sensexn
-
మార్కెట్ల జోరు:10800కిపైన నిఫ్టీ
సాక్షి, ముంబై: వారం చివరలో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 290 పాయింట్లు ఎగిసి 35,535 వద్ద,నిఫ్టీ పాయింట్లు 9010,806 లాభపడి వద్ద స్థిరంగా ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ 10800స్థాయికిపైన ముగిసింది. ఒక దశలో 300 పాయింట్లకుపైగా పుంజుకుంది. ఆరంభంనుంచి ఉత్సాహంగాఉన్న సూచీలు ట్రేడింగ్ ఆఖరు గంటలో మరింత పుంజుకున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రయివేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ , ఐటీ, ఇతర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్ల ర్యాలీ మార్కెట్లకు ఊతమిచ్చాయి. టెలికాం, ఫార్మ సెక్టార్ భారీగా నష్టపోగా , రియల్టీ స్వల్పంగా నష్టపోయింది. రిలయన్స్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, జిందాల్ స్టీల్, హింద్ కాపర్, టాటా స్టీల్, వేదాంతా, సెయిల్, నాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్,ఐషర్ మోటార్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్ హెచ్‌సీఎల్ లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్, యూపీఎల్ లాంటి షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. అయితే జియో దెబ్బతో ఎయిర్టెల్, ఆర్‌కాం, ఐడియా, పీసీ జ్యుయలరీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అటు ఫారెక్స్ మార్కెట్లు రూపాయి నష్టాలనుంచి తేరుకుంది. డాలరు మారకంలో 0.04 పైసల లాభంతో 67.28 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి కూడా రూ.121 పుంజుకుని పది గ్రా. 31,486 వద్ద ఉంది. -
బ్యాంకుల హవా, దలాల్ స్ట్రీట్‌లో రికార్డులు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. రికార్డు స్థాయిలవైపు దూసుకెళ్లిన మార్కెట్లు చివర్లో వెనక్కి తగ్గాయి. ఆఖరు గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్ నిఫ్టీ పాయింట్ల లాభాలకు పరిమితమయ్యాయి. ప్రభుత్వ , ప్రయివేట్ బ్యాంక్ సెక్టార్ హవా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో రంగాల్లో కొనుగోళ్లతో మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరాయి. నిఫ్టీ 9,700 పాయింట్ల మైలురాయిని అధిగమించి చరిత్రాత్మక గరిష్టం 9,709ని నమోదు చేసింది. చివరకు సెన్సెక్స్ 124 పాయింట్లు పెరిగి 31,369 వద్ద నిఫ్టీ 37 పాయింట్లు ఎగిసి 9,674 వద్ద ముగిసింది. ఐటీసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐబీ హౌసింగ్, కోల్ ఇండియా, మారుతీ, ఎయిర్టెల్, అంబుజా, ఏసీసీ, టాటా మోటార్స్ లాభపడగా హిందాల్కో, ఎంఅండ్ఎం, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, ఐవోసీ,గెయిల్, సిప్లా, ఓఎన్జీసీ నష్టపోయాయి. ముఖ్యంగా చివర్లో ఐషర్ మోటార్స్,ఇన్ఫోసిస్ అమ్మకాలు వెల్లువెత్తాయి. విప్రో నష్టాల్లో ముగియగా టీసీఎస్ బాగా లాభపడింది. అటు డాలర్ మారకంలో రుపాయి 0.03 నష్టపోయి రూ.64.77 వద్ద ఉంది. ఎంసీఎక్స్ లో పుత్తడి పది గ్రా. 18రూపాయలు లాభపడి, రూ.28, 125 వద్ద ఉంది. -
నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా సెన్సెక్స్, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిల వద్ద గట్టి రెసిస్టెంట్‌ను ఫేస్ చేస్తున్నాయి. సెన్సెక్స్ 90 పాయింట్ల నష్టంతో 29,939 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 9309 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 30వేలకు, నిఫ్టీ 9350 స్థాయికి కిందికి పతనమై 9300 గట్టి పరీక్షనుఎదుర్కొంటోంది. ముఖ్యంగా పీఎస్య బ్యాంక్స్ , ఫార్మా లాభాల్లోనూ మెటల్ సెక్టార్లు నష్టపోతున్నాయి. గ్రాసిమ్, బీవోబీ, మారుతీ, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, మారుతి, హీరో మోటార్ లుపిన్, సన్‌ఫార్మా లాభపడుతున్నాయి. రిలయన్స్, వేదాంత బయోకాన్ భారీగాను, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, అంబుజా, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, ఎంఅండ్ఎం, టీసీఎస్ స్వల్పంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల బాగా లాభపడిన ఇండియా బుల్స్, ఐటీసీలలో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. మరోవైపు మే డెరివేటివ్స్ సిరీస్ నేటితో ప్రారంభం. -
30వేలు తాకిన సెన్సెక్స్ ..వెంటనే నష్టాల్లోకి
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 30,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. అయితే వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 50పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్ తర్వాత కొద్దిగా గా పుంజుకుంది. సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టంతో 29,871వద్ద నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 9234 వద్ద కొనసాగుతున్నాయి. సిమెంట్, బ్యాకింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఐటీ, ఫార్మా పాజిటివ్‌గా ఉన్నాయి. ఆర్ఐఎల్, గ్రాసిం, టాటా పవర్, ఐడియా, డిష్టీవీచ, టైర్ల షేర్లు లాభపడుతుండగా, భారతి ఎయిర్టెల్, హెచ్‌పీసీఎల్ నష్టపోతోంది. ఆర్బీఐ పాలసీ, నాలగవ త్రైమాసిక ఫలితాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్టు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అటు డాలర్ మారకంలో రూపాయి 0.29 పైసల నష్టపోయి రూ. 65.14 వద్ద ఉంది. పుత్తడి ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. 158 లాభంతో రూ. 28,860 వద్ద ఉంది. -
స్వల్ప నష్టాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో మొదలైనాయి. సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టంతో 29,594 వద్ద, నిఫ్టీ11 పాయింట్ల నష్టంతో 9,162 వద్ద కొనసాగుతున్నాయి. ఏప్రిల్ డెరివేటివ్ సిరీస్ ప్రారంభం రోజు మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు నెగిటివ్‌గా, మెటల్, ఫార్మా పాజిటివ్‌గా ఉన్నాయి.అయితే నిఫ్టీ 9,150కిపైన స్థిరంగా ఉంది. ముఖ్యంగా వరసగా లాభపడిన బ్యాంక్ నిఫ్టీలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, విప్రో భారీ లూజర్స్‌గా నిలుస్తుండగా ఫెర్టిలైజర్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. టాటా స్టీల్, ఆర్ఐఎల్, యాక్సిస్, ఓన్జీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్ మారకంలో రుపీ 0.10పైసల లాభంతో 64.81 వద్ద వుంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. 173 కోల్పోయి రూ. 28,530 వద్ద ఉంది. -
జోరుగా సాగుతున్న మార్కెట్లు
ముంబై: దేశీయ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలున్నప్పటకీ ఆరంభంలోనే సెన్సెక్స్ లాభాల సెంచరీ సాధించి, డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. దీంతో సెన్సెక్స్ 29వేల మార్క్‌ను,నిఫ్టీ 8900 స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం 195 పాయింట్ల లాభంతో సెన్సెక్స్29,028 వద్ద,నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో8946 వద్ద స్థిరంగా ట్రేడ్అవుతున్నాయి. అయితే హెచ్1బీ వీసాలపై అమెరికా కొత్త బిల్లు ప్రతిపాదన నేపథ్యంలో ఐటీ కౌంటర్ మరోసారి నష్టాలు చవి చూస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. ఆటో, బ్యాంక్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, భారతీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, సిప్లా, టాటా మోటార్స్, హీరోమోటో, ఆర్ఐఎల్ లాభాల్లోనూ, , గ్రాసిమ్, జీ, హిందాల్కో, సన్ పార్మా, విప్రో, టెక్ నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు జాగరణ్ ప్రకాశన్ గ్రూప్ సంస్థ రేడియో సిటీ పబ్లిక్ ఇష్యూ నేడు మొదలుకానుంది. దీంతో ఇన్వెస్టర్లు జాగరణ్ కౌంటర్వైపు చూపు నిలిపే అవకాశమున్నట్లు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, నగదు విభాగంలో శుక్రవారం ఎఫ్ఐఐలు రూ. 1529 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్ రూ. 737 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 0.05 పైసల నష్టంతో 66.76 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి విలువ 155 రూపాయలు కోల్పోయి రూ.29,015వద్ద ఉంది. -
రిలయన్స్ మెరుపులు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ముకేష్ అంబానీ నిన్నటి ప్రకటనతో రిలయన్స్ ఇండస్ట్రీస్ 8 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేయడం మార్కెట్లకు బలాన్నిచ్చింది. దీంతో ఒకదశలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా జంప్ చేసింది. చివరికి103 పాయింట్లు ఎగిసి 28,865 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు బలపడి 8,927 వద్ద ముగిసింది. ఒకవైపు ఐటీ పతనం దిశగాపోతుండగా రిలయన్స్ మాత్రం దూసుకుపోయింది. ఇదే బాటలో ఐడియా, భారతి ఎయిర్ టెల్ కూడా సాగడం విశేషం. ఒక మిగతా రంగాలకువస్తే.. మెటల్, ఫార్మా బలహీనంగా ముగిశాయి. ఆర్ఐఎల్ 11 శాతం లాభాలతో టాప్ విన్నర్ గా నిలిచింది. ఐడియా యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, ఇన్ఫ్రాటెల్ లాభాల్లో, భారతి ఎలక్ట్రానిక్స్ కాస్ట్రోల్ ఇండియా, ఎన్టీపీసీ, అంబుజా సిమెంట్, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, ఏసీసీ, అరబిందో నష్టాల్లో ముగిశాయి. కాగా ఫిబ్రవరి ఎఫ్ అండ్ ఓ సిరీస్ రేపటితో ముగియనుంది. డాలర్ మారకంలో రూపాయి 0.05పైసల నష్టంతో రూ.66.98 వద్ద ఉంది. -
5 నెలల గరిష్టానికి మార్కెట్లు.నిఫ్టీ@8900
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్100 పాయింట్ల లాభంతో 28,761 వద్ద నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 8907 వద్ద ముగిసింది. ఆరంభంనుంచి స్తబ్దుగా ఉన్న మార్కెట్లలో మిడ్ సెషన్ నుంచీ కొనుగోళ్లు జోరందుకున్నాయి. దీంతో నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 8,900ను అధిగమించింది. అలాగే మరోసారి 5 నెలల గరిష్తాన్ని మార్కెట్లు తాకాయి. అలాగే 2016 సెప్టెంబర్ 9 తరువాత మళ్లీ 8,900 స్థాయిని నమోదు చేయడం విశేషం. ఫిబ్రవరి డెరివేటివ్స్ గురువారం ముగియనున్నప్పటికీ ట్రేడర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. నిఫ్టీ 8.950 స్థాయిలలో కొంత నిరోధకతను కలిగి ఉందని పేర్కొన్నారు. నిఫ్టీ బ్యాంక్ , మెటల్, రియల్టీ రంగాలు పాజిటివ్‌గా ముగిశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ రికార్డ్ హైని తాకాయి. అరబిందో, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్ , జెట్ ఎయిర్ వేస్ లాభపడగా, ఇన్ఫ్రాటెల్ 4 శాతం పతనమైంది. మిగిలిన బ్లూచిప్స్‌లో భారతీ, టీసీఎస్, ఐటీసీ, సన్ ఫార్మా నష్టపోయాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో ప్రకటనతో ముఖ్యంగా ఏప్రిల్ నుంచి సభ్యులకు టారిఫ్ ప్లాన్స్‌పై రాయితీ ప్రకటించించడంతో టెలికాం స్టాక్స్ ఒక శాతం డౌన్ అయ్యాయి. ఐడియా సెల్యులార్ క్షీణించగా , భారతి ఎయిర్టెల్ టాప్ లూజర్‌గా నిలిచింది. ఇండెక్స్ హెవీవెయిట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా బైబ్యాక్ ఆఫర్ ప్రాంతంలో నిన్నర్యాలీ తర్వాత నేడు 1 శాతం పైగా పడిపోయింది. డాలర్ తోపోలిస్తే రూపాయి 0.10 పైసలు లాభపడి రూ.66.92వద్ద నిలవగా, పసిడి బలహీనత ఈ రోజు కూడా కొనసాగింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా.పుత్తడి రూ.154 నష్టపోయి రూ.29,149 వద్ద ఉంది. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మిడ్ సెషన్ నుంచీ ఊపందుకున్న కొనుగోళ్లతో దేశీ స్టాక్ మార్కెట్లు ఐదు నెలల గరిష్టాన్ని నమోదుచేశాయి. సెన్సెక్స్193 పాయింట్లు లాభంతో 28,661 వద్ద నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 8,879 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ట్రేడింగ్ చివర్లో సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ బైబ్యాక్ వివరాలు వెల్లడికావడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. ఒక దశలో టీసీఎస్ షేరు 5 శాతంపైగా ఎగసింది. ఇదే జోరు మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కూడా కొనసాగింది. ఐటీ మెటల్, రియల్టీ కౌంటర్లు లాభాల్లో ముగిశాయి. ఇతర బ్లూచిప్ షేర్లలో టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ . గెయిల్, బీపీసీఎల్, ఐడియా, బీవోబీ, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. అయితే యాక్సిస్ దాదాపు 2 శాతం క్షీణించింది. బాష్, టెక్ మహీంద్రా, యస్‌బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, ఏసీసీ, హెచ్డీఎఫ్సీ, ఎంఅండ్ఎం, హిందాల్కో నష్టాలు మార్కెట్ల భారీ లాభాలను అడ్డుకున్నాయి.మార్క్ సాన్స్ ఫార్మా , డీసీబీ బ్యాంక్, పుంజ్ లాయిడ్ లిమిటెడ్ , డెల్టా కార్ప్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ టాప్ విన్నర్స్‌గా, ఏఐఏ ఇంజినీరింగ్, హ్యావెల్స్ ఇండియా , కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇండియా బుల్స్ రియలెస్టేట్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. అటు డారల్ తో పోలిస్తే రూపాయి 0.05 పైసలు నష్టంతో రూ.66.97 వద్ద, పుత్తడి పది గ్రా. ఎంసీఎక్స్ మార్కెట్లో రూ.98 నష్టంతో రూ.29,262 వద్ద ఉంది. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. రోజు మొత్తం ఊగిసలాటలో సాగిన మార్కెట్లు చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్లు పెరిగి 28,352 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 8,805 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సెక్టార్ డీలీ పడగా ప్రయివేట్ బ్యాంకింగ్ షేర్లు లాభాలనార్జించడం విశేషంగా నిలిచింది. రియల్టీ కూడా నష్టాల్లోనే ముగిసింది. ఐటీ లాభపడింది. క్యూ3 ఫలితాల నేపథ్యంలో దాదాపు 11 శాతం నష్టపోయి బీవోబీ, ఐడియా 2.5 శాతం క్షీణించి టాప్ లూజర్‌గా నిలిచింది. అరబిందో, భెల్, స్టేట్‌బ్యాంక్, మారుతీ, బాష్, హీరోమోటో, లుపిన్, ఐటీసీ నష్టాల్లో ఐషర్, యస్‌బ్యాంక్, టాటా పవర్, కొటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, జీ, హిందాల్కో, హెచ్‌యూఎల్ లాభాల్లో ముగిశాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలహీనపడి రూ.67.01 వద్ద ఉంది. బంగారం ఎంసీఎక్స్ మార్కెట్ లో స్వల్పంగా నష్టపోయింది. పది గ్రా. రూ. 29,149 వద్ద కొనసాగుతోంది. -
లాభాల్లో మొదలైన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్65 పాయింట్ల లాభంతో 28,393 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు ఎగిసి 8804 వద్ద కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం రంగ బ్యాంకు షేర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. మెటల్, ఐటీ సెక్టార్ పాజిటివ్, ఆయిల్ అండ్ గ్యాస్ నెగిటివ్‌గా ఉన్నాయి. ఎస్బీఐ, గ్రాసిం, టెక్ మహీంద్రా టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. ఐసీఐసీఐ, యాక్సిస్ , ఇందస్ ఇండ్, కోటక్ మహీంద్ర ఫెడరల్ బ్యాంక్, టాటా స్టీల్, గ్లెన్ మార్క్ లాభాల్లో ఉన్నాయి. బీపీసీఎల్, అరబిందో, జీ ఎంటర్ టైన్ మెంట్, బాష్, గెయిల్ నష్టాల్లో ఉన్నాయి. అటు గురువారం నాటి క్లోజింగ్ తో పోలిస్తే రూపాయి లాభాలతో ఆరంభమైంది. నాలుగు పైసల లాభంతో రూ. 66.81 వద్ద ఉంది. -
ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. వరుసగా గత మూడురోజులుగా లాభాల్లో ముగిసిన మార్కెట్లు శుక్రవారం లాభాలకు బ్రేక్ వేశాయి. ఆరంభంలో పాజిటివ్ గా ఉన్నప్పటికీ ప్రాఫిట్ బుకింగ్ కారణం సెన్సెక్స్ 9 పాయింట్ల నష్టంతో 27,238 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 8,400 వద్ద స్థిరంగా ముగిశాయి. ముఖ్యంగా ఐటీ రంగ నష్టాలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసినప్పటికీ టీసీఎస్, ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి. ఎన్టిపిసి, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టపోగా, యాక్సిస్ బ్యాంక్, ఐటిసి, గెయిల్, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా అధిక లాభాలు ఆర్జించాయి అటు డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 0.10పైసల నష్టంతో రూ. 68.19 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడిస్వల్ప నష్టాలతో పది గ్రా. రూ. 28,390 వద్ద ఉంది. -
స్వల్ప లాభాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో ఫ్లాట్ గా అరంభమైన మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 26,679 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 8,206 వద్ద ట్రేడ్ అవుతనున్నాయి. ప్రధానంగా టెలికాం కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఆటో లాభాల్లో టాటా మోటార్స్ టాప్ విన్నర్ గా ఉంది. ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి, కోల్ ఇండియా పవర్ గ్రిడ్ లాభాల్లో, హెచ్ యూఎలె, ఐటిసి నష్టాల్లో ఉన్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ టెహ్ అగ్ర స్థానంలో నిలిచింది. అటుడాలర్ మారకపు విలువలో మంగళవారం రూపాయి భారీగా నష్టాలతో ముగిసింది. రూ.68 దిగువకు పడిపోయి రూ.68.22 వద్ద ముగిసింది. అయితే బుధవారం రూపాయి 12 పైసలు లాభంతో ఉంది. -
నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ఆరంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో నామమాత్ర లాభాలతో మొదలైనా అంతలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 71 పాయింట్లు పతనమై 26,524 , నిఫ్టీ 17 పాయింట్లు క్షీణించి 8,163 వద్ద ట్రేడవుతోంది. భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోకి నష్టాలను మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ లూజర్స్ గా ఉన్నాయి. శాతం నష్టపోయాయి. నిఫ్టీ 0.6-1.4 శాతం క్షీణించింది. లెండింగ్ రేట్ల కోత దెబ్బతో బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బిఐ ఒకొక్కటీ 0.65-1.4 శాతం నష్టపోతుండగా. ఎన్ఎస్ఇ బ్యాంకింగ్ ఇండెక్స్ నిఫ్టీ బ్యాంక్ 0.67 శాతం పతనమైంది. ఎఫ్ఎంసీజీ, ఐటీ 0.5-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి అటు డాలర్ తో పోలిస్తే రూపాయి నష్టాల్లో ఉంది. 13 పైసలు నష్టపోయి రూ. 68.13 దగ్గర ఉంది. సోమవారం నాటా ముగింపు. రూ.68.22 . బంగారం ధరలు మాత్రం కొత్త సంవత్సరంలో పుంజుకున్నాయి. ఎంసీఎక్స్ బంగారం ధరలు. రూ.123లు ఎగిసి రూ. పది గ్రా. రూ.27,568 వద్ద ఉంది. -
నష్టాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బలహీనంగా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 162 పాయింట్ల నష్టంతో 26397 వద్ద, నిఫ్టీ 56 నష్టంతో 8136వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో నిఫ్టీ కీలక మద్దతుస్తాయి 8150 కిందికి దిగజారింది. బ్యాంక్ నిప్టీ కూడా నష్టాలతోనే ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా ఐటీ ఎఫ్ ఎంసీజీ, ఆటో రంగం నష్టపోతోంది. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాల్లోఉన్నాయి. గురువారం నగదు విభాగంలో ఎఫ్ఐఐలు దాదాపు రూ. 403 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, దేశీ ఫండ్స్ మాత్రం యథావిధిగా రూ. 238 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి రెండు పైసల లాభంతో రూ. 68.37 వద్ద వద్ద ఉంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. ముఖ్యంగా ఆర్ బీఐ షాకుతో బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఆరంభంలో వంద పాయింట్లకు పైగా నస్టపోయిన సెన్సెక్స్ 50 పాయింట్లు క్షీణించి 26,265 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 8,099 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా బ్యాంకు షేర్లలో అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. బ్యాంకుల వద్ద జమవుతున్నభారీ డిపాజిట్లకు చెక్ పెట్టే బాటలో రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 3 శాతం పతనంకాగా, బ్యాంక్ నిఫ్టీ కూడా 1.7 శాతం క్షీణించింది. ఫార్మా, ఐటీ, మిడ్ క్యాప్ షేర్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతోంది. మరోవైపు బ్యాంకులపై ఒత్తిడి కొనసాగనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో దిగ్గజ బ్యాంకింగ్ షేర్లన్నీ 1నుంచి 3 శాతం నష్టాల్లో, సిప్లా, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, జీ లాభాల్లో ఉన్నాయి. అటు డాలర్ తోపోలిస్తే రూపాయి 12 పైసలు నష్టంతో రూ.68.59 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి పది గ్రా. రూ211 లాభంతో రూ. 28,801 వద్ద ఉంది. -
తీవ్ర ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల వరుస లాభాలతో మురిపించిన స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 25,952వద్ద, నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 7994వద్ద ట్రేడవుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 140, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా నష్టపోయాయి. మరోసారి మార్కెట్లు కీలక మద్దతుస్థాయిలకు దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 26000 నిఫ్టీ 8000 పాయింట్ల కిందికి దిగజారాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అ టు నేడు డెరివేటివ్ సిరీస్ ముగియనుండటంతో మదుపర్ల అప్రమత్తత కొనసాగుతోంది ఎక్కువగా లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపుతుండడటంతో లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లలో కూడా అమ్మకాల జోరు కొనసాగుతోంది. టాటా మెటార్స్, లుపిన్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బీఐ, ఐసిఐసీఐ, ఎల్ అండ్ టీ సన్ ఫార్మా, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఆర్ ఐ ఎల్ లాంటి దిగ్గజాలన్నీ కుప్పకూలుతున్నాయి. విదేశీ మదుపర్లు అమ్మకాలు 13 వేల కోట్లకు చేరాయి. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి రోజు రోజుకి మరింత క్షీణిస్తోంది. ఆరంభంలోనే 27 పైసల నష్టంతో రూ. 68.83 స్థాయికి దిగజారి 70 కి రికార్డ్ పతనం దిశగా పయనిస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి కూడా భారీ నష్టాలనే నమోదు చేస్తోందివ. పది గ్రా. పుత్తడి 327 రూపాయల నష్టంతో రూ. 28,812 వద్ద ఉంది. -
200 పాయింట్లకు పైగా కుప్పకూలిన మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, దేశీయ పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఆరంభంలోనే నెగిటివ్ గా ఉన్న మార్కెట్లు భారీగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో మరింత బలహీనపడ్డాయి. 200 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్28,000 పాయింట్ల మద్దతునుంచి, నిఫ్టీ 8650 స్తాయినుంచి దిగజారింది. సెన్సెక్స్ 27.877 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 8632వద్ద ట్రేడవుతోంది. అటు అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ గురువారంతో ముగియనున్న నేపథ్యం కూడా మదుపర్లు సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తోంది. దీంతో దాదాపు అన్ని రంగాలూ రెడ్ గానే ఉన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ, మెటల్స్ రంగాలు నష్టపోతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఫలితాలతో 6.2 శాతం పతనమైంది. ఏషియన్ ఫెయింట్స్, ఐసీఐసీఐ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్, అరబిందో, హెచ్డీఎఫ్సీ, విప్రో క్షీణించాయి. క్యూ2 ఫలితాలు అంచనాలతో భారతీ ఎయిర్ టెల్ లాభపడుతుండగా, హీరోమోటో, కొటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ ఇదే బాటలోఉన్నాయి. అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయి స్వల్ప లాభాలతో ఉంది. 0.01పైసల లాభంతో 66.82 వద్ద ఉంది. అయితే ఈ రోజు పసిడి జోరుగా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి 202 రూపాయల లాభంతో 29,965వద్ద ఉంది. -
స్పల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు వారాంతంలో స్వల్ప నష్టాలతో ముగిసాయి. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 53 పాయింట్లు క్షీణించి 28,077 వద్ద నిఫ్టీ 6 పాయింట్లు తగ్గి 8,693 వద్ద స్థిరపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టార్ లాభాల మద్దుతుతో నష్టాలనుంచి కోలుకున్నాయి. అలాగే ఐటీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీ స్వల్పంగా లాభపడ్డాయి. మెటల్స్ సూచీ నీరసించింది. సెప్టెంబర్ క్వార్టర్ లో లాభాలను ఆర్జింఇన రిలయన్స్ ఇండస్ట్రీస్ , 2.5శాతం నష్టాలతో ముగిసింది. యాక్సిస్, హెచ్ డీ ఎఫ్ సీ తీవ్ర అమ్మకాల ఒత్తడిని ఎదుర్కొన్నాయి. హిందాల్కో, అంబుజా, ఏసీసీ, సిప్లా, పవర్‌గ్రిడ్, గ్రాసిమ్, ఇన్ఫ్రాటెల్ నష్టపోగా, ఐడియా, టెక్‌మహీంద్రా, టాటా పవర్, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్, టీసీఎస్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లాభపడ్డాయి. అటు డాలర్ బలహీనత నేపథ్యంలో రూపాయి ఉదయం నష్టాలనుంచి కొద్దిగా కోలుకుంది. ప్రస్తుతతం 0.05 పైసల నష్టంతో 66.86 వద్ద ఉంది. కాగా పసిడి మరింత దిగి వస్తున్నట్టు కనిపిస్తోంది. పది గ్రా పుత్తడి ఎంసీఎక్స్ మార్కెట్ లో 33 రూపాయలు క్షీణించి రూ. 29,877 వద్ద ఉంది. -
కీలక మద్దతు స్థాయిలకు పైన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో సెన్సెక్స్ ప్రారంభంలోనే 100 పాయింట్లకు పైగా అధిగమించింది. ప్రస్తుతం205 పాయింట్ల లాభంతో 28,169 వద్ద నిఫ్టీ కూడా 53 పాయింట్ల లాభంతో 8,712దగ్గర ట్రేడవుతున్నాయి. దాదాపు అన్నిరంగాలూ లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ ,నిఫ్టీ రెండు మద్దతు స్థాయిలను అధిమించాయి. సెన్సెక్స్ 28,000 పాయింట్ల, 8,700 పైన స్థిరంగా ఉన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్స్, రియల్టీ, ఆటో రంగాలు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఫలితాలు ప్రకటించనున్న ఆర్ఐఎల్, ఎస్ బ్యాంక్, బయోకాన్, ఎల్ ఐసీ హౌసింగ్ షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. వీటితోపాటు ఐడియా, ఐసీఐసీఐ ఓఎన్జీసీ, ఇన్ఫ్రాటెల్, యస్‌బ్యాంక్ హెచ్‌సీఎల్ టెక్, భారతీ నష్టాలతోనూ ఉన్నాయి. అటు రూపాయి 0.05 పైసల నష్టంతో 66.73 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. 93 రూపాయలు బలపడి రూ.29,994 దగ్గర ఉంది. -
ప్రాఫిట్ బుకింగ్‌తో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. నిన్నటి సెషన్ లో 521 పాయింట్ల లాభంతోముగిసిన మార్కెట్లు ప్రారంభంలోనే అప్రమత్తతను సూచించాయి. దీంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఈ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 100 పాయింట్లకు పైగా క్షీణించిన సెన్సెక్స్ చివరికి 66 పాయింట్ల నష్టంతో 27,984 వద్ద కీలకమైన మద్దతు స్థాయి 28వేల పాయింట్ల మైలురాయి దిగువన స్థిరపడింది. నిఫ్టీ కూడా 19 పాయింట్ల నష్టంతో 87 వేలకు దిగువకు దిగజారి 8659 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో.రియల్టీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫార్మా, ఐటీ, మెటల్ సెక్టార్ లాభపడగా, ఎఫ్ఎంసీజీ నష్టపోయింది. దీంట్లో ఐటీసీ హెచ్‌యూఎల్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఐసీఐసీఐ, హీరో మోటో, హెచ్డీఎఫ్సీ క్షీణించగా, ఐడియా, భెల్, టాటా పవర్, విప్రో, లుపిన్, గెయల్, అదానీ పోర్ట్స్ పుంజుకున్నాయి. అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయి 6 పైసలు బలపడి 66.67 వద్ద ఉంది. మరోవైపు డాలర్ బలహీనత నేపథ్యంలో బులియన్ మార్కెట్టో బంగారం ధరలు బలపడ్డాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లోపదా గ్రా. పసిడి 134రూపాయల లాభంతో 29,920 వద్ద ఉంది. -
ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కట్లు ఫ్లాట్ గా ముశాయి. సెన్సెక్స్ 21 పాయింట్ల లాభంతో 28,082 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 8708 వద్ద క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ ఫ్లాట్ నోట్ తోనూ నిఫ్టీ దాని కీలకమైన మద్దతు స్థాయికి 8,700 కి పైన స్థిరంగా ముగిశాయి.ఆరంభం తరువాత 150 పాయింట్లకు పైగా పెరిగిన దలాల్ స్ట్రీల్ ఆయిల్ అండ్ గ్యాస్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియాల్టీ షేర్ల బలహీనత కారణంగా ఫ్లాట్ గా మారింది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు ప్రారంభ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు ఎనలిస్టులు భావించారు. అక్టోబర్ 13న క్వార్టర్2 ఫలితాలు ప్రారంభం కావడం కీలకమన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో భారతదేశం ఉక్కు దిగుమతులు 37.3 శాతం క్షీణించగా, ఎగుమతులు 35.6 పెరిగాయి. దీంతో మెటల్ సెక్టార్ కు భారీ డిమాండ్ ఏర్పడగా, టీసీఎస్,ఇన్ఫోసిస్ లలో కొనుగోళ్ల ధోరణి కనిపించింది. 3 శాతం లాభంతో టాటాస్టీల్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఏసీసీ, ఏషియన్ పెయింట్స్, సిప్లా, భారతీ ఇన్ ఫ్రాటెల్ , హిందాల్కో, ఇన్ఫోసిస్, అంబుజా సిమెంట్స్, లూపిన్ షేర్లు లాభపడ్డాయి. బరోడా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టిపిసి, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి, బీపీసీఎల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, లార్సన్ అండ్ టుబ్రో బ్యాంక్ తదితరాలు నష్టపోయాయి అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మరింత లాభపడింది. 13 పైసల లాభంతో 66.56 వద్దఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి 173 రూపాయల లాభంతో రూ.29,751 వద్ద ఉంది. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ చెప్పిన సెన్సెక్స్ 111 నష్టంతో, నిఫ్టీ 33 నష్టంతో ముగిశాయి. 8800 మద్దతు స్థాయి కిందికి దిగజారిన నిఫ్టీ8775 వద్ద ముగిసింది. ప్రధానంగా రియల్టీ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. డీఎల్ ఎఫ్, ఇండియా బుల్స్ , హెచ్ డీఎల్ సూచీలు పతన మయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో కొనుగోళ్ల ఒత్తిడి నెలకొంది. ఒన్ జీసీ, కాస్ర్టోల్ ఇండియా లాభపడగా, భారతి ఇన్ ఫ్రా టెల్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఎస్ బ్యాంక్, టాటా స్టీల్, హిందాల్కో, సిప్లా,మారుతి సుజుకి ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను ఆర్జించగా, భారతి ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. అటు డాలర్ తోపోలిస్తే రూపాయి విలువ మరింత బలహీన పడింది. 0.05 పైసల నష్టంతో 67.02 దగ్గరుంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పదిగ్రాముల పసిడి ధర 57 రూపాయల లాభంతో 30,960 వద్ద ఉంది. -
స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
ముంబై: ఆసియా మార్కెట్ల బలహీనతతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 72 పాయింట్ల నష్టంతో 28,561 దగ్గర, నిఫ్టీ 25 పాయింట్లు తగ్గి 8,781 వద్ద ట్రేడవుతోంది. అన్ని రంగాల సూచీలు స్తబ్దుగానే ఉన్నాయి. ప్రధానంగా రియల్టీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ సెక్టార్ లాభపడుతుండగా, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఐటీ రంగం నష్టాలను నమోదు చేస్తోంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. రాబోయే అమెరికా ఫెడ్, జపాన్ కేంద్ర బ్యాంక్ పాలసీ సమావేశాల నేపథ్యంలో మదుపర్లు వేచి చూసి ధోరణిని అవలంబిస్తున్నారని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అటు కరెన్సీమార్కెట్ లో 0.06 పైసల నష్టంతో 67.03 వద్ద ఉంది.ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రా. పుత్తడి 66 రూపాయల లాభంతో 30, 969 దగ్గర ఉంది.