సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో అద్దెలు హడలెత్తిస్తున్నాయి. మూడు నెలల్లో కిరాయిలు 1–4 శాతం మేర పెరిగాయి. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, ఆఫీసులకు దగ్గరగా ఉన్న చోట, అలాగే మెట్రో కనెక్టివిటీ, ఇతర రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో నెలవారీ అద్దెలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయని అనరాక్ అధ్యయనంలో వెల్లడైంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో 1000-1,300 చదరపు అడుగుల 2 బీహెచ్‌కే ఫ్లాట్ ధరలను పరిశీలిస్తే.. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లీహిల్స్, కొండాపూర్ వంటి ప్రాంతాలలో నెలవారీ అద్దె అర లక్ష రూపాయలకు పైగానే ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment