
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్పల్ప నష్టాలతో ముగిసాయి. రికార్డు స్థాయి లాభాల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి మళ్లిన సూచీలు మిడ్ సెషన్ నుంచి కోలుకున్నాయి. ఒక దశంలో 300 పాయింట్లకు కోల్పోయినా, చివరికి సెన్సెక్స్ 85 పాయింట్ల నష్టంతో 51849 వద్ద, నిఫ్టీ ఒక పాయింట్ లాభంతో వద్ద 15576 పటిష్టంగా ముగిసాయి. బ్యాంకింగ్ మెటల్, ఫార్మా ఇండెక్స్ లాభపడగా, ఐటీ , ఎఫ్‌ఎంసిజి కంపెనీల షేర్లలో అమ్మకాలు కనిపించాయి. రిలయన్స్, ఇండస్ ఇండ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో , మారుతి, అదానీ పోర్ట్స్ టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాల్లో ముగిసాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఐటీసి, ఇన్పోసిస్, యాక్సిస్, టైటన్, విప్రో, భారతి ఎయిర్‌టెల్, తదితరాలు నష్టపోయాయి. అటు డాలరుమారకలో రూపాయి 19పైసలు క్షీణించి 73.09 వద్ద ముగిసింది.
చదవండి : Sun Halo: అందమైన రెయిన్‌బో.. ట్విటర్ ట్రెండింగ్
అద్దె ఇళ్ళు: మోడల్ టెనెన్సీ యాక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
stockmarket: లాభాల స్వీకరణ, ఐటీసీ ఢమాల్
Comments
Please login to add a commentAdd a comment