నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు | Sensex Falls Nearly 100 Points, Banking Shares Extend Losses | Sakshi
Sakshi News home page

నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

Published Tue, Jan 3 2017 10:01 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

Sensex Falls Nearly 100 Points, Banking Shares Extend Losses

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ఆరంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో నామమాత్ర లాభాలతో మొదలైనా   అంతలోనే  నష్టాల్లోకి జారుకున్నాయి.  ఒక దశలో 100  పాయింట్లకు పైగా నష్టపోయిన  సెన్సెక్స్‌ 71 పాయింట్లు పతనమై 26,524 , నిఫ్టీ 17 పాయింట్లు క్షీణించి 8,163 వద్ద ట్రేడవుతోంది. భారీ అమ్మకాల  ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోకి నష్టాలను మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ లూజర్స్ గా  ఉన్నాయి. శాతం నష్టపోయాయి. నిఫ్టీ  0.6-1.4  శాతం క్షీణించింది. లెండింగ్ రేట్ల కోత దెబ్బతో బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బిఐ ఒకొక్కటీ 0.65-1.4 శాతం   నష్టపోతుండగా. ఎన్ఎస్ఇ బ్యాంకింగ్ ఇండెక్స్ నిఫ్టీ బ్యాంక్  0.67 శాతం పతనమైంది.   ఎఫ్‌ఎంసీజీ, ఐటీ 0.5-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి
అటు డాలర్ తో పోలిస్తే  రూపాయి నష్టాల్లో ఉంది. 13 పైసలు నష్టపోయి రూ. 68.13 దగ్గర ఉంది.  సోమవారం నాటా ముగింపు. రూ.68.22 . బంగారం ధరలు మాత్రం  కొత్త సంవత్సరంలో పుంజుకున్నాయి. ఎంసీఎక్స్ బంగారం ధరలు. రూ.123లు ఎగిసి రూ. పది గ్రా. రూ.27,568 వద్ద ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement