దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా సెన్సెక్స్, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిల వద్ద గట్టి రెసిస్టెంట్‌ను ఫేస్ చేస్తున్నాయి. సెన్సెక్స్ 90 పాయింట్ల నష్టంతో 29,939 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 9309 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 30వేలకు, నిఫ్టీ 9350 స్థాయికి కిందికి పతనమై 9300 గట్టి పరీక్షనుఎదుర్కొంటోంది. ముఖ్యంగా పీఎస్‌య బ్యాంక్స్ , ఫార్మా లాభాల్లోనూ మెటల్ సెక్టార్లు నష్టపోతున్నాయి. గ్రాసిమ్, బీవోబీ, మారుతీ, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, మారుతి, హీరో మోటార్ లుపిన్, సన్‌ఫార్మా లాభపడుతున్నాయి. రిలయన్స్, వేదాంత బయోకాన్ భారీగాను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, అంబుజా, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌ఎం, టీసీఎస్ స్వల్పంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల బాగా లాభపడిన ఇండియా బుల్స్, ఐటీసీలలో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది.
మరోవైపు మే డెరివేటివ్స్ సిరీస్ నేటితో ప్రారంభం.