసాగితే క్రమేపీ క్షీణించవచ్చని ఈ ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. ⇔ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ సంకేతాలు ఎలా వున్నాయి? ఈ వివరాలు www.sakshibusiness.comలో -
3 బిలియన్ డాలర్లు కట్టండి
పీఎంటీ క్షేత్రాలపై ఆర్ఐఎల్, షెల్, ఓఎన్జీసీకి ప్రభుత్వం నోటీసులు న్యూఢిల్లీ: పన్నా/ముక్తా, తపతి (పీఎంటీ) చమురు, గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి వ్యయాల రికవరీకి సంబంధించి 3 బిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఆపరేటర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, రాయల్ డచ్ షెల్, ఓఎన్జీసీ సంస్థలకు డీజీహెచ్ నోటీసులు పంపింది. 2016 అక్టోబర్ నాటి ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పాక్షిక ఉత్తర్వుల ప్రకారం అసలు, వడ్డీ, ఇతర చార్జీలతో కలిపి ఈ మొత్తం చెల్లించాలని మే ఆఖరులో పంపిన డిమాండ్ నోటీసులో సూచించింది. అయితే, ఇందుకు ఆఖరు తేదీ, చెల్లించకపోతే పర్యవసానాలు వంటివేమీ అందులో పేర్కొనలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తుది ఉత్తర్వులు వెలువరించడానికి ముందుగానే ‘పాక్షిక’ ఆర్బిట్రేషన్ అవార్డు ఆధారంగా డీజీహెచ్ ఈ నోటీసు జారీ చేసినట్లు వివరించాయి. మరోవైపు పరిహార మొత్తాన్ని (ఏదైనా కట్టాల్సింది ఉంటే) ఆర్బిట్రేషన్ ప్యానెల్ పూర్తిగా ఖరారు చేయకముందే ఇటువంటి చర్యలు సరికాదని ఆర్ఐఎల్ వర్గాలు పేర్కొన్నాయి. నోటీసులకు తగు వివరణ ఇప్పటికే పంపినట్లు తెలిపాయి. వివరాల్లోకి వెడితే.. పీఎంటీలో ఆర్ఐఎల్, బీజీ ఎక్స్‌ప్లొరేషన్‌కు చెరి 30 శాతం, ఓఎన్జీసీకి మిగతా వాటాలు ఉన్నాయి. బీజీని టేకోవర్ చేసిన షెల్ ఆ తర్వాత దాని స్థానంలో వాటాలు దక్కించుకుంది. వ్యయాల రికవరీ, లాభాల్లో వాటాలు, ఉత్పత్తి పంపక ఒప్పందంలోని (పీఎస్సీ) అకౌంటింగ్ విధానాలు మొదలైన అంశాలపై ఆపరేటర్లకు, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. దీనిపై 2010లో ఆర్ఐఎల్ .. ప్రభుత్వంపై ఆర్పిట్రేషన్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా 2012లో దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అయితే, ప్రభుత్వం వీటిని సవాలు చేసింది. తదుపరి బ్రిటన్‌లో ఆర్బిట్రేషన్ కమిటీ.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. -
క్యూ1 ఫలితాలే కీలకం!
♦ ఈ వారంలోనే ఆర్ఐఎల్, విప్రో క్యూ1 ఫలితాలు ♦ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపైనా దృష్టి ♦ ఫలితాలను బట్టి షేర్ల కదలికలు ♦ ఈ వారంస్టాక్ మార్కెట్‌పై నిపుణుల అంచనాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, హిందుస్తాన్ యునిలివర్ వంటి బ్లూచిప్ కంపెనీలు వెల్లడించే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై ఈ వారం స్టాక్‌మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని నిపుణులంటున్నారు. వీటితో పాటు నేటి (సోమవారం)నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరిస్తారని వారంటున్నారు. ఈ వర్షాకాల సమావేశాలు రాష్ట్రపతి ఎన్నికతో ఆరంభమవుతాయి. ఇక రుతుపవనాల విస్తరణ, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం.. ఈ అంశాలు కూడా స్టాక్‌మార్కెట్‌పై తగినంతగా ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఫలితాలను బట్టి సూచీల కదలికలు... కంపెనీల క్యూ1 ఫలితాలను బట్టి స్టాక్ సూచీల కదలికలు ఉంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. ఈ వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్ కంపెనీలు క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఈ వారం ఎలాంటి ఆర్థిక పరమైన గణాంకాలు వెల్లడి కావని, అందుకని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరును ఇన్వెస్టర్లు గమనిస్తారని వివరించారు. ఫలితాల సీజన్ ప్రారంభమైనందున షేర్ల వారీ కదలికలు ప్రధానంగా ఉంటాయని పేర్కొన్నారు. క్యూ1 ఫలితాల వెల్లడికి ముందు, ఫలితాలు వెల్లడైన తర్వాత కంపెనీ షేర్లు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి చెప్పారు. ఇప్పటివరకైతే వర్షాలు సంతృప్తికరంగానే కురిశాయని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన వ్యాపారాలకు శుభసూచకమని కోటక్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ–ఈక్విటీ) హర్ష ఉపాధ్యాయ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల వడ్డీరేట్ల తగ్గింపుకు అవకాశమేర్పడిందని, మార్కెట్ మరింత ముందుకు పోవడానికి ఇది దోహదపడుతుందని వివరించారు. నేడు ఏసీసీ క్యూ1 ఫలితాలు నేడు (ఈ నెల 17న–సోమవారం) ఏసీసీ, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ తమ క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. మంగళవారం(ఈ నెల 18న) హిందుస్తాన్ యునిలివర్, క్రిసిల్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు, గురువారం(ఈ నెల 19న) విప్రో, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు, శుక్రవారం (ఈ నెల 20న) రిలయన్స్ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్ కంపెనీలు క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. ఇక అంతర్జాతీయ అంశాల్లో... సోమవారం యూరోజోన్ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. గురువారం యూరప్ కేంద్ర బ్యాం క్, జపాన్ కేంద్ర బ్యాంక్‌లు వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటాయి. కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల జోరు విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ నెల మొదటి రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు మన క్యాపిటల్ మార్కెట్లో రూ.11,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఎఫ్‌పీఐలు మన ఈక్విటీ మార్కెట్లో రూ.498 కోట్లు, డెట్‌మార్కెట్లో రూ.10,405 కోట్లు, వెరశి రూ.10,903 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి–జూన్ కాలానికి వచ్చిన రూ.1.62 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులకు ఇది కొనసాగింపు. జీఎస్టీ అమలు సాఫీగా సాగుతుండడం, భారత ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలే విదేశీ పెట్టుబడుల జోరుకు కారణాలని నిపుణులంటున్నారు. -
ఆర్ఐఎల్ ర్యాలీ–కోలుకున్న మార్కెట్
స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల కారణంగా తగ్గిన మార్కెట్...చివరకు కోలుకుని ముగిసింది. క్రితం రోజు రికార్డుస్థాయిలో ముగిసిన సెన్సెక్స్ శుక్రవారం బలహీనంగా ప్రారంభమై 31,287 పాయింట్లస్థాయికి పడిపోయింది. మధ్యాహ్న సెషన్లో ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) భారీ ర్యాలీ జరపడంతో సెన్సెక్స్ చివరకు 8 పాయింట్ల స్వల్ప తగ్గుదలతో 31,361 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 9,684–9,643 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 8.75 పాయింట్ల నష్టంతో 9,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నెలలో వెలువడే ఆర్ఐఎల్ ఫలితాలు బావుంటాయన్న అంచనాలు, ఆ కంపెనీ టెలికం సబ్సిడరీ రిలయన్స్ జియో త్వరలో చౌక 4జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నదనే వార్తలతో ఆర్ఐఎల్ షేరు 3.43 శాతం ర్యాలీ జరిపి 9 సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 1,491 వద్ద ముగిసింది. ఇది ఇంతిలా పెరగడంతో సూచీలు కుదుటపడ్డాయి. అమెరికాలో జాబ్స్ డేటా వెలువడనుండటం, యూరప్‌లో ద్రవ్య విధానం కఠినతరం కానున్నదనే ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు క్షీణించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. సెన్సెక్స్‌లో 20 షేర్లు డౌన్.. సెన్సెక్స్–30 షేర్లలో 20 షేర్లు తగ్గుదలతో ముగిసాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌బ్యాంక్, ఇన్ఫోసిస్, ఆసియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ షేర్లు 1 శాతంపైగా తగ్గాయి. వెలుగులో ఫార్మా షేర్లు... కొద్దివారాలపాటు భారీ క్షీణతల్ని నమోదుచేసిన ఫార్మా షేర్లు కనిష్టస్థాయిల వద్ద లభ్యమవుతుండటంతో తాజాగా వాటికి కొనుగోలు మద్దతు లభించిందని వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్ కోలుకోవడానికి ఆర్ఐఎల్తో పాటు ఫార్మా షేర్లు కూడా తోడ్పాటునందించినట్లు ఆయన తెలిపారు. బీఎస్ఈ ఫార్మా ఇండెక్స్ 1 శాతంపైగా పెరిగింది. -
టీసీఎస్‌ను దాటిన ఆర్ఐఎల్
ముంబై: మార్కెట్ విలువలో ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)...ఐటీ దిగ్గజం టీసీఎస్‌ను మళ్లీ మించిపోయింది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి ఆర్ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,68,160 కోట్లుకాగా, టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 4,64,577 కోట్లు. ఆర్ఐఎల్ షేరు ధర 1.2 శాతం ఎగిసి రూ. 1,440 వద్ద ముగియగా, టీసీఎస్ షేరు 0.26 శాతం క్షీణించి రూ. 2,357 వద్ద క్లోజయ్యింది. జూన్ 23న ఆర్ఐఎల్ మార్కెట్ విలువ టీసీఎస్‌ను మించగా, అదేనెల 28న టీసీఎస్ విలువ ఆర్ఐఎల్ విలువను దాటింది. తర్వాత తాజాగా మళ్లీ ఆర్ఐఎల్ విలువ టాప్‌లోకి చేరింది. నాలుగేళ్ల క్రితం ఆర్ఐఎల్ విలువను టీసీఎస్ అధిగమించి, అప్పట్నుంచి నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది ఆర్ఐఎల్ చకాచకా జరిపిన ర్యాలీతో టీసీఎస్‌ను ద్వితీయస్థానానికి దింపింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్ఐఎల్ షేరు 33 శాతం పెరగ్గా, టీసీఎస్ షేరు 0.17 శాతం క్షీణించింది. -
రుణాలపై వడ్డీ భారం తగ్గించుకున్న ఆర్ఐఎల్
♦ 2016–17లో రూ.1,14,742 కోట్ల పెట్టుబడులు ♦ కార్పొరేట్ చరిత్రలోనే ఇది రికార్డు ♦ వాటాదారులకు వివరించిన ముకేశ్ న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 2.3 బిలియన్ డాలర్ల (రూ.15,000 కోట్లు) రుణాలను తక్కువ వడ్డీ రేటుకు రీఫైనాన్స్ చేసుకుంది. దీనివల్ల వడ్డీ రూపేణా గణనీయంగా ఆదా అవుతుందని వాటాదారులకు కంపెనీ తెలిపింది. కంపెనీ స్థూల రుణ భారం మార్చి నాటికి రూ.1,96,601 కోట్లు కాగా, ఇందులో అధిక భాగం జియో కార్యకలాపాల కోసం తీసుకున్నది కావడం గమనార్హం. ‘‘1.75 బిలియన్ డాలర్ల దీర్ఘకాలిక సిండికేటెడ్ రుణం, 550 మిలియన్ డాలర్ల మేర క్లబ్లోన్ రెండూ కలిపి 2.3 బిలయన్ డాలర్ల మేర రుణాలను రీఫైనాన్స్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల మిగిలి ఉన్న కాలంలో వడ్డీ రూపేణా గణనీయంగా ఆదా అవుతుంది’’ అని 2016 – 17 వార్షిక నివేదికలో వాటాదారులకు కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ వివరించారు. అయితే, వడ్డీ రూపంలో ఎంత ఆదా అవుతుందన్న అంచనాలను వెల్లడించలేదు. ఇక గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,14,742 కోట్లను పెట్టుబడులుగా పెట్టామని, దేశ చరిత్రలో ఓ కార్పొరేట్ కంపెనీ ఒకే ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదేనని పేర్కొన్నారు. మూలధన విస్తరణ అన్నది పెట్టుబడుల రేటింగ్‌ను కొనసాగించేందుకేనని వివరించింది. భారత సార్వభౌమ రేటింగ్ కంటే రెండు స్థాయిలు ఎక్కువలోనే కంపెనీ రేటింగ్ ఉందని, ఎస్అండ్పీ సంస్థ ఆర్ఐఎల్కు అంతర్జాతీయ రుణ రేటింగ్ బీబీబీప్లస్ ఇచ్చినట్టు తెలిపింది. మూలధన పెట్టుబడుల వల్ల కంపెనీకి నగదు ప్రవాహాలు మెరుగవుతాయని, రానున్న సంవత్సరాల్లో ఆదాయాల్లో అస్థిరతలు తగ్గుతాయని తెలిపింది. హైడ్రోకార్బన్ వ్యాపారంపై మూలధన వ్యయాలు పూర్తయినందున నగదు ప్రవాహాలు మెరుగుపడతాయని పేర్కొంది. పెట్రోల్ బంక్‌ల విస్తరణ ఇంధన రిటైల్ విస్తరణపై దృష్టి పెట్టినట్టు ఆర్ఐఎల్ తన వాటాదారులకు వివరించింది. కంపెనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,221 పెట్రోల్ పంపులు ఉండగా, 2017–18 సంవత్సరంలో వీటిని విస్తరించనున్నట్టు తెలిపింది. -
రిలయన్స్– బీపీ పెట్టుబడులు 40,000 కోట్లు
♦ కేజీ డీ6లో నూతన గ్యాస్ క్షేత్రాల అభివృద్ధి ♦ 30–35 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ ఉత్పత్తి ♦ సంయుక్తంగా పెట్రోల్ పంపులు ♦ మరిన్ని అంశాల్లో సహకారానికి అంగీకారం న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) పీఎల్సీ తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నాయి. మరిన్ని అంశాల్లో కలసి సాగాలని నిర్ణయించుకున్నాయి. కొన్నేళ్ల విరామం తర్వాత ఇరు సంస్థలు కలసి కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ6 బ్లాక్ పరిధిలో తిరిగి గ్యాస్ ఉత్పత్తి, నూతన గ్యాస్ అన్వేషణ క్షేత్రాలను అభివృద్ధిపర్చడంపై 8 సంవత్సరాల వ్యవధిలో 6 బిలియన్ డాలర్లు (రూ.40,000కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించాయి. గురువారం ఢిల్లీలో బీపీ సీఈవో బాబ్ డుడ్లేతో కలసి ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తమ భాగస్వామ్యంపై మీడియాకు వివరాలు వెల్లడించారు. సంయుక్తంగా రిటైల్ పెట్రోల్ పంపుల ఏర్పాటు, విమాన ఇంధన (ఏటీఎఫ్) మార్కెటింగ్తోపాటు నూతన వ్యాపార అవకాశాలైన సంప్రదాయ, సంప్రదాయేతర ఇంధన వాణిజ్యం, మార్కెటింగ్ అంశాల్లో వ్యూహాత్మక సహకారానికి తాము అంగీకారానికి వచ్చినట్టు ముకేశ్ అంబానీ తెలిపారు. విధానాల్లో మార్పులు కొత్త వనరుల అభివృద్ధికి తమకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. కేజీ డీ6 బ్లాక్‌లోని ఆర్–సిరీస్ గ్యాస్ క్షేత్రం అభివృద్ధి పురోగతికి, 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు తమ మధ్య అంగీకారం కుదిరిందన్నారు. 2020–22 నాటికి కేజీ డీ6 బ్లాక్ నుంచి నిత్యం 30–35 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. ఇది అప్పటి దేశ గ్యాస్ అవసరాల్లో 10 శాతం మేర తీరుస్తుందని, 20 బిలియన్ డాలర్ల మేర దిగుమతులను నివారిస్తుందన్నారు. ఇంధన ట్రేడింగ్, కర్బన ఉద్గారాల ట్రేడింగ్ అవకాశాలనూ అందిపుచ్చుకుంటామన్నారు. ఆర్బిట్రేషన్ కేసులతో ఇబ్బందేమీ లేదు పలు అంశాలపై ప్రభుత్వంతో కొనసాగుతున్న ఆర్బిట్రేషన్ ప్రక్రియ తమ కొత్త పెట్టుబడులపై ప్రభావం చూపబోదని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఓఎన్జీసీ బావుల్లోని గ్యాస్ తోడేయడంపై ఆర్ఐఎల్ 1.55 బిలియన్ డాలర్లు (రూ.10,000 కోట్లు) పరిహారం చెల్లించాలని కేంద్రం ఆర్ఐఎల్కు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనితోపాటు మరో మూడు ఆర్బిట్రేషన్ కేసులు ఆర్ఐఎల్, ప్రభుత్వానికి మధ్య నడుస్తున్నాయి. ‘‘ఇక్కడే కాదు కేసులన్నవి ప్రపంచమంతటా ఉన్నవే. దీనికి పారదర్శకమైన పరిష్కారం లభిస్తుందని బలంగా నమ్ముతున్నాను’’ అని డుడ్లే సైతం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయా సమస్యలన్నీ తగిన రీతిన పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛాయుత ధరల విధానం ఉండాలి: డుడ్లే బీపీ 2011లో 7.2 బిలియన్ డాలర్లతో కేజీ డీ6, మరో 20 బ్లాకుల్లో 30 శాతం వాటా తీసుకుందని ఆ సంస్థ సీఈవో డుడ్లే తెలిపారు. వీటితో పాటు ఆర్ సిరీస్, డీ–55 ఆవిష్కరణల నుంచి గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు గాను ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. భారత మార్కెట్ ‘ఫ్రీ మార్కెట్ ప్రైసింగ్’ (ధరలను మార్కెట్‌కు విడిచిపెట్టడం) విధానం వైపు అడుగులు వేయాలని కోరారు. పర్యావరణానికి అనుకూల సహజ వాయువు విషయంలో స్వేచ్ఛాయుత మార్కెట్ ధరలకు మద్దతిత్చే విధానాలు అవసరమన్నారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా డుడ్లే ప్రధాని మోదీ, పెట్రోలియం మంత్రి ప్రధాన్‌లను కలిశారు. సహజవాయువు ధరల విధానాన్ని సమీక్షించాలని, సముద్రంలో మరీ లోతైన ప్రాంతాల్లో ఉత్పత్తి చేసే గ్యాస్‌కు అధిక రేటు ఉండాలని బీపీ కోరుతోంది. ఇంధన రిటైల్‌లో పెట్టుబడులు పెట్టండి రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ పీఎల్‌సీలను ఇంధ న రిటైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కేంద్రం కోరింది. ఆర్ఐఎల్కు ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. బీపీ గతేడాదే పెట్రోల్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతి పొందింది. గురువారం బీపీ సీఈవో బాబ్ డుడ్లే, ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీలతో కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 80 నిమిషాల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రిటైల్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని బీపీ, రిలయన్స్ సంస్థలను ఆహ్వానించినట్టు ప్రధాన్ సమావేశం అనంతరం ట్వీటర్లో పోస్ట్ చేశారు. -
58 భారతీయ కంపెనీల్లో రిలయన్సే టాప్
ముంబై : ఫోర్బ్స్ మేగజీన్ ప్రకటించిన 'గ్లోబల్ 2000' జాబితాలో భారతీయ కంపెనీల్లో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. 58 కంపెనీలు భారతీయ కంపెనీలు ఈ జాబితాలో చోటుదక్కించుకోగా.. వాటన్నంటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలిస్థానంలో ఉంది. సంచలనమైన ఆఫర్లతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పేరుతో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఈ కంపెనీ బలపర్చిందని ఫోర్బ్స్ ఇండియా ఎడిషన్ గురువారం పేర్కొంది. అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ ఆధారంగా ఫోర్బ్స్ ఈ ర్యాంకింగ్స్ ను ప్రతేడాది విడుదల చేస్తోంది. వరల్డ్ బిగ్గెస్ట్ కంపెనీల ఈ జాబితాలో భారత్ నుంచి బ్యాంకులు, ఐటీ కంపెనీలే ఆధిపత్య స్థానంలో ఉన్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత భారత కంపెనీల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీలు ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహింద్రాలు కూడా గ్లోబల్ 200 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో టాటా మోటార్స్ భారత కంపెనీల్లో ఆరవ స్థానంలో ఉంది. అయితే గతేడాది కంటే ఈ కంపెనీ ర్యాంకింగ్ పడిపోయింది. అయితే ఈ జాబితాలో చైనా, అమెరికా కంపెనీలే 40 శాతం స్థానాలను ఆక్రమించి, తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. -
సెబీ వర్సెస్ ఆర్ఐఎల్ కేసు జూన్‌కి వాయిదా
న్యూఢ్లిల్లీ: ఇటీవల సంచలనం రేపిన సెబీ వర్సస్ రిలయ్స్ ఇండస్ట్రీస్ కేసును శాట్ విచారణకు అంగీకరించింది. ఏడాదిపాటు ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ నుంచి సెబీ నిషేధించడాన్ని సవాల్ చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) దాఖలు చేసిన పిటిషన్‌ను సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్ విచారణకు) స్వీకరించింది. ఈమేరకు ఆర్ఐఎల్ శాట్ ముందు హాజరైంది. ఆర్ఐఎల్ అప్పీలుపై శాట్ తదుపరి విచారణను జూన్‌నెల చివరికి వాయిదా వేసింది. దీనికి సంబంధించిన మ్యూచుఫల్ ఫండ్స్ ట్రేడ్ వివరాలను సెబీకి అందించాల్సింది శాట్ ఆర్ఐఎల్ను ఆదేశించింది. అలాగే తమ అభ్యంతరాలపై పూర్తి విరాలను సమర్పించాల్సింది సెబీని కోరింది. అనంతరం విచారణను ఎనిమిదివారాల పాటు వాయిదా వేసింది. దీంతో మార్కెట్లో రిలయన్స్ షేర్ 2 శాతం నష్టపోయింది. పదేళ్ల క్రితం నాటి ఈ కేసుకు సంబంధించి.. రిలయన్స్ పెట్రోలియం ఎఫ్‌అండ్‌వో విభాగంలో(డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్) మోసపూరిత ట్రేడింగ్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్రమంగా లాభాలు ఆర్జించిందన్న ఆరోపణలతో సెబీ భారీ జరిమానా విధించింది. 2007 నవంబర్ 29 నుంచి 12 శాతం వడ్డీతో రూ. 447 కోట్లు కట్టాలని ఆర్ఐఎల్ను ఆదేశించింది. చట్టవిరుద్ధంగా లాభాల ఆర్జన ఆరోపణలపై రిలయన్స్‌తో పాటు 12 సంస్థలను ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా ఏడాది పాటు నిషేధం విధిస్తూ సెబీ మార్చి 24న ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
స్ట్రీట్ అంచనాలను బద్దలు కొట్టిన రిలయన్స్
న్యూఢిల్లీ : ఆయిల్ నుంచి టెలికాం వరకు వ్యాపారాల్లో హవా చాటుతున్న రిలయన్స్ ఇంటస్ట్రీస్, స్ట్రీట్ అంచనాలు మరోసారి అంచనాలను బద్దలు కొట్టింది. ఏడాది ఏడాదికి కంపెనీ కన్సాలిడేట్ నికర లాభాలను 11.54 శాతం పెంచుకుంది. మార్చితో ముగిసిన క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.8,055కోట్లగా నమోదైనట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభాలు రూ.7,220 కోట్లగానే ఉన్నాయి. ఏడాది ఏడాదికి కంపెనీ లాభాల వృద్ధి నమోదుచేయడం ఇది వరుసగా తొమ్మిది క్వార్టర్. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు కూడా కంపెనీకి ఒక్కో బ్యారెల్‌కు 11.5 డాలర్లగా ఉన్నాయి. ఈటీ నౌ అంచనాల ప్రకారం ఇవి 10.4 డాలర్లే ఉంటాయని తెలిసింది. స్టాండలోన్ మార్జిన్లు కూడా కంపెనీకి 17 శాతం పెరిగినట్టు వెల్లడైంది. నిర్వహణల నుంచి వచ్చిన రెవెన్యూలు ఈ క్వార్టర్ లో 12 శాతం పెరిగి రూ.74,598 కోట్లగా నమోదైనట్టు ప్రకటించింది. గత క్వార్టర్ లో ఇది రూ.66,606 కోట్లగానే ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈబీఐటీడీఏలు ఏడాది ఏడాదికి 17 శాతం పెరిగి, 12,416 కోట్లగా రికార్డైనట్టు వెల్లడించింది. సీఎన్‌బీసీ-టీవీ18 అంచనాల ప్రకారం కంపెనీ లాభాలు 8000 కోట్లగా, నిర్వహణ లాభాలు 11,485 కోట్లగా నమోదవుతాయని తెలిసింది. కానీ వారి అంచనాలను రిలయన్స్ బద్దలుకొట్టింది. వచ్చే నెలల్లో జియో నెట్ వర్క్ కోసం లక్ష టవర్లను ఏర్పాటుచేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. మార్చితో ముగిసిన క్వార్టర్‌కు జియో సబ్ స్క్రైబర్ బేస్ 108.9 మిలియన్లను తాకినట్టు కూడా కంపెనీ వెల్లడించింది. మరోవైపు స్టాక్ విలువ 1.19 శాతం పెరిగి, 4.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ అవతరించింది. ఐటీ దిగ్గజం టీసీఎస్ ను ఇది అధిగమించింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం మార్కెట్ల ముగింపుకు 4.58 లక్షల కోట్లగా ఉంది. -
ఫ్రాన్స్ ఎన్నికలపై మార్కెట్ ఫోకస్
♦ ఏప్రిల్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపుతో ఒడిదుడుకులు ♦ ప్రభావితం చేయనున్న ఆర్ఐఎల్, విప్రో యాక్సిస్ బ్యాంక్‌ల ఫలితాలు ♦ ఈసీబీ పాలసీపైనా ఇన్వెస్టర్ల దృష్టి ముంబై: ఫ్రాన్స్ ఎన్నికలు, కార్పొరేట్ ఫలితాల ఆధారంగా ఈ వారం మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఏప్రిల్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారంలో(ఈ నెల 27న–గురువారం) ముగియనున్నందున స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు, ఫ్రాన్స్ ఎన్నికల.. తదితరాలు కూడా ఈ వారం మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఇక ఈ శుక్రవారం (ఈ నెల28న) పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, విదేశీ కరెన్సీ నిల్వలు, బ్యాంక్ డిపాజిట్ వృద్ధి, బ్యాంక్ రుణ వృద్ధి.. ఈ అంశాలకు సంబంధించిన గణాంకాలు వెలువడుతాయి. నేడు ఫ్రాన్స్ ఎన్నికల తొలి రౌండు ప్రభావం ఇప్పుడు అందరి దృష్టి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. యూరోజోన్‌లో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఫ్రాన్స్‌లో రెండు రౌండ్లుగా జరిగే ఈ ఎన్నికల తుది ఫలితాలు మే 11న వస్తాయి. కానీ ఏప్రిల్ 23.. ఆదివారం జరిగిన తొలి రౌండు ఎన్నికలు మార్కెట్లకు కీలకమని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ తొలి రౌండు ఫలితంతో మార్కెట్ ముందుగా సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ హెడ్ వీకే శర్మ చెప్పారు. మే 7న రెండో రౌండు ఎన్నికలు జరుగుతాయి. అమెరికా, ఉత్తర కొరియా మధ్య తాజా పరిణామాలేవైనా సంభవిస్తే భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ ప్రభావితమవుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సంఘానియా అన్నారు. ఈ వారం జరిగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) పాలసీ సమావేశం సైతం మార్కెట్ ట్రెండ్‌ను శాసిస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. గురువారం (27న) ఈసీబీ ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. దిగ్గజ కార్పొరేట్ల ఫలితాలు... ఈ వారంలో పలు దిగ్గజ కంపెనీల జనవరి–మార్చి క్వార్టర్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటిదాకా వెలువడిన క్యూ4 ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో ఈ వారంలో రానున్న కంపెనీల ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తున్నారు. సోమవారం(ఈనెల 24న) మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 ఫలితాలు వస్తాయి. అదే రోజు అల్ట్రాటెక్ సిమెంట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. మంగళవారం(ఈ నెల 25న) యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ ప్రులైఫ్, బుధవారం(ఈ నెల 26న) జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్, గురువారం(ఈ నెల27) మారుతీ సుజుకీ, బయోకాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, శుక్రవారం(ఈ నెల28) అంబుజా సిమెంట్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ తదితర కంపెనీల ఆర్థిక ఫలితాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు రూ.18,890 కోట్లు దేశీయ కేపిటల్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)పెట్టుబడులు భారీ స్థాయిలో తరలివస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.18,890 కోట్లను ఎఫ్‌పీఐలు నికరంగా పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్ 3–21 తేదీల మధ్య ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.1,132 కోట్లుగాను, డెట్ విభాగంలో రూ.17,758 కోట్లుగానూ ఉన్నాయి. -
నష్టాలకు చెక్: దూసుకొచ్చిన మార్కెట్లు
వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి వస్తున్ననష్టాలకు స్టాక్ మార్కెట్లు బ్రేక్ వేశాయి. నష్టాల నుంచి తేరుకుని, భారీ లాభాల దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంలోకి ఎగిసి 29662 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ తన కీలకమార్కు 9200ను అధిగమించి ట్రేడవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ మద్దతుతో మార్కెట్లు ర్యాలీ జరుపుతున్నాయి. గెయిల్ 2 శాతం మేర లాభాలను పండిస్తోంది. గెయిల్ తో పాటు హిందాల్కో, టాటా స్టీల్, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీలు లాభాల్లో నడుస్తున్నాయి. కోల్ ఇండియా, మహింద్రా అండ్ మహింద్రా, సిప్లా, భారతీ ఎయిర్ టెల్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నేడు మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఫలితాలను ప్రకటించనుంది. నార్త్ కొరియా ప్రయోగించిన క్షిపణి పరీక్ష విఫలమవ్వడం, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్సు ఆసియా టూర్ లో బిజిబిజిగా కావడంతో అటు ఆసియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ ఫ్లాట్ గా 64.50వద్ద ప్రారంభమైంది. -
వారికి గుడ్ న్యూస్ అందించిన రిలయన్స్
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన మహిళా ఉద్యోగులకు తీపి కబురు అందించింది. అద్దె గర్భం,దత్తత ద్వారా తల్లులయ్యే మహిళలకు వేతనంతో కూడిన 12 వారాలు సెలవుదినాలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు-2016 ప్రకారం వీరికి 12 వారాల పెయిడ్‌లీవ్ కు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. కొత్త ప్రసూతి చట్టం నిబంధనల ప్రకారం దీన్ని 28 రోజుల నుంచి 12 వారాలకు పెంచినట్టు వెల్లడించింది. ఏప్రిల్ 1, 2017నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. అలాగే రెగ్యులర్ ఉద్యోగుల మెటర్నిటీ లీవ్‌ను 26 వారాలకు పొడిగించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు ఉద్యోగులకు అందించిన నోటీసులో కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధి ప్రకటించారు. మూడు నెలల లోపు బిడ్డను దత్తత తీసుకున్న మహిళలకు కూడా ఈ నిబంధనలను వర్తింపచేయనుంది. దత్తత తేదీ నుంచి ఈ లీవ్‌ను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. 28 రోజుల నుంచి 12 వారాలకు పెంచినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. బిడ్డను దత్తత స్వీకరించిన మహిళ / సింగిల్ ఫాదర్‌కు దత్తతు సెలవు వర్తిస్తుందని తెలిపింది. కాగా మెటర్నిటీ బెనిఫిట్ బిల్లు 2016 ప్రకారం కనీసం 10 మంది పనిచేస్తున్న సంస్థల్లో ఈ కొత్త చట్టాన్ని అమలుచేయాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం మూడు నెలల కన్నా తక్కువ వయసున్న చిన్నారిని దత్తత తీసుకునే, అద్దె గర్భం ద్వారా తల్లయ్యే మహిళలకు 12 వారాల ప్రసూతి సెలవులు ఇస్తారు. సుమారు 18 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలిగేలా పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. -
సెన్సెక్స్ 184 పాయింట్లు లాస్
ముంబై : బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, రుతుపవనాలపై వస్తున్న నిరాశజనకమైన అంచనాలతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 184.25 పాయింట్లు పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ 29,237.15 వద్ద, 62.80 పాయింట్ల నష్టంలో 9045.20 వద్ద నిఫ్టీ క్లోజయ్యాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొద్దామనుకున్న హెల్త్ కేర్ బిల్లుపై ఆయనకు ఎదురుదెబ్బ తగలడంతో డాలర్ ఇండెక్స్ ఢమాల్ మంటోంది. డాలర్ పడిపోతుండటంతో బంగారం పైపైకి ఎగుస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 108.00 పైకి ఎగిసి రూ.28,901 వద్ద ట్రేడయ్యాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా ఏడాదిన్నర గరిష్ట స్థాయిలకు ఎగిసింది. 34 పైసల లాభంతో 65.08 వద్ద ముగిసింది. బలహీనమైన గ్లోబల్ సంకేతాలు, నిరాశజనకమైన రుతుపవనాలు అంచనాలకు తోడు లాభాల స్వీకరణ కూడా మార్కెట్లకు దెబ్బకొట్టింది. మెటల్, టెక్, ఐటీ, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఆటో సూచీలు నష్టాల్లో నడిచాయి. కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, హీరో మోటార్ కార్పొరేషన్, ఏసియన్ పేయింట్స్, టాటా మోటార్స్, విప్రో, లుపిన్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్ నేటి ట్రేడింగ్ మేజర్ లూజర్లుగా 2.37 శాతం వరకు నష్టపోయాయి. -
రిలయన్స్‌లో భారీ అమ్మకాలు: నష్టాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి సెబీ ఇచ్చిన షాక్ మార్కెట్లను బాగానే తాకింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్నుంచి నిషేధించడంతో ఆర్ఐఎల్ షేర్లలో మదుపర్ల అమ్మకాలకు తోడు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్‌కు నెగెటివ్ గా మారాయి. సెన్సెక్స్78 పాయింట్లు క్షీణించి 29,343వద్ద నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 9,081ను వద్ద కొనసాగుతోంది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,100 స్థాయి దిగువకు చేరింది. అటు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లును నేడు పార్లమెంటులోప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లో కొనసాగుతుండగా పీఎస్‌యూ బ్యాంకింగ్ లాభాల్లో ఉంది. 2 శాతం నష్టాలతో కోల్ ఇండియా, ఆర్ఐఎల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.బీవోబీ, పవర్‌గ్రిడ్, గెయిల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, గ్రాసిమ్ , మదర్ సన్ సుమి లాభాల్లోనూ, అరబిందో, ఐడియా, లుపిన్ తదితర షేర్లు నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి భారీగా లాభపడింది. 42పైసల లాభంతో రూ.65.11 వద్ద ఉంది. -
రిలయన్స్ మెరుపులు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ముకేష్ అంబానీ నిన్నటి ప్రకటనతో రిలయన్స్ ఇండస్ట్రీస్ 8 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేయడం మార్కెట్లకు బలాన్నిచ్చింది. దీంతో ఒకదశలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా జంప్ చేసింది. చివరికి103 పాయింట్లు ఎగిసి 28,865 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు బలపడి 8,927 వద్ద ముగిసింది. ఒకవైపు ఐటీ పతనం దిశగాపోతుండగా రిలయన్స్ మాత్రం దూసుకుపోయింది. ఇదే బాటలో ఐడియా, భారతి ఎయిర్ టెల్ కూడా సాగడం విశేషం. ఒక మిగతా రంగాలకువస్తే.. మెటల్, ఫార్మా బలహీనంగా ముగిశాయి. ఆర్ఐఎల్ 11 శాతం లాభాలతో టాప్ విన్నర్ గా నిలిచింది. ఐడియా యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, ఇన్ఫ్రాటెల్ లాభాల్లో, భారతి ఎలక్ట్రానిక్స్ కాస్ట్రోల్ ఇండియా, ఎన్టీపీసీ, అంబుజా సిమెంట్, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, ఏసీసీ, అరబిందో నష్టాల్లో ముగిశాయి. కాగా ఫిబ్రవరి ఎఫ్ అండ్ ఓ సిరీస్ రేపటితో ముగియనుంది. డాలర్ మారకంలో రూపాయి 0.05పైసల నష్టంతో రూ.66.98 వద్ద ఉంది. -
రిలయన్స్–ఓఎన్జీసీ వివాదంలో ఆర్బిట్రేటర్ ఎంపిక
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ క్షేత్రాల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్యాస్ వెలికితీసిన వివాదంపై ఏర్పాటైన త్రిసభ్య ఆర్బిట్రేషన్ ప్యానెల్ ప్రిసైడింగ్ జడ్జిగా సింగపూర్‌కి చెందిన ఆర్బిట్రేటర్ ప్రొఫెసర్ లారెన్స్ బూ నియమితులయ్యారు. మిగతా ఇద్దరు ఆర్బిట్రేటర్లు ఇందుకు అంగీకారం తెలిపినట్లు కేంద్ర చమురు శాఖ వర్గాలు తెలిపాయి. పొరుగునే ఉన్న ఓఎన్జీసీ క్షేత్రానికి చెందిన గ్యాస్‌ను ఆర్ఐఎల్ దాదాపు ఏడేళ్ల పాటు కేజీ–డీ6లోని తమ క్షేత్ర బావుల నుంచి వెలికితీసిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి గాను మొత్తం 1.55 బిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఆర్ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలు నికో, బీపీలకు చమురు శాఖ నోటీసులిచ్చింది. దీనిపై నవంబర్ 11న ఆర్ఐఎల్ ఆర్బిట్రేషన్ నోటీసు ఇచ్చింది. తమ ఆర్బిట్రేటర్‌గా బ్రిటన్ హైకోర్టు న్యాయమూర్తి బెర్నార్డ్ ఎడర్ను ప్రతిపాదించింది. -
ఆర్ఐఎల్ ఆస్తుల్లో 40వేల కోట్ల తరుగుదల
కేజీ డీ6పైనే రూ.20,114 కోట్లు... న్యూఢిల్లీ: అకౌంటింగ్ విధానంలో మార్పు దృష్ట్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రూ.39,570 కోట్ల మేరకు తన ఆయిల్ అండ్ గ్యాస్ ఆస్తుల విలువను రద్దు (రైట్‌డౌన్) చేసింది. ఇందులో కేజీ బేసిన్‌లోని డీ6తోపాటు అమెరికా షేల్ గ్యాస్ ప్రాజెక్టులు సైతం ఉన్నాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి ఆర్ఐఎల్ భారతీయ అకౌంటింగ్ ప్రమాణాల పరిధిలోని నూతన విధానానికి మళ్లింది. ఈ మార్పు నేపథ్యంలో తన చమురు, సహజవాయువుల నిల్వలను ఆర్ఐఎల్ తిరిగి ప్రకటించింది. 2016 మార్చి 31 నాటికి తన ఆయిల్, గ్యాస్ ఆస్తుల విలువలో రూ.39,750 కోట్ల తరుగుదలను చూపించింది. కేవలం ఒక్క కేజీ బేసిన్‌లోని డీ6 బ్లాక్‌కు సంబంధించే రూ.20,114 కోట్ల తరుగుదలను చూపించింది. ఈ వివరాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల నివేదికలో ఆర్ఐఎల్ వెల్లడించింది. విలువ తరుగుదలకు ఆయిల్, గ్యాస్ ధరల పతనమే ప్రధాన కారణం. ఇక స్వాధీనం చేసిన బ్లాక్‌లు, ఫలితమివ్వని బావులు, విడిచిపెట్టిన బావులు వంటివి ప్రభావం చూపినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. -
ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ వివాదంలో ఆర్బిట్రేటర్ నియామకం
న్యూఢిల్లీ: గ్యాస్ వెలికితీతపై ఓఎన్జీసీ–రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య నెలకొన్న వివాద పరిష్కార ఆర్బిట్రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తమ తరఫు ఆర్బిట్రేటర్‌గా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీఎస్ సింఘ్వీ పేరును ప్రతిపాదించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్ ఇప్పటికే తమ తరఫు ఆర్బిట్రేటర్‌గా బ్రిటన్ హైకోర్టు జడ్జి బెర్నార్డ్ ఎడర్ పేరు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. త్రిసభ్య ప్యానెల్లో సభ్యులైన ఈ ఇద్దరు ఇక.. ప్రిసైడింగ్ జడ్జి ఎంపికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేజీ–డీ6 బ్లాక్ ఆపరేటర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. పొరుగునే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ క్షేత్రం నుంచి ఏడేళ్లుగా దాదాపు 338.332 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల గ్యాస్ (ఎంబీటీయూ) వెలికితీసిందంటూ నవంబర్ 3న చమురు శాఖ ఆర్ఐఎల్కు నోటీసులు ఇచ్చింది. ఈ గ్యాస్‌కు సంబంధించి మొత్తం 1.55 బిలియన్ డాలర్లు కట్టాలంటూ ఆదేశించింది. వాస్తవానికి ఆర్‌ఐఎల్‌పై ఓఎన్జీసీ స్వయంగా దావా వేసినప్పటికీ .. సహజ వనరులపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి గనుక పరిహారం కేంద్రానికే చెందాలంటూ మాజీ జస్టిస్ ఏపీ షా కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలోనే చమురు శాఖ ఆర్ఐఎల్కు నోటీసులిచ్చింది. -
ఒత్తిడిలో మార్కెట్లు, ఆయిల్ షేర్ల్ జోరు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఉత్సాహంతో మొదలైనా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 26,717 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 8,240 వద్ద మొదలైనా మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 17 పాయింట్లు,నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఒక్క ఆటో మినహా మిగిలిన అన్ని రంగాలు పాజిటివ్ గా ఉన్నా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఫార్మా , అయిల్ అండ్ గ్యాస్ రంగాలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్ఐఐలు అమ్మకాలు రూ. 434 కోట్లుగా నమోదయ్యాయి ఓఎన్జీసీ, గెయిల్ ఆర్ఐఎల్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టాటా పవర్, గ్రాసిమ్, ఐషర్, ఇన్ఫ్రాటెల్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, బీవోబీ లాభాల్లో టాటా మోటార్స్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్ డీవీఆర్, పవర్‌గ్రిడ్, భారతీ, మారుత, ఐడియా నష్టాల్లోనూకొనసాగుతున్నాయి. అటు డాలర్ మారకపు విలువలో దేశీయ కరెన్సీ 22 పైసలు బలపడి రూ.68,43 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. బంగారం రూ.347 నష్టంతో రూ.28,415 వద్ద ఉంది. -
జీఈతో ఆర్ఐఎల్ జట్టు
ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స కోసం న్యూఢిల్లీ: రిలయన్స ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), జీఈ కంపెనీలు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స(ఐఐఓటీ) వ్యాపారం కోసం ఒక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారుు. ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స వ్యాపారం కోసం డిజిటల్ సొల్యూషన్స ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని రెండు కంపెనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారుు. ఆరుుల్, గ్యాస్, విద్యుత్తు, ఫార్మా, టెలికం ఇతర రంగాల్లో వినియోగదారులకు ఐఐఓటీ సొల్యూషన్స అందించడానికి రెండు దిగ్గజ సంస్థల మధ్య ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారని ఆ ప్రకటన పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా డేటా కనెక్టివిటీ ఉపయోగించడం ద్వారా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉన్న ఉత్పత్తులను ఐఓటీ పరికరాలు ఆపరేట్ చేస్తారుు. ఉదాహరణకు మనం ఎక్కడ ఉన్నా, కారును లాక్ చేయవచ్చు. సీసీటీవీని నియంత్రించవచ్చు. రిలయన్స జియో అందిస్తున్న హై బ్యాండ్విడ్త కనెక్టివిటీ, క్లౌడ్ సర్వీసుల వల్ల భారత్‌లో ఐఐఓటీకి మంచి వృద్ధి అవకాశాలున్నాయని ఆర్ఐఎల్ సీఎండీ ముకేశ్ అంబానీ చెప్పారు. జీఈ సంస్థ ప్రిడిక్స్ క్లౌడ్‌ను, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ అప్లికేషన్‌సను, డేటా సైన్స నైపుణ్యాలను అందిస్తుందని, తాము ఒక ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ వెండార్‌గా ప్రిడిక్స్పై సొల్యూషన్స ఆఫర్ చేస్తామని వివరించారు. డిజిటల్ దిశగా భారత్ అడుగులు వేయడం హర్షించదగ్గ విషయమని జీఈ చైర్మన్, సీఈఓ జెఫ్ ఇమ్మెల్ట్ చెప్పారు. -
కేజీ డీ6లో ‘నికో’ వాటా అమ్మకానికి..
ఆర్ఐఎల్ డీ6 బ్లాక్‌లో 10% వాటా రెండోసారి విక్రయ ప్రయత్నం న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని డీ6 బ్లాక్‌లో ఆర్ఐఎల్ భాగస్వామ్య కంపెనీ, కెనడాకు చెందిన నికో రీసోర్సెస్ తన వాటాను తాజాగా మరోసారి విక్రయానికి పెట్టింది. కేజీ డీ6లో ఆర్ఐఎల్ 60 శాతం వాటాతో నిర్వహణ కంపెనీగా ఉండగా... బ్రిటన్‌కు చెందిన బీపీ పీఎల్‌సీకి 30%, నికోకు 10% చొప్పున వాటాలు ఉన్నారుు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నికో రీసోర్సెస్ కేజీ డీ6 (కేజీ-డీడబ్ల్యూఎన్-98/3) బ్లాక్‌లో 10% వాటాలను విక్రరుుంచి, దాని ద్వారా వచ్చే నిధులతో 340 మిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.2,278 కోట్లు) రుణాలను తీర్చివేయాలని అనుకుంటున్నట్టు గతేడాది ఫ్రిబవరిలోనే తెలిపింది. వాటా విక్రయానికి 2015 ఏప్రిల్ 30వ తేదీని గడువుగా నిర్ణరుుంచగా, తర్వాత దాన్ని మే 31కి, సెప్టెంబర్ 15 వరకు పొడిగించినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో వాటాల విక్రయ ప్రతిపాదనను వారుుదా వేసింది. ప్రభుత్వ జరిమానాతో సంక్లిష్టం.. కేజీ డీ6లో అభివృద్ధి చేయని క్షేత్రాల్లోని సహజ వాయువు నిల్వలకు ధర విషయంలో ఉన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో తమ వాటాల విక్రయ ప్రక్రియను తిరిగి చేపట్టామని నికో రీసోర్సెస్ తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ ఎల్స్‌వర్త్ తెలి పారు. కానీ పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్ తోడివేసినందుకు 1.55 బిలియన్ డాలర్ల మేర జరిమానా చెల్లించాలన్న ప్రభుత్వ డిమాండ్‌తో వాటాల విక్రయం సంక్లిష్టంగా మారినట్టు ఎల్స్‌వర్త్ తెలిపారు. -
రిలయన్స్‌కు కేంద్రం షాక్!
• ఓఎన్జీసీ గ్యాస్‌ను లాక్కున్న కేసులో • 1.55 బిలియన్ డాలర్ల జరిమానా... • రిలయన్స్, బీపీ, నికో రిసోర్సెస్‌కు నోటీసులు... • ఆర్బిట్రేషన్‌కు దారితీసే అవకాశం... న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స ఇండస్ట్రీస్‌కు (ఆర్ఐఎల్) కేంద్రం షాకిచ్చింది. కేజీ బేసిన్లో ఓఎన్జీసీ గ్యాస్ బ్లాక్ నుంచి అక్రమంగా సహజవాయువును లాగేసుకున్నట్టు రేగిన వివాదంలో 1.55 బిలియన్ డాలర్ల (ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు రూ.10,380 కోట్లు) భారీ జరిమానాను విధించింది. ఈ మేరకు రిలయన్సతో పాటు దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్‌కు కేంద్ర పెట్రోలియం శాఖ శుక్రవారం డిమాండ్ నోటీసులను జారీ చేసింది. అరుుతే, దీనిపై రిలయన్స న్యాయపోరాటం (ఆర్బిట్రేషన్) చేసే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నారుు. ఏపీ షా కమిటీ నివేదిక మేరకే... ఓఎన్జీసీకి కేజీ బేసిన్లో కేజీ-డీడబ్ల్యూఎన్-98/2(కేజీ-డీ5), గోదావరి పీఎంఎల్ పేరుతో చమురు-గ్యాస్ బ్లాక్లున్నారుు. ఇవి రిలయన్‌సకు చెందిన కేజీ-డీ6 బ్లాక్ పక్కనే ఉన్నారుు. తమ బ్లాక్‌ల నుంచి గ్యాస్‌ను రిలయన్స లాగేసుకుంటోందని ఓఎన్జీసీ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు కేంద్రం జస్టిస్ ఏపీ షా నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆగస్టు 29న ఇచ్చిన నివేదికలో రిలయన్స ఓఎన్జీసీ గ్యాస్‌ను అక్రమంగా తోడేసుకున్నది వాస్తవమేనని తేల్చిచెప్పింది. ఓఎన్జీసీ బ్లాక్‌ల నుంచి గడిచిన ఏడేళ్లుగా (ఈ ఏడాది మార్చి వరకూ) రిలయన్స సుమారు 338.33 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల(ఎంబీటీయూ) గ్యాస్‌ను తన బావుల ద్వారా తోడేసుకుందని కేంద్రం లెక్కతేల్చింది. దీనికిగాను 1.47 బిలియన్ డాలర్లను రిలయన్స, బీపీ, నికోలు జరిమానాగా చెల్లించాలని ఈ నెల 3న పెట్రోలియం మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. సంబంధిత కాలానికి వడ్డీ కింద మరో 149.86 మిలియన్ డాలర్లను కూడా జత చేసింది. అరుుతే, ఈ గ్యాస్‌పై రిలయన్స చెల్లించిన 71.71 మిలియన్ డాలర్ల రాయల్టీని తీసేస్తే మొత్తం జరిమానా 1.55 బిలియన్ డాలర్లుగా నిర్ధారించింది. ఓఎన్జీసీకి కాదు కేంద్రానికి... రిలయన్స నుంచి రాబాట్టాల్సిన నష్టపరిహారం ఓఎన్జీసీకి కాకుండా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుందని షా కమిటీ సూచించడంతో దీనిపై ఓఎన్జీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. షా కమిటీ సూచనల నేపథ్యంలోనే నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స(డీజీహెచ్) లెక్కమేరకు పెట్రోలియం శాఖ నోటీసులు పంపింది. ‘షా కమిటీ సిఫార్సులను ఆమోదించాం. కేజీ-డీ6 బ్లాక్ కాంట్రాక్టర్ (రిలయన్స) ఓఎన్జీసీ గ్యాస్ బ్లాక్‌ల నుంచి గ్యాస్‌ను తోడుకోవడం, అక్రమంగా దాన్ని అమ్ముకోవడం ద్వారా ప్రయోజనం పొందింది. దీన్ని రాబట్టుకోవడం కోసమే నోటీసులు జారీ చేశాం’ అని పెట్రోలియం శాఖ పేర్కొంది. మరో 177 మిలియన్ డాలర్లు కూడా... కాగా, కేజీ-డీ6లో ముందుగా పేర్కొన్న లక్ష్యాల మేరకు గ్యాస్‌ను ఉత్పత్తి చేయనందుకుగాను తాజాగా రిలయన్స, దాని భాగస్వామ్య పక్షాలకు 177 మిలియన్ డాలర్ల జరిమానాను విధిస్తూ (ఈ మొత్తాన్ని రిలయన్స కేజీ-డీ6 గ్యాస్ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి వ్యయాల రూపంలో మినహారుుంచుకోకూడదు) కూడా పెట్రోలియం శాఖ మరో డిమాండ్ నోటీసు పంపింది. గతంలో కూడా వ్యయాలను వెనక్కి తీసుకోకుండా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఇప్పటికే రిలయన్స ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది కూడా. మరోసారి ఆర్బిట్రేషన్... షా కమిటీ సిఫార్సులు, రిలయన్స నుంచి రాబట్టే పరిహారం ఓఎన్జీసీకి కాకుండా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుందన్న వాదనల నేపథ్యంలో దీనిపై ఆర్బిట్రేషన్ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారుు. మరోపక్క, తాము ఉద్దేశపూర్వకంగా పక్కనున్న ఓఎన్జీసీ బ్లాక్ నుంచి గ్యాస్‌ను తోడుకోలేదని.. తమ కేజీ-డీ6 బ్లాక్ పరిధిలోనే ప్రభుత్వంతో ఒప్పందం, అనుమతుల మేరకే బావులను తవ్వి గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నామని ఆర్ఐఎల్ వాదిస్తోంది. పీఎస్సీ ప్రకారం ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య ఎవైనా వివాదాలు తలెత్తితే ఆర్బిట్రేషన్ ద్వారానే పరిష్కరించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్ఐఎల్, భాగస్వామ్య సంస్థలు ఓఎన్జీసీ గ్యాస్ వివాదంలో కూడా ఆర్బిట్రేషన్‌ను మొదలుపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ప్రభుత్వం జరిమానాపై ఆర్ఐఎల్ నుంచి తక్షణం ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు. బీపీ అధికార ప్రతినిధి మాత్రం.. తమకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయని.. అరుుతే, ఇలాంటి భౌగోళికపరమైన సరిహద్దు వివాదాలను అంతర్జాతీయ పెట్రోలియం పరిశ్రమ విధానాలు, పీఎస్సీ నిబంధనల మేరకే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. -
రిలయన్స్ అధినేతకు భారీ షాక్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తన బావుల పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్‌ను తోడివేయడంపై వివాదంలో ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి భారీ పరిహారాన్ని విధించింది. ఈ వివాదంలో 1.55 బిలియన్ డాలర్లు( సుమారు 10వేల312 కోట్లు) జరిమానా విధించింది. ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్-జీసీ -రిలయెన్స్ సంస్థకు చెందిన కేజీ- డీ 6 బ్లాక్ మధ్య నడుస్తున్న గ్యాస్ వివాదంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడు సంవత్సరాలుగా కేజీ బేసిన్లో సహజవాయువును తోడుకుంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వాముల నుంచి ఈ పరిహారాన్ని కోరుతూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది కాగా ఓఎన్జీసీ గ్యాస్‌ను ఆర్ఐఎల్ ఉత్పత్తి చేసినందున అందుకు పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)1 బిలియన్ డార్లుగా ( సుమారు రూ. 6652.75 కోట్లుగా) లెక్క కట్టింది. ఈ అంచనాలను ఆయిల్ మంత్రిత్వ శాఖకు అందచేసిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ లాభం 7,206 కోట్లు
క్యూ2లో 23% తగ్గుదల... • ఆదాయం రూ.81,651 కోట్లు; 9.6 శాతం అప్ • పెట్రోకెమికల్, రిఫైనరీ ఆదాయాల జోరు... • స్థూల రిఫైనింగ్ మార్జిన్ 10.1 డాలర్లు... న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో కంపెనీ రూ.7,206 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.9,345 కోట్లతో పోలిస్తే 23 శాతం తగ్గింది. కాగా, క్రితం ఏడాది క్యూ2లో నికర లాభం అధికంగా నమోదుకావడానికి అమెరికా షేల్ గ్యాస్ ఆస్తుల విక్రయం రూపంలో వచ్చిన రాబడులు కూడా కలిసి ఉండటం ప్రధాన కారణంగా నిలిచింది. దీన్ని మినహాయించిచూస్తే... నికర లాభం 43.1 శాతం ఎగబాకినట్లు లెక్క. ఇక కన్సాలిడేటెడ్ ఆదాయం క్యూ2లో రూ.74,490 కోట్ల నుంచి రూ. 81,651 కోట్లకు ఎగబాకింది. 9.6 శాతం వృద్ధి చెందింది. కంపెనీ కీలక వ్యాపారాలైన పెట్రోకెమికల్స్, రిఫైనింగ్ విభాగాల్లో మంచి పనితీరు నమోదుకావడం ఆకర్షణీయమైన ఫలితాలకు దోహదం చేసింది. రిఫైనింగ్ మార్జిన్ తగ్గింది... సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్ఐఎల్ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) 10.1 డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో జీఆర్ఎం 10.6 డాలర్లు కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 11.5 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురు(క్రూడ్)ను పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ చమురు-గ్యాస్ ఉత్పత్తి వ్యాపారానికి సంబంధించి క్యూ2లో కంపెనీ రూ.491 కోట్ల స్థూల నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల లాభం రూ.3,326 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా చమురు-గ్యాస్ ధరలు తగ్గడం, కేజీ-డీ6 బేసిన్లో ఉత్పిత్తి పడిపోవడం వంటివి దీనికి కారణంగా నిలిచాయి. ⇔ పెట్రోకెమికల్స్ విభాగం స్థూల లాభం 35.5 శాతం ఎగబాకి రూ.3,417 కోట్లకు చేరింది. పాలియెస్టర్, ఇతర ఫైబర్ ఉత్పత్తులకు సంబంధించి అమ్మకాలు జోరందుకోవడం దీనికి దోహదం చేసింది. ⇔ రిఫైనింగ్ విభాగం స్థూల లాభం రూ.5,445 కోట్ల నుంచి రూ.5,975 కోట్లకు పెరిగింది. 10 శాతం మేర వృద్ధి చెందింది. ⇔ రిటైల్ వ్యాపారం మార్జిన్లు కూడా భారీగా దూసుకెళ్లాయి. క్యూ2లో ఈ విభాగం స్థూల లాభం 42.1 శాతం వృద్ధితో రూ.114 కోట్ల నంచి రూ.162 కోట్లకు పెరిగింది. ⇔ సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.1,89,132 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలానికి రుణ భారం రూ.1,80,388 కోట్లుగా ఉంది. ⇔ ఇక నగదు నిల్వలు కూడా రూ.89,966 కోట్ల నుంచి రూ.82,330 కోట్లకు తగ్గాయి. ⇔ రిలయన్స్ షేరు ధర గురువారం బీఎస్ఈలో 0.15 శాతం స్వల్ప లాభంతో రూ.1,089 వద్ద ముగిసింది. కాగా, మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. రిఫైనింగ్ వ్యాపారంలో పటిష్టమైన పనితీరుతో పాటు పెట్రోకెమికల్స్ విభాగంలో రికార్డుస్థాయి లాభాల కారణంగా క్యూ2లో అద్భుతమైన ఫలితాలను ప్రకటించగలిగాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా రిఫైనింగ్ వ్యాపారం అధిక లాభదాయకతను నమోదు చేసింది. దీనికి ప్రధానంగా రిఫైనింగ్ అసెట్స్ సామర్థ్యంతో పాటు మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా కంపెనీ సత్వర చర్యలు, కార్యకలాపాల నిర్వహణ పనితీరు దోహదం చేశాయి. నిర్మాణంలో ఉన్న హైడ్రోకార్బన్ ప్రాజెక్టులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే... ఇంధన, పెట్రోకెమికల్స్ రంగంలో దిగ్గజ స్థానంలో ఉన్న కంపెనీ స్థాయి మరింత బలోపేతం అవుతుంది. రిలయన్స్ జియో 4జీ సేవలకు కస్టమర్లనుంచి లభించిన అద్వితీయమైన స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మొబైల్ ఇంటర్నెట్(డేటా) పవర్‌తో దేశ ప్రజలందరి సామర్థ్యాలను మరింతగా పెంచడమే లక్ష్యంగా జియో టెలికం వెంచర్‌ను ఏర్పాటుచేశాం. - ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ -
కేజీ బేసిన్ పరిహారంపై ఓఎన్జీసీలో భిన్న స్వరాలు
♦ షా కమిటీ సిఫారసును సవాల్ చేద్దాం వద్దు... ఆమోదిద్దాం ♦ రెండుగా విడిపోయిన బోర్డు ♦ ఆర్ఐఎల్ పరిహారం ప్రభుత్వానికేనన్న షా కమిటీ న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో తమ క్షేత్రాల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) బ్లాక్‌లకు తరలిపోయిన గ్యాస్‌కు సంబంధించి రూ.11వేల కోట్ల పరిహారం అడిగే విషయమై ఓఎన్జీసీ బోర్డు రెండుగా విడిపోయింది. దీనిపై ఏర్పాటైన జస్టిస్ ఏపీ షా కమిటీ గత నెలలో కేంద్రానికి నివేదిక సమర్పించడంతోపాటు, రిలయన్స్ అక్రమంగా తరలించుకుపోయిన గ్యాస్‌పై పరిహారం ప్రభుత్వానికే వెళుతుందని, ఓఎన్జీసీకి రాదంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. గ్యాస్ ప్రభుత్వానిదే కనుక పరిహారానికీ ప్రభుత్వమే అర్హురాలని తెలిపింది. తాజాగా ఇదే అంశంపై ఓఎన్జీసీ బోర్డులో రెండు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం గమనార్హం. భిన్న స్వరాలు:విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... బోర్డులోని ఒక వర్గం షా కమిటీ ప్రతిపాదనను సవాలు చేయాలని డిమాండ్ చేస్తోంది. వివాద పరిష్కారమై సంతృప్తి చెందకపోతే కోర్టును తిరిగి ఆశ్రయించవచ్చని ఢిల్లీ హైకోర్టు అవకాశం ఇచ్చింది కనుక కోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేస్తోంది. ఇదే వర్గం మరో పాయింట్‌ను కూడా లెవనెత్తుతోంది. కేజీ డీ6 బ్లాక్‌కు ఆర్ఐఎల్ కూడా యజమాని కాదని, పెట్టుబడులపై రాబడి మీద నిర్ణీత శాతం మేర చెల్లిస్తోందన్న లాజిక్‌ను షా కమిటీ విస్మరించిందని వాదిస్తోంది. మరో వర్గం మాత్రం ప్రభుత్వంతో పోరాడడం సరికాదని, కేజీ బేసిన్లో గ్యాస్ ఆర్ఐఎల్ బేసిన్‌కు వెళుతోందన్న విషయాన్ని నిరూపించామని, షా కమిటీ సిఫారసులను ఆమోదించాలని కోరుతోంది. మరోవైపు పెట్రోలియం శాఖ ఆర్ఐఎల్ ఎంత పరిహారం చెల్లించాలన్న అంశాన్ని తేల్చాల్సిందిగా డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)ను కోరింది. ఈ నేపథ్యంలో చివరికి ఈ అంశం ఏమని తేలుతుందో ఆసక్తికరంగా మారింది. పూర్వాపరాలు:కేజీ బేసిన్లో ఓఎన్జీసీకి చెందిన గోదావరి-పీఎంఎల్, కేజీ-డీడబ్ల్యూఎన్-98/2 బ్లాక్‌లు... ఆర్ఐఎల్కు కేజీ- డీడబ్ల్యూఎ - 98/3 లేదా డీ6 బ్లాక్ పక్కపక్కనే ఉన్నాయి. తమ బ్లాక్‌ల నుంచి ఆర్ఐఎల్ గ్యాస్ తరలించుకుపోతోందని ఓఎన్జీసీ తొలిసారిగా 2013లో గుర్తించి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. స్పందన లేకపోవడంతో ఓఎన్జీసీ 2014 మేలో ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు చేసింది. దీనిలో ప్రభుత్వాన్ని పార్టీగా చేర్చింది. ఆర్ఐఎల్ కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించిన 2009 ఏప్రిల్ 1 నుంచి... 2015, మార్చి 31 మధ్య కాలంలో 11.122 బిలియన్ ఘనపు మీటర్ల మేర గ్యాస్ తరలిపోయినట్లు స్వతంత్ర అధ్యయన సంస్థ డీఅండ్‌ఎం సైతం గతేడాది నవంబర్‌లో ఇచ్చిన నివేదికలో తేల్చింది. అప్పటి సహజ వాయువు రేట్ల(యూనిట్‌కు 4.2 డాలర్లు) ప్రకారం దీని విలువ 1.7 బిలియన్ డాలర్లు. -
గ్యాస్ తరలింపు ముందుగా తెలియదు
♦ కేజీ బేసిన్లో రిలయన్స్‌తో వివాదంపై ♦ ఓఎన్జీసీ సీఎండీ డీకే షరాఫ్ న్యూఢిల్లీ: కేజీ బేసిన్లో తమ క్షేత్రాలకు ఆనుకుని ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కేజీ-డీ6 క్షేత్రాల్లోకి గ్యాస్ తరలిపోతోందన్న విషయంపై తమకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని కంపెనీ సీఎండీ డీకే షరాఫ్ పేర్కొన్నారు. అయితే, ఈ విషయం మాత్రం ఆర్ఐఎల్కు ముందుగానే తెలుసని చెప్పారు. గ్యాస్ తరలింపు వివాదంపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఏపీ షా కమిటీ.. ఓఎన్జీసీ గ్యాస్‌ను ఆర్ఐఎల్ లాగేసుకుందని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. 2009 నుంచి 2015 వరకూ ఈ విధంగా ఓఎన్జీసీ బ్లాక్‌ల నుంచి గ్యాస్ ఆర్ఐఎల్ క్షేత్రాల్లోకి తరలిపోయిందని... దీనికి ప్రతిగా ఆ కంపెనీకి నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా కేంద్ర పెట్రోలియం శాఖకు ఇటీవలే సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. ఇరు కంపెనీల క్షేత్రాలూ ఒకదానితో ఒకటి అనుసంధానమైన ఉన్నాయని, గ్యాస్ తమ క్షేత్రాల్లోకి వచ్చేస్తున్న విషయం ఆర్ఐఎల్కు ముందే తెలిసి ఉండొచ్చన్న వాదనను కమిటీ నిర్ధారించింది. అయితే, క్షేత్రాల అనుసంధానం సంగతి 2007లోనే ఓఎన్జీసీకి తెలిసినా కూడా 2013 వరకూ చడీచప్పుడులేకుండా ఉందని ఆర్ఐఎల్ చేసిన ఆరోపణలను కూడా కమిటీ తన నివేదికలో పొందుపరిచింది. ‘ఈ అంశం గురించి ఓఎన్జీసీకి ముందస్తుగా ఎలాంటి అవగాహన లేదు. విషయం తెలిసిన వెంటనే(2013లో) నియంత్రణ సంస్థల దృష్టికి తీసుకెళ్లడం ఇతరత్రా చర్యలు చేపట్టాం. అయితే, మాకు ముందుగా తెలియదన్న అంశాన్ని షా కమిటీకి మేం చెప్పినప్పటికీ నివేదికలో ప్రస్తావించినట్లు లేదు’ అని షరాఫ్ వివరించారు. కాగా, ఆర్ఐఎల్కు తోడేసిన గ్యాస్ విలువ రూ.11,000 కోట్లుగా టెక్నికల్ కన్సల్టెంట్ డీఅండ్‌ఎం లెక్కగట్టిన సంగతి తెలిసిందే. పరిహారం ప్రభుత్వానికే..!: గ్యాస్ తరలింపునపై నష్టపరిహారం ఓఎన్జీసీకి కాకుండా కేంద్ర ప్రభుత్వానికే ఆర్ఐఎల్ చెల్లించాల్సి వస్తుందని షా కమిటీ తన నివేదికలో పేర్కొనడం ఓఎన్జీసీకి మింగుడుపడని అంశం. ఓఎన్జీసీ క్షేత్రాల నుంచి అక్రమంగా ఆర్ఐఎల్ గ్యాస్‌ను తరలించుకున్నప్పటికీ.. సహజవాయువుపై ఆ కంపెనీకి ఎలాంటి యాజమాన్య లేదా నియంత్రణ హక్కులు లేవని.. అందుకే నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వమే డిమాండ్ చేయాల్సి వస్తుందని కమిటీ పేర్కొంది. అయితే, నష్టపరిహారంపై ఎవరికి హక్కులు ఉంటాయన్నది ఇప్పుడే చెప్పడం కష్టమని షరాఫ్ వ్యాఖ్యానించారు. షా కమిటీ పెట్రోలియం శాఖకు నివేదిక వచ్చిన మర్నాడే.. ఆర్ఐఎల్కు చెందిన రిలయన్స్ జియో పత్రికల్లో మొదటి పేజీల్లో ఇచ్చిన యాడ్లలో ప్రధాని మోదీ ఫొటో ప్రత్యక్షమైన తరుణంలో ప్రభుత్వం దీనిపై నిజంగానే చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారా అంటూ విలేకరులు అడగగా.. ఈ రెండింటికీ సంబంధం లేదని షరీఫ్ చెప్పారు. జీఎస్పీసీ కేజీ క్షేత్రంలో వాటా కొనుగోలు! కేజీ బేసిన్లో జీఎస్పీసీకి చెందిన దీన్‌దయాల్ క్షేత్రంలో వాటా కొనుగోలుకు ఓఎన్జీసీ ప్రయత్నిస్తోంది. చర్చలు కొనసాగుతున్నాయని.. ఈ బ్లాక్‌లో సహజవాయువు నిల్వలను అంచనా వేసేందుకు అమెరికా కన్సల్టెంట్ రైడర్ స్కాట్‌ను నియమించుకున్నట్లు షరాఫ్ తెలిపారు. 20% తగ్గనున్న గ్యాస్ ధర... దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధర అక్టోబర్‌లో 20 శాతం మేర తగ్గిపోయే అవకాశం ఉందని షరాఫ్ చెప్పారు. అంతర్జాతీయంగా గ్యాస్ రేట్లు పడిపోతుండటం, దేశీ గ్యాస్ ధర నిర్ణయాన్ని దీంతో అనుసంధానించడటమే దీనికి కారణమన్నారు. ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ఆమోదించిన ఫార్ములా ప్రకారం ప్రస్తుతం యూనిట్(ఎంఎంబీటీయూ) ధర 3.06 డాలర్లు కాగా, ఈ అక్టోబర్ 1 నుంచి దాదాపు 2.5 డాలర్ల స్థాయికి తగ్గనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓఎన్జీసీ, ఆర్ఐఎల్లకు చెందిన ప్రస్తుత క్షేత్రాలకు ఇది వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ ఫార్ములా ప్రకారం ప్రతి ఆరు నెలలకు గ్యాస్ ధరను సవరించాల్సి ఉంటుంది. -
ఆర్ఐఎల్ హజీరా ప్లాంట్‌పై ‘ఎక్సైజ్’ఎగవేత ఆరోపణ
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) హజీరా తయారీ యూనిట్‌పై దాదాపు రూ.25 కోట్ల మేర ఎక్సైజ్ సుంకం ఎగవేత ఆరోపణలు వచ్చాయి. సెంట్రల్ రెవెన్యూ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ డెరైక్టరేట్ జనరల్ (డీజీసీఈఐ) ఈ కేసు విచారణను ప్రారంభించిందనీ, ఆర్ఐఎల్ నుంచి కొన్ని వివరణలు కోరిందని అధికార వర్గాలు తెలిపాయి. సంస్థలో ఉత్పత్తిచేసి, పెయింట్ కర్మాగారాలకు విక్రయించే కెమికల్ జీలీన్ మిశ్రమ (నాఫ్తా విచ్ఛిత్తి ద్వారా పొందిన రసాయనం) వర్గీకరణ విషయంలో అవకతవకలు జరిగినట్లు ప్రధాన ఆరోపణ. ఈ కెమికల్‌ను మినరల్ ఆయిల్గా వర్గీకరించి 14 శాతం సుంకం చెల్లించాల్సి ఉండగా, ఆర్గానిక్ కెమికల్గా చూపించి 12.5 శాతం సుంకం చెల్లించిందన్నది ఆరోపణ. తోసిపుచ్చిన ఆర్ఐఎల్ కాగా ఆర్ఐఎల్ ప్రతినిధి ఒకరు ఈ అంశంపై మాట్లాడుతూ, పూర్తి నియమ నిబంధనల ప్రకారమే తాము నడుచుకున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు తరచూ తమ కార్యకలాపాల రికార్డులను ఆడిట్ చేస్తున్నారనీ వివరించారు. కెమికల్ వర్గీకరణ విధం సరైనదేనని అన్నారు. తమ వాదన విషయంలో ఆర్ఐఎల్ ముంబైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అభిప్రాయాన్ని కోరినట్లు సమాచారం. డీజీసీఈఐకు ఈ నివేదికను ఆర్ఐఎల్ సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
నేటి నుంచి జియో పూర్తి సేవలు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 4జీ సేవలు నేటి(సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా 4జీ సదుపాయం ఉన్న ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా జియో సిమ్‌ను ఉపయోగించుకునే అవకాశం యూజర్లకు కల్పిస్తోంది. వాయిస్ కాలింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించడంతోపాటు అత్యంత చౌక రేట్లకు డేటా ప్లాన్లను తాజాగా ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ కంపెనీ ఏజీఎంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 5 నుంచి ప్రివ్యూ సేవలు, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తిస్థాయి వాణిజ్య సేవలు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. సాధ్యమైనంత వేగంగా 10 కోట్ల మంది సబ్స్క్రయిబర్లను జియో నెట్‌వర్క్‌లోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కూడా ఆయన చెప్పారు. కాగా, ప్రస్తుతం జియో సిమ్‌లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లోనే లభ్యమవుతుండగా.. నేటి నుంచి మల్టీ బ్రాండ్ అవుట్లెట్లు, మొబైల్ ఫోన్ షాప్‌లలోనూ తీసుకోవచ్చనేది సంబంధిత వర్గాల సమాచారం. ప్రివ్యూ సేవల్లో భాగంగా డిసెంబర్ 31 వరకూ జియో వాయిస్, డేటా, యాప్స్ ఇతరత్రా సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఆతర్వాత 4జీ డేటా రూ.149 నుంచి రూ.4,999 వరకూ 10 రకాల ప్లాన్లు యూజర్లకు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అన్లిమిటెడ్ వాయిస్, ఎస్ఎంఎస్, ఏడాది పాటు యాప్స్ సబ్స్క్రిప్షన్ వంటివి జియో ఆఫర్ చేస్తోంది. -
ముకేశ్ రీఎంట్రీపై టెల్కోల్లో గుబులు!
• రిలయన్స్ జియో లక్ష ్యం..10 కోట్ల మంది యూజర్లు! • ఇప్పటికే అనధికారికంగా సేవలు షురూ... • 90 రోజుల ఉచిత డేటా, వాయిస్ సేవలతో గాలం... • దీంతో మార్కెట్ వాటాపై పాత టెల్కోల్లో కలవరం... ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ టెలికం రంగంలోకి రీఎంట్రీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించే చర్యలను వేగవంతం చేయడమే దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా, వీలైనంత త్వరగా 10 కోట్ల మంది సబ్స్క్రయిబర్లను జియో నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలన్నది ముకేశ్ మెగా ప్రణాళికగా పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే బీటా(ప్రయోగాత్మక) సేవల పేరుతో ఎటువంటి మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నా... 90 రోజుల ఉచిత అన్లిమిటెడ్ డేటా, వాయిస్ సేవలు అంటూ యూజర్లకు రిలయన్స్ జియో ఇప్పటికే ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముకేశ్ అంబానీ జోరుతో ప్రస్తుత టెల్కోల్లో కలవరం మొదలైంది. ఇది స్పెక్ట్రం వాడక నిబంధనలకు విరుద్ధమని, పరీక్షల పేరుతో రిలయన్స్ జియో పూర్తిస్థాయి సేవలను ఇస్తోందంటూ సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సర్కారు ఖజానాకు కూడా గండికొడుతోందని ఆరోపణలు గుప్పించింది. మార్కెట్ వాటా కోసమే... రిలయన్స్ జియో రాక నేపథ్యంలో ఇప్పటికే మొబైల్ డేటా విభాగంలో టెల్కోలు పోటాపోటీగా టారిఫ్‌ల తగ్గింపు, పరిమితి పెంపు వంటి చర్యలతో ధరల పోరుకు తెరతీశాయి. ప్రస్తుతం దేశీ టెలికం పరిశ్రమ మార్కెట్ వాటాలో ఐదింట మూడొంతులు దిగ్గజాలైన భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ చేతిలోనే ఉంది. జియో పూర్తిస్థాయి అరంగేట్రానికి ముందే డేటా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేచర్యల్లో భాగంగా ఈ మూడు టెల్కోలు టారిఫ్‌లను తప్పనిసరిగా తగ్గించుకునేలా చేస్తోంది. ఇది ఆయా కంపెనీల వాటాదారులపైనా ప్రభావం చూపుతోంది. జియో 10 కోట్ల మంది యూజర్లను దక్కించుకునే పరిస్థితే ఉంటే ఎక్కడ యూజర్లను కోల్పోవాల్సి వస్తుందోనన్న ఆందోళనలో టెల్కోలు ఉన్నాయి. మార్కెట్ వాటాను చేజార్చుకుంటే మళ్లీ దక్కించుకోవడం కష్టసాధ్యమన్నది ఆయా కంపెనీల కలవరపాటుకు ప్రధాన కారణం. జియో ఎదురుదాడి... మరోపక్క, రిలయన్స్ జియో కూడా తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చడంతోపాటు ఎదురుదాడి మొదలుపెట్టింది. తమ బీటా సేవల్లో వినియోగదారులు ఇతర టెల్కోలకు సంబంధించిన నెట్‌వర్క్‌కు కాల్ చేసినప్పుడు తగిన ఇంటర్కనెక్షన్ సేవలను అందించకుండా ప్రస్తుత టెల్కోలు తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని, కాల్‌డ్రాప్‌లకు కారణమవుతున్నాయంటూ రిలయన్స్ జియో కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విదితమే. మొత్తంమీద సీఓఏఐ, జియోల మధ్య నెలకొన్న ఈ వివాదంతో కేంద్ర ప్రభుత్వం కూడా గందగోళంలో పడినట్లు కనిపిస్తోంది. దాదాపు మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న అదిపెద్ద స్పెక్ట్రం వేలాన్ని వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రావడం దీనికి నిదర్శనం. అప్పుల కుప్పలు... వాస్తవానికి నెట్వర్క్ విస్తరణపై ఇప్పటికే వేల కోట్ల రూపాయిలు కుమ్మరిస్తున్నా ఆ స్థాయిలో ఇంకా డేటా వినియోగం మరింతగా పుంజుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఐడియా వార్షిక స్థూల లాభంతో పోలిస్తే నికర రుణ భారం 5.7 రెట్లు కాగా, భారతీ ఎయిర్టెల్ విషయానికొస్తే.. 3.3 రెట్లుగా ఉంది. ఇక రిలయన్స్ జియో కూడా దేశవ్యాప్త 4జీ సేవల కోసం ఇప్పటికే 20 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 1.35 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు చెబుతోంది. అయితే, టెలికం విస్తరణ కోసం మరింతగా రుణం సమరించే ప్రణాళికలపై ప్రస్తుత టెల్కోలకు చెందిన మైనారిటీ వాటాదారులు వ్యతిరేక గళం వినిపిస్తుండటం గమనార్హం. మరోపక్క, పెట్రోలియం-రిఫైనింగ్ వ్యాపారంలో లాభాల పంట పండుతుండటంతో ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో మాత్రం తన ప్రతిష్టాత్మక ప్రణాళికల విషయంలో ఏమాత్రం తగ్గకుండా పెట్టుబడులను కుమ్మరిస్తోంది. ముకేశ్ లక్ష్యంగా పెట్టుకున్న 10 కోట్ల మంది సబ్స్క్రయిబర్ల మార్కుపైనే దృష్టిపెట్టి ముందుకెళ్తోంది. పానాసోనిక్, మైక్రోమ్యాక్స్ యూజర్లకూ జియో ఉచిత సేవలు... న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలు పానాసోనిక్, మైక్రోమ్యాక్స్ కంపెనీలు తాజాగా టెలికం సర్వీసెస్ ప్రొవైడర్ రిలయన్స్ జియోతో జతకట్టాయి. దీంతో పానాసోనిక్, మైక్రోమ్యాక్స్ మొబైల్ హ్యాండ్‌సెట్స్‌ను కొనుగోలు చేసిన వారు జియో 90 రోజులపాటు ఉచిత డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులను పొందొచ్చు. జియోతో ఇప్పటికే ఎల్జీ, శాంసంగ్ కంపెనీలు జతకట్టాయి. ‘మైక్రోమ్యాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసినవారు వారి హ్యాండ్‌సెట్‌తోపాటు జియో సిమ్‌ను పొందొచ్చు. ఈ సిమ్ ద్వారా 3 నెలలపాటు అపరిమిత హెచ్డీ వాయిస్, వీడియో కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా సేవలను పొందొచ్చు’ అని మైక్రోమ్యాక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుభజిత్ సేన్ తెలిపారు. అలాగే యూ స్మార్ట్‌ఫోన్స్ యూజర్లు కూడా ఈ సేవలను పొందొచ్చని పేర్కొన్నారు. తమ 4జీ స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులు కూడా జియో ప్రివ్యూ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్ (మొబిలిటీ డివిజన్) పంకజ్ రాణా తెలిపారు. -
ఇతర సర్వీసుల నుంచి జియోకు మారండి!
ముంబై: ‘జియో’ ఫోన్లే వాడాలని తమకు ఉద్యోగులకు రిలయన్స్ ఇండస్ట్రీస్(రిల్) సూచింది. ప్రస్తుతం ఇతర సెల్‌ఫోన్ సంస్థల సేవలు వాడుతున్న ఉద్యోగులు 'జియో'కు మారాలని రిల్ కోరింది. ఎయిర్ టెల్, వొడా ఫోన్ లాంటి ఇతర ఆపరేటర్ల సర్వీసులు వాడుతున్న రిలయన్స్ ఉద్యోగులు తమ సొంత కంపెనీ ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన హైస్పీడ్ 4జీ జియోకు మారాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో అతిపెద్ద ప్రైవేటు వాణిజ్య సంస్థ అయిన 'రిల్'లో 40 వేల మందిపైగా ఉద్యోగులున్నారు. 'మన కంపెనీ చరిత్రలో మరో మైలురాయిని అందుకోబోతున్నాం. ప్రస్తుతం మనం వాడుతున్న సెల్‌ఫోన్ కనెక్షన్లు జియోకు మార్చుకోవాల్సిన అవసరముంద'ని రిలయన్స్ ఉద్యోగులకు రాసిన లేఖలో హెచ్ ఆర్ విభాగం పేర్కొంది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్ పీ) ద్వారా ఆపరేటర్ ను మార్చుకోవచ్చని సూచించింది. అంతేకాదు ఎంఎన్ పీకి బంధించిన విధానాన్ని స్టెప్-బై-స్టెప్ ఉద్యోగులకు వివరించింది. కాగా, జియోకు 15 లక్షల మంది టెస్ట్ యూజర్లు ఉన్నారని రిల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. దేశవ్యాప్తంగా 22 సర్వీస్ ఏరియాల ద్వారా 18వేల పట్టణాలు, 2 లక్షలకుపైగా గ్రామాల్లో జియో సేవలు అందించనున్నట్టు వెల్లడించారు. -
ఆర్ఐఎల్కు రూ.2,500 కోట్ల జరిమానా
-
ఆర్ఐఎల్కు మరో రూ.2,500 కోట్ల జరిమానా
-
ఆర్ఐఎల్కు మరో రూ.2,500 కోట్ల జరిమానా
♦ కేజీ డీ6లో లక్ష్యానికంటే తక్కువగా గ్యాస్ ఉత్పత్తి ♦ ఐదేళ్లలో విధించిన జరిమానా రూ.18,492 కోట్లు ♦ కేంద్రంతో చర్చిస్తున్నామన్న ఆర్ఐఎల్ న్యూఢిల్లీ: పెట్రో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై (ఆర్ఐఎల్) మరో పిడుగు పడింది. కేజీ డీ6 క్షేత్రంలో లక్ష్యానికన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), దాని భాగస్వామ్య కంపెనీలకు కేంద్రం తాజాగా మరో 38 కోట్ల డాలర్లు (రూ.2,500 కోట్ల మేర) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్ 1 తర్వాత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యాల మేరకు గ్యాస్ ఉత్పత్తి చేయనందుకు విధించిన మొత్తం జరిమానా 2.76 బిలియన్ డాలర్లకు (రూ.18,492 కోట్లు సుమారు) చేరుకుంది. నిజానికి ఒప్పందం ప్రకారం గ్యాస్ విక్రయంపై వచ్చిన లాభాలను ఆర్ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం, నికో రిసోర్సెస్‌లు కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవాలి. అయితే, గ్యాస్ వెలికితీత కోసం చేసిన మూల ధన, నిర్వహణ వ్యయాలను గ్యాస్ విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలోంచి మినహాయించుకున్నాకే మిగిలిన లాభాలను పంచుకునేలా ఒప్పందం వీలు కల్పిస్తోంది. ఇప్పుడు జరిమానా వసూలు కోసం కేంద్రం ఈ ఉత్పత్తి వ్యయాలను మినహాయించుకోనివ్వకుండా ఆ మేరకు అధికంగా లాభాల్ని అందుకోనుంది. ఏటేటా పడిపోయిన ఉత్పత్తి కేజీ డీ6 బ్లాక్‌లో ధీరూభాయి-1, 3 గ్యాస్ క్షేత్రాల నుంచి ప్రతి రోజు 80 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్స్(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ 2011-12లో జరిగిన వాస్తవ ఉత్పత్తి రోజుకు 35.33 ఎంఎంఎస్‌సీఎండీగానే ఉంది. 2012-13లో 20.88 ఎంఎంఎస్‌సీఎండీ, 2013-14లో 9.77 ఎంఎంఎస్‌సీఎండీల మేరకే ఉత్పత్తి జరిగింది. ఆ తర్వాతి సంవత్సరాల్లోనూ ఇది 8 ఎంఎంఎస్‌సీఎండీలకే పరిమితం అయింది. అయితే, 2015-16లోనూ ఉత్పత్తి లక్ష్యానికంటే తక్కువగానే ఉన్నా, దీనికి సంబంధించిన వ్యయాల వసూలు నిలిపివేత నోటీసు రిలయన్స్‌కు ఇంకా జారీ కాలేదు. చర్చల దశలో ఉంది: ఆర్ఐఎల్ వ్యయాల రికవరీ నిలిపివేత అంశం ప్రభుత్వంతో చర్చల దశలో ఉందని ఆర్ఐఎల్ స్పష్టం చేసింది. ‘‘కేంద్రం నుంచి జూన్3న అందుకున్న సవరించిన క్లెయిమ్ ప్రకారం 2014-15 సంవత్సరం వరకు 2.75 బిలియన్ డాలర్ల మేర వ్యయాల వసూల్ని నిలిపేశారు. దీనివల్ల పెట్రోలియంపై కేంద్రానికి అదనంగా వెళ్లే లాభం 24.6 కోట్ల డాలర్లు. పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఉత్పత్తి పంపిణీ ఒప్పందానికి తన సొంత నిర్వచనమిస్తూ అంచనాల మేరకు ప్రతిపాదిత వ్యయాల మినహాయింపును ఏటా సవరిస్తుంటుంది. వాటిని అంతకుముందు సంవత్సరాలకు కలుపుతుంది. ఈ మేరకు అదనపు లాభం కోసం డిమాండ్ చేస్తుంది. వీటితో కాంట్రాక్ట్ సంస్థ అంగీకరించదు. గ్యాస్ పూల్ ఖాతా నుంచి ఇప్పటికే కేంద్రం 8.17 కోట్ల డాలర్లు వసూలు చేసుకుంది’ అని రిలయన్స్ స్టాక్స్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. -
భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
ముంబై: వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు జూన్ 24 తరువాత మళ్లీ భారీగా పతనమయ్యాయి. రోజు మొత్తం నష్టాలతో నీరసంగా కదిలిన మార్కెట్లు చివరికి రోజులో కనిష్టం వద్దే ముగిశాయి ప్రారంభంలో 50 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ మిడ్ సెషన్ తరువాత భారీగా పతనమైంది. అమ్మకాల ఒత్తిడితో ఒకదశలో 350 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 310 పాయింట్ల నష్టంతో 27,774 దగ్గర, నిఫ్టీ 103 పాయింట్ల నష్టంతో 8,575 దగ్గర క్లో జ్ అయ్యాయి. ప్రధానంగా ఆటో, సెక్టార్ లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇదే ట్రెడ్ దాదాపు అన్ని ప్రభుత్వ రంగ షేర్లలో కనిపించింది. మారుతి, ఎం అండ్ ఎం, హీరో మోటో కార్ప్, ఐషర్ మోటార్స్ , మదర్సన్ సుమి అశోక్ లేలాండ్ భారీగా నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఏ బ్యాంక్ టాప్ సెల్లర్స్ గా నిలిచాయి. అదానీ పోర్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు లాభపడ్డాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 0.012 పైసల లాభంతో 66.72వద్ద ఉండగా, పసిడి ధరలు కూడా లాభాల్లో ఉన్నాయి. రూ. ఎంసీఎక్స్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 218 లాభంతోరూ. 31,491 వద్ద ఉంది. -
ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: ఉదయం సెషన్ నుంచి ఊగిసలాటలో నడిచిన మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసేనాటికి స్వల్పలాభాలను నమోదుచేశాయి. సెన్సెక్స్ 41 పాయింట్ల లాభంతో 27,787 దగ్గర, నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 8,528 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంకు, లుపిన్, రిలయెన్స్, టీసీఎస్, ఓఎన్జీసీ లు టాప్ లో నిలవగా.. హెచ్ యూఎల్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, హీరో నష్టాలను నమోదుచేశాయి. హిందూస్తాన్ యూనీలివర్ కంపెనీ సోమవారం ప్రకటించిన ఫలితాలతో వరుసగా రెండోరోజు నష్టాల్లోనే నమోదుచేసింది. వాల్యుమ్ గ్రోత్ లో దలాల్ స్ట్రీట్ ను నిరాశరచడంతో, స్టాక్ 2.9 శాతం కిందకు పడిపోయి, రూ.895గా ట్రేడ్ అయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్ కోసం కేటాయించిన నిధుల్లో మొదటి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో నిఫ్టీ పీఎస్ యూ బ్యాంకు ఇండెక్స్ 0.26శాతంతో స్వల్పంగా లాభపడింది. అటు కరెన్సీ మార్కెట్ లో డాలర్ తో రూపాయ మారకం విలువ 0.06పైసలు లాభపడి, రూ.67.14గా ఉంది. 10 గ్రాముల పుత్తడి ధర రూ.46 లాభంతో రూ.31,061గా నమోదైంది. -
త్వరలో సర్కారీ షేర్ల మేళా!
♦ 51 కంపెనీల్లో మైనారిటీ వాటాల విక్రయానికి రెడీ... ♦ మర్చంట్ బ్యాంకర్లకు ఆహ్వానం.. ♦ ప్రస్తుతం ఎస్‌యూయూటీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వాటా ♦ మూడేళ్లలో పూర్తిగా అమ్మేసే ప్రణాళిక... ♦ జాబితాలో ఆర్ఐఎల్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్టీ, హెచ్‌యూఎల్ వంటి దిగ్గజ కార్పొరేట్లు న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ద్వారా ఖజానా నింపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోని దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు సహా మొత్తం 51 లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో తనకున్న మైనారిటీ వాటాల అమ్మకం ప్రక్రియకు తెరతీసింది. రానున్న మూడేళ్లలో ఈ కంపెనీల నుంచి పూర్తిగా వైదొలగాలన్నది సర్కారు ప్రణాళిక. ఇందుకోసం మర్చంట్ బ్యాంకర్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. వాటా విక్రయ జాబితాలో రిలయన్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్), ఐటీసీ, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో పాటు పలు టాటా గ్రూప్ కంపెనీలు కూడా ఉన్నాయి. ద స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూటీఐ(ఎస్‌యూయూటీఐ) ద్వారా కేంద్రానికి ఈ 51 లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో మైనారిటీ వాటాలు ఉన్నాయి. మూడేళ్ల ప్రక్రియ... ప్రభుత్వం విడుదల చేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ) ప్రకారం ఎస్‌యూయూటీఐ దాదాపు మూడు మర్చంట్ బ్యాంకర్లు/సలహాదారులు, బ్రోకింగ్ సంస్థలను నియమించుకోనుంది. వచ్చే మూడేళ్లపాటు ఈ 51 కంపెనీల్లో మైనారిటీ వాటా అమ్మకం విషయంలో ఎస్‌యూయూటీఐకి మర్చంట్ బ్యాంకర్లు తగిన సహకారాన్ని అందించనున్నారు. ఆఫర్ ఫల్ సేల్(ఓఎఫ్సీ), బ్లాక్ డీల్, బల్క్ డీల్ ఇతరత్రా మార్గాల్లో ఈ వాటా విక్రయాలకు సంబంధించి తగిన సలహాలను ఇస్తారు. కాగా, మర్చెంట్ బ్యాంకర్లు తమ బిడ్లను ఆగస్టు 1 కల్లా సమర్పించాల్సి ఉంటుందని ఆర్ఎఫ్పీలో పేర్కొన్నారు. ఎస్‌యూయూటీఐకు ఉన్న మొత్తం వాటాలన్నింటికీ కలిపి మర్చెంట్ బ్యాంకర్లు ఒకే బిడ్‌ను సమర్పించాల్సి ఉంటుందని.. అయితే, 51 కంపెనీల్లో వాటా అమ్మకాలకు సంబంధించి విడివిడిగా అమ్మకం ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుందని కూడా ప్రభుత్వం పేర్కొంది. మార్కెట్ అధ్యయన నివేదిక, ఇష్యూ ప్రైసింగ్ సహా రిటైల్ ఇన్వెస్టర్లను ఈ ఇష్యూల్లో పాల్గొనేవిధంగా తగిన అవగాహన కలిగించడం, ఇష్యూకి తగిన సమయం వరకూ అన్ని విధాలుగా మర్చెంట్ బ్యాంకర్లు ఎస్‌యూయూటీఐకి తమ సలహాలు, వ్యూహాలన్నింటినీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రధానమైన దేశీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాను కూడా సమర్పించాలని ఆర్ఎఫ్పీలో పేర్కొన్నారు. డిజిన్వెస్ట్మెంట్కు జోష్... ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల రూపంలో(డిజిన్వెస్ట్‌మెంట్) రూ.56,500 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.36,000 కోట్లను పీఎస్‌యూల్లో మైనారిటీ వాటాల అమ్మకం ద్వారా, మిగతా రూ.20,500 కోట్లను లాభాల్లో ఉన్న, నష్టాలను ప్రకటిస్తున్న కంపెనీల్లో వ్యూహాత్మక వాటా అమ్మకం రూపంలో సమీకరించాలనేది ప్రణాళిక. ఎస్‌యూయూటీఐ వాటాల విక్రయంతో డిజిన్వెస్ట్‌మెంట్‌ను పరుగులు పెట్టించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఏర్పాటు చేయనున్న సీపీఎస్ఈ(కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు) రెండో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లో తమకు వాటాలున్న కంపెనీలను చేర్చే అంశాన్ని కూడా ఎస్‌యూయూటీఐ ప్రత్నామ్యాయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. యూటీఐకి అనుబంధంగా... అంతక్రితం ఉన్న యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(యూటీఐ) నుంచి విభజించి దానికి అనుబంధంగా ఈ ఎస్యూయూటీఐని 2003లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికిందికి 51 కంపెనీలకు సంబంధించిన మైనారిటీ వాటాలను చేర్చింది. అయితే, వీటిలో ఎన్ఎస్డీఎల్, ఎస్టీసీఐ ఫైనాన్స్, ఓవర్ ద కౌంటర్ ఎక్స్ఛేంజ్, స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్, యూటీఐ-ఐఏఎస్ లిమిటెడ్, యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ సర్వీసెస్, నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్డీఎల్ ఈ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.. ఈ 8 ఎనిమిది కంపెనీలు అన్లిస్డెడ్వి. 2014 మార్చిలో యాక్సిస్ బ్యాంక్‌లో 9 శాతం వాటాను ఎస్‌యూయూటీఐ ద్వారా విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లకుపైగానే సమీకరించిన సంగతి తెలిసిందే. ఎస్‌యూయూటీఐకి వాటాలున్న ఇతర లిస్టెడ్ కంపెనీల్లో అంబుజా సిమెంట్స్, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, టాటా పవర్, టాటా మోటార్స్, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌లు కూడా ప్రధానంగా ఉన్నాయి. -
మార్కెట్‌కు రిలయన్స్ జోష్
ఫలితాల దన్నుతో 5.6% పెరిగిన ఆర్ఐఎల్ * 150 పాయింట్ల లాభంతో 27,365కు సెన్సెక్స్ * 37 పాయింట్ల లాభంతో 8,275కు నిఫ్టీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ వంటి సెన్సెక్స్ షేర్లతో పాటు ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు ఎగిశాయి. దీంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలోనూ లాభాల బాటపట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో 27,365 పాయింట్ల వద్ద. ఎన్ఎస్ఈ నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 8,275 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు నెలల గరిష్టం. అయితే లోహ, బ్యాంక్ షేర్లు పతనమవడం స్టాక్‌మార్కెట్ లాభాలకు కళ్లెం పడింది. ఆదాయపు పన్ను లావాదేవీలపై విదేశీ ఇన్వెస్టర్లతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల రెండు రోజుల సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కావడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. ఇవి సానుకూలంగా జరుగుతాయన్న అంచనాలే దీనికి కారణం. టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, ఆయిల్, గ్యాస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 585 పాయింట్లు లాభపడింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతున్నారని, ఇది సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని మార్కెట్ నిపుణులంటున్నారు. రిలయన్స్ జోరు.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలానికి అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. దీంతో ఈ షేర్ 5.6 శాతం లాభపడి రూ.963 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. 30 సెన్సెక్స్ షేర్లలో 18 షేర్లు లాభాల్లో ముగిశాయి.1,565 షేర్లు లాభాల్లో, 1,157 షేర్లు నష్టాల్లో ముగిశాయి. -
అమెరికా పైప్‌లైన్‌లో వాటా విక్రయించిన రిలయన్స్
డీల్ విలువ రూ. 6,400 కోట్లు న్యూఢిల్లీ : అమెరికాలోని షేల్ఆయిల్, గ్యాస్ పైప్‌లైన్ జాయింట్ వెంచర్లో దేశీయ పెట్రో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు వున్న మొత్తం 49.9 శాతం వాటాను విక్రయించింది. న్యూయార్క్‌లో లిస్టయిన కంపెనీ ఎంటర్ప్రైజ్ ప్రాడక్ట్స్ పార్టనర్స్ కు 1.07 బిలియన్ డాలర్లకు (సుమారు 6,400 కోట్లు) విక్రయించినట్లు ఆర్ఐఎల్ అమెరికా సబ్సిడరీ రిలయన్స్ హోల్డింగ్ యూఎస్ఏ ప్రకటించింది. రిలయన్స్‌తో కలిపి ఈ వెంచర్లో 50.1 శాతం వాటా కలిగిన నేచురల్ రిసోర్సెస్ కంపెనీ కూడా తన వాటాను అదే సంస్థకు విక్రయించడానికి గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. -
ఆర్ఐఎల్ మార్కెటింగ్ మార్జిన్‌పై కాగ్ కన్నెర్ర
⇒ డాలర్లలో వసూలు చేయడంపై అభ్యంతరం... ⇒ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఉత్పత్తి చేస్తున్న సహజవాయువుపై మార్కెటింగ్ మార్జిన్‌ను డాలర్ల రూపంలో వసూలు చేయడానికి చమురు శాఖ అనుమతించడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. రూపాయిల్లో కాకుండా డాలర్‌ను ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవడంవల్ల ప్రభుత్వం అదనంగా రూ.201 కోట్ల యూరియా సబ్సిడీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. కేజీ-డీ6 బ్లాక్ ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు(పీఎస్సీ)లో అసలు మార్కెటింగ్ మార్జిన్ అనే అంశమే లేదని.. అయినాకూడా కాంట్రాక్టర్(ఆర్ఐఎల్) ఒక్కో యూనిట్ గ్యాస్ సరఫరాకుగాను 0.135 డాలర్ల చొప్పున వసూలు చేస్తున్న విషయాన్ని కాగ్ లేవనెత్తింది. మంగళవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. కాగా, ప్రభుత్వం నిర్ధేశించిన యూనిట్ ధరపై ఈ మొత్తాన్ని అదనంగా ఆర్ఐఎల్ విధిస్తోంది. సహజవాయువు అమ్మకాలకు సంబంధించి ఏ ఒక్క కంపెనీకి కూడా నిర్ధిష్టంగా ఇంత మార్కెటింగ్ మార్జిన్ వసూలు చేయొచ్చంటూ ఆనుమతి ఇవ్వలేదని చమురు శాఖ 2009లో వెల్లడించినట్లు కాగ్ తెలిపింది. ఆతర్వాత 2010 మే నెలలో గెయిల్‌కు సరఫరా చేసే ప్రతి వెయ్యి ఘనపు మీటర్ల(ఎంఎస్‌సీఎం) గ్యాస్‌పై రూ.200 చొప్పున మార్కెటింగ్ మార్జిన్‌ను చమురు శాఖ ఆమోదించింది. రిలయన్స్ మాత్రం దీనికి విరుద్ధంగా గ్యాస్ కొనుగోలుదార్లందరికీ అమెరికా డాలర్లలో ఈ మొత్తాన్ని వసూలు చేస్తోందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2009 మే నుంచి మార్చి 2014 వరకూ ఎరువుల ప్లాంట్లకు ఆర్ఐఎల్ రోజుకు సగటున సరఫరా చేసిన 15 మిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్‌కు గాను మార్కెటింగ్ మార్జిన్ రూపంలో అదనంగా రూ.201 కోట్లు భరించాల్సి వస్తుందని తెలిపింది. దీనిపై స్పష్టమైన విధానం లేనందున సబ్సిడీ క్లెయిమ్‌లను సరఫరాలు మొదలైననాటి నుంచే పెండింగ్‌లో పెట్టినట్లు ఎరువుల మంత్రిత్వ శాఖ గతేడాది జనవరిలో పేర్కొన్న విషయాన్ని కూడా కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. -
ద్రవ్యోల్బణం, టీసీఎస్, ఆర్ఐఎల్ ఫలితాలపై దృష్టి
ఈ వారం మార్కెట్లో హెచ్చుతగ్గులుండవొచ్చు-నిపుణులు 13న రిటైల్, 14న టోకు ద్రవోల్బణం డేటా వెల్లడి 16న టీసీఎస్, 17న రిలయన్స్ ఫలితాల ప్రకటన న్యూఢిల్లీ: నాలుగురోజులకే ట్రేడింగ్ పరిమితమయ్యే ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను ద్రవ్యోల్బణం గణాంకాలు, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఫలితాలు నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న మార్కెట్‌కు సెలవు. ద్రవ్యోల్బణం డేటా, కార్పొరేట్ ఫలితాలు స్టాక్ సూచీలను హెచ్చుతగ్గులకు లోనుచేయవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందనతో ఈ సోమవారం మార్కెట్ మొదలవుతుందని, తదుపరి ద్రవ్యోల్బణం డేటాపై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఫిబ్రవరి నెలలో దేశీయ పారిశ్రామికోత్పత్తి 5 శాతం వృద్ధిచెందిన సంగతి తెలిసిందే. ఇది 9 నెలల గరిష్టస్థాయి. ఇక ఏప్రిల్ 13, 14 తేదీల్లో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలను ప్రభుత్వం వరుసగా వెలువరిస్తుంది. రిజర్వుబ్యాంక్ తర్వాతి రోజుల్లో మళ్లీ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు ఆ ద్రవ్యోల్బణం గణాంకాల ద్వారా ఏర్పడతాయి. ఫలితాల సీజన్‌తో స్వల్పకాలిక ట్రెండ్... ఈ వారం ప్రారంభంకానున్న కార్పొరేట్ ఫలితాల సీజన్ , మార్కెట్ స్వల్పకాలిక దిశను నిర్దేశిస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేష్ అగర్వాల్ అంచనా వేశారు. మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఐటీ దిగ్గజం టీసీఎస్ ఏప్రిల్ 16న ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తుంది. పెట్రోకెమికల్స్ దిగ్గజం రిల యన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలు ఏప్రిల్ 17న వెల్లడవుతాయి. ఫలితాలు మందకొడిగా వుంటాయన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్లో నెలకొన్నాయని, ఆయా కార్పొరేట్లు ప్రకటించే భవిష్యత్ ఫలితాల గైడె న్స్ మార్కెట్‌కు కీలకమని జయంత్ మాంగ్లిక్ అన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 81,000 కోట్లు న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇప్పటివరకూ దేశీయ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 81,000 కోట్లు దాటాయి. ఇంత విలువైన ఈక్విటీ, రుణపత్రాలను వారు కొనుగోలు చేసారు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ. 40,000 కోట్లు న్యూఢిల్లీ: గత 2014-15 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో రూ. 40,000 కోట్లు పెట్టుబడి చేశాయి. అంతక్రితం వరుసగా ఐదు ఆర్థిక సంవత్సరాలపాటు నికర విక్రయాలు జరిపిన మ్యూచువల్ ఫండ్స్ 2014-15లో రూ. 40,722 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలుచేశాయి. -
4 వారాల్లో సమాధానం ఇవ్వండి
న్యూఢిల్లీ: కృష్ణాగోదావరి బేసిన్లో గ్యాస్ అన్వేషణ విషయంలో కాగ్ తుది నివేదికపై 4 వారాల్లో సమాధానం తెలపాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది. డీ6 బావుల తవ్వకంలో కాంట్రాక్టర్లకు చెల్లింపులుసహా, పలు అవకతవకలు చోటుచేసుకున్నట్లు కాగ్ నివేదిక పేర్కొంది. ఆయా అంశాలకు సంబంధించి దాదాపు రూ.2,179 కోట్ల వ్యయాలను ఆర్ఐఎల్ మినహాయించుకోడానికి అనుమతి ఇవ్వవద్దని నివేదిక కోరింది. -
రిలయన్స్‌పై చమురు ప్రభావం
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల పతన ప్రభావం కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పై పడింది. ఆర్ఐఎల్ నికరలాభం 2014 డిసెంబర్ క్వార్టర్లో 4.5 శాతం క్షీణించి రూ. 5,256 కోట్లకు తగ్గింది. తొమ్మిది త్రైమాసికాల తర్వాత ఈ కంపెనీ లాభం తగ్గడం ఇదే ప్రథమం. 2013 డిసెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ రూ. 5,502 కోట్ల నికరలాభం సంపాదించింది. 2014 సెప్టెంబర్ క్వార్టర్లో ఆర్జించిన రూ. 5,972 కోట్ల నికరలాభంతో పోలిస్తే తాజా త్రైమాసికంలో మరింత క్షీణించింది. కంపెనీ స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 7.3 డాలర్లకు పడిపోవడంతో ఆర్ఐఎల్ లాభాలు తగ్గుముఖం పట్టాయి. బ్యారల్ క్రూడ్‌ను పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రో ఉత్పత్తుల రూపంలో రిఫైన్ చేసినందుకు వచ్చే లాభాన్ని రిఫైనింగ్ మార్జిన్‌లుగా వ్యవహరిస్తారు. ఈ మార్జిన్ 2013 డిసెంబర్ క్వార్టర్లో 7.6 డాలర్లు కాగా, 2014 సెప్టెంబర్ క్వార్టర్లో 8.3 డాలర్లు. ముడి చమురు ధరలు పతనం కావడంతో పెట్రో ఉత్పత్తుల కొనుగోలు సెంటిమెంట్ దెబ్బతిందని కంపెనీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తాజా త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ 20.4 శాతం క్షీణించి రూ. 96,330 కోట్లకు తగ్గగా, ఎగుమతులు 21.5 శాతం క్షీణతతో రూ. 58,507 కోట్లకు పడిపోయాయి. 2014 సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే కంపెనీ రుణం రూ. 1,42,084 కోట్ల నుంచి రూ. 1,50,007 కోట్లకు పెరిగింది. కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు రూ. 83,456 కోట్ల నుంచి రూ. 78,691 కోట్లకు తగ్గాయి. కేజీ డీ-6 క్షేత్రంలో పడిపోయిన ఉత్పత్తి... సాంకేతిక కారణాలతో కృష్ణాగోదావరి (కేజీ) డీ-6 క్షేత్రంలో చమురు, సహజవాయువుల ఉత్పత్తి తాజా త్రైమాసికంలో తగ్గింది. 2014 అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఈ క్షేత్రంలో 5 లక్షల బ్యారళ్ల ముడి చమురు, 38.5 బిలియన్ క్యూబిక్ ఫీట్ల సహజవాయువుల ఉత్పత్తి జరిగింది. అయితే కొత్త బావి అయిన ఎంఏ 08లో ఉత్పత్తి పెరగడంతో డీ-6 క్షీణత లోటు కొంతమేర తీరినట్లు కంపెనీ తెలిపింది. షేల్‌గ్యాస్ వ్యాపారానికి దెబ్బ... ముడి చమురు ధర ముగిసిన త్రైమాసికంలో 90 డాలర్ల నుంచి 53 డాలర్లకు 40 శాతం క్షీణించిన ఫలితంగా తమ షేల్‌గ్యాస్ వ్యాపారానికి విఘాతం కలిగిందని కంపెనీ పేర్కొంది. షేల్‌గ్యాస్ వ్యాపారంలో 26.4 కోట్ల డాలర్లు పెట్టుబడి చేసినట్లు ఆర్ఐఎల్ వివరించింది. కంపెనీ షేల్‌గ్యాస్ వ్యాపారాన్ని అమెరికాలో నిర్వహిస్తోంది. శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆర్ఐఎల్ షేరు ధర 0.5 శాతం పెరుగుదలతో రూ. 869 వద్ద ముగిసింది. కంపెనీ ప్రకటించిన ఫలితాలు వివిధ విశ్లేషణ సంస్థల అంచనాలకు అనుగుణంగానే వున్నాయి. ముడి చమురు, ఫీడ్‌స్టాక్ ధరలు తగ్గినా, మా నిర్వహణా సామర్థ్యంతో రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు సాధించ గలిగాం. వీటి ప్రభావం వచ్చే 4-6 త్రైమాసికాల్లో కనిపిస్తుంది. - ముకేశ్ అంబానీ పెరిగిన రిటైల్ ఆదాయం... అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ ఆదాయం 2014 డిసెంబర్ క్వార్టర్లో అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 18.9 శాతం పెరిగి రూ. 4,686 కోట్లకు చేరింది. ఈ వ్యాపారంలో మార్జిన్లు, లాభదాయకత పెరగడంతో ఆదాయం కూడా వృద్ధిచెందిందని కంపెనీ తెలిపింది. రిటైల్ సబ్సిడరీ లాభం రికార్డుస్థాయిలో 114 శాతం వృద్ధిచెంది రూ. 227 కోట్లకు ఎగిసింది. తాజా త్రైమాసికంలో మరో 15 రిలయన్స్ ఫ్రెష్ స్టోర్లను ప్రారంభించామని, 100 నగరాలకు రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్లను విస్తరించామని కంపెనీ తెలియజేసింది. దేశవ్యాప్తంగా 2,285 రిలయన్స్ రిటైల్ స్టోర్లున్నాయి. -
8,400 దాటేసిన నిఫ్టీ
క్యూ3లో జపాన్ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో మాంద్యంలోకి జారుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో జపాన్ మొదలు ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాలతో వెనుకంజ వేశాయి. దేశీయంగానూ ఈ ప్రభావం పడటంతో మార్కెట్లు తొలుత నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా క్షీణించి 27,921 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే అక్టోబర్ నెలలో దిగుమతుల భారం బాగా తగ్గి వాణిజ్యలోటు మరింత కట్టడికావడంతో మిడ్ సెషన్ నుంచీ సెంటిమెంట్ మెరుగైంది. ప్రధానంగా చమురు దిగుమతుల బిల్లు క్షీణించడం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్ 28,206 పాయింట్ల గరిష్టానికి చేరింది. చివరికి 131 పాయింట్ల లాభంతో 28,178 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు పుంజుకుని 8,431 వద్ద ముగిసింది. అంతకుముందు ఇంట్రాడేలో 8,438ను చేరింది. మార్కెట్ చరిత్రలోనే ఇవి సరికొత్త గరిష్టాలుకావడం గమనార్హం. ఎస్బీఐ జోరు క్యూ2లో ప్రోత్సాహక ఫలితాల కారణంగా ఎస్బీఐ 5.5% జంప్‌చేసింది. రూ. 2,940 వద్ద ముగిసింది. ఇది ఏడాది గరిష్టంకాగా, 4% ఎగసిన టాటా మోటార్స్ రూ. 545 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో హీరోమోటో, ఎన్టీపీసీ, రిలయన్స్ సైతం 2-1.5% మధ్య పురోగమించాయి. అయితే మరోవైపు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు 1%పైగా నష్టపోయాయి. ఎఫ్ఐఐలు రూ. 656 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. చిన్న షేర్లు ఓకే మార్కెట్‌ను మించుతూ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1% స్థాయిలో బలపడ్డాయి. బీఎస్ఈ-500లో గతి, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, బజాజ్ ఫైనాన్స్, కల్పతరు పవర్, అనంత్‌రాజ్, ఎన్సీసీ, ఎల్జీ ఎక్విప్మెంట్స్, స్టెరిలైట్ టెక్, వీగా ర్డ్, పీఎఫ్సీ 18-8% మధ్య దూసుకెళ్లాయి. -
రిలయన్స్ లాభం 5,972 కోట్లు
రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారాల్లో మరోసారి అద్భుతమైన పనితీరును సాధించాం. ప్రాంతీయంగా పరిశ్రమ ప్రమాణాల కంటే మెరుగైన పనితీరును కనబరిచాం. అంతర్జాతీయంగా ఆర్థిక పరమైన అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. దేశీయ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశావహ ధోరణి.. వ్యాపార రంగానికి కలిసొచ్చే అంశం. వచ్చే 12-18 నెలల్లో వాటాదారులకు రిలయన్స్ గణనీయమైన విలువను సృష్టించనుంది. ఇంధన, కన్జూమర్ వ్యాపార విభాగాల్లో తలపెట్టిన భారీ పెట్టుబడులన్నీ పూర్తికానున్నాయి. ఆయా ప్రాజెక్టులు కంపెనీకే కాకుండా భారత్ ఆర్థికాభివృద్ధిని పెంచడంలో చోధకంగా పనిచేస్తాయి. - ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ క్యూ2లో స్వల్పంగా 1.7% వృద్ధి * ఆదాయం 4.3 శాతం తగ్గుదల; రూ.1,13,396 కోట్లు * స్థూల రిఫైనింగ్ మార్జిన్ 8.3 డాలర్లు... న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో రూ.5,972 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,873 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.7 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం 4.3 శాతం తగ్గుదలతో రూ.1,13,396 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.1,18,439 కోట్లుగా ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుముఖం, రిఫైనింగ్, చమురు-గ్యాస్ వ్యాపారంలో అమ్మకాల తగ్గుదలతో ఆదాయం కొద్దిగా దిగొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇంధన ఎగుమతులు క్యూ2లో 14.7 శాతం తగ్గి రూ.66,065 కోట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఎగుమతులు రూ.77,428 కోట్లుగా ఉన్నాయి. పెరిగిన జీఆర్ఎం...: ఇదిలాఉండగా... కంపెనీ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) క్యూ2లో 8.3 డాలర్లకు పెరిగింది. క్రితం ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో జీఆర్ఎం 7.7 డాలర్లు మాత్రమే. ఈ ఏడాది క్యూ1లో జీఆర్ఎం 8.7 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడి చమురును శుద్ధి చేసి తద్వారా వచ్చిన ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కంపెనీకి వచ్చే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. చమురు, గ్యాస్ రంగంలో ఆదాయాల క్షీణత ప్రభావాన్ని పటిష్ట జీఆర్ఎంతో కంపెనీ పూడ్చుకోగలిగింది. ఇతర ముఖ్యాంశాలు... * కీలకమైన రిఫైనరీ వ్యాపారం పన్ను ముందు లాభం(ఎబిటా) క్యూ2లో 18.5 శాతం ఎగబాకి రూ.3,844 కోట్లకు చేరింది. అయితే, ఈ విభాగంలో ఆదాయం 5.9% తగ్గి రూ.1,03,590 కోట్లుగా నమోదైంది. * ఇక పెట్రోకెమికల్స్ విభాగంలో ఎబిటా దాదాపు మార్పుల్లేకుండా రూ.2,361 కోట్లుగా ఉంది. చమురు-గ్యాస్ రంగం ఎబిటా 14.5 శాతం క్షీణించి రూ.818 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది క్యూ2లో ఈ మొత్తం రూ. 956 కోట్లు.. ఈ ఏడాది క్యూ1లో రూ.1,042 కోట్లుగా నమోదైంది. దేశీయంగా కేజీ-డీ6లో ఉత్పత్తి క్షీణత ఈ విభాగంలో ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. * రిటైల్ వ్యాపార ఆదాయం రూ.3,470 కోట్ల నుంచి రూ.4,167 కోట్లకు ఎగసింది. ఎబిటా రూ.70 కోట్ల నుంచి రూ.99 కోట్లకు పెరిగింది. * పెట్రోకెమికల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఆర్ఐఎల్ 16 బిలియన్ డాలర్లమేర పెట్టుబడుల ప్రణాళికను అమలు చేస్తోంది. * మరో 4.5 బిలియన్ డాలర్లను పాలిస్టర్ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణపై ఖర్చుచేస్తోంది. 2017-18 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తికానున్నాయి. * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంకా మిగిలిన కాలంలో దాదాపు రూ. 5,000- 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ గ్రూప్ సీఎఫ్‌వో అలోక్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటికే క్యూ1లో రూ. 15,000 కోట్లు, క్యూ2లో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. * ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి కంపెనీ రుణ భారం రూ.1,42,084 కోట్లకు ఎగబాకింది. జూన్ చివరికి ఈ మొత్తం రూ.1,35,769 కోట్లు. * కంపెనీ వద్ద నగదు, తత్సంబంధ ఇతర నిల్వలు ఈ సెప్టెంబర్ ఆఖరికి రూ.83,456 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో ఈ మొత్తం రూ.81,559 కోట్లు. * రిలయన్స్ షేరు ధర సోమవారం బీఎస్ఈలో స్వల్పంగా 0.3 శాతం తగ్గి.. రూ.958 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. -
రూ.100 లక్షల కోట్లకు చేరువలో మార్కెట్ విలువ
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ సూచీలు కొత్త రికార్డులతో దూసుకెళుతున్న నేపథ్యంలో మార్కెట్ విలువసైతం భారీగా పుంజుకుంటోంది. వెరసి బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ. 100 లక్షల కోట్లకు చేరువైంది. ప్రస్తుతం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 96,25,517 కోట్లను తాకింది. మరో రూ. 3.74 లక్షల కోట్లు జమ అయితే రూ. 100 లక్షల కోట్ల మైలురాయిని చేరుతుంది. గత శుక్రవారానికి ఈ విలువ డాలర్ల రూపేణా 1.58 ట్రిలియన్లకు చేరింది. కాగా, ఈ ఏడాది జూన్‌లో మార్కెట్ విలువ మళ్లీ 1.5 ట్రిలి యన్ డాలర్లను తాకగా, తొలిసారి 2007లో ట్రిలియన్ డాలర్ల క్లబ్లో భారత్ మార్కెట్ చేరింది. అయితే మార్కెట్ల పతనంతో 2008 సెప్టెంబర్‌లో మార్కెట్ విలువ పడిపోగా, తిరిగి 2009 మేలో ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. ఈ బాటలో 2013 ఆగస్ట్‌లో మరోసారి మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల దిగువకు పడినప్పటికీ 2014లో తిరిగి ప్రాభవాన్ని పొందింది. సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను అధిగమించి రికార్డు సృష్టించింది. -
నెల రోజుల్లో గరిష్ట నష్టాలు
ఇటీవల వరుస లాభాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు మళ్లీ నీరసించాయి. గత నెల రోజుల్లోలేని విధంగా సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయింది. 27,057 వద్ద ముగిసింది. ప్రధానంగా ఆయిల్, ఎఫ్ఎంసీజీ రంగాలు 1.5% చొప్పున తిరోగమించాయి. వెరసి నిఫ్టీ సైతం 59 పాయింట్లు క్షీణించి 8,094 వద్ద నిలిచింది. అంచనాలకంటే ముందుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చునన్న ఆందోళనలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. వచ్చే వారం జరగనున్న ఫెడ్ సమావేశంపై మారెట్లు దృష్టిపెట్టాయని చెప్పారు. దీనికితోడు ఇటీవల సరికొత్త రికార్డులతో దూసుకెళుతున్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి 61 స్థాయికి బలహీనపడటం కూడా అమ్మకాలకు కారణమైనట్లు తెలిపారు. దిగ్గజాలకు నష్టాలు: సెన్సెక్స్ దిగ్గజాలలో హీరో మోటో, ఐటీసీ, ఇన్ఫీ, కోల్ ఇండియా, రిలయన్స్, హెచ్డీఎఫ్ సీ, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, భెల్, టీసీఎస్ 2.5-1% మధ్య నష్టపోయాయి. అయితే మరోపక్క సెసాస్టెరిలైట్, టాటా పవర్, ఐసీఐసీఐ బ్యాంక్ 1.5% చొప్పు న లాభపడ్డాయి.కాగా, ట్రేడైన షేర్లలో అత్యధికం లాభపడటం విశేషం. 1,741 షేర్లు లా భాలతో పుంజుకోగా, 1,272 నష్టపోయాయి. -
వచ్చే నెలాఖరులోగా గ్యాస్ ధరపై కొత్త ఫార్ములా: ప్రధాన్
న్యూఢిల్లీ: గ్యాస్ ధరపై ప్రభుత్వం తన కొత్త ఫార్ములాను వచ్చేనెలాఖరులోగా ప్రకటించనుంది. పెటుబడి దారుల ప్రయోజనాలను, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫార్ములా ప్రకటిస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో చెప్పారు. గ్యాస్ ధరపై గతంలో యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన రంగరాజన్ ఫార్ములాకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేయలేదని చెప్పారు. రంగరాజన్ ఫార్ములా ప్రకారం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(బీటీయూ) పరిమాణంలోని గ్యాస్ ధర రెట్టింపై 8.4 అమెరికన్ డాలర్లకు పెరిగి ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి రంగరాజన్ ఫార్ములా అమలు కావలసి ఉండగా, ఎన్నికల ప్రకటనతో 3 నెలలు వాయిదా పడింది. గ్యాస్ ధరపై సమగ్ర సమీక్ష జరగాలన్న కారణంతో ఎన్డీఏ ప్రభుత్వం గత జూన్ 25న మరో మూడునెలలపాటు ఫార్ములాను వాయిదా వేసింది. -
రిలయన్స్‌కు సెబీ రూ.13 కోట్ల జరిమానా
ముంబై: దేశీ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు నియంత్రణ సంస్థ సెబీ రూ.13 కోట్ల జరిమానా విధించింది. ఏడేళ్ల క్రితం నాటి స్టాక్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘన కేసులో శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఇందులో రూ. 1 కోటి మొత్తాన్ని లిస్టింగ్ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించినందుకు.. మిగతా రూ.12 కోట్లను సెక్యూరిటీస్ కాంట్రాక్టుల(నియంత్రణ) చట్టంలోని నిబంధనలను పాటించనందుకు జరిమానాగా విధిస్తున్నట్లు పేర్కొంది. ఇక కేసు విషయానికొస్తే.. ముకేశ్ అంబానీ సారథ్యంలోని ఆర్ఐఎల్ 2007లో తమ ప్రమోటర్లకు 12 కోట్ల వారెంట్లను జారీ చేసింది. ఇంతే మొత్తంలో ఈక్విటీ షేర్ల కింద మార్పు చేసేందుకు వీలుగా వారెంట్ల ఇష్యూ జరిగింది. దీనివల్ల కంపెనీ మొత్తం ప్రీ-ఇష్యూ పెయిడ్-అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ పెరిగేందుకు(డైలూషన్) దారి తీసింది. ఈ షేర్ల జారీ కారణంగా షేరువారీ ఆర్జన(డీఈపీఎస్) తగ్గుదల వివరాలను ఆరు క్వార్టర్లపాటు, వార్షిక ఫలితాల్లో కూడా ఆర్ఐఎల్ వెల్లడించలేదనేది సెబీ ప్రధాన ఆరోపణ. కంపెనీ షేర్లను కొనుగోలు చేసే లేదా విక్రయించే ఇన్వెస్టర్లపై ఈ సమాచారం చాలా ప్రభావం చూపుతుందని.. అయినా కంపెనీ దీన్ని చాన్నాళ్లపాటు చెప్పలేదని సెబీ పేర్కొంది. కాగా, ప్రస్తుతం సెబీ ఆదేశాలను పరిశీలిస్తున్నామని, న్యాయ సలహాలకు అనుగుణంగా తగిన చర్యలను చేపడతామని ఆర్ఐఎల్ కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. -
రెండో రోజూ నష్టాలే
వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు నీరసించాయి. సెన్సెక్స్ 76 పాయింట్లు క్షీణించి 25,589 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 23 పాయింట్ల నష్టంతో 7,649 వద్ద నిలిచింది. ప్రధానంగా ఐటీ రంగం 1%పైగా క్షీణించడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ప్రకటించిన నిరుత్సాహకర గైడె న్స్ ఐటీ షేర్లలో అమ్మకాలకు కారణమైంది. ప్రధానంగా ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ 1.5% స్థాయిలో నష్టపోయాయి. ఇతర సెన్సెక్స్ దిగ్గజాలలో హిందాల్కో, సెసాస్టెరిలైట్, టాటా మోటార్స్ 1%పైగా క్షీణించగా, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, కోల్ ఇండియా, ఎస్బీఐ 0.5% స్థాయిలో లాభపడ్డాయి. యూరప్ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, ఉక్రెయిన్ సంక్షోభ భయాలు వంటి అంతర్జాతీయ అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. రైల్ షేర్ల జోరు: మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధంగా రైల్ షేర్లు లాభాలతో పరుగుతీశాయి. రైల్వే సంబంధ మౌలిక సదుపాయాల విభాగంలో విదేశీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో కెర్నెక్స్ మైక్రో, కాళిందీ రైల్, స్టోన్ ఇండియా, టెక్స్మాకో రైల్ 5% చొప్పున పుంజుకున్నాయి. హైస్పీడ్ రైళ్లు, సబర్బన్ కారిడార్లు, రవాణా లైన్లు వంటి అంశాలలో 100% విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు క్యాబినెట్ ఆమోదముద్ర వేయడం ప్రభావం చూపింది. దీంతో రైళ్ల ఆధునీకరణ, విస్తరణ ప్రాజెక్ట్‌లకు జోష్ లభించనుంది. సిండికేట్ బ్యాంక్ లంచం కేసు నేపథ్యంలో భూషణ్ స్టీల్ షేరు మరో 20% పతనమైంది. వెరసి మూడు రోజుల్లో 43% దిగజారింది. ఈ నెల 5న రూ. 381 వద్ద ఉన్న షేరు గురువారం రూ. 244 వద్ద ముగిసింది. -
ఆదాయం ఓకే.. మార్జిన్లు డీలా!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో ఐటీ కంపెనీల ఆదాయాలు పుంజుకుంటాయని నిపుణులు అంచనా వేశారు. దేశీయంగా, అభివృద్ధి చెందిన మార్కెట్లలోనూ సాఫ్ట్వేర్ సేవలకు కనిపిస్తున్న డిమాండ్ ఇందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అయితే సిబ్బంది జీతాల పెంపు నేపథ్యంలో లాభదాయకత(మార్జిన్లు) తగ్గవచ్చునని అభిప్రాయపడ్డారు. తొలి క్వార్టర్ కీలకం... సాధారణంగా ఐటీ, బీపీవో రంగానికి తొలి క్వార్టర్(క్యూ1) కీలకంగా నిలుస్తుంది. క్లయింట్ల బడ్జెట్లు మొదలయ్యే కారణంగా సాఫ్ట్వేర్ సేవల కంపెనీల ఆదాయాలు మెరుగ్గా నమోదవుతాయి. దేశీ ఐటీ, బీపీవో పరిశ్రమ విలువ 118 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగిన నేపథ్యంలో కంపెనీల ఆదాయాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెచ్ దీపేన్ షా చెప్పారు. అభివృద్ధి చెందిన మార్కెట్ల నుంచి ఐటీ సేవలకు పటిష్ట డిమాండ్ కనిపిస్తున్న నేపథ్యంలో డాలర్ల రూపేణా ఆదాయంలో వృద్ధి కనిపిస్తుందని అంచనా వేశారు. క్రాస్ కరెన్సీ ప్రయోజనాలవల్ల 30-40 బేసిస్ పాయింట్లమేర అధిక ఆదాయం నమోదుకాగలదని చెప్పారు. అయితే త్రైమాసిక ప్రాతిపదికన చాలావరకూ కంపెనీల మార్జిన్లు ఒత్తిడిలో పడే అవకాశముందన్నారు. ఇందుకు సిబ్బంది జీతాల పెంపు, అధిక వీసా వ్యయాలు, రూపాయి పుంజుకోవడం వంటి అంశాలను పేర్కొన్నారు. ఈ మూడు అంశాల వల్ల నిర్వహణ లాభాలు 1.3-2.3% మధ్య మార్జిన్లు క్షీణించే అవకాశముందని ఎంకే తెలిపింది. 11న ఇన్ఫీతో షురూ: ఇన్ఫోసిస్‌తో ఐటీ కంపెనీల ఫలితాల సీజన్ మొదలుకానుంది. ఈ నెల 11న ఇన్ఫోసిస్ క్యూ1 పనితీరును వెల్లడించనుంది. 17న టీసీఎస్, 24న విప్రో ఫలితాలు ప్రకటించనున్నాయి. మొత్తంగా యూఎస్, యూరప్‌లలో సాఫ్ట్వేర్ సేవలకు పటిష్ట డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని కంపెనీలు ప్రకటించనున్న అంచనాల(గెడైన్స్) ద్వారా వెల్లడికానుందని ఆనంద్ రాఠీ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన డాలర్ల రూపంలో ఐటీ కంపెనీల ఆదాయం సగటున 3.4% వృద్ధిని సాధించవచ్చునని నోమురా అంచనా వేసింది. -
కేంద్రానికి రిలయన్స్ ఆర్బిట్రేషన్ నోటీసు
న్యూఢిల్లీ: ఇప్పటికే చాలా జాప్యమైన సహజవాయువు ధర పెంపును వెంటనే అమలు చేయాలంటూ ప్రభుత్వానికి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), భాగస్వామ్య సంస్థలు బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్‌లు ఆర్బిట్రేషన్ నోటీసు జారీ చేశాయి. గత ప్రభుత్వం ఆమోదించిన గడువు తేదీ అయిన ఏప్రిల్ 1 నుంచి రేటు పెంపు అమలుకాకపోవడం వల్ల సుమారు 4 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు నిలిచిపోయేందుకు దారితీస్తోందని మే 9న జారీ చేసిన ప్రీ-ఆర్బిట్రేషన్ నోటీసులో ఈ 3 కంపెనీలు పేర్కొన్నాయి. లండన్‌కు చెందిన సర్ డేవిడ్ స్టీల్‌ను తమ తరఫున ఆర్బిట్రేటర్‌గా పేర్కొంటూ ఆర్బిట్రేషన్ నోటీసును జూన్ 17న జారీ చేసినట్లు సమాచారం. గ్యాస్ రేటును 4.2 డాలర్ల నుంచి(ఒక్కో యూనిట్‌కు) రెట్టింపునకు పైగా పెంచుతూ(8.8 డాలర్లకు) గతేడాది కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని ఈ ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని కూడా పేర్కొందని... దీనికి కట్టుబడి ఉండాలని ప్రభుత్వాన్ని రిలయన్స్-బీపీ-నికో పేర్కొన్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచి రేటు పెంచుతూ జనవరి10న గత యూపీఏ సర్కారు కొత్త గ్యాస్ ధర ఫార్ములాను నోటిఫై చేసింది. అయితే, సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకిరావడంతో అమలు జూలై 1 వరకూ వాయిదా పడింది. అయితే, రంగరాజన్ కమిటీ రూపొందించిన ఫార్ములా ప్రకారం రేటు పెంపుపై తాజాగా మోడీ నేతృత్వంలోని సెప్టెంబర్ నెలాఖరు వరకూ పెంపును వాయిదా వేసింది. -
మార్కెట్‌కు ఇరాక్ దెబ్బ
275 పాయింట్లు పతనం 25,246 వద్దకు సెన్సెక్స్ గరిష్టం 25,609- కనిష్టం 25,114 ఒక దశలో 400 పాయింట్లు డౌన్ అన్ని రంగాలకూ నష్టాలే ఇరాక్ అంతర్యుద్ధం శృతిమించడంతో ఉన్నట్టుండి ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. దీంతో ముందురోజుకి పూర్తి విరుద్ధమైన రీతిలో మిడ్ సెషన్నుంచీ అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి మార్కెట్లు లాభాల నుంచి నష్టాలలోకి మళ్లాయి. ఉదయం సెషన్లో 25,609 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన సెన్సెక్స్ మిడ్ సెషన్లో కనిష్టంగా 25,114ను చవిచూసింది. అంటే గరిష్ట స్థాయి నుంచి దాదాపు 500 పాయింట్ల పతనం! క్రితం ముగింపునుంచి చూస్తే 400 పాయింట్ల నష్టం! ఆపై కొంతమేర కోలుకున్నప్పటికీ చివరికి 275 పాయింట్ల నష్టంతో 25,246 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఇదే విధంగా కదిలి ట్రేడింగ్ ముగిసేసరికి 74 పాయింట్లు పోగొట్టుకుంది. 7,558 వద్ద నిలిచింది. బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా... రియల్టీ, పవర్, ఆయిల్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ 2-1% మధ్య తిరోగమించాయి. ఇరాక్‌లో యుద్ధ భయాలు ముదరడంతో ఆయిల్ ధరలు మరోసారి పెకైగశాయి. ఇరాక్ బైజీలోని ప్రధాన ఆయిల్ రిఫైనరీను మిలటెంట్లు ఆక్రమించినట్లు వార్తలు వెలువడటంతో ఒక్కసారిగా సెంటిమెంట్ దిగజారిందని విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 114 డాలర్లకు చేరగా, నెమైక్స్ చమురు 107 డాలర్లకు చేరువైంది. ఇక మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కూడా 0.6% బలహీనపడి 60.40కు పతనమైంది. ఇది కూడా అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. ఆరు షేర్లు మాత్రమే సెన్సెక్స్‌లో ఆరు షేర్లు మాత్రమే లాభపడగా... సిప్లా, హిందాల్కో, గెయిల్ 3-1.5% మధ్య పుంజుకున్నాయి. అయితే మరోవైపు భెల్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, హీరోమోటో, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.5-1.5% మధ్య తిరోగమించాయి. ఇక బీఎస్ఈ-500 సూచీలో ఆమ్టెక్ ఇండియా, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, జీలెర్న్, బీజీఆర్ ఎనర్జీ, ఇండియా సిమెంట్స్, ఎరా ఇన్ఫ్రా, జేపీ అసోసియేట్స్, జేఎం ఫైనాన్షియల్, హెచ్‌పీసీఎల్, అలహాబాద్ బ్యాంక్, బజాజ్ హిందుస్తాన్ 7.5-4.5% మధ్య పతనమయ్యాయి. మొత్తం ట్రేడైన షేర్లలో 1,631 నష్టపోగా, 1,400 బలపడ్డాయి. -
గ్యాస్ ధరపై త్వరగా నిర్ణయం
పెట్రోలియం మంత్రిని కోరిన బీపీ చీఫ్ మాస్కో: కృష్ణా గోదావరి బేసిన్‌లోని కేజీ డీ6 క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి పెంపునకు గ్యాస్ ధర సవరణ, చట్ట సంబంధ అనుమతులు అవరోధాలుగా మారిన నేపథ్యంలో బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డూబ్లే భారత పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. మాస్కోలో మంగళవారం ప్రపంచ పెట్రోలియం సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాన్‌ను ఆయన కలుసుకున్నారు. గ్యాస్ ధరల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా డూబ్లే కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేజీ డీ6తో సహా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో 30 శాతం వాటాను బీపీ 2011లో 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కేజీ డీ6లో నానాటికీ క్షీణిస్తున్న ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ అనుమతులు జాప్యం కావడం బీపీకి నిరాశ కలిగించింది. గ్యాస్ ధరను గత ఏప్రిల్ 1 నుంచి పెంచాల్సి ఉన్నప్పటికీ పెంచలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి డూబ్లే తెచ్చారు. కేజీ డీ6లో ప్రస్తుతం రోజుకు 13 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. మూడేళ్ల కిందటి ఉత్పత్తితో పోలిస్తే ఇది కేవలం ఐదో వంతే. ధరల పెంపుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే తమ పెట్టుబడుల నిర్ణయాలు కొలిక్కి వస్తాయని బీపీ చెబుతోంది. -
వచ్చే ఏడాది అందుబాటులోకి 4G: రిలయన్స్
-
ఓఎన్జీసీలోని కొన్ని శక్తుల పనే ఇది: ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ చోరీకి పాల్పడి ఉండవచ్చంటూ ఓఎన్జీసీ చేసిన ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఘాటుగా స్పందించింది. పదమూడేళ్లుగా కనుగొన్న నిక్షేపాలను అభివృద్ధి చేయడంలో విఫలమైన ఓఎన్జీసీలోని కొన్ని శక్తులు సంస్థ సీఎండీ కె.సరాఫ్‌ను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి ఆరోపణలు చేసి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన కేజీ డీ6 బ్లాకు పక్కనే ఉన్న తమ క్షేత్రం నుంచి వేలాది కోట్ల రూపాయల విలువైన గ్యాస్‌ను ముకేశ్ అంబానీ సంస్థ చోరీ చేసి ఉండవచ్చని ఆరోపిస్తూ ఓఎన్జీసీ ఈ నెల 15న ఢిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ‘ఈ ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. ఓఎన్జీసీలోని కొన్ని శక్తులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతో సంస్థ సీఎండీని తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నమే ఇదని భావిస్తున్నాం..’ అని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. సరాఫ్‌ను తప్పుదోవ పట్టించిన శక్తుల పేర్లను రిలయన్స్ వెల్లడించలేదు. ఈ వ్యవహారంపై ఓఎన్జీసీ గతేడాది ఆగస్టులో తమను సంప్రదించిన నాటి నుంచీ స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు జరిపించడానికి తాము యత్నిస్తున్నామని తెలిపింది. -
రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 5,631 కోట్లు
Reliance Industries Q4 PAT up 2.3% at Rs 5630 crore, in line with estimates Read more at: http://economictimes.indiatimes.com/articleshow/33913963.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst గత ఆర్థిక సంవత్సరం రిలయన్స్‌కు కు చాలా సంతృప్తికరంగా సాగింది. జీఆర్‌ఎంలు భారీగా పుంజుకోవడంతో రిఫైనింగ్ వ్యాపారంలో ఎన్నడూలేనంత అత్యధికస్థాయి లాభాలను ఆర్జించగలిగాం. పాలిమర్స్, వీటి ఉత్పత్తుల అమ్మకం మార్జిన్లు పెరగడంతో పెట్రోకెమికల్స్లో లాభాలు కూడా భారీగా వృద్ధిచెందాయి. దేశీయంగా చమురు-గ్యాస్ ఉత్పత్తిలో కొన్ని సాంకేతికపరమైన సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికాలోని షేల్ గ్యాస్ వ్యాపారం గణనీయమైన వృద్ధిని నమోదుచేసుకుంది. రిటైల్ వ్యాపారం విషయానికొస్తే దేశంలోనే అతిపెద్ద రిటైల్ చైన్‌గా ఆవిర్భవించాం. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతోకూడిన 4జీ టెలికం సేవలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు కసరత్తును వేగవంతం చేశాం. - ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీ న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గడచిన రెండేళ్లకు పైగా కాలంలో అత్యధిక స్థాయిలో త్రైమాసిక లాభాన్ని ఆర్జించింది. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2013-14, జనవరి-మార్చి-క్యూ4)లో రూ.5,631 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,589 కోట్లతో పోలిస్తే లాభం నామమాత్రంగానే(0.8 శాతం) వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం క్యూ4లో 13 శాతం పెరుగుదలతో రూ.97,807 కోట్లకు ఎగసింది. కాగా, 2012-13 క్యూ4లో డాలరుతో రూపాయి మారకం విలువ 54.2 స్థాయిలో ఉండగా.. 2013-14 క్యూ4లో రూపాయి సగటు విలువ 61.8గా ఉంది. రూపాయి భారీ క్షీణత కూడా కంపెనీ రాబడులు పుంజుకోవడానికి దోహదం చేసింది. జీఆర్ఎంల జోరు... మార్చి క్వార్టర్లో స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం-ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధిచేయడం ద్వారా వచ్చే రాబడి) మెరుగైన రీతిలో 9.3 డాలర్లుగా నమోదైంది. అంతక్రితం క్వార్టర్(క్యూ3)లో 7.6 డాలర్లతో పోలిస్తే 1.7 డాలర్లు(22 శాతం) ఎగబాకింది. అయితే, క్రితం ఏడాది క్యూ4లో నమోదైన 10.1 డాలర్లతో పోలిస్తే మాత్రం తగ్గుముఖం పట్టడం విశేషం. సీక్వెన్షియల్‌గా చూస్తే... 2013-14 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో నమోదైన రూ.5,511 కోట్ల నికర లాభంతో పోలిస్తే(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) క్యూ4లో లాభం 2.2 శాతం మేర పెరిగింది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం రూ.1.03 లక్షలతో పోలిస్తే 8 శాతం తగ్గింది. పూర్తి ఏడాదికి ఇలా...: గతేడాది(2013-14) రిలయన్స్ నికర లాభం రూ.21,984 కోట్లుగా నమోదైంది. దేశంలోని ఒక ప్రైవేటు రంగ కంపెనీ ఒక ఏడాదిలో ఆర్జించిన అత్యధిక లాభంగా నిలిచింది. 2012-13 ఏడాదిలో ఆర్జించిన రూ.21,003 కోట్లతో పోలిస్తే 4.7% పెరిగింది. మొత్తం ఆదాయం కూడా పూర్తి ఏడాదికి 8.1% పెరుగుదలతో రూ.4,01,302 కోట్లకు వృద్ధి చెందింది. ఇది కూడా రికార్డు గరిష్టస్థాయి. అంతక్రితం ఏడాదిలో ఆదాయం రూ.3,71,119 కోట్లు. అతిపెద్ద రిటైల్ చైన్‌గా ఆవిర్భావం.. రిలయన్స్ రిటైల్... దేశంలో అతిపెద్ద రిటైల్ చైన్‌గా ఆవిర్భవించిందని ఆర్ఐఎల్ ప్రకటించింది. 2013-14 పూర్తి ఏడాదికి రిటైల్ వ్యాపార విభాగం రూ.363 కోట్ల పన్ను ముందు(ఎబిటా) లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.14,496 కోట్లకు ఎగబాకింది. గతేడాది అన్ని విభాగాల్లో కలిపి కొత్తగా 225 రిటైల్ సోర్లను కంపెనీ ఏర్పాటు చేసింది. దీంతో మార్చి చివరినాటికి రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 146 నగరాల్లో 1,691కి చేరింది. కాగా, మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో సంస్థ ఆదాయం 19.27% వృద్ధితో రూ.3,051 కోట్ల నుంచి రూ.3,639 కోట్లకు పెరిగింది. ఇతర ముఖ్యాంశాలివీ... పెట్రో కెమికల్స్ వ్యాపార విభాగం లాభం క్యూ4లో రూ.2,096 కోట్లకు పెరిగింది. అంతక్రిత ఏడాది ఇదే కాలంలో రూ.1,895 కోట్లతో పోలిస్తే 10.6 శాతం ఎగసింది. చమురుశుద్ధి(రిఫైనింగ్) విభాగం లాభం రూ.3,520 కోట్ల నుంచి రూ.3,954 కోట్లకు చేరింది. 12.3 శాతం పెరిగింది. అయితే, చమురు-గ్యాస్ ఉత్పత్తి విభాగం లాభం మాత్రం 17.8 శాతం దిగజారి రూ.460 కోట్ల నుంచి రూ.378 కోట్లకు పడిపోయింది. ఆదాయం కూడా రూ.1,597 కోట్ల నుంచి రూ.1,417 కోట్లకు క్షీణించింది. అంటే 11.2 శాతం తగ్గింది. ప్రధానంగా కేజీ-డీ6 బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి భారీగా దిగజారడమే దీనికి కారణంగా నిలిచింది. భౌగోళికపరమైన అడ్డంకులతోపాటు అంచనాకంటే బావుల్లోకి అధికంగా నీరుచేరడం ఇతరత్రా సమస్యలు గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోయేలా చేస్తున్నాయని కంపెనీ పేర్కొంది. క్యూ4లో షేరు వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.17.3 నుంచి స్వల్పంగా రూ.17.4కు చేరింది. పూర్తి ఏడాదికి చూస్తే... రూ.65.8 నుంచి రూ.68కి వృద్ధి చెందింది. ఇతర ఆదాయం క్యూ4లో రూ.2,040 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాది క్యూ4లో ఇది రూ.2,240 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో జామ్‌నగర్‌లోని జంట రిఫైనరీల నుంచి 41.1 బిలియన్ డాలర్ల పెట్రో ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అంతక్రితం ఏడాది ఇది 39.3 బిలియన్ డాలర్లు. మార్చి చివరి నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.89,968 కోట్లకు పెరిగిపోయింది. క్రితం ఏడాది మార్చి ఆఖరికి రూ. 72,427 కోట్లు మాత్రమే రుణభారం ఉండటం గమనార్హం. ఇక మార్చి చివరికల్లా రిలయన్స్ వద్ద మొత్తం రూ.88,190 కోట్ల నగదు తత్సంబంధ నిల్వలు ఉన్నాయి. ఒక్కో షేరుకి రూ.9.50 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ షేరు ధర గురువారం(శుక్రవారం స్టాక్ మార్కెట్ టేడ్రింగ్ సెలవు) 1.88 శాతం పెరిగి రూ.959 వద్ద ముగిసింది. -
ప్రస్తుత ధరకే రిలయన్స్ కేజీ డీ6 గ్యాస్ విక్రయం
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం నాచురల్ గ్యాస్ ధరల సవరణపై నిర్ణయం తీసుకునేంత వరకు కేజీ డీ6 క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత రేటుకే విక్రయించనుంది. ప్రస్తుతం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు (ఎంబీటీయూ) 4.2 డాలర్లుగా ఉన్న ధరను ఏప్రిల్ 1 నుంచి 8 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించిన సంగతి విదితమే. అయితే, ఎన్నికల సంఘం సలహా మేరకు, మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ధరల పెంపును వాయిదా వేయాలని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ నిర్ణయించారని అధికార వర్గాలు తెలిపాయి. ఓఎన్జీసీ వంటి సంస్థలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు గ్యాస్‌ను 4.2 డాలర్ల ధరకే అమ్ముతాయి. అయితే, కేజీ డీ6 గ్యాస్‌పై రిలయన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోవాలంటే ఇరు పక్షాలూ సంతకాలు చేయాల్సి ఉంది. నూతన విక్రయ ఒప్పందాలకు సంబంధించిన అనేక అంశాలను రిలయన్స్ - కేజీ డీ6 గ్యాస్ కొనుగోలుదారుల సమావేశంలో పరిష్కరించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత గ్యాస్ అమ్మకం, కొనుగోలు ఒప్పందం (జీఎస్‌పీఏ) మాదిరే కొత్త జీఎస్‌పీఏ కూడా ఐదేళ్లపాటు అమల్లో ఉండడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అంగీకరించిందని ఆవర్గాలు పేర్కొన్నాయి. -
రూ. 6,500 కోట్ల సంగతేంటి..?
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు కేటాయించిన కేజీ-డీ6 బేసిన్‌లోని ఆయిల్, గ్యాస్ క్షేత్రం కాంట్రాక్ట్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ వేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన రూ. 6,500 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలపై ఎలాంటి దర్యాప్తును చేపట్టిందీ వివరించమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ ఈ అంశంపై సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌ను వివరణ అడిగింది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిసారించిందని, తమ వంతు వచ్చాక తగువిధంగా స్పందిస్తుందని మోహన్ కోర్టుకు వివరించారు. ముకేష్ అంబానీ గ్రూప్ కంపెనీ ఆర్ఐఎల్కు సహకరించేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ఏకమయ్యాయంటూ ఎన్జీవో కామన్ కాజెస్ కౌన్సిల్ తరఫున ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ఇది కీలకమైన అంశమే అయినప్పటికీ ఏ ఒక్క రాజకీయ పార్టీ ఈ విషయాన్ని లేవనెత్తకపోవడం గమనార్హమని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. సీనియర్ సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా, ఎన్జీవో కామన్ కాజ్ వేసిన పిటిషన్లపై స్పందిస్తూ కేవలం వ్యక్తులే ఈ విషయాలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లు వ్యాఖ్యానించింది. కాగా, ఎంపీ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది కొలిన్ గాన్‌సేల్వ్స్ తమ వాదనను ముగించిన తరువాత, ఎన్జీవో తరఫున విచారణకు హాజరైన భూషణ్ ఈ కేసుకు సంబంధించిన ఒక లేఖను కోర్టుకు చదివి వినిపించారు. ఊరూపేరూలేని కంపెనీలతో..: సింగపూర్‌లోని ఇండియన్ హైకమిషన్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖగా పేర్కొంటూ భూషణ్ లేఖలోని కొన్ని విషయాలను కోర్టుకు వినిపించారు. సింగపూర్‌లో ఒకే గదిలో ఏర్పాటు చేసిన ఎలాంటి వ్యాపారాలూ నిర్వహించని ఒక సంస్థ రూ. 6,500 కోట్లను ఇన్వెస్ట్ చేయడంపై దర్యాప్తునకు సంబంధించిన ఈ లేఖను భూషణ్ కోర్టుకు సమర్పించారు. బయో మెట్రిక్స్ మార్కెటింగ్ అనే సంస్థ ద్వారా ఇండియాకు ఈ పెట్టుబడులు అందినట్లు హైకమిషన్ పేర్కొన్న విషయాన్ని భూషణ్ తెలియజేశారు. ఈ కంపెనీకి ఎలాంటి ఆస్తులు, ఈక్విటీ లేదని ఆయన వివరించారు. బ్యాంకింగ్ లెసైన్స్‌లపై ఈసీ దృష్టి న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల జారీ అంశంపై ఎన్నికల సంఘం(ఈసీ) దృష్టిసారించింది. సోమవారం(31న) లెసైన్స్‌ల అంశాన్ని పరిశీలించే అవకాశాలున్నాయని ఎలక్షన్ కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ బుధవారమిక్కడ చెప్పా రు. ఈసీ అడిగిన కొన్ని వివరణలను ఆర్బీఐ ఇప్పటికే సమర్పించిందని కూడా ఆయన వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున లెసైన్స్‌ల జారీపై నిర్ణయం కోసం ఆర్బీఐ ఈసీకి లేఖరాయడం తెలిసిందే. ఇండియా పోస్ట్, ఐఎఫ్సీఐ, ఎల్ఐసీ హౌసింగ్ ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థలు; అనిల్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌లతో సహా మొత్తం 24 కంపెనీలు బ్యాంకింగ్ లెసైన్స్‌ల రేసులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, కొత్త లెసైన్స్‌ల జారీ విషయంలో ఈసీకి ఉన్న అభ్యంతరాలేంటన్న ప్రశ్నకు... వాళ్లు(ఆర్బీఐ) నిబంధనల విషయంలో పూర్తి విశ్వాసంతో ఉంటే మా పరిశీలన కోసం ఎందు కు పంపాల్సి వస్తుంది. తమ విధులను నమ్మకంగా, సంతృప్తికరంగా, సక్రమంగా నిర్వర్తించినప్పుడు అసలు ఈ అంశాన్ని ఈసీ నిర్దేశం కోసం పంపించాల్సిన అవసరమే లేదని బ్రహ్మ స్పష్టం చేశారు. కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల అంశానికి సంబంధించి గతేడాది(2013)లోనే నిర్ణయం తీసుకున్నప్పుడు జారీ చేయనీయకుండా ఆర్బీఐకి ఉన్న అడ్డకుంలేమిటని కూడా ఆయన ప్రశ్నించారు. -
కేజీ-డీ6లో మళ్లీ తగ్గిన గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి మళ్లీ రెండు నెలల తర్వాత తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరిలో రోజుకు 13.63 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ)కు పెరిగిన ఉత్పత్తి ఈ నెలలో 13.28 ఎంసీఎండీలకు తగ్గింది. చమురు శాఖకు సమర్పించిన స్థాయీ నివేదికలో నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిబ్రవరిలో తొలివారంలో కేజీ-డీ6లోని డీ1, డీ3 ప్రధాన క్షేత్రాలతో పాటు ఎంఏ చమురు క్షేత్రం నుంచి 13.58 ఎంసీఎండీల గ్యాస్‌ను ఆర్ఐఎల్ ఉత్పత్తి చేసింది. ఆతర్వాత వారంలో ఇది 13.68 ఎంసీఎండీలకు పెరిగింది. అయితే, ఈ నెల 9తో ముగిసిన వారంలో గ్యాస్ ఉత్పత్తి 13.28 ఎంసీఎండీలకు తగ్గిందని డీజీహెచ్ తెలిపింది. ఇందులో డీ1, డీ3 క్షేత్రాల నుంచి 8.17 ఎంసీఎండీలు, ఎంఏ చమురు క్షేత్రం నుంచి 5.11 ఎంసీఎండీల ఉత్పత్తి నమోదైంది. ఇంకా సగానికిపైగా బావుల మూత... అంతకంతకూ పడిపోతున్న ఉత్పత్తిని తిరిగి పెంచే ప్రణాళికలో భాగంగా ఆర్ఐఎల్ జనవరిలో ఎంఏ చమురు క్షేత్రంలోని ఎంఏ-8 బావిలో మళ్లీ గ్యాస్ వెలికితీతను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ ఉత్పత్తి గత నెలలో 1.5 ఎంసీఎండీలు పెరిగి 5.33 ఎంసీఎండీలకు చేరింది. మూడేళ్లపాటు వరుస తగ్గుదలకు బ్రేక్‌పడింది. అయితే, మళ్లీ తాజాగా ఉత్పత్తి పడిపోవడం గమనార్హం. కేజీ-డీ6 బ్లాక్‌లో ఆర్ఐఎల్కు 60 శాతం, బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)కు 30 శాతం, కెనడాకు చెందిన నికో రిసోర్సెస్‌కు 10 శాతం చొప్పున వాటాలున్నాయి. ఇప్పటిదాకా డీ1, డీ3 క్షేత్రాల్లో 22 బావులను తవ్విన ఆర్ఐఎల్ కేవలం 18 బావుల్లోనే ఉత్పత్తిలోకి తీసుకొచ్చింది. కాగా, ప్రస్తుతం 8 బావుల్లోనే ఉత్పత్తి జరుగుతోందని, 10 బావులు మూతబడేఉన్నాయని డీజీహెచ్ తాజా నివేదికలో పేర్కొంది. అదేవిధంగా ఎంఏ క్షేత్రాల్లో మొత్తం 7 బావులకుగాను 5 బావుల్లోనే ఉత్పత్తి జరుగుతోంది. ఒక బావి(ఎంఏ-6హెచ్)లో మరమ్మతులు చేపడుతోందని నియంత్రణ సంస్థ వెల్లడించింది. 2009 ఏప్రిల్‌లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత 2010 మార్చిలో గరిష్టంగా 69.43 ఎంసీఎంసీలను తాకింది. ఇప్పుడు 80 శాతం పైనే ఉత్పత్తి దిగజారినట్లు లెక్క. కాగా, వచ్చే నెల 1 నుంచి గ్యాస్ రేటు రెట్టింపు కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 4.2 డాలర్లుగా ఉన్న ధర దాదాపు 8 డాలర్లకు ఎగబాకనుంది. ధర పెరిగాక అనూహ్యంగా లాభాలు దండుకోవడగానికే రిలయన్స్ అక్రమంగా గ్యాస్‌ను దాచిపెడుతోందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
వారసుడొచ్చాడు!
న్యూఢిల్లీ: సరిగ్గా ముప్పై రెండేళ్ల క్రితం రిలయన్స్ సామ్రాజ్యంలో ధీరూభాయ్ అంబానీ కుమారుడు ముకేశ్ అంబానీ అడుగుపెట్టారు. ఇప్పుడు ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కంపెనీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ త్వరలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఆకాశ్ దీనిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం కావడం విశేషం. దేశవ్యాప్తంగా వైర్లెస్ బ్రాండ్ బ్యాండ్(4జీ) స్పెక్ట్రంను దక్కించుకున్న రిలయన్స్ జియో... తాజాగా జరిగిన 2జీ వేలంలో అనేక సర్కిళ్లలో స్పెక్ట్రంను కొనుగోలు చేయడం తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రిలయన్స్ జియో టెలికం సేవలకు సంబంధించి కీలకమైన మార్కెట్ వ్యూహాన్ని ఖరారు చేయడంలో ఆకాశ్ కూడా పాలుపంచుకున్నట్లు సమాచారం. ‘కంపెనీకి క్రమంతప్పకుండా ఆకాశ్ వస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే మనోజ్ మోడి, చైర్మన్ ముకేశ్‌తో సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు. రిలయన్స్ జియో గ్రూప్ ప్రెసిడెంట్ సందీప్ దాస్ తో సన్నిహితంగా పనిచేస్తున్నారు. అయితే, కంపెనీ దీనిపై బయటకు వివరాలను వెల్లడించకపోవడానికి ఆకాశ్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉండటం కారణం’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తండ్రి బాటలోనే... 1981లో ముకేశ్ అంబానీ 24 ఏళ్ల వయస్సులో ఆర్ఐఎల్లో చేరారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భారత్‌లోనే అతిపెద్ద చమురు రిఫైనరీని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు రిలయన్స్ గ్రూప్ తొలిసారిగా టెలికం వెంచర్లోకి రావడంలో(విడిపోక ముందు) ముకేశ్ చొరవే ప్రధానకారణం. కాగా, ప్రస్తుతం ఆకాశ్ అంబానీ వయస్సు కూడా 22 ఏళ్లు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో అండర్ గ్యాడ్యుయేషన్ చేసిన ఆకాశ్ గతేడాది భారత్‌కు తిరిగొచ్చారు. ముకేశ్‌కు ప్రీతిపాత్రమైన టెలికం రంగంలోనే, అందులోనూ సొంత కంపెనీలోనే తన తొలి కార్పొరేట్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తుండటం విశేషం. కాగా, యేల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆకాశ్ సోదరి ఇషా కూడా త్వరలోనే రిలయన్స్ ఫౌండేషన్‌లో చేరనున్నట్లు సమాచారం. గ్రూప్ నేతృత్వంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, హాస్పిటల్ వెంచర్లు దీని అధీనంలోనే ఉన్నాయి. కాగా, ముకేశ్ రెండో కుమారుడు అనంత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. -
ఇకపైనా ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఐఐపీ వంటి ఆర్థిక గణాంకాలతోపాటు, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆర్ఐఎల్ వంటి బ్లూచిప్స్ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో ఇకపై మార్కెట్లను క్యూ3 ఫలితాలే నడిపిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అక్టోబర్-డిసెంబర్ కాలానికి(క్యూ3) మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, క్యాపిటల్ గూడ్స్ దిగ్గజం ఎల్అండ్టీ పనితీరు ఈ వారంలో వెల్లడికానుంది. కాగా, ఈ నెల 28న రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పరపతి సమీక్షను చేపట్టనుంది. ఈ అంశాల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తతతో వ్యవహరించే అవకాశమున్నదని నిపుణులు పేర్కొన్నారు. గత వారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ గత నాలుగు వారాల్లోలేని విధంగా 305 పాయింట్లు(1.5%) ఎగసి 21,064 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం కొంతమేర లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టే అవకాశాలున్నాయనేది కొందరు నిపుణుల అభిప్రాయం. 6,350 వద్ద అమ్మకాలు! విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు ఈ వారం కీలకంగా నిలవనున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. వీటికితోడు అంతర్జాతీయ సంకేతాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు, బ్యాంకింగ్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ రంగాల పనితీరును నిశితంగా గమనించాల్సి ఉన్నదని రెలిగేర్ సెక్యూరిటీస్‌కు చెందిన రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ వివరించారు. మార్కెట్లు స్థిరీకరణ దిశలో కదులుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,350 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడి(రెసిస్టెన్స్) ఎదురుకావచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే 6,150-6,100 పాయింట్ల స్థాయిలో నిఫ్టీకి పటిష్ట మద్దతు లభించవచ్చునని తెలిపారు. ఈ స్థాయిలో కొనుగోళ్లు పుంజుకుంటాయని చెప్పారు. సాంకేతికంగా నిఫ్టీ బుల్లిష్ ధోరణిని కనబరుస్తున్నదని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. 6,360 స్థాయి వద్ద ఎదురయ్యే అమ్మకాల ఒత్తిడి(రెసిస్టెన్స్)ని తట్టుకుని ముందుకెళ్తే మరింత ఊపందుకుంటుందని అంచనా వేశారు. ఈ నెలాఖరున ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లలో అప్రమత్తత కనిపిస్తుందని వెరాసిటీ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. గత పాలసీ సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ ద్రవ్యోల్బణం ఉపశమనంతో ఇదే స్థితిని కొనసాగించే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. ఈ నెల 28 నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్వహించనున్న రెండు రోజుల సమావేశంపై ట్రేడర్లు దృష్టి పెడతారని నిపుణులు పేర్కొన్నారు. ఈ వారంలో ప్రధాన ఫలితాలు హెచ్డీఎఫ్సీ ఎల్ అండ్ టీ అల్ట్రాటెక్ సిమెంట్ కెయిర్న్ ఇండియా గ్లెన్‌మార్క్ ఫార్మా అశోక్ లేలాండ్ సెన్సెక్స్ షేర్లలో ఎఫ్ఐఐల జోరు మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌కు ప్రాతినిధ్యం వహించే అత్యధిక శాతం కంపెనీలలో ఎఫ్ఐఐల పెట్టుబడులు పుంజుకున్నాయి. క్యూ3లో 21 సెన్సెక్స్ షేర్లలో విదేశీ పెట్టుబడుల జోరు పెరిగింది. సెన్సెక్స్‌లో 30 బ్లూచిప్ కంపెనీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, బజాజ్ ఆటో, భెల్, ఓఎన్జీసీ, గెయిల్, టాటా పవర్, సెసా స్టెరిలైట్, హీరో మోటో, టాటా మోటార్స్, మారుతీ, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్ఎం తదితరాల్లో ఎఫ్ఐఐల వాటా పెరిగింది. పెట్టుబడులు తగ్గిన వాటిలో హెచ్‌యూఎల్, ఐటీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. కాగా, కొత్త ఏడాదిలో ఎఫ్ఐఐలు డెట్ మార్కెట్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జనవరి 1-17 మధ్య నికరంగా రూ. 16,152 కోట్ల(260 కోట్ల డాలర్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొన్నారు. షేర్లలో రూ. 2,148 కోట్ల(34.8 కోట్ల డాలర్లు) నికర పెట్టుబడులు పెట్టారు. -
రిలయన్స్ లాభం రూ.5,511 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా వున్నాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్(2013-14, క్యూ3)లో రూ. 5,511 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,502 కోట్ల లాభంతో పోలిస్తే వృద్ధి నామమాత్రంగా 0.2 శాతానికే పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 96,307 కోట్ల నుంచి రూ.1,06,383 కోట్లకు పెరిగింది. 10.5 శాతం వృద్ధి చెందింది. ఇక సెప్టెంబర్ క్వార్టర్(క్యూ2)తో పోల్చినా(రూ.5,490 కోట్లు) కూడా సీక్వెన్షియల్‌గా లాభంలో వృద్ధి 0.4 శాతమే. ఆదాయం స్వల్పంగా 0.1 శాతం క్షీణించింది. రూ.1.065 లక్షల కోట్ల నుంచి రూ. 1.063 లక్షల కోట్లకు తగ్గింది. అయితే, విశ్లేషకులు క్యూ3లో లాభం సగటున రూ. 5,300-5,350 కోట్లకు తగ్గొచ్చని అంచనా వేశారు. దీని ప్రకారం చూస్తే ఆర్ఐఎల్ లాభాలు కాస్త మెరుగ్గా ఉన్నట్లే లెక్క. నాన్-కోర్(పెట్రోలియం, పెట్రోకెమికల్స్ ప్రధాన వ్యాపారం కాకుండా) బిజినెస్ ఆదాయాలు పుంజుకోవడం కంపెనీకి చేయూతనందించాయి. జీఆర్‌ఎంలు ఇలా... కంపెనీ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) ఈ ఏడాది క్యూ3లో ఒక్కో బ్యారెల్‌పై 7.6 డాలర్లకు తగ్గింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఇది 9.6 డాలర్లు కాగా, సెప్టెంబర్ క్వార్టర్లో 7.7 డాలర్లుగా నమోదైంది. పరిశ్రమ విశ్లేషకుల సగటు అంచనా 7.5 డాలర్లు. ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధి చేయడం ద్వారా వచ్చే పెట్రో ఉత్పత్తులపై కంపెనీకి లభించే లాభాన్నే జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. అయితే, ప్రామాణిక సింగపూర్ సగటు జీఆర్ఎం కంటే తమ మార్జిన్లు మెరుగ్గానే ఉన్నాయని ఆర్ఐఎల్ చెబుతోంది. భారీ ఇతర ఆదాయం ఆసరా... క్యూ3లో ఆర్ఐఎల్కు ఇతర ఆదాయం రూపంలో రూ. 2,305 కోట్లు లభించాయి. ఈ ఆదాయం క్యూ2తో(రూ. 2,060 కోట్లు) పోలిస్తే 12 శాతం పెరిగింది. అదే క్రితం ఏడాది క్యూ3లో రూ. 1,740 కోట్లతో పోలిస్తే 32 శాతం దూసుకెళ్లడం గమనార్హం. ఈ రాబడే కంపెనీ లాభాలు నిలదొక్కుకోవడంలో ప్రధానంగా దోహదం చేసినట్లు కనబడుతోంది. కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వల పెట్టుబడులపై ఈ ఆదనపు ఆదాయం లభిస్తోంది. రిఫైనింగ్‌పై మెయింటెనెన్స్ ప్రభావం... కంపెనీ ముడిచమురు రిఫైనింగ్ వ్యాపారం క్యూ3లో కాస్త తడబడింది. పన్నులు, వడ్డీ చెల్లింపులకు ముందు లాభం(ఎబిటా) 13.1 శాతం తగ్గింది. అయితే, పెట్రోకెమికల్స్ విభాగం ఎబిటా 9.7 శాతం వృద్ధితో రూ. 2,124 కోట్లకు పెరగడం కంపెనీకి కొంత చేదోడుగా నిలిచింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఆర్ఐఎల్కు రెండు భారీ చమురు శుద్ధి రిఫైనరీలు ఉన్న సంగతి తెలిసిందే. నిర్వహణ పనుల(మెయింటెనెన్స్) కోసం ఇందులో ఒక ప్లాంట్‌ను కొద్దికాలంపాటు మూసివేయడం వల్ల డిసెంబర్ త్రైమాసికంలో తక్కువమొత్తంలో ముడిచమురును శుద్ధి చేశామని కంపెనీ పేర్కొంది. ఈ విభాగంలో ఆదాయాలు తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని వివరించింది. కేజీ-డీ6లో ఉత్పత్తి కిందికే... అక్టోబర్-డిసెంబర్ మూడు నెలల్లో కేజీ-డీ6 క్షేత్రాల్లో చమురు-గ్యాస్ ఉత్పత్తి మరింత పడిపోయింది. దీంతో ఈ విభాగంలో ఆదాయం కూడా రూ. 1,733 కోట్లకు తగ్గింది. క్రితం ఏడాది క్యూ3లో రూ. 1,921 కోట్లతో పోలిస్తే 10 శాతం మేర క్షీణించింది. సిల్వాస్సాలో కొత్తగా పాలియెస్టర్ తయారీ ప్లాంట్‌ను డిసెంబర్ క్వార్టర్‌లోనే ఆరంభించాం. మా ప్రధాన వ్యాపారమైన చమురు-గ్యాస్, పెట్రోకెమికల్స్ విస్తరణ కోసం ఉద్దేశించిన 12 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులో ఇది తొలిమెట్టు. రిటైల్ వ్యాపారం కూడా భారీ వృద్ధి పథంలో కొనసాగుతోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా అనిశ్చితి వాతావరణంలోనూ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ విభాగాల్లో మెరుగైన పనితీరును సాధించగలిగాం. - ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీ ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు డిసెంబర్ నాటికి ఆర్ఐఎల్ వద్ద నగదు, తత్సంబంధ నిల్వలు రూ.88,705 కోట్లుగా లెక్కతేలాయి. కంపెనీ మొత్తం రుణ భారం రూ. 81,330 కోట్లకు పెరిగింది. గతేడాది ఏప్రిల్‌లో రుణాలు రూ. 72,427 కోట్లే. అప్పులు, నగదు నిల్వలను బేరీజు వేస్తే కంపెనీ నికరంగా రుణ రహితంగా ఉన్నట్లే లెక్క. షేరు(రూ.10 ముఖ విలువ) వారీ ఆర్జన(ఈపీఎస్) డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో రూ. 17.1గా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో, ఈ ఏడాది క్యూ2లో ఈపీఎస్ రూ.17గా నమోదైంది. ‘పండుగ’ చేసుకున్న రిటైల్ వ్యాపారం... రిలయన్స్ రిటైల్ వ్యాపార ఆదాయం క్యూ3లో 38 శాతం వృద్ధి చెంది రూ. 3,927 కోట్లకు చేరింది. పండుగ సీజన్లో అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు తోడ్పడింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రిటైల్ విభాగం ఆదాయం రూ. 2,839 కోట్లుగా నమోదైంది. మొత్తంమీద క్యూ3లో పన్నులు, వడ్డీ చెల్లింపుల ముందు లాభాలు రూ. 106 కోట్లకు చేరాయి. గడిచిన మూడు నెలల్లో కొత్తగా 90 స్టోర్లను ఏర్పాటు చేసింది. డిసెంబర్ చివరికి రిలయన్స్ రిటైల్ మొత్తం 141 నగరాల్లో 1,577 స్టోర్లను నిర్వహిస్తోంది. -
రిలయన్స్ కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి పెంపు
న్యూఢిల్లీ: కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి క్షీణతకు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అడ్డుకట్ట వేసింది. ఇక్కడి ఎంఏ-గ్యాస్ క్షేత్రంలోని ‘ఎంఏ-8’ కొత్త బావిలో ఈ నెల 2 నుంచి ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన నాలుగేళ్లలో ఆర్ఐఎల్ కొత్తగా అభివృద్ధి చేసిన తొలి బావి ఇదే కావడం గమనార్హం. కాగా, కేజీ-డీ6 గ్యాస్ బ్లాక్‌లో ప్రస్తుతం గ్యాస్ ఉత్పత్తి రోజుకు 13.7 మిలియన్ ఘనపు మీటర్ల(ఎంఎస్‌ఎండీ)కు పెరిగినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. ఇందులో డీ1, డీ3 క్షేత్రాల నుంచి 8.7 ఎంసీఎండీలు, ఎంఏ క్షేత్రం నుంచి 5 ఎంసీఎండీల చొప్పున ఉత్పత్తి జరుగుతోందని తెలిపాయి. గత నెలలో ఇక్కడ మొత్తం ఉత్పత్తి కొత్త ఆల్‌టైమ్ కనిష్టమైన 11.7 ఎంఎస్ఎండీలకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఎంఏ-8 బావి ప్రస్తుతం స్థిరీకరణ ప్రక్రియలో ఉందని.. రోజుకు 1.5 ఎంసీఎండీల గ్యాస్ ఉత్పత్తి జరుగుతోందని అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో 2.5 ఎంసీఎండీలకు పెరగవచ్చని అంచనా. ఇదిలాఉండగా.. డీ1, డీ3లలో మొత్తం 18 బావులకుగాను మూసేసిన 10 బావుల్లో మూడో వంతును తిరిగి ఉత్పత్తికి సిద్ధం చేసేందుకు రిలయన్స్ మరమ్మతులు చేపడుతోంది. ఎంఏ క్షేత్రంలో కూడా ఆరు బావులకుగాను రెండు బావులను కూడా కంపెనీ మూసేసింది. ప్రధానంగా బావుల్లోకి ఇసుక, నీరు చేరడం ఇతరత్రా భౌగోళిక అంశాలే కారణమని రిలయన్స్ చెబుతూవస్తోంది. అయితే, తగినన్ని బావులను తవ్వకపోవడంవల్లే ఉత్పత్తి పాతాళానికి పడిపోయిందని అటు నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్), పెట్రోలియం శాఖ అధికారులు వాదిస్తున్నారు. 2009 ఏప్రిల్‌లో కేజీ-డీ6లో రిలయన్స్ గ్యాస్, చమురు ఉత్పత్తిని పారంభించింది. 2010 మార్చిలో 69.5 ఎంసీఎండీల గరిష్టస్థాయిని తాకింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరను రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీంతో యూనిట్ ధర 4.2 డాలర్ల నుంచి 8.4 డాలర్లకు ఎగబాకనుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి పెంపు చర్యలను ముమ్మరం చేస్తుండం గమనార్హం. -
ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాలు
ప్రపంచ మార్కెట్ల బలహీనత, లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం 94 పాయింట్ల నష్టంతో మూడు వారాల కనిష్టస్థాయి 20,693 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 6,162 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 477 పాయింట్లు కోల్పోయింది. ఎఫ్ఐఐలు వరుసగా రెండురోజుల పాటు విక్రయాలు జరపడంతో సెంటిమెంట్ బలహీనపడినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. హెవీవెయిట్ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తగ్గడంతో సూచీలు క్షీణించాయి. మెటల్, రియల్టీ షేర్లలో అమ్మకాలు అధికంగా జరిగాయి. టాటా స్టీల్, సేసా స్టెరిలైట్, హిందాల్కోలు 2-3% తగ్గగా, డీఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్ షేర్లు 1-2% పడిపోయాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో (ఎఫ్ఐఐలు) ఏర్పడుతున్నాయని, ఈ కారణంగా వారు ఇటీవల వర్ధమాన మార్కెట్లలో లాభాల స్వీకరణ జరుపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఎఫ్ఐఐలు మరో రూ. 567 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకున్నారు. కొద్ది నెలల నుంచి అదేపనిగా అమ్మకాలు జరుపుతున్న దేశీయ సంస్థలు మాత్రం తాజాగా రూ. 59.44 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం విశేషం. రిలయన్స్ కౌంటర్లో పెరిగిన ఓపెన్ ఇంట్రస్ట్: ఐదు రోజుల నుంచి వరుస నష్టాలు చవిచూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) భారీగా పెరిగింది. మూడు నెలలుగా మద్దతునిస్తున్న రూ. 840 సమీపస్థాయిలోనే రిలయన్స్ ముగిసింది. ఫ్యూచర్ కాంట్రాక్టు క్రితంరోజులానే రూ. 7 ప్రీమియంతో క్లోజయ్యింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ ఓఐలో 7.12 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 1.32 కోట్ల షేర్లకు పెరిగింది. ఆర్ఐఎల్ కౌంటర్లో ఓపెన్ ఇంట్రస్ట్ ఇంతభారీగా పెరగడం అరుదు. రూ. 860 స్ట్రయిక్ వద్ద పెద్ద ఎత్తున కాల్ రైటింగ్ జరగడంతో 2.65 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 6.12 లక్షల షేర్లకు పెరిగింది. అలాగే రూ. 840 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడంతో ఈ పుట్ ఆప్షన్లో 83 వేల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 3.05 లక్షల షేర్లకు చేరింది. ఫ్యూచర్ కాంట్రాక్టులో గరిష్టస్థాయి ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) వున్నందున, సమీప భవిష్యత్తులో ఈ షేరు ఏదో ఒకవైపు వేగంగా కదలవచ్చు. అయితే రూ. 860 స్థాయిని అధిగమించలేకపోతే రిలయన్స్ దిగువవైపుగా ప్రయాణించవచ్చని, ఆ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే ర్యాలీ జరపవచ్చని ఆప్షన్ రైటింగ్ సూచిస్తున్నది. -
కేజీ డీ6లో పెరగనున్న గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ ఉత్పత్తిని రిలయున్స్ ఇండస్ట్రీస్ ఈ నెల నుంచి రోజుకు 1-3 మిలియున్ స్టాండర్ట్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) మేర పెంచనుంది. ఉత్పత్తి క్షీణతకు అడ్డుకట్ట వేసే ప్రక్రియును సంస్థ చేపట్టడంతో ఇది సాధ్యం కానుంది. ఆర్ఐఎల్ తన భాగస్వావుులు బీపీ పీఎల్సీ (యుూకే), నికో రిసోర్సెస్ (కెనడా)లతో కలసి కేజీ డీ6 బ్లాకులో ఎంఏ క్షేత్రాన్ని తవ్వింది. ఎంఏ-8 పేరుగల ఈ క్షేత్రంలో ఈనెల నుంచే ఉత్పత్తి ప్రారంభవుయ్యే అవకాశవుుందని విశ్వసనీయు వర్గాలు వెల్లడించారుు. ఈ క్షేత్రంలో 1-3 ఎంసీఎండీల గ్యాస్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఎంఏ-8లో 3 ఎంసీఎండీల గ్యాస్ లభిస్తే కేజీ డీ6లో అత్యధికంగా గ్యాస్ ఉత్పత్తి అయ్యే బావి ఇదే అవుతుంది. గత వుూడేళ్లలో కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తి నానాటికీ తగ్గుతూ ప్రస్తుతం 12 ఎంసీఎండీలకు చేరింది. డీ1, డీ3 క్షేత్రంలో వుూసేసిన బావుల్లో వుూడో వంతుకు వురవ్ముతులు చేయూలనీ, తద్వారా వూర్చి నాటికి ఉత్పత్తిని వురింత పెంచాలనీ ఆర్ఐఎల్ యుత్నిస్తోంది. ఇసుక, నీరు వస్తుండడంతో డీ1, డీ3ల్లోని మొత్తం 18 బావుల్లో పదింటిని సంస్థ వుూసివేసింది. ఎంఏ క్షేత్రంలోని 6 బావుల్లో రెండు కూడా ఇదే కారణంతో వుూతపడ్డారుు. కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తి 2010 వూర్చి నాటికి ఉత్పత్తి 69.43 ఎంసీఎండీల గరిష్ట స్థారుుకి చేరింది. -
ఫలితాలు, ద్రవ్యోల్బణంపై దృష్టి..
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లపై ఈ వారంలో అనేక అంశాలు ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ల రెండో త్రైమాసిక(క్యూ2) ఫలితాలు, ద్రవ్యోల్బణం గణాంకాలు, అమెరికాలో ప్రభుత్వ రుణ పరిమితి పెంపు వంటివన్నీ మన మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ వంటి బ్లూచిప్ దిగ్గజాల ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే ఉన్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్ కాస్త సానుకూల ఫలితాలతో మార్కెట్‌కు జోష్‌నిచ్చింది. దిగ్గజాల ఫలితాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారిస్తారని, దీంతో నిర్దిష్టంగా షేరువారీ కదలికలు మార్కెట్లో ఉండొచ్చని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ పేర్కొన్నారు. మరోపక్క ఈ వారంలో నాలుగు రోజులకే ట్రేడింగ్ పరిమితం కానుంది. బక్రీద్ సందర్భంగా ఈ నెల 17న (బుధవారం) స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. గత వారంలో 613 పాయింట్లు ఎగబాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 20,529 పాయింట్ల వద్ద స్థిరపడింది. ద్రవ్యోల్బణం డేటా... సెప్టెంబర్ నెలకు సంబంధించిన టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ), రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు ఈ వారంలోనే వెలువడనున్నాయి. ఈ నెల 29న ఆర్బీఐ రెండో త్రైమాసిక పరపతి విధాన సమీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం డేటా చాలా కీలకం కానుంది. ఆగస్టులో టోకు ధరల ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్టానికి(6.1%) ఎగబాకడం తెలిసిందే. ముఖ్యంగా ఉల్లిపాయలు, ఇతరత్రా నిత్యావసర సరుకుల ధరలు దూసుకెళ్లడమే దీనికి ప్రధాన కారణం. దీనిప్రభావంతో ఆర్బీఐ మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్ష(సెప్టెంబర్ 20న)లో వడ్డీరేట్లను(రెపో రేటు) అనూహ్యంగా పావు శాతం పెంచడం తెలిసిందే. రానున్న పాలసీ సమీక్షకూ ద్రవ్యోల్బణం గణాంకాలే ముఖ్యమని, ధరలను మరింత కట్టడిచేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం. డెట్ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు వెనక్కి... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీ డెట్ మార్కెట్ నుంచి నిధులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా షట్‌డౌన్ ఆందోళనలే దీనికి కారణంగా నిలుస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో ఇప్పటిదాకా నికరంగా రూ.7,800 కోట్లకుపైగా(1.2 బిలియన్ డాలర్లు) మొత్తాన్ని ఎఫ్ఐఐలు ఉపసంహరించుకున్నారు. అక్టోబర్ 1-11 మధ్య రూ.5,541 కోట్ల విలువైన డెట్ సెక్యూరిటీ(బాండ్)లను ఎఫ్ఐఐలు కొనుగోలు చేయగా... రూ.13,365 కోట్ల విలువైన బాండ్లను విక్రయించినట్లు సెబీ గణాంకాల్లో వెల్లడైంది. మరోపక్క స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.3,230 కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా కొనుగోలు చేశారు. రుణ పరిమితి టెన్షన్... అమెరికా ప్రభుత్వ రుణ పరిమితి పెంపునకు డెడ్‌లైన్ దగ్గరపడుతున్నకొద్దీ.. ప్రపంచ మార్కెట్లలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇప్పటికే ప్రతిపక్ష రిపబ్లికన్లు, ప్రభుత్వ పార్టీ డెమోక్రాట్లకు మధ్య పొరపొచ్చాల కారణంగా బడ్జెట్ బిల్లులు ఆమోదం పొందకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల మూసివేత(షట్‌డౌన్) కొనసాగుతుండటం తెలిసిందే. ఇప్పుడు రుణ పరిమితి పెంపునకు గడువు ఈ నెల 17తో ముగియనుంది. ప్రస్తుతం 16.7 లక్షల కోట్ల(ట్రిలియన్) డాలర్లుగా ఉన్న రుణ పరిమితిని పెంచడం అమెరికాకు తక్షణావసరం. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకొచ్చిన ఆరోగ్య బీమా పథకం(ఒబామాకేర్)పై గుర్రుగాఉన్న రిపబ్లికన్లు రుణపరిమితి పెంపు బిల్లుకు ఆమోదం పొందకుండా పావులు కదుపుతున్నారు. ఇదేగనుక జరిగితే అమెరికాకు తీవ్ర నిధుల కొరత తప్పదని, చెల్లింపుల్లో చేతులెత్తేసే పరిస్థితి(డీఫాల్ట్)కి దారితీస్తుందని ప్రపంచబ్యాంక్ కూడా ఇప్పటికే హెచ్చరిం చింది. రుణ పరిమితి పెంచకపోతే.. అమెరికా ట్రెజరీ విభాగం నిధుల కోసం మరిన్ని బాండ్లను జారీచేయడానికి అవకాశం ఉండదు. దీంతో చెల్లింపులను నిలిపేయడం లేదంటే వ్యయాల్లో కోతకు దారితీస్తుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, మార్కెట్లను కుదిపేసే అవకాశం ఉంది. గడువులోగా అమెరికా రుణ పరిమితి పెంపునకు డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య సయోధ్య కుదురుతుందా లేదా అనేదానిపై అటు విదేశీ, ఇటు దేశీ ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారించనున్నారు. బ్లూచిప్స్ ఫలితాల వారం.. కంపెనీ ఫలితాల తేదీ ఆర్ఐఎల్ 14న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15న టీసీఎస్ 15న బజాజ్ ఆటో 16న హెచ్‌సీఎల్ టెక్ 17న ఎల్అండ్టీ 18న -
రిలయన్స్‌పై రూ. 5 వేల కోట్ల వడ్డింపు!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)పై మరో భారీ జరిమానా వడ్డనకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. కేజీ-డీ6 క్షేత్రాల్లో ముందుగా చెప్పినదానికంటే 2012-13లో చాలా తక్కువ గ్యాస్‌ను ఉత్పత్తిచేసినందుకుగాను... 78.1 కోట్ల డాలర్ల(దాదాపు రూ.5 వేల కోట్లు) అదనపు జరిమానా విధించాలని నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయ మంత్రిత్వ శాఖ సలహా కోరినట్లు చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే గురువారం ఇక్కడ విలేకరులతో చెప్పారు. ‘2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో కూడా గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోయినందుకుగాను ఆర్ఐఎల్కు 100.5 కోట్ల డాలర్ల(సుమారు రూ.6,500 కోట్లు) జరిమానా విధిస్తూ చమురు శాఖ నోటీసు జారీచేసింది. అయితే, ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వం) చర్యలు చేపట్టడం జరిగాయి. తాజా కేసులో అదనపు జరిమానా విధించాలని డీజీహెచ్ జూలైలో చేసిన సూచనలపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న దానిపైనే న్యాయ సలహా కోరాం’ అని వివేక్ వెల్లడించారు. పాతాళానికి గ్యాస్ ఉత్పత్తి... కేజీ-డీ6లో 2012-13కు సంబంధించి రోజుకు 86.73 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ) గ్యాస్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. ఆర్ఐఎల్ సగటును 26.07 ఎంసీఎండీలను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఇందుకుగాను ఆర్ఐఎల్ వెచ్చించిన పెట్టుబడి వ్యయంలో 78.1 కోట్ల డాలర్లను రికవరీ చేసుకోనీయకుండా జరిమానాగా విధించాలనేది డీజీహెచ్ వాదన. అయితే, ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి ఘోరంగా పడిపోయి 14 ఎంసీఎండీలకే పరిమితమవుతోంది. కంపెనీ ముందస్తు ప్రణాళికలో చెప్పినవిధంగా తగినన్ని గ్యాస్ బావులు తవ్వకపోవడం వల్లే ఉత్పత్తి దిగజారిందని డీజీహెచ్ చాన్నాళ్లుగా చెబుతోంది. క్యాబినెట్ ముందుకు వివాదం.... కేజీడీ6లోని డీ1,డీ3 క్షేత్రాల్లో రిలయన్స్ ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు వివాదం కేంద్ర క్యాబినెట్ ముందుకు రానుంది. ఉత్పత్తి తగ్గినందుకు కారణాలు తేలే వరకూ అధిక రేటునివ్వరాదంటున్న చమురు శాఖ.. ఈ విషయాన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లనుంది. ఈ క్షేత్రాల్లో గ్యాస్‌కి కొత్త రేటు వర్తింపచేయడానికి ముందుగా సాంకేతికపరమైన అంశాలు పరిష్కారం కావాల్సి ఉందని వివేక్ తెలిపారు. నిల్వలు నిజంగానే అంచనా వేసిన దానికన్నా తక్కువగా ఉన్నాయా లేక ఎక్కువ బావులు తవ్వకపోవడం వల్లే ఉత్పత్తి తగ్గిందా అన్నది డీజీహెచ్ సారథ్యంలోని మేనేజ్మెంట్ కమిటీ పరిశీలిస్తుందన్నారు. అవసరమైతే అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయాలూ తీసుకుంటామని చెప్పారు. -
కోర్టుకు హాజరైన టీనా అంబానీ
న్యూఢిల్లీ : సంచలనాత్మకమైన 2జి టెలికాం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబాని సతీమణి టీనా అంబానీ శుక్రవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు వచ్చారు. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ సైనీ నేతృత్వంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్షిగా ఆమె కోర్టుకు హాజరయ్యారు. జూలై 19న అనిల్, టీనాలకు కోర్టు నుంచి సమన్లు జారీ కాగా, ఈ కేసు విచారణ నిమిత్తం సాక్షిగా అనిల్ అంబాని నిన్న కోర్టుకు హాజరయ్యారు. అసలు స్వాన్ టెలికం కంపెనీ అనేది ఒకటుందని గానీ, దాని గురించి గానీ తనకు ఏమీ తెలియదని అనిల్ అంబానీ కోర్టుకు తెలిపారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు వచ్చిన విషయం తెలిసిందే. 2008 సంవత్సరంలో టెలికం స్పెక్ట్రం పొందిన స్వాన్ టెలికం కంపెనీ గురించి తెలుసా అని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించినప్పుడు ఆయనీ పైవిధంగా సమాధానం ఇచ్చారు.