రానున్న వారంలో మార్కెట్ మూమెంటం ఎలా ఉండబోతోంది. ఈ వారం భారీ నష్టాలనుంచి పుంజుకుని ముందుకొచ్చాయి. ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథంగా ఉంచిన నేపథ్యంలో నెక్ట్స్ ఎలా ఉండ బోతోంది.. తదితర విషయాలపై అశిక ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీ లీడ్ ఎనలిస్ట్ కౌశిక్ మోహన్‌తో సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు సంభాషణ..
గ్లోబల్ పరిణామాలు ఎఫ్‌ఐఐ సెల్లింగ్, ఆయిల్ ధరలు బలమైన డాలర్ నేపథ్యంలో మార్కెట్లో పరిణామాలు చూశాం. రానున్నది ఎలక్షన్ సీజన్, అలాగే పండుగ సీజన్ నేపథ్యంలో పెద్దగా నష్టపోయే అవకాశం కాలేదు. దేశీయ స్టాక్‌మార్కెట్లు ఎందుకు బలంగా ఉన్నాయంటే భారత్ అందిస్తున్న పీఎల్‌ఐ ప్రయోజనాల మూలంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి.పురోగతి ఆకర్షణీయంగా ఉంది. వినియోగం పెరిగింది. అలా మనదేశంలో యంగస్టర్, నిపుణులు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే చైనాతో పోలిస్తే ఇండియాపై పరిశ్రమలు మొగ్గుచూపుతున్నాయి.
ప్రైవేటు బాంక్స్, పీఎస్‌యూ బ్యాంక్స్ ఫలితాలు, క్రెడిట్ గ్రోత్ బావుంది. ఎస్‌బీఐ కొనుక్కోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ గ్లోబల్‌గా టాప్-5 లో బ్యాంకుగా ఉంది. కోటక్, ఐసీఐసీఐ, కర్నాటక బ్యాంక్ పాజిటివ్‌గానే ఉన్నాయి. కనుక ఫైనాన్సియల్ రంగంలోనే ఎల్‌ఐసీ లాంటి ఇన్సూరెన్స్ సెక్టార్ బుల్లిష్‌గా ఉంది.
అమెరికా ట్రెజరీ, ఇండియా బాండ్స్‌కి తేడా ఏంటి? ఇండియా డెఫిసిట్ ఎక్కువగాఉంటే గవర్నమెంట్స్ ట్రెజరీ బాండ్స్‌ను జారీ చేస్తుంది. టాక్స్ సేవింగ్స్ లాంటి వాటికోసం వాటిని కొనుగోలు చేస్తాం. లాంగ్ టర్న్ క్యాపిటల్ గెయిన్స్ కోసం కూడా వీటిని బై చేయవచ్చు. యూఎస్ ట్రెజరీ బాండ్స్‌లో వడ్డీ ఎక్కువ ఇస్తే.. అక్కడ రిటర్న్స్ ఎక్కువ వుంటాయి. కానీ డాలర్ చిక్కులుంటాయి. ఏదైనా లాంగ్ టెర్మ్‌లో బాండ్స్ మంచి ఈల్డ్స్ ఇస్తాయి.
ప్రస్తుతం పీఎస్‌యూ, ఇన్‌ఫ్రా, సిమెంట్ షేర్లు బలహీనంగా ఉన్నాయి. కానీ ఇవీ ఫ్యూచర్ గైడెన్స్ ఆధారంగా ట్రేడింగ్ కావడం లేదు. అందుకే బలహీనత. కానీ బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్స్, టెండర్స్ చూస్తే మనం చాలా పటిష్టంగా ఉన్నాం. సెప్టెంబరు క్వార్టర్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే.. మేజర్‌గా నిఫ్టీలోనే కాకుండా ఫార్మా,కెమికల్ బావుండే అవకాశం ఉంది.
ప్రస్తుతం చైనాలో డిఫ్లేషన్ ఉంది. చైనా డంపింగ్ కారణంగా కెమికల్, ఫార్మా ధరలు పడిపోయాయి. ఇపుడు మెల్లిగా కోలుకుంటున్నాయి. లోయర్ లెవల్స్‌ని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు క్యాపిటల్ గూడ్స్ సెక్టార్‌కూడా బలంగా ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్)సెక్టార్ కూడా బాగా పెర్‌ఫాం చేయబోతోంది. ముఖ్యంగా మేడిన్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. వీటికి మళ్లీ బ్యాంకింగ్ సహకారం కచ్చితంగా అవసరం.. వీటిని కూడా మనం చూడాలి.
ఆటో, ఆటో యాంగ్జీలరీస్‌లో ఇన్వెంటరీమీద దృష్టిపెట్టాలి. క్యూ 3లోఫెస్టివ్ సీజన్‌తో వస్తుంది కాబట్టి ఇపుడు కొనాలనే సెంటిమెంట్ ఉంటుంది. క్యూ2 ప్రొడక్ట్స్‌ను క్యూ3లో కొంటారు. ఇదొక సైకిల్. అలాగే రీసెంట్‌గా ఆటో కంపెనీల సేల్స్ బావున్నాయి. భారత్‌ను ట్రేడింగ్ కాగా ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూడాలి. క్యాష్ ఎర్నింగ్స్‌ను పరిశీలించి, షేర్లను కొనుగోలుకు ఎంపిక చేసుకోవాలి. రానున్న పదేళ్లలో ఇండియా గ్రోత్ కూడా శరవేగంగా పెరగబోతోంది. దాదాపు రెండు మూడు రెట్లు పుంజుకోతోంది. 6 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవ బోతోంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment