profit booking
-
లాభాల స్వీకరణకే ఎఫ్ఐఐల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఎడాపెడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలతో ఆందోళన చెందుతున్న మదుపరులకు కాస్త ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెట్టుబడులపై మంచి రాబడులను అందించే పటిష్ట స్థితిలో భారత ఎకానమీ ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని ఆమె చెప్పారు.‘ఎఫ్ఐఐలు తమకు అనువైనప్పుడు లేదా లాభాలను స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు వైదొలుగుతూ ఉంటారు. భారత ఎకానమీలో నేడు పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్లే లాభాల స్వీకరణ కూడా జరుగుతోంది‘ అని తెలిపారు. ఎఫ్ఐఐలు గతేడాది అక్టోబర్ నుంచి రూ. 1.56 లక్షల కోట్ల మేర స్టాక్స్ అమ్మగా.. ఇందులో ఏకంగా రూ. లక్ష కోట్ల స్టాక్స్ విక్రయాలు ఈ ఏడాడి స్వల్ప కాలంలోనే నమోదవడం తెలిసిందే. -
పడగొట్టిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్ ద్వయం, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడరల్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి(బుధవారం)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా స్టాక్ సూచీలు మంగళవారం ఒక శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 802 పాయింట్లు నష్టపోయి 71,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 215 పాయింట్లు క్షీణించి 21,522 వద్ద నిలిచింది. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 866 పాయింట్లు క్షీణించి 71,076 వద్ద, నిఫ్టీ 236 పాయింట్లు పతనమై 21,502 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, రియల్టీ, మీడియా షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ, పారిశ్రామిక రంగాల షేర్లలో విక్రయాలు నెలకొన్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు 0.53%, 0.18% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,971 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1003 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ పాలసీ వెల్లడికి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇతర ముఖ్యాంశాలు... జీవితకాల గరిష్ట స్థాయి (రూ.2,918) వద్ద రిలయన్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.2815 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో 7% ర్యాలీ చేసింది. మరో అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలోనూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రైవేట్ రంగ దిగ్గజం దాదాపు 1% నష్టపోయి రూ.1444 వద్ద ముగిసింది. ► క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు 5% నష్టపోయి రూ.6,815 వద్ద నిలిచింది. షేరు 5% క్షీణతతో మార్కెట్ విలువ రూ. 22,984 కోట్లు హరించుకుపోయి రూ.4.21 లక్షల కోట్లకు దిగివచ్చింది. బజాజ్ ఫైనాన్స్ పతనంతో ఇదే గ్రూప్ చెందిన బజాజ్ ఫిన్సర్వ్ షేరూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.1591 వద్ద నిలిచింది. ► ఐటీసీ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో షేరు 3% నష్టపోయి రూ.438 వద్ద నిలిచింది. ►లిస్టింగ్ రోజే ఈప్యాక్ డ్యూరబుల్ షేరు 10% నష్టపోయింది. ఇష్యూ ధర (రూ.230)తో బీఎస్ఈలో 2% డిస్కౌంట్‌తో రూ.225 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11% పతనమై రూ.206 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,990 కోట్లుగా నమోదైంది. ► మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా మోటార్స్–డీవీఆర్‌తో కలుపుకొని టాటా మోటార్స్ కంపెనీ మారుతీ సుజుకీని అధిగమించి అటో రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం టాటా మోటార్స్ షేరు 2% పెరిగి రూ.859 వద్ద, టాటా మోటార్స్–డీవీఆర్ షేరు 1.63% లాభపడి రూ.573 వద్ద ముగిశాయి. ► బీఎల్ఎస్ ఈ–సర్విసెస్ ఐపీఓకు తొలిరోజు 15.63 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.37 కోట్ల షేర్లను జారీ చేయగా 21.41 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ కోటా 49.రెట్లు, సంస్థాగతేతర విభాగం 29.66 రెట్లు, క్యూబీఐ కోటా 2.19 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి. -
సాక్షి మనీ మంత్రా: మార్కెట్ల యూటర్న్, రూ. 6 లక్షల కోట్లు ఆవిరి
Today Market Closing: దేశీయ మార్కెట్లు యూటర్న్ తీసుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులమధ్య సాగిన సూచీలు చివరికి స్వల్ప లాభాలకు పరిమితమై నాయి ముఖ్యంగా రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల అమ్మకాలతో 380 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. చివరికి సెన్సెక్స్ 94 పాయింట్లు లాభంతో 67,221.13 వద్ద ముగిసింది. అలాగే 20వేలకు ఎగువన మొదలైన నిఫ్టీ ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. నిఫ్టీ 3 పాయింట్లు నష్టంతో 19,993.20 వద్ద ముగిసింది. ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లు ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ & గ్యాస్, మెటల్ , రియాల్టీ ఒక్కొక్కటి 1-3 శాతం చొప్పున నష్టపోయాయి. తద్వారా వరుసగా 7 రోజుల లాభాలకు చెక్ పడింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లోని రూ.324.3 లక్షల కోట్ల నుండి దాదాపు రూ.318.7 లక్షల కోట్లకు పడిపోయింది.అంటే ఒక్క సెషన్లోనే దాదాపు రూ. 5.6 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు కోల్పోయారు.మిడ్, స్మాల్ క్యాప్‌లు ఈరోజు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.96 శాతం క్షీణించి 32,084.93 వద్దకు చేరుకోగా, బిఎస్ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 4.02 శాతం క్షీణించి 36,982.74 వద్దకు చేరుకుంది. నిఫ్టీ ఇండెక్స్‌లో బీపీసీఎల్ ,ఎన్టీపీసీ ,పవర్ గ్రిడ్ ,షేర్లు టాప్ లూజర్లుగా ముగిశాయి. మరోవైపు టిసిఎస్ , లార్సెన్ అండ్ టూబ్రో ,ఇన్ఫోసిస్ ,షేర్లు టాప్ గెయినర్లుగా ముగిశాయి. అటు యుఎస్ ద్రవ్యోల్బణం డేటా ,యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ , యుఎస్ ఫెడ్ ద్రవ్య విధాన సమావేశాలపై దృష్టి సారించడంతో గ్లోబల్ సూచనలు కూడా బలహీనంగా ఉన్నాయి. అలాగే ఈ రోజు తవెల్లడి కానున్న ఆగస్ట్‌లో భారత ద్రవ్యోల్బణం డేటా , జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు రూపాయి: అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 13 పైసలు ఎగిసింది. -
నాలుగు రోజుల రన్‌కు బ్రేక్: మార్కెట్ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. వరుస లాభాలకారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకుదిగడంతో భారీ నష్టాలనుమూటగట్టుకుంది. సె న్సెక్స్ 347 కుప్పకూలి 62622 వద్ద 99 పాయింట్ల నష్టంతో 18534 వద్ద నిఫ్టీ 18550 దిగువకుచేరింది. మిడ్ స్మాల్ క్యాప్ భారీగా నష్టపోయాయి. ఐటీ, రియల్టీ, హెల్త్‌కేర్ తప్ప అన్ని రంగాలషేర్లు నష్టాల్లోనే మగిసాయి. భారతి ఎయిర్టెల్, కోటక్ మహీంద్ర, బ్రిటానియా, సన్‌ఫార్మ టాప్ విన్నర్స్‌గా , ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, రిలయన్స్ , హెచ్డీఎఫ్సీ బాగా నష్టపోయాయి. -
లాభాల స్వీకరణ, ఎఫ్ఎంసీజీ, ఐటీ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. రికార్డు హైల వద్ద లాభాల స్వీకరణకు తోడు థాంక్స్ గివింగ్ సందర్భంగా అమెరికా మార్కెట్లు పనిచేయని కారణంగా పెట్టుబడిదారుల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రభుత్వ రంగ షేర్లు లాభపడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్,నిఫ్టీ స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 62 వేల పాయింట్లకుపైన, నిఫ్టీ 18400కు ఎగువన ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు,అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా లాభాల్లోనూ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, సిప్లా, నెస్లే, ఆసియన్‌పెయింట్స్ , అదానీ ఎంటర్ పప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ నష్టాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి15 పైసలు ఎగిసి 81.51 వద్ద కొనసాగుతుంది -
stockmarket: ప్రాఫిట్ బుకింగ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా ట్రేడింగ్ పప్రారంభం నుంచీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరికి నష్టాల్లోనే సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 186 పాయింట్లు క్షీణించి 52,549 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు నష్టంతో 15,748 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైద్యరంగానికి ప్రకటించిన ఉపశమన చర్యల కారణంగా ఫార్మ, ఇంకా ఎఫ్ఎంసిజి షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, హెచ్‌యుఎల్, నెస్లే ఇండియా, సిప్లా, డివిస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభపడగా, ఓఎన్జీసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందాల్కో, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఆటో నష్టపోయాయి. -
stockmarket: ఫెడ్ ఎఫెక్ట్, కరెక్షన్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో గురువారం ట్రేడింగ్‌ను ఆరంభిచాయి. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లను పెంచనుందన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాలతో కుప్పకూలాయి. మెటల్, బ్యాంకింగ్, షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అటు అదానీ గ్రూపు షేర్లలో కూడా అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 296 పాయింట్లు కుప్ప కూలి 52205 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు నష్టంతో 15673 వద్ద కొన సాగుతున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, టాటా స్టీల్, హీరమోటో, బజాజ్ ఫిన్, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ నష్టపోతున్నాయి. ఫెడరల్ బ్యాంకు, టాటా టెలీ , శ్రీ రేణుక లాంటి షేర్లు స్వల్పంగా లాభపడు తున్నాయి. -
ప్రాఫిట్ బుకింగ్: 52 వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసి రికార్డు స్థాయికి ఎగిసిన నిఫ్టీ చివరికి కీలక మద్దతు స్థాయికి దిగువన ముగిసింది. భారీ అమ్మకాలతో అటు సెన్సెక్స్ 52 వేల దిగువన ముగియడం గమనార్హం. సెన్సెక్స్ 334 పాయింట్ల నష్టంతో 51941 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు కోల్పోయి15635 వద్ద క్లోజ్ అయింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ధోరణి కనిపించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ, కోటక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, యూనియన్ బ్యాంకు,పీఎన్బీ, ఫెడరల్ బ్యాంకు తదితరలు నష్టపోయాయి. ఇంకా టాటా మోటార్స్, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ గ్రాసిం, ఐషర్ మోటార్స్ , రిలయన్స్ నష్టపోగా ఓఎన్జిసి, ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, పవర్ గ్రిడ్, ఎస్బిఐ లైఫ్, భారత్ పెట్రోలియం, దివిస్ ల్యాబ్స్ లాభపడ్డాయి. -
మిశ్రమ ముగింపు : ఐటీ నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్పల్ప నష్టాలతో ముగిసాయి. రికార్డు స్థాయి లాభాల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి మళ్లిన సూచీలు మిడ్ సెషన్ నుంచి కోలుకున్నాయి. ఒక దశంలో 300 పాయింట్లకు కోల్పోయినా, చివరికి సెన్సెక్స్ 85 పాయింట్ల నష్టంతో 51849 వద్ద, నిఫ్టీ ఒక పాయింట్ లాభంతో వద్ద 15576 పటిష్టంగా ముగిసాయి. బ్యాంకింగ్ మెటల్, ఫార్మా ఇండెక్స్ లాభపడగా, ఐటీ , ఎఫ్ఎంసిజి కంపెనీల షేర్లలో అమ్మకాలు కనిపించాయి. రిలయన్స్, ఇండస్ ఇండ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో , మారుతి, అదానీ పోర్ట్స్ టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాల్లో ముగిసాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఐటీసి, ఇన్పోసిస్, యాక్సిస్, టైటన్, విప్రో, భారతి ఎయిర్టెల్, తదితరాలు నష్టపోయాయి. అటు డాలరుమారకలో రూపాయి 19పైసలు క్షీణించి 73.09 వద్ద ముగిసింది. చదవండి : Sun Halo: అందమైన రెయిన్బో.. ట్విటర్ ట్రెండింగ్ అద్దె ఇళ్ళు: మోడల్ టెనెన్సీ యాక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ stockmarket: లాభాల స్వీకరణ, ఐటీసీ ఢమాల్ -
stockmarket: లాభాల స్వీకరణ, ఐటీసీ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కీలక సూచీలు మంగళవారం నాటి బలహీనతను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 226 పాయింట్లు పతనమై 51704 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 15524 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా మార్చి క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో ఐటీసీ కుప్పకూలింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభాలు 1.3 శాతం క్షీణంచాయి. మార్చి 2021 తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 3,748 కోట్ల రూపాయలుగా నమోదైంది..దీంతో ఐటీసీ షేరు 3 శాతం నష్టపోయింది. ఇంకా ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, టిసిఎస్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ నష్టపోతున్నాయి. అదానీ పోర్ట్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, కోల్ ఇండియా, సిప్లా, శ్రీ సిమెంట్స్, టాటా స్టీల్, డివిస్ ల్యాబ్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్, ఎస్బిఐ లైఫ్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ శుక్రవారం వెల్లడించనుంది. చదవండి : నిఫ్టీ రికార్డు ర్యాలీకి విరామం భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర -
రికార్డు ప్రాఫిట్ బుకింగ్ : ఫ్లాట్ ముగింపు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసాయి. రోజంతా లాభనష్టాల మధ్య మార్కెట్లు ఊగిసలాడాయి. పెట్టుబడిదారులు లాభాలను రికార్డు స్థాయిలో లాభాలను స్వీకరించడంతో సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకుపై పతనమై 51వేల దిగువకు చేరింది. నిఫ్టీ కూడా 15వేలకు దిగువకు పతనమైంది. కానీ కనిష్ట స్థాయిల్లో ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో బౌన్స్ బ్యాక్ అయ్యాయి. తద్వారా కీలక మద్దతు స్థాయిలను నిలబెట్టుకోవడం విశేషం. చివరకు సెన్సెక్స్ 19 పాయింట్ల నష్టంతో 51300 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 15106 వద్ద పటిష్టంగా ముగిసాయి. స్థిరపడ్డాయి. టాటా స్టీల్ బిగ్గెస్ట్ గెయినర్‌గా నిలవగా ఐషర్ మోటార్స్టాప్ లూజర్‌గా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, గెయిల్ లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ నష్టాలతో ముగిసాయి. -
ప్రాఫిట్ బుకింగ్ : బడ్జెట్ ర్యాలీకి బ్రేక్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డు పరుగు నుంచి వెనక్కి తగ్గాయి. రికార్డుల మోత మోగించిన సూచీలు ఆఖరి గంటలో మొత్తం లాభాలను కోల్పోయాయి. లాభాల స్వీకరణతో రికార్డు హై నుంచి సెన్సెక్స్ 642 పాయింట్లు పతనమైంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ , ఫార్మా షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. చివరకు సెన్సెక్స్ 20పాయింట్ల నష్టంతో 51329 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 15109వద్ద స్థిరపడ్డాయి. తద్వారా వరుస ఏడు రోజుల లాభాలకు బ్రేక్ చెప్పాయి. ఇంట్రా డేలో సెన్సెక్స్ 487 పాయింట్లు పెరిగి 51,835.86 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 15,257 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ , రిలయన్స్ డీల్‌కు హైకోర్టు తన మునుపటి ఉత్తర్వులను రద్దు చేస్తూ సానుకూల తీర్పురావడంతో ఫ్యూచర్ షేర్లు 10 శాతం ఎగిసాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ నిఫ్టీ లూజర్‌గా ఉంది. ఇంకా టాటా మోటార్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, బజాజ్ ఆటో, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, దివిస్ ల్యాబ్స్, టీసీస్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా నష్టపోయాయి. ఎస్బిఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఒఎన్‌జిసి, ఇండియన్ ఆయిల్, టైటాన్, శ్రీ సిమెంట్స్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. రికార్డు స్థాయిల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో ఆరు రోజుల బడ్జెట్ ర్యాలీని బ్రేక్ పడిందని విశ్లేషకులు తెలిపారు. -
లాభాల స్వీకరణ: బుల్ రన్‌కు బ్రేక్
సాక్షి, ముంబై: అత్యధిక రికార్డు స్థాయిలనుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు దిద్దుబాటుకు గురవుతున్నాయి. మూడు రోజుల భారీ లాభాల అనంతరం మదు పరుల లాభాల స్వీకరణ సర్వ సాధారణం. ఈ నేపథ్యంలో కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో కొనసాగుతున్నప్పటికీ 50వేలకు ఎగువన సెన్సెక్స్, నిఫ్టీ 14700కు పైన స్థిరంగా ట్రేడ్ అవుతుండటం గమనార్హం. 50వేల మద్దతు స్థాయికి పైన ఉన్నంతవరకు ఆందోళన అవసరం లేదని విశ్లేషకుల అంచనా. అయితే ఈ స్థాయిల్లో అప్రమత్తత అవసరమని సూచిస్తునన్నారు. సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గి 50040 వద్ద, నిఫ్టీ 51 పయింట్ల నష్టంతో 14750 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, ఐటీ, పీఎస్‌యు బ్యాంక్ సూచికల్లో అమ్మకాల ధోరణి కనిపిస్తోంది. మరోవైపు, ఆటో, ఎఫ్ఎంసిజి, మెటల్, మీడియా షేర్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, టాటామోటార్స్ ఏషియన్ పెయింట్స్ తదితరాలు నష్టాల్లోనూ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జిసి, బజాజ్ ఆటో లాభాల్లోను ఉన్నాయి. మెరుగైన ఫలితాలనుప్రకటించినభారతి ఎయిర్టెల్ లాభాల జోరు కనిపిస్తోంది. -
భారీ నష్టాల్లో సూచీలు
సాక్షి, ముంబై: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. జూలై ఎఫ్అండ్ఓ సిరీస్ రేపటితో ముగియనున్న సందర్భంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ 99పాయింట్ల నష్టంతో 37912వద్ద, నిఫ్టీ 142 పాయింట్ల నష్టంతో 11157 వద్ద కొనసాగుతోంది. మరోవైపు అమెరికా ఫెడ్ నిర్ణయాలవైపు చూస్తున్న కారణంగా అప్రమత్తత కొనసాగుతోందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. రిలయన్స్, నెస్లే, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్, బీపీసీఎల్, అదాని పోర్ట్స్, టీసీఎస్, మారుతి, హీరో మోటో, టెక్ మహీంద్ర నష్టపోతున్నాయి. గ్రాసీం, భారతీ ఇన్ఫ్రాటెల్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. -
ఊరట : దిగివచ్చిన బంగారం
ముంబై : కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నా పదిగ్రాముల పసిడి ఇంకా 47,000కు పైగానే పలుకుతోంది. ఇండో-చైనా ఉద్రిక్తతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరగడంతో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధరలు నిలకడగానే ఉన్నా ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో దేశీ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి.ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం 439 రూపాయలు తగ్గి 47,128 రూపాయలకు దిగివచ్చింది. ఇక కిలో వెండి 230 రూపాయలు పతనమై 48,100 రూపాయలు పలికింది. చదవండి : ‘ఆ కోట కింద రూ. 11,617 కోట్ల సంపద’ -
వరుస లాభాలు : లాభాల స్వీకరణ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వరసగా ఏడవ సెషన్ లో లాభాల బాటలో వుంది. ఆరంభంలో తడబడినా వెంటనే పుంజుకుని సెన్సెక్స్ 182 పాయింట్ల లాభంతో 34291 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు లాభంతో 10119 వద్ద ట్రేడ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోను కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. అరబిందో ఫార్మా, టాటా మోటార్స్,ఎస్ బీఐ, వేదాంతా ఇండిగో లాభపడుతుండగా, ఇండస్ ఇండ్, యాక్సిస్, హెచ్డీఎఫ్ సీ బ్యాంకు తదితర షేర్లలో లాభాల స్వీకరణ నెలకొంది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 114 పాయింట్లు కోల్పోయి 33998 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 10036 వద్ద కొనసాగుతుండటం గమనార్హం. చదవండి : అమానుష ఘటనపై రతన్ టాటా ఆవేదన -
ప్రాఫిట్ బుకింగ్: ఆరంభ లాభాలు ఆవిరి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడు రోజు కూడా లాభాలతో ప్రారంభమైనాయి. ఆరంభంలో సెన్సెక్స్ 90 పాయింట్లు ఎగియగా, నిప్టీ 30 పాయింట్లు లాభపడింది. అయితే వెంటనే ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు క్షీణించి 38575 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు నష్టంతో11286 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. తద్వారా నిఫ్టీ 11300 దిగువకు చేరింది. ముఖ్యంగా ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఫార్మ షేర్లు బలహీనంగా ఉన్నాయి. మిడ్ క్యాప్ మెటల్, బ్యాంక్ నిఫ్టీ ,ఆటో రంగాలు నష్టపోతున్నాయి. ఐటీ షేర్లులాభపడుతున్నాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు,ఓఎన్జీసీ నష్టపోతుండగా, ఎయిర్‌లైన్ షేర్లు, ఇండిగో, స్పైస్ జెట్ కూడా బాగా నష్టపోతున్నాయి. బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్,యూపీఎల్, టైటన, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో,భారతి ఇన్ఫ్రాటెల్ లాభపడుతున్నాయి. మరోవైపు ఫెడ్ వడ్డీ రేటు కట్ నిర్ణయంతో డాలరు బాగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి కనిష్టం నుంచి కోలుకుంది. -
రికార్డుస్థాయి నుంచి భారీ నష్టాల్లోకి
సాక్షి,ముంబై: మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్ 42వేల దిగువకు, నిఫ్టీ 12300 దిగువన కొనసాగుతున్నాయి. గరిష్టస్థాయిలకు చేరుకోవడంతో లాభాల స్వీకరణకు తోడు అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరుగుదల భయం తీవ్ర నష్టాలకు కారణమవుతోంది. ప్రధానంగా హెవీ వెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ షేర్లలో అనూహ్య అమ్మకాలతో పాటు ఐటీ, బ్యాంకింగ్, పెట్రోరంగ కంపెనీలకు చెందిన మిడ్‌క్యాప్ షేర్లలో అనూహ్య అమ్మకాలు సూచీలను గరిష్టస్థాయిల నుంచి వెనక్కి లాగాయి. ఫలితంగా 42,274 గరిష్టం నుంచి 700 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 355 పాయింట్లు కుప్పకూలి 41591వద్దకు చేరగా, నిప్టీ రికార్డు స్థాయి 12,430 నుంచి పడి, ప్రస్తుతం 105 పాయింట్లు నష్టపోయి 12,246 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు నిఫ్టీ టాప్ లూజర్‌గా ఉంది. ఎల్అండ్టీ, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, పవర్ గ్రిడ్ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. -
అమ్మకాలు, చతికిలబడిన పందెం ‘షేర్లు’
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో సంక్రాంతి శోభ ముందే రావడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారు. కీలక సూచీలు మంగళవారం జీవిత కాల గరిష్టాలను నమోదు చేయడంతో ఇన్వెస్టర్ల భారీగా అమ్మకాలు జరుపుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ 263 పాయింట్ల కుప్పకూలగా, నిఫ్టీ 75 పాయింట్లు క్షీణించింది. దీంతో సెన్సెక్స్ 41800 స్థాయిని , నిఫ్టీ 12300 స్థాయిని కూడా కోల్పోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో ప్రాఫిట్‌బుకింగ్ కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మలో అమ్మకాలు కొనసాగుతుండగా, మెటల్ , పెయింటింగ్ రంగ షేర్లు లాభపడుతున్నాయి. ఇండస్ ఇండ్, విప్రో, డా.రెడ్డీస్, ఎస్బీఐ, బీపీసీఎల్, అల్ట్రా టెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, గ్రాసిం నష్టపోతున్నాయి. హీరో మోటో, టైటన్, ఎం అండ్, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టాటా స్టీల్, మారుతి సుజుకి స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. -
లాభాల స్వీకరణ : మార్కెట్ల పతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంనుంచీ అమ్మకాల ఒత్తిడినిఎదుర్కొంటున్న కీలక సూచీలు మిడ్ సెషన్‌నుంచి మరింత పతన మైనాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్ల లాభాల స్వీకరణతో ప్రస్తుతం సెన్సెక్స్ 400 పాయింట్లు పతనమై 40731 వద్ద,నిఫ్టీ 115 పాయింట్లు క్షీణించి 12035 వద్ద ట్రేడవుతున్నాయి. తద్వారా వారాంతంలో సెన్సెక్స్ 41 వేల స్థాయిని కోల్పోగా, నిఫ్టీ 12050 స్థాయి దిగువకు చేరింది. సూచీల జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ట్రేడర్ల లాభాల స్వీకరణకు తోడు కేంద్రం సెప్టెంబర్ త్రైమాసికపు జీడీపీ గణాంకాలను విడుదల చేయనుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, హిందూస్థాన్ యూనిలివర్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో షేర్లు నష్టపోతుండగా, యస్‌బ్యాంక్, ఎన్టీపీసీ, భారతీఎయిర్‌టెల్, అదానీపోర్ట్స్, ఇన్ఫ్రాటెల్ షేర్లు లాభపడ్డాయి. -
ఐటీ షేర్ల షాక్ : నష్టాల్లోకి సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. స్వల్పలాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు మిడ్ సెషన్‌కు భారీగా నష్టపోతున్నాయి. గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం సూచీల పతనానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్226 పాయింట్లుకుప్పకూలి 40344 వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో 11901 వద్ద కొనసాగుతోంది. ఒకదశలో నిఫ్టీ 11900 స్థాయికి కిందికిచేరింది.ప్రధానంగా ఈ ఏడాదికి దేశీయ ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్‌ను ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమీ కో అపరేషన్ అండ్ డెవెలప్మెంట్(ఓఈసీడీ) 5.8శాతానికి డౌన్‌గ్రేడ్ చేయడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. మెటల్, మీడియా షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా వీసా నిబంధనల మార్పుల వార్తలతో ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తడి నెలకొంది. అలాగే ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. భారతి ఇన్ఫ్రాటెల్ 5 శాతం పతనమైన టాప్‌లూజర్‌గా కొనసాగుతోంది. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, యుపిఎల్, బజాజ్ ఆటో, సిప్లా నష్టపోతుండగా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, యస్ బ్యాంక్, ఎన్టీపీసీ, జీ లిమిటెడ్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, యస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటిసి, కోల్ ఇండియా లాభపడుతున్నాయి. -
లాభాల స్వీకరణ, అయినా ఓకే!
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డు లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెన్సెక్స్ 93 పాయింట్లు ఎగిసి 40,258 వద్ద , నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 11927 వద్ద ట్రేడవుతోంది, ఈ రోజు కొన్ని లాభాలను అధిగమించడానికి ముందు సరికొత్త రికార్డును తాకింది. ఒక దశలో సెన్సెక్స్ 330 పాయింట్లకు పైగా ఎగిసి 40,500 వద్దకు, నిఫ్టీ కూడా రోజు గరిష్ట స్థాయికి పెరిగింది. ఆటె, మెటల్ షేర్లు లాభపడుతున్నాయి. యుఎస్-చైనా వాణిజ్య చర్చలపై ఆశావాహ వార్తలు మెటల్షేర్లకు పాజిటివ్‌గా మారాయి. యస్ బ్యాంకు దాదాపు 10 శాతం నష్టపోయింది. జీ, ఐవోసీ, మారుతి సుజుకి, హీరోమోటో, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్ నష్టపోతుండగా, టాటా స్టీల్ వేదాంతా, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ ఐసీఐసీఐ బ్యాంకు లాభపడుతున్నా -
ప్రాఫిట్ బుకింగ్ : అయినా లాభాల్లోనే
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. కానీ ఆరంభ లాభాలను కుదించుకోవడంతో ఆల్ టైం హైల నుంచి వెనక్కి తగ్గాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో రికార్డుల బోణి కొట్టిన కీలక సూచీలు రెండూ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. ఆరంభంనుంచి దాదాపు చివరి వరకూ ట్రిపుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోయిన మార్కెట్లు ఒక దశలో 400 పాయింట్ల లాభాలను సాధించాయి. అయితే చివరి అర్థగంటలో అమ్మకాలతో సెన్సెక్స్ 199 పాయింట్ల లాభాలకు పరిమితమై 38871 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు ఎగిసి 11669 వద్ద ముగిశాయి. ఇవాల్టి మార్కెట్లో సెన్సెక్స్ 39వేల మైలురాయిని దాటగా, నిప్టీ 11700 స్థాయికి ఎగువన ట్రేడ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా రికార్డ్ స్థాయిలో కొనసాగడం విశేషం. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీగా లాభపడ్డాయి. మెటల్, ఐటీ, ఆటో రంగాలు లాభాల్లో ముగిశాయి. రియల్టీ, ఎఫ్ఎంసీజీ నష్టపోయాయి. ఆంధ్రాబ్యాంక్, లక్ష్మీ విలాస్, టాటా స్టీల్, పీఎన్బీ హౌసింగ్, వెల్ కార్ప్ టాప్విన్నర్స్గా ఉండగా, జేఅండ్‌కే, సిండికేట్, పీఎన్బీ, బీవోబీ, యూనియన్, బీవోఐ, కెనరా, అలహాబాద్, సెంట్రల్, ఇండియన్ బ్యాంక్, టాటా మోటార్స్, హిందాల్కో, వేదాంతా, గెయిల్, టాటా స్టీల్, విప్రో, మారుతీ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ లాభపడిన వాటిల్లో ఉన్నాయి. అయితే ఐవోసీ, యూపీఎల్, ఇండస్ఇండ్, జీ, ఐబీ హౌసింగ్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఐషర్, టైటన్, కోల్ ఇండియా టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. కాగా ఆర్బీఐ రేట్ కట్ అంచనాలు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో బీజేపీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టనుందనే అంచనాలు ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు దారి తీసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు. -
ప్రాఫిట్ బుకింగ్ : నష్టాల్లోకి మార్కెట్లు
సాక్షి,ముంబై: ఫెడ్ బూస్ట్‌తో లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా నష్టాల్లోకి జారుక్నున్నాయి. అత్యధిక స్థాయిల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ దిగడంతో ఆరంభ లాభాలన్నీ ఆవి రైపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ సెంచరీకి పైగా లాభాలతో 38,500ను అధిగమించిన సెన్సెక్స్ ప్రస్తుతం 78 పాయింట్లు నష్టపోయి 38308వద్ద కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 20 పాయింట్లు నష్టపోయి 11501 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంకు 30వేల స్థాయి వద్ద ఆల్ టైం హైని టచ్ చేసింది. దీంతో బ్యాంకింగ్ సెక్టార్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. అయితే నిఫ్టీ11500 స్థాయిని నిలదొక్కుకోవడం విశేషం. రియల్టీ తప్ప దాదాపు అన్ని రంగాలూ నష్టపోతున్నాయి. ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటన్, యస్ బ్యాంక్, టాటా స్టీల్, గ్రాసిమ్, ఐషర్, హిందాల్కో, పవర్‌గ్రిడ్ టాప్ విన్నర్స్‌గా ఉండగా, హెచ్‌పీసీఎల్, ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్, జీ, ఆర్ఐఎల్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. ఇక రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 3.5 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో ప్రెస్టేజ్, శోభా, సన్‌టెక్ 1-0.6 శాతం మధ్య లాభపడుతున్నాయి. -
సిరీస్ క్లోజింగ్ : ప్రాఫిట్ బుకింగ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ సుమారు 400పాయింట్లకు పైగా ఎగియగా, 10800 పైనే నిఫ్టీ ఉత్సాహంగా కదలాడింది. అయితే డెరివేటివ్ సిరీస్ ముగియనున్న నేపథ్యంలో మిడ్ సెషన్ తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్ 256 పాయింట్ల లాభంతో 35,906 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల లాభానికి పరిమితమై 10806వద్ద కొనసాగుతోంది. అయితే అన్ని రంగాల షేర్లూ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ప్రధానంగా ఐటి, ఎఫ్ఎంసిజి, ఆటో, బ్యాంకింగ్, రియాల్టీ రంగ కౌంటర్లు లాభపడుతున్నాయి. మెటల్, ఫార్మా, పిఎస్యూ బ్యాంక్స్ కూడా లాభాల్లో ఉన్నాయి. వేదాంతా, సన్‌ఫార్మ, టీసీఎస్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. అటు క్రూడ్ భారీగా పెరగడంతో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం షేర్లు నష్టపోతున్నాయి. -
బడ్జెట్ భయంతో ప్రాఫిట్ బుకింగ్: భారీ నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ప్రపంచమార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఆర్థిక సర్వే వ్యాఖ్యల నేపథ్యంలో కీలక సూచీలు రికార్డ్ స్థాయిల నుంచి వెనక్కి మళ్లాయి. భారీగా అమ్మకాల ఒత్తిడితో ట్రేడింగ్‌ను ఆరంభించిన మార్కెట్లలో చివరి వరకూ అదే ధోరణి కొనసాగింది. చివరికి సెన్సెక్స్ 250 పాయింట్లు పతనమై 36,034 వద్ద నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 11,050 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ ప్రధానంగా నష్టపోయాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 1 న రానున్న యూనియన్ బడ్జెట్ నేపథ్యంలో పెట్టుబడిదారులు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్టు విశ్లేషకులు తెలిపారు. ఐషర్, కొటక్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, బాష్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, హిందాల్కో, యాక్సిస్ నష్టాల్లోనూ, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్, హీరో మోటో, కోల్ ఇండియా, భారతీ, సన్ ఫార్మా, ఎస్బీఐ లాభాల్లోనూ ముగిశాయి. -
ప్రాఫిట్ బుకింగ్: 34వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డ్ స్థాయిల వెనక్కి తగ్గాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో న ష్టాల్లో ముగిసాయి. ముఖ్యంగా రికార్డ్ స్థాయిల నమోదు తరువాత రోజంతా రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయిన సెన్సెక్స్ 99 క్షీణించి 34వేల దిగువకు చేరింది. నిఫ్ టీ41 పాయింట్లను కోల్పోయి 10,49 వద్ద స్థిరపడింది. చివరి గంటలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాలు పోగొట్టుకోవడమేకాకుండా సాంకేతికంగా కీలకమైన స్థాయిల దిగువన ముగిశాయి. ఫార్మా లాభపడగా,బ్యాంక్ నిఫ్టీ, రియల్టీ, ఆటో, ఎఫ్ఎంసీజీ నష్టపోయాయి. సన్ పార్మా 6 శాతం జంప్‌చేయగా.. టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, విప్రో, అరబిందో, జీ, వేదాంతా, ఎంఅండ్ఎం, యూపీఎల్, లుపిన్ కూడాలాభాలను ఆర్జించాయి. అలాగే ఐవోసీ, భారతీ, ఐసీఐసీఐ, అల్ట్రాటెక్, బాష్, టీసీఎస్, హిందాల్కో, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్ తదితరాలు నష్టపోయాయి. -
ప్రాఫిట్ బుకింగ్ : నష్టాల్లో మార్కెట్లు
ముంబై : మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్‌లో లాభాల స్వీకరణ కొనసాగడంతో గురువారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు ఆసియన్ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలతో మార్కెట్లు కరెక్షన్కు గురయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టంలో 32,237 వద్ద, నిఫ్టీ 67.85 పాయింట్ల నష్టంలో 10,013 వద్ద క్లోజయ్యాయి. నేటి మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్పొరేషన్‌లు మేజర్ గెయినర్లుగా లాభాలు పండించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంట్రాడేలో సరికొత్త రికార్డు స్థాయిలను తాకింది. 1.6 శాతం పైకి ఎగిసి, రూ.1655 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది. కాగ, ప్రతికూల ఆసియా మార్కెట్లు, ఆర్బీఐ వడ్డీరేటు కోత ప్రభావంతో మార్కెట్లు మార్నింగ్ సెషన్ నుంచి నష్టాల్లోనే ట్రేడవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి ఆర్బీఐ పాలసీ రివ్యూ నేపథ్యంలో పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంకింగ్ సెక్టార్ షేర్లలో లాభాల స్వీకరణ నెలకొంది. దీంతో నిఫ్టీ బ్యాంకు 300 పాయింట్ల మేర పడిపోయింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 63.65 వద్ద నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 108 రూపాయలు నష్టపోయి 28,329 రూపాయలుగా ఉన్నాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : ప్రాఫిట్ బుకింగ్, బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 25. 26 పాయింట్ల నష్టంలో 31,344 వద్ద, నిఫ్టీ 10.25 పాయింట్ల నష్టంలో 9,664 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలో టాటా స్టీల్, టాటా మోటార్స్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్‌లు ఒత్తిడిలో కొనసాగాయి. ఫార్మా దిగ్గజం లుపిన్ శాతం పైగా లాభపడింది. లుపిన్‌తో పాటు భారతీ ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. టాటా టెలిసర్వీసులు, టాటా స్కై, టాటా కామ్లు భారతీ ఎయిర్‌టెల్‌లో విలీనమయ్యే ప్రక్రియపై చర్చలు ప్రారంభకావడంతో టాటా టెలీ 5 శాతం మేర లాభపడింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి 64.72 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా 28,105 వద్ద ట్రేడవుతున్నాయి. -
ప్రాఫిట్ బుకింగ్: మార్కెట్లు డౌన్
ముంబై : రికార్డుల మోతమోగించిన స్టాక్ మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. బుధవారం ట్రేడింగ్ లో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంలో 30,590 వద్ద, నిఫ్టీ 8.20 పాయింట్ల నష్టంలో 9504 వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్స్, బ్యాంకులు, ఆటో, ఫార్మా సూచీలు నష్టాలు గడిస్తుండగా.. మెటల్స్ పైకి ఎగిశాయి. స్ట్రాంగ్ క్యూ4 లాభాలు నమోదుచేయడంతో ట్రేడింగ్ ప్రారంభంలో టాటా స్టీల్ 3 శాతానికి పైగా లాభాలార్జించింది. టాటా స్టీల్ తో పాటు టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు పండించాయి. ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, జీ ఎంటర్ టైన్మెంట్ టాప్ లూజర్లుగా ఉన్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 63.99 వద్ద ప్రారంభమైంది. 2017 ఏప్రిల్ 27 తర్వాత ఇదే అతిపెద్ద స్థాయి. మిశ్రమమైన ఎకనామిక్ డేటా, రిటైల్ ఆదాయాలతో అమెరికా మార్కెట్లు ఎస్ అండ్ పీ 500, డౌ జోన్స్ మంగళవారం ఫ్లాట్ గా ముగిశాయి. టెక్నాలజీ స్టాక్స్ మద్దతుతో నాస్ డాక్ రికార్డు క్లోజింగ్ లో నమోదైంది. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 122 రూపాయలు లాభపడి 28,114 వద్ద ట్రేడవుతున్నాయి. -
ప్రాఫిట్ బుకింగ్: మార్కెట్లు ఢమాల్
లాభాల జోరుతో పరుగులు పెట్టిన నిన్నటి మార్కెట్లు, శుక్రవారం సతికిలపడ్డాయి. లాభాల స్వీకరణతో మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 267.41 పాయింట్లు కిందకి పడిపోయి, 30వేల కిందకు దిగజారింది. 29,850.80 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 74.60 పాయింట్ల నష్టంలో 9285.30 వద్దకు పడిపోయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నెగిటివ్ గా ట్రేడయ్యే సరికి, దేశీయ మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బ్యాంక్స్, ఆయిల్, మెటల్స్ స్టాక్స్, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో శుక్రవారం మార్కెట్లు ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. నేటి ట్రేడింగ్ లో ఎస్బీఐ, అరబిందో ఫార్మా, ఏసియన్ పేయింట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా నిలువగా... టాటా మోటార్స్, ఓన్జీసీ, హిందాల్కోలు నష్టాలు గడించాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 19 పైసలు బలహీనపడి 64.36 గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 157 రూపాయల లాభంలో 28,229గా ట్రేడయ్యాయి. -
వారాంతం నష్టాలతో ముగింపు
ముంబై : మార్కెట్లో శుక్రవారం ట్రేడింగ్ లోనూ ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుంది. దీంతో వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 111.34 పాయింట్ల నష్టంలో 29,918.40 వద్ద, నిఫ్టీ 38.10 పాయింట్ల నష్టంలో 9,304.05 వద్ద క్లోజ్ అయ్యాయి. నేటి ట్రేడింగ్ లో ఎస్బీఐ, మారుతీ సుజుకీ, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా 1-3 శాతం లాభపడగా.. ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ లు 1-2 శాతం నష్టపోయాయి. ఈ వారంలో రికార్డుల మోత మోగించిన స్టాక్ మార్కెట్ లో ఈ రెండు రోజులుగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు పాల్పడ్డారు. రికార్డుల స్థాయిలో మార్కెట్లు ర్యాలీ జరుపడంతో ఈ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు కనీసం 2 శాతం మేర లాభపడ్డాయి. మార్చి నుంచి ఇదే మెరుగైన ప్రదర్శన. మంచి కార్పొరేట్ ఫలితాలు, ఆర్థిక వృద్ధి పెరగడం స్టాక్ మార్కెట్లను పైకి ఎగిసేలా దోహదం చేశాయి. ఐదు రోజులు రికార్డు లాభాల అనంతరం చోటుచేసుకున్న ప్రాఫిట్ బుకింగ్ తో బ్యాంకు నిఫ్టీ 0.6 శాతం మేర పడిపోయింది. నష్టాలు పాలైన కంపెనీల్లో ఎక్కువగా బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్ లిమిటెడ్ 3.4 శాతం మేర నష్టపోయింది. కంపెనీ మార్చి క్వార్టర్ ఫలితాలు 62 శాతం క్షీణించడంతో కంపెనీ ఈ మేర నష్టపోయింది. కాగ సోమవారం మార్కెట్లు సెలవును పాటించనున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 12 పైసల నష్టంలో 64.28గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు అక్షయ తృతీయ సందర్భంగా 88 రూపాయల లాభంతో 28,857 రూపాయలుగా ఉన్నాయి. -
ప్రాఫిట్ బుకింగ్: లాభాలకు బ్రేక్
అలుపెరగకుండా రికార్డుల మోత మోగించిన మార్కెట్లకు బ్రేక్ పడింది. మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంది. దీంతో గురువారం ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 103.61 పాయింట్ల నష్టంలో 30029.74 వద్ద, నిఫ్టీ 9.70 పాయింట్ల నష్టంలో 9342.15 వద్ద క్లోజ్ అయ్యాయి. లుపిన్, అరబిందో ఫార్మా, ఐటీ టాప్ లూజర్లుగా నష్టాలు గడించగా.. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, యస్ బ్యాంకు, ఏసీసీ లాభాల్లో నడిచాయి. ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ సాధారణ ఫలితాలను ప్రకటించిన తర్వాత కంపెనీ షేరు స్వల్పంగా పడిపోయింది. మంచి లాభాల్లో అదరగొట్టిన కొటక్ మహింద్రా బ్యాంకు షేరు లాభాల్లో ముగిసింది. ఏప్రిల్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియడంతో పాటు, గత మూడు రోజులుగా జరిపిన రికార్డు లాభాలతో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ బుధవారం విడుదల చేసిన ట్యాక్స్ కట్ ప్లాన్ కూడా పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో ఆసియన్ షేర్లలోనూ జోరు తగ్గింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా 3 పైసలు బలహీనపడి 64.14 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 43 రూపాయల లాభంతో 28,762 రూపాయలుగా నమోదయ్యాయి. -
మార్కెట్లకు ప్రాఫిట్ బుకింగ్ దెబ్బ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్ లోముగిశాయి. సెన్సెక్స్ 130 పాయింట్ల నష్టంతో 29,518 వద్ద , నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 9,126 వద్ద ముగిసింది. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,150 స్థాయి దిగువన ముగియడం విశేషం.గతవారం రికార్డ్ స్థాయిలను నమోదు చేసిన మార్కెట్లలో మదుపర్ల లాభాల స్వీకరణ కొనసాగింది. దీంతో గత మూడు సెషన్లుగా వరుసగా పాజిటివ్‌గా ముగిసిన మార్కెట్లు మొదటిసారి నష్టాలను మూటగట్టుకున్నాయి. ఐటీ టెలికాం, బ్యాంకింగ్ సెక్టార్ నష్టాలను చవిచూసింది. ప్రధానంగా ఐడియా 14శాతానికిపై గాఎగిసిన ఐడియా చివరలో 14 శాతానిపైగా నష్టపోయింది. ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో లాంటి లార్జ్ క్యాఫ ఐటి స్టాక్స్ నష్టపోయాయి. అయితే యాంటి డంపింగ్ డ్యూటీ పై వాణిజ్య మంత్రి మార్చి 28 న సమావేశం నిర్వహించనున్నారనే వార్తల నేపథ్యంలో టైర్ షేర్లన్నీ 1నుంచి 3శాతం ఎగిశాయి. ఏంఆర్ఎఫ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, టీవీఎస్ శ్రీచక్ర, సియల్, అపోలో టైర్స్ గుడ్ ఇయర్ ఇండియా జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. అరబిందో, గ్రాసిమ్, భెల్, ఐషర్, కోల్ ఇండియా లాభపడగా, 1:1 బోనస్ ప్రకటించడంతో వాపోలీ మెడికేర్ కూడా భారీగా లాభపడింది. అయితే జీఎస్టీ లోని కీలకమైన నాలుగు చట్టాలకు క్యాబినెట్ ఆమోదం లభించడంతో దేశంలో రానున్న ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ గా ఉండదనుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. -
ప్రాఫిట్ బుకింగ్ :నష్టాల్లో మార్కెట్లు
ముంబై : అంచనావేసిన మాదిరిగానే సోమవారం మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ నెలకొంది. దీంతో గత వారం 2.5 శాతం ర్యాలీ నిర్వహించిన దేశీయ బెంచ్ మార్కు సూచీలు ఒక్కసారిగా కిందకి పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంలో 29,528 వద్ద, నిఫ్టీ 25.20 పాయింట్ల నష్టంతో 9134 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వొడాఫోన్ ఇండియా విలీనానికి ఐడియా సెల్యులార్ ఆమోదం తెలుపడంతో ఐడియా షేర్లు ఒక్కసారిగా 15 శాతం మేర పైకి ఎగిశాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పగ్గాలు అతివాదిగా ముద్రపడిన యోగి ఆదిత్యానాథ్ కు అప్పగించడంతో ఈ వారంలో మార్కెట్లు ప్రకంపనాలు సృష్టించనున్నాయని విశ్లేషకులు ముందుగానే అంచనావేశారు. అత్యధిక జనాభా ఉన్న యూపీ రాష్ట్ర సీఎంగా యోగి ఎన్నికైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ భవిష్యత్ సంస్కరణలపై మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపవచ్చని, లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చని మార్కెట్లు విశ్లేషకులు భయాందోళనలు వ్యక్తంచేశారు. వారి భయాందోళనలకు అనుగుణంగా మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభంలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడింది. 6 పైసల లాభంతో 65.40 వద్ద ప్రారంభమైంది. -
లాభాల స్వీకరణ: నష్టాల్లో మార్కెట్లు
ముంబై : ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ ఓటింగ్ కు ముందు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 48.63 పాయింట్ల నష్టంలో 28999.56 వద్ద, నిఫ్టీ 16.55 పాయింట్ల నష్టంలో 8946.90 వద్ద క్లోజ్ అయ్యాయి. బుల్లిష్ జోరుతో గరిష్టాల్లో నమోదైన దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఎక్కువగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో రెండేళ్ల గరిష్టంలో ఎగిసిన మార్కెట్లు కిందకి దిగజారాయి. మరోవైపు ఈ వారం చివర్లో రానున్న ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎగ్జిట్ పోల్స్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంచనావేసిన దానికంటే మెరుగైన మూడో క్వార్టర్ జీడీపీ గణాంకాలు, దేశీయ కంపెనీల ఆదాయాలు, సపోర్టింగ్ గా వచ్చిన బడ్జెట్, గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చే సానుకూలాంశాలు ఇటీవల దలాల్ స్ట్రీట్ లో సెంటిమెంట్ ను బలపర్చాయని విశ్లేషకులు చెప్పారు. వచ్చే వారంలో విడుదల కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వు మీటింగ్ పై కూడా ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని కూడా విశ్లేషకులు చెప్పారు. ఎక్కువగా మెటల్, హెల్త్ కేర్, ఎఫ్ఎంసీజీ, కొన్ని బ్యాంకింగ్, రియాల్టీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అదేసమయంలో ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
అమ్మకాల ఒత్తిడితో నష్టపోయిన మార్కెట్లు
ముంబై: సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరికి స్వల్పనష్టాలతో ముగిసాయి. సెన్సెక్స 48.74 పాయింట్ల నష్టంతో 28,003, నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 8,636.55 దగ్గర ముగిసింది. లాభాల స్వీకరణ,ఆయిల్ ధరల్లో క్షీణతనుమార్కెట్లను నష్టాల్లోకి తీసుకెళ్లాయి. అమ్మకాల ఒత్తిడి, తక్కువ ముడి చమురు ధరలు, రెండు రాబోయే ప్రపంచ సంఘటనల పై మార్కెట్ నెగిటివ్ గా స్పందించింది. దీంతో సోమవారం భారత ఈక్విటీ మార్కెట్ లోని కీలక సూచీలు నష్టాల్లో ముగిసాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ లో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రారంభంలో అన్ని వైపులనుంచీ పెరిగిన కొనుగోళ్లతో ప్రామాణిక సూచీ సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ చేసింది. వెరసి గరిష్టంగా 28,285కు చేరింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ కూడా 8,700ను అధిగమించింది. ఇది 15 నెలల గరిష్టంకాగా, మిడ్‌సెషన్ నుంచీ ట్రేడర్లు లాభాల స్వీకరణకు ఉపక్రమించడంతో మార్కెట్లు వెనకడుగు వేశాయి. బ్యాంకు షేర్లు బేర్.. ఆదుకున్న ఐటీ ప్రధానంగా బ్యాంకు షేర్లలో అమ్మకాలు మార్కెట్లను దెబ్బకొట్టాయి. ప్రయివేట్, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే ఐటీ కౌంటర్లకు డిమాండ్ పుట్టడంతో ఈ రంగం 2 శాతంపైగా ఎగసింది. ఈ బాటలో మెటల్స్, మీడియా, ఆటో రంగాలు 1.5-0.6 శాతం మధ్య పురోగమించాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టాటా స్టీల్, హిందాల్కో, గ్రాసిమ్, మారుతీ, ఇండస్ఇండ్, విప్రో, టాటా మోటార్స్, బజాజ్ ఆటో 3.5-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోవైపు ఐసీఐసీఐ 5 శాతం, ఎల్అండ్టీ 4 శాతం చొప్పున పతనమై మార్కెట్లను వెనక్కిలాగాయి. క్యూ1 ఫలితాలు నిరాశపరచడం దీనికి కారణమైంది. మిగిలిన దిగ్గజాలలో భెల్, బీవోబీ, అదానీ పోర్ట్స్, బాష్, కొటక్ బ్యాంక్, ఐడియా, లుపిన్, స్టేట్‌బ్యాంక్ 2.7-0.7 శాతం మధ్య నీరసించాయి. -
లాభాల స్వీకరణకు అవకాశం..!
* వర్షపాత విస్తరణపై ఇన్వెస్టర్ల దృష్టి * ఈ వారం మార్కెట్ తీరుపై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: లాభాల నుంచి స్టాక్ మార్కెట్ ఈ వారం ఒకింత విరామం తీసుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. రంజాన్ సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు రోజు కావడంతో ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. గత వారం స్టాక్ మార్కెట్ లాభపడడంతో ఈ వారం లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశముందని, తదుపరి సంకేతాల కోసం ఇన్వెస్టర్లు వర్షపాత విస్తరణను గమనిస్తారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం గమనం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు..ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 5(మంగళవారం) వెలువడే నికాయ్ సేవల రంగం పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుంది. కంపెనీలకు లాభాలు.. నైరుతి రుతుపవనాల విస్తరణ, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్ల పోకడలు.. ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. సంస్కరణల జోరు, వర్షాలు తగిన రీతిలో కురుస్తుండడం, కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలోనే ఉంటాయన్న అంచనాల కారణంగా బ్రెగ్జిట్ ఉదంతం తర్వాత ఇన్వెస్టర్లు భారత్‌పై దృష్టిసారించారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోజనాలన్నీ రానున్న క్వార్టర్లలో కంపెనీల లాభాలు పెరిగేందుకు తోడ్పడతాయని చెప్పారు. ఈ వారంలో లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశం ఉందని, దీంతో మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగవచ్చని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి, కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి ఒక వారంలో ప్రారంభమవుతాయని.. ఇవన్నీ సమీప కాలంలో మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని వివరించారు. విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ లావాదేవీలపై ఆధారపడి ఈ వారం మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీలు ముఖ్యంగా ముడి చమురు ధరల కదలికలు కూడా కీలకమేనని పేర్కొన్నారు. ఫలితాలను బట్టి షేర్ల కదలికలు గత వారంలో మార్కెట్ పనితీరు బాగా ఉందని, ఈ వారంలో కొంత కరెక్షన్ జరగవచ్చని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్(ఈక్విటీస్) పంకజ్ శర్మ చెప్పారు. రానున్న 4-6 వారాల్లో పలు కంపెనీలు ప్రకటించనున్న ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు కీలకం కానున్నాయని వివరించారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను బట్టి కంపెనీల షేర్ల కదలికలు జరిగినట్లే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాలను బట్టి కంపెనీల షేర్ల కదలికలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా సోమవారం(జూలై 4) అమెరికా మార్కెట్లకు సెలవు. కాగా అంతకు ముందటి మూడు వారాల వరుస నష్టాలకు గత వారంలో తెరపడింది. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 747 పాయింట్లు పెరిగి 27,145వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 240 పాయింట్లు లాభపడి 8,328 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 8 నెలల గరిష్టానికి, నిఫ్టీ 10 నెలల గరిష్టానికి చేరాయి. పెరుగుతున్న విదేశీ నిధుల ప్రవాహం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గత నెలలో భారత స్టాక్ మార్కెట్లో రూ.3,713 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల మొత్తం రూ.20,600 కోట్లకు పెరిగాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.41,661 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది మార్చి-మే కాలానికి రూ.32,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వర్షాలు బాగా కురుస్తాయనే అంచనాలతోనే విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టారని క్వాంటమ్ ఏఎంసీ అసోసియేట్ ఫండ్ మేనేజర్(ఈక్విటీ) నీలేశ్ షెట్టి చెప్పారు. మంచి వర్షాలతో కంపెనీల పనితీరు బాగా ఉంటుందన్న అంచనాలతోనే నిధుల ప్రవాహం పెరుగుతోందన్నారు. కాగా గత నెలలో ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్ నుంచి రూ.6,220 కోట్లు వెనక్కి తీసుకున్నారు. -
సెన్సెక్స్ @ 27000
♦ లాభాల స్వీకరణతో ♦ 26,843 పాయింట్ల వద్ద ముగింపు ♦ 8,260 పాయింట్ల నుంచి తగ్గిన నిఫ్టీ ముంబై: సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావంతో శుక్రవారం భారత్ స్టాక్ సూచీలు జోరుగా ప్రారంభమైనా, లాభాల స్వీకరణతో చివరకు ఫ్లాట్‌గా ముగిసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిదశలో 27,000 పాయింట్ల స్థాయిని తాకింది. ఇటీవల పెరిగిన షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరగడంతో సెన్సెక్స్ క్రితం రోజుతో పోలిస్తే దాదాపు మార్పేమీ లేకుండా 26,843 పాయింట్ల వద్దే ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్ల స్వల్పలాభంతో 8,221 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా జాబ్స్ డేటాపై కన్ను..: వచ్చేవారం రిజర్వుబ్యాంక్ పరపతి విధాన సమీక్ష, అమెరికాలో జాబ్స్ డేటా వెల్లడి వంటి అంశాల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారని, దాంతో స్టాక్ సూచీలు గరిష్టస్థాయి వద్ద స్థిరపడలేదని విశ్లేషకులు తెలిపారు. టెలికాం షేర్లు పతనం..: ఐడియా సెల్యులర్ షేర్లను ప్రైవేటు ఈక్విటీ సంస్థ ఈక్విటీ పార్టనర్స్ తక్కువ ధరకు విక్రయించడంతో ఈ షేరు 11% పడిపోయింది. నిఫ్టీ-50 షేర్లలో భారీగా పతనమైన షేరు ఇదే. ఈ ప్రభావం భారతీ ఎయిర్‌టెల్‌పై పడటంతో ఈ షేరు 2.12% క్షీణించింది. ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్ వ్యాపారాన్ని 2 ప్రత్యేక యూనిట్లగా విభజించనున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించడంతో ఆ షేరు 1.8% పెరుగుదలతో రూ.885 వద్ద ముగిసింది. -
పుత్తడికి సీజనల్ డిమాండ్
ధర పటిష్టంగా వుండవచ్చంటున్న బులియన్ ట్రేడర్లు ముంబై: ఈ ఏడాది జోరుగా పెరిగిన బంగారం ధర మున్ముందు కూడా సీజనల్ డిమాండ్ కారణంగా పటిష్టంగానే వుంటుందని బులియన్ ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఇటీవల బాగా పెరిగినందున, చిన్నచిన్న సర్దుబాట్లు జరిగినప్పటికీ, పుత్తడికి రానున్న రోజుల్లో డిమాండ్ పెరుగుతుందని, పెళ్ళిళ్లు తదితరాల కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొనుగోళ్లు బావుంటాయని బులియన్ ట్రేడర్లు వివరించారు. క్రితం వారం ప్రథమార్థంలో దేశీయ మార్కెట్లో 22 నెలల గరిష్టస్థాయికి చేరిన పుత్తడి ధర, అటుతర్వాత లాభాల స్వీకరణకు లోనై, భారీగా పడిపోయింది. కానీ వారం చివర్లో స్టాకిస్టులు, రిటైలర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో తిరిగి పుంజుకుంది. అయితే అంతక్రితంవారంతో పోలిస్తే స్వల్పనష్టంతో ముగిసింది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛతగల 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం గత శుక్రవారం, అంతక్రితంవారం ఇదేరోజుతో పోలిస్తే రూ. 55 నష్టంతో 29,395 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి ధర అంతే తగ్గుదలతో రూ. 29,245 వద్ద క్లోజయ్యింది. ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర ఒకదశలో 1,287 డాలర్ల గరిష్టస్థాయికి చేరింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంతో ఆ స్థాయికి ధర పెరిగినా, అటుతర్వాత లాభాల స్వీకరణతో 1,259 డాలర్ల వద్దకు తగ్గి ముగిసింది. అంతక్రితం వారంతో పోలిస్తే 11 డాలర్ల మేర క్షీణించింది. -
ప్లస్ 210 నుంచి మైనస్ 38కు
లాభాల స్వీకరణతో నష్టాలు * 38 పాయింట్ల నష్టంతో 26,553కు సెన్సెక్స్ * 20 పాయింట్ల నష్టంతో 8,040కు నిఫ్టీ అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా, బిహార్ ఎన్నికల ఫలితాలపై ఆందోళన, ఇటీవల బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ట్రేడింగ్ చివరి గంటలో లాభాల స్వీకరణ కారణంగా ఫార్మా, ఐటీ, బ్యాంక్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 38 పాయింట్లు నష్టపోయి 26,553 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8,040 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా, టెక్నాలజీ, కొన్ని ఆయిల్ షేర్లు మార్కెట్‌ను పడగొట్టాయి. లాభాల నుంచి నష్టాల్లోకి.. అమెరికా మార్కెట్లు మంగళవారం పెరగడంతో బుధవారం ఆసియా మార్కెట్లు పెరిగాయి. దీంతో మన మార్కెట్ కూడా లాభాల్లోనే ప్రారంభమైంది. ఇటీవల బాగా పతనమైన బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో ఒక దశలో సెన్సెక్స్ 210 పాయింట్లు లాభపడింది. సెప్టెంబర్‌లో 50.5గా ఉన్న చైనా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అక్టోబర్‌లో 52కు పెరగడం, గత నెలలో భారత సేవల రంగం కార్యకలాపాలు 8 నెలల గరిష్టానికి చేరాయని నికాయ్ వెల్లడించడం సానుకూల ప్రభావం చూపాయి. అయితే బిహార్ ఎన్నికల ఫలితాలపై ఇన్వెస్టర్ల ఆందోళన, అలాగే లాభాల స్వీకరణ ప్రతికూలత చూపాయి. -
నాలుగో రోజూ నష్టాలే...
⇒ కొనసాగుతున్న లాభాల స్వీకరణ ⇒ ప్రభావం చూపిన యూరో మార్కెట్లు ⇒ 29,000 పాయింట దిగువకు సెన్సెక్స్.. ⇒ 33 మైనస్‌తో 8,724 పాయింట్లకు నిఫ్టీ మార్కెట్ అప్డేట్ వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. లాభాల స్వీకరణ (ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్, కొన్ని వాహన షేర్లలో) కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 29,000 స్థాయి కంటే దిగువనే ముగిసింది. ఎలాంటి ప్రధాన సంఘటనలు లేకపోవడంతో రోజంతా స్టాక్ మార్కెట్లు ఊగిసలాటకు గురయ్యాయి. యూరోప్ మార్కెట్లలో ట్రేడింగ్ ప్రతికూలంగా ప్రారంభం కావడంతో చివరి అరగంటలో అమ్మకాల ఒత్తిడితో నష్టాల పాలయ్యాయి. సెన్సెక్స్ 117 పాయింట్లు నష్టపోయి 28,883 పాయింట్ల వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 8,724 పాయింట్ల వద్ద ముగిశాయి. కన్సూమర్ డ్యూరబుల్స్,వాహన షేర్లు నష్టపోగా. లోహ, రియల్టీ, ఆరోగ్య సంరక్షణ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో 799 పాయింట్లు(2.7 శాతం) నష్టపోయింది. ఆర్బీఐ రేట్ల కోత విధించకపోవడం, కంపెనీల క్యూ3 ఆర్ధిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం వంటి కారణాల వల్ల మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయని జియోజిత్ బీఎన్పీ పారిబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ పేర్కొన్నారు. ప్రధాన లోహాల ధరలు పెరగడం, చైనాలో మరిన్ని ప్రోత్సాహాకాలు వస్తాయన్న అంచనాలతో హిందాల్కో, టాటా స్టీల్, సెసా స్టెరిలైట్, కోల్ ఇండియా వంటి లోహ షేర్లు పెరిగాయని వెల్త్‌రేస్ సెక్యూరిటీస్ డెరైక్టర్, సీఈఓ కిరణ్ కుమార్ కవికొండల వ్యాఖ్యానించారు. కెనరా... తీరే వేరు దాదాపు అన్ని బ్యాంకుల క్యూ3 ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో బ్యాంక్ షేర్లు పతనమవుతున్నాయి. కానీ అంచనాలను మించిన ఫలితాలనివ్వడంతో కెనరా బ్యాంక్ షేర్ ధర పెరిగింది. అమెరికాలో జాగ్వార్ అమ్మకాలు నిరాశపరచడం, గురువారం ఆర్ధిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్ 2 శాతం క్షీణించింది. బీఎస్ఈలో 1,557 షేర్లు నష్టాల్లో, 1,346 షేర్లు లాభాల్లో ముగిశాయి. -
ఆయిల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ఇరాన్ డీల్‌తో ఇన్వెస్టర్లలో వెల్లువెత్తిన ఉత్సాహం ఒక్కరోజులోనే చల్లారిపోయింది. మంగళవారం తిరిగి ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 111 డాలర్లకు పెరగడంతో ఆయిల్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ 180 పాయింట్లు కోల్పోయి 20,425 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 6,059 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరో రెండు రోజుల్లో నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనుండటం, శుక్రవారం క్యూ2 జీడీపీ డేటా వెల్లడికానుండటంతో చాలావరకూ లాంగ్ పొజిషన్లను ఇన్వెస్టర్లు స్క్వేర్‌ఆఫ్ చేసుకున్నారని, మార్కెట్ క్షీణతకు ఇది కూడా ఒక కారణమని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. ప్రధాన ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు కూడా బలహీనంగా ముగిసాయి. క్రితం రోజు పెద్ద ర్యాలీ జరిపిన ఆయిల్ రిఫైనరీ షేర్లు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు 5-6 శాతం పడిపోయాయి. చమురు ఉత్పాదక షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, కెయిర్న్లు 1-2.5 శాతం మధ్య క్షీణించాయి. బ్యాంకింగ్ షేర్లు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 2-4 శాతం మధ్య తగ్గాయి. ప్రపంచ ఇన్వెస్టర్లు ట్రాక్‌చేసే మోర్గాన్ స్టాన్లీ ఇండెక్స్ నుంచి తొలగించిన కారణంతో కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనీటెక్లు 5-8 శాతం మధ్య పతనమయ్యాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) తిరిగి రూ. 339 కోట్ల విలువైన నికర అమ్మకాలు జరిపారు. దేశీయ సంస్థలు రూ. 357 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. ఆర్ఐఎల్ కౌంటర్లో భారీ రోలోవర్స్... రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) షేరు 8 వారాల కనిష్టస్థాయి రూ. 841 వద్ద ముగియడం, ఈ షేరు సాంకేతికంగా కీలకమైన 830-840 మద్దతు శ్రేణి వద్దవుండటంతో డిసెంబర్ డెరివేటివ్ సిరీస్‌కు మంగళవారం రోలోవర్స్ భారీ జరిగాయి. నవంబర్ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 10 లక్షల షేర్లు కట్‌కాగా, డిసెంబర్ సిరీస్‌లో 23 లక్షల షేర్లు యాడ్కావడం విశేషం. ఈ నెల సిరీస్ ముగియడానికి మరో రెండురోజులు సమయం వున్నా, ఇప్పటికే డిసెంబర్ సిరీస్ ఆర్ఐఎల్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో బిల్డప్ 80.24 లక్షల షేర్లకు చే రింది. నవంబర్ సిరీస్ ప్రారంభంకావడానికి రెండు రోజుల ముందు.... అంటే అక్టోబర్ 29న నవంబర్ కాంట్రాక్టు బిల్డప్ 58 లక్షల షేర్లవర కే వుండేది. షేరు కీలక మద్దతుస్థాయిని సమీపించడంతో అటు షార్ట్, ఇటు లాంగ్ రోలోవర్స్ పెరగడాన్ని డిసెంబర్ బిల్డప్ సూచిస్తున్నది. సమీప భవిష్యత్తులో ఆర్ఐఎల్ ప్రస్తుత మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే వచ్చే నెలలో ర్యాలీ జరపవచ్చని, మద్దతును కోల్పోతే వేగంగా పతనంకావొచ్చన్నది ఈ భారీ బిల్డప్ అంతరార్థం. కేజీ డీ6 క్షేత్రంలో మరో బావిని రిలయన్స్ మూసివేయడంతో అత్యంత కనిష్టస్థాయికి గ్యాస్ ఉత్పత్తి పడిపోయిందని, వచ్చే ఏప్రిల్ నుంచి రెట్టింపు గ్యాస్ ధరను గ్యారంటీ మొత్తాన్ని తీసుకుని ఆర్ఐఎల్కు వర్తింపచేస్తామంటూ కేంద్ర పెట్రో మంత్రి ప్రకటించడం వంటి అనుకూల, ప్రతికూల వార్తలు తాజాగా వెలువడ్డ నేపథ్యంలో ఈ బిల్డప్ జరగడం గమనార్హం. -
స్టాక్ మార్కెట్ లాభాల స్వీకరణ, సెన్సెక్స్ 153 పాయింట్లు డౌన్!
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్ లో 55 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్.. మధ్నాహ్నం (12.40) కల్లా 153 పాయింట్లు నష్టంతో 19841 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయి 5854 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ప్రధాన రంగాల కంపెనీ షేర్లతోపాటు కాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్. పీఎస్ యూ, బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. ద్రవ్యమార్కెట్ లో నిన్నటి ముగింపుకు స్వల తేడాతో ప్రస్తుతం 63.80 వద్ద ట్రేడ్ అవుతోంది. బుధవారం ఉదయం ఆరంభంలో 16 పైసలు లాభపడింది. రూపాయి బలపడుతుండటం, సిరియాపై యుద్ధ భయాలు కాస్త తగ్గడం వంటి సానుకూల అంశాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ ఏకంగా 727 పాయింట్లు (3.77%) ఎగసింది. జూలై 25 తర్వాత తొలిసారిగా కీలకమైన 20,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. చివరికి 19,997 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఒకేరోజున ఇంత స్థాయిలో పెరగడం నాలుగేళ్లలో ఇదే మొదటిసారి. జయప్రకాశ్ అసోసియేట్స్, పీఎన్ బీ, హిండాల్కో,బ్యాంక్ ఆఫ్ బరోడా, మారుతి సుజుకీ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకోగా, పవర్ గ్రిడ్, ఓఎన్ జీసీ, టాటా మోటార్స్, హెచ్ యూఎల్, ఐటీసీ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.