సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. స్వల్పలాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు మిడ్ సెషన్‌కు భారీగా నష్టపోతున్నాయి. గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం సూచీల పతనానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్226 పాయింట్లుకుప్పకూలి 40344 వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో 11901 వద్ద కొనసాగుతోంది. ఒకదశలో నిఫ్టీ 11900 స్థాయికి కిందికిచేరింది.ప్రధానంగా ఈ ఏడాదికి దేశీయ ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్‌ను ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమీ కో అపరేషన్ అండ్ డెవెలప్‌మెంట్(ఓఈసీడీ) 5.8శాతానికి డౌన్‌గ్రేడ్ చేయడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. మెటల్, మీడియా షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా వీసా నిబంధనల మార్పుల వార్తలతో ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తడి నెలకొంది. అలాగే ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. భారతి ఇన్‌ఫ్రాటెల్ 5 శాతం పతనమైన టాప్‌లూజర్‌గా కొనసాగుతోంది. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, యుపిఎల్, బజాజ్ ఆటో, సిప్లా నష్టపోతుండగా, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, యస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, జీ లిమిటెడ్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, యస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటిసి, కోల్ ఇండియా లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment