ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. ముఖ్యంగా ఆర్ బీఐ షాకుతో బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఆరంభంలో వంద పాయింట్లకు పైగా నస్టపోయిన సెన్సెక్స్ 50 పాయింట్లు క్షీణించి 26,265 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 8,099 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా బ్యాంకు షేర్లలో అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
బ్యాంకుల వద్ద జమవుతున్నభారీ డిపాజిట్లకు చెక్ పెట్టే బాటలో రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 3 శాతం పతనంకాగా, బ్యాంక్ నిఫ్టీ కూడా 1.7 శాతం క్షీణించింది. ఫార్మా, ఐటీ, మిడ్ క్యాప్ షేర్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతోంది. మరోవైపు బ్యాంకులపై ఒత్తిడి కొనసాగనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో దిగ్గజ బ్యాంకింగ్ షేర్లన్నీ 1నుంచి 3 శాతం నష్టాల్లో, సిప్లా, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, జీ లాభాల్లో ఉన్నాయి.
అటు డాలర్ తోపోలిస్తే రూపాయి 12 పైసలు నష్టంతో రూ.68.59 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి పది గ్రా. రూ211 లాభంతో రూ. 28,801 వద్ద ఉంది.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Published Mon, Nov 28 2016 10:10 AM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM
Advertisement
Advertisement