దేశంలోనే ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏది అంటే ముంబై అని చెబుతారు. కానీ ఖరీదైన ప్రాపర్టీ డీల్స్‌లో ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతం ముంబైని మించిపోతోంది. గుర్గావ్‌లోని డీఎల్‌ఎఫ్ కామెలియాస్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ఇటీవల రూ. 190 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది ఎన్‌సీఆర్‌లో అత్యంత ఖరీదైన హై-రైజ్ కండోమినియం అపార్ట్‌మెంట్ డీల్‌గా నిలిచింది. చదరపు అడుగుల ధర (కార్పెట్ ఏరియా) పరంగా దేశంలోనే అతిపెద్దది.
ఇండెక్స్‌ట్యాప్‌కు లభించిన పత్రాల ప్రకారం.. ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్‌వేర్ టెక్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో దాని డైరెక్టర్ రిషి పార్థీ ఈ 16,290 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ని కొనుగోలు చేశారు. ఈ డీల్ డిసెంబర్ 2న నమోదైంది. ఇందుకోసం కంపెనీ రూ.13 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. అయితే ఈ డీల్‌పై డీఎల్‌ఎఫ్ స్పందించలేదు.
దేశంలోనే అతిపెద్దది
“చదరపు అడుగుల ప్రకారం చూస్తే ఒక హై రైజ్ అపార్ట్‌మెంట్‌కు రూ. 190 కోట్ల ధర దేశంలోనే అత్యధికం. ఇది ముంబైని మించిపోయింది. సూపర్ ఏరియాను పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకు రూ. 1.18 లక్షలు, కార్పెట్ ఏరియా పరంగా అయితే
రూ. 1.82 లక్షలు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ప్రాపర్టీ ధరలు సూపర్ ఏరియా ప్రాతిపదికన ఉండగా, ముంబైలో కార్పెట్ ఏరియాలో ఉంటాయి. కాబట్టి ఈ గుర్గావ్ ఒప్పందం కార్పెట్ ఏరియా పరంగా ముంబై ధర కంటే చాలా అధికం’’ అని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రొపెక్విటీ ఫౌండర్-సీఈవో సమీర్ జసుజా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు.. ఇల్లు సొంతం!
ముంబైలోని టానియెస్ట్ ఏరియాల్లో కార్పెట్ ఏరియా ధరలు రూ. 1,62,700 వరకు ఉన్నాయి. ఈ కామెలియాస్ డీల్‌కు ముందు జరిగిన అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ డీల్‌లలో ముంబైలోని లోధా మలబార్‌లో జరిగిన డీల్ ఒకటి. ఇక్కడ ఓ కంపెనీ గత ఏడాది చదరపు అడుగుకు (కార్పెట్ ఏరియా) రూ. 1,36,000 చొప్పున రూ. 263 కోట్లకు మూడు అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment