దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్65 పాయింట్ల లాభంతో 28,393 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు ఎగిసి 8804 వద్ద కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం రంగ బ్యాంకు షేర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. మెటల్, ఐటీ సెక్టార్ పాజిటివ్, ఆయిల్ అండ్ గ్యాస్ నెగిటివ్‌గా ఉన్నాయి. ఎస్‌బీఐ, గ్రాసిం, టెక్ మహీంద్రా టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. ఐసీఐసీఐ, యాక్సిస్ , ఇందస్ ఇండ్, కోటక్ మహీంద్ర ఫెడరల్ బ్యాంక్, టాటా స్టీల్, గ్లెన్ మార్క్ లాభాల్లో ఉన్నాయి. బీపీసీఎల్, అరబిందో, జీ ఎంటర్ టైన్ మెంట్, బాష్, గెయిల్ నష్టాల్లో ఉన్నాయి.
అటు గురువారం నాటి క్లోజింగ్ తో పోలిస్తే రూపాయి లాభాలతో ఆరంభమైంది. నాలుగు పైసల లాభంతో రూ. 66.81 వద్ద ఉంది.