ముంబై: దేశీయ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలున్నప్పటకీ ఆరంభంలోనే సెన్సెక్స్ లాభాల సెంచరీ సాధించి, డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. దీంతో సెన్సెక్స్ 29వేల మార్క్‌ను,నిఫ్టీ 8900 స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం 195 పాయింట్ల లాభంతో సెన్సెక్స్29,028 వద్ద,నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో8946 వద్ద స్థిరంగా ట్రేడ్‌అవుతున్నాయి. అయితే హెచ్1బీ వీసాలపై అమెరికా కొత్త బిల్లు ప్రతిపాదన నేపథ్యంలో ఐటీ కౌంటర్ మరోసారి నష్టాలు చవి చూస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. ఆటో, బ్యాంక్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌ఫ్రాటెల్, కోల్ ఇండియా, భారతీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, సిప్లా, టాటా మోటార్స్, హీరోమోటో, ఆర్‌ఐఎల్ లాభాల్లోనూ, , గ్రాసిమ్, జీ, హిందాల్కో, సన్ పార్మా, విప్రో, టెక్ నష్టాల్లో ఉన్నాయి.
మరోవైపు జాగరణ్ ప్రకాశన్ గ్రూప్ సంస్థ రేడియో సిటీ పబ్లిక్ ఇష్యూ నేడు మొదలుకానుంది. దీంతో ఇన్వెస్టర్లు జాగరణ్ కౌంటర్‌వైపు చూపు నిలిపే అవకాశమున్నట్లు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, నగదు విభాగంలో శుక్రవారం ఎఫ్‌ఐఐలు రూ. 1529 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్ రూ. 737 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.
అటు డాలర్ మారకంలో రూపాయి 0.05 పైసల నష్టంతో 66.76 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి విలువ 155 రూపాయలు కోల్పోయి రూ.29,015వద్ద ఉంది.