ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 30,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. అయితే వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 50పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్ తర్వాత కొద్దిగా గా పుంజుకుంది. సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టంతో 29,871వద్ద నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 9234 వద్ద కొనసాగుతున్నాయి.
సిమెంట్, బ్యాకింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఐటీ, ఫార్మా పాజిటివ్‌గా ఉన్నాయి. ఆర్‌ఐఎల్, గ్రాసిం, టాటా పవర్, ఐడియా, డిష్‌టీవీచ, టైర్ల షేర్లు లాభపడుతుండగా, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌పీసీఎల్ నష్టపోతోంది. ఆర్‌బీఐ పాలసీ, నాలగవ త్రైమాసిక ఫలితాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్టు విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
అటు డాలర్ మారకంలో రూపాయి 0.29 పైసల నష్టపోయి రూ. 65.14 వద్ద ఉంది. పుత్తడి ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. 158 లాభంతో రూ. 28,860 వద్ద ఉంది.