ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మిడ్ సెషన్ నుంచీ ఊపందుకున్న కొనుగోళ్లతో దేశీ స్టాక్ మార్కెట్లు ఐదు నెలల గరిష్టాన్ని నమోదుచేశాయి. సెన్సెక్స్193 పాయింట్లు లాభంతో 28,661 వద్ద నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 8,879 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ట్రేడింగ్ చివర్లో సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ బైబ్యాక్ వివరాలు వెల్లడికావడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. ఒక దశలో టీసీఎస్ షేరు 5 శాతంపైగా ఎగసింది. ఇదే జోరు మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కూడా కొనసాగింది.
ఐటీ మెటల్, రియల్టీ కౌంటర్లు లాభాల్లో ముగిశాయి. ఇతర బ్లూచిప్ షేర్లలో టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ . గెయిల్, బీపీసీఎల్, ఐడియా, బీవోబీ, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. అయితే యాక్సిస్ దాదాపు 2 శాతం క్షీణించింది. బాష్, టెక్ మహీంద్రా, యస్‌బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, ఏసీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌ఎం, హిందాల్కో నష్టాలు మార్కెట్ల భారీ లాభాలను అడ్డుకున్నాయి.మార్క్ సాన్స్ ఫార్మా , డీసీబీ బ్యాంక్, పుంజ్ లాయిడ్ లిమిటెడ్ , డెల్టా కార్ప్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ టాప్ విన్నర్స్‌గా, ఏఐఏ ఇంజినీరింగ్, హ్యావెల్స్ ఇండియా , కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇండియా బుల్స్ రియలెస్టేట్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
అటు డారల్ తో పోలిస్తే రూపాయి 0.05 పైసలు నష్టంతో రూ.66.97 వద్ద, పుత్తడి పది గ్రా. ఎంసీఎక్స్ మార్కెట్‌లో రూ.98 నష్టంతో రూ.29,262 వద్ద ఉంది.