ముంబై: ఆర్‌బీఐ నుంచి కీలక వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత కొరవడంతో రేట్ల ఆధారిత రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఆటో, రియలీ్ట, కమోడిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బలహీన డిసెంబర్ క్వార్టర్ ఫలితాల నమోదుతో ఎఫ్‌ఎంసీజీ షేర్లూ డీలా పడ్డాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 724 పాయింట్లు నష్టపోయి 71,428 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 213 పాయింట్లు పతనమై 21,718 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఆర్‌బీఐ పాలసీ ప్రకటన వెల్లడి ఐటీ, ఇంధన షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 921 పాయింట్లు పతనమై 71,231 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు క్షీణించి 21,665 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి.
వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు డీలా
ఆర్‌బీఐ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత రాకపోవడంతో బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు నష్టాలు చివచూశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.50%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ 2% చొప్పున నష్టపోయాయి. ఆటో రంగ షేర్లూ నష్టాల బాటపట్టాయి.
ఐషర్ మోటార్స్ 3%, అపోలో టైర్స్ 2.50%, మారుతీ, ఎంఅండ్‌ఎం, సంవర్ధన మదర్సన్ షేర్లు 2%, టీవీఎస్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ షేర్లు 1%, ఎంఆర్‌ఎఫ్ 0.10% చొప్పున నష్టపోయాయి. బీఎస్‌ఈ ఆటో ఇండెక్స్ 1% పతనమైంది. అలాగే రియల్టీ రంగ షేర్లైన గోద్రేజ్ ప్రాపర్టీస్ 3.50%, శోభ, లోథా 3%, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 1% మేర నష్టపోయాయి. నిబంధనల అతిక్రమణ కారణంగానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ అధికారులు తెలపడంతో పేటీఎం షేరు 10% పతనమై రూ.447 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది.
Comments
Please login to add a commentAdd a comment