ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్(జేఎఫ్‌ఎస్‌ఎల్) స్టాక్ ఎక్సే్ఛంజీలలో సోమవారం(21న) లిస్ట్‌కానుంది. జియోఫిన్ పేరుతో టీ గ్రూప్‌లో షేర్లు లిస్ట్‌కానున్నట్లు బీఎస్‌ఈ తాజాగా పేర్కొంది.
ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని(రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్) గత నెలలో రిలయన్స్ ప్రత్యేక కంపెనీగా విడదీసింది. దీంతో షేరు ధరను నిర్ధారించే బాటలో డమ్మీ టికర్‌తో మూడు రోజులపాటు బీఎస్‌ఈ ట్రేడింగ్‌కు వీలు కల్పించింది కూడా. దాదాపు రూ. 262 ధర వద్ద జియో ఫైనాన్షియల్ స్థిరపడిన సంగతి తెలిసిందే.
కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 1.66 లక్షల కోట్లు(20.3 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. వెరసి దేశీయంగా బజాజ్ ఫైనాన్స్ తదుపరి రెండో పెద్ద ఎన్‌బీఎఫ్‌సీగా నిలవనుంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో వచ్చే వారం నుంచి ట్రేడింగ్ షురూ కానుంది.
ట్రేడ్ ఫర్ ట్రేడ్ విభాగంలో 10 రోజులపాటు కంపెనీ లిస్ట్‌కానున్నట్లు బీఎస్‌ఈ తాజాగా వెల్లడించింది. జేఎఫ్‌ఎస్‌ఎల్ షేర్లను గత వారం తమ వాటాదారులకు రిలయన్స్ కేటాయించింది. వివిధ ఫైనాన్షియల్ సర్వీస్ సొల్యూషన్లు అందిస్తున్న జేఎఫ్‌ఎస్‌ఎల్ బీమా, డిజిటల్ చెల్లింపులు, అసెట్ మేనేజ్‌మెంట్ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించనుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏర్పాటుకు గత నెలలో అసెట్ మేనేజ్‌మెంట్ దిగ్గజం బ్లాక్‌రాక్‌తో చేతులు కలిపింది.
Comments
Please login to add a commentAdd a comment