
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా ట్రేడింగ్ పప్రారంభం నుంచీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరికి నష్టాల్లోనే సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 186 పాయింట్లు క్షీణించి 52,549 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు నష్టంతో 15,748 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైద్యరంగానికి ప్రకటించిన ఉపశమన చర్యల కారణంగా ఫార్మ, ఇంకా ఎఫ్‌ఎంసిజి షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, హెచ్‌యుఎల్, నెస్లే ఇండియా, సిప్లా, డివిస్ ల్యాబ్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభపడగా, ఓఎన్‌జీసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందాల్కో, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఆటో నష్టపోయాయి.