TodayStockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. గత వారం నష్టాలనుంచి కోలుకున్న సూచీలు ఈ వారాన్ని లాభాలతో శుభారంభం చేశాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి 267 పాయింట్ల లాభంతో 65, 216వద్ద ముగిసింది. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 19394 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఐటీ,ఫైనాన్షియల్ షేర్లు లాభపడ్డాయి.
అదానీ పోర్ట్స్ , బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్‌గ్రిడ్, హిందాల్కో టాప్ విన్నర్స్‌గా నిలవగా, రిలయన్స్, ఎంఅండ్‌ఎం, బ్రిటానియా, బీపీసీఎల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్‌గా మిగిలాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి ఆరంభంలో ఆల్ టైం కనిష్టం నుంచి కోలుకుంది. చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది.
నిరాశపర్చిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్‌లో కస్టమర్లకు షాకిచ్చింది. సోమవారం ఈ షేరు ధరబీఎస్‌ఈలో రూ.265 నిఫ్టీ రూ. 262 వద్ద లిస్ట్ అయింది . అయితే ఇంట్రాడే కనిష్ట స్థాయికి జారిపోయింది. రెండు ఎక్స్ఛేంజీలలో 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment