Flat
-
ఎవరీ 'రిషి పార్టి'.. ఏకంగా రూ.190 కోట్ల ప్లాట్ కొన్నాడు
హర్యానాలోని గురుగ్రామ్ ఇప్పుడు లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ విభాగంలో.. ముంబై, బెంగళూరులతో పోటీ పడుతోంది. అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ ది కామెలియాస్‌లో వ్యాపారవేత్త 'రిషి పార్టి' (Rishi Parti) ఏకంగా రూ. 190 కోట్లు చెల్లించి.. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఇంతకీ రిషి పార్టీ ఎవరు? ఆయనకు సంబంధించిన కంపెనీలు ఏవి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ రిషి పార్టి?ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఫైండ్ మై స్టే ప్రైవేట్ లిమిటెడ్, ఇంటిగ్రేటర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా నాలుగు కంపెనీలకు 'రిషి పార్టి' డైరెక్టర్. అయితే ఎక్కువగా ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ద్రుష్టి సారిస్తున్నారు. అంతే కాకుండా ఈయన ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు.ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది లాజిస్టిక్స్‌కు సంబంధించిన కంపెనీ. ఇది 2001లో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సంస్థ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి లాజిస్టిక్స్ కంపెనీలలో కొత్తదనానికి మార్గం వేస్తోంది. రిషి పార్టి దీనిని 24ఏళ్ల వయసులో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్రారభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీలో 150 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. -
అపార్ట్మెంట్ ఖరీదు అబ్బో.. దేశంలోనే ఖరీదైన డీల్!
దేశంలోనే ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏది అంటే ముంబై అని చెబుతారు. కానీ ఖరీదైన ప్రాపర్టీ డీల్స్‌లో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం ముంబైని మించిపోతోంది. గుర్గావ్లోని డీఎల్ఎఫ్ కామెలియాస్‌లోని ఓ అపార్ట్మెంట్ ఇటీవల రూ. 190 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది ఎన్సీఆర్లో అత్యంత ఖరీదైన హై-రైజ్ కండోమినియం అపార్ట్మెంట్ డీల్‌గా నిలిచింది. చదరపు అడుగుల ధర (కార్పెట్ ఏరియా) పరంగా దేశంలోనే అతిపెద్దది.ఇండెక్స్ట్యాప్కు లభించిన పత్రాల ప్రకారం.. ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో దాని డైరెక్టర్ రిషి పార్థీ ఈ 16,290 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ని కొనుగోలు చేశారు. ఈ డీల్ డిసెంబర్ 2న నమోదైంది. ఇందుకోసం కంపెనీ రూ.13 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. అయితే ఈ డీల్‌పై డీఎల్ఎఫ్ స్పందించలేదు.దేశంలోనే అతిపెద్దది“చదరపు అడుగుల ప్రకారం చూస్తే ఒక హై రైజ్ అపార్ట్‌మెంట్‌కు రూ. 190 కోట్ల ధర దేశంలోనే అత్యధికం. ఇది ముంబైని మించిపోయింది. సూపర్ ఏరియాను పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకు రూ. 1.18 లక్షలు, కార్పెట్ ఏరియా పరంగా అయితేరూ. 1.82 లక్షలు. ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రాపర్టీ ధరలు సూపర్ ఏరియా ప్రాతిపదికన ఉండగా, ముంబైలో కార్పెట్ ఏరియాలో ఉంటాయి. కాబట్టి ఈ గుర్గావ్ ఒప్పందం కార్పెట్ ఏరియా పరంగా ముంబై ధర కంటే చాలా అధికం’’ అని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రొపెక్విటీ ఫౌండర్-సీఈవో సమీర్ జసుజా పేర్కొన్నారు.ఇదీ చదవండి: అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు.. ఇల్లు సొంతం!ముంబైలోని టానియెస్ట్ ఏరియాల్లో కార్పెట్ ఏరియా ధరలు రూ. 1,62,700 వరకు ఉన్నాయి. ఈ కామెలియాస్ డీల్‌కు ముందు జరిగిన అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్‌లలో ముంబైలోని లోధా మలబార్లో జరిగిన డీల్ ఒకటి. ఇక్కడ ఓ కంపెనీ గత ఏడాది చదరపు అడుగుకు (కార్పెట్ ఏరియా) రూ. 1,36,000 చొప్పున రూ. 263 కోట్లకు మూడు అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. -
అక్కడ ఒక్కో ఇల్లు రూ. 100 కోట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలు
న్యూఢిల్లీ: జీవితంలో ఓ సొంతిల్లు కొనుక్కోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇందుకోసం పైసాపైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్న వారు లేదా కొనుక్కున్న వారు ఉంటారు. ఈ క్రమంలో సామాన్యులు తమ తాహతుకు మించే ఖర్చు చేస్తారు. అయితే మన దేశంలో వంద కోట్ల ఖరీదు చేసే ఫ్లాట్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా?లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు కొత్త నిర్వచనంన్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవరపర్స్(డీఎల్ఎఫ్) సంస్థ ‘ది కామెల్లియాస్’ పేరుతో అత్యంత ఖరీదైన లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తోంది. ఇది భారతదేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు కొత్త నిర్వచనాన్ని అందించే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. ‘ది కామెలియాస్’లో ఒక్కో అపార్ట్ మెంట్ ధర రూ.100 కోట్ల వరకు ఉంది. దేశంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, సీఈఓలు, అత్యంత ధనవంతులకోసం ‘ది కామెల్లియాస్’ నిర్మితమయ్యింది. ఈ ప్రాజెక్ట్ విలాసవంతమైన ఇంటీరియర్స్, సాటిలేని విసాలవంతమైన సౌకర్యాలకు నెలవుగా ఉంది.పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన ఇళ్ల ధరలు2014లో ‘ది కామెలియాస్’ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు చదరపు అడుగు ధర రూ.22,500. కానీ నేడు దాని ధర చదరపు అడుగు రూ.85,000కు పైగానే పలుకుతోంది. అంటే పదేళ్లలో 4 రెట్లు పెరిగింది. గతంలో దాదాపు రూ.25-30 కోట్లకు అమ్ముడుపోయిన ఇక్కడి ఫ్లాట్ ధర నేడు రూ.100 కోట్లకు చేరుకుంది. ఢిల్లీలోని అత్యంత పాష్ ఏరియాలు, గురుగ్రామ్‌లోని పాష్ ఏరియాల మధ్య ధరల వ్యత్యాసం ఇప్పుడు తగ్గుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ఇటీవల, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్‌పై ఒక నివేదికను అందించింది.బాల్కనీలోంచి చూస్తే..డీఎల్ఎఫ్ ది కామెల్లియాస్లోని ఫ్లాట్‌లో 72 అడుగుల గాజు బాల్కనీ ఉంటుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి అతిథులు కోసం మరొకటి ఆ ఫ్లాట్‌లోని వారి కోసం రూపొందించారు. ఈ బాల్కనీ వినోదాలకు కేంద్రంగా ఉంటుంది. దీనిలో డైనింగ్ ఏరియా, ఫార్మల్ సీటింగ్, ఫ్యామిలీ మీటింగ్స్ కోసం ప్రత్యేక కార్నర్లు ఉన్నాయి. ఈ బాల్కనీలోంచి చూస్తే బయటనున్న స్విమ్మింగ్ పూల్, పచ్చని చెట్లు కనిపిస్తాయి.లగ్జరీ లివింగ్‌లో కొత్త బెంచ్మార్క్ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్‌లో సింపుల్‌గా ఉంటుంది. క్లాస్సి, స్పెషల్ ఫర్నిషింగ్‌ను ఇందుకోసం వినియోగించారు. డీఎల్ఎఫ్కు చెందిన ఐకానిక్ ప్రాజెక్ట్‌లు ‘ది అరాలియాస్’, ‘ది మాగ్నోలియాస్’ మాదిరిగా ఈ ప్రాజెక్ట్ కూడా ఢిల్లీ- ఎన్సీఆర్లో అల్ట్రా-లగ్జరీ లివింగ్ కోసం కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. కాగా ది కామెల్లియాస్కు మించిన పెద్ద ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించేందుకు డీఎల్ఎఫ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.కొత్త ప్రాజెక్టులో..డీఎల్ఎఫ్ దహ్లియాస్ పేరుతో నిర్మితమవుతున్న ఈ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ గోల్ఫ్ కోర్స్ రోడ్, గురుగ్రామ్‌లో నిర్మింతం కానుంది. సగటున ఒక అపార్ట్‌మెంట్‌కు దాదాపు రూ.100 కోట్లు ఖర్చుకానుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 34,000 కోట్లుగా అంచనా. ఇందులో 9,500 చదరపు అడుగుల నుండి 16,000 చదరపు అడుగుల వరకు నివాస స్థలాలు ఉంటాయి. దహ్లియాస్‌లో 2,00,000-చదరపు అడుగుల క్లబ్‌హౌస్ ఏర్పాటు కానుంది. ఇది కామెల్లియాస్లోని క్లబ్‌హౌస్ కంటే చాలా పెద్దదిగా ఉండనుంది. ఇది లగ్జరీ మార్కెట్లో మరింత ఆకర్షణీయంగా మారనుంది.ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా..? ధరలు.. ఏ ఏరియాలో ఎంత?
సాక్షి, సిటీబ్యూరో: స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి రేట్లు పెరుగుతుండటంతో అపార్ట్మెంట్ల ధరలు సైతం పెరుగుతున్నాయి. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు, గృహాల సరఫరా తక్కువగా ఉంటుంది.కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్‌లో అంతర్జాతీయ మౌలిక వసతులు, హైరైజ్ ప్రాజెక్ట్‌లతో ఫ్లాట్ల ధరలు ఎక్కువ పలుకుతున్నాయి. కరోనా తర్వాత విశాలమైన అపార్ట్మెంట్లు, హైరైజ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. దీంతో బిల్డర్లు హైరైజ్ ప్రాజెక్ట్‌లలో స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్ వంటి ఆధునిక వసతులను కల్పిస్తున్నారు.కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటి పరిధిలో చ.అ.కు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పైగానే ధరలు ఉంటున్నాయి. నగరంలో అపార్ట్మెంట్ చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,500 ఖర్చవుతోంది. భవనం ఎత్తును బట్టి నిర్మాణ వ్యయం పెరుగుతూంటుంది.నోట్: అపార్ట్మెంట్ విస్తీర్ణం, వసతులు, ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది. -
సొసైటీలో ‘సభ్యత్వ’ బేరం!
సాక్షి, హైదరాబాద్: ‘‘రండి బాబు.. రండి.. అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనండి.. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో భాగస్వాములు కండి.. ఇక్కడ కొనండి.. అక్కడ సభ్యత్వం పొందండి..’’ ఎన్నో అక్రమాలకు కేరాఫ్‌గా మారిన జూబ్లీహిల్స్ సొసైటీ పాలకవర్గం చేస్తున్న ప్రచారమిది. సొసైటీకి ఏ మాత్రం సంబంధం లేని, ఇంకా కట్టని, అసలు ఎలాంటి అనుమతుల్లేని వెంచర్లో ఫ్లాట్లను అంటగట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. 13.713 ఎకరాలు.. 1,900 ఫ్లాట్లు.. 40 ఫ్లోర్లు.. రివర్ వ్యూ, హైరైజ్ అంటూ జూబ్లీహిల్స్–4 పేరిట విక్రయాలు చేస్తోంది. ఇదంతా నమ్మి రూ.లక్షలు పోసి కొనుగోలు చేస్తే.. ఏదో ఒకరోజు ‘హైడ్రా’ ఎటాక్ తప్పని పరిస్థితి. ఈ వెంచర్‌కు సంబంధించి స్థానికులు, కొందరు సభ్యులు పలు కీలక వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్–4 వెంచర్స్ పేరుతో.. ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ (జేహెచ్‌సీహెచ్‌బీఎస్)’ పాలకవర్గం కొత్త దందాకు తెర తీసింది. ఓ ప్రైవేట్ వెంచర్లో ప్రపోజ్డ్ డెవలపర్‌గా ప్రవేశించి.. ఫ్లాట్లు విక్రయించే పని చేపట్టింది. ఫ్లాట్లు అమ్మేందుకు భారీ స్కెచ్ వేసింది. ఎంతో డిమాండ్ ఉన్న ‘జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ’లో కొత్తగా సభ్యత్వాలను మొదలుపెట్టింది. సభ్యత్వం కావాలంటే.. ప్రైవేట్ వెంచర్లో ఫ్లాట్ కొనాలని కొర్రీపెట్టి, అంటగడుతోంది. సొసైటీ నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించడం లేదని పాలకవర్గం చెప్తున్నా.. ఇక్కడ సభ్యత్వాలు ఇచ్చే సమయంలోనే వెంచర్ తెరపైకి ఎలా వచ్చింది? అది ప్రైవేట్ వెంచర్ అయినప్పుడు సొసైటీ ఎందుకు విక్రయిస్తోంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీని వెనుక వందల కోట్ల స్కామ్ ఉందంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఫ్లాట్ల అమ్మకాలకు సంబంధించి చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ)కు ఇంత అన్న లెక్కన కొందరి జేబుల్లోకి సొమ్ము చేరేలా తతంగం నడిపిస్తున్నారనే చర్చ సాగుతోంది. అందుకే కొత్తగా సభ్యత్వం కోసం వస్తున్నవారికి ‘‘దాదాపు 15 వేల కోట్ల ఆస్తులపై మీకు హక్కులు వస్తాయి. క్లబ్‌కు వెళ్లొచ్చు. స్కూల్లో మీ పిల్లలను చదివించొచ్చు. కమ్యూనిటీ సెంటర్ వంటివి వినియోగించుకోవచ్చు..’’ అంటూ ప్రచారం చేస్తున్నారని సభ్యులు చెప్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ఫేజ్–4లో ఫ్లాట్ కొనుగోలు చేయాల నే షరతు పెట్టారని, భవిష్యత్‌లో అన్ని అనుమతులు రా కుంటే పరిస్థితి ఏమిటనేది ఎక్కడా పేర్కొనలేదని అంటున్నారు. ఇదంతా తెలియని కొందరు మాత్రం సిటీ మధ్య లోని ఆస్తుల్లో భాగస్వాములం కాబోతున్నామనే ఆశతో సొసైటీ పాలకవర్గం బుట్టలో పడుతున్నారని చెప్తున్నారు. మాకే ఇంకా స్థలాలు ఇవ్వలేదంటూ.. మరోవైపు దశాబ్దాలుగా సొసైటీలో సభ్యులుగా ఉన్న తమకే స్థలాలు ఇవ్వలేదని.. ప్రైవేట్ వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇక్కడ రూ.5 లక్షలు తీసుకుని సభ్యత్వం ఇవ్వడమేంటని కొందరు సభ్యులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా తమ సొసైటీ సభ్యులుగా ఉన్నా.. ఈ అక్రమాలపై స్పందించడం లేదేమని ప్రశ్నిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫేజ్–4 బ్రోచర్‌ను నేరుగా మంత్రి తుమ్మలతోనే ఆవిష్కరింపజేశారు. దీనివల్ల ఇబ్బందులు, అనుమానాలు ఉండవనే ఎత్తుగడ ఉన్నట్టు స్పష్టమవుతోందని సొసైటీ సభ్యులు చెప్తున్నారు. జనం ఫ్లాట్ల కొనుగోలుకు ముందుకొస్తారని, అధికారులు జోక్యం చేసుకోకుండా ఓ సంకేతం ఉంటుందని అంటున్నారు. నిజానికి ఇక్కడి మోసాలు, అక్రమాలు మంత్రికి తెలియకుండా తప్పుదారి పట్టించారని ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ సొసైటీని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సొసైటీ మార్చారని వాపోతున్నారు. ఒక్కో షేర్‌కు రూ.300 చొప్పున వసూలు చేసి.. రూ.15,000 కోట్ల ఆస్తులపై హక్కులు ఎలా కలి్పస్తారని కొందరు సభ్యులు ప్రశి్నస్తున్నారు. సొసైటీ మొత్తం సభ్యులు 5,000 మంది అనుకున్నా.. ఒక షేర్ కొన్న కొత్త సభ్యుడి వాటా సుమారు రూ.30 లక్షలు అవుతుందని... ఇలా ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమిటా వెంచర్.. ఎక్కడ? నార్సింగి పరిధిలోని మంచిరేవుల వద్ద టింబర్ చెరువును ఆనుకుని జూబ్లీహిల్స్ ఫేజ్–4 పేరుతో చేపడుతున్న ఈ వెంచర్‌కు రహదారి వివాదం ఉంది. దేవాదాయ శాఖ భూముల్లోంచి దారితీసే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు. వెంచర్‌కు అనుమతి రావాలంటే దారి చూపించాలి. అది సాధ్యం కాదు గనుక వెంచర్ ఏర్పాటు కలేనని స్థానికులు అంటున్నారు. ఎవరైనా వాస్తవాలు తెలుసుకున్నాకే కొనుగోలు చేయాలని స్పష్టం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఇదంతా తెలిసినా.. వెంచర్ బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారని సమాచారం. అలాగే వదిలేస్తే భవిష్యత్‌లో హైడ్రా దృష్టిలో పడితే ఎలాగని, తమ ఉద్యోగానికి ఎసరొచ్చే పరిస్థితి వస్తుందేమోనని కలవరపడుతున్నారు.జవాబు లేని ప్రశ్నలెన్నో.. » రహదారే లేకుండా హెచ్ఎండీఏ నుంచి వెంచర్‌కు అనుమతి ఎలా వస్తుంది? » అనుమతి లేని వెంచర్లో ప్లాట్లు తీసుకోవాలని సభ్యులపై ఒత్తిడి ఎందుకు? » షరతు విధిస్తూ సభ్యత్వ నమోదు ఫారం ఇస్తున్నా సహకార శాఖ అధికారులెక్కడ? » ఇలా అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నా సహకార శాఖ అధి కారులు కళ్లు మూసుకుని కూర్చోవడం వెనుక ఏం జరుగుతోంది?మా భూమిలో నుంచి రోడ్డు లేదు మంచిరేవుల రెవెన్యూ పరిధిలో జూబ్లీహిల్స్ ఫేజ్–4 పేరుతో వస్తున్న వెంచర్‌కు ఉత్తరం వైపు నుంచి 40 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. ఆ రోడ్డుతో అనుమతులు రావనే ఉద్దేశంతో.. 70ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సర్వే నంబర్ 293లోని దేవాదాయ శాఖ భూమిలో నుంచి వంద అడుగుల రోడ్డు ఉన్నట్టు చూపుతూ హెచ్ఎండీఏ, ఇతర అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికే రోడ్డు వేసేందుకు ప్రయతి్నస్తే అడ్డుకున్నాం. వారికి అనుమతులు రాకుండా హెచ్ఎండీఏలో ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి అనుమతులు లేని వెంచర్లలో ఫ్లాట్లు కొని మోసపోవద్దు. – పి.సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్, మంచిరేవులప్రైవేటు కేసులు, రోడ్డు డాక్యుమెంట్లు చూసుకోవాలి మంచిరేవులలో సర్వే నంబర్ 234, 236, 237, 263, 264, 265, 266, 267లలో ఉన్న భూమి పట్టాభూమి. దానికి ఉత్తరం వైపు గ్రీన్‌ఫీల్డ్ లే–అవుట్లో నుంచి రోడ్డు ఉంది. రెవెన్యూపరంగా కేసులు లేవు. ప్రైవేటుగా ఉన్న కేసులు, రోడ్డు సౌకర్యం, ఇతర వివరాల డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలి. కొంత మేర ఇటికిన్ చెరువు బఫర్ ఈ భూమికి తగిలి ఉంటుంది. ఇటీవల దేవా దాయ శాఖ భూమిలో నుంచి రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రయతి్నస్తే స్థానికులు అడ్డుకున్నారు. కోర్టుల్లో కేసులు ఉన్నాయనే విషయం ప్రచారంలో ఉంది. – నర్రా శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, గండిపేట మండలం -
మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే?
'ఆదిపురుష్' సినిమాతో సీతమ్మగా మనందరికీ తెలిసిన హీరోయిన్ కృతి సనన్ మరో ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఓవైపు నటిగా హిట్స్ కొడుతున్న ఈమె.. మరోవైపు బిజినెస్‌లోనూ పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో ఖరీదైన ఫ్లాట్ సొంతం చేసుకుంది. ఇంతకీ దీని రేట్ ఎంత? ఈ ఫ్లాట్ స్పెషాలిటీ ఏంటి?(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది.. ధర ఎంతంటే?)బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో హీరోయిన్గా కృతి సనన్ బాగానే కలిసి వస్తోంది. 2023లో ఈమె చేసిన మూడు సినిమాలు సరిగా ఆడనప్పటికీ.. ఈ ఏడాది మాత్రం 'తేరే బాతోన్ మే ఐసా ఉల్జా జియా', 'క్రూ' చిత్రాలతో హిట్ కొట్టింది. గతేడాది రూ.35 కోట్లతో బంగళా, రెండు ఫ్లాట్స్ కొనుగోలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని సొంతం చేసుకుంది.ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో 2000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ ఫ్లాట్ ఉంది. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోదా అనే ప్రాజెక్టులోని ఫ్లాట్ ఇది. మొన్నీమధ్య అమితాబ్ బచ్చన్ కూడా ఇందులోనే ఫ్లాట్ కొన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి కృతి సనన్ చేరింది. ఏదేమైనా చేతిలో డబ్బులున్నప్పుడే ఆస్తులు కూడబెట్టుకోవాలనే విషయాన్ని కృతి పక్కాగా ఫాలో అవుతున్నట్లుంది!(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలేవో తెలుసా?) -
47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా పేరున్న ముంబై నగరంలో కోట్లాది రూపాయలు పెట్టి భవంతులు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ వజ్రాల వ్యాపారి సుమారు రూ.97 కోట్లు పెట్టి ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.రియల్ఎస్టేట్ సమాచార సంస్థ జాప్కీకి లభించిన పత్రాల ప్రకారం.. డైమండ్ కంపెనీ కిరణ్ జెమ్స్ ప్రమోటర్ మావ్జీభాయ్ షామ్‌జీభాయ్ పటేల్ ముంబైలోని పోష్ ఒబెరాయ్ 360 వెస్ట్‌లో రూ. 97.4 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. వర్లీలో ఉన్న ఈ అపార్ట్మెంట్ భవనాన్ని ముంబైలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్‌లో ఒకటిగా పరిగణిస్తారు.అపార్ట్మెంట్ భవనంలోని 47వ అంతస్తులో మావ్జీభాయ్ కొన్న ఫ్లాట్ 14,911 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ విస్తీర్ణాన్ని మరో 884 చదరపు అడుగులు విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పత్రాల ప్రకారం.. దీని విక్రేత ఒయాసిస్ రియాల్టీ భాగస్వామి అయిన స్కైలార్క్ బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అపార్ట్మెంట్ తొమ్మిది కార్ పార్కింగ్ స్లాట్లతో వస్తుంది. సేల్ డీడ్ ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీపై పటేల్ రూ.5.8 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.ముంబైలోని 360 వెస్ట్ ప్రాజెక్ట్ 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే యూనిట్లను కలిగి ఉంటుంది. రెండు టవర్లుగా ఉండే ఈ భవనంలో ఒక దాంట్లో రిట్జ్-కార్ల్టన్ హోటల్ ఉండగా మరో టవర్‌లో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. వీటిని గ్లోబల్ హాస్పిటాలిటీ చైన్ నిర్వహిస్తోంది. సముద్ర వీక్షణ ప్రాజెక్ట్ అయిన దీని ఎత్తు 360 మీటర్లు ఉండటం, అన్ని అపార్ట్మెంట్లు పడమర వైపు ఉన్నందున దీనికి ఈ పేరు వచ్చింది. -
కొత్త ఫ్లాట్ కొన్న హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. రేటు ఎంతంటే?
'సీతారామం', 'హాయ్ నాన్న' తదితర చిత్రాలతో తెలుగులో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకుర్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె ముంబయిలోని ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. అయితే ఈ ఫ్లాట్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ ఫ్యామిలీది కావడం విశేషం. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'బిగ్‌బాస్' ప్రియాంక.. ఆ తప్పు వల్లే ఇలా!) ముంబయికి చెందిన మృణాల్ ఠాకుర్.. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. బాలీవుడ్లో లవ్ సోనియా, సూపర్ 30, బత్లా హౌస్ తదితర చిత్రాలు చేసింది. ఉన్నంతలో ఓ మాదిరిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే 2022లో 'సీతారామం' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి సౌత్‌లో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆచితూచి ఒక్కో చిత్రంలో నటిస్తున్నప్పటికీ అవన్నీ మృణాల్‌కి మరింత పేరు తెచ్చి పెడుతున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో ముంబయిలోని అంధేరి ప్రాంతంలో కొత్తగా ఫ్లాట్ కొనుగోలు చేసింది. గతంలో ఇది హీరోయిన్ కంగనా రనౌత్ తండ్రి-సోదరుడికి సంబంధించినది. ఇప్పుడు దీన్ని మృణాల్ సొంతం చేసుకుంది. అయితే దీని విలువ ఎంతనేది బయటకు రాలేదు గానీ దాదాపు రూ.10 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు. ఏదైతేనేం మృణాల్ కొత్త ఫ్లాట్ రేటు గురించి ఓ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) -
100 కోట్లతో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సీఈఓ.. ఇంతకి ఎవరామె?
దేశంలో లగ్జరీ ఇళ్లకు అంతకంతకూ పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ ఢిల్లీలోని గురుగ్రామ్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌పై ఫ్రీ-లాంచ్ ప్రకటించింది. అలా అనౌన్స్ చేసిందో లేదో ఇలా లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఎగబడ్డారు. కేవలం 72 గంటల్లో రూ.7200 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడు పోయాయి. ఢిల్లీతో పాటు ముంబైలో ఖరీదైన ప్లాట్లు ఊహించని విధంగా అమ్ముడు పోతున్నాయి. తాజాగా, ముంబైలో ఓ లగ్జరీ ప్లాట్ అమ్ముడుపోయింది. ఆ ఫ్లాట్ విలువ అక్షరాల రూ.116.42 కోట్లు. ఇంతకి ఆ ప్లాట్‌ను కొనుగోలు చేసింది ఎవరని అనుకుంటున్నారా? 49వ ఫ్లోర్లో ఇల్లు ప్రముఖ లగ్జరీ హోం డెకోర్ కంపెనీ మైసన్ సియా ఫౌండర్, అండ్ సీఈఓ ఫ్యాషన్ డిజైనర్ వ్రాతికా గుప్తా ఆకాశ హర్మ్యాలను తాకుతూ ముంబైలోని లోయర్ పారెల్ ప్రాంతంలో 52 ఫ్లోర్లతో నిర్మించిన త్రీసిక్స్టీ వెస్ట్‌లో ఓ ప్లాన్‌ను సొంతం చేసుకున్నారు. 49వ ఫ్లోర్లో 12,138 స్కైర్ ఫీట్లో ఉన్న ఈ ఫ్లాట్‌లో సుమారు 8 కార్ల వరకు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. వ్రాతికా గుప్తా ఎవరు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ,పెర్ల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్‌లో పూర్వ విద్యార్థిని వ్రాతిక గుప్తా. అంజుమన్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌లో అపెరల్ డిజైనర్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో తన వృత్తిని ప్రారంభించారు. 2009 నుండి 2011 వరకు అంజూమోడీ డిజైనర్‌గా, టూ వైట్ బర్డ్స్‌లో డిజైన్ డైరెక్టర్‌గా పని చేశారు. 2017లో వస్త్రప్రపచంలోకి అడుగు పెట్టారు వ్రాతిక. వ్రాతిక & నకుల్‌ని స్థాపించారు. భర్త నకుల్ అగర్వాల్‌తో కలిసి భారతీయ వారసత్వం ఉట్టిపడేలా బ్రాండెడ్ డిజైన్లను తయారు చేస్తున్నారు. 2022లో మైసన్ సియా అనే లగ్జరీ హోమ్ డెకర్ బ్రాండ్‌తో రియల్ ఎస్టేట్‌లో విభాగంలో రాణిస్తున్నారు. -
ఖరీదైన ఫ్లాట్ కొన్న స్టార్ హీరోయిన్ కుమార్తె!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, సారికల కూతురు అక్షర హాసన్ గురించి చాలామందికి తెలియదు. అక్షర సినిమాల్లో నటించినప్పటికీ శృతిహాసన్‌లా గుర్తింపు రాలేదు. 2015లో షమితాబ్ సినిమాతో అక్షర ఎంట్రీ ఇచ్చింది. ఆమె హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించింది. వివేగం, లాలీకీ షాదీ మే లాడ్డూ దీవానా అనే సినిమాల్లో కనిపించింది. అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న అక్షర హాసన్.. ఖార్ ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. దాని విలువ దాదాపు రూ.15.75 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 అంతస్తులున్న టవర్‌లో 13వ ఫ్లోర్లో ఇంటిని కొనుగోలు చేసింది. కాగా.. అక్షర ప్రస్తుతం తన తల్లి సారికతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. కమల్ హాసన్‌తో 2004లో సారిక ఠాకూర్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అక్షర 2015లో బాలీవుడ్ చిత్రం షమితాబ్లో అమితాబ్ బచ్చన్, ధనుష్‌లతో కలిసి నటించింది. ఆమె చివరిగా తమిళ చిత్రం అచ్చం మేడం నానం పయిర్పులో కనిపించింది. అక్షర హాసన్ కేవలం నటనే కాదు.. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. మహిళల హక్కుల కోసం, లింగ సమానత్వం, మహిళ మానసిక ఆరోగ్యం వంటి సమస్యలపై పోరాటం చేస్తోంది. View this post on Instagram A post shared by Akshara Haasan (@aksharaa.haasan) -
సాక్షి మనీ మంత్రా: రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్‌మార్కెట్లు
Today Stockmarket Closing bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిసాయి. ఆరంభం నుంచి స్తబ్దుగా కదలాడిన సూచీలు చివరికి వరుసగా రెండో రోజు కూడా బలహీన్‌నోట్‌లో ముగిసాయి.సెన్సెక్స్ 78.22 పాయింట్లు క్షీణించి 65,945 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 19,665 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19700 దిగువకు చేరింది. బ్యాంక్, ఫార్మా , ఐటీ మినహా మిగిలిన అన్ని సూచీలు ప్రధానంగా ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 0.5 శాతం లాభంతో గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది వోడాఫోన్ ఐడియా ఏకంగా 7శాతం లాభపడి 20 నెలల గరిష్టానికి చేరింది. ఐషర్ మోటార్స్, హీరో మోటో, నెస్లే, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ టాప్ గెయినర్స్‌గా టెక్ ఎం, సిప్లా, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్ర, అదాని ఎంటర్ ప్రైజెస్ టాప్ లూజర్స్‌గా మిగిలాయి. రూపాయి:డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం 10 పైసల నష్టంతో 83.23 వద్ద ముగిసింది. సోమవారం 83.14 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ఐటీ దెబ్బ, ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్
Today Stock Market Closing bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. ఉదయం నుంచీ లాభ నష్టాల మధ్య ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు పెరిగి 66,024, నిఫ్టీ 19,675 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ 1.5 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.3 శాతం పెరగగా, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ స్వ్పలంగా నష్టపోయాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగిసింది. బజాజ్ ఫైనాన్స్, టాటా క న్జూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా టాప్ గెయనర్స్‌గా నిలిచాయి. మరోవైపు హిందాల్కో, ఎస్బీఐ లైఫ్, హీరోమోటో, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సోమవారంనష్టాల్లో ముగిసింది. మరియు శుక్రవారం ముగింపులో 82.93 వద్ద డాలర్‌కు 21 పైసలు తగ్గి 83.14 వద్ద ముగిసింది. -
అపార్ట్మెంట్ బదులు భూములు కొంటే 10 రెట్ల లాభం! ఎలాగో తెలుసా?
పెట్టుబడి మార్గంగా అపార్ట్మెంట్ కొంటున్నారా? అయితే సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ కంటే భూమిపై పెట్టుబడి పెట్టడం వల్ల 10 రెట్లు ఎక్కువ రాబడిని ఇస్తుందని కొలియర్స్ (Colliers)అడ్వైజరీ సర్వీసెస్ ప్రచురించిన నివేదిక తెలిపింది. అద్దె రూపంలో రాబడి అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో భూములు కొని అద్దెకు ఇవ్వడం ద్వారా అపార్ట్మెంట్ల కంటే 10 రెట్లు అధిక రాబడి పొందవచ్చని కొలియర్స్ నివేదిక పేర్కొంది. సిటీ సెంటర్‌కు సమీపంలో ఉండటం, రాబోయే మౌలిక సదుపాయాలు, సామాజిక సౌకర్యాలు, పర్యాటక ఆకర్షణలు, ఆర్థిక స్థోమత వంటివి దేశ వ్యాప్తంగా ప్రాపర్టీ అప్రిషియేషన్కు కీలకమైన చోదకాలుగా ఉన్నాయని ‘టాప్ ఇన్వెస్ట్మెంట్ కారిడార్స్ ఇన్ ఇండియా’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక వివరించింది. రియల్ ఎస్టేట్ రంగంలో ట్రాక్షన్ కొనసాగుతోందని, దీనికి తోడు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగం పెరిగిందని, భారతదేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లోని మైక్రో-మార్కెట్లు కీలక పెట్టుబడి కారిడార్లుగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించింది. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ కారిడార్లు వ్యవసాయేతర భూమి లభ్యత అత్యధికంగా ఉండటంతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాల రాక వంటి అంశాల ఆధారంగా మహారాష్ట్రలోని వసాయి విరార్, భివండి, నేరల్-మాథెరన్ వంటి ప్రాంతాలు కీలకమైన హాట్స్పాట్లుగా ఉన్నట్లు కొలియర్స్ నివేదిక గుర్తించింది. హైదరాబాద్‌లోనూ.. కీలకమైన పెట్టుబడి ప్రాంతాలలో ఒకటిగా పరిగణించే మహారాష్ట్రలోని నెరల్-మాథెరన్ మైక్రో-మార్కెట్లో హాలిడే హోమ్‌లకు సగటు వార్షిక అద్దె రాబడి 15 శాతం ఉంటుందని, రాబోయే 10 సంవత్సరాలలో భూమి పెట్టుబడులపై ఐదు రెట్లు రాబడిని పొందగలదని అంచనా వేసినట్లు నివేదిక పేర్కొంది. గుజరాత్‌లోని పర్యాటక, పారిశ్రామిక కేంద్రం - సనంద్ నల్ సరోవర్ కారిడార్, చెన్నైలోని ECR, హైదరాబాద్‌లోని మేడ్చల్, కోల్‌కతాలోని న్యూ టౌన్, రాజర్హట్లు కూడా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పింది. పుష్కలమైన భూమి లభ్యత, పర్యాటకరంగంలో పెరిగిన ట్రాక్షన్, మౌలిక సదుపాయాలను పెంచడం వంటి కారణాలతో ఈ కారిడార్లు పెట్టుబడుల గమ్యస్థానాలుగా అభివృద్ధి చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతాలలో 2.5 నుంచి 4 శాతం సగటు వార్షిక అద్దె రాబడి మధ్య, భూమిపై 6 నుంచి 8 శాతం వార్షిక ధర పెరుగుదల ఉంటుందని వివరించింది. -
ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..
UK Flats: భూమి మీద అత్యంత విలువైనది.. కాలంతోపాటు విలువ పెరిగేది ఏదైనా ఉందంటే అది భూమి (ఇళ్లు) మాత్రమే. అన్ని దేశాల్లోనూ ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతుతున్నాయి. అయితే యూకేలోని ఓ నగరంలో మాత్రం రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లను రూ.100కే విక్రయిస్తున్నారు. లూయీ నగరంలోని కార్నిష్ టౌన్ సెంటర్లో నివాసితులకు చౌకగా ఇళ్లు అందించేందుకు 6,40,000 పౌండ్ల (రూ.6.6 కోట్లు) విలువైన గ్రేడ్ 2 లిస్టెడ్ ఫ్లాట్లను 1 పౌండ్ (రూ.103)కే విక్రయించడానికి కౌన్సిల్ అంగీకరించింది. 11 కోస్ట్‌గార్డ్ ఫ్లాట్లను త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్‌కు విడుదల చేయాలన్న సిఫార్సును కార్న్‌వాల్ కౌన్సిల్ క్యాబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా గ్రాంట్ ఫండింగ్ ద్వారా 1 మిలియన్ పౌండ్లతో పునరుద్ధరణ పనులను చేపట్టడానికి ముందుకొచ్చింది. డిప్యూటీ కౌన్సిల్ లీడర్ డేవిడ్ హారిస్ ప్రకారం.. ‘ఈ ఫ్లాట్లను బహిరంగ మార్కెట్లో విక్రయించడంలేదు. దీని వల్ల ఇప్పటికే రెండో ఇంటి యాజమాన్యం, హాలిడే హోంలు అధిక స్థాయిలో ఉన్న లూయీ పట్టణంలో చౌక గృహ సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కమ్యూనిటీ-నేతృత్వంలోని పునరాభివృద్ధి పథకం ఈ ఫ్లాట్లను పేదలకు మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తుంది. (Flipkart New Feature: ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్!) అధిక సంఖ్యలో హాలిడే హోమ్‌లు ఉండే ఇంగ్లాండ్‌లో సెకండ్ హోమ్‌లు, హాలిడే హోమ్‌ల సమస్య కార్న్‌వాల్‌లో మరీ ఎక్కువగా ఉంది. 2021లో ఈ ప్రాంతంలో 13,000 సెకండ్ హోమ్‌లు ఉన్నట్లుగా కార్న్‌వాల్ లైవ్ నివేదించింది. కౌన్సిల్ 2021లో చేపట్టిన నార్త్ రోడ్ భవనం పునర్నిర్మాణాన్ని ఆర్థికంగా పనికిరానిదిగా, అవసరానికి మించినదిగా ప్రకటించారు. అధిక నిర్వహణ ఖర్చులను నివారించేందుకు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. లూయి కౌన్సిలర్లు ఎడ్వినా హన్నాఫోర్డ్, అర్మాండ్ టామ్స్ మద్దతుతో త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్ 1 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ఖర్చుతో ఆస్తుల పూర్తి పునరుద్ధరణను చేపట్టడానికి ముందుకొచ్చింది. అర్హతలు ఇవే.. ఇదే విధమైన పథకాన్ని 2015లో స్టోక్-ఆన్-ట్రెంట్ కౌన్సిల్ అమలు చేసింది. వీటిపై ఆసక్తి ఉన్నవారు కనీసం ఐదేళ్ల పాటు కొత్త ప్రాపర్టీలలో ఉండటానికి అంగీకరించాలి. ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి. కుటుంబ ఆదాయం 18,000 నుంచి 25,000 పౌండ్ల మధ్య ఉండాలి. కొత్త పథకం పోర్ట్‌ల్యాండ్ స్ట్రీట్ ప్రాంతంలో ఉంటుందా లేదా నగరంలోని మరొక వెనుకబడిన ప్రాంతంలో ఉంటుందా అన్నది ఇంకా నిర్ణయించలేదని హౌసింగ్ క్యాబినెట్ సభ్యుడు, కౌన్సిలర్ రాండీ కాంటే పేర్కొన్నారు. -
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన దబాంగ్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే?
దబాంగ్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తొలి చిత్రంతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా గారాల పట్టిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దహాద్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. సోనాక్షికి ఇది తొలి వెబ్ సిరీస్. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఈ దబాంగ్ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త బీటౌన్‌లో వినిపిస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!) సోనాక్షి సిన్హా ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. బాంద్రా ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం సముద్ర పక్కనే ఉండడంతో సినీ ప్రముఖులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. సోనాక్షి అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయడానికి దాదాపు రూ. 11 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. బాంద్రాలోని ఆరియాట్ భవనంలో ఓ లగ్జరీ ఫ్లాట్ కోసం రూ.55 లక్షల విలువైన స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించింది. ఈ ఏడాది ఆగస్టులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్ సౌకర్యాలు అపార్ట్మెంట్లో నాలుగు కార్లకు పార్కింగ్ సౌకర్యం, లాబీతో పాటు ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ కూడా ఉంది. 2020లో కూడా రూ. 14 కోట్లకు బాంద్రాలో విలాసవంతమైన ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సోనాక్షి రాబోయే సినిమాలు సోనాక్షి చివరిసారిగా విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య కలిసి నటించిన వెబ్ సిరీస్ దహాద్లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్‌లో నటించనుంది. దీనికి ఆమె సోదరుడు కుష్ సిన్హా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో సోనాక్షి కూడా కీలక పాత్రలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
సాక్షి మనీ మంత్రా: మార్కెట్ల యూటర్న్, రూ. 6 లక్షల కోట్లు ఆవిరి
Today Market Closing: దేశీయ మార్కెట్లు యూటర్న్ తీసుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులమధ్య సాగిన సూచీలు చివరికి స్వల్ప లాభాలకు పరిమితమై నాయి ముఖ్యంగా రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల అమ్మకాలతో 380 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. చివరికి సెన్సెక్స్ 94 పాయింట్లు లాభంతో 67,221.13 వద్ద ముగిసింది. అలాగే 20వేలకు ఎగువన మొదలైన నిఫ్టీ ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. నిఫ్టీ 3 పాయింట్లు నష్టంతో 19,993.20 వద్ద ముగిసింది. ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లు ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ & గ్యాస్, మెటల్ , రియాల్టీ ఒక్కొక్కటి 1-3 శాతం చొప్పున నష్టపోయాయి. తద్వారా వరుసగా 7 రోజుల లాభాలకు చెక్ పడింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లోని రూ.324.3 లక్షల కోట్ల నుండి దాదాపు రూ.318.7 లక్షల కోట్లకు పడిపోయింది.అంటే ఒక్క సెషన్లోనే దాదాపు రూ. 5.6 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు కోల్పోయారు.మిడ్, స్మాల్ క్యాప్‌లు ఈరోజు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.96 శాతం క్షీణించి 32,084.93 వద్దకు చేరుకోగా, బిఎస్ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 4.02 శాతం క్షీణించి 36,982.74 వద్దకు చేరుకుంది. నిఫ్టీ ఇండెక్స్‌లో బీపీసీఎల్ ,ఎన్టీపీసీ ,పవర్ గ్రిడ్ ,షేర్లు టాప్ లూజర్లుగా ముగిశాయి. మరోవైపు టిసిఎస్ , లార్సెన్ అండ్ టూబ్రో ,ఇన్ఫోసిస్ ,షేర్లు టాప్ గెయినర్లుగా ముగిశాయి. అటు యుఎస్ ద్రవ్యోల్బణం డేటా ,యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ , యుఎస్ ఫెడ్ ద్రవ్య విధాన సమావేశాలపై దృష్టి సారించడంతో గ్లోబల్ సూచనలు కూడా బలహీనంగా ఉన్నాయి. అలాగే ఈ రోజు తవెల్లడి కానున్న ఆగస్ట్‌లో భారత ద్రవ్యోల్బణం డేటా , జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు రూపాయి: అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 13 పైసలు ఎగిసింది. -
ఈ ఇల్లు చూస్తే నిజంగా అదృష్టవంతులం అనుకుంటారు! ఎందుకంటే..
Tiny 1 BHK Flat In Mumbai: భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబయి (Mumbai) అగ్రస్థానంలో ఉంది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో ఇళ్లు చాలా ఖరీదైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ ఇల్లు కొన్నాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా చాలా కష్టం. అందుకే ఇక్కడ ప్రజలు అత్యంత ఇరుకు అపార్ట్మెంట్లలో నివసిస్తుంటారు. ఇటీవల ఒక ఇన్స్టాగ్రామ్ (Instagram) యూజర్ ముంబైలోని వన్ బీహెచ్‌కే (1 BHK) ఫ్లాట్ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన యూజర్లు.. ఇదెక్కడి ఇల్లురా బాబూ.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఇంట్లో ఉండనందుకు నిజంగా చాలా అదృష్టమంతులమంటూ కామెంట్లు చేస్తున్నారు. సుమిత్ పాల్వే అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఇది సౌత్ బాంబే కాబట్టి ఇరుకు ఇళ్లకు రాజీ పడాల్సిందే అంటూ ఆ వీడియో ప్రారంభంలోనే పేర్కొన్నాడు. అత్యంత చిన్నది, ఇరుకైనది అయిన ఆ ఇంటిని చూపించడానికి చాలా కష్టపడ్డాడు ఆ యువకుడు. అత్యంత ఖరీదైన దక్షిణ ముంబైలో రూ. 2.5 కోట్లు పెట్టి కొనే అపార్ట్మెంట్లు కూడా ఇలాగే ఇరుగ్గా ఉంటాయని, రాజీ పడక తప్పదని వివరించాడు. View this post on Instagram A post shared by SUMIT PALVE (@me_palve) -
సాక్షి మనీ మంత్రా: బ్యాంకింగ్ దెబ్బ, ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. రోజంతా ఒడిదుడులకు మధ్య సాగిన సూచీలు చివరికి ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్ 11 పాయింట్ల లాభంతో 650,87వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభాలకు పరిమితమై 19,347 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 19400 దిగువకు చేరింది. రియల్టీ ఇండెక్స్ 1 శాతం, ఆటో, ఎఫ్ఎంసిజి, ఐటీ మెటల్ 0.5 శాతం పెరిగాయి. మరోవైపు, పవర్, ఆయిల్ & గ్యాస్ ,బ్యాంకింగ్ రంగ షేర్లు 0.5 శాతం తగ్గాయి. టాటా స్టీల్, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గాఉన్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్, బీపీసీఎల్, డా. రెడ్డీస్, హీరోమోటోకార్ప్ భారీ నష్టాల్ని ఎదుర్కొన్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ కూడా నష్టపోయింది. మంగళవారం నాటి ముగింపు 82.70తో పోలిస్తే బుధవారం రూపాయి 82.73 వద్ద స్థిరపడింది. -
అమ్మ ప్రేమకు బహుమతిగా చంద్రుడిపై స్థలం కొన్న కూతురు..
సాక్షి, పెద్దపెల్లి జిల్లా: పెద్దపల్లికి చెందిన ఓ మహిళ తన తల్లి మీద ఉన్న ప్రేమతో చంద్రుడిపై స్థల కొనుగోలు చేసి గిఫ్ట్‌గా అందించారు. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచంద్ర, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత.. తల్లి వకుళాదేవి పేరిట చంద్రుడిపై 2022లో లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఆగస్టు 23న వకుళాదేవి, ఆమె మనువరాలు ఆర్త సుద్దాల పేర్ల మీద చంద్రుడిపై ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. కాగా సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ వద్ద ప్రాజెక్ట్ మేనేజర్‌గ, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. ఇకచంద్రుడిపై భూమిని కొనుగోలు చేయాలి అనుకునే వారు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్‌ను సందర్శించి, భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ సహా పలు ప్రాంతాలు ఉంటాయి. ముందుగా మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను పొందాలి. చదవండి: చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టిన దృశ్యాలు చంద్రుడిపై ఎకరానికి రూ. 35 లక్షలకుపైనే ధర ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి అక్కడ జీవరాశి బతికే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, చాలా మంది తమ ప్రెస్టేజీ కోసం అక్కడ భూమిని కొనుగోలు చేస్తున్నారు. చంద్రుడి మీద కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇప్పటికే అక్కడ భూమిని కొన్నారు. మరోవైపు చంద్రయాన్–3 మిషన్ విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ బుధవారంచంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్ బయటకు వచ్చిది. వాస్తవానికి రోవర్ జీవితకాలం ఒక లూనార్ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది. -
సాక్షి మనీ మంత్రా: లాభాలకు చెక్, అయ్యో,జియో ఫైనాన్షియల్ సర్వీసెస్
Today StockMarketClosing: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్ 3.94 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 65,220వద్ద, నిఫ్టీ 2.90 పాయింట్లు లేదా 0.01 శాతం లాభంతో 19,396.50 వద్ద ముగిశాయి. తద్వారా సోమవారం నాటి లాభాలకు చెక్ చెప్పాయి. ఐటీ, ఫార్మా , పీఎస్‌యు బ్యాంక్ మినహా అన్ని రంగాలు లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ , పవర్ ఒక్కొక్కటి 1 శాతం లాభపడ్డాయి. మెటల్ , ఎఫ్ఎంసిజి ఒక్కొక్కటి 0.5 శాతం ఎగిసాయి. అలాగే నేటి ట్రేడింగ్ సెషన్లో బిఎస్ఇ మిడ్‌క్యాప్ , స్మాల్‌క్యాప్ రెండు సూచీలు తాజా రికార్డు గరిష్టాలను అధిగమించాయి. ఇది కీలక సూ చీలకు ఊతమిచ్చాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ,ఎన్టీపీసీ, హీరోమోటో టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. బీపీసీఎల్, సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, టీసీఎస్ టాప్ లూజర్స్‌గాఉన్నాయి. మరోవైపు సోమవారం మార్కెట్లో లిస్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వరుసగా రెండో రోజు కూడా 5 శాతం కుప్పలకూలడం గమనార్హం.ఎన్ఎస్ఇలో రూ.236.45 వద్ద లోయర్ సర్క్యూట్ అయింది. రూపాయి: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 17 పైసల లాభంతో ముగిసింది. గత ముగింపు 83.11తో పోలిస్తే 82.94 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్ర: ఐటీ జోరు, కోలుకున్న సూచీలు
దేశీయస్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. ఆరంభంలోనే భారీ నష్టాలతో ఉన్నప్పటికీ తీవ్ర ఒడిదుడుకుల మధ్య ముగింపులో కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంతో 65,401.92 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభంతో 19,434 వద్ద ముగిసాయి. దాదాపు 1509 షేర్లు పురోగమించగా, 2101 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో ఎల్‌టిఐఎండ్‌ట్రీ, దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, హెచ్‌యుఎల్, రిలయన్స్ ప్రధానంగా లాభాలను ఆర్జించగా, నష్టపోయిన వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, జెఎస్డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్బీఐ, టాటా స్టీల్ ఉన్నాయి. ఐటీ, ఎఫ్ఎంసిజి మినహా మిగిలిన అన్ని సూచీలు మెటల్ ఇండెక్స్ దాదాపు 2 శాతం నష్టపోయాయి. పవర్, రియాల్టీ , సీఎస్‌యు బ్యాంక్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. అటు డాలరు మారకంలో రూపాయి సోమవారం నష్టపోయింది. శుక్రవారం నాటి 82.85 ముగింపుతోపోలిస్తే 82.95 వద్ద ముగిసింది.బలహీన దేశీయ మార్కెట్లు బలమైన డాలర్ కారణంగా భారత రూపాయి తాజా 10 నెలల కనిష్టానికి పడిపోయింది. బలహీనమైన ఐఐపీ గ్రోత్ కూడా ప్రభావం చూపింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఉద్యోగులకు ఖరీదైన ఫ్లాట్స్: బిలియనీర్ గొప్పమనసు
Savji Dholakia ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఇళ్లు, బంగారం లాంటి భారీ బహుమతులుఇవ్వడంలో సూరత్‌లోని వ్యాపారుల తరువాతే ఎవరైనా. తాజాగా సూరత్‌కుచెందిన బిలియనీర్ కార్మికులకు ఫ్లాట్లను బహుమతిగా ఇవ్వడం విశేషంగా నిలిచింది. ప్రతి సంవత్సరం దీపావళికి తన ఉద్యోగులకు ఖరీదైన బహుమతుల వర్షం కురిపించడం వజ్రాల వ్యాపారికి అలవాటు. (లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించిన ముఖేష్ అంబానీ) సూరత్‌లో అత్యంత ధనవంతుడు హరికృష్ణ ఎక్స్ పోర్ట్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సావ్జీ ధోలాకియా ఏటా తన ఉద్యోగులకు రూ.50 కోట్లకు పైగా ప్రోత్సాహకాలను అందిస్తారు. ఒకసారి తన కార్మికులకు దీపావళి బోనస్‌గా 400 ఫ్లాట్లు , 1260 కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాదిదీపావళి బోనస్‌గా ఉద్యోగులకు ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా బహుమతిగా ఇస్తారు. అత్యంత ప్రతిభ చూపించిన వారికి ఖరీదైన వస్తువులు, నగలు కూడా అందిస్తారు. జీవితంలో ఎవరికైనా తొలి కారు కొనుక్కోవడం అంటేచాలా గొప విషయం. తన ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేలా ఏటీ బహుమతులు ఇస్తూ ఉంటానని, తద్వారా పనితీరు, జీవనశైలి మెరుగుపడుతుంది,వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అంతిమంగా అది కంపెనీకి కూడా ఉపయోగపడుతుంది అని ధోలాకియా ఒకసారి చెప్పారు. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) అంతేకాదు ఎనలేని సంపద ఉన్నప్పటికీ మనవడిని సామాన్య జీవనం గడిపేలా చేశాడు. సావ్టీ మనవడు రువిన్ ధోలాకియా, విద్యను పూర్తి చేసిన తర్వాత అమెరికా నుండి తిరిగి వచ్చాడు. రోజూ సామాన్య జనం పడుతున్న కష్టాలను నేర్చుకోవాలని, గొప్ప మేనేజ్మెంట్ స్కూల్‌తో పోలిస్తే మంచి ఉపాధ్యాయుడిచ్చే అనుభవాలు గొప్పవని సావ్జీ ధోలాకియా విశ్వాసం. ధోలాకియా అమెర్లీలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. 13 ఏళ్లకే చదువు మానేశాడు. 1977లో స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులో తన జేబులో టిక్కెట్టు ఛార్జీగా కేవలం పన్నెండు రూపాయల యాభై పైసలతో సూరత్‌కు వచ్చారు. సూరత్‌లోని తన మామ వజ్రాల వ్యాపారంలో చేరాడు. అతని సోదరులు కూడా వ్యాపారంలో చేరారు. వీరిద్దరూ కలిసి 1984లో తమ సొంత వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సాధారణ కార్మికుడిగా, కూలిగా జీవనం సాగించి అంచెలంచెలుగా ఎదిగిన సావ్జీ ధోలాకియా ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 12000 కోట్లు. 2014 నాటికి, వారు 6500 మంది ఉద్యోగులను కలిగి ఉన్నారు.2022లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది. అంతేకాతు కుటుంబం తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన హెలికాప్టర్‌ను సూరత్‌లో వైద్యం ఇతర అత్యవసర పరిస్థితుల కోసం రూ. 50-కోట్ల బ్రాండ్-న్యూ ఛాపర్‌ని విరాళంగా అందించాలని(గతంలో) నిర్ణయించడం విశేషం. అలాగే సౌరాష్ట్రలోని అమ్రేలి జిల్లాలోని లాఠీ తాలూకాలోని తన స్వస్థలంలో ఇప్పటికే 75 చెరువులను నిర్మించడమేకాదు 20 లక్షలకుపైగామొక్కల్నినాటారు. మొదట్లో ధోలాకియా మొదట గార్మెంట్ షాపులో సేల్స్‌మెన్‌గా, హెటల్లో , వాచ్ అవుట్‌లెట్‌లో ఆఖరికి కూలీగా కూడా పనిచేశాడట.. రెండు రోజులు కూలి పని కూడా చేశాడు. చెన్నైలో రోజుకు అతని సంపాదన. కేవలం రూ.200 మాత్రమే. అందుకే జీవితంలో సగటుమనిషి కష్టాలు, కన్నీళ్లు తెలుసు. ఎంత ఎదిగినా. తాను నడిచి వచ్చిన త్రోవను మర్చిపోలేదు. అందుకే తన సంపాదనలో సింహ భాగం ఉద్యోగులకు ఇస్తూ తన గొప్పదనాన్ని చాటుకుంటున్నారు. -
ఇక వర్క్ ఫ్రం ఆఫీస్.. ఫ్లాట్ అద్దె రూ.2.5 లక్షలు.. 25 లక్షల అడ్వాన్స్!
బెంగళూరు: ఫ్లాట్ అద్దె అడ్వాన్సు రూ.25 లక్షలంటూ వచ్చిన ట్వీట్‌పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ అనంతరం టెక్ ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం నుంచి తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో బెంగళూరులో ఇళ్ల అద్దెలు ఏ స్థాయిలో పెరిగాయనేందుకు ఉదాహరణ ఇది. నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఓ ఫ్లాట్‌కు అద్దె నెలకు రూ.2.5 లక్షలు కాగా, అడ్వాన్స్ రూ.25 లక్షలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు పెద్ద సంఖ్యలో యూజర్లు ఛలోక్తులు సంధించడంతోపాటు మండిపోతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా అనంతరం ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంతోపాటు ఆఫీసుల్లోనూ విధులకు హాజరవ్వాలంటూ ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చాయి. చాలా వరకు కంపెనీలు మళ్లీ ఆఫీసులకొచ్చి డ్యూటీ చేయాలంటూ ఆదేశాలిచ్చాయి. ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు చేరుతుండటంతో ఇళ్ల అద్దెలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఖరీదైన ప్రాంతాల్లోనైతే యజమానులు మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తేజస్వీ శ్రీవాస్తవ అనే టెక్ కంపెనీ సీఈవో ట్విట్టర్లో ప్రస్తావించారు. హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని 4 బీహెచ్‌కే ఫ్లాట్‌కు నెల వారీ రెంట్ రూ.2.5 లక్షలు, డిపాజిట్ రూ.25 లక్షలంటూ ఉన్న ప్రకటనను చూసి ఆయన షాకయ్యారు. అడ్వాన్స్‌కు అవసరమైన మొత్తానికి లోన్ ఆప్షన్ కూడా ఉండటం ఆయన్ను మరింత షాక్‌కు గురి చేసింది. ఆయన ఈ ప్రకటనను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పెట్టారు. ‘కిడ్నీ అమ్ముకోవడానికి కూడా ఆప్షన్ ఉంటే బాగుండేది’అంటూ శ్రీవాస్తవ క్యాప్షన్ ఇచ్చారు. ఆ ట్వీట్లపై కామెంట్లు పోటెత్తాయి. కొందరు నెటిజన్లు ఇంటి అద్దెలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా ఇంకొందరు రుణం కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్‌పై మండిపడ్డారు. చివరి రెండు సున్నాల ముందు చుక్క పెట్టడం మరిచిపోయారేమో అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా కామెంట్ చేశారు. They should add an option: Apply for Kidney Donation.#Bangalore #HouseRent#Bengaluru #HSRLayout@peakbengaluru pic.twitter.com/KPyeKmkfyF — Tejaswi Shrivastava (@trulytazz) July 27, 2023 -
హెచ్డీఎఫ్సీ ట్విన్స్ షాక్: ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.రికార్డు స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్వల్ప లాభాలకు పరిమితమవుతున్నాయి. సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంతో 65,485 వద్ద,నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 19397 వద్ద కొనసాగుతున్నాయి. రియల్టీ ఇండెక్స్ 0.5 శాతం నష్టల్లోనూ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజి, ఆయిల్ అండ్ గ్యాస్ పవర్ ఇండెక్స్‌లు 0.5-1 శాతం లాభాల్లో ఉన్నాయి. (రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన) ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్, హీరో మోటో, ఇండస్ఇండ్ బ్యాంకు లాభాల్లో టాప్‌లో ఉండగా, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ,టాటా కన్జ్యూమర్, డా. రెడ్డీస్, అదానీ పోర్ట్స్ నష్టపోతున్నాయి. -
హౌసింగ్ స్కీం: 5500 ఫ్లాట్లు, రూ.9.89 లక్షలకే ఫ్లాట్
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) గృహకొనుగోలుదారులకు భలే మంచి శుభవార్త అందించింది. వివిధ ప్రదేశాలలో 5,500 ఫ్లాట్లతో కూడిన కొత్త గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో రూ. 9.89 లక్షల ప్రారంభ ధరకే ఫ్లాట్‌ను అందించ నుంది. శుక్రవారం (జూన్ 30) ప్రారంభించిన ఈ పథకంలో ముందుగా వచ్చిన వారికి, ముందుగా కేటాయింపు ప్రాతిపదికన వీటిని విక్రయించ నుంది. ఫ్లాట్లలో 1-BHK, 2-BHK ,3-BHK ఇళ్లు ఉన్నాయి. అత్యున్నత నిర్ణయాధికార సంస్థ జూన్ 14న ఆన్లైన్లో ఫస్ట్-కమ్, ఫస్ట్ సర్వ్ హౌసింగ్ స్కీమ్ ఫేజ్ 4ను ప్రారంభించేందుకు ఆమోదించింది. ఈ పథకం టోకెన్ చెల్లించి తమ కిష్టమైన ప్రాంతంలో ఫ్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) డీడీఏ హౌసింగ్ స్కీమ్‌లోని ఫ్లాట్ల వివరాలు 1-BHK ఫ్లాట్లు నరేలా, సిరాస్‌పూర్, రోహిణి, లోక్‌నాయక్ పురంలో ఉన్నాయి 2-BHK ఫ్లాట్లు నరేలా ,ద్వారకలో ఉన్నాయి 3-BHK ఫ్లాట్లు జసోలాలో ఉన్నాయి (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) ఫ్లాట్లు: ధరలు సుమారుగా 1-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 9.89 లక్షల -రూ. 26.98 లక్షలు, లోక్‌నాయక్ పురంలో రూ. 28.47 లక్షలకు 2-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 1 కోటి నుండి రూ. 1.23 కోట్లకు-ద్వారకలో రూ. 1.33 కోట్లు 3-BHK ఫ్లాట్లు: రూ. 2.08 కోట్ల నుండి రూ. 2.18 కోట్లు బుకింక్ అమౌంట్ 1-BHK ఫ్లాట్లు: రూ. 50,000 (ఆర్థికంగా వెనుకబడినవారికి ), రూ. 1 లక్ష (జనరల్) 2-BHK ఫ్లాట్: రూ. 4 లక్షలు 3-BHK ఫ్లాట్: రూ. 10 లక్షలుచెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, అవసరమైన సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సిఉంటుంది. జూన్ 30 సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్. జూలై 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి (మరిన్ని అప్డేట్స్కోసం చదవండి: సాక్షిబిజినెస్)