Today StockMarketClosing: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్ 3.94 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 65,220వద్ద, నిఫ్టీ 2.90 పాయింట్లు లేదా 0.01 శాతం లాభంతో 19,396.50 వద్ద ముగిశాయి. తద్వారా సోమవారం నాటి లాభాలకు చెక్ చెప్పాయి. ఐటీ, ఫార్మా , పీఎస్‌యు బ్యాంక్ మినహా అన్ని రంగాలు లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ , పవర్ ఒక్కొక్కటి 1 శాతం లాభపడ్డాయి. మెటల్ , ఎఫ్‌ఎంసిజి ఒక్కొక్కటి 0.5 శాతం ఎగిసాయి.
అలాగే నేటి ట్రేడింగ్ సెషన్‌లో బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ , స్మాల్‌క్యాప్ రెండు సూచీలు తాజా రికార్డు గరిష్టాలను అధిగమించాయి. ఇది కీలక సూ చీలకు ఊతమిచ్చాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐటీసీ,ఎన్టీపీసీ, హీరోమోటో టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. బీపీసీఎల్, సిప్లా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐషర్ మోటార్స్, టీసీఎస్ టాప్ లూజర్స్‌గాఉన్నాయి. మరోవైపు సోమవారం మార్కెట్‌లో లిస్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వరుసగా రెండో రోజు కూడా 5 శాతం కుప్పలకూలడం గమనార్హం.ఎన్‌ఎస్‌ఇలో రూ.236.45 వద్ద లోయర్ సర్క్యూట్ అయింది.
రూపాయి: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 17 పైసల లాభంతో ముగిసింది. గత ముగింపు 83.11తో పోలిస్తే 82.94 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment