ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ముకేష్ అంబానీ నిన్నటి ప్రకటనతో రిలయన్స్ ఇండస్ట్రీస్ 8 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేయడం మార్కెట్లకు బలాన్నిచ్చింది. దీంతో ఒకదశలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా జంప్ చేసింది. చివరికి103 పాయింట్లు ఎగిసి 28,865 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు బలపడి 8,927 వద్ద ముగిసింది.
ఒకవైపు ఐటీ పతనం దిశగాపోతుండగా రిలయన్స్ మాత్రం దూసుకుపోయింది. ఇదే బాటలో ఐడియా, భారతి ఎయిర్ టెల్ కూడా సాగడం విశేషం. ఒక మిగతా రంగాలకువస్తే.. మెటల్, ఫార్మా బలహీనంగా ముగిశాయి. ఆర్‌ఐఎల్ 11 శాతం లాభాలతో టాప్ విన్నర్ గా నిలిచింది. ఐడియా యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, ఇన్‌ఫ్రాటెల్ లాభాల్లో, భారతి ఎలక్ట్రానిక్స్ కాస్ట్రోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, అంబుజా సిమెంట్, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, ఏసీసీ, అరబిందో నష్టాల్లో ముగిశాయి. కాగా ఫిబ్రవరి ఎఫ్ అండ్ ఓ సిరీస్ రేపటితో ముగియనుంది.
డాలర్ మారకంలో రూపాయి 0.05పైసల నష్టంతో రూ.66.98 వద్ద ఉంది.