జియో వినియోగదారులకు రిలయన్స్ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా ఎయిర్‌ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్, జియో 5జీ గురించి కీలక ప్రకటన చేశారు.
జియో ఎయిర్‌ఫైబర్ ఎలా పనిచేస్తుందంటే?
జియో ఎయిర్‌ఫైబర్ డివైజ్ సాయంతో వైఫై తరహాలో ఎటువంటి వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్, హాట్‌స్పాట్ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్‌ఫైబర్ డివైజ్‌ను ఆఫ్, ఆన్ చేస్తే సరిపోతుంది. సులభంగా, వేగంగా ఇంట్లో, ఆఫీస్‌లో గిగాబైట్ (సెకనుకు వెయ్యి మెగాబైట్స్) స్పీడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఫైబర్ ఆప్టికల్స్ వర్సెస్ జియో ఎయిర్‌ఫైబర్
సాధారణంగా బ్రాండ్ బ్యాండ్ సేవలు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్‌తో పాటు, మోడెమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. జియో ఎయిర్‌ఫైబర్ విషయానికొచ్చేసరికి దీనికి కేబుల్స్‌తో పనిలేదు. ఇదో సింగిల్ డివైజ్. దగ్గర్లోని జియో టవర్స్ నుంచి వీటికి సిగ్నల్స్ అందుతాయి. గత ఏడాది ఎయిర్‌ఫైబర్ గురించి జియో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. అందులో ఇంట్లో జియోఫైబర్‌తో పిల్లలు వినియోగించే యాప్స్, వెబ్‌సైట్స్‌ను కుటుంబసభ్యులు కంట్రోల్ చేయొచ్చు. సంబంధిత వెబ్‌సైట్లను, యాప్స్‌ను ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేకుండా బ్లాక్ చేసే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొంది. 5జీ నెట్‌వర్క్‌తో 1.5జీబీపీఎస్ స్పీడ్ పొందవచ్చని తెలిపింది.
జియో ఎయిర్‌ఫైబర్ ధర
గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)లో 5జీ నెట్‌వర్క్‌తో పాటు జియో ఎయిర్ ఫైబర్ డివైజ్ గురించి ప్రస్తావించింది. తాజాగా ఆ డివైజ్‌ను ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. పలు నివేదికలు.. జియో ఎయిర్‌ఫైబర్ ధర ఎంత ఉంటుందో ఓ అంచనా వేశాయి. వాటి ఆధారంగా పోర్టబుల్ రూటర్లను (జియోఫై ఎం2ఎస్) రూ. 2,800కి, మెష్ ఎక్స్‌టెండర్ (వైఫై ధర రూ. 2,499), జియో ఎక్స్‌టెండర్ 6 మెష్ వైఫై సిస్టం ధర రూ. 9,999గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ సరి కొత్త వైర్‌లెస్ రూటర్ ధర రూ. 10,000 ఉంటుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. జియో ఎయిర్ ఫైబర్ ధర ఎంతనేది అధికారంగా వెల్లడించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment