Realty
-
విశాలమైన ఇళ్ల కొనుగోలు.. టైర్–2 జోరు
కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ (Work form Home) నేటికీ కొనసాగుతుండటంతో ‘టైర్–2’ (tier 2 cities) ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపు తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబై లోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాల్లో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది.ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకంగా కానున్నాయని అంచనా వేసింది. -
జూబ్లీహిల్స్‌లో బంగ్లా.. రూ.40 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాలకు (luxury homes) ఆదరణ పెరిగింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రూ.80 కోట్ల ఖరీదైన రెండు బంగ్లాలు, ఒక్కోటి రూ.40 కోట్ల చొప్పున అమ్ముడుపోయాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 కోట్లకు పైగా విలువైన 59 అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు జరిగాయని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. వీటి విలువ రూ.4,754 కోట్లు. వీటిలో 53 అపార్ట్మెంట్లు కాగా.. 6 బంగ్లాలు ఉన్నాయి.2023లో సుమారు రూ.4,063 కోట్ల విలువైన 58 లగ్జరీ గృహాలు విక్రయించారు. మొత్తం అమ్మక విలువలో వార్షిక పెరుగుదల 17 శాతంగా ఉంది. 2024లో అమ్ముడైన అల్ట్రా లగ్జరీ గృహాలలో రూ.100 కోట్ల విలువైన యూనిట్లు 17 ఉన్నాయి. వీటి విలువ రూ.2,344 కోట్లు. గతేడాది 88 శాతం వాటాతో అత్యధికంగా ముంబైలో 52 అల్ట్రా లగ్జరీ యూనిట్లు సేల్ అయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో మూడు, బెంగళూరు, హైదరాబాద్‌లో రెండేసి గృహాలు అమ్ముడయ్యాయి.హెచ్ఎన్ఐ, ప్రవాసుల డిమాండ్ గత రెండేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 130 అల్ట్రా లగ్జరీ గృహాలు విక్రయమ్యాయి. వీటి విలువ రూ.9,987 కోట్లు. 2022లో రూ.1,170 కోట్ల విలువైన 13 యూనిట్లు అమ్ముడుపోయాయి. వీటిలో 10 అపార్ట్మెంట్లు కాగా మూడు బంగ్లాలు ఉన్నాయి. 2023లో రూ.4,063 కోట్ల విలువైన 58 యూనిట్లు అమ్ముడయ్యాయి.హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు వ్యక్తిగత వినియోగం, పెట్టుబడుల కోసం అల్ట్రా లగ్జరీ గృహాలను కొనుగోలు చేస్తున్నారు. ఇన్పుట్ వ్యయం పెరుగుదల, బలమైన కొనుగోలుదారుల డిమాండ్ కారణంగా మెట్రో నగరాలలో ఈ తరహా ఇళ్ల పెరుగుతున్నాయి. దీంతో గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఆల్ టైమ్ హై!
హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ (real estate) ఆల్ టైం హై స్థాయికి చేరుకుంది. గతేడాది నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు, ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్ల పెంపు, హైడ్రా దూకుడు ఇవేవీ భాగ్యనగరంలో స్థిరాస్తి రంగాన్ని కదిలించలేకపోయాయి. కొత్త ప్రభుత్వ విధానాలతో కొద్ది కాలం అస్థిరత ఏర్పడినా.. మార్కెట్ తిరిగి శరవేగంగా పుంజుకుంది. దీంతో హైదరాబాద్ రియల్టీలో పూర్వ వైభవం సంతరించుకుంది. నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించగా.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోఆర్థికవృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, కొనుగోలుదారుల అభిరుచిలో మార్పుల కారణంగా హైదరాబాద్‌లో గృహ విక్రయాలు పెరిగాయి. గతేడాది నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 36,974 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం సిటీలో అపార్ట్మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.5,974. ఏడాదిలో అపార్ట్మెంట్ల ధరలు 8 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయ్యింది. పశ్చిమ హైదరాబాదే.. హైటెక్ సిటీ, కోకాపేట, రాయదుర్గం, కూకట్పల్లి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాదే కస్టమర్ల చాయిస్‌గా ఉంది. ఎల్బీనగర్, కొంపల్లి ప్రాంతాల్లో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో వరుసగా 11, 10 శాతం మేర రేట్లు పెరిగాయి. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో 8 శాతం, కోకాపేటలో 8 శాతం, మణికొండలో 6, నాచారం, సైనిక్‌పురిలో 5 శాతం మేర ధరలు పెరిగాయి. ప్రస్తుతం నగరంలో అత్యధికంగా చ.అ.ధరలు బంజారాహిల్స్‌లో రూ.14,400–16,020 మధ్య ఉండగా.. జూబ్లీహిల్స్‌లో 13,400–14,034, కోకాపేటలో 10,045–12,500, మణికొండలో రూ.8,500–9,220 మధ్య ధరలు ఉన్నాయి.ఆఫీస్ అ‘ధర’హో.. 2024లో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. గతేడాది కొత్తగా 1.03 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ పూర్తి కాగా.. 1.56 కోట్ల చ.అ. స్పేస్ లావాదేవీలు జరిగాయి. కార్యాలయాల స్థలం లీజు, కొనుగోళ్లలో గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్(జీసీసీ) ఆధిపత్యాన్ని కొనసాగించాయి. గతేడాది జరిగిన ఆఫీసు స్పేస్ లావాదేవీల్లో జీసీసీ వాటా 49 శాతంగా ఉంది. 51 లక్షల చ.అ.ఆఫీస్ స్పేస్‌ను బహుళ జాతి కంపెనీలు జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. దేశీయ వ్యాపార సంస్థలు 24 లక్షల చ.అ.లు, ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ 18 లక్షల చ.అ.లు, 12 లక్షల చ.అడుగుల స్థలంలో థర్డ్ పార్టీ ఐటీ సంస్థల లావాదేవీలు ఉన్నాయి. నగరంలో ఆఫీస్ స్పేస్ ధర చ.అ.కు సగటున రూ.70గా ఉంది. ఏడాది కాలంలో ధరలు 7 శాతం మేర పెరిగాయి.దేశవ్యాప్తంగా ఇలా.. గతేడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 3,72,936 యూనిట్లు లాచింగ్ కాగా.. 3,50,612 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే లాంచింగ్స్‌లో 6 శాతం, విక్రయాల్లో 7 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఇంకా 4,95,839 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 నెలల సమయం పడుతుంది. ఇక, గతేడాది 7.19 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. 5.03 కోట్ల చ.అ. స్థలం కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 8 నగరాల్లో మొత్తం 97.3 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ స్టాక్ ఉంది. -
మొదట కొనేది ఇల్లే.. ఆ తర్వాతే పెళ్లి, ఫ్యూచర్
చదువు పూర్తయ్యిందా.. మంచి ఉద్యోగం, తర్వాత పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్ నాటికి ఓ సొంతిల్లు.. మన నాన్నల ఆలోచనలివే కదూ! కానీ, ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులూ మారాయి. చదువు కొనసాగుతుండగానే ఉద్యోగావకాశాలు నడిచొస్తున్నాయి. దీంతో యువత ముందుగా స్థిరమైన నివాసానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి, విదేశీ ప్రయాణాలు, ఫ్యూచర్ ఇతరత్రా వాటి కోసం ప్లానింగ్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోవిరివిగా రుణాల లభ్యత, బహుళ ఆదాయ మార్గాలు, మంచి ప్యాకేజీతో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు యువత ఆసక్తి చూపిస్తోంది. 2018లో గృహ కొనుగోలుదారుల్లో మిలీనియల్స్ (25–35 ఏళ్ల వయస్సు గలవారు) వాటా 28 శాతంగా ఉండగా.. గతేడాదికి 37 శాతానికి పెరిగింది. 2030 నాటికి 60 శాతానికి చేరుతుందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది.ఇటీవల కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి. గతంలో రిటైర్డ్, సీనియర్ సిటీజన్స్, సంపన్న వర్గాల గృహ కొనుగోళ్లు, పెట్టుబడులు ఉండేవి. కానీ, కొన్నేళ్లుగా మిలీనియల్స్, జెన్–జెడ్ కస్టమర్ల వాటా పెరిగింది. జీవితం ప్రారంభ దశలోనే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి కారు, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్‌లాగే ప్రాపర్టీకి నేటి యువత ప్రాధాన్యత ఇస్తోంది. అందుబాటులో టెక్నాలజీ.. మ్యాజిక్‌బ్రిక్స్.కామ్, హౌసింగ్.కామ్, 99 ఎకర్స్ వంటి రియల్ ఎస్టేట్ యాప్స్ యువ కొనుగోలుదారుల ప్రాపర్టీ శోధనను మరింత సులువు చేశాయి. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే భౌతికంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడం, పరిసర ప్రాంతాల వాకబు వంటివి పెద్ద ప్రయాస ఉండేది. కానీ, నేటి యువతరానికి అంత టైం లేదు. దుస్తులు, ఫుడ్ ఆర్డర్ చేసినంత సులువుగా ప్రాపర్టీ కొనుగోళ్లు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టు ప్రాపర్టీ సమీక్ష, రేటింగ్ యాప్స్, త్రీడీ వ్యూ, వర్చువల్ టూర్ వంటి సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. గృహ రుణాలకు పోటీ.. యువ గృహ కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం పోటీపడి హోమ్లోన్స్ అందిస్తున్నాయి. రుణాల మంజూరులో వేగం, తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. క్రౌడ్ ఫండింగ్, ప్రాపర్టీ షేరింగ్ వంటి పాక్షిక యాజమాన్య ప్లాట్‌ఫామ్‌లు పరిమిత మూలధనంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో భారీ ముందస్తు చెల్లింపులు అవసరం లేకుండానే నేటి యువ కస్టమర్లు లక్ష కంటే తక్కువ ప్రారంభ పెట్టుబడితో యువ ఇన్వెస్టర్లు ఖరీదైన, విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఐటీ హబ్‌లలో యువ పెట్టుబడులు.. బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లలో యువ ఐటీ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ మార్కెట్లో గణనీయమైన ప్రభావం చూపుతున్నారు. రూ.80 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర కలిగిన 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల కొనుగోళ్లలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంది. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్‌తో యువ ఉద్యోగులకు నిత్యం ఆఫీస్‌కు వెళ్లాలనే టెన్షన్ లేదు. దీంతో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు ఉండాలనుకోవడం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటే సిటీకి కాస్త దూరమైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ప్రధాన ప్రాంతంలో కొనుగోలు చేసే ధరతోనే శివార్లలో పెద్ద సైజు ఇళ్లు, వసతులను పొందవచ్చనేది వారి అభిప్రాయం. అయితే గ్రీనరీతో పాటు విద్యుత్, నీటి వినియోగాన్ని ఆదా చేసే ప్రాజెక్ట్‌లు, సౌర ఫలకాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పర్యావరణ అనుకూల ఫీచర్లు ఉండే ఇళ్లను కోరుకుంటున్నారు.పెరిగిన పట్టణ గృహ యజమానులు.. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్ విధానంతో యువ ఉద్యోగులు ఆఫీసులో కూర్చొని పనిచేసే అవసరం లేదు. వారు ఇప్పుడు తమ పనికి కాకుండా జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వారికి నచ్చిన ప్రాంతంలో నివసించే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, వినియోగదారుల అభిరుచులతో గృహ కొనుగోలుదారుల్లో మార్పులు వచ్చాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కీలకమైన వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 2020లో పట్టణ గృహ యజమానుల రేటు 65 శాతంగా ఉండగా.. 2025 నాటికి 72 శాతానికి పెరుగుతుందని జేఎల్ఎల్ అంచనా వేసింది. సరసమైన గృహ రుణాలు, నివాస సముదాయంలో యువ కొనుగోలుదారుల ప్రాధాన్యతే ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. -
హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!
డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్‌లో (hyderabad) అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) (residential real estate inventory) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. - సాక్షి, సిటీబ్యూరోఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. గతేడాది నాటికి గ్రేటర్లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది. గత రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం.దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: మెట్రో వెంట.. రియల్ ఎస్టేట్ బూమ్!2024లో కొత్త ఇళ్ల సరఫరా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గిందని అనరాక్ నివేదిక పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో అప్రూవల్స్‌లో జాప్యం కారణంగా హౌసింగ్ సప్లయి తగ్గిపోయినట్లు చెప్పినట్లు చొప్పుకొచ్చింది.2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రధాన నగరాల్లో దాదాపు 253 మిలియన్ చ.అ.మేర కొత్త ఇళ్ల సరఫరాను ప్రారంభించే ప్రణాళికలను టాప్ 11 లిస్టెడ్ డెవలపర్లు ఏడాది ప్రారంభంలో ప్రకటించారని అనరాక్ గుర్తు చేసింది. అయితే సార్వత్రిక, రాష్ట్రాల ఎన్నికల కారణంగా వీటిలో కేవలం 23% లేదా 57 మిలియన్ చ.అ.ల మేర ప్రాజెక్ట్‌లు మాత్రమే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభమయ్యాయి. -
మెట్రో వెంట.. సొంతింటి ప్రయాణం!
హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది మెట్రో, ఔటర్ ప్రాజెక్ట్‌లే.. మెట్రో రైలుతో ప్రధాన నగరంలో, ఓఆర్ఆర్తో శివారు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. దీంతో నగరంలో రియల్ బూమ్ ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం రెండో దశలో ఔటర్ రింగ్ రోడ్డు వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. దీంతో మెట్రో మార్గంలో చుట్టూ 10 కి.మీ. వరకూ స్థిరాస్తి అవకాశాలు మెరుగవుతాయి. ఇదే సమయంలో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తే నగరం నలువైపులా ప్రయాణం సులువవుతుంది. బడ్జెట్ గృహాల లభ్యత పెరిగి, ఐటీ ఉద్యోగ వర్గాల సొంతింటి కల సాకారమవుతుందని జనప్రియ అప్స్కేల్ ఎండీ క్రాంతి కిరణ్‌రెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రజల దైనందిన జీవితంలో ప్రజారవాణా అత్యంత కీలకం. దీంతో ప్రభుత్వం మెట్రోని పొడిగించాలని నిర్ణయించింది. వచ్చే 5–10 ఏళ్లలో దశలవారీగా మెట్రో 2.0 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియల్టీ మరింత దూరం విస్తరిస్తోంది. సాధారణంగా ప్రజలు మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు.ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఇళ్ల ధరలు రూ.కోటి దాటిపోయాయి. ఐటీ ఉద్యోగ వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. మెట్రోతో శివార్లకు రవాణా సౌకర్యం రావడంతో ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వీరంతా తమ బడ్జెట్లో నివాసాలు దొరికే తూర్పు హైదరాబాద్‌లో కొనుగోలు చేశారు.విదేశాల్లో ప్రైవేట్‌కే స్టేషన్ల బాధ్యత.. సింగపూర్, న్యూయార్క్ వంటి దేశాల్లో మాదిరిగా నగరంలోనూ భూగర్భ మెట్రో ఉంటే మేలు. విదేశాలలో భూగర్భ మెట్రో స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని స్థానికంగా హోటల్స్, మాల్స్ వంటి వాణిజ్య సముదాయాలకే అప్పగిస్తారు. స్టేషన్ నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు ఆయా వాణిజ్య సముదాయాలకు యాక్సెస్ ఉంటుంది. దీంతో యజమానులకు బిజినెస్ అవుతుంది. ప్రతిఫలంగా స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని వాణిజ్య యజమానులే భరిస్తారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు యజమానికి ఇద్దరికీ లాభమే.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..చిత్తడి, వదులుగా ఉండే నేలలో భూగర్భ మెట్రో కష్టమవుతుంది. కానీ, మనది రాతి భూభాగం. భూగర్భ మెట్రో లైన్ కోసం సొరంగం తవ్వడం కష్టమవుతుందేమో.. కానీ ఒకసారి తవ్వాక నియంత్రణ సులువు. రోడ్డు మార్గం ఎలా ఉంటుందో మెట్రో లైన్ కూడా అలాగే వేయాల్సి ఉంటుంది. పైగా వంకర్లు ఉండే మార్గంలో ఎక్కువ బోగీలతో మెట్రోను నడపడం కుదరదు. కానీ, భూగర్భ మెట్రోను ఏ నుంచి బీ పాయింట్‌కు సరళ రేఖ మాదిరిగా వేయవచ్చు. దీంతో మెట్రో రైలు వేగం పెరగడంతో పాటు ఎక్కువ బోగీలతో మెట్రో నడపొచ్చు.భవిష్యత్తు ఈ ప్రాంతాలదే.. ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల బహుళ జాతి సంస్థలే నగరానికి ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ, కొన్నేళ్లుగా తయారీ రంగంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఫాక్స్‌కాన్, టాటా ఎయిరోస్పేస్ వంటి సంస్థలు ఆదిభట్ల, శంషాబాద్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ అంతా వెస్ట్‌లోనే ఉంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కానీ, ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నివాస, వాణిజ్య భవనాలతో కిక్కిరిసిపోవడంతో ఈ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. కొంగరకలాన్, ఆదిభట్ల, శంషాబాద్, కొల్లూరు, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో మార్కెట్ ఊపందుకుంటుంది.హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఐటీలోనే కాదు రియల్ ఎస్టేట్‌లోనూ హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయి. రెండు నగరాలకు ఉన్న తేడా.. రోడ్ల వెడల్పు. బెంగళూరులో ఎయిర్‌పోర్టు రోడ్డు తప్ప అన్నీ దాదాపు 60 ఫీట్ల రోడ్లే.. కానీ, మన దగ్గర 100, 140 ఫీట్ల రోడ్లు కూడా ఉన్నాయి. నగరంలో అంత పెద్ద రోడ్లు ఎలా వచ్చాయి? రోడ్డు వెడల్పుగా ఉంటే అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) ఉంటుందని యజమానులు రోడ్ల కోసం భూములు ఇచ్చారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!దీంతో భారీ టౌన్‌షిప్‌లు, స్కై స్క్రాపర్లు వస్తున్నాయి. తాజాగా హైరైజ్ ప్రాజెక్ట్‌లతో ట్రాఫిక్ పెరుగుతోందని ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు పెట్టాలనే ప్రతిపాదనకు బదులుగా రోడ్లను ఇంకా వెడల్పు చేయడం ఉత్తమం. హైదరాబాద్ రియల్టీకి వరమైన జీవో–86 వల్లే దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సమర్థవంతమైన జీవోపై ఆంక్షలు పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. -
ఫైనాన్స్ కంపెనీ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌గా జస్టిస్ శ్రీకృష్ణ
డేటా షేరింగ్ ప్లాట్‌ఫాం ఈక్వల్, అలాగే ఆ సంస్థ పెట్టుబడులున్న అకౌంట్ అగ్రిగేటర్ వన్‌మనీ ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ(Justice B.N. Srikrishna) నియమితులయ్యారు. న్యాయశాస్త్ర, ఆర్థిక(Finance), టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆర్బీఐ మాజీ గవర్నర్లు జగదీష్ కపూర్, రాకేష్ మోహన్ .. యూఐడీఏఐ మాజీ చైర్మన్ జె సత్యనారాయణ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.డేటా షేరింగ్‌కి సంబంధించి భద్రత, నైతికతకు ప్రాధాన్యమిస్తూ అత్యున్నత ప్రమాణాలు పాటించడంలో ఇరు కంపెనీలకు ఈ బోర్డు మార్గనిర్దేశం చేస్తుంది. వ్యక్తుల హక్కులు, ఆకాంక్షలు, ఆర్థిక వృద్ధి తదితర అంశాల్లో సమతౌల్యత పాటించేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ తెలిపారు. రుణాలు, ఉద్యోగాలు(Jobs), ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మందికి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నామని ఈక్వల్ వ్యవస్థాపకుడు కేశవ్ రెడ్డి తెలిపారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధన దిశగా కృషి చేస్తున్నట్లు వన్‌మనీ వ్యవస్థాపకుడు కృష్ణ ప్రసాద్ చెప్పారు.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతబ్రిగేడ్ గ్రూప్ కొత్త ప్రాజెక్ట్రియల్టీ సంస్థ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కోకాపేటలో బ్రిగేడ్ గేట్‌వే పేరుతో 10 ఎకరాల విస్తీర్ణంలో హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకు రూ.4,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఈ ప్రాజెక్టులో లగ్జరీ గృహాలను 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, మైసూరు, చెన్నై, కొచ్చిలో కంపెనీ పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. -
ఆఫీసు స్థలాలకు డిమాండ్.. ఆల్‌టైమ్ హై!
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 2024లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ (office space) నూతన గరిష్టాలకు చేరింది. మొత్తం 719 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) పరిమాణంలో లీజు లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో స్థూల లీజింగ్‌తో పోల్చి చూసినప్పుడు 21 శాతం అధికం కాగా, కరోనా విపత్తుకు ముందు ఏడాది 2019 గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 19 శాతం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా (Knight Frank) విడుదల చేసింది. కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ కుదేలవగా ఆ తర్వాత నుంచి ఏటా పుంజుకుంటూ వస్తోంది. నగరాల వారీ లీజింగ్బెంగళూరులో స్థూల ఆఫీస్ లీజింగ్ ముందటి సంవత్సరంతో పోల్చితే 2024లో 45 శాతం వృద్ధితో 181 లక్షల ఎస్ఎఫ్టీకి చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 25% వృద్ధితో స్థూల లీజింగ్ 127 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.హైదరాబాద్‌లో డిమాండ్ 17 శాతం పెరిగి 103 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.ముంబై మార్కెట్లోనూ 40 శాతం వృద్ధి నమోదైంది. 104 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరిగాయి. పుణెలో 19 శాతం పెరిగి 80 లక్షల చదరపు అడుగులకు చేరింది. అహ్మదాబాద్‌లో 64 శాతం వృద్ధితో 30 లక్షల ఎస్ఎఫ్టీ స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. చెన్నై మార్కెట్లో 25 శాతం క్షీణించి 81 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. కోల్‌కతాలో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ స్వల్పంగా 14 లక్షల చదరపు అడుగులకు తగ్గింది.సానుకూలతలు ఎన్నో.. ఆఫీస్ స్పేస్ లీజింగ్ నూతన గరిష్టాలకు చేరడం వెనుక దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం, బలమైన దేశీ వినియోగం, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రాతినిధ్యం తదితర అంశాలను కారణాలుగా నైట్‌ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఆఫీస్ స్పేస్‌కు అసాధారణ డిమాండ్ ఉండడం దేశ, విదేశీ సంస్థల్లో వ్యాపార విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొంది. జీసీసీలు, ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ రంగాలు ఈ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తున్నట్టు తెలిపింది. -
ఇంటి విలువను పెంచే ల్యాండ్ స్కేపింగ్
గతంలో ప్రతి చిన్న అవసరానికి బయటకు వెళ్లేవారు. ఇంట్లో గడిపే సమయం తక్కువగా ఉండేది. కానీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అంతా ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. దీంతో ఇంట్లో గడిపే నాణ్యమైన సమయం పెరిగింది. ఇల్లు, పరిసర ప్రాంతాలు స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం ఉండాలని కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో నివాస సముదాయాల్లో (Residential) ల్యాండ్ స్కేపింగ్‌కు (landscaping) ఆదరణ పెరిగింది. - సాక్షి, సిటీబ్యూరోవేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్ (hyderabad) అర్బన్ జంగిల్‌గా మారిపోతోంది. దీంతో నివాసితులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్ స్కేపింగ్ అనివార్యమైపోయింది. కనుచూపు మేర పచ్చదనం, అది కూడా సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలని నేటి గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పురుగుమందులు, రసాయనాలతో గాలి, నేల కాలుష్యం అవుతోంది. దీంతో సేంద్రీయ, సస్టెయినబుల్ గార్డెనింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. వాక్ వే, టెర్రస్లలో.. సువాసన, ఆకర్షణీయమైన పూల మొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్ వే, డెక్‌లు, టెర్రస్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్‌లను చేపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్‌లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్‌తో బార్బిక్యూ వంటి ఔట్‌డోర్ ఈవెంట్లు, పార్టీలను చేసుకునేందుకు ఆహ్లాదకరమైన వేదికగా ఉంటుంది.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..విద్యుత్ బిల్లు ఆదా.. గ్లోబల్ ల్యాండ్ స్కేపింగ్ సర్వీస్ మార్కెట్ 2024లో 330.8 బిలియన్ డాలర్లుగా ఉందని, 2024 నుంచి 2030 నాటికి 6.7 శాతం వృద్ధి రేటు ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. వేసవి వచ్చిదంటే చాలు భానుడి ప్రతాపం 43 డిగ్రీలు దాటుతోంది. ఎండ, ఉక్కపోతతో ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఏసీ, కూలర్లు ఉన్నా కృత్రిమమే. దీంతో ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్‌లలో ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. సాధారణ ఇళ్లతో పోలిస్తే ల్యాండ్ స్కేపింగ్ గృహాల్లో విద్యుత్ బిల్లు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ఆదా అవుతుంది.ఇంటి విలువ 20 శాతం వృద్ధి.. ల్యాండ్ స్కేపింగ్‌తో ఇల్లు, పరిసర ప్రాంతాల రూపరేఖలు మారిపోతాయి. సహజ సౌందర్యం, ఆకర్షణీయంగా ఉంటుంది. అందమైన ల్యాండ్ స్కేపింగ్‌తో ఇంటి విలువ దాదాపు 20 శాతం వరకు పెరుగుతుంది. నిరంతరం గ్రీనరీ చూస్తుండటంతో మనిషిలో ఒత్తిడి తగ్గడంతో పాటు సృజనాత్మకత పెరుగుతుంది. ల్యాండ్ స్కేపింగ్‌తో పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం తగ్గుతుంది. అలాగే గడ్డి, పొదలతో కూడిన ల్యాండ్ స్కేపింగ్ మట్టిని బలంగా ఉండేలా చేస్తుంది. దీంతో వరదలు, వర్షం వంటి వాటితో భూమి కోతలను నివారిస్తుంది. అంతేకాకుండా సీతాకోకచిలుకలు, చిన్న పక్షలు వంటి స్థానికంగా జీవవైవిధ్యానికి ల్యాండ్ స్కేపింగ్ ఆసరాగా నిలుస్తుంది.క్లబ్ హౌస్‌లో కో–వర్కింగ్ ప్లేస్.. కరోనా తర్వాతి నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానం అలవాటయ్యింది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా ఇప్పటికీ కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్ ఆఫీస్ కోసం వినియోగిస్తే ఒప్పుకోవడం లేదు. ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వస్తే హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ ఇస్తే ఇష్టపడటం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!క్లబ్‌హౌస్‌లో ప్రత్యేకంగా కో–వర్కింగ్ స్పేస్ ఇస్తున్నారు. హై నెట్వర్క్ స్పీడ్‌తో వైఫై సేవలను అందిస్తున్నారు. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతరత్రా ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో ఆయా నివాస సముదాయంలో వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే నివాసితులందరూ ఒకే చోట పనిచేసుకునే వీలు కలుగుతుంది. దీంతో ఇంట్లో ఎలాంటి అంతరాయం కలగదు. పైగా అత్యవసర సమయంలో వెంటనే ఇంటికి చేరుకోవచ్చు. -
వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..
హైదరాబాద్ నగరంలో హైరైజ్ నిర్మాణాలు (High rise apartments)ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో పాతిక ఫ్లోర్ల భవనం అంటే.. వామ్మో అనుకునే పరిస్థితి. కానీ, ఇప్పుడు 50 అంతస్తులపైనే నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. స్కై స్క్రాపర్లలో (skyscrapers) నివాసం అనేది స్టేటస్ సింబల్‌గా మారిపోవడంతో ప్రవాసులు, ఎంటర్ప్రెన్యూర్లు, బ్యూరోక్రాట్ల అభిరుచి మేరకు డెవలపర్లు పోటాపోటీగా ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు.దీంతో పశ్చిమ హైదరాబాద్‌లో (hyderabad) తలెత్తి చూస్తే తప్ప అపార్ట్మెంట్ కనిపించని పరిస్థితి! దేశంలో హైరైజ్ ప్రాజెక్ట్‌లకు పెట్టింది పేరు ముంబై. ఇక్కడ భూమి లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. కానీ, హైదరాబాద్‌లో భూమి లభ్యత ఉన్నప్పటికీ అధిక ధరల కారణంగా డెవలపర్లు హైరైజ్ ప్రాజెక్ట్‌లను చేయక తప్పని పరిస్థితి. మరోవైపు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న ప్రాంతంలో నివాసం ఉండేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తుండటంతో ఎత్తయిన గృహ సముదాయాలు వెలుస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోవెస్ట్లోనే ఎక్కువ.. షేక్‌పేట, రాయదుర్గం, మదీనాగూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువగా హైరైజ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హెచ్ఎన్ఐలు సెకండ్ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌లో లగ్జరీ అపార్ట్మెంట్ ఉండాలని కోరుకుంటున్నారు. అధిక అద్దెలు, ఆస్తుల విలువల పెంపు కారణంగా పెట్టుబడిదారులు ఇలాంటి ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న పశ్చిమ హైదరాబాద్‌లోనే ఆకాశహర్మ్యాలు ఎక్కువగా వస్తున్నాయి. భవనం ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి హైరైజ్ ప్రాజెక్ట్‌లలో అపార్ట్మెంట్ల ధరలు ప్రీమియంగానే ఉంటాయి.బాల్కనీలోంచి సిటీ వ్యూ.. ప్రస్తుతం నగరంలో 200 మీటర్ల ఎత్తు అంటే 50 నుంచి 59 అంతస్తుల హైరైజ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్, ఎంటర్ప్రెన్యూర్లు, ఐటీ, ఫార్మా రంగాల్లోని ఉన్నతోద్యోగులు ఎక్కువగా ఆకాశహర్మ్యాలలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. హైరైజ్ ప్రాజెక్ట్‌ల ఎంపికకు మరో ప్రధాన కారణం సిటీ వ్యూ.. 200 మీటర్ల ఎత్తులోని ఫ్లాట్‌లోంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లోని నగరంలోని పరిసరాలను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా హైఎండ్ కుటుంబాలు, అభిరుచులు కలిగిన నివాసితులు ఒకే చోట ఉండటంతో వారి మధ్య సామాజిక బంధం మరింత బలపడుతుంది. జీవన నాణ్యత మెరుగవుతుంది.స్వచ్ఛమైన గాలి, వెలుతురుఅత్యంత ఎత్తులో ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలూ ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి అనువైన గృహాలివే. పైగా ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తాయి. ఈ ప్రాజెక్ట్‌లకు చేరువలోనే అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు, నిత్యావసరాలు అన్నీ లభ్యమవుతాయి. ఇంట్లో ఉన్నంత సేపు కుటుంబ, వృత్తి, కెరీర్ వంటి వ్యాపకాలపై ఫోకస్ చేయవచ్చు. వీటిల్లో క్లబ్ హౌస్‌తో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్‌లు, స్విమ్మింగ్ పూల్, జిమ్, డే కేర్ సెంటర్, మెడిటేషన్ హాల్స్, వెయిటింగ్ రూమ్స్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.మరింత మౌలిక వసతులు కల్పించాలి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు గృహాలను అందించాలంటే హైరైజ్ నిర్మాణాలే సరైనవి. కాకపోతే ప్రజల జీవన నాణ్యత మెరుగు పరిచేందుకు అవసరమైన రహదారులు, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి. – ప్రశాంత్‌రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్ -
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.12–14 వేల వరకు ఉంటోంది. మిగిలిన ప్రాంతాలన్నీ ఇప్పటికే బాగా రద్దీగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది బాలానగర్ వైపు చూస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఒకప్పుడు బాలానగర్ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే.ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్‌లో ఇంతకుముందు రాలేదు.లగ్జరీ నిర్మాణాలు షురూ.. ఇప్పుడిప్పుడే బాలానగర్ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.హైటెక్ సిటీకి బాలానగర్ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.బాలానగర్ వైపు.. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు కావాలంటే ఎంత లేదన్నా కనీసం రూ.6 నుంచి రూ.7 కోట్లకుపైగా పెట్టాలి. అదే బాలానగర్‌లో లగ్జరీ ఫ్లాటు అంటే దాదాపు 2 వేల చ.అ. విస్తీర్ణం ఉండే ఫ్లాటు అన్ని సౌకర్యాలతో కలిపి కూడా సుమారు రూ.కోటిన్నర– రెండు కోట్లలోపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఇంత తక్కువ ధరలో, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో దొరకడం దాదాపు ఇంకెక్కడా లేదు. కాబట్టి, ఐటీ జనాలు క్రమంగా ఇప్పుడు బాలానగర్ వైపు చూస్తున్నారు. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా, చివరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నవారు కూడా బాలానగర్ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఇల్లు.. ఇదే కొత్త ట్రెండు!
సొంతిల్లు ప్రతి ఒక్కరి స్వప్నం.. దానికి తగ్గట్టుగానే ఇంటిని (homes) అభిరుచికి తగ్గట్లు నిర్మించుకోవడంతో పాటు సరికొత్త ఇంటీరియర్ (interior) ఏర్పాటు చేసుకుంటున్నారు. విల్లా, ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌజ్ ఇలా ఏదైనా సరే.. కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపించేలా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు నగరవాసులు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వావ్ అనిపించేలా హాల్, మోడ్రన్ కిచెన్, బెడ్రూమ్స్తో పాటు బాల్కనీని (balcony) ముస్తాబు చేసుకుంటున్నారు. కాఫీ కప్పుతో అలా బాల్కనీలోకి వెళ్తే మనసుకు హాయినిచ్చేలా మలుచుకుంటున్నారు. చాలామంది గ్రీనరీ ఫీల్ కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ లాన్ ఏర్పాటు చేసుకొని అందమైన మొక్కలతో అలంకరిస్తున్నారు. బాల్కనీ, పెంట్‌హౌస్ సైజును దృష్టిలో ఉంచుకొని కొన్ని సంస్థలు ప్రత్యేక డిజైన్లతో మైమరపిస్తున్నాయి.కరోనా కాలం తర్వాత నగరవాసులు ఎన్నో నూతన ఒరవడుల వైపు ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు (software employees) ఇలాంటి వాటికి అధికంగా మొగ్గుచూపారు. దీనికి ఓ కారణం ఉంది.. లాక్డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) కారణంగా అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇళ్లలో ఉండటం, వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ఇంట్లో ఇంటీరియర్‌తో పాటు బాల్కనీ ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వర్క్ మధ్యలో ఫ్యామిలీతో అలా బాల్కనీ, పెంట్‌హౌస్‌లో కూర్చొని సరదాగా కాసేపు గడిపి మళ్లీ పని చేసుకుంటున్నారు. నగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ (real estate) వ్యాపారంతో సమానంగా ఇంటీరియర్, పలు థీమ్స్‌తో కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఒకలా.. ఇప్పటి నుంచి మరోలా అనే విధంగా ముస్తాబు చేస్తున్నాయి. అపార్ట్మెంట్స్ బాల్కనీ.. అపార్ట్మెంట్ బాల్కనీ కొద్ది స్పేస్ అయినా వాటిని మరింత సుందరీకరణకు మొగ్గు చూపుతున్నారు. కొందరు వారికి నచ్చిన థీమ్స్‌తో డిజైన్ చేయించుకుంటారు. థీమ్ నేమ్స్, లైటింగ్ కొటేషన్స్, సేఫ్టీ కోసం ఇన్విజిబుల్ గ్రిల్స్, వాల్ ఆర్ట్‌ను ఎంచుకుంటున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉన్న వారు బాల్కానీని ఆఫీస్ థీమ్స్‌తో పాటు పలు విభిన్న థీమ్స్‌తో సిటీ వ్యూ చూస్తూ డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ ఇంట్రెస్ట్ రావడానికి సరికొత్త డిజైన్స్ ఎంచుకుంటున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్‌లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. త్రీ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్లో కొత్త థీమ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విల్లాస్ కల్చర్ పెరిగింది. పెంట్‌హౌస్‌లో ఉన్న స్పేస్‌కి చాలా ఖర్చు పెడుతున్నారు. సిటీ వ్యూ కనబడేలా అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, జెకూజీ, బార్ కౌంటర్, హోమ్ థియేటర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ పెరుగుతుంది విల్లాస్, అపార్ట్‌మెంట్స్‌లో ఇంటీరియర్‌కి ఎంతో ఖర్చు చేస్తున్నారు. అందులో భాగంగానే బాల్కనీని చేరుస్తున్నారు. ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ రెట్టింపు అవుతుంది. గ్రీనరీ, ఇంట్లోనే వెజిటబుల్స్ పెంచుకొనేలా ఉన్న స్పేస్‌తో కాకుండా కొత్త స్పేస్ ఇచ్చే ఆలోచన అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలో వస్తోంది. వచ్చిన అతిథులు బాల్కనీ, పెంట్‌హౌస్ చూసి వావ్ అనేలా ఉండాలని కోరుకుంటున్నారు. వారు బాల్కనీ, పెంట్హౌస్లనే ఇష్టపడేలా డిజైన్ చేసుకుంటున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉన్న వారు ఆఫీస్ థీమ్స్‌తో పాటు పలు విభిన్న థీమ్స్‌తో సిటీ వ్యూ ఉండేలా డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ రావడానికి వారికి నచ్చినట్లు డిజైన్ చేస్తున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్‌లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. – హేమలత రామా, స్వర్గ బాల్కనీ మేకోవర్స్, సీఈఓ -
ప్రాపర్టీ ఎంపికలో పిల్లలూ కీలకమే..
‘మా వాడికేం తెలుసు, వాడింకా చిన్నపిల్లోడే..’ ‘పెద్దవాళ్ల నిర్ణయాల్లో చిన్నోడివి తలదూర్చటం ఎందుకు..?’ ‘నీకింకా నిర్ణయం తీసుకునేంత వయస్సు రాలేదులే..’..పిల్లల విషయంలో మన పెద్దల అభిప్రాయాలివీ. కానీ, నేటి జనరేషన్ పేరెంట్స్ ఇలాంటి మాటలకు టాటా చెప్పేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీ(Property) ఎంపికలో పిల్లలే అంతిమ నిర్ణేతలయ్యారు. పిల్లల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఉన్న ప్రాజెక్ట్‌లకే తల్లిదండ్రులు జై కొడుతున్నారు. దీంతో ప్రాజెక్ట్ ఎలివేషన్ నుంచి వసతుల వరకూ పిల్లలను ఆకట్టుకునే ప్రత్యేక థీమ్‌లు, క్లబ్‌హౌస్‌లతో నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ఇల్లంటే నాలుగు గోడలు కాదు.. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఉండాలి. అందుకే మూస ధోరణిలో నిర్మించే ప్రాజెక్ట్(Project)లను కొనుగోలుదారులు ఆదరించడం లేదు. ఇది వరకు అంతగా పట్టించుకోని చిన్నారుల అవసరాలే ఇప్పుడు గృహ కొనుగోలు నిర్ణయాలను చాలా వరకు ప్రభావితం చేస్తున్నాయి. విదేశీ తరహాలో నిర్మాణం, ఆధునిక వసతులు ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. అవును.. సొంతిల్లు కొంటున్నామంటే ఇప్పుడు పిల్లల అభిరుచులు, అవసరాలు తీరడం కూడా ముఖ్యమే. – సాక్షి, సిటీబ్యూరోపెద్దలు వృత్తి, ఉద్యోగ రీత్యా అధిక సమయం బయటే గడుపుతారు. వాస్తవానికి ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది చిన్నారులే. పాఠశాల సమయం మినహా మిగతా సమయం ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో, పరిసరాల్లో వీరి అవసరాలు తీరే వసతులు ఏ మేరకు ఉంటున్నాయనేది కీలకం. సౌకర్యాలంటే ప్రత్యేకంగా వారికంటూ ఒక గది, అందులో నచ్చేట్లుగా ఉండే రంగులు, ఇంటీరియర్(interior) మాత్రమే కాదన్నది నేటితరం పిల్లల భావన. బయట పరిసరాలు వీరిని ఎక్కువ ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి కేవలం బాల్యం వరకే కాదు పెరిగి పెద్దయ్యే వరకూ చుట్టుపక్కల తగిన వసతులు ఉండేలా చూడటం పెద్దల బాధ్యత. కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం ఇల్లు కొనేటప్పుడు పిల్లల గురించి పరిగణలోకి తీసుకోవడం మర్చిపోవద్దు.కిడ్స్ థీమ్‌లతో ప్రాజెక్ట్‌లు..నివాస సముదాయంలోని క్లబ్‌హౌస్‌లు కమ్యూనిటీ లివింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు పిల్లలకు మంచి అలవాట్లు పెంపొందేందుకు సహాయపడతాయి. దీంతో నిర్మాణ సంస్థలు డిస్నీ, హ్యారీపోర్టర్ వంటి కిడ్స్ థీమ్(Kids Theme)లతో కూడిన ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. వీటిల్లో చిన్న పిల్లలు ఆడుకునే క్రమంలో కిందపడిపోయినా గాయాలు కాకుండా మృదువైన ఆట పరికరాలు, ఇంటరాక్టివ్ అండ్ ఎడ్యుకేషనల్ టాయ్స్ ప్లే ఏరియాలు, ఆర్ట్, డ్యాన్స్ ఇతరత్రా హాబీల శిక్షణ తరగతుల కోసం యాక్టివిటీ జోన్లు, చిట్టడవి, శాండ్ పిట్స్, ట్రీ బెంచ్, మినీ సాకర్ ఫీల్డ్, యాంపీ థియేటర్ వంటి ఇతరత్రా వసతుల జోన్లను కల్పిస్తున్నారు.మంచి కమ్యూనిటీ, ప్లేగ్రౌండ్ఒకవైపు విశాలమైన ఆట స్థలాలు, వినూత్నమైన ఎలివేషన్లతో పిల్లలను ఆకట్టుకుంటే.. మరోవైపు ప్రాజెక్ట్‌లోనే క్రచ్, ప్లేగ్రౌండ్, మంచి కమ్యూనిటీ వంటి వాటితో తల్లిదండ్రులనూ కట్టిపడేస్తున్నారు బిల్డర్లు. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలో మీటర్ల దూరం ఉండే స్కూల్‌కు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే అపార్ట్మెంట్ కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రాజెక్ట్‌లోనే స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి వసతులే కాదు, ఇందులోనే కమ్యూనిటీ మంచి సర్కిల్, ప్లేగ్రౌండ్ వంటివి ఉంటేనే కొనేందుకు ముందుకొస్తున్నారు. పార్కులు, థియేటర్లు, మాల్స్, రెస్టారెంట్లు ఉన్నాయో లేవో కూడా కొనుగోలుదారులు చూస్తున్నారని నిర్మాణదారులు అంటున్నారు. ధరలపై ప్రభావం..వసతులన్నీ ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ఉంటుంది. సహజంగానే దీని ప్రభావం ధరలపై ఉంటుంది. పేరున్న పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రజా రవాణా, మాల్స్ ఉన్నట్లయితే ఎక్కువ మంది ఆ చుట్టుపక్కల నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీంతో కొత్త నిర్మాణాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ చూపెట్టి ఆయా ప్రాంతంలో ఉన్న ధరల కంటే ఎక్కవ ధరకు విక్రయించేవారు ఉంటారు. నాణ్యమైన నిర్మాణం, గడువులోగా పూర్తి చేసే నిర్మాణదారులనే అంతిమంగా ఎంపిక చేసుకోవాలి.అభిరుచుల కోసం క్లబ్‌హౌస్‌లు..ప్రస్తుతం మార్కెట్లో చాలా ప్రాజెక్ట్‌లు పిల్లల వసతులపై దృష్టిపెడుతున్నాయి. వారు ఆటలాడుకునేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తున్నాయి. తక్కువ లోతులో ఈత కొలనులు నిర్మిస్తున్నాయి. పెద్దలకే కాదు పిల్లల కోసం వేర్వేరు ప్లే కోర్టులను తమ ప్రాజెక్ట్‌లో చేరుస్తున్నాయి. తక్కువ స్థలంలో నిర్మాణాలు చేపడుతూ ఖాళీ స్థలం ఎక్కువ ఉండేలా పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పిస్తుంటారు. ఈ దృష్ట్యా కొన్ని నిర్మాణ సంస్థలు అపార్ట్మెంట్లలోనే ట్యూషన్ గదులను నిర్మిస్తున్నాయి. వ్యాపకాలు, అభిరుచులకు పదును పెట్టేలా చిన్నారుల కోసం ప్రత్యేకంగా క్లబ్‌హౌస్‌లను నిర్మించడం నేటి పోకడ. ఉద్యోగాలకు వెళ్లిన తల్లిదండ్రుల కంటే పిల్లలు పాఠశాల నుంచి ముందుగానే ఇంటికి చేరుకుంటారు. అమ్మానాన్న వచ్చే వరకు వీరు క్లబ్ హౌస్‌లో ఇతర నైపుణ్యాలను పెంపొందించుకునే కార్యక్రమాల్లో పాల్గొనే సదుపాయం కల్పిస్తున్నాయి.నేటి పేరెంట్స్ నిర్ణయంలో మార్పులుమెట్రో నగరాల్లో భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితి. దీంతో పిల్లలకు సమయం కేటాయించలేని పరిస్థితి. అందుకే కనీసం నివాసం ఉండే ప్రాజెక్ట్‌లోనైనా పిల్లల అవసరాలు, అభిరుచులను తీర్చేవిధంగా ఉండాలని భావిస్తున్నారు. చిన్నారులకు భద్రమైన, ఆధునిక వసతులను అందించే ప్రాజెక్ట్‌లను కోరుకుంటున్నారు.– వంశీకృష్ణ, డైరెక్టర్, ప్రైమార్క్ డెవలపర్స్ -
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ కళకళ
హైదరాబాద్ (Hyderabad) మార్కెట్లో కార్యాలయ స్థలాలకు (office space) బలమైన డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది మొత్తం మీద గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56 శాతం పెరిగి 12.5 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ)గా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా (Colliers) నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది లీజు పరిమాణం 8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది 14 శాతం పెరిగి 66.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు కొలియర్స్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇవే పట్టణాల్లో స్థూల కార్యాలయ స్థలాల లీజింగ్ 58.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. పట్టణాల వారీగా.. » బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 21.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. క్రితం ఏడాది 15.6 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజుతో పోల్చితే 39 శాతం పెరిగింది. » ముంబైలోనూ 43 శాతం వృద్ధితో 10 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. » పుణెలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 5.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. » చెన్నైలో స్థూల లీజింగ్ 35 శాతం క్షీణతతో 6.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. 2023లో ఇదే పట్టణంలో లీజింగ్ 10.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. » ఢిల్లీ ఎన్సీఆర్లోనూ 16 శాతం తక్కువగా 9.7 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజు నమోదైంది.2025లోనూ గరిష్ట స్థాయిలోనే.. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలతోపాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల నుంచి ఆఫీస్ స్థలాలకు ఈ ఏడాది డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. 2025లోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ గరిష్ట స్థాయిలోనే కొనసాగొచ్చొని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ విభాగం ఎండీ అర్పిత్ మెహరోత్రా అంచనా వేశారు. వచ్చే కొన్నేళ్ల పాటు లీజింగ్ 60 మిలియన్ ఎస్ఎఫ్టీకి మించి కొనసాగడం సాధారణ అంశంగా మారుతుందన్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) నుంచి స్థిరమైన డిమాండ్ కొనసాగడం పెద్ద పరిమాణంలో ఆఫీస్ స్థలాల లీజింగ్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు బెంగళూరు కేంద్రంగా పనిచేసే సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు. లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ వసతులకూ డిమాండ్ దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ (ఎల్‌అండ్‌ఐ) వసతుల లీజింగ్ ప్రస్తుత ఏడాది మొత్తం మీద 50–53 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో గతేడాది లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ వసతుల లీజింగ్ 53.57 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ వరకు లీజింగ్ ఈ నగరాల్లో 41 మిలియన్ ఎస్ఎఫ్టీని అధిగమించినట్టు తెలిపింది.‘‘ప్రభుత్వం 2020లో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ప్రకటించిన నాటి నుంచి ఇండస్ట్రియల్ స్థలాల లీజింగ్‌లో మెరుగైన వృద్ధి నమోదవుతోంది. దీనికితోడు రిటైల్, ఈ–కామర్స్ సైతం బలంగా అవతరించడం డిమాండ్‌కు మద్దతుగా నిలిచింది’’అని ఈ నివేదిక వెల్లడించింది. బలమైన పారిశ్రామిక కార్యకలాపాలకు తోడు వినియోగ దోరణి విస్తృతం కావడంతో 2025లో లీజింగ్ బలంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. చైనా ప్లస్ వన్ విధానంతో భారత్ సైతం ప్రయోజనం పొందుతుండడం ఈ రంగాల్లో డిమాండ్‌కు కలిసొస్తున్నట్టు వివరించింది. -
హైదరాబాద్‌లో ఇల్లు.. రూ.కోటి అయినా కొనేద్దాం!
కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో గృహాల ధరలు పెరిగిపోయాయి. 2024 తొలి అర్ధ ఆర్థిక సంవత్సరం(హెచ్1)లో నగరంలో ఇళ్ల సగటు ధర రూ.84 లక్షలుగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.15 కోట్లకు పెరిగింది. ఏడాది కాలంలో 37 శాతం ధరలు వృద్ధి చెందాయని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. అలాగే నగరంలో 2024 హెచ్1లో రూ.25,059 కోట్లు విలువ చేసే 29,940 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి 27,820 ఇళ్లు విక్రయించారు. వీటి విలువ రూ.31,993 కోట్లు. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో విక్రయాలు, లాంచింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. 2024 హెచ్1 గృహాల ధర సగటున రూ.కోటిగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి 23 శాతం పెరిగి, ఏకంగా రూ.1.25 కోట్లకు చేరింది. ఇక, 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో టాప్–7 సిటీస్‌లో రూ.2,79,309 కోట్లు విలువ చేసే 2,27,400 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి రూ.2,35,800 కోట్ల విలువైన 2,35,200 విక్రయమయ్యాయి. యూనిట్ల అమ్మకాల్లో 3 శాతం క్షీణత ఉన్నప్పటికీ.. సేల్స్ వ్యాల్యూ మాత్రం 18 శాతం పెరిగింది.ఇదీ చదవండి: హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్..ముంబైలో స్థిరంగా ధరలు.. ఆసక్తికరంగా ఏడాది కాలంలో ముంబై(ఎంఎంఆర్)లో యూనిట్ల ధరలు పెరగలేదు. 2024 హెచ్1లో ధర సగటున రూ.1.45 కోట్లుగా ఉండగా.. 2025 హెచ్1లోనూ అదే ధర ఉంది. ఇక, అత్యధికంగా ఢిల్లీ–ఎన్సీఆర్లో ఇళ్ల ధరలు పెరిగాయి. 2024 హెచ్1లో ఇక్కడ ధర సగటు రూ.93 లక్షలు కాగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.45 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత బెంగళూరులో గతంలో రూ.84 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.1.21 కోట్లు, చెన్నైలో రూ.72 లక్షల నుంచి రూ.95 లక్షలకు, పుణేలో రూ.66 లక్షల నుంచి రూ.85 లక్షలకు, అలాగే 2024 హెచ్1లో కోల్‌కత్తాలో యూనిట్ ధర సగటు రూ.53 లక్షలుగా పలకగా.. 2025 హెచ్1 నాటికి రూ.61 లక్షలకు పెరిగింది. -
రికార్డు స్థాయిలో ఆఫీస్ లీజింగ్
న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల(ఆఫీస్ స్పేస్) మార్కెట్ ఈ ఏడాది మంచి జోరును కొనసాగించింది. గతేడాదితో పోల్చితే సుమారు 14 శాతం అధికంగా 85 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ ఈ ఏడాది ఎనిమిది ప్రధాన నగరాల్లో నమోదవుతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తన అంచనాలు వెల్లడించింది. 2023లో ఇవే నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 74.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం.‘‘ఎనిమిది ప్రధాన నగరాల్లో 2022 నుంచి ఆఫీస్ స్పేస్ స్థూల లీజింగ్ ఏటా 70 మిలియన్ ఎస్ఎఫ్టీపైనే ఉంటూ వస్తోంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 66.7 మిలియన్ ఎస్ఎఫ్టీ స్థూల లీజింగ్ లావాదేవీలు జరిగినట్టు ప్రకటించింది. స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2018లో 49.1 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2019లో 67.7 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2020లో 46.6 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2021లో 50.4 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2022లో 72 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2023లో 74.6 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున నమోదైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఈ రంగాల్లో డిమాండ్ అధికం.. ముఖ్యంగా ఐటీ–బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (ఐటీ–బీపీఎం), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ), ఇంజనీరింగ్, తయారీ రంగాలతోపాటు, ఫ్లెక్స్ ఆపరేటర్ స్పేస్ విభాగాలు ఈ వృద్ధిని నడిపిస్తున్నట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఈ రంగాలు మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు తెలిపింది. ‘‘2024 భారత ఆఫీస్ రంగానికి రికార్డుగా నిలిచిపోతుంది. స్థూల లీజింగ్ ఈ ఏడాది 85 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోవచ్చు.ఇందులో నికర వినియోగం 45 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చు. భారత వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో అత్యధిక గరిష్ట స్థాయి ఇది’’అని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ తెలిపింది. మొత్తం ఆఫీస్ లీజింగ్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) 30 శాతం వాటా ఆక్రమిస్తాయని పేర్కొంది. డిమాండ్ పెరగంతో ప్రముఖ ప్రాంతాల్లో కార్యాలయ వసతుల అద్దెల పెరుగుదలపై ఒత్తిడి నెలకొన్నట్టు తెలిపింది. ‘‘2025లో అధిక శాతం నూతన వసతుల సరఫరా ప్రముఖ ప్రాంతాల చుట్టూనే ఉండనుంది. స్థిరమైన సరఫరాతో అద్దెల పెరుగుదల మోస్తరు స్థాయిలో ఉండనుంది. దీంతో కిరాయిదారుల అనుకూల సెంటిమెంట్ కొంత కాలం పాటు కొనసాగనుంది’’అని వివరించింది. -
వెలుగులోకి రాని వేల కోట్ల వ్యాపారాధిపతి.. ఎవరీ బిలియనీర్?
విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లోకి వచ్చే వ్యాపారవేత్తలు భారత్‌లో అనేక మంది ఉన్నారు. అయితే సంబంధిత వ్యాపార రంగాలలో ప్రముఖంగా ఉన్నప్పటికీ లో ప్రొఫైల్‌లో ఉండడానికి ప్రయత్నించేవారూ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ (Vikas Oberoi). బాలీవుడ్ నటిని వివాహం చేసుకున్నప్పటికీ, ప్రజల దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు.ఎవరీ వికాస్ ఒబెరాయ్?వికాస్ ఒబెరాయ్.. ఒబెరాయ్ రియాల్టీకి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆయన తండ్రి రణవీర్ ఒబెరాయ్ ఈ రియల్-ఎస్టేట్ కంపెనీని స్థాపించారు. ఇది వికాస్ నాయకత్వంలో దేశంలోని అగ్రశ్రేణి రియల్-ఎస్టేట్ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఆతిథ్యం, రిటైల్, కార్పొరేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌తో సహా విభిన్న రంగాలలోకి ప్రవేశించింది.ముంబైలో హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లు, వాణిజ్య స్థలాలనెన్నో అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రధాన పేరుగా మారింది. ఒబెరాయ్ రియాల్టీకి అధిపతి మాత్రమే కాకుండా వికాస్ ఒబెరాయ్ ముంబైలోని ఫైవ్ స్టార్ వెస్టిన్ హోటల్‌ను కూడా కలిగి ఉన్నారు. ప్రస్తుతం నగరంలోని మొదటి రిట్జ్-కార్ల్టన్ హోటల్‌తోపాటు విలాసవంతమైన నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నారు.వికాస్ ఒబెరాయ్ నేపథ్యంముంబైలో పుట్టి పెరిగిన వికాస్ ఒబెరాయ్ నగరంలోని జై హింద్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. తరువాత ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఓనర్/ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా, వివేక్ శిక్షణ పొందిన పైలట్ కూడా. ఆయనకు పైలట్ లైసెన్స్ కూడా ఉంది.ప్రముఖ బాలివుడ్ నటి గాయత్రీ జోషిని వికాస్ ఒబెరాయ్ వివాహం చేసుకున్నారు. మోడల్ నుండి నటిగా మారిన ఆమె షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ చిత్రంలో గీత పాత్రను పోషించారు. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట అప్పటి నుండి అందరి దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి విహాన్ ఒబెరాయ్, యువన్ ఒబెరాయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గతేడాది అక్టోబర్‌లో వీరు ఇటలీలోని సార్డినియాలో విహారయాత్ర చేస్తుండగా కారు ప్రమాదంలో చిక్కుకుని అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు.చదవండి: అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ జీతం ఇంతేనా?వికాస్ ఒబెరాయ్ నెట్వర్త్ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. దేశంలోని అత్యంత ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలలో ఒకరైన వికాస్ ఒబెరాయ్ నెట్‌వర్త్ 6.5 బిలియన్ డాలర్లు (రూ. 45,000 కోట్లు). -
హైదరాబాద్‌లో బోటింగ్ విల్లాలు..
పొద్దున లేవగానే గలగలా పారే నీటి సవ్వడి.. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి హ్యాపీగా పడవలో షికారు.. వీటి కోసం ఎక్కడో టూరిస్ట్ ప్లేస్‌కు వెళ్లాల్సిందేనని అనుకోకండి. నగర స్థిరాస్తి రంగంలోనే తొలిసారిగా ప్రణీత్ గ్రూప్ నివాస సముదాయంలోనే బోటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. -సాక్షి, సిటీబ్యూరోగాగిళ్లపూర్లో నిర్మిస్తున్న గ్రూవ్ పార్క్ లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో బోటింగ్ వసతిని అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కంపెనీ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. ప్రాజెక్ట్‌కు మధ్యలో చెరువు ఉండటంతో నివాసితులకు వినూత్నంగా బోటింగ్ సేవలను అందించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్..70 ఎకరాల్లో 884 ట్రిపులెక్స్ విల్లాలను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. 167 నుంచి 350 గజాల్లో వేర్వేరు విస్తీర్ణాలలో స్పానిష్ ఆర్కిటెక్చర్ విల్లాలు ఉన్నాయని, ప్రారంభ ధర రూ.1.70 కోట్లుగా నిర్ణయించామని పేర్కొన్నారు. -
ఇంటికి టైల్.. యమస్టైల్!
ఇళ్లు నిర్మించుకోవడం ఒక ఎత్తయితే.. టైల్స్ ఎంపిక మరో ఎత్తు.. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంటి అందం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఆకర్షణీయంగా కనిపించడంలో కీలక పాత్ర పోషించేది నేలపై పరిచే టైల్స్. వాటి డిజైన్ ఎంపిక విషయంలో దాదాపు ఒక యుద్ధం చేసినంత కసరత్తు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే చాలా కంపెనీలు కస్టమర్ల అభిరుచులు, ట్రెండ్‌కు తగ్గట్టు తయారు చేస్తున్నాయి. ప్రతి ఏటా కస్టమర్ల అభిరుచుల్లో చాలా తేడా కనిపిస్తోందని పలు కంపెనీలు చెబుతున్నాయి. రంగులు, డిజైన్లు, ఆకారాల విషయంలో ప్రజలు ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని పేర్కొంటున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోప్రకృతి నుంచి స్ఫూర్తి టైల్స్ డిజైన్ రూపొందించే విషయంలో ప్రతి అంశం నుంచి స్ఫూర్తి పొందుతుంటారని తయారీదారులు చెబుతున్నారు. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుందని, ప్రకృతికి సంబంధించి చెట్లు, పూలు, ఆకులను మనసులో ఉంచుకుని తయారు చేస్తుంటామని పేర్కొంటున్నారు. ఇక, వివిధ రకాల ఆకారాలు కూడా ముఖ్యమని, రంగులు, విభిన్న కాన్సెప్టులతో మార్బుల్, స్టోన్స్‌తో రూపొందిస్తుంటామని చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నారు.రూ.35 నుంచి ప్రారంభం.. టైల్స్‌లో కూడా ఒక్కో డిజైన్, ఒక్కో ఆకారాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంది. ప్రతి చదరపు అడుగు టైల్కు రూ.35 నుంచి రూ.500 వరకు కూడా ఉంది. సెరామిక్ టైల్స్‌కు కాస్త తక్కువ ధర ఉంటుంది. విట్రిఫైడ్, మార్బుల్ టైల్స్, గ్రానైట్ టైల్స్, వుడ్ లుక్ టైల్స్, సిమెంట్ టైల్స్ వంటి రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మార్బుల్ టైల్స్‌కు కాస్త ధర ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఎక్కువగా సెరామిక్ టైల్స్‌కు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత విట్రిఫైడ్ టైల్స్‌కు, ఆ తర్వాత వేరే రకం టైల్స్‌ను వాడుతున్నారు. ఏటా భారీస్థాయిలో వృద్ధి.. టైల్స్ రంగం ఏటా భారీ స్థాయిలో వృద్ధి నమోదు చేస్తోంది. ఏటా 11.96 శాతం పెరుగుదల కనిపిస్తోందని కెన్ పరిశోధనలు తేల్చాయి. 2023లో టైల్స్ మార్కెట్ ఏకంగా 8,543.9 మిలియన్ డాలర్లు నమోదు చేయగా, 2030 నాటికి ఈ మార్కెట్ విలువ ఏకంగా 13,265.2 మిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని అంచనా వేస్తున్నారు. 2024 నుంచి 2030 మధ్య ఈ రంగం ఏకంగా 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దినుసుల స్ఫూర్తిగా.. దేశంలోని మసాలా దినుసులను స్ఫూర్తిగా తీసుకుని టైల్స్ డిజైన్ రూపొందిస్తుంటాను. భారతీయత ఉట్టిపడేలా, ఇక్కడి ప్రకృతి రమణీయతను టైల్స్ డిజైన్స్‌లో ఉండేలా చూసుకుంటాను. అనేక దేశాల్లో ఇలాంటి డిజైన్స్‌కు యమ గిరాకీ ఉంది. ప్రజల అభిరుచికి తగ్గట్టు టైల్స్ డిజైన్స్ రూపొందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాను. – మారియా కాస్టిలో, రీజెన్సీ టైల్స్ చీఫ్ డిజైనర్ -
హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్
బోనమెత్తిన భక్తుల కోర్కెలు తీర్చే గ్రామదేవతగా పూజించే గండిమైసమ్మ.. అందుబాటు ధరల్లోనే సామాన్య, మధ్యతరగతి సొంతింటి కలనూ తీరుస్తోంది. అర్ధగంట ప్రయాణ వ్యవధిలోనే ఐటీ కారిడార్‌కు చేరుకునే వీలు, శంషాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర జిల్లా కేంద్రాలకు చేరుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ.. సమీప దూరంలోనే అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద, ఉపాధి కేంద్రాలు.. అన్నింటికీ మించి అందుబాటులోనే గృహాల ధరలు ఉండటంతో బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ప్రాంతాలకు డిమాండ్ ఏర్పడింది. –సాక్షి, సిటీబ్యూరోనీరు ఎత్తు నుంచి పల్లెం వైపు ప్రవహించినట్టే.. అభివృద్ధి కూడా మెరుగైన మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల వైపే విస్తరిస్తుంది. ఇందుకు సరైన ఉదాహరణ బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ప్రాంతాలు. ఐటీ కారిడార్‌కు చేరువలో ఉండటంతో మియాపూర్, బాచుపల్లి ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. ఇప్పుడా డెవలప్మెంట్ బాచుపల్లికి కొనసాగింపుగా.. బహదూర్‌పల్లి, గండిమైసమ్మ మార్గంలో విస్తరించింది. అన్నింటికీ మించి చౌక ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను గండిమైసమ్మ తీరుస్తోంది.వెస్ట్, నార్త్ జోన్లతో కనెక్టివిటీ.. మెరుగైన రోడ్లు, రవాణా సదుపాయాలతో వెస్ట్, నార్త్ హైదరాబాద్ ప్రాంతాలకు సులువుగా చేరుకునే వీలు ఉండటం బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ఏరియాల ప్రత్యేకత. ఇక్కడి నుంచి అరగంటలో బాచుపల్లి మార్గంలో ప్రగతినగర్ మీదుగా జేఎన్టీయూకి, అక్కడి నుంచి హైటెక్‌సిటీకి వెళ్లొచ్చు. ఇప్పటికే మియాపూర్–బాచుపల్లి ఆరులైన్ల రహదారి మార్గం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. అలాగే 1.5 కి.మీ. దూరంలోని దుండిగల్ ఔటర్ ఎగ్జిట్–5 ఎక్కితే శంషాబాద్ విమానాశ్రయానికి ఈజీగా చేరుకోవచ్చు.ఉపాధి అవకాశాలు మెండుగానే.. ఉపాధిపరంగా ఐటీ కారిడార్‌కు సులువుగా చేరుకోవడంతో పాటు స్థానికంగా పలు ఫార్మా కంపెనీల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. కండ్లకోయ, బహదూర్‌పల్లి ఐటీ పార్క్‌లు ఉండటంతో ఉపాధి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. సమీపంలోని గౌడవెల్లిలో 600 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్, దూలపల్లిలో ఫారెస్ట్ అకాడమీలు ఉండటంతో చుట్టూ పచ్చదనంతో ప్రశాంత వాతావరణం, కాలుష్య రహిత గృహాలు ఉండటం ఈ ప్రాంతాల ప్రత్యేకత. గండిమైసమ్మ చుట్టు పక్కల పదుల సంఖ్యలో ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలున్నాయి. మల్లారెడ్డి, టెక్ మహీంద్రా విశ్వవిద్యాలయాలు చుట్టుపక్కలే ఉన్నాయి. వైద్య కళాశాలతో పాటు నారాయణ హృదయాలయ, మల్లారెడ్డి, జీవీకే ఆస్పత్రులు చేరువలోనే ఉన్నాయి.అందుబాటు ధరల్లోనే ఇళ్లు..హైదరాబాద్ రియల్టీలో కొత్త మైక్రో మార్కెట్‌గా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున గృహ నిర్మాణం జరుగుతోంది. బహదూర్‌పల్లి, గండిమైసమ్మ, బాసుర్గడి, గౌడవెల్లి, అయోధ్యక్రాస్ రోడ్స్ వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లో నిర్మాణంలో ఉన్నాయి. ప్రైమార్క్, రూబ్రిక్ కన్స్ట్రక్షన్స్, వాసవి, ప్రణీత్ గ్రూప్, అపర్ణా వంటి సంస్థలు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలల్లో ధర చదరపు అడుగుకు రూ.5,500 వేలుగా చెబుతున్నారు. ప్రాజెక్ట్‌లలోని వసతులు, విస్తీర్ణాలను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.ఇదీ చదవండి: హైదరాబాద్ 2.o.. అభివృద్ధి ఖాయం!నార్త్ వేవ్‌లో సెంచరీ క్రాస్.. నిర్మాణ రంగంలో దశాబ్ధన్నర కాలం అనుభవంలో ఇప్పటివరకు 18 లక్షల చ.అ.ల్లో 30కు పైగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. తాజాగా బహదూర్‌పల్లిలో 13.5 ఎకరాల్లో నార్త్వేవ్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తున్నాం. 14 బ్లాక్‌లు, ఒక్కోటి 9 అంతస్తుల్లో మొత్తం 1,026 యూనిట్లు ఉంటాయి. నార్త్ వేవ్ ప్రాజెక్ట్‌ను కిడ్స్ సెంట్రిక్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఇందులో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా ప్లే ఏరియా, పెట్ జోన్, ఔట్‌డోర్ ఫిట్నెస్ స్టేషన్, యోగా, స్విమ్మింగ్ పూల్, జిమ్, క్రికెట్ పిచ్, బీబీక్యూ పార్టీ లాన్, మినీ గోల్ప్, రాక్ క్లయింబింగ్, ప్లే స్కూల్.. ఇలా వందకు పైగా ఆధునిక వసతులను కల్పిస్తున్నాం. – సాయికృష్ణ బొర్రా, డైరెక్టర్, ప్రైమార్క్ డెవలపర్స్మాడ్యులర్ కిచెన్ ఫ్రీ.. గండిమైసమ్మ– మేడ్చల్ మార్గంలోని అయోధ్య క్రాస్‌రోడ్స్‌లో 5.2 ఎకరాల్లో శ్రీవెన్ త్రిపుర ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 3 టవర్లలో 638 యూనిట్లుంటాయి. న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఫ్లాట్‌కు మాడ్యులర్ కిచెన్‌ను ఉచితంగా అందిస్తున్నాం. అలాగే ఈ ఏడాది డిసెంబర్ 31లోపు ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి లోయర్ ఫ్లాట్, ఈస్ట్, కార్నర్ ఫ్లాట్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అలాగే 12 నెలల పాటు నిర్వహణ ఉచితం. ఆఫర్లతో కస్టమర్లకు సుమారు రూ.5–6 లక్షలు ఆదా అవుతుంది. 50 వేల చదరపు అడుగుల క్లబ్ హౌస్‌లో స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్ట్, సూపర్ మార్కెట్, బాంక్వెట్ హాల్ వంటి అన్ని రకాల వసతులు ఉంటాయి. 299 యూనిట్లతో కూడిన టవర్–1ను దసరా నాటికి కస్టమర్లకు హ్యాండోవర్ చేస్తాం. నిర్మాణంలో ఉన్న మిగిలిన రెండు టవర్లను 2027 మార్చి వరకు పూర్తి చేస్తాం. – ఎండీ కృష్ణరావు, రూబ్రిక్ కన్స్ట్రక్షన్ -
హైదరాబాద్ 2.o.. అభివృద్ధి ఖాయం!
‘మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ బృహత్తర ప్రాజెక్ట్‌లతో హైదరాబాద్ అభివృద్ధి ఖాయం. ఏ నగరంలోనైనా సరే ప్రభుత్వం, డెవలపర్లు సంయుక్తంగా ప్రజా కేంద్రీకృత విధానాలతో నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టిస్తారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, నీరు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ప్రభుత్వం కల్పిస్తే.. కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలపర్లు చేపడతారు’ అని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్(టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోసబర్బన్ పాలసీ అవసరం.. విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం, వినోదం ఇలా ప్రతీ అవసరం కోసం ప్రజలు ప్రధాన నగరానికి రావాల్సిన, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏటా 3 లక్షల మంది నగరానికి వలస వస్తున్నారు. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోతే కోర్ సిటీలో జన సాంద్రత పెరిగి, బెంగళూరు, ఢిల్లీ మాదిరిగా రద్దీ, కాలుష్య నగరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే శివారు ప్రాంతాలు మెరుగైన మౌలిక వసతులతో అభివృద్ధి చెందేందుకు సబర్బన్ పాలసీ అవసరం. మెట్రో విస్తరణతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనుసంధానం కావడంతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శరవేగమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. అందుకే హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో ఈ ఏడాది రూ.5 వేల కోట్ల నిధులతో నాలాల పునరుద్ధరణ పూర్తి చేయాలి.ఆదాయంలో 25–30 శాతం వాటా.. ప్రస్తుతం గ్రేటర్లో 1.1 కోట్ల జనాభా ఉంది. మెరుగైన మౌలిక వసతులతో దేశంలోనే నివాసితయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. వ్యవసాయం తర్వాత రెండో అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమ రియల్ ఎస్టేట్ రంగం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టీ, నిర్మాణ అనుమతుల రుసుము, ఇంపాక్ట్ ఫీజు, ఆదాయ పన్ను ఇలా స్థిరాస్తి రంగం నుంచి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ఆదాయంలో 25–30 శాతం వాటా స్థిరాస్తి రంగానిదే.‘యూజర్ పే’తో గ్రోత్ కారిడార్‌లో రోడ్లు.. ఓఆర్ఆర్ నిర్మాణ సమయంలోనే గ్రోత్ కారిడార్‌కు రెండు వైపులా రహదారులను ప్లాన్ చేశారు. కానీ.. ఇప్పటికీ వేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆయా రోడ్లను ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీతో హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకొని, రైతుల నుంచి భూములను సేకరించి రహదారులను నిర్మించాలి. ఇందుకైన వ్యయాన్ని ఈ రోడ్లను వినియోగించుకునే డెవలపర్ల నుంచి వసూలు చేస్తారు. ఉదాహరణకు టోల్ మాదిరిగా ఏ నుంచి బీ రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయాన్ని బిల్డర్లు ‘యూజర్ పే’ రూపంలో చెల్లిస్తారు. దీంతో ప్రభుత్వంపై వ్యయ భారం తగ్గడంతో పాటు మెరుగైన రోడ్లతో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ రోడ్లలో కొన్ని రీజినల్ రింగ్ రోడ్ అనుసంధానించబడి రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చెందుతాయి.వాక్ టు వర్క్‌తో.. ఫోర్త్ సిటీ.. తెలంగాణ ప్రభుత్వం 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని తలపెట్టింది. అయితే.. ఈ పట్టణం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ప్లాన్ చేయాలి. వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌లతో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా, వైద్య, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతో ఫోర్త్ సిటీ స్వయం సమృద్ధి చెందుతుంది. ఈ మోడల్‌ను హైదరాబాద్‌లోని మిగతా మూడు వైపులకూ విస్తరించాలి.నివాస, వాణిజ్య స్థిరాస్తికి డిమాండ్.. హైడ్రా దూకుడుతో కొంత కాలంగా స్థిరాస్తి రంగం మందగమనాన్ని ఎదుర్కొంది. అయితే నిర్మాణ అనుమతులు ఉన్న ప్రాజెక్ట్‌ల జోలికి వెళ్లమని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రస్తుతం మార్కెట్లో నిలకడ వాతావరణం నెలకొంది. దీంతో కొత్త కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేరాఫ్ హైదరాబాద్. ఆయా రంగాల్లో 1.50 లక్షల కొత్త ఉద్యోగాలతో రాబోయే కాలంలో నివాస, వాణిజ్య స్థిరాస్తి రంగానికి డిమాండ్ తప్పకుండా ఉంటుంది. ఉప్పల్ నుంచి నారాపల్లి, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట, పరేడ్ గ్రౌండ్ నుంచి కొంపల్లి ఫ్లై ఓవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మూడు మార్గాలతో పాటు ఆదిభట్ల నుంచి లేమూరు మార్గంలో నివాస కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతికి అందుబాటులో ధరల్లో ఇళ్లు లభ్యమవుతాయి. -
అపార్ట్మెంట్ ఖరీదు అబ్బో.. దేశంలోనే ఖరీదైన డీల్!
దేశంలోనే ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏది అంటే ముంబై అని చెబుతారు. కానీ ఖరీదైన ప్రాపర్టీ డీల్స్‌లో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం ముంబైని మించిపోతోంది. గుర్గావ్లోని డీఎల్ఎఫ్ కామెలియాస్‌లోని ఓ అపార్ట్మెంట్ ఇటీవల రూ. 190 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది ఎన్సీఆర్లో అత్యంత ఖరీదైన హై-రైజ్ కండోమినియం అపార్ట్మెంట్ డీల్‌గా నిలిచింది. చదరపు అడుగుల ధర (కార్పెట్ ఏరియా) పరంగా దేశంలోనే అతిపెద్దది.ఇండెక్స్ట్యాప్కు లభించిన పత్రాల ప్రకారం.. ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో దాని డైరెక్టర్ రిషి పార్థీ ఈ 16,290 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ని కొనుగోలు చేశారు. ఈ డీల్ డిసెంబర్ 2న నమోదైంది. ఇందుకోసం కంపెనీ రూ.13 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. అయితే ఈ డీల్‌పై డీఎల్ఎఫ్ స్పందించలేదు.దేశంలోనే అతిపెద్దది“చదరపు అడుగుల ప్రకారం చూస్తే ఒక హై రైజ్ అపార్ట్‌మెంట్‌కు రూ. 190 కోట్ల ధర దేశంలోనే అత్యధికం. ఇది ముంబైని మించిపోయింది. సూపర్ ఏరియాను పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకు రూ. 1.18 లక్షలు, కార్పెట్ ఏరియా పరంగా అయితేరూ. 1.82 లక్షలు. ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రాపర్టీ ధరలు సూపర్ ఏరియా ప్రాతిపదికన ఉండగా, ముంబైలో కార్పెట్ ఏరియాలో ఉంటాయి. కాబట్టి ఈ గుర్గావ్ ఒప్పందం కార్పెట్ ఏరియా పరంగా ముంబై ధర కంటే చాలా అధికం’’ అని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రొపెక్విటీ ఫౌండర్-సీఈవో సమీర్ జసుజా పేర్కొన్నారు.ఇదీ చదవండి: అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు.. ఇల్లు సొంతం!ముంబైలోని టానియెస్ట్ ఏరియాల్లో కార్పెట్ ఏరియా ధరలు రూ. 1,62,700 వరకు ఉన్నాయి. ఈ కామెలియాస్ డీల్‌కు ముందు జరిగిన అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్‌లలో ముంబైలోని లోధా మలబార్లో జరిగిన డీల్ ఒకటి. ఇక్కడ ఓ కంపెనీ గత ఏడాది చదరపు అడుగుకు (కార్పెట్ ఏరియా) రూ. 1,36,000 చొప్పున రూ. 263 కోట్లకు మూడు అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. -
రూ.అర కోటి లోపు ఇల్లు కావాలి..
భూముల ధరలు పెరగడం, నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాల భారం.. వంటి రకరకాల కారణాలతో సామాన్యులకు హైదరాబాద్‌లో సొంతిల్లు అనేది అందనంత దూరంలో ఉంటోంది. 2–3 ఏళ్ల క్రితం వరకు కూడా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే గృహాలు అందుబాటు ధరల్లో ఉండేవి. కానీ, హైరైజ్ అపార్ట్మెంట్లు, ఆధునిక వసతుల కల్పనతో కూడిన లగ్జరీ హోమ్స్ నిర్మాణంలో బిల్డర్లు పోటీపడుతుండటంతో కోట్లు వెచ్చిస్తే గానీ సొంతింటి కల సాకారం కానీ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సామాన్యుల సొంతింటి కల నెరవేరడానికి దగ్గరి దారిని చూపించే ప్రాంతాలపై ‘సాక్షి రియల్టీ’ప్రత్యేక కథనం... –సాక్షి, సిటీబ్యూరోరెండు బెడ్రూమ్స్, కిచెన్, హాల్, టాయిలెట్స్‌తో 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే బడ్జెట్ హోమ్స్‌కు ఇప్పటికీ ఆదరణ ఉంది. చిన్న వ్యాపారులు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, మధ్యస్థాయి ఉద్యోగులు వంటి సామాన్య, మధ్యతరగతి వర్గాలు సొంతింటి కలను బడ్జెట్ హోమ్స్‌తో తీర్చుకుంటారు. అద్దెకు ఉండే బదులు అదే అద్దెసొమ్మును నెలవారీ వాయిదా(ఈఐఎం) రూపంలో చెల్లిస్తే సొంతిల్లు సొంతమవుతుందనేది వారి ఆలోచనగా ఉంటుంది. దీంతో రూ.50 లక్షలలోపు ధర ఉండే గృహాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఏ ప్రాంతాల్లో కొనొచ్చంటే... మాదాపూర్, నార్సింగి, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్ మినహా మిగిలిన మూడు జోన్లలో ఇప్పటికీ సామాన్యులకు రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ గృహాలు దొరుకుతున్నాయి. ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ రోడ్, హయత్‌నగర్, పోచారం, ఘట్కేసర్, కీసర, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో బడ్జెట్ హోమ్స్ కొనుగోలు చేయవచ్చు. ఔటర్ లోపల ఉండే నివాస ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఎంపిక చేసుకోవడం ఉత్తమం. వీటిల్లో క్లబ్ హౌస్, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటివి ఉండేలా చూసుకోవాలి. దీంతో ఇల్లు చిన్నగా అనిపించినా, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.పీఎంఏవైను సవరించాలి.. లాభం ఉందంటే అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు డెవలపర్లు కూడా ముందుకొస్తారు. అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి. దీంతో డెవలపర్లలో విశ్వాసం పెరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం నిబంధనలను సవరించాలి. అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన నిబంధనల వర్తింపు సరికాదు. ఎందుకంటే... 700 చదరపు అడుగుల ఫ్లాట్ అంటే ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్. దానిని హైదరాబాద్‌లో బడ్జెట్ హోమ్‌గా పరిగణిస్తుంటారు. అందుకే పీఎంఏవై స్కీమ్ ప్రయోజనాలను గృహ కొనుగోలుదారుల ఆదాయాన్ని బట్టి కాకుండా అపార్ట్మెంట్ విస్తీర్ణాన్ని బట్టి వర్తింపజేయాలి. దీంతో ఎక్కువ మంది ఈ పథకానికి అర్హత పొందుతారు. కొనే ముందు వీటిని పరిశీలించాలి.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి విభాగాల నుంచి నిర్మాణ అనుమతులతోపాటు రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి. ప్రమోటర్లు, బిల్డర్ల పాత చరిత్ర చూడాలి. ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే ఆర్థిక శక్తి నిర్మాణ సంస్థకు ఉందా లేదో పరిశీలించాలి. రోడ్డు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి కనీస మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. బడ్జెట్ హోమ్స్ ప్రాజెక్ట్‌లకు సమీపంలో విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం మంచిది.వేగంగా అనుమతులివ్వాలిబడ్జెట్ హోమ్స్‌తో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. సొంతింటి కోసం ప్రభుత్వం ఆదాయపడాల్సిన అవసరం, ధనిక, పేద తరగతి మధ్య వ్యత్యాసం తగ్గుతాయి. ఈ తరహా నిర్మాణాలకు అనుమతులు త్వరితగతిన జారీ చేయాలి. ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్లలో స్టాంప్ డ్యూటీని తగ్గించాలి. బ్యాంక్‌లు కూడా బడ్జెట్ గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేలా వడ్డీరేట్ల తగ్గింపు, రుణ నిబంధనల సడలింపులతో ప్రత్యేక పథ కాన్ని తీసుకురావాలి. – జక్కా వెంకట్‌రెడ్డి, ఏవీ కన్స్ట్రక్షన్స్ -
ఇంటి డెసిషన్.. ఇంత ఫాస్టా?
ఇల్లు కొనే ముందు సవాలక్ష ఎంక్వైరీలు, చర్చలు, లాభనష్టాల బేరీజులు... ఇలా చాంతాడంత లిస్టే ఉంటుంది. కానీ, నేటి యువతరం గృహ కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత ఈజీగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్లిపోతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఇంటి కొనుగోలు నిర్ణయానికి 33 రోజుల సమయం పడితే.. ఈ ఆర్థిక సంవత్సరం అర్ధ వార్షికం(హెచ్1) నాటికి కేవలం 26 రోజుల్లోనే డెసిషన్ తీసుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో మనదేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ప్రాపర్టీ అన్వేషకులు కొనుగోలుదారులుగా మారేందుకు పట్టే సమయంపై ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2019, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కొనుగోలు సమయం కేవలం 25 రోజులుగా ఉంది. 2021 కోవిడ్ మహమ్మారి సమయంలో గరిష్టంగా 33 రోజుల సమయం పట్టింది.వేగానికి కారణమిదే... ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. కొన్నేళ్లుగా మార్కెట్లో బ్రాండెడ్ డెవలపర్ల నుంచి గృహాల విక్రయాలు పెరిగాయి. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.రూ.3 కోట్లయినా చిటికెలో నిర్ణయం.. సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. రూ.3 కోట్ల ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఎంపికకు అతి తక్కువగా, కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారు. రూ.1–3 కోట్ల ధర ఉన్న ఇళ్లకు 27 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల కొనుగోలుకు ఏకంగా 30 రోజులు సమయం తీసుకుంటున్నారు.డిమాండ్‌తో వేగంగా నిర్ణయం కోవిడ్ తర్వాతి నుంచి విశాలైన గృహాలు, హైఎండ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో ఇళ్లు వేగంగా అమ్ముడవుతున్న కారణంగా కస్టమర్లు కొనుగోలు నిర్ణయాన్ని వేగంగా తీసుకుంటున్నారు. – ప్రశాంత్‌రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్ -
ఇక్కడ ఇళ్ల ధరలకు రెక్కలు..
దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో (టైర్–2) ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. 23 ప్రముఖ పట్టణాల్లో సగటున 65 శాతం ఎగిసినట్టు ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. అదే విధంగా ఐదు నగరాల్లో ధరలు తగ్గాయి.ముఖ్యంగా దక్షిణాదిన గుంటూరు పట్టణంలో 51 శాతం మేర ధరల్లో పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత విశాఖపట్టణంలో 29 శాతం, విజయవాడలో 21 శాతం చొప్పున పెరిగాయి. దక్షిణాదిలోనే మంగళూరులో 41 శాతం, కోయింబత్తూర్‌లో 11 శాతం, గోవాలో 6 శాతం, కోచిలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. త్రివేండ్రంలో మాత్రం 4 శాతం, మైసూర్లో 14 శాతం చొప్పున ధరలు తగ్గాయి. జైపూర్ టాప్.. టైర్–2 పట్టణాల్లో దేశంలోనే అత్యధికంగా జైపూర్‌లో 65 శాతం మేర ధరలు పెరిగినట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర రూ.6,979కు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ.4,240గా ఉండడం గమనార్హం. ఉత్తరాదిన ఆగ్రా.. ఉత్తరాదిన ఆగ్రాలో ఇళ్ల ధరలు 59 శాతం పెరిగాయి. ఆ తర్వాత చండీగఢ్‌లో 34 శాతం, బివాండిలో 25 శాతం, ఇండోర్‌లో 20 శాతం, డెహ్రాడూన్‌లో 14 శాతం, లుధియానాలో 11 శాతం, లక్నోలో ఒక శాతం చొప్పున ధరల్లో వృద్ధి కనిపించింది. భోపాల్‌లో 5 శాతం, మోహాలిలో 8 శాతం, సోనేపట్‌లో 26 శాతం చొప్పున ధరలు పతనమయ్యాయి.పశ్చిమాన గాంధీనగర్ పశ్చిమభారత్లో గాంధీనగర్‌లో అత్యధికంగా 19 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. ఆ తర్వాత సూరత్‌లో 14 శాతం, నాగ్‌పూర్‌లో 12 శాతం, వడోదరలో 10 శాతం, నాసిక్‌లో 4 శాతం, అహ్మదాబాద్‌లో 4 శాతం చొప్పున ధరలు పెరిగాయి. తూర్పున భువనేశ్వర్‌లో 15 శాతం, రాయ్‌పూర్‌లో 14 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది.బలంగా డిమాండ్.. ‘‘టైర్–2 నగరాల్లో డెవలపర్లు, కార్పొరేట్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఇన్వెస్టర్ల సమూహం నుంచి ఇళ్లకు ఆసక్తి పెరిగింది. ఈ నగరాల్లో భూమి చౌకగా లభించడం, మౌలిక ససతులతో పెద్ద ఎత్తున అనుసంధానత, బలమైన డిమాండ్ వెరసి ప్రీమియం, లగ్జరీ ఇళ్ల సరఫరా మెరుగుపడింది’’అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా తెలిపారు.