
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో నాలుగు రోజుల లాభాలకు సూచీలు చెక్ చెప్పాయి. ఫలితంగా సెన్సెక్స్ 101 పాయింట్లు క్షీణించి 61019 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు కోల్పోయి 18120 వద్ద కొనసాగుతున్నాయి.
షేర్లు నష్టపోతుండగా, మీడియా, ఫార్మా షేర్ల లాభాలకు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. దీంతో నిఫ్టీ 18 వేలకు ఎగువన, సెన్సెక్స్ 61 వేలకు ఎగువన స్థిరంగా ఉన్నాయి. మరోవైపు అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ స్టేట్‌మెంట్‌ను ప్రకటించనుంది.దీంతో ట్రేడర్ల అప్రమత్తత కొనసాగుతోంది.
సన్‌ఫార్మా, డా.రెడ్డీస్, హిందాల్కో, ఐటీసీ లాభపడుతుండగా, భారతి ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, మారుతి, హీరో మోటార్స్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టంతో ఉంది. 1 పైసా నష్టంతో 82.70 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment