Jio Financial Services
-
బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్
దీపావళి పండగను పురస్కరించుకుని ధన్‌తేరాస్ సందర్భంగా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి రిలయన్స్ గ్రూప్ అవకాశం కల్పిస్తోంది. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్స్ యాప్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేసేలా చర్యలు చేపట్టింది. ముదుపర్లు, వినియోగదారులు నేరుగా ఈ యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేసేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్మార్ట్ గోల్డ్ ఫీచర్‌తో డిజిటల్ రూపంలో కేవలం రూ.10తో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చని కంపెనీ ప్రకటనలో తెలిపింది.నేరుగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి జియో ఫైనాన్స్ యాప్ ద్వారా 0.5 గ్రాములు, 1 గ్రా., 2 గ్రా., 5 గ్రా., 10 గ్రా. బరువుగల బంగారం అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన బంగారం అందిస్తామని తెలిపింది. గోల్డ్‌లో మదుపు చేసేందుకు మరో మార్గాన్ని కూడా జియో ఫైనాన్స్ అందుబాటులో ఉంచింది. ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!కస్టమర్లు రూ.10 అంతకంటే ఎక్కువ పెట్టుబడితో డిజిటల్ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చని స్పష్టం చేసింది. ఇలా కొంతకాలం మదుపు చేసిన తర్వాత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా దీన్ని రెడీమ్ చేసుకోవచ్చని చెప్పింది. -
జియోఫైనాన్స్ కొత్త యాప్.. ఇక మరిన్ని ఫీచర్లు
న్యూఢిల్లీ: జియోఫైనాన్స్ యాప్‌ను మరింత మెరుగ్గా ప్రారంభించినట్టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకటించింది. రుణాలు, పొదుపు ఖాతాలు, యూపీఐ బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, డిజిటల్ ఇన్సూరెన్స్‌తో సహా అనేక రకాల సేవలను ఈ యాప్ అందిస్తోంది.జియోఫైనాన్స్ యాప్ బీటా వెర్షన్ 2024 మే 30న ప్రారంభమైంది. 60 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్నారు. బీటా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అనేక రకాల ఆర్థిక ఉత్పత్తులు సేవలు జోడించామని, మ్యూచువల్ ఫండ్లపై రుణాలు, గృహ రుణాలు (బ్యాలెన్స్ బదిలీతో) సహా ఆస్తిపై రుణాలు వీటిలో ఉన్నాయని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. -
అంబానీ కంపెనీ హోమ్లోన్ల విస్తరణ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్షియల్ లిమిటెడ్(జేఎఫ్ఎల్) త్వరలో హోమ్‌లోన్ సర్వీసులను విస్తరిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈమేరకు కంపెనీ తన లోన్ల వివరాలు వెల్లడించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కంపెనీ తన ‘జియో ఫైనాన్స్ యాప్ బీటా మోడ్’ వినియోగదారులకు హోమ్లోన్లు అందిస్తోంది.గతేడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అనంతరం జియో ఫైనాన్స్ యాప్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా యూపీఐ సర్వీసులు, ఆన్లైన్ బిల్లు చెల్లింపులు, బీమా సేవలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా సర్వీసు అందిస్తోంది. జేఎఫ్ఎల్ యాప్ బీటా మోడ్ వినియోగదారులకు హోమ్లోన్లు అందిస్తున్నారు. ఈ సర్వీసును త్వరలో కంపెనీ వినియోగదారులందరికీ అందుబాటులోకి తేనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మార్కెట్లో వస్తున్న వార్తల ప్రకారం కంపెనీ ఈ సర్వీసును తీసుకొస్తే ఇదే రంగంలో సేవలందించే ఇతర హోమ్‌లోన్ కంపెనీలు, కొన్ని బ్యాంకులపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.మే 30, 2024న ప్రారంభమైన జియో ఫైనాన్షియల్ లిమిటెడ్ యాప్ ఇప్పటికే 10 లక్షల డౌన్లోడ్లను అధిగమించిందని కంపెనీ తెలిపింది. జులై 2023లో బ్లాక్‌రాక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అందుకోసం ఇరు కంపెనీలు రూ.1,258 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి. -
నవకల్పనలపై జియో ఫైనాన్షియల్ దృష్టి
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎస్ఎఫ్ఎల్) నవకల్పనలు, వృద్ధి, దేశవ్యాప్తంగా ఆర్థికాంశాల గురించి అవగాహన కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. సర్వీసుల పోర్ట్‌పోలియోను విస్తరిస్తోందని, అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ను సరళతరం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.రిలయన్స్ అనుబంధ సంస్థ జేఎఫ్ఎస్ఎల్ తొలి వార్షిక నివేదికను గురువారం విడుదల చేసిన సందర్భంగా అంబానీ ఈ విషయాలు తెలిపారు. టెక్నాలజీ ఊతంతో వివిధ వర్గాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ప్రోడక్టులు అందించడం ద్వారా ఆర్థికంగా సమ్మిళిత భారత భవిష్యత్‌ను తీర్చిదిద్దే విషయంలో కంపెనీ సారథ్య బాధ్యతలను నిర్వర్తించగలదని ఆయన పేర్కొన్నారు.భారత మార్కెట్‌పై గల అపార అవగాహన, టెక్నాలజీలో అనుభవాన్ని ఉపయోగించుకుని కస్టమర్ల అవసరాలకు తగిన ఆర్థిక సాధనాలు, సేవలను రూపొందించడం కొనసాగిస్తుందని వివరించారు. అధునాతన సాంకేతికత తోడ్పాటుతో యూజర్ల అనుభూతిని మెరుగుపర్చే దిశగా జియోఫైనాన్స్ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు జేఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఈషా ఎం అంబానీ తెలిపారు. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు నిరాశ
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మొదటి త్రైమాసికంలో నిరాశజనక ఫలితాలను నమోదు చేసింది. 2024 జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం ఫలితాలను కంపెనీ సోమవారం (జూలై 15) వెల్లడించింది.గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 6% క్షీణించి రూ.312.63 కోట్లకు చేరుకుంది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని రూ.414 కోట్లతో పోలిస్తే కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 9% పెరిగి రూ.417.8 కోట్లకు చేరుకుంది.మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈలో రూ.4.90 లేదా 1.40% పెరిగి రూ.355.25 వద్ద ముగిశాయి. -
ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ బంపర్ డీల్ అందుకుంటోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ముకేశ్ అంబానీకి చెందిన జియో లీజింగ్ సర్వీసెస్ ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌తో రూ.35,904 కోట్ల డీల్ కుదుర్చుకోనుంది.టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, జియో లీజింగ్ సర్వీసెస్ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ .35, 904 కోట్ల విలువైన రౌటర్లు, సెల్ ఫోన్లు వంటి టెలికాం పరికరాలు, కస్టమర్ కేంద్రాల ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డీల్ కు ఆమోదం పొందడానికి కంపెనీ వాటాదారులకు పోస్టల్ బ్యాలెట్ నోటీసును పంపినట్లు సమాచారం.జియో లీజింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎల్ఎస్ఎల్) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగదారులకు అనుబంధ సేవలతో పాటు టెలికాం పరికరాలను లీజుకు ఇచ్చే వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ డీల్ విజయవంతమైతే భారత టెలికాం రంగంలో ఇదే అతిపెద్ద ఎక్విప్మెంట్ లావాదేవీ అవుతుంది. నివేదిక ప్రకారం, జెఎల్ఎస్ఎల్ లీజింగ్ మోడల్ ద్వారా, ముఖేష్ అంబానీ లేటెస్ట్ 5జీ పరికరాలను ప్రజలకు అందుబాటు ధరలో అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మోడల్ ఆకాష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు మరింత మంది చందాదారులను ఆకర్షిస్తుంది. జియో ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2025 మార్చి నుంచి 2026 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరాల్లో ఈ లావాదేవీ జరగనుంది. -
జియో ఫైనాన్షియల్ సరికొత్త రికార్డులు!
దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో సరికొత్త రికార్డ్ లను నమోదు చేశాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్ ధర 35 శాతం పెరిగింది. ఫలితంగా ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ. 2 లక్షల కోట్లను అధిగమించింది. ఫిబ్రవరి 23న పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం రికార్డు స్థాయిని తాకింది. ఉదయం 10.30 గంటల సమయానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 8 శాతం పెరిగి.. ఒక్కోషేర్ ధర రికార్డు స్థాయిలో రూ. 326కి చేరుకుంది. ఈ స్టాక్ వరుసగా ఐదవ సెషన్లో 17 శాతం వృద్ధిని నమోదు చేయడంతో సంస్థ విలువ పరంగా రూ. 2.08 లక్షల కోట్లు దాటేందుకు దోహదపడింది. ఆర్ఐఎల్ ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో రూ.2,989ను తాకింది. బీఎస్ఈలో ఈ షేరు మునుపటి ముగింపుతో పోలిస్తే 0.5 శాతం పెరిగి రూ.2,978 వద్ద ట్రేడవుతోంది. వ్యూహాత్మక అడుగులు జియో ఫైనాన్షియల్ సెక్యూర్డ్ లోన్లు అందించేందుకు దృష్టి సారిస్తోంది. ఆర్ధిక విభాగంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది రెండు కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా దాని సురక్షిత రుణ వ్యాపారాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. దాని అనుబంధ సంస్థ జియో ఇన్ఫర్మేషన్ అగ్రిగేటర్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ఎయిర్ ఫైబర్, ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి పరికరాల కోసం ఆపరేటింగ్, ఫైనాన్సింగ్ లీజులను అందించడం, చైన్ ఫైనాన్సింగ్, సరఫరాదారుల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చేలా వ్యూహాత్మకంగా వడివడిగా అడుగులు వేస్తోంది. కాగా, జనవరిలో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్‌రాక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సంస్థలు సంయుక్తంగా భారత్ లో మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు పత్రాలను దాఖలు చేశాయి. 39 కంపెనీలు@ రూ. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం, 39 కంపెనీలు స్టాక్ మార్కెట్ లో రూ. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ ట్రేడింగ్ చేస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.20.05 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో ఉండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.14.78 లక్షల కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.10.78 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్: మొత్తం షేర్ల సంఖ్యను మార్కెట్ విలువతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. -
పటిష్టమైన దేశీ బ్రాండ్ ఏంటో తెలుసా..
గ్లోబల్–500 కంపెనీల జాబితాలో పటిష్టమైన దేశీ బ్రాండ్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో చోటు దక్కించుకుంది. బ్రాండ్ పటిష్టత సూచీలో 88.9 పాయింట్లతో 17వ ర్యాంకులో నిలి్చంది. 2024 సంవత్సరానికి గాను బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో ఎల్ఐసీ 23వ స్థానంలో, ఎస్బీఐ 24వ స్థానంలో నిల్చాయి. గతేడాది (2023) కూడా పటిష్టమైన భారతీయ బ్రాండ్ల జాబితాలో జియో అగ్రస్థానం దక్కించుకుంది. 2024కి సంబంధించిన జాబితాలో వుయ్‌చాట్, యూట్యూబ్, గూగుల్, డెలాయిట్, కోకా కోలా, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు టాప్‌లో ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్ రంగంలో మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే కొత్త కంపెనీ అయినప్పటికీ పరిశ్రమలో జియో అత్యంత వేగంగా ఎదిగిందని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: గూగుల్‌పే యూజర్లకు శుభవార్త.. అదేంటంటే? కస్టమర్ల సంఖ్య వేగంగా పెరగడం, నవకల్పనలు, బ్రాండ్‌పై సానుకూల అభిప్రాయం మొదలైనవన్నీ కూడా జియో బ్రాండ్ పటిష్టత, ట్రిపుల్ ఏ రేటింగ్‌లో ప్రతిఫలిస్తున్నాయని తెలిపింది. టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటర్స్ వంటి దిగ్గజ కంపెనీలున్న టాటా గ్రూప్.. దక్షిణాసియాలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలి్చందని నివేదిక పేర్కొంది. -
జియో ఫైనాన్స్ పర్సనల్ లోన్స్.. ఇవి ఉంటే చాలు!
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన జియో ఫైనాన్స్ తన రుణ వితరణ వ్యాపారాన్ని ప్రారంభింంది. తొలుత పర్సనల్ లోన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, మర్చంట్ ట్రేడ్ క్రెడిట్ ఫెసిలిటీని ఆరంభింంది. జియో ఫైనాన్స్, మై జియో మొబైల్ అప్లికేషన్స్ ద్వారా వేతన జీవులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి డిజిటల్ పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ఉంటే చాలు. రుణాన్ని వేగంగా పొందొచ్చు. కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కింద ఖరీదైన మొబైల్ ఫోన్లు, ఏసీలు, కెమెరా కొనుగోళ్లకు రుణాలను అందిస్తోంది. మర్చంట్ వెబ్ సైట్లపై నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కింద ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. ‘‘జియో ఫైనాన్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలను అందిస్తోంది. తయారీదారులు, ఓఈఎంలు లేదా డీలర్లు ఈ రుణాలపై వడ్డీని భరిస్తారు. దీంతో నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాన్ని వినియోగదారులు పొందొచ్చు. కాకపోతే కస్టమర్లు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది’’అని జియో ఫైనాన్స్ పేర్కొంది. ఇన్వెంటరీ కొనుగోళ్లకూ రుణాలు వ్యాపారస్థులకు రుణాలను కూడా జియో ఫైనాన్స్ ప్రారంభింంది. అన్ సెక్యూర్డ్ మర్చంట్ ట్రేడ్ క్రెడిట్ ఫెసిలిటీని తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన వర్తకులకు అందించనుంది. జియో ఫైనాన్షియల్ రిలయన్స్ నుం విడిపోయి ఎక్సే్ఛంజ్‌లలో లిస్టయింది. ఇన్సూరెన్స్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ సేవలను సైతం ఈ సంస్థ త్వరలోనే అందించనుంది. -
Jio financial services: ఇకపై రిలయన్స్ జియో డెబిట్ కార్డులు!
రిలయన్స్ జియో టారిఫ్ పరంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆ దెబ్బతో అదే రంగంలోని కొన్ని కంపెనీలు కుదేలయ్యాయి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి పూర్తిస్థాయి ఆర్థిక సేవలు అందించేలా సన్నద్ధమవుతుంది. రిలయన్స్ ఫైనాన్షియల్ మార్కెట్లోనూ తన సత్తా చాటాలనుకుంటోంది. పేమెంట్ విభాగం సేవింగ్స్ అకౌంట్లను, బిల్ పేమెంట్ సర్వీసులను సంస్థ రీలాంచ్ చేసింది. త్వరలో డెబిట్ కార్డులు కూడా తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో ఆటో, హోమ్లోన్లను కూడా జారీ చేయనుంది. ఇటీవల సంస్థ తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కొన్ని అంశాలను వెల్లడించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా ఉన్న 300 స్టోర్లలో గృహ వినియోగ వస్తువులపై రుణాలను మంజూరు చేస్తోంది. ఇప్పటికే ముంబయిలోని వేతన జీవులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి వ్యక్తిగత రుణాలు అందిస్తుంది. త్వరలో వ్యాపారులకు సైతం రుణాలు జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 24 బీమా సంస్థలతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జతకట్టింది. తన ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ఓ యాప్‌ను సైతం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సిద్ధం చేస్తోంది. -
మళ్లీ జియో ఫైనాన్స్ డీలా
ముంబై: వరుసగా రెండో రోజు జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో మరోసారి 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్ఈలో రూ. 12.5 కోల్పోయి రూ. 239 వద్ద నిలవగా.. ఎన్ఎస్ఈలోనూ ఇదే స్థాయి నష్టంతో రూ. 237 దిగువన స్థిరపడింది. సోమవారం సైతం ఈ షేరు 5 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకిన సంగతి తెలిసిందే. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ గత నెలలో జరిగిన ధర నిర్ధారణ ట్రేడింగ్‌లో రూ. 262 ధర వద్ద స్థిరపడింది. తదుపరి ఈ కౌంటర్లో స్టాక్ ఎక్సే్ఛంజీలు సోమవారం(21) నుంచి 10 రోజులపాటు ట్రేడ్ ఫర్ ట్రేడ్ విభాగంలో సాధారణ ట్రేడింగ్‌కు తెరతీశాయి. ఫలితంగా రోజుకి 5 శాతం సర్క్యూట్ బ్రేకర్ అమలుకానుంది. తొలి రోజు 5 శాతం పతనమై రూ. 250 సమీపంలో నిలిచింది. ఇండెక్సులలో.. ధరలో నిలకడను తీసుకురావడం, హెచ్చుతగ్గులను పరిమితం చేయడం వంటి లక్ష్యాలతో స్టాక్ ఎక్సే్ఛంజీలు జియో ఫైనాన్షియల్‌ను ప్రధాన ఇండెక్సులలో తాత్కాలికంగా భాగం చేశాయి. విలీనాలపై సవరించిన తాజా నిబంధనల అమలులో భాగంగా సెన్సెక్స్‌లో 31వ, నిఫ్టీలో 51వ షేరుగా ప్రస్తుతం కొనసాగుతోంది. నిజానికి ఈ షేరుని లిస్టింగ్ తదుపరి మూడు రోజులకు సెన్సెక్స్, నిఫ్టీల నుంచి తొలగించవలసి ఉంది. అయితే వరుసగా సర్క్యూట్ బ్రేకర్లను తాకడంతో ఈ షేరుని ఆగస్ట్ 29వరకూ సెన్సెక్స్, నిఫ్టీలలో కొనసాగించనున్నట్లు ఇండెక్సుల కమిటీ పేర్కొంది. అప్పటికి కూడా సర్క్యూట్ బ్రేకర్లను తాకడం కొనసాగితే.. మరోమారు ఇండెక్సుల నుంచి తొలగింపు వాయి దా పడవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఎల్ఐసీకి షేర్లు ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్‌లను జియో ఫైనాన్షియల్ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత నెలలో ప్రత్యేక కంపెనీగా విడదీసింది. దీనిలో భాగంగా వాటాదారులకు ప్రతీ 1 ఆర్ఐఎల్ షేరుకిగాను 1 జియో ఫైనాన్షియల్‌ను కేటాయించింది. ఫలితంగా ఆర్ఐఎల్లోగల వాటాలకుగాను ఎన్బీఎఫ్సీ జియో ఫైనాన్షియల్‌లో 6.66 శాతం వాటాను పొందినట్లు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ తాజాగా వెల్లడించింది. ఆటుపోట్ల మధ్య మార్కెట్ అక్కడక్కడే ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 4 పాయింట్లు బలపడి 65,220 వద్ద నిలిచింది. 3 పాయింట్ల స్వల్ప లాభంతో నిఫ్టీ 19,346 వద్ద స్థిరపడింది. అంతకుముందు ఇంట్రాడేలో సెన్సెక్స్ 147 పాయింట్ల వరకూ పుంజుకుని 65,396కు చేరింది. నిఫ్టీ సైతం 19,443–19,381 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. యూఎస్‌లో వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,165 లాభపడితే 1503 డీలాపడ్డాయి. పిరమిడ్ టెక్నో ఐపీవో సక్సెస్ ఇండ్రస్టియల్ ప్యాకేజింగ్ కంపెనీ పిరమిడ్ టెక్నోప్లాస్ట్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు మంగళవారాని(22)కల్లా 18 రెట్లుపైగా సబ్‌్రస్కిప్షన్ లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 75.6 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 13.83 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఈ ఆఫర్‌తో కంపెనీ రూ. 153 కోట్లు సమకూర్చుకుంది. రూపాయి రికవరీ 14 పైసలు అప్; 82.99 వద్ద ముగింపు న్యూఢిల్లీ: డాలరు మారకం విలువ తగ్గిన నేపథ్యంలో దేశీ కరెన్సీ రూపాయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే 14 పైసలు బలపడి, 82.99 వద్ద ముగిసింది. అమెరికా డాలరు బలహీనత దీనికి కారణం. -
సాక్షి మనీ మంత్రా: లాభాలకు చెక్, అయ్యో,జియో ఫైనాన్షియల్ సర్వీసెస్
Today StockMarketClosing: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్ 3.94 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 65,220వద్ద, నిఫ్టీ 2.90 పాయింట్లు లేదా 0.01 శాతం లాభంతో 19,396.50 వద్ద ముగిశాయి. తద్వారా సోమవారం నాటి లాభాలకు చెక్ చెప్పాయి. ఐటీ, ఫార్మా , పీఎస్‌యు బ్యాంక్ మినహా అన్ని రంగాలు లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ , పవర్ ఒక్కొక్కటి 1 శాతం లాభపడ్డాయి. మెటల్ , ఎఫ్ఎంసిజి ఒక్కొక్కటి 0.5 శాతం ఎగిసాయి. అలాగే నేటి ట్రేడింగ్ సెషన్లో బిఎస్ఇ మిడ్‌క్యాప్ , స్మాల్‌క్యాప్ రెండు సూచీలు తాజా రికార్డు గరిష్టాలను అధిగమించాయి. ఇది కీలక సూ చీలకు ఊతమిచ్చాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ,ఎన్టీపీసీ, హీరోమోటో టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. బీపీసీఎల్, సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, టీసీఎస్ టాప్ లూజర్స్‌గాఉన్నాయి. మరోవైపు సోమవారం మార్కెట్లో లిస్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వరుసగా రెండో రోజు కూడా 5 శాతం కుప్పలకూలడం గమనార్హం.ఎన్ఎస్ఇలో రూ.236.45 వద్ద లోయర్ సర్క్యూట్ అయింది. రూపాయి: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 17 పైసల లాభంతో ముగిసింది. గత ముగింపు 83.11తో పోలిస్తే 82.94 వద్ద ముగిసింది. -
అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఎల్ఐసీ భారీ వాటా కొనుగోలు
LICacquires6.66pcJFS: లయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ అయిన ఫైనాన్షియల్ ఎంటిటీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సంస్థలో 6.66 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ మేరకు ఎల్ఐసీ మంగళవారం ప్రకటించింది. ఇదీ చదవండి:ఎస్బీఐ లైఫ్: కస్టమర్లకు గుడ్ న్యూస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) షేర్లు సోమవారం లిస్టింగ్ తర్వాత దాని తొలి ట్రేడింగ్ సెషన్లో లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ షేరు ఒక్కో షేరుకు రూ. 265గా లిస్ట్ అయింది. చివరికి 5 శాతం నష్టంతో ముగిసిన సంగతి తెలిసిందే. కంపెనీ విభజన తేదీ అయిన జూలై 20న దాని ఉత్పన్నమైన ధర రూ. 261.85 కంటే 1 శాతానికి పైగా మార్జినల్ ప్రీమియం. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.68 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లకు తగ్గింది. మరోవైపు వరుసగా రెండో సెషన్లో మంగళవారం కూడా జేఎఫ్ఎస్ షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. -
సాక్షి మనీ మంత్రా: లాభాల మెరుపులు, జియో ఫైనాన్సియల్ లిస్టింగ్ నీరసం
TodayStockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. గత వారం నష్టాలనుంచి కోలుకున్న సూచీలు ఈ వారాన్ని లాభాలతో శుభారంభం చేశాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి 267 పాయింట్ల లాభంతో 65, 216వద్ద ముగిసింది. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 19394 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఐటీ,ఫైనాన్షియల్ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ , బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్‌గ్రిడ్, హిందాల్కో టాప్ విన్నర్స్‌గా నిలవగా, రిలయన్స్, ఎంఅండ్ఎం, బ్రిటానియా, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్‌గా మిగిలాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి ఆరంభంలో ఆల్ టైం కనిష్టం నుంచి కోలుకుంది. చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. నిరాశపర్చిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్‌లో కస్టమర్లకు షాకిచ్చింది. సోమవారం ఈ షేరు ధరబీఎస్ఈలో రూ.265 నిఫ్టీ రూ. 262 వద్ద లిస్ట్ అయింది . అయితే ఇంట్రాడే కనిష్ట స్థాయికి జారిపోయింది. రెండు ఎక్స్ఛేంజీలలో 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఎదురుచూపులకు ఫుల్స్టాప్.. జియో ఫైనాన్స్ లిస్టింగ్ ఎప్పటినుంచంటే?
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్(జేఎఫ్ఎస్ఎల్) స్టాక్ ఎక్సే్ఛంజీలలో సోమవారం(21న) లిస్ట్‌కానుంది. జియోఫిన్ పేరుతో టీ గ్రూప్‌లో షేర్లు లిస్ట్‌కానున్నట్లు బీఎస్ఈ తాజాగా పేర్కొంది. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని(రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్) గత నెలలో రిలయన్స్ ప్రత్యేక కంపెనీగా విడదీసింది. దీంతో షేరు ధరను నిర్ధారించే బాటలో డమ్మీ టికర్‌తో మూడు రోజులపాటు బీఎస్ఈ ట్రేడింగ్‌కు వీలు కల్పించింది కూడా. దాదాపు రూ. 262 ధర వద్ద జియో ఫైనాన్షియల్ స్థిరపడిన సంగతి తెలిసిందే. కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 1.66 లక్షల కోట్లు(20.3 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. వెరసి దేశీయంగా బజాజ్ ఫైనాన్స్ తదుపరి రెండో పెద్ద ఎన్‌బీఎఫ్‌సీగా నిలవనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో వచ్చే వారం నుంచి ట్రేడింగ్ షురూ కానుంది. ట్రేడ్ ఫర్ ట్రేడ్ విభాగంలో 10 రోజులపాటు కంపెనీ లిస్ట్‌కానున్నట్లు బీఎస్ఈ తాజాగా వెల్లడించింది. జేఎఫ్ఎస్ఎల్ షేర్లను గత వారం తమ వాటాదారులకు రిలయన్స్ కేటాయించింది. వివిధ ఫైనాన్షియల్ సర్వీస్ సొల్యూషన్లు అందిస్తున్న జేఎఫ్ఎస్ఎల్ బీమా, డిజిటల్ చెల్లింపులు, అసెట్ మేనేజ్మెంట్ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించనుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏర్పాటుకు గత నెలలో అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం బ్లాక్‌రాక్‌తో చేతులు కలిపింది. -
జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ త్వరలో..
న్యూఢిల్లీ: రిటైల్, టెలికం రంగాల్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఆర్థిక రంగంలోనూ అదే తీరును కొనసాగించడంపై దృష్టి పెడుతోంది. త్వరలోనే జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్‌ను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. తద్వారా సంస్థ పూర్తి విలువను, సామర్థ్యాలను వెలికి తీసే అవకాశం ఉంటుందని సంస్థ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల ఇంధనాలపైనా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సాంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్లడమనేది చరిత్రలోనే కీలక మైలురాయిగా నిలవగలదని అంబానీ తెలిపారు. అటు మరో అయిదేళ్ల పాటు అంబానీని సీఎండీగా కొనసాగించాలన్న ప్రత్యేక తీర్మానానికి షేర్‌హోల్డర్ల ఆమోదాన్ని కంపెనీ కోరింది. ప్రస్తుతం 66 ఏళ్లున్న అంబానీ.. సంస్థ నిబంధనల ప్రకారం 70 ఏళ్లకు రిటైర్ కావాలి. అంతకు మించిన కాలవ్యవధికి కొనసాగించదల్చుకుంటే దానికి ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది. -
బ్లాక్‌రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార విస్తరణలో దూసుకుపోతున్నారు. దేశంలో ఫైనాన్స్ వ్యాపారానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఆ రంగంలోని ప్రత్యర్థులను ఢికొట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మ్యానేజ్మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇటీవల డీమెర్జ్ అయిన జియో ఫైనాన్సియల్స్తో కలిసి ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇరు సంస్థల సమ భాగస్వామ్యంతో జియో బ్లాక్‌రాక్ అనే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మొత్తం 300 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతమ జాయింట్ వెంచర్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. రిలయన్స్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విడిపోయిన కొద్ది రోజులకే ఈ డీల్ కుదుర్చుకోవడం విశేషంగా నిలుస్తోంది. జూన్ చివరి నాటికి 9.4 ట్రిలియన్ డాలర్లు ఆస్తుల నిర్వహణలో ఉన్న బ్లాక్‌రాక్‌తో దాదాపు 20 బిలియన్ డాలర్లు మార్కెట్ క్యాప్‌తో ఉన్న జియో ఫైనాన్సియల్స్ డీల్ కీలకమైన, వ్యూహాత్మకమైన వ్యాపార నిర్ణయంగా మార్కెట్ నిపుణుల అంచనా. (షాకిస్తున్న వెండి, బంగారం ధరలు, ఏకంగా రూ. 1100 జంప్) జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కలిసి భారతదేశంలో రాబోయే జాయింట్ వెంచర్ ద్వారా ఇండియాలో తమ ఉనికిని మరింత విస్తరణకు కృషి చేయడం చాలా ఆనందంగా ఉందని, బ్లాక్‌రాక్‌కు ఇది కీలక అడుగు అని బ్లాక్‌రాక్ చైర్మన్, సీఈవో లారీ ఫింక్ లింక్డ్ఇన్ పోస్ట్‌లో తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులు, రిస్క్ మేనేజ్ మెంట్లో బ్లాక్‌రాక్ లోతైన నైపుణ్యంతో, సాంకేతిక సామర్థ్యం జియో ఫైనాన్షియల్స్ లోతైన మార్కెట్ నైపుణ్యం కలగలిసి తమ డిజిటల్ ప్రొడక్ట్స్ డెలివరీ బాటలు వేస్తుందని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో హితేష్ సేథియా చెప్పారు. (Maruti Jimny Into Camping Setup: మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో)