ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో మొదలైనాయి. సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టంతో 29,594 వద్ద, నిఫ్టీ11 పాయింట్ల నష్టంతో 9,162 వద్ద కొనసాగుతున్నాయి. ఏప్రిల్ డెరివేటివ్ సిరీస్ ప్రారంభం రోజు మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాలు నెగిటివ్‌గా, మెటల్, ఫార్మా పాజిటివ్‌గా ఉన్నాయి.అయితే నిఫ్టీ 9,150కిపైన స్థిరంగా ఉంది.
ముఖ్యంగా వరసగా లాభపడిన బ్యాంక్ నిఫ్టీలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, విప్రో భారీ లూజర్స్‌గా నిలుస్తుండగా ఫెర్టిలైజర్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. టాటా స్టీల్, ఆర్‌ఐఎల్, యాక్సిస్, ఓన్‌జీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
అటు డాలర్ మారకంలో రుపీ 0.10పైసల లాభంతో 64.81 వద్ద వుంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. 173 కోల్పోయి రూ. 28,530 వద్ద ఉంది.