బ్యాంకుల హవా, దలాల్ స్ట్రీట్‌లో రికార్డులు
Published Thu, Jul 6 2017 4:51 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. రికార్డు స్థాయిలవైపు దూసుకెళ్లిన మార్కెట్లు చివర్లో వెనక్కి తగ్గాయి. ఆఖరు గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్ నిఫ్టీ పాయింట్ల లాభాలకు పరిమితమయ్యాయి. ప్రభుత్వ , ప్రయివేట్ బ్యాంక్ సెక్టార్ హవా, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఆటో రంగాల్లో కొనుగోళ్లతో మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరాయి. నిఫ్టీ 9,700 పాయింట్ల మైలురాయిని అధిగమించి చరిత్రాత్మక గరిష్టం 9,709ని నమోదు చేసింది. చివరకు సెన్సెక్స్ 124 పాయింట్లు పెరిగి 31,369 వద్ద నిఫ్టీ 37 పాయింట్లు ఎగిసి 9,674 వద్ద ముగిసింది.
ఐటీసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐబీ హౌసింగ్, కోల్ ఇండియా, మారుతీ, ఎయిర్‌టెల్, అంబుజా, ఏసీసీ, టాటా మోటార్స్ లాభపడగా హిందాల్కో, ఎంఅండ్‌ఎం, సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, ఐవోసీ,గెయిల్, సిప్లా, ఓఎన్‌జీసీ నష్టపోయాయి. ముఖ్యంగా చివర్లో ఐషర్ మోటార్స్,ఇన్ఫోసిస్ అమ్మకాలు వెల్లువెత్తాయి. విప్రో నష్టాల్లో ముగియగా టీసీఎస్ బాగా లాభపడింది.
అటు డాలర్ మారకంలో రుపాయి 0.03 నష్టపోయి రూ.64.77 వద్ద ఉంది. ఎంసీఎక్స్ లో పుత్తడి పది గ్రా. 18రూపాయలు లాభపడి, రూ.28, 125 వద్ద ఉంది.
Advertisement
Advertisement