
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో హైదరాబాద్ నగరానికి వలస వస్తుండటంతో ఇక్కడ ఇంటి అద్దెలు (house rent) పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి.
- సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని దాదాపు అన్ని కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) విధానాన్ని ఎత్తివేయడంతో అంతా నగరానికి చేరుకున్నారు. దీంతో ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉందని మ్యాజిక్‌బ్రిక్స్.కామ్ తెలిపింది.
ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో సప్లై తగ్గడంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు అద్దెలు కూడా పెరిగాయి.
ఇదీ చదివారా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్..
ఈ ఏడాది హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్‌లో డిమాండ్, సప్లై వాటా 50, 39 శాతంగా ఉన్నాయి.
గచ్చిబౌలి, కొండాపూర్‌లో అత్యధికంగా అద్దెలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)తో మెరుగైన కనెక్టివిటీ కారణం. 55 శాతం మంది అద్దెదారులు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు నెలవారీ అద్దెలకు కోసం వెతుకుతున్నారు. 1000 చదరపు అడుగుల నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment