Today Market Closing: దేశీయ మార్కెట్లు యూటర్న్ తీసుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులమధ్య సాగిన సూచీలు చివరికి స్వల్ప లాభాలకు పరిమితమై నాయి ముఖ్యంగా రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల అమ్మకాలతో 380 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. చివరికి సెన్సెక్స్ 94 పాయింట్లు లాభంతో 67,221.13 వద్ద ముగిసింది. అలాగే 20వేలకు ఎగువన మొదలైన నిఫ్టీ ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. నిఫ్టీ 3 పాయింట్లు నష్టంతో 19,993.20 వద్ద ముగిసింది. ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లు ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ & గ్యాస్, మెటల్ , రియాల్టీ ఒక్కొక్కటి 1-3 శాతం చొప్పున నష్టపోయాయి. తద్వారా వరుసగా 7 రోజుల లాభాలకు చెక్ పడింది.
బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లోని రూ.324.3 లక్షల కోట్ల నుండి దాదాపు రూ.318.7 లక్షల కోట్లకు పడిపోయింది.అంటే ఒక్క సెషన్‌లోనే దాదాపు రూ. 5.6 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు కోల్పోయారు.మిడ్, స్మాల్ క్యాప్‌లు ఈరోజు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.96 శాతం క్షీణించి 32,084.93 వద్దకు చేరుకోగా, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 4.02 శాతం క్షీణించి 36,982.74 వద్దకు చేరుకుంది. నిఫ్టీ ఇండెక్స్‌లో బీపీసీఎల్ ,ఎన్‌టీపీసీ ,పవర్ గ్రిడ్ ,షేర్లు టాప్ లూజర్‌లుగా ముగిశాయి. మరోవైపు టిసిఎస్ , లార్సెన్ అండ్ టూబ్రో ,ఇన్ఫోసిస్ ,షేర్లు టాప్ గెయినర్లుగా ముగిశాయి.
అటు యుఎస్ ద్రవ్యోల్బణం డేటా ,యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ , యుఎస్ ఫెడ్ ద్రవ్య విధాన సమావేశాలపై దృష్టి సారించడంతో గ్లోబల్ సూచనలు కూడా బలహీనంగా ఉన్నాయి. అలాగే ఈ రోజు తవెల్లడి కానున్న ఆగస్ట్‌లో భారత ద్రవ్యోల్బణం డేటా , జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు
రూపాయి: అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 13 పైసలు ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment